IFFI
-
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
ఇఫీలో కల్కి... 35: చిన్న కథ కాదు
ఒక భారీ చిత్రం... ఒక చిన్న చిత్రం... తెలుగు పరిశ్రమ నుంచి ఈ రెండు చిత్రాలు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శితం కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి’, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శిల కాంబినేషన్లో నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా నిర్మించిన చిన్న చిత్రం ‘35: చిన్న కథ కాదు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి.దేశ వ్యాప్తంగా పోటీలో నిలిచిన 384 ఫీచర్స్ ఫిల్మ్స్‌లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో 5 చిత్రాలను, ఇండియన్ పనోరమా విభాగంలో 20 చిత్రాలను... మొత్తంగా 25 చిత్రాలను ఎంపిక చేశారు. ఇక నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచిన 262 చిత్రాల్లో 20 చిత్రాలను ఎంపిక చేశారు. ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శితం కానున్న 5 చిత్రాల్లో ‘కల్కి’, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న 20 చిత్రాల్లో ‘35: చిన్న కథ కాదు’ ప్రదర్శితం కానున్నాయి.మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఇక కురుక్షేత్ర యుద్ధంతో మొదలై, అక్కణ్ణుంచి 6 వేల సంవత్సరాల తర్వాతి కథతో దాదాపు రూ. 600 కోట్లతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి’ హాలీవుడ్ సినిమాని తలపించి, భారీ వసూళ్లను రాబట్టి, ఘనవిజయం సాధించింది. ఇక కుమారుడు పాస్ మార్కులు తెచ్చుకోవాలని ఓ తల్లి పడే తపనతో రూపొందిన ‘35: చిన్న కథ కాదు’ ఎమోషనల్‌గా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ప్రారంభ చిత్రంగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ ఇండియన్ పనోరమా విభాగంలోప్రారంభ చిత్రంగా హిందీ ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ని ప్రదర్శించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను రణ్‌దీప్ హుడా పోషించారు. అది మాత్రమే కాదు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఒక రచయితగా, ఓ నిర్మాతగానూ వ్యవహరించారు రణ్‌దీప్.ముందు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఆరంభమైంది. అయితే క్రియేటివ్ పరంగా ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత రణ్‌దీప్ దర్శకత్వ బాధ్యతను నిర్వర్తించారు. ఈ చిత్రంలో చరిత్రను ఏకపక్షంగా చూపించారంటూ కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ నటీనటుల నటనకు ప్రశంసలు లభించాయి. రణ్‌దీప్ టైటిల్ రోల్లో అంకితా లోఖండే, అమిత్ సాయి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దక్షిణాది ప్రముఖులకు జ్యూరీలో చోటు లేదు‘ఇఫీ’ ఉత్సవాల్లో మొత్తం 25 ఫీచర్ íఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ íఫిల్మ్స్ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జ్యూరీలో ఉంటారు. ఫీచర్ ఫిల్మ్స్ ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కోసం ఆరుగురు సభ్యు లతో కూడిన జ్యూరీ సినిమాలను ఎంపిక చేసింది. అయితే దక్షిణాదికి చెందిన ప్రముఖులు ఎవరూ జ్యూరీలో లేకపోవడం గమనార్హం. ఇక గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఈ 55వ ‘ఇఫీ’ వేడుకలు నవంబరు 20న ఆరంభమై 28న ముగుస్తాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాల్లో బెంగాలీ చిత్రం ‘మొనిహార’ ఒకటి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న సుభాదీప్ బిస్వాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మొనిహార కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్‌గా రూపొందిన ‘అపార్, ‘నవాబీ శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. ఇంకా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన పట్నాల పై అన్వేష్ తీసిన డాక్యుమెంటరీ బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. -
చిత్రమా? ప్రచార విచిత్రమా?
ఉరుము లేని పిడుగు! గోవాలో 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ముగింపు వేడుకల వేదికపై అవార్డ్ జ్యూరీ ఛైర్మన్ – ఇజ్రాయిలీ దర్శకుడు నదవ్ లపిద్ అందరి ముందూ చేసిన వ్యాఖ్య అలాంటిదే! ఇఫీలోని అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇతర దేశాల చిత్రాలతో పాటు భారత్ నుంచి ఒక ఎంట్రీ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన ఆయన దాన్ని ‘అసభ్య ప్రచార చిత్రం. ఈ ఉత్సవంలో ప్రదర్శనకు తగదు’ అన్నారు. ఈ హఠాత్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని హతాశులను చేస్తే, మరో వర్గంలో హర్షం నింపాయి. అతిథిగా పిలిచి, అవార్డుల జ్యూరీ పెత్తనమిస్తే ఇంత మాట అంటారా? కశ్మీర్‌లోని మైనారిటీ హిందువుల బాధల్ని తొలిసారి ఇంతగా తెరపై చూపిస్తే, సినిమా బాలేదనడమేమిటి? ఆస్కార్లు వచ్చిన స్పీల్బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ మాటేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు చర్చ రేపుతున్నాయి. 1990ల నుంచి ఇప్పటికీ ఆగని కశ్మీరీ పండిట్ల విషాదగాథ కట్టెదుటి నిజం. ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఆ సత్యాన్ని ఏ రకంగా తెరపై చూపారన్నదే వివాదం. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ 170 నిమిషాల చిత్రం వాణిజ్య విజయం అందుకుంది. అంతే వివాదాస్పదమూ అయింది. 1990ల కాలఘట్టాన్ని మనసును కదిలించేలా తెరపై చూపారనే ప్రశంసతో పాటు పలు వాస్తవాలను తమకు అనుకూలమైన మేరకే చూపి, మతోద్వేగాన్ని రెచ్చగొట్టారనే విమర్శలూ వెల్లువెత్తాయి. మోదీ, అమిత్ షా తదితర పాలకవర్గ అగ్రనేతలు స్వయంగా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు, నేతాగణం వినోదపు పన్ను మినహాయింపు నుంచి ఉచితంగా టికెట్ల పంపిణీ దాకా ఈ చిత్రాన్ని పూర్తిగా భుజానికెత్తుకున్నాయి. అలా సహజంగానే ఈ సినిమాకు రాజకీయ రంగు, విభజన – విద్వేషవాదమనే పొంగు వచ్చాయి. ‘సెకనుకు 24 ఫ్రేముల చొప్పున చెప్పే సత్యం సినిమా’ అన్నారు దర్శక దిగ్గజం గొడార్డ్. కానీ, ఇవాళ విప్లవ వీరుడు అల్లూరి సైతం బ్రిటీషు వారి దగ్గర పనిచేసినట్టు సినిమాటిక్ కల్పనతో ఆస్కార్ గురిగా మన చిత్రాలు బరిలోకి దిగుతున్నప్పుడు సినిమా ఎంత సత్యమనే సందేహం కలుగుతుంది. స్వప్నలోక విహారంగా మారిన నేటి సినిమాలో సైతం కళ్ళెదుటి జీవితానికి కల్పన చేర్చి కదిలించేలా చెబితే చాలు. విలువలెలా ఉన్నా వసూళ్ళవర్షం కురుస్తుంది. అది బాక్సాఫీస్ నిరూపిత సత్యం. వ్యాపారంలో అది ఓకేనేమో కానీ, కళాత్మక విలువలెన్నో చూసి కిరీటం పెట్టాల్సిన అవార్డ్స్‌కు అది పనికొస్తుందా? ఇఫీలో అంతర్జాతీయ చిత్రాలతో పోటీకి మనోళ్ళు దింపిన ‘కశ్మీర్ ఫైల్స్’తో సమస్య ఇదే. కశ్మీర్‌పై కన్నీరుపెట్టేవారూ కథనంలో నిజాయతీపై భిన్నాభిప్రాయంతో ఉంటే తప్పు పట్టలేం. కరోనా తర్వాత రూ. 330 కోట్లు సంపాదించి, ఈ ఏటి మేటి బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. లాల్‌బహదూర్ మరణం మిస్టరీపై ‘తాష్కెంట్ ఫైల్స్’ తీసి, పెద్దగా ఆకర్షించలేని దర్శక– రచయిత వివేక్ అగ్నిహోత్రి దీనికి మాత్రం సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రేరణగా అదే తరహాలో అనేకులు రకరకాల ‘ఫైల్స్’తో వెండితెర వ్యాపారం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ‘ఇఫీ’ జ్యూరీ ఛైర్మన్∙వ్యాఖ్య దౌత్యపరంగానూ కలకలం రేపింది. ఇజ్రాయిల్ రాయబారి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తోటి ఇజ్రాయిలీ వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. భారత ఆతిథ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ కోరాలంటూ బహిరంగ లేఖ రాశారు. ‘భారత్‌కు వచ్చి వెళ్ళిపోతున్న నీకేం! ఇక్కడే ఉండాల్సినవాళ్ళ పరిస్థితి ఏమి’టంటూ మందలిస్తూనే, మనసులోని భయం బయటపెట్టారు. నిజానికి, నదవ్కు ఇలాంటివి కొత్తేమీకాదు. కాన్, బెర్లిన్ లాంటి ప్రఖ్యాత చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా అనుభవం, ఘాటుగా మాట్లాడతాడనే ముద్ర ఆయనకున్నాయి. ఆ నిష్కర్ష వైఖరి వల్లే ఇఫీకి పిలిచి, జ్యూరీ బాధ్యతలిచ్చారనుకోవచ్చు. అయితే, ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే దేశంలో, ప్రభుత్వం వారి ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవంలో, పాలకపక్ష అండదండలున్న కళాకృషిని విమర్శించడం జీర్ణించుకోవడం కష్టమే. అలాగే, గెల్చిన చిత్రాలను ప్రస్తావించే వేదికపై అవార్డ్ రాని ఎంట్రీపై వ్యాఖ్యలు చేయడమూ విచిత్రమే. అంత మాత్రానికే సినిమాను విమర్శించిన వారందరినీ అర్బన్ నక్సల్స్, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుకడే గ్యాంగ్ అనేయచ్చా? నదవ్ పండిట్లకు మద్దతునిస్తూనే, ‘హింసాద్వేషాల్ని ప్రేరేపించేలా మసిపూసి మారేడుకాయలా ఆ చిత్రం తీశారు. ఫాసిస్ట్ కోణం ఉంద’ని వివరణనిచ్చారు. ఇది తనొక్కరి అభిప్రాయం కాదనీ, బయట పెదవి విప్పకున్నా సినిమా చూడగానే జ్యూరీ మొత్తం ఇదే అభిప్రాయపడిందనీ తేల్చారు. సిన్మా సహా ఏ కళాకృషీ విమర్శకు అతీతం కాదు. ఆత్మాశ్రయమే అయినా అవార్డ్ నిర్ణేతల పని అదే! విధాన నిర్ణయాలతో బాధితులకు సాంత్వన చేకూర్చాల్సినవారు అది గాలి కొదిలి, ప్రచార కళతో వెండితెర వెనక దాగుందామనుకుంటేనే దారుణం. గత ఎనిమిదేళ్ళలో పాలకులు ఎందరు పండిట్లకు కశ్మీర్లో పునరావాసం కల్పించగలిగారు? మిగిలిన కొద్ది కుటుంబాలు నేటికీ తూటాలకు బలవుతుంటే ఏ మేరకు రక్షణ కల్పించారు? వీటిని వదిలేసి, నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలతో తీసిన వ్యాపారాత్మక చిత్రం బాగోగులపై ఎవరో, ఏదో అన్నారని విరుచుకుపడితే ఉపయోగమేంటి? బాధిత కశ్మీరీలకు కావాల్సింది పెదాల మీది ప్రేమ కాదు... పాలకుల చేతల్లో చేవ. సినిమాలు అందుకు ప్రేరేపిస్తే మంచిదే. వెనకుండి నడిపే రాజకీయుల కోసం విద్వేషాలకు ఆజ్యం పోసి, విభజన పెంచితేనే కష్టం. తాజా ఘటనతో ‘ఇఫీ’ జ్యూరీలను సజాతీయులతో నింపేస్తే మరీ నష్టం! -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్‌కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్‌లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడపై జ్యూరీ అధినేత ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అతడి కామెంట్స్‌పై పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘గుడ్ మార్నింగ్.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల చేత అబద్ధాలు చెప్పిస్తుంది’ అంటూ తనదైన శైలిలో నడవ్ లాపిడ్ చురక అట్టించారు. చదవండి: హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ అంతేకాదు తన ట్వీట్‌కి క్రియేటివ్ కాన్షియస్నెస్(#CreativeConsciousness) అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. కాగా నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. GM. Truth is the most dangerous thing. It can make people lie. #CreativeConsciousness — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 29, 2022 ‘कश्मीर फ़ाइल्स’ का सच कुछ लोगो के गले में एक काँटे की तरह अटक गया है।वो ना उसे निगल पा रहे है ना उगल! इस सच को झूठा साबित करने के लिए उनकी आत्मा,जो मर चुकी है, बुरी तरह से छटपटा रही है।पर हमारी ये फ़िल्म अब एक आंदोलन है फ़िल्म नहीं।तुच्छ #Toolkit गैंग वाले लाख कोशिश करते रहें।🙏 pic.twitter.com/ysKwCraejt — Anupam Kher (@AnupamPKher) November 29, 2022 -
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’
పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు. అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్ ఇజ్రాయెల్‌కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యునిగా చేశారు. -
IFFI: కిడకి అభినందనలు
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్ ఒవేషన్’తో అభినందించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఏఆర్ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. -
నేను కథలు రాయను.. దొంగలిస్తాను: సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి అనే విషయం తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలతోపాటు మరేన్నో సూపర్ హిట్, బాలీవుడ్ సినిమాలకు ఆయన కథలు అందించారు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీతో మెప్పించిన ఆయన నెక్ట్స్ రాజమౌళి-మహేశ్ చిత్రానికి స్క్రీప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటివలె కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభ పదవికి ఎన్నిక చేసింది. చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు ఇదిలా ఉంటే త్వరలో గోవాలో జరగబోయే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI) భాగంగా తాజాగా ఆయన ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. అబద్ధాలు చెప్పేవారు మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం లేని దాని నుంచే మనం కొత్తగా క్రియేట్ చేసి ఆసక్తికర అంశాన్ని వెలిగితియాడమే రచయిత ముఖ్య లక్షణమన్నారు. చదవండి: పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్? ‘హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రేక్షకులు.. ఇలా అందర్నీ మెప్పించే కథలు రాయాలి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఒక అబద్దాన్ని అందంగా చూపించడమే కథా రచన. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. మన చుట్టే చాలా కథలు ఉంటాయి. నిజ జీవితంలో కూడా అనేక కథలు ఉంటాయి. అలాగే మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయి. నేను కూడా అక్కడి నుంచే కథలు తీసుకుంటాను. ఆ కథలని మనదైన శైలిలో రచించాలి’ అంటూ చెప్పకొచ్చారు. -
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన 'కిడ', 'ఖుదీరామ్ బోస్'
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా 'కిడ', స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ఖుదీరామ్ బోస్’ ఎంపికయ్యాయి. ఈ చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో ప్రదర్శించబడతాయి. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమ చిత్రం ఇండియన్ పనోరమాకు ఎంపికవడం పట్ల నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. -
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు
ఈ ఏడాది జరిగే గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి. తాజాగా ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించే తేదీలు, ప్రదర్శించే సినిమా వివరాలను ఇండయన్ పనోరమా ప్రకటించింది. ఈ చిత్రోత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 25 ఫిచర్స్ ఫిలింస్, 20 నాన్ ఫిచర్స్ ఫలింస్ను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. అందులో తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, ఆఖండ చిత్రాలకు గుర్తంపు లభించింది. మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. ఆర్ఆర్ఆర్, ఆఖండలతో పాటు బాలీవుడ్ మూవీ కాశ్మీర్ ఫైల్స్, టోనిక్(బెంగాలి చిత్రం) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ప్రదర్శించనున్నారు. కాగా కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. -
విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల పరంగా సమంత మరింత స్పీడు పెంచారు. వరుసగా ప్రాజెక్ట్స్ సంతకం చేయడమే కాకుండా రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచారు. ఇవే కాకుండా పలు ఈవెంట్స్‌కు కూడా ఆమె స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఇలా విడాకుల బాధ నుంచి బయట పడేందుకు సామ్ కూడా తన షెడ్యూల్ బిజీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది. చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్ ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ ఈవెంట్లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఇక వ్యాఖ్యాతగా సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయిను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. చదవండి: ఆ విషయంలో సామ్‌ను ఫాలో అవుతున్న చై! -
నయనతార, విజయ్ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్.. ఫోటోలు వైరల్
తమిళ సినిమా: నటి సమంతకిది సెలబ్రేషన్ టైమ్. ఇటీవల జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ది ఫ్యామిలీ మెన్– 2 వెబ్ సిరీస్‌కు గాను సమంత ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో శాకుంతలం అనే చారిత్రాత్మక కథా చిత్రంతో పాటు తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి నయనతార మరో కథానాయిక. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు. (చదవండి: నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు) నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో నటి సమంత కూడా పాల్గొన్నారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్న సమంతను కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్ర సెట్లో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకున్నారు. -
‘గతం’ మూవీకి అరుదైన అవకాశం
‘గతం’మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు.భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు జనవరి 17న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫంక్షన్లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ఒక ప్రధాన భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఒక కొత్త సినిమా అయిన గతంకు అవకాశం దక్కడం గొప్ప అని చెప్పుకోవచ్చు. -
నా దర్శక–నిర్మాతలకు అంకితం
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నాను. నాకు ఈ స్థానం కల్పించిన నా అభిమానులకు, తమిళ ప్రజలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ యాక్టర్ ఇజబెల్లా హప్పెట్కు లైఫ్‌టైమ్ అచీమ్‌మెంట్ అవార్డును అందించారు. నవంబర్ 28 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
రజనీకాంత్‌కు అరుదైన గౌరవం
సాక్షి, న్యూఢిల్లీ : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎఫ్ఎఫ్ఐ 2019 ఉత్సవంలో ఆయనను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆమెను వరించింది. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రజనీకాంత్ ప్రతిష్టాత్మక గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో మహిళా దర్శకుల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. వీటిలో 24 చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల రేసులో ఉన్నాయి. In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant. IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE — Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 Happy to announce that Life Time Achievement Award for a 'Foreign Artiste' will be conferred on French Actress Isabelle Hupert.#IFFI2019 #IFFIGoa50 pic.twitter.com/toOVkr6u5r — Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019 I thank the government of India for this prestigious honour bestowed upon me on the golden jubilee of the International film festival of India 🙏🏻#IFFI2019 — Rajinikanth (@rajinikanth) November 2, 2019 -
తనపై జోక్ వేసిన నటుడికి మహిళా మంత్రి కౌంటర్!
గోవా: తనపై జోక్ వేసిన నటుడికి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖల మంత్రి స్మృతీ ఇరానీ తగిన రీతిలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. గోవాలో సోమవారం 48వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. స్మృతీ ఇరానీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డైరెక్టర్ మజిద్ మజీది తీసిన ఓ సినిమాను ప్రదర్శించారు. ఆ మూవీ గురించి యాంకర్‌గా చేసిన రాజ్‌కుమార్ చెబుతూ అత్యుత్సాహానికి పోయి.. ‘ఈ డైరెక్టర్ మజిద్ మజీది కూడా మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయనా ఇరానీనే’ అంటూ జోక్ చేశాడు. ఆపై కేంద్ర మంత్రి ఆ నటుడికి ఊహించని షాకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎంత సంయమనంతో, సహనంతో పాలిస్తుందనడానికి ఓ నటుడు కేంద్ర మంత్రిపై జోక్ చేయడమే నిదర్శనమని స్మృతీ ఇరానీ బదులిచ్చారు. రాజ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలపాలి. నువ్వు చేసిన వ్యాఖ్యలతోనైనా కేంద్ర ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని అందరికీ తెలిసింది. ’నాపై జోక్‌తో నైనా నీకాలు విరగొట్టింది మా బీజేపీ కార్యకర్తలు, మద్ధతుదారులంటూ ఏ ఒక్కరూ నిందలు వేసే అవకాశమే లేదంటూ’నటుడు రాజ్‌కుమార్‌తో మంత్రి స్మృతీ ఇరానీ కౌంటర్ ఇవ్వడంతో అక్కడున్న వారు షాకయ్యారు. ఇటీవల ఓ మూవీ షూటింగ్లో రాజ్‌కుమార్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈవెంట్ కు వ్యాఖ్యాతలుగా వ్యహరించిన రాజ్‌కుమార్ రావ్, నటి రాధికా ఆప్తేలను ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. Compliments to @RajkummarRao & @radhika_apte for being such wonderful hosts at #IFFI2017 Opening Ceremony. pic.twitter.com/4bbO8mh2pG — Smriti Z Irani (@smritiirani) 20 November 2017 -
ఆ రెండు చిత్రాలకు పేర్లే శాపమా?
సాక్షి, ముంబై : గోవాలో ఈ ఏడాది జరగబోయే ఇఫ్ఫీ 2017 వేడుకల్లో ప్రదర్శన కోసం ఎంపికైన రెండు చిత్రాలను తొలగించటం చర్చనీయాంశంగా మారింది. జ్యూరీ సభ్యులకు కూడా తెలీకుండా వాటిని సాంకేతిక సమాచార శాఖ తొలగించాల్సిన అవసరమేంటన్నదే అసలు ప్రశ్నగా మిగిలింది. ఈ పరిణామాలతోనే కలత చెందిన జ్యూరీ చీఫ్ సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చిత్రాలు-వాటి నేపథ్యం... నటరంగ్, టైమ్‌పాస్, బాంజో వంటి చిత్రాలను అందించిన రవిజాదవ్ ‘న్యూడ్’ చిత్రానికి దర్శకుడు. ఓ గృహిణి తన కుటుంబానికి, కొడుక్కి తెలీకుండా రహస్యంగా నగ్న మోడల్ కావాలనుకుని ఆ దిశగా చేసే ప్రయత్నాలు.. ఆ క్రమంలో ఆమె ఎదుర్కునే కష్టాలు... అసలు ఆ రంగం ఎలా ఉంటుందన్న విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు జాదవ్. కళ్యాణి ములాయ్, ఛయ్యా కదమ్ లీడ్ రోల్స్ పోషించగా... వెటరన్ నటుడు నసీరుద్దీన్ షా కూడా కళాకారుడిగా ఓ చిన్న పాత్రలో మెరిశారు. అర్థరాత్రి ఓ యువతి ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో మళయాళ చిత్రం ఎస్(సెక్సీ) దుర్గను సనాల్, శశిధరన్లు తెరకెక్కించగా... కన్నన్ నాయర్, రాజశ్రీ దేశ్‌పాండే ప్రధాన పాత్రాల్లో నటించారు. గతంలోనే ఈ చిత్ర టైటిల్ పై పెను దుమారం రేగగా.. ఆపై దానిని ఎస్ దుర్గగా మార్చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇఫ్ఫీ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేసి రెండు నెలల క్రితం ఆ ప్రతిపాదనను సమాచార ప్రసార శాఖకు పంపించారు. ఇందులో న్యూడ్ ను తొలి చిత్రంగా ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ.. ఆ రెండు చిత్రాలను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘కనీసం ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వమనే నేను అడుగుతున్నా. ప్రారంభ చిత్రంగా దీన్ని ఎంపిక చేయటం నేను గర్వంగా భావించా. కానీ, ఇప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగించింది’’ అని రవిజాదవ్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఐబీ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. మరోవైపు ఎస్ దుర్గ దర్శకులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. కారాణాలేంటి? అయితే వాటి పేర్లు.. అభ్యంతరాలు వ్యక్తం కాకూడదన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే చివరి నిమిషంలో ఆ రెండు చిత్రాలను తొలగించి వాటి స్థానంలో మరో రెండు చిత్రాలకు చోటు కల్పించారని చెబుతున్నారు. ఈ నేఫథ్యంలోనే ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ న్యూడ్ చిత్రానికి అసలు సెన్సార్ సర్టిఫికెట్ లేదని చెప్పటం విశేషం. మరో పక్క సెక్సీ దుర్గను ఇది వరకే మామి, కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా.. అక్కడ కొన్ని కట్లు పడ్డాయి. తర్వాత దానిపేరును ఎస్ దుర్గాగా మార్చేశారు. కానీ, ఇక్కడ చిత్రాన్ని ఎటువంటి కట్లు లేకుండా ప్రదర్శించాల్సి ఉంటుంది, పైగా ఇదివరకే దాని టైటిల్‌పై మతపరమైన వివాదాలు తెలెత్తాయి. అందుకే ఆ చిత్రాలను తొలగించి ఉంటారన్న అభిప్రాయం పారికర్ వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇండియాకు ఇలాంటి చిత్రాలే అవసరం ఉందంటున్న పలువురు.. వాటిని ఇఫ్ఫీ పనోరమ ప్రదర్శన నుంచి తొలగించటం సిగ్గు చేటు అంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డు
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో పురస్కారం అందుకోనున్నారు. చలన చిత్ర రంగంలో విశేష కృషి చేసినందుకు జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016)లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సెంటినరీ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ తెలిపారు. గత అయిదు దశాబ్దాలుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు ఎస్పీ బాలు తన గాత్ర మాధుర్యంతో ఎనలేని సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఎస్పీ బాలు వివిధ భాషల్లో సుమారు 40వేలకుపైగా పాటలు పడి సంగీతాభిమానులను అలరించారన్నారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరుసార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వరించాయి. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్..ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి. -
'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేదిక మీదనుంచి రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుండగా తాజాగా... లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన సినిమాలలో కథానాయికగా నటించిన స్మితాపాటిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బెనగల్. స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది అంటూ కితాబిచ్చాడు. స్మిత, శ్యాం బెనగల్ రూపొందించిన మండీ, భూమిక, మంతన్, నిశాంత్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. శ్యాం మాటల్లో చెప్పాలంటే 'కెమరా ఆమెను ప్రేమించింది, ఆమె సహజ నటి, ఏ పాత్రలోకైన సునాయాసంగా ఒదిగిపోతుంది. మన ప్రేమేయం లేకుండానే ఆమె మన కథలో భాగమైపోతుంది.' స్మితతో పాటు తన సినిమాల్లో కథానాయికగా నటించిన షబానా అజ్మీని కూడా ప్రశంసించాడు శ్యాం బెనగల్. ' తొలిసారిగా క్యారెక్టర్ కోసం ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్యర్యపోయా, షబానా అజ్మీ ప్రొఫైల్ కూడా చూడటం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయా. ఆ సమయంలోనే అంకుర్ సినిమాలో లక్ష్మీ నా కళ్లకు కనిపించింది.' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. -
'సంగీతాన్నికంపల్సరీ చేయండి'
ప్రపంచ వ్యాప్తంగా హింసను తగ్గించాలంటే పాఠశాలలో, కళాశాలలో సంగీతాన్ని నిర్భంద విద్యగా ప్రవేశపెట్టాలని అన్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. గోవాలో జరగుతున్న ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఇళయరాజ, స్వరాల్లో ఉన్న దైవత్వం హింసను జయించగలదని,అందుకే విద్యార్థులకు సంగీతాన్ని నేర్పించాలన్నారు. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ఎన్నో అద్భుత గీతాలను స్వరపరిచిన మేస్ట్రో వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన మైళురాయికి చేరువలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డ్స్‌తో పాటు, పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్న ఇళయరాజాను వేదికపై నిర్వాహకులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్‌తో సత్కరించారు. -
ఆ వేడుక క్లైమాక్స్ కు స్వరమాంత్రికుడు
న్యూఢిల్లీ: ఆస్కార్ అవార్డు విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ భారత అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుక(ఇఫ్పి)కు హాజరుకానున్నారు. ఈ నెల 20న ప్రారంభంకానున్న ఈ చిత్రోత్సవ ముగింపు సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకానున్నారు. గోవా ప్రభుత్వం, గోవా ఎంటర్ టైన్ మెంట్ సొసైటీ మంగళవారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమం అనంతరం ఈ ప్రకటన విడుదల చేశాడు. ఈ చిత్రోత్సవ వేడుకలో దాదాపు 89 దేశాలకు చెందిన 187 చిత్రాలు ప్రదర్శనకోసం కొలువుదీరనున్నాయి. వీటిలో భారత్ చెందిన 47 ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అయితే, స్పెయిన్ మాత్రం ఈసారి తన చిత్రాల హవాను ఈ వేడుకలో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ వేడుక జరగనుంది.