india visit
-
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
కోల్‌కతా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి పశి్చమబెంగాల్లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అజీమ్ హత్యకు అతని పాత స్నేహితుడే రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పశి్చమబెంగాల్ సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది గురువారం ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది పక్కా ప్రణాళికతో చేసి హత్య. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్ ప్రాంతంలో అజీమ్ చివరిసారిగా కనిపించిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను అజీమ్ పాత స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. అమెరికా పౌరసత్వమున్న ఆ స్నేహితుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపాక మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్‌కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
భారత పర్యటనకు ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగో వారంలో ఉండొచ్చని, ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావొచ్చని పేర్కొన్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవల సవరించిన నేపథ్యంలో మస్క్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్ డాలర్లతో తయారీ ప్లాంటును పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది. దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఆయనతో మస్క్ సమావేశమయ్యారు. భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశమున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. -
సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో జరిగే జి–20 శిఖరాగ్రంలో ఆయన పాల్గొంటారని సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ తెలిపారు. పర్యటనకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయన్నారు. జి–20 అధ్యక్షస్థానంలో ఉన్న భారత్ నాయకత్వ లక్షణాలు మరింత విస్తృతమై బలమైన దేశంగా నిలుస్తోందన్నారు. అమెరికా–భారత్ సంబంధాల్లో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అపెక్, జపాన్ జి–7తోపాటు క్వాడ్ కూటమి సదస్సులు వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటి తో భారత్–అమెరికా మరింత సన్నిహితమయ్యే అవకాశాలు పెరుగుతాయని లూ అన్నారు. -
మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భారత్– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న అల్బనీస్ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు. ‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ‘ఆస్ట్రేలియా–భారత్ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్ చెప్పారు. నేడు మోదీతో కలిసి టెస్ట్ మ్యాచ్ వీక్షణ బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన. -
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్..
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి. చదవండి: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు ! -
బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని
అహ్మదాబాద్: జేసీబీ బుల్డోజర్.. ప్రస్తుతం భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. శ్రీరామ నవమి, హానుమాన్ శోభాయాత్రల సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల అనంతరం.. ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. అల్లర్లకు కారణమైన వాళ్లకు చెందిన ఇళ్లను, దుకాణాలను, ఇతర కట్టడాలను.. అక్రమ కట్టాలుగా నిర్ధారించుకుని ప్రభుత్వాలు జేసీబీ బుల్డోజర్లతోనే కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ట్రెండ్‌లోకి వచ్చేశారు. ఎలాగంటారా?.. గుజరాత్ వడోదరా హలోల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన సందర్శించాడు. #WATCH UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat (Source: UK Pool) pic.twitter.com/Wki9PKAsDA — ANI (@ANI) April 21, 2022 జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించిన బోరిస్.. హుషారుగా జేసీబీ బుల్డోజర్ ఎక్కి పరిశీలించి కాసేపు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన వెంట.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇంకేం.. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947 నుంచి 2022 వరకు బోరిస్ కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎందుకంటే.. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. చరఖా తిప్పారు. From Gandhi's Charkha to Modi's JCB - Boris Johnson covered the history of India from 1947 to 2022, in a day. pic.twitter.com/1N0Fcku3iT — PuNsTeR™ (@Pun_Starr) April 21, 2022 #WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k — ANI (@ANI) April 21, 2022 మహాత్ముడి రచనల్లో ఒకటైన, ప్రచురణకాని గైడ్ టు లండన్‌ను బోరిస్ కానుకగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గుజరాత్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్తారు. आज जेसीबी तेरा भाई चलाएगा 😎 pic.twitter.com/DIacyWBEy4 — Desi Boy 🇮🇳⚙️ (@Desi_b_o_y) April 21, 2022 #JCBKIKHUDAI .. Boris Johnson pic.twitter.com/Qu31P72iQg — Er R K DAHARWAL आर के डहरवालرکدہاروال (@DaharwalK) April 21, 2022 JCB share price pic.twitter.com/RXrJ6AsRbw — Armoured_assault (@Vivek_707) April 21, 2022 -
నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం
భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా దేశంలో మూడు రోజులు పర్యటించారు. రెండేళ్ల క్రితం సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తాక అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ సరిచేసుకోవడమే దేవ్బా తాజా పర్యటన ఆంతర్యం. నిరుడు జూలైలో అయిదోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేవ్బా జరిపిన మొదటి విదేశీ పర్యటన ఇది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు తలెత్తడం, అవి విభేదాలుగా పరిణమించడం వింతేమీ కాదు. శతాబ్దాలుగా భారత్, నేపాల్ దేశాల మధ్యా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అందుకే అప్పుడప్పుడు పొరపొచ్చాలు ఏర్పడినా, మరో దేశం ఆ సమస్యలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూసినా ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంయమనం పాటించి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాయి. తిరిగి ఒక్కటవుతున్నాయి. దేవ్‌బాకు ముందున్న ప్రధాని కేపీ ఓలి చైనా ప్రభావంతో మన దేశంతో తగాదాకు దిగారు. పర్యవసానంగా ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చిన దేవ్బా ఆ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు కృషి చేశారు. దానిలో భాగంగానే ఆయన భారత్ పర్యటనకొచ్చారు. నేపాల్‌కు ఇది ఎన్నికల సంవత్సరం కూడా. కనుక రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం సమస్య ఆ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఖాయం. ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను నేపాల్ 2020లో తన మ్యాప్‌లో భాగంగా చూపింది. దానికి సంబంధించిన బిల్లుకు అక్కడి పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. రాబోయే ఎన్నికల్లో దేవ్‌బాను దెబ్బతీయడానికి మాజీ ప్రధాని ఓలి శర్మ, ఇతరులు గట్టిగానే ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఈ వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. బిహార్‌లోని జయనగర్ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకూ నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు. 35 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్యా ప్రారంభమైన తొలి బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ఇది. దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సాయపడ బోతోంది. అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్ కారిడార్‌ను కూడా లాంఛనంగా దేవ్‌బాకు అప్పగించారు. ఈ కారిడార్ వల్ల అక్కడి ఈశాన్య ప్రాంత మారుమూల పల్లెలకు సైతం నేపాల్ విద్యుత్ సదుపాయం అందించగలుగుతుంది. ఇవిగాక నేపాల్‌లో విద్యుదు త్పత్తి ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో సహా మరెన్నో ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. మన దేశంతో నేపాల్ క్రమేపీ సన్నిహితమవుతున్న తీరును చైనా గమనిస్తూనే ఉంది. దేవ్బా మన దేశం రావడానికి మూడు రోజుల ముందు నేపాల్‌లో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ పర్య టించారు. ఒక్క మన దేశంతో మాత్రమే కాదు... అమెరికాతో కూడా నేపాల్ దగ్గరవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకునే వాంగ్ యీ హుటాహుటీన ఈ పర్యటనకొచ్చారు. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒక సంస్థ ద్వారా తాను అందించదల్చుకున్న సాయం అంగీకారమో కాదో మార్చి 28 లోగా చెప్పాలని అమెరికా గడువు విధించింది. 50 కోట్ల డాలర్ల విలువైన ఆ గ్రాంటు స్వీకరించడానికి నేపాల్ కొంత సందేహించింది. అయితే దీన్ని అంగీకరించకపోతే నేపాల్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకుంటానని అమెరికా హెచ్చరించడంతో గడువుకు ఒక్కరోజు ముందు నేపాల్ పార్లమెంటు ఆ గ్రాంటు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో నేపాల్ ఓటువేసింది. దీనికి కూడా అమెరికా ఒత్తిడే కారణం. చిత్రమేమంటే ఈ రెండు అంశాల్లోనూ ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు సెంటర్, మాధవ్ నేపాల్ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ సోషలిస్టులు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. చైనాకు అత్యంత సన్నిహితమని ముద్ర ఉన్న మాజీ ప్రధాని శర్మ ఓలి నాయకత్వంలోని యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సైతం తటస్థంగా ఉండిపోయింది. ఈ పరిణామాలతోపాటు భారత్‌లో దేవ్బా పర్యటించడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోయింది. నెహ్రూ ఏలుబడిలో దక్షిణాసియా దేశాలతో మన సంబంధాలు సక్రమంగా ఉండటం లేదని నిపుణులు విమర్శించేవారు. ముఖ్యంగా నేపాల్‌తో సంబంధాల విషయంలో మనం పెద్దన్న పోకడలకు పోతే ఆ దేశం చైనాను ఆశ్రయించే అవకాశం ఉన్నదని హెచ్చరించేవారు. చిత్రమేమంటే అనంతరకాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు అంతంతమాత్రమే. అందువల్లే నేపాల్‌కు చైనా సన్నిహితం కాగలిగింది. వేలాదిమంది నేపాలీ విద్యార్థులకు తమ దేశంలోని విద్యాసంస్థల్లో చవగ్గా చదువుకునే అవకాశం కల్పించింది. నేపాల్‌లో మాండరిన్ భాష నేర్పించడానికి పలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికైతే నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు భారత్, అమెరికాలతో దేవ్బా ప్రభుత్వ సంబంధాలపై నోరెత్తడంలేదు. అయితే ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికలనాటికి అమెరికా మాటెలా ఉన్నా భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక సరిహద్దు అంశంలోనైనా, మరే ఇతర విషయంలోనైనా మన దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి దేవ్బా తాజా పర్యటన దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగుపడతాయి. -
Sakshi Cartoon: ఆయన అలానే వస్తారట!
ఆయన అలానే వస్తారట! -
పుతిన్‌కి భారత్ పర్యటన ఎంత ప్రాధాన్యం?
న్యూఢిల్లీ, మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్‌లో ఒక్కరోజు పర్యటనకు సోమవారం రానున్నారు. ఏటా ఇరుదేశాల మధ్య జరిగే వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 20 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 21వ సమావేశంలో పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి చర్చలు జరుపుతారు. గతంలో 2018 అక్టోబర్‌లో పుతిన్, మోదీ మధ్య చర్చలు జరిగాయి. ఈ మూడేళ్లలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన, దానికి రష్యా మద్దతు తెలపడం పాక్‌కు లాభదాయకంగా మారింది. మరోవైపు చైనా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతూ భౌగోళిక రాజకీయాలకు తెర తీయడం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా, చైనాతో చేతులు కలిపింది. ఈ అంశాలన్నీ ద్వైపాక్షిక బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకోవడానికి పుతిన్ జెనీవాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చేస్తున్న విదేశీ పర్యటన ఇదే. పుతిన్, మోదీ సమావేశానికి ముందు ఇరుదేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు చర్చించుకుంటారు. సాధారణంగా పుతిన్ విదేశీ ప్రయాణాలపై ఆసక్తి కనబరచరు. అలాంటిది కరోనా ముప్పుని సైతం లెక్క చేయకుండా పుతిన్ భారత్‌కు వస్తున్నారంటే ఆయన మన దేశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారన్న విషయం అర్థమవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా, రష్యా మధ్యలో భారత్ రష్యాతో భారత్‌కి సుదీర్ఘ కాలంగా సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొద్ది ఏళ్లుగా అమెరికాతో కూడా మంచి సంబంధాలు నెరుపుతూ ఇరు దేశాలకు సమ దూరం పాటిస్తూ వస్తోంది. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు చేతులు కలిపి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసి దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్వాడ్ కూటమిపై రష్యా గుర్రుగా ఉంది. అమెరికా, చైనా ఆధిపత్య స్థాపన పోరులో రష్యా, భారత్‌లు చెరోవైపు ఉన్నాయి. ఇక ఆయుధాల కొనుగోలులో భారత్ ఎప్పుడూ రష్యాపైనే ఆధారపడుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికాను కూడా ఆశ్రయిస్తోంది. ఈ విషయాలన్నింటిపైనా పుతిన్, మోదీ చర్చించే అవకాశం ఉంది. -
డిసెంబర్ 6న భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6వ తేదీన భారత్‌కు రానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అదే రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ] ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు. దీంతోపాటు, అదే రోజు రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరుగుతాయని వివరించారు. చదవండి: తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
భారత్ గొప్ప దేశం: ట్రంప్
వాషింగ్టన్: భారత్ ఎంతో గొప్ప దేశమని, తన పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ఆయన బుధవారం అమెరికాకు చేరుకున్నారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే ట్రంప్ ‘భారత్ చాలా గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది’అని ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలయ్యాక రావాలనుకున్నా.. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక భారత పర్యటనకు రావాలని భావించానని ట్రంప్ చెప్పారు. మోదీకి ఆ ఆలోచన నచ్చకపోవడంతో ముందే వచ్చానన్నారు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం విందులో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ‘భారత్‌కి మళ్లీ మళ్లీ వస్తూ ఉండాలని ఆశపడుతున్నాను’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్లేటర్‌ను ఆస్వాదించిన ట్రంప్ ట్రంప్, భార్య మెలానియా భారత్ పర్యటనలో బస చేసిన ఐటీసీ మౌర్యలో వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ట్రంప్ ప్లేటర్ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేబుల్ సైజ్‌లో ఉండే నాన్, మటన్ లెగ్‌తో తయారు చేసిన సికందరి నాన్ రుచికి వారు ఫిదా అయ్యారని హోటల్ వర్గాలు వెల్లడించాయి. వారు వెళ్లేటపుడు ఎంఎఫ్ హుస్సేన్ గుర్రం చిత్రం ముద్రించిన అప్రాన్లను హోటల్ యాజమాన్యం అధ్యక్షుడికి కానుకగా ఇచ్చింది. -
అమెరికా, భారత్‌ల స్నేహగీతం..
-
హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా
డెబ్బయ్ లక్షల మంది స్వాగతిస్తారన్నారు. అది తక్కువనిపించిందేమో!! అంతలోనే ! ఆ సంఖ్య కోటికి చేరింది. ఆ క్షణం రానే వచ్చింది. ట్రంప్ ఊహించిన కోటి మంది కాకున్నా... అహ్మదాబాద్ వీధుల్లో లక్షల మంది స్వాగతం పలికారు. మొతెరా మైదానంలో మరో లక్షన్నర మంది ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించారు. భారత్‌కు రాకముందు ట్రంప్ యంత్రాంగం కశ్మీర్‌ను తెరపైకి తెచ్చింది. సీఏఏ నిరసనలనూ ప్రస్తావించింది. కానీ ఆశ్చర్యంగా.. ట్రంప్ ప్రసంగంలో మోదీ కీర్తి ప్రతిష్టలకు ట్రంపెట్ల మోతలే తప్ప భారత్‌ను ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలేమీ లేవు. భారత్‌లో మత సామరస్యానికి జై కొడుతూ... తమ దేశంలోని భారతీయ అమెరికన్ల ప్రతిభకు జేజేలన్నారు. మందగమనంలోని భారతానికి ఊరటనిచ్చేలా వాణిజ్యపరమైన ప్రకటనలు చేస్తారని భావించారంతా!!. అంతకుమించి... అనేలా భారతీయుల్ని సంతోషపెట్టారు ట్రంప్. మన దీపావళి, హోలీ పండుగల్ని మనకే వివరిస్తూ... దిల్వాలే దుల్హనియా, షోలే అంటూ బాలీవుడ్ సినిమా చూపించారు. క్రికెట్ వీరులు సచిన్, కోహ్లీలనూ కొనియాడారు. భారతీయుల నుంచి కోట్లాది చప్పట్లను రాబట్టడానికి ఇంతకన్నా ఏమైనా కావాలా చెప్పండి..? ఇక దారిపొడవునా ఘన స్వాగతం పలికిన గుజరాతీలను తక్కువ చేయలేదు ట్రంప్. అల్లంత ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని మాటల్లో మరింత ఎత్తున ఆవిష్కరించారు. మోదీ ఛాయ్‌వాలా నుంచి ప్రభుత్వ సారథిగా మారిన చరిత్రను మరోసారి వినిపించారు. సాక్షాత్తూ అగ్రరాజ్యాధీశుడే తమను అలా పొగిడేస్తుంటే స్థానికులకు ఇంకేం కావాలి చెప్పండి? మొత్తానికి మొదటిరోజు ప్రసంగమంతా జనరంజకమే!. వీనులవిందైన పరస్పర పొగడ్తలే! ఈ ప్రసంగంలో దేశానికి కాస్తంత ప్రయోజనం కలిగించే అంశమేదైనా ఉందంటే అది 3 బిలియన్ డాలర్ల రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందమే!. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లు, క్షిపణులు, యుద్ధనౌకలు తయారు చేస్తున్నామని చెప్పిన ట్రంప్.. హెలికాప్టర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు భారత్‌తో 3 బిలియన్ డాలర్ల (రూ. 21వేల కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. మరి మంగళవారం ఇరువురు ప్రభుత్వాధినేతల చర్చల్లో ఇదొక్కటే సాకారమవుతుందా? మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం – ట్రంప్ ట్రంప్ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఇరు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం అత్యున్నత, చరిత్రాత్మక శిఖరాలకు చేరాయి. – మోదీ అహ్మదాబాద్: ‘అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం’.. భారతీయుల మనసు గెలుచుకునే ఈ సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి సోమవారం ట్రంప్ ప్రసంగించారు. ‘నమస్తే.. నమస్తే.. హలో ఇండియా’ అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడని, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆ మహోన్నత నేతకు.. తనకీ అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత సాంస్కృతిక వైభవాన్ని, గత 70 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలను, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాటిస్తున్న గొప్ప విలువలను, వివిధ రంగాల్లో ఇండియా సాధించిన ఘనతలను ట్రంప్ తన ప్రసంగంలో సందర్భానుసారం ప్రస్తావించి, భారతీయులను ఆకట్టుకున్నారు. స్వామి వివేకానంద ప్రవచిత వ్యాఖ్యను గుర్తు చేసి, భారత దార్శనికతను ప్రశంసించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ సామర్థ్యాన్ని తన ప్రసంగంలో గుర్తు చేశారు. భారత్‌కు సహకరించే విషయంలో అమెరికా ముందుంటుందని, భారత సాయుధ దళాలకు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయని వెల్లడించారు. వేదికపైకి మోదీ, ట్రంప్‌తో పాటు మెలానియా వచ్చారు. హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ట్రంప్ కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్.. ఇతర ప్రముఖులు మొదటి వరుసలో కూర్చుని ట్రంప్, మోదీల ప్రసంగాలను విన్నారు. ఈ స్వాగతాన్ని మర్చిపోలేం ‘ఐదు నెలల క్రితం భారత ప్రధానికి అమెరికాలో భారీ ఫుట్‌బాల్ స్టేడియంలో స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నన్ను స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతం గొప్పగా ఉంది. థ్యాంక్యూ. ఈ ఆతిథ్యాన్ని మేమెన్నడూ మర్చిపోం’ అని ట్రంప్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవిస్తున్న దేశంగా.. వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలన, పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనం కల్పిస్తున్న దేశంగా భారత్‌ను ప్రపంచదేశాలు అభిమానిస్తాయన్నారు. గట్టి ప్రతినిధి ఒక సామాన్య భారతీయుడు ఏం సాధించగలడనేదానికి భారత ప్రధాని మోదీనే సజీవ తార్కాణమని ప్రశంసించారు. భారత, అమెరికా వాణిజ్య చర్చలను ప్రస్తావిస్తూ ‘మోదీ తమ దేశం తరఫున గట్టిగా వాదిస్తారు(టఫ్ నెగోషియేటర్)’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘‘మోదీని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాకపోతే ఆయనతో వ్యవహారాలు నడపడం అంత సులువు కూడా కాదు’’అని అన్నారు. ‘‘ప్రధానమంత్రి మోదీగారు.. మీరు గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధించగలరు అనేందుకు సజీవ తార్కాణం మీరు’’అని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు. ‘భారత్ సామర్థ్యం ఆశ్చర్యకరం. అద్భుతం. స్వతంత్ర దేశంగా భారత్ సాధించిన అభివృద్ధి మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకం. భారత్ సాధించిన పురోగతి ఈ శతాబ్దంలోనే అసాధారణ విజయం’ అని ఇండియాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చప్పట్లు.. నవ్వులు.. గుజరాత్ సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు లక్షమందితో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. మోదీ, సర్దార్‌పటేల్‌ను ప్రశంసిస్తున్న సమయంలో, షోలే, డీడీఎల్‌జీ వంటి బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్లు సచిన్, కోహ్లీలను ప్రస్తావించిన సమయంలోనూ భారీగా చప్పట్లు వినిపించాయి. ట్రంప్ మాటతీరు, ఉచ్ఛారణతో పలుమార్లు స్టేడియంలో నవ్వులు పూచాయి. ప్రపంచం మారుమూలల్లోనూ భారతీయ నృత్యం భాంగ్రాకు, హోళీ, దీపావళి పండగలకు మంచి ఆదరణ ఉందన్నారు. ‘ఏడాదికి రెండు వేల సినిమాలు తీసే అత్యద్భుతమైన సృజనాత్మకత ఉన్న బాలీవుడ్ ఉన్న దేశమిది’అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రజలకు ట్రంప్, మోదీ అభివాదం సాంస్కృతిక కార్యక్రమాలు మోదీ, ట్రంప్‌లు స్టేడియంలోకి వచ్చేవరకు బాలీవుడ్ గాయకుడు కైలాశ్ ఖేర్ బృందం, గుజరాతీ స్థానిక గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్టేడియంలో వాలంటీర్లుగా వ్యవహరించారు. వి ద పీపుల్ నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘‘అమెరికా, భారత్.. ఈ రెండు దేశాల రాజ్యాంగాలు ఒకే అద్భుతమైన పదంతో ప్రారంభమవుతాయి. అది ‘వి ద పీపుల్(ప్రజలమైన)’. అంటే, మన రెండు దేశాల్లోనూ దేశ పౌరులకు సమాన గౌరవం, సాధికారత, విశ్వాసం లభిస్తాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎండల్లో.. ఓపికగా ప్రజలు... స్టేడియంకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకే విచ్చేసిన ప్రజల సహనానికి ఎర్రటి ఎండ పరీక్ష పెట్టింది. స్టేడియం సామర్త్యం 1.10 లక్షలు కాగా సోమవారం అంతకు మించి 1.25 లక్షల మంది చేరారు. ఇరువురు నేతలు ప్రజలకు అభివాదం చేయడాన్ని పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య స్వాగతించారు కూడా. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ప్రజల ఓపిక తగ్గుతూ వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు ఆ తరువాత ట్రంప్ మాట్లాడే సమయానికి ఒక్కరొక్కరుగా స్టేడియంను వీడిపోవడం కనిపించింది. మోదీని ట్రంప్ ప్రశంసించే సమయంలో చాలామంది బయటకు వెళ్లారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్, అమెరికాలు ఉన్నాయన్నారు. ‘ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను సంపూర్ణంగా నాశనం చేశాం. ఐఎస్ స్థాపకుడైన అల్ బగ్దాదీ వంటి రాక్షసున్ని అంతమొందించాం’ అని గుర్తు చేశారు. తమ సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని, ఉగ్రవాదులను, వారి భావజాలాన్ని నిర్మూలించే దిశగా భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘నేను అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి ఉగ్రసంస్థలను, వారి భూభాగంలోని ఉగ్రవాదులను నాశనం చేసే దిశగా పాకిస్తాన్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. ‘పాక్‌తో మా సంబంధాలు బావున్నాయి. అవి మెరుగుపడే దిశగా వెళ్తున్నాం. దక్షిణాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తొలగుతాయని, సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. చైనా పేరును ప్రస్తావించకుండానే.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్రదేశాలను ట్రంప్ అభివర్ణించారు. అమెరికా విలువలను కాపాడేవారికి తమ దేశంలోకి స్వాగతం పలుకుతామని, అదే సమయంలో ఉగ్రవాదాన్ని కానీ ఏ విధమైన తీవ్రవాదాన్ని కానీ సమర్ధించబోమన్నారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం -
సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ దంపతులు
-
నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్
అహ్మదాబాద్ : భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఇరు దేశాధినేతలు మోతేరాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియం వరకు 22 కి.మీ రోడ్ షోలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సదర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని మోదీ, ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. గాంధీజీ గురించిన విశేషాలను ప్రధాని మోదీ వారికి వివరించారు. చరఖాపై నూలు వడకడం ఎలానో చెప్తుండగా వారు ఆసక్తిగా గమనించారు. ట్రంప్ చరఖాపై కాసేపు నూలు వడికారు. అనంతరం సందర్శకుల పట్టికలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’అని విజిటర్స్ బుక్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ‘త్రీ మంకీస్’ ప్రతిమ ద్వారా గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోదీ వివరించారు. అనంతరం వారు మోతేరాకు బయల్దేరారు. -
ట్రంప్ పర్యటన.. ఎక్కడికక్కడ వైమానిక నిఘా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్లోని ప్రతి ఫ్లోర్లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు. మెలానియాకు సైతం.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు. సబర్మతి ఆశ్రమానికి తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది? అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది. అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట! గంటకు 1.02 కోట్లు రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి. అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్లో బస చేశారు. ఆ హోటల్లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట. -
సతీసమేతంగా భారత్‌కు బయల్దేరిన ట్రంప్
-
నమస్తే ట్రంప్
-
భారత్‌కు రానున్న ప్రిన్స్ చార్లెస్
లండన్: ప్రిన్స్ ఆఫ్ వేల్స్, రాణి ఎలిజబెత్-2 తనయుడు, దివంగత ప్రిన్సెస్ డయానా భర్త చార్లెస్(70) నవంబర్‌లో రెండురోజులపాటు అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నారు. వాతావరణ మార్పులు, సుస్థిర మార్కెట్లు, సోషల్ ఫైనాన్స్ అంశాలను దృష్టిలో పెట్టుకుని చార్లెస్ భారత్‌కు రానున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. చార్లెస్ తన 10వ అధికారిక భారత పర్యటనలో భాగంగా నవంబర్ 13న న్యూఢిల్లీకి రానున్నారని సమాచారం. భారత్‌కు ఆయన చివరిసారిగా తన రెండో భార్య కెమిల్లాతో కలిసి రెండేళ్ల క్రితం 2017 నవంబర్ లో వచ్చారు. యూరోపియన్ యూనియన్ (బ్రెక్జిట్) నుంచి వైదొలిగిన నేపథ్యంలో బ్రిటన్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చార్లెస్ తనయుడు ప్రిన్స్ విలియం తన భార్యతో కలిసి గతవారం పాకిస్తాన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ చేరుకున్న పాంపియో
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం ఆయనతో భేటీ కానున్నారు. రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్‌పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం పాంపియో ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు. మోదీతో భేటీ కానున్న ట్రంప్ జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో పాటు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌లతో ఆయన సమావేశం కానున్నట్టు యూఎస్ ప్రభుత్వాధికారి ఒకరు సోమవారం విలేకరులకు తెలిపారు. -
భారత్–ఉజ్బెకిస్తాన్ల మధ్య 17 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకఘట్టం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రసుత్తం భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మేం పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. దీర్ఘకాల ప్రయోజ నాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. శాంతియుత, ప్రజాస్వామ్య, సుసంపన్న అఫ్గానిస్తాన్తోనే అందరికీ లాభం కలుగుతుంది’ అని ఈ విషయంలో సహకరించుకోవాలని భారత్, ఉజ్బెకిస్తాన్‌లో ఓ అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు.