iPhone 7
-
ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్‌లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ సంస్థలకు చెందిన Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished యాపిల్ ఐఫోన్ గోల్డ్ కలర్ వేరియంట్ 64 జీబీ స్మార్ట్‌ఫోన్ కేవలం 10,899 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 Refurbished యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్'ను కలిగి ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64 జీబీ ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డీ+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!) -
గుడ్ న్యూస్ : ఇక తక్కువ ధరలోనే ఐఫోన్ 7
సాక్షి, బెంగళూరు : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. త్వరలోనే ఇండియాలో తయారైన మరో ఐఫోన్ సరసమైన ధరలో భారతీయ వినియోగదారులకు లభ్యం కానుంది. మేడిన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది దిగ్గజ సంస్థ ఆపిల్. ఇందులో భాగంగా బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్ ఐపోన్ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్ ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైదని ఆపిల్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆపిల్ ప్రకటించింది. భవిష్యత్తులో మేడిన్ ఇండియా పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 7 బేసిక్ మోడల్ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు విదేశీ స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే సుంకాల బారి నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టింది ఆపిల్ సంస్థ. తైవాన్ దిగ్గజం విస్ట్రోన్ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్‌లో ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే. -
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
సముద్ర గర్భంలో దొరికిన ఐఫోన్ పనిచేస్తుందోచ్!
న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్ఫార్మెన్స్కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సిగ్నల్‌ను కరెక్ట్‌గా అందుకుంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్‌లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్‌ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్‌ను కూడా అది కరెక్ట్‌గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్‌గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్‌లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్‌పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్‌ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్‌పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్‌ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
ఫ్లిప్‌కార్ట్ డే 2: స్మార్ట్ఫోన్లపై గ్రేట్ డీల్స్
సాక్షి, బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్ ఐదు రోజుల పండుగ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డేస్ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు వంటి వాటిపై ఫ్లిప్‌కార్ట్ బుధవారం గ్రేట్ డీల్స్‌ను అందించింది. నేటి నుంచి మొబైల్, ఎలక్ట్రానిక్స్ బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న టాప్ ఆఫర్స్... శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ధర రూ.46వేల నుంచి రూ.29,990కు తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.23వరకు తగ్గింపు ఆపిల్ ఐఫోన్ 7(32జీబీ) రూ.38,999కే అందుబాటు, ఎక్స్చేంజ్పై రూ.15,300 వరకు తగ్గింపు, అదనంగా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్పై 10 శాతం వరకు తగ్గింపు ఓప్పో ఎఫ్3 ప్లస్(64జీబీ) ఫోన్ రూ.24,990కే లభ్యం, ఎక్స్చేంజ్పై రూ.23,500 వరకు తగ్గింపు, హెచ్‌టీసీ యూ11 ఫోన్‌పై రూ.6,991 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుతం ఇది రూ.44,999కే అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.20వేల వరకు ఆఫర్ కూడా ఇస్తోంది. మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డీల్స్... ఆసుస్ జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, లెనోవో కే8 ప్లస్(3జీబీ) ఫోన్లు రూ.8,999కే లభ్యం రెడ్మి నోట్ 4 ఫోన్ ఫ్లాట్ డిస్కౌంట్ రూ.2000. రూ.10,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటు, ఎక్స్చేంజ్లో ఈ ఫోన్‌పై రూ.10వేల వరకు తగ్గింపు ఉంది. ఎంఐ మ్యాక్స్2(బ్లాక్, 64జీబీ) ఫోన్‌ఫై రూ.2000 తగ్గింపు, రూ.14,999కే విక్రయం, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.14వేల వరకు తగ్గిస్తోంది. మోటో ఎం(64జీబీ) ధర రూ.12,999 నోకియా 3 రూ.9,505 కొత్త ఫోన్లపై కూడా ఆసక్తికరమైన ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. పానసోనిక్ ఎలుగ రే 700 ధర రూ.10వేలు. జెన్‌ఫోన్ సెల్ఫీ రూ.13,999కే లభ్యం. -
ఈ స్మార్ట్ఫోన్లకు గ్లోబల్‌గా మస్తు గిరాకీ!
ప్రతి వారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతూ.. వినియోగదారులను అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్స్‌తో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా విపరీతంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో ఏ ఏ స్మార్ట్ఫోన్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి? బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లుగా ఏవి నిలుస్తున్నాయి? అంటే.. ఈ క్వార్టర్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ వచ్చిన స్మార్ట్ఫోన్ల జాబితాను రీసెర్చ్ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్ తన క్వార్టర్లీ రిపోర్టులో వెల్లడించింది. 2017 క్యూ 2 ఎక్కువగా సేల్ అయిన స్మార్ట్ఫోన్లు... ఆపిల్ ఐఫోన్ 7... ప్రారంభ ధర రూ.56,200 ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7, ఈ క్వార్టర్లో ఎక్కువగా మార్కెట్ షేరును సంపాదించుకుంది. 4.7 శాతం మార్కెట్ షేరుతో 16.9 మిలియన్ యూనిట్లు ఈ క్వార్టర్లో అమ్ముడుపోయాయి. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్.. ప్రారంభ ధర రూ.76,300 ఐఫోన్ 7లో అతిపెద్ద వేరియంట్ ఈ ఐఫోన్ 7 ప్లస్. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7 తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ క్వార్టర్లో 4.2 శాతం మార్కెట్ షేరును సంపాదించుకున్న ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్, 15.1 మిలియన్ యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8... ధర రూ.57,900 దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 10.2 మిలియన్ హ్యాండ్సెట్ల షిప్మెంట్లతో ఇది 2.8 శాతం మార్కెట్ షేరును దక్కించుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్... ప్రారంభ ధర రూ.64,900 గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ఈ క్వార్టర్లో 2.5 శాతం మార్కెట్ షేరును సంపాదించింది. ఈ క్వార్టర్లో 9 మిలియన్ యూనిట్లు రవాణా అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విక్రయాలను నమోదుచేసిన స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ ఎస్8 ప్లస్, నాలుగో స్థానంలో నిలిచింది. షావోమి రెడ్మి 4ఏ... ధర రూ.5,999 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మధ్యలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండో క్వార్టర్లో 5.5 మిలియన్ యూనిట్ల సరుకు రవాణాను రికార్డు చేశాయి. గ్లోబల్‌గా ప్రస్తుతం దీని మార్కెట్ షేరు 1.5 శాతం. -
పేటీఎం ఇండిపెండెన్స్ డే సేల్: భారీ క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమ బంపర్ డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించిన అనంతరం.. మీకంటే మీమేమనా తక్కువా అని పేటీఎం మాల్ కూడా భారీ డీల్స్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా పేటీఎం మాల్ తన యాప్, వెబ్సైట్లో స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. మంగళవారం నుంచి అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, అప్లియెన్స్, అప్పీరల్స్, యాక్ససరీస్ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్ వెల్లడించింది. ఈ సేల్ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో అతిపెద్ద హైలెట్, ఐఫోన్ 7పై 8000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయడం. అంతేకాక ఐఫోన్ ఎస్ఈపై కూడా ఫ్లాట్ 15 శాతం డిస్కౌంట్, రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ ధర 19,990కి దిగొచ్చింది. అంతేకాక షాపింగ్ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు, అప్పీరల్స్, మొబైల్ యాక్ససరీస్‌పై వాడుకోవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్‌బ్యాక్‌లతో పేటీఎం మాల్లో లిస్టయ్యాయి. షావోమి ఇటీవల లాంచ్‌చేసిన ఎంఐ మ్యాక్స్ 2 కూడా పేటీఎం తన మాల్లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్, వివో స్మార్ట్ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఆపిల్, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు పేటీఎం మాల్ చెప్పింది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాల దానిపై ఫ్లాట్ రూ.10వేల క్యాష్‌బ్యాక్, లెనోవో ఐడియాప్యాడ్ 320పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం లిస్టు చేసింది. అదేవిధంగా టీవీలు, వాషింగ్ మిషన్లపై 20వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్లపై 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ఇలా పేటీఎం మాల్లో అందించే చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
అమెజాన్‌లో ఐఫోన్ 6 ధరెంతో తెలుసా?
భారీ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన మొట్టమొదటి ప్రైమ్ డే సేల్‌ను నిన్న సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సేల్ నేటి అర్థరాత్రి(జూలై 11, అర్థరాత్రి) వరకు కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 6ను 25వేల రూపాయలకే అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం డిస్కౌంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఐఫోన్ 6ఎస్(స్పేస్ గ్రే, 32జీబీ), ఐఫోన్6ఎస్(గోల్డ్, 32జీబీ) ఫోన్లను 25 శాతం తగ్గింపుతో రూ.34,999కి విక్రయిస్తోంది. వీటితోపాటు ఐఫోన్ 7 రోజ్ గోల్డ్, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.42,999కే అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ల అసలు ధర రూ.56,200. ప్రస్తుతం అమెజాన్ ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరతో 23 శాతం పొదుపు చేసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు ఎల్జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌ను 30 శాతం ఆదాతో 37,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా తగ్గించి రూ.38,999కే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్ ప్రత్యేకంగా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్ యూజర్లకు మాత్రమే. రెండు రకాల డీల్స్‌ను ఈ సేల్‌లో అమెజాన్ ఆఫర్చేస్తోంది. రెగ్యులర్ డిస్కౌంట్లను, ప్రత్యేక సందర్భాల్లో పరిమిత ఉత్పత్తులపై ఆఫర్ చేసే డీల్స్. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉన్నాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. 30 కొత్త బ్రాండ్లను కూడా ఈ సేల్‌లో లాంచ్చేసింది. భారత్‌తో పాటు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు. -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
ఐఫోన్ 7పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
ఇటీవలే 'బిగ్ 10 సేల్' నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మరోసారి నేటి నుంచి సమ్మర్ షాపింగ్ డేస్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించి, తగ్గింపు ధరతో అందుబాటులో తీసుకొచ్చింది.. దీంతో ఐఫోన్ 7(బ్లాక్, 32జీబీ) వేరియంట్ రూ.45,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై అదనంగా మరో 15వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అంతేకాక సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం క్యాష్ బ్యాక్ నూ, ఫోన్ పే యూజర్లకు 25 శాతం డిస్కౌంట్ నూ అందిస్తున్నట్టు తెలిసింది. దీంతో మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. సమ్మర్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్7, 7 ప్లస్ వేరియంట్లు 'నో కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.ఆపిల్ ఐఫోన్7 ప్రారంభ ధర 60వేల రూపాయల నుంచి ఉంది. ఐఫోన్ 7(జెట్ బ్లాక్, 128జీబీ) ఫోన్ 54,499 రూపాయలకు, ఐఫోన్ 7 ప్లస్(బ్లాక్, 128జీబీ) ఫోన్ 67,999లకు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.. వీటికి కూడా ఎక్స్చేంజ్ పై 15వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఐఫోన్ మోడల్స్ పై ధర తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. -
ఐఫోన్7 వరస్ట్ ఫీచర్‌ను అది కాఫీ కొట్టింది!
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్... త్వరలోనే ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్ ప్లస్ 5 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేయనుందట. 2017లో తీసుకురాబోతున్నారంటూ ఎక్కువగా అంచనావేసిన ఫోన్లలో ఈ వన్ ప్లస్5 ఒకటి. ఐఫోన్ లెవల్ క్వాలిటీలో దీన్ని లాంచ్ చేస్తారని టెక్ అభిమానులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫీచర్లను సైతం ఆపిల్ నుంచి వన్ ప్లస్ కాఫీకొడుతుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భాగంగానే ఐఫోన్ 7లో లేని ఓ ఫీచర్ ను, వన్ ప్లస్5 కూడా తన స్మార్ట్ ఫోన్ లో అందించడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. అదేమిటో తెలుసా? 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్. హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఐఫోన్7 మాదిరిగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి రానుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. అంటే ఇది కేవలం బ్లూటూత్ హెడ్ ఫోన్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాయి. హెడ్ ఫోన్ జాక్ అందించకపోతుండటంతో, ఐఫోన్ 7 మాదిరిగా, వన్ ప్లస్ కూడా తన స్మార్ట్ ఫోన్ లో మరేదైనా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తారా? అని టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను చైనీస్ సోషల్ మీడియా సైట్ వైబో షేర్ చేసింది. లీక్ చేసిన ఈ ఫోటోలో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ లెన్స్ కెమెరా, విలక్షణమైన వన్ ప్లస్ లోగో కనిపిస్తోంది.. కానీ ఈ విషయంపై వన్ ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు హెడ్ ఫోన్ జాక్ ఇస్తుందా ? లేదా? అన్నది అప్పుడే క్లారిటీగా తెలుస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్స్ లేకపోవడం టెక్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ అదే!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 7’ నిలిచింది. 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్ 7’ యూనిట్లు అమ్ముడయినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఇది ఆరు శాతంగా నమోదైంది. 1.74 కోట్ల హ్యాండ్సెట్ల అమ్మకాలతో యాపిల్ కంపెనీకే చెందిన ఐఫోన్ 7 పస్ స్మార్ట్‌ఫోన్ రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 2017 మొదటి త్రైమాసికంలో 35.33 కోట్ల స్మార్ట్ఫోన్లు సేల్ అయినట్టు స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-5 స్మార్ట్ఫోన్లలో రెండు యాపిల్ కంపెనీవే కావడం విశేషం. 89 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఒప్పో ఆర్9ఎస్ మూడో స్థానంలో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ జే3, శామ్సంగ్ గెలాక్సీ జే5 నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. కాగా, భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది. -
ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 7 ఎంతో తెలుసా?
ముంబై: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 26 వరకు నిర్వహించనున్న ఆపిల్ డేస్ సేల్ లో భాగంగా ఆ కంపెనీ ఉత్పత్తులపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది.. ఈ సేల్ ఆఫర్ లో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన తన లేటెస్ట్ మొబైల్ ఐఫోన్ 7(256జీబీ) వేరియంట్ పై 20వేల రూపాయల బంపర్ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ వేరియంట్ కేవలం 39,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర 59,999 రూపాయలు నుంచి 70,000 రూపాయల వరకు ఉంది. సిల్వర్, బ్లాక్, జెట్ బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. కేవలం ఐఫోన్ 7పై డిస్కౌంట్ ను మాత్రమే కాక, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను రూ.19000 వరకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఫోన్ ను బట్టి ఎక్స్చేంజ్ మొత్తం ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం ధర తగ్గింపు దొరకనుంది. ఇతర స్టోరేజ్ వేరియంట్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లపై కూడా డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక ఐఫోన్ 6(16జీబీ) పై 26,010 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ ఐఫోన్ 6 ఫ్లిప్ కార్ట్ లో 25,990 రూపాయలకే లభ్యం కానుంది. ఎక్స్చేంజ్ , యాక్సిస్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు దీనికి వర్తిస్తాయి.. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకు 54,990 రూపాయలకే లభ్యం కానుంది. ఇతర డెబిట్, క్రెడిట్ కార్డుదారులకైతే ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ పై 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆపిల్ వాచ్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరంగా ఐఫోన్ 7కు ఫ్లిప్ కార్ట్ అధికారిక ఆన్ లైన్ రీటైలర్ గా ఉంది. -
వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు!
వాస్తవ విరుద్దంగా ప్రకటనలు: ఏఎస్సీఐ న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 7 ప్రకటనను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా...? నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్ 7 కాదు. ఐఫోన్ 7ప్లస్. అంటే మెరుగైన ఉత్పత్తిని చూపిస్తూ వినియోగదారులను ఆకర్షించేలా ఈ ప్రకటన ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలా 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్ (ఏఎస్సీఐ) ప్రకటించింది. వీటిలో కోకకోలా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలవి సైతం ఉన్నాయి. మొబిక్విక్, హిందూస్తాన్ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్‌కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి. -
ఐ ఫోన్ 7, 7 ప్లస్‌లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆపిల్ ఐ ఫోన్లపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ తాజా స్మార్ట్ఫోన్లు ఐ ఫోన్ 7 రెడ్, 7 ప్లస్ రెడ్ పై రూ. 4000 తగ్గింపు అందిస్తోంది. మొదటి రోజు అమ్మకాలపై మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని అమెజాన్ ప్రకటించింది. గత నెలలో రెడ్ కలర్ స్పెషల్ వేరియింట్ లో ఈ ఐ ఫోన్ 7, 7 ప్లస్ మోడల్స్‌ను ఆపిల్ లాంచ్ చేసింది. అలాగే ఇండియాలో ప్రీ బుకింగ్ లను గత వారం మొదలు పెట్టింది. ప్రస్తుతం వీటిపై అమెజాన్ ఈ స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐ ఫోన్ 7 రూ. 66000 కే అమెజాన్ అందిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ.70,000 ప్రస్తుతం ఐ ఫోన్ 7 ప్లస్ ధర రూ. 78,000గా ఉంది. దీని లాంచింగ్ ధర రూ. 82, 000 మరోవైపు 128 జీబీ వేరియంట్ ఐ ఫోన్లపై మాత్రమే ఈ ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం. అలాగే రూ. 8550 ల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎక్సేంజ్ చేసుకునే డివైస్ ఆధారంగా డిస్కౌంట్ ధరను నిర్ణయిస్తారు. కాగా ఏప్రిల్ 14నుంచి ఆపిల్ ఐ ఫోన్ 7,7 ప్లస్ విక్రయించనున్నట్టు ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐ ఫోన్ 7 256 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర. 80,000గా నిర్ణయించింది. -
ఐ ఫోన్ 7ప్లస్, 7లపై డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: అప్‌గ్రేడ్ చేసిన ఆపిల్ ఐ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 5శాతం తగ్గింపుతోపాటు, రూ. 25వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో ఆపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ స్టార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే పాత ఐఫోన్ హ్యాండ్సెట్లు ఎక్సేంజ్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా ఐఫోన్ 4, 4, 5, -5, 5 సి, 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్ , ఎస్ఈ ఫోన్లకు ఎక్సేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐఫోన్ 7 32జీబీ 5శాతం డిస్కౌంట్ తో రూ 57,000కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర. రూ 60,000. దీనికి అదనంగా ఇతర ఐఫోన్ మోడల్స్‌తో మార్పిడి చేసుకున్న వినియోగదారులు రూ.21.800 తగ్గింపు ఆఫర్ తో రూ. 35,200 ల వరకు ఈ హ్యాండ్ సెట్ ధర తగ్గనుంది. అదే విధంగా, ఐఫోన్ 7 (128జీబీ) మరియు ఐఫోన్ 7 (256జీబీ ) వరుసగా రూ.43,200,రూ. 51,200 ఫ్లాట్ డిస్కౌంట్ . దీనికి ఎక్సేంజ్ ఆఫర్ అదనం. కాగా వీటి అసలు ధరలు వరుసగా రూ 70,000 , రూ .80,000లుగా ఉన్నాయి. ఐఫోన్ 7 ప్లస్ , 32జీబీ వెర్షన్ 5 శాతం డిస్కౌంట్ తర్వాత రూ 44, 800కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్అసలు ధరరూ. 72,000. అదేవిధంగా, 128జీబీ వెర్షన్ రూ. 52,800 (అసలు ధర రూ 82,000) కొనుగోలు చేయవచ్చు.256జీబీ రూ.60,800గా ఉండనుంది. అసలు ధర రూ. 92,000గాఉంది. (ఈ ధరలు 5 శాతం డిస్కౌంట్ + ఎక్సేంజ్ ఆఫర్ రూ.26,600 కలిపి మొత్తం రూ.31,200 తగ్గింపు తర్వాత) దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి పలు బ్యాంకుల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అలాగే, ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ గోల్డ్ కలర్ వేరియంట్, 32జీబీ, ఐఫోన్ 7 128జీబీ ఈ అప్గ్రేడ్ప్రోగ్రాం నుంచి మినహాయించిన సంగతిని గమనించగలరు. మరోవైపు తను కొనుగోలు చేసి ఐఫోన్ కు వెనుక చిన్న గీతలు పడడంతో ఎక్సేంజ్‌ను నిరాకరించారనీ, టైం వేస్ట్ అంటూ కోలకత్తాకు చెందిన మనోహర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొనుగోలుదారులూ..బీ కేర్‌ఫుల్.. -
ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
డిజిటల్ లావాదేవీల్లో ఫుల్ పాపులర్ అయిన పేటీఎం, ఐఫోన్, మ్యాక్ బుక్ మోడల్స్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ ఆపిల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు పేటీఎం నిర్వహించే ఈ సేల్ లో మ్యాక్ బుక్ కొనుగోలుచేసిన వారికి రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వీటిలో ఎంపికచేసిన వాటికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం 15 అంగుళాలు కలిగిన ఆపిల్ మ్యాక్ బుక్ రూ.1,50,000కు అందుబాటులో ఉంది. దీనిపై వినియోగదారులు రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ పొందనున్నారు. అంతేకాక మరికొన్ని ఆపిల్ ఉత్పత్తులపై కూడా పేటీఎం ఆఫర్లను అందిస్తోంది. 256జీబీ కలిగిన ఐఫోన్ 7 కొనుగోలు చేసిన వారికి రూ.12వేల క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. అదేవిధంగా రూ.65వేల ధర కలిగిన 128జీబీ ఐఫోన్ 7 కొనుగోలుచేసిన వారికి, రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46వేలు ధర ఉన్న 32జీబీ ఐఫోన్ 6ఎస్ కొంటే, రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.65వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే, రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొనుగోలు చేసిన వారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు పేటీఎం పేర్కొంది. -
ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు!
ఆపిల్ ఐఫోన్‌ను డిస్కౌంట్ ధరల్లో కొనుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్ఫామ్లో ఆపిల్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. జనవరి 10 నుంచి 13 వరకు జరిగే ఈ ఫెస్ట్‌లో ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లతో పాటు ఆపిల్ యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లను ఈ సైట్ ప్రకటించింది. అదనంగా ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ 6 కొనుకునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఆపిల్ ఫెస్ట్‌లో డిస్కౌంట్లేమిటో మీరే ఓ సారి చూడండి... ఆపిల్ ఐఫోన్ 7 : ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్‌తో రూ.65వేలకే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించే విధంగా అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలని. ఎక్స్చేంజ్పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంది. అలా ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ అయితే 7 శాతం డిస్కౌంట్‌కి రూ.55,000కు విక్రయించనున్నారు. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేవు. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్‌ను రూ.65,000కే విక్రయించనున్నారు. 6 శాతం డిస్కౌంట్‌తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్‌ను రూ.75,000కు ఆపిల్ విక్రయించనుంది.. ఐఫోన్ 7 ప్లస్ : ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్‌ను రూ.82వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా దీనిపై రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్‌ను కూడా రూ.82వేలకే లభ్యం కానుంది. జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలు. ఐఫోన్ 7 ప్లస్128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్‌కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లనే ఈ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు. ఐఫోన్ 6 ఎస్ : ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ రూ.31,990కు కొనుకోవచ్చు. ఎక్స్చేంజ్పై రూ.24వేల వరకు డిస్కౌంట్ ఉంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.4,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈఎంఐ రూ.1,552కే ప్రారంభమవుతుంది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు రూ.46,999కు లభ్యం కానున్నాయి.. ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్: (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లు రూ.56,999కు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లందరికీ అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 5ఎస్ : దేశంలో ఎక్కువగా పాపులర్ అయిన ఈ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ రూ.19,999కు ఆపిల్ అందించనుంది. ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ 50, 25 శాతం ఆఫర్ చేస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టి, ఆపిల్ అదరగొట్టింది!
బెంగళూరు : పండుగ సీజన్లో ఎలాగైనా భారత్‌లో ఐఫోన్స్ విక్రయాలు పెంచుకోవాలని భావించిన ఆపిల్, ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో దోస్తికట్టింది. ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన వేళ విశేషం ఆపిల్‌కు బాగా కలిసివచ్చింది. ఐఫోన్ విక్రయాల్లో విరగదీసింది. అక్టోబర్‌లో 50 శాతం ఐఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌తోనే జరిగినట్టు తెలిసింది. ఆపిల్‌కు ఎలాంటి అవుట్టెల్స్ లేకపోవడంతో, సిటీలకు, పట్టణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేయడానికి ఈ దోస్తీ బాగా సహకరించిందని ఆపిల్ సంబురపడుతోంది. ఆపిల్ లేటెస్ట్గా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ విక్రయాలు అత్యధిక మొత్తంలో నమోదవుతూ, అక్టోబర్‌లో దాదాపు 2.6 లక్షల యూనిట్ల సరుకు రవాణా జరిగినట్టు టెక్నాలజీ పరిశోధన సంస్థ సైబర్‌మీడియా తెలిపింది. చాలామటికి ఐఫోన్ విక్రయాలు ఎక్స్చేంజ్ ఆఫర్లోనే జరిగినట్టు పేర్కొంది. 70 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లను ఐఫోన్ 7ల కోసం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు వివరించింది. 30 శాతం ముందటి తరం ఐఫోన్లకు అప్‌గ్రేడ్‌గా తీసుకున్నట్టు తెలిపింది. రూ.20వేలకు ఎక్కువున్న ప్రీమియం హ్యాండ్ సెట్ కేటగిరీలో ఆపిల్ మార్కెట్ షేర్ అత్యధికంగా ఆర్జించడానికి ఈ దోస్తి దోహదం చేసిందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో రూ.20వేలకు పైన ఉన్న హ్యాండ్ సెట్ల మార్కెట్లో ఆపిల్ షేరు 20 శాతంగా ఉండేదని సైబర్ మీడియా వెల్లడించింది. కానీ అక్టోబర్‌లో ఈ షేరు భారీగా పెరిగినట్టు పేర్కొంది. శాంసంగ్ నోట్ 7 ఎదుర్కొంటున్న పేలుళ్ల సమస్య కూడా ఆపిల్‌కు బాగా కలిసి వచ్చినట్టు సైబర్ మీడియా ప్రముఖ విశ్లేషకుడు(టెలికాం) ఫైసల్ కావూసా తెలిపారు. ఒక్క భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా శాంసంగ్ గెలాక్సీ పేలుళ్ల సమస్య ఆపిల్‌కు లబ్ది చేకూరుస్తుందన్నారు. రెడింగ్టోన్ ఇన్‌గ్రామ్, రాశి ఫెరిఫిరల్స్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆపిల్ ఇన్ని రోజులు ఐఫోన్లను భారత్‌లో విక్రయించేది. కానీ మొదటిసారి సంప్రదాయానికి భిన్నంగా, ఈ పండుగ సీజన్లో ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టి, డైరెక్ట్‌గా తానే ఐఫోన్ విక్రయాలను భారత్‌లో చేపట్టింది. -
ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!
బుర్రలో విషయం ఉన్నోళ్లు ఏడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతితెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలో ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఏంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సహోద్యోగి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్ లైన్ లో అమ్మేసి సుమారు 12 లక్షల రూపాయలు పోగేసింది. ఈ డబ్బును డౌన్ పేమెంట్ గా చెల్లించి ఇల్లు కొక్కుకుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహద్యోగి ఒకరు 'తియాన్ యా యి డూ' బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్ గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని వుండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఆమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుకున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు. షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షీయోలీ స్టోరీ '20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్' హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశారు. కొంతమంది ఆమెను ప్రసంసిస్తే, మరికొంత మంది ఆమె చేసిన పని కరెక్ట్ కాదని తిట్టిపోశారు. -
ఐఫోన్ 7 ఫ్రీగా వస్తుందన్న కక్కుర్తితో..!
ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే వ్యక్తులు ఉంటారని తరచుగా ఆ మాట వింటూనే ఉంటాం. ప్రస్తుతం దానికి భిన్నమైన ఘటన ఉక్రెయిన్ లో జరిగింది. ఓ యువకుడు స్మార్ట్ ఫోన్ పిచ్చితో ఏకంగా తన పేరును శాశ్వతంగా మార్చేసుకున్నాడు. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓలెజ్ఞాండర్ తురిన్(20) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉండేవాడు. అతడికి స్మార్ట్ ఫోన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందులో ఏకంగా ఐఫోన్ 7 వస్తుందంటే ఆగుతాడా. ఉక్రెయిన్ యువకుడు రాజధాని కీవ్ నగరంలో ఓ ఆఫర్ గురించి విన్నాడు. అదేమంటే.. కీవ్ లోని ఐఫోన్ స్టోర్ బంపర్ ఆఫర్ అంటూ.. పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులలో తొలి ఐదుగురికి ఐఫోన్ 7 ఫ్రీ అని ప్రకటించింది. దీంతో ఏ మాత్రం వెనుకాడకుండా ఓలెజ్ఞాండర్ అందుకు అంగీకరించాడు. స్టోర్ వాళ్ల ఆఫర్ మేరకు 'ఐఫోన్ సిమ్ సెవెన్' గా తనపేరు మార్చుకున్నాడు. 'ప్రతి మనిషి తనను తాను ఏదో ఒక కొత్త తరహాలో ఆవిష్కరించుకోవాలనుకుంటారు కదా. ప్రస్తుతం తాను కూడా అందరికంటే భిన్నంగా ఉండాలని భావించాను. మరో వ్యక్తి గతంలో ఇదే తరహాలో తన పేరును ట్విట్టర్ అని మార్చుకున్నాడు. అలాంటిది నేను ఐఫోన్ కోసం పేరు మార్చుకుంటే తప్పేముంది' అని ఐఫోన్ సిమ్ సెవెన్ అన్నాడు. ఓలెజ్ఞాండర్ తురిన్ సోదరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తాము జీర్ణించకోలేకపోతున్నామని, నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా తప్పడం లేదన్నారు. సెవెన్ గా పేరు మార్చుకోవడంతో ఒక్కరోజులోనే స్థానికంగా సెలబ్రిటీ అయిపోయాడు. -
ఐఫోన్ మళ్లీ పేలింది!
సిడ్నీ: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు తరచుగాగా చోటు చేసుకోవడంతో ఆ కంపెనీ గత త్రైమాసికంలో ఆ కంపెనీ మార్కెట్ పై ప్రభావం చూపింది. శాంసంగ్ నుంచి పోటీ తగ్గుతుందని యాపిల్ సంబరపడింది. కానీ ప్రస్తుతం యాపిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా దిగ్గజ కంపెనీ యాపిల్ ఐఫోన్లు పేలుతుండటం ఆ కంపెనీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ఓసారి ఐఫోన్ 6, మరోసారి ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ స్మార్ట్ ఫోన్ పేలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 7 పేలిపోయి ఓ కారులోని వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వెల్స్ లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తన పేరు మాట్ జోన్స్ అని తాను సర్ఫింగ్ కు వెళ్లగా తన ఐఫోన్ పేలిపోయిందని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. తాను సర్ఫింగ్ కు వెళ్తూ ఐఫోన్ 7ను కారులో వదిలివెళ్లానని, తిరిగొచ్చి చూసే సరికి కారు నిండా దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పాడు. కేవలం వారం కిందటే ఐఫోన్ తాను కొనుగోలు చేయగా.. అంతలోనే ఫోన్ పేలిపోయిందన్నాడు. తాను కేవలం కంపెనీ ఇచ్చిన ఛార్జర్ మాత్రమే వాడినట్లు తెలిపాడు. బ్యాటరీల తయారీలో లిథియం-అయాన్ వాడుతున్న స్టార్ట్ ఫోన్ల లోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పేలుడుకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టామని గతంలో ఐఫోన్లు పేలిన సందర్భంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆగస్టులోనే ఐఫోన్ తొలిసారిగా పేలినా.. రెండు నెలల తర్వాత కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల కిందట ఐఫోన్ 6 పేలి ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సిడ్నీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో అతడికి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. (తప్పక చదవండీ: స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?) -
ఐఫోన్7లో మనకు తెలియని మరో కొత్త ఫీచర్!
న్యూయార్క్ : మీరు కొత్తగా కొనుకున్న ఐఫోన్7లో హోమ్ బటన్ పనిచేయడం లేదా..? అయితే ఏమాత్రం ఆందోళన పడకండి. దానికి ఓ పరిష్కారం ఉందట. ఓ వర్చ్యువల్ బటన్‌ను(దాగిఉన్న హోమ్ బటన్) ఆపిల్ సంస్థ ఐఫోన్7లో పొందుపరిచిందట. ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు, వెంటనే ఈ వర్చ్యువల్ బటన్ ఆన్ అయిపోతుందట. అయితే ఈ వర్చ్యువల్ హోమ్ బటన్ ఎక్కడ ఉంటుందా అనేదే సందేహమా.. ఈ బటన్‌ను ఐఫోన్7 ఫోన్ల స్క్రీన్ కింద భాగంలో ఆ సంస్థ అమర్చిందని ఆపిల్-ట్రాకింగ్ వెబ్సైట్ మ్యాక్రూమర్స్ వెల్లడించింది. ఐఫోన్7 హోమ్ బటన్‌ను ఈ ఏడాదే కొత్తగా రీడిజైన్ చేశారు. ఈ కొత్త హోమ్ బటన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో దీన్ని ఆన్ చేయవచ్చు. బటన్‌ను యూజర్లు నొక్కినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆ బటన్ యాక్టివేట్ అయినట్టు యూజర్లకు వెంటనే తెలిసిపోతుందని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది.ఈ ఫీచర్ టెక్నికల్‌గా దాగిఉంటుందని, ఫిజికట్ బటన్ పనిచేయనప్పుడు, ఇది ఆన్ అవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ హోమ్ బటన్‌లో మార్పులు తీసుకురావాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ నుంచి తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం హోమ్ బటన్‌లో ఆపిల్ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. చిన్నచిన్నగా ఫిజికల్ హోమ్ బటన్ల వాడకాన్ని ఆపిల్ సంస్థ తొలగిస్తుందని టాక్. -
ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ యూజర్లకు దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో నెలకు 10జీబీ 4జీ/3జీ డేటాను ఏడాది పాటు కొత్త ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులు ఉచితంగా వాడుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సునిల్ భారతీ మిట్టల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఐఫోన్7 ఫోన్లు నిన్నటి నుంచే భారత వినియోగదారుల ముంగిట్లోకి వచ్చాయి. రిటైల్ దుకాణాల్లోనూ లేదా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఫోన్లను కొనుకోవచ్చని కంపెనీ తెలిపింది. తాజా ఐఫోన్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్టెల్ మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇన్ఫినిటీ ప్లాన్స్‌పై ఉచిత డేటాను, అపరిమిత వాయిస్కాలింగ్ను ఆఫర్ చేయనున్నట్టు భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి చెప్పారు. ఈ ఉచిత డేటా ప్లాన్‌కు అదనమని టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలుపుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్), 3జీ/4జీ డేటా, ఎస్ఎమ్ఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది.