Hyderabad Police
-
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ స్పెషల్: ఆటోలు, కార్లలో ఉచిత ప్రయాణం!
సాక్షి,హైదారబాద్ : నగర వాసులకు శుభవార్త. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులే క్షేమమే లక్ష్యంగా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో తెచ్చినట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండనుంది.మరోవైపు,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం(రేపు)హైదరాబాద్‌లో అర్దరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు కొనసాగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30 కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు చివరి స్టేజి వరకు అందుబాటులో ఉండనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు విభాగం సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్,ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ , ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు,క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.న్యూఇయర్ వేడుకలపై మాదాపూర్ డీసీపీ వినీత్ సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో భద్రత విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం.మాదాపూర్ జోన్లో 61 ఈవెంట్స్ జరగనున్నాయి. 43పబ్స్ ఉన్నాయి. 20 కమ్యూనిటీ ఈవెంట్స్ జరగనున్నాయి.నిర్వాహకులు తప్పని సరిగా సమయం, నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఈవెంట్లో ఐడీకార్డ్‌లు తప్పని సరి.మైనర్లకి మద్యం సప్లయ్ చేయకూడదు. సౌండ్ ఎక్కువగా ఉండకూడదు.. స్థానికులను ఇబ్బందులు పెట్టొద్దు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి.కెపాసిటీ మేరకు మాత్రమే కస్టమర్స్ ను అనుమతించాలి. ప్రతి ఈవెంట్స్ లో అన్నీ ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకోవాలి. భద్రత ,పార్కింగ్, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలి. క్యాబ్, టాక్సీ,ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చాం. డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రంతా కొనసాగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు. డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంటుంది.న్యూ ఇయర్ ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. -
పబ్‌లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల ఘాటు హెచ్చరికలు
-
సంధ్య థియేటర్ ఘటనపై 'హైదరాబాద్ పోలీసుల' హెచ్చరిక
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. దీంతో వారు అధికారికంగా ఒక హెచ్చరిక చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో రేవతి మరణం గురించి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.అల్లు అర్జున్ రాకముందే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్టుగా కొందరు తప్పుడు వీడియోలతో పోస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ అంశంపై వారు ఇలా చెప్పుకొచ్చారు ' ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.ఈ విషయంలో పోలీసు శాఖ కీర్తిని తక్కువ చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన పై విచారణ…— Hyderabad City Police (@hydcitypolice) December 25, 2024 -
అజ్ఞాతంలో నటుడు మోహన్ బాబు?
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు (Hyd Police) సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు.. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఇంతకీ ఏం జరిగింది?మంచు మోహన్ బాబుని గత కొన్నిరోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj) ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని.. మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి-కొడుకు పరస్పరం హైదరాబాద్ ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్నిరోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్‌పై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయలయ్యాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
అల్లు అర్జున్ అరెస్ట్: సోషల్ మీడియా పోస్ట్‌లపై పలు కేసులు
సాక్షి,హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం, పలువురు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.అయితే, దిల్సుఖ్నగర్ శివలింగనగర్కు చెందిన మగుడంపల్లి భాస్కర్ (40) తన భార్య రేవతి (39), కొడుకు శ్రీతేజ్ (9)తో కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్లోని లోయర్ బాల్కనీలో ఉండగా.. 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కిందపడిపోయారు. అప్పటికే రేవతి మరణించగా, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు
'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)తాజాగా చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు.షోకాజ్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్న కొన్ని అంశాలుసంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలుసంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం.ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారుఅల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు.అల్లు అర్జున్‌తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.టిక్కెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
బిగ్‌బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
అల్లు అర్జున్ అరెస్ట్.. టూమచ్!
హైదరాబాద్, సాక్షి: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను నగర పోలీసులు దాదాపు ధృవీకరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకుగానూ శుక్రవారం(నవంబర్ 13) మధ్యాహ్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే..అరెస్ట్ టైంలో పోలీసులు అతి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన టైంలో.. అల్లు అర్జున్ నైట్ దుస్తులతో ఉన్నారు. తమతో రావాలని కోరగానే.. డ్రస్ మార్చుకుంటానని అన్నారాయన. దీంతో బెడ్ రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి మరీ తీసుకెళ్లారు. ఆ టైంలో అరెస్ట్ సమయంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘బెడ్ రూంలోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా?. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా?’’ అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవ్వగా.. ఆమెను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇక.. తనయుడి వెంట అల్లు అరవింద్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని వాహనం నుంచి దించేశారు. ‘మంచైనా చెడైనా నాదేనంటూ..’ ఆ టైంలో అల్లు అర్జున్ , అరవింద్‌తో అన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండినాలుగు సెక్షన్ల కింద కేసుభారత న్యాయ సంహిత సెక్షన్లు 105, 118(1) రెడ్‌విత్ 3/5 కింద కేసు పెట్టారు. ఇందులో 105 నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. ఈ కేసులో గనుక నేరం రుజువైతే కనీసం ఐదేళ్లు.. గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అలాగే.. బీఎన్ఎస్ 118(1) సెక్షన్ చూసుకుంటే ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడుతుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సంధ్య థియేటర్ యజమానులలో ఒకరైన ఎం సందీప్‌ను, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ విజయ్ చందర్ ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి.. తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, అలాంటి నోటీసులేం జారీ చేయకుండానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.హైకోర్టులో పిటిషన్ ఉండగానే..ఈకేసుకు సంబంధించిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ కావడం గమనార్హం.మాకేం సంబంధం లేదు!తమకు సంబంధం లేకుండా, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ‘ప్రీమియర్ షో నిర్వహణ థియేటర్ యాజమాన్యం నిర్ణయం కాదు. చట్టప్రకారం గత నెల 29న ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రదర్శనపై మైత్రి డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నెల 4, 5 తేదీల్లో బెనిఫిట్ షో కోసం గత నెల 30 నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున చిక్కడపల్లి పోలీసులకు, ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. .. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా భారీగా వచ్చిన అభిమానులతో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు మహిళ మృతి ఘటన చోటుచేసుకుందే తప్ప ఇది హత్య కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదు. ఈ ఘటనలో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా మేం దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు. -
HYD: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.ఆరు ప్రత్యేక బృందాలతో హైటెక్ నేరగాళ్ల కోసం చేసి గాలింపు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు ఆరెస్టు చేశారు.వీరిపై తెలంగాణలో 45కుపైగా సైబర్ క్రైమ్ కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు,26సెల్ఫోన్లు,16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.సెక్స్టార్షన్,పెట్టుబడులు, కొరియర్ పేరుతో వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో ఈ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.6.94 కోట్లు సైబర్ నేరాల ద్వారా కాజేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పోలీసులే షాక్ అయ్యేలా.. విశాఖ హానీ ట్రాప్ కేసులో -
అజ్ఞాతంలో హర్షసాయి.. స్పెషల్ టీమ్‌లు రంగంలోకి
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.గుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష, ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. హర్షసాయి డెబ్యూ మూవీ ‘మెగా’ కాపీరైట్సే్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్షసాయి ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆయన తరఫు లాయర్ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా, హర్షసాయిపై ఆరోపణలకుగానూ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. జానీ మాస్టర్ ఉదంతం వార్తల్లో ఉండగానే.. మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి తనను లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో.. 328, 376(2)(n)354(ఆ)(ఇ) సెక్షన్ల కింద పోలీసులు హర్షపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. -
మోహన్‌బాబు ఇంట్లో చోరీ.. హౌజ్ బాయ్ అరెస్ట్
పహాడీషరీఫ్(హైదరాబాద్): సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి గ్రామ శివారులో మోహన్‌బాబుకు నివాసం (మంచు టౌన్షిప్) ఉంది. ఇంటి ఆవరణలోనే వ్యక్తిగత కార్యదర్శులు, సెక్యూరిటీ సిబ్బంది, పనివారి కోసం వేర్వేరు గదులు సైతం ఉన్నాయి. ఈ నెల 22న మోహన్‌బాబు ఆదేశాల మేరకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కిరణ్‌కుమార్ తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొని రాత్రికి మంచు టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు. రాత్రి కావడంతో ఉదయాన్నే డబ్బులు మోహన్‌బాబుకు ఇద్దామని భావించి తన గదిలో ఉంచాడు. ఈ టౌన్‌షిప్‌లోనే అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన గణేశ్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కిరణ్ డబ్బులు తెచ్చిన విషయం ముందే తెలుసుకున్న గణేశ్ అతడు నిద్రపోయాక, తలుపు నెట్టి డబ్బులు కాజేసి పరారయ్యాడు. ఉదయాన్నే లేచి చూడగా డబ్బుతో పాటు గణేష్ కూడా కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అతడే డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. మోహన్‌బాబు సూచన మేరకు కిరణ్ 23వ తేదీన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచనలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి రూ.7,36,400ల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్
గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం (సెప్టెంబర్ 17) జరగనుంది. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు విధించినట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు.ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు. సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంచి వెల్లడించారు. ఇక శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు.ఇదీ చదవండి : రేపే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా -
HYD: స్పా సెంటర్లలో రాసలీలలు.. ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మధురా నగర్ పీఎస్ పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుండి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు.వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ నామోదర్, నాగరాజు, సతీష్‌లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే, వీరు ముగ్గురు పీఎస్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు కూడా వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో సదరు స్పా సెంటర్లోకి ముగ్గురు కానిస్టేబుల్స్, మరో హోంగార్డ్ వెళ్లిన దృశ్యాలను పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు. అలాగే, వారితోపాటు ఉన్న హోంగార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
శభాష్ పోలీస్..!
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్‌కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.హైదరాబాద్‌లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్‌కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్‌ను రాచకొండ సీపీ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు. -
శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
-
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
-
కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!
వెంగళరావునగర్(హైదరాబాద్): బూతు పురాణాలతో మరోసారి కుర్చీతాత రచ్చకెక్కాడు. గతంలో అనేకమార్లు ప్రముఖ యూట్యూబ్ స్టార్స్ స్వాతినాయుడు, వైజాగ్ సత్యపై దుర్భాషలాడి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరకు క్షమాపణలు కోరుతూ కేసులు లేకుండా చేసుకున్నాడు. అయితే మళ్లీ అదే తరహాలో బూతులు మాట్లాడుతున్నాడని బాధితులు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాలు.. రహమత్‌నగర్‌కు చెందిన కాలా పాషా అలియాజ్ కుర్చీ తాత మహేశ్‌బాబు సినిమాలోని కుర్చీ పాట ద్వారా యూ ట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. అయితే, యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ తీసే స్వాతినాయుడు, వైజాగ్ సత్యతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. అతని చెడు ప్రవర్తన కారణంగా వారు అతనిని దూరంగా ఉంచారు. దాంతో గతంలో వారిని తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీహిల్స్, తర్వాత మధురానగర్ పీఎస్‌లో కేసులు పెట్టారు. అనంతరం కుర్చీతాత వారితో రాజీ కుదుర్చుకున్నాడు. తాజాగా మళ్లీ తమను తిడుతున్నాడంటూ స్వాతినాయుడు, వైజాగ్ సత్యలు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత, మాజీ సీఎంలను, సినీరంగ ప్రముఖులను సైతం తిడుతున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
ప్రజాభవన్ ఎదుట రోడ్డుప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్‌లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
మోస్ట్ వాంటెడ్‌గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్‌గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్‌కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్‌తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్‌కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.