IYR KRISHNARAO
-
ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అస్సలు వాడలేదు: శ్యామలరావు
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్‌తో శ్యామలరావు మాట్లాడుతూ ‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించారు. జులై 6న వచ్చిన రెండు ట్యాంకర్లలో, జులై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శ్యాంపుల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్‌కు పంపించాం. ఆ నెయ్యిని 100శాతం ఉపయోగించలేదు.’’ అని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌లో జంతుసంబంధమైన, వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. అసమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్లు ది ప్రింట్లో వచ్చిన కథనం లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? : ఐవైఆర్ కృష్ణారావు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీనెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? ’’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది కచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమరాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు. చర్యతీసుకోవడం మానేసి రాజకీయమా? ‘‘టీటీడీలో ఒక సిస్టమ్‌ను అనుసరిస్తాం. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగానే సరఫరాదారును ఎంపిక చేస్తారు. ఎంపికైన ఏజెన్సీ కల్తీ వంటి ఏదైనా తప్పు చేస్తే దానిని గుర్తించి చర్య తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. అది మానేసి దీనిని రాజకీయంచేయడం ఎంత వరకు సబబు?’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీటీడీ అధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధికి చెప్పారు. వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ! టీటీడీకి ఈ ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ రెండేసి ట్యాంకర్లు చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి, సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలియతిప్పి.. ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌లో వేర్వేరుగా పరీక్షలు చేసిన ముగ్గురు టెక్నీషియన్లు టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు. దాంతో తిరుపతిలో టీటీడీ గోడౌన్ బయట నుంచే ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డులో వినియోగించడం కాదు కదా కనీసం తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌లోకి కూడా అనుమతించడం లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. -
ప్రాధాన్యతల లేమిలో భారత్–పాక్
రుతుపవన వర్షాలు భారత ఉపఖండం అంతా వ్యాపిస్తాయి. కృత్రిమంగా ఏర్పడిన దేశ సరిహద్దులను ఈ వర్షాలు లెక్క చేయవు. కురిస్తే మొత్తం ఉప ఖండం అంతా కుంభ వృష్టి. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, కరువు. ఈ సంవత్సరం అంతటా కుంభవృష్టి. ఇక దానితో పాటు వచ్చే వరదలు, మలేరియా డెంగీలాంటి అనారోగ్యాలు సరిహ ద్దుకు అటు ఇటు ఒకే రకంగా ప్రజలను పీడిస్తు న్నాయి. వర్షాకాలంలో పురపాలక శాఖ అసమర్థతతో ఉంటే మోకాలు లోతు లేదా నడుము లోతు నీళ్లలో రోడ్లపై నడవాల్సి ఉంటుంది. అది సింధ్ హైదరాబాద్ అయినా దక్కన్ హైదరాబాద్ అయినా. 70 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా భారత్–పాక్ దేశాలు ఈ ప్రాథమిక సమస్యలను అధిగమించడంలో విఫలమైనాయి. దీన్ని విస్మరించి రెండు దేశాలలో చర్చ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ విషయంలో ఎవరి వాదన పైచేయిగా ఉన్నది అనే దానిపై నడుస్తుంది. ప్రతి ఏటా జరిగే ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో అన్ని దేశాలు తమ దేశ పరిస్థి తులను, ప్రపంచంలోని ప్రధాన సమస్యలపై వారి విధానాన్ని వివరించడం ఆనవాయితీ. భారత ఉపఖండంలోని మూడు ప్రధాన దేశాల అధిపతులు సెప్టెంబర్ నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆ దేశ పురోగతి సమస్యల విషయం విశదీకరిస్తూ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన మార ణహోమాన్ని గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంతో సరిహద్దు సమస్య లేకపోవటం బంగ్లాదేశ్ తన అంతర్గత వ్యవహారాల మీద, దేశ అభివృద్ధి మీద పూర్తి దృష్టి సారించడానికి తోడ్ప డింది. ఈనాడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చక్కని పురోగతి సాధిస్తున్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను, స్వచ్ఛభారత్ లాంటి ప్రధాన కార్యక్ర మాలను తన ఉపన్యాసంలో వివరించారు. ఎటొచ్చీ కొంత తేడాగా నడిచిన ఉపన్యాసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది. పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావనతో ప్రారంభమైన ప్రసంగం, అంతర్జాతీయ నల్లధన మార్పిడి ఏ విధంగా వారి దేశానికి నష్టం కలి గిస్తుందని వివరిస్తూ, ఇస్లామిక్ తీవ్రవాదం అసలు సమస్య కాదు పొమ్మన్నారు. ఇక ప్రధా నంగా తన ఉపన్యాసంలో కశ్మీర్ గురించి ప్రస్తా వించారు. కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి వేది కపై ప్రముఖంగా ప్రస్తావిస్తారు అని అందరూ ఊహించినప్పటికీ ఆయన ప్రసంగించిన విధా నం ఒక రాజ్యాధినేత ఐరాస వంటి అంతర్జా తీయ సంస్థలో ప్రసంగించాల్సిన స్థాయిలో లేదు. శాపనార్థాలతో సాగిన ఆయన ప్రసంగంలో.. 370 రద్దు వల్ల కశ్మీర్లో మారణహోమం జరుగు తోందని, ఈ సమస్య అణు యుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. భారత్‌లోని ముస్లిం లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. కశ్మీర్లో అటువంటి మారణహోమం జరగా లని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు. కశ్మీర్ వాసులకు నష్టం జరిగినా పర్వా లేదు మాకు రాజకీయ లబ్ధి కావాలనేది ఆయన కోరికగా కనిపిస్తుంది. ఇక అణు యుద్ధ ప్రస్తావన తీసుకురావడం ఒక రకంగా ఆయన అనుభవ రాహిత్యం చాటుతోంది. ఐక్యరాజ్య సమితి సభలో ఇటువంటి హెచ్చరిక చేసినందున దీనిని తీవ్రంగా పరిగణించి పాకిస్తాన్ అణు కేంద్రాల పైన ఐక్యరాజ్యసమితి పూర్తి నియంత్రణ తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక భారత దేశంలోని ముస్లింలను రెచ్చగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన రాజకీయ అవివేకాన్ని చాటుతుంది. 370 ప్రకరణ తొలగింపును భార తదేశంలో మత ప్రాంతీయ విభేదాలకు అతీ తంగా ప్రజలందరూ సమర్థిస్తున్నారు అనే సత్యాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఐక్య రాజ్యసమితిలో ఈ విధంగా మాట్లాడినా, విలేకర్ల సమావేశంలో మాత్రం కశ్మీర్ సమస్య పరిష్కా రానికి భారత్‌తో యుద్ధం మార్గం కాదన్నారు. ఉన్న వాస్తవాన్ని గుర్తించి మరొక వేదికపై ప్రస్తా వించటం అభినందనీయం. సైన్యాన్ని అదుపులో పెట్టగలిగిన ప్రజా పాలకులు అధికారం చేపట్ట నంతవరకు పాకిస్తాన్ దేశ సమస్యలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ ‘ iyrk45@gmail.com -
రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం
వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ దేశీయ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు రైతు సంక్షేమం దృష్ట్యా పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఇవి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తమ లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్ కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక నేడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. అందుకనే ’మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’లో రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా మార్పులు తీసుకురావడం అవశ్యం. ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెం ట్‌కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన ’మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ (ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్) ఉల్లంఘనకు గానూ రైతులపై ఈ కేసు పెట్టారు. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(కాంట్రాక్ట్ ఫార్మింగ్) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 ఏళ్ల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసు మూలంగా ’ మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం’లోని కొన్ని లొసుగుల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్ 39 కింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పారు. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా అమ్మనంతవరకు వ్యవసాయదారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్ కింద పరిరక్షించటం జరి గింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్ పొందిన వ్యక్తులు గానీ ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సెక్షన్లలోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కేసులలో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి. 1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన ఖీఖఐ్కS లాంటి మేధోసంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా! 2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించారు కాబట్టి పరిశోధనకు అవసరమైనటువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా ట్రిప్స్ అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరిచారు. ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్ రంగాల్లో డబ్ల్యూటీవో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా పేటెంటింగ్ కాపీరైట్ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయరంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులు గానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసి, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగి ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది. డబ్ల్యూటీవో సంస్థ ఆధ్వర్యంలోని ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో ట్రిప్స్ చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధితులమయ్యాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలోని మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం కిందనే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(కాంట్రాక్ట్ ఫార్మింగ్) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్‌ను, చిన్నకమతాల రైతులను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థలకే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు, షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతు సంక్షేమం దృష్ట్యా అవి పనిచేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న, సన్నకారు రైతులపైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్షదారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థలపై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక ఈనాడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరఫున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి. పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి. రైతు లను కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు. ఇంకొక ప్రధాన విషయం మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని sui generisవిధానంలో ఈ ‘మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ని రూపొం దించారు. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని ట్రిప్స్ విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
‘జార్ఖండ్ అలా చేస్తే.. ఏపీ మాత్రం అందుకు విరుద్ధం’
సాక్షి, గుంటూరు : అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని జనచైతన్య వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సదస్సులో పాల్గొన్న ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ. 30 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపారని, కానీ ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిదులను ఏపీ పాలకులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర నిధులను విద్య, వైద్యానికి ఖర్చు చేయగా.. ఏపీలో అందుకు విరుద్ధంగా పప్పు బెల్లాలకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఆదాయమో శ్వేత పత్రం విడుదల చేయాలి.. అప్పుచేయటం తప్పుకాదని, కానీ ఎందుకు అప్పులు చేస్తున్నామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సదస్సులో పాల్గొన్న ఆర్థికవేత్త కేసీ రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ స్థితిగతులపై చర్చించడం తప్పుకాదని అన్నారు. 11.5 శాతం వృద్ధిరేటు సాధించామని చెబుతున్న పాలకులు ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని, ఏ రంగం మీద ఎంత ఆదాయం వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలని స్పష్టం చేశారు. -
ఇలాంటి పాలన వద్దే వద్దు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలపై సామాన్యులు, పేదలు, యువత, మహిళలు, రైతులే కాకుండా మాజీ ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, విద్యావంతులు, పర్యావరణవేత్తలు ఇలా అన్ని రంగాల ప్రముఖులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అక్రమాలు, అరాచకాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తన వర్గం వారే తప్ప బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టదని, రాష్ట్రంలో ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచేశారని తూర్పారా బట్టారు. ఈ అవినీతి పరంపరపై పలువురు ప్రముఖులు ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబుకు విలువలు లేవు కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయనను మించిన అవినీతిపరుడు, అసమర్ధుడు, వెన్నుపోటుదారుడు ఎవరున్నారు? ఇంకొకర్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు? ఆయన పెద్ద జాదూ.. అన్ని కులాలను, మతాల్ని మోసం చేశాడు. వాజ్‌పేయితో కలుస్తానంటే ఆ వేళ ముస్లింలు వద్దన్నారు. అయినా బీజేపీతో చేతులు కలిపాడు. ఆ తర్వాత అవే మసీదుల్లో మీటింగులు పెట్టి.. నన్ను క్షమించండి, మరెప్పుడూ కలవనన్నాడు. మళ్లీ మోదీతో కలిశాడు. వంగి వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు తిడుతున్నాడు. నిన్నటి దాకా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తిట్టి ఇప్పుడు వాళ్లకు దండాలు పెడుతున్నాడు. ప్రత్యేక హోదాలో ఏముందీ? అన్నది చంద్రబాబే. ప్యాకేజీయే మంచిదని చెప్పాడు. మళ్లీ నల్లచొక్కా వేసుకుని హోదా కావాలంటున్నాడు. - పోసాని కృష్ణమురళీ, సినీనటుడు ముస్లింలను బాబు వంచించారు ముస్లింలను నిలువునా వంచించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. బాబు పాలనలో మైనారిటీలు ఎప్పుడూ సంతోషంగా లేరు. గుజరాత్ అట్టుడికిపోతూ అమాయక ముస్లింలు ఊచకోతకు గురైతే.. ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాదీ ముస్లిం యువకులను గుజరాత్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి జైళ్లలో పెడితే చంద్రబాబు ఏం చేశారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీలకు తన మౌనంతో బాసటగా నిలిచి.. ముస్లింలను దగా చేసింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందో ముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించిన ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటి మహానేత కుమారుడిగా వైఎస్ జగన్‌ను వారు అవే కళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజం అంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా! ప్రతి ముస్లిం కుటుంబం కూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. జగన్‌ను కూడా అలానే భావిస్తున్నారు. - అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత ఇరిగేషన్ అంతా పెద్ద స్కాం ఓట్ల కోసమే ఎన్నికల ముందు వివిధ కులాలు, వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఒక సామాజికవర్గం మేలు కోసం తప్ప సీఎంగా ఆయన చేస్తున్నదేమీ లేదు. టీడీపీ నాయకులు కాగితాలపైన కంపెనీలు సృష్టించి విలువైన భూములు కబ్జా చేశారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని దాన్ని ఏ రకంగానూ ముందుకు పోనీయకుండా చేశారు. కాంట్రాక్టర్లకు భారీ లాభాలు వచ్చేలా చేసి.. ఇష్టమొచ్చినట్లు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇరిగేషన్ ఒక పెద్ద స్కామ్. ‘నాకేంటి?’ అన్న తరహాలో బాబు ఆలోచన ఉంటుంది. ప్రగతి సాధించలేక వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టేందుకు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు చేశారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఓడరేవు కట్టారా? - ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సమయంలోనే ఈ గిమ్మిక్కులేంటి? సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాల పేరుతో డబ్బుల్ని జమ చెయ్యడమేంటి. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా పసుపు–కుంకుమ అంటూ.. రూ.10 వేలు ఇవ్వడం ఏం న్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం. – ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఏఎస్ ఎక్కడ చూసినా అవినీతి, బంధుప్రీతి అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. గత ఐదేళ్లలో పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఫలానా పనికి ఫలానా రేటంటూ వాటాలు పంచుకున్నారు. కాంట్రాకర్లకు బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. మంత్రులు తప్పు చేస్తే ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యమంత్రే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? రాజధాని కోసం మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. భూములు ప్రభుత్వపరం కాక ముందే.. విదేశీ కంపెనీలకు పందేరం పెట్టారు. - జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మోసకారి బాబును నమ్మొద్దు చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలేదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. చంద్రబాబుది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్ చేసి చూపించాడు. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో చంద్రబాబు నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని సీఎం కాగానే అవసరం తీరాక వదిలేశాడు. - ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పోలవరంలో బాబు చేసిందేమీ లేదు పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చిందొకరు. జాతీయ ప్రాజెక్ట్‌గా చేసిందొకరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చుపెట్టింది మరొకరు. మరి పోలవరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సింగపూర్ తరహాలో రాజధానని పదేపదే చెప్పడం ఆత్మన్యూనతాభావం. భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొనడం ఎంత దారుణం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో తన సామాజికవర్గానికి చెందిన బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. మేకిన్ ఇండియాలో భాగంగానే అనంతపురంలో కియో కంపెనీ ఏర్పాటైంది. అది తన ఘనతగా చెప్పుకోవడం సరికాదు. హంద్రీనీవా పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. హంద్రీనీవాను పూర్తి చేయకుండా.. చేతులారా రాయలసీమను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. - వై.వెంకట్రామి రెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ సంపద సృష్టి పెద్ద మాయ రాష్ట్రాభివృద్ధిపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలే. సంపద సృష్టి అనేది పెద్ద మాయ. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. రైతులకు రూ.88 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే.. తీరా మాఫీ రూ.15వేల కోట్లకు మించలేదు. బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్న బీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారు.? ఎందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. 2014 ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఆచరణలో ఒకే ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. అదికూడా సరిగా పనిచేయడం లేదు. - డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు చంద్రబాబు 14 ఏళ్ల పాలన కుతంత్రాలు, దోపిడీతోనే నడిచింది. సమాజంలో కులాల మధ్య విభేదాలకు బీజం నాటారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలను దిగజార్చి, కోర్టు స్టేలతో విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. విచారణ జరగకుండా వాయిదాలు వేయించుకున్న మాత్రాన సచ్ఛీలుడైపోరు. ఏదొక రోజు కోర్టు బోను ఎక్కక తప్పదు. కొత్త పార్టీలను మాయచేసి ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అగ్రిగోల్డ్, సదావర్తి భూములు, విశాఖ భూ కుంభకోణం, అమరావతి అవినీతి భాగోతం.. ఇలా ఇంత తీవ్రమైన అవినీతి ఏపీలో ముందెన్నడూ జరగలేదు. ఇదంతా కేవలం చంద్రబాబు అసమర్ధ, అవినీతి పాలన వల్లే. - పి.విజయ్‌బాబు, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నారు. ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ అన్నింటా అక్రమాలే. పెండింగులోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి కి.మి.కు రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లయితే.. అమరావతిలో కి.మీ. రూ. 36 కోట్లు పోస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చ.అడుగుకు రూ. 2 వేలు ఖర్చవుతుంటే అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణంలో చ.అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారు. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విహారయాత్రలకు రూ. 400 కోట్లు దోచిపెట్టారు. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పీఎంఏవై ఇళ్లకు పక్క రాష్ట్రంతో పోల్చితే మన వద్ద చ.అడుగుకు రూ. వెయ్యికి పైగా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 36.5 కోట్ల చదరపు అడుగులకు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి. రాజధానిలో శిలాఫలకాలు, సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్‌ల హంగులకు వందల కోట్లు వృథా చేశారు. - అజేయకల్లం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అర్చకుల కడుపు కొట్టారు వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని సుప్రీం, హైకోర్టులు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. టీడీపీ హయాంలో అర్చకులకు ఎలాంటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు. 2017 డిసెంబర్లో మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేసి లోపల గోడల్ని పగులగొట్టారు. పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది. – రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు విశాఖలో రూ. లక్ష కోట్ల కుంభకోణం విశాఖలో హుద్‌హుద్ బీభత్సం కంటే ఈ ఐదేళ్లలో నగరానికి భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను టీడీపీ సర్కారు పూర్తిగా దగాచేసింది. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. విశాఖ జిల్లాలో జరిగిన భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖ జిల్లాలో సహజ, ఇంధన వనరుల్ని దోచేశారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట ఎన్నికలకు ముందు డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఈ ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు.? - కేఎస్ చలం, యూపీఎస్సీ మాజీ ఇన్చార్జ్ చైర్మన్ దారుణంగా ఇసుక దోపిడీ ఏపీలో ఇసుకను రాజకీయ మాఫియా దోచుకుంటోంది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుకను అధికార పార్టీ దోచేస్తోంది. రాష్ట్రమంతా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. సీఎం నివాసానికి సమీపంలోనే ఇసుక దోపిడీ సాగుతోంది. ఈ దోపిడీపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. - రాజేందర్ సింగ్, ప్రముఖ పర్యావరణవేత్త ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు పట్టిసీమ ఎత్తిపోతల్లో రూ.374 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు రూ.1853 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 27,403.74 కోట్లకు పెంచేసి.. ఒక్కటీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు కాగా, 2017 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామన్నారు. అది పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచారు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్) డిస్కంలను ముంచేస్తారా?.. సీఎస్ దినేష్ అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా.. అప్పటి సీఎస్ దినేశ్ కుమార్ అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆ అంశాన్ని కేబినెట్లో పెట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని.. ఈ దశలో ఎక్కువ ధరకు సుజ్లాన్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి పవన విద్యుత్ కొనుగోలు అవసరం లేదని సీఎస్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఏడాదికి డిస్కమ్స్ రూ.2000 కోట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని.. ఈ సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 పైసలకు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. రూ.3.46 పైసలకే ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయన్న అంశాన్ని గుర్తు చేశారు. సీఎస్ టక్కర్ నిరాకరణ.. చట్టాన్నే మార్చేసిన సీఎం రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనల్ని సీఆర్డీఏ అధ్యయనం అనంతరం సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. అందుకు విరుద్ధంగా ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ, సీఎం ఆమోదం అనంతరం ప్రతిపాదనల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపారు. దీనిపై సీఎస్ టక్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపితే.. అప్పుడు ఆ ప్రతిపాదనల్ని మంత్రివర్గానికి పంపాలని, అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. శాఖలన్నీ ఫైలుపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎస్ టక్కర్ స్పష్టం చేయడంతో చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. ఆ చట్టంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కి అధికారాలు తొలగిస్తూ ఏకంగా సవరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలుకాగా.. విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో చెత్తపాలన బిహార్‌తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బిహార్‌లో మ్యూజియం నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుని సకాలంలో పూర్తి చేశాం. ఎక్కడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి మేం ఇచ్చిన డిజైన్లు ఎంపికచేశామన్నారు. తర్వాత ఇష్టానుసారంగా సూచనలిచ్చారు. సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు. నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే తప్ప తామేం చేయలేమని సీఆర్డీఏ ఉద్యోగుల సంభాషణల్లో మాకు తెలిసింది. ఏపీలో చెత్తపాలన సాగుతోంది. - పుమిహికో, మాకీ అసోసియేట్స్ చంద్రబాబు బీసీ, కాపు వ్యతిరేకి చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. వాళ్ల(చంద్రబాబు) అడుగులకు మడుగులొత్తే వాళ్లే కావాలి. కాపులకు రిజర్వేషన్‌పై మంజునాథ్ కమిషన్ వేశారు. మంజునాథ్ నివేదిక ఇవ్వడానికి ముందే కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టారు. - జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
చంద్రబాబు ఏపీని అప్పుల రాష్ణ్రంగా మార్చారు
-
చంద్రబాబుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా దీన్ని స్వాగతించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ జిమ్మికులు చేస్తున్నారని విమర్శించారు. -
‘కౌరవ సభను తలపించిన చంద్రబాబు దీక్ష’
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబు దీక్ష కౌరవ సభను తలపించిందని ఆయన ట్విట్ చేశారు. దీక్షపై ఐవైఆర్ స్పందిస్తూ.. ‘‘చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించింది. లక్ష్మణ్ కూమార్ కూడా సభకు వచ్చి వెళ్లారు. ధుర్యోదన ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదు.’’అని ట్విటర్లో పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించే ఐవైఆర్ ఈ ట్విట్లు చేసినట్లు తెలుస్తోంది. This looks like #kauravasabha which divided #AP than a #dharmaporatasabha. Dhrutarashtra is having a word with the CM. Sakuni can be seen in the picture. Laxman Kumar came and went. Duryodhana did not attend the meeting. Duryodhana need not necessarily be a male . pic.twitter.com/Q6wsq8fTAL — IYRKRao , Retd IAS (@IYRKRao) February 12, 2019 -
పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే ప్రయోజనం
సాక్షి,హైదరాబాద్: పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ చేకూరుతుందని, తీసుకెళ్లి షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంతో పాటు ‘దిస్ దట్ ఎవ్రిథింగ్’.., ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆదివారం ఫ్యాప్సీలో రోశయ్య ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది పుస్తకాలు తీసుకెళ్తుంటారే కానీ, వాటిని చదవరని, అలాంటి వాళ్లతో ప్రయోజనం ఉండదన్నారు. వృత్తిపరంగా ఐవైఆర్ కృష్ణారావు అనుభవాలు, రాజకీయనేతలతో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పర్యవసానాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇతరులను కించపరచడానికో లేక.. డైరెక్షన్ చేయడానికో ఈ పుస్తకం రాయలేదని, వృత్తిపరంగా ఎదుర్కొన్న అనుభవాలను, ఎంచుకు న్న ధోరణిలో రాశారన్నారు. భారత్‌టుడే చీఫ్ ఎడిట ర్ జి.వల్లేశ్వర్ పుస్తక సమీక్ష చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుండటాన్ని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని మాజీ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ విభజన సమయంలో ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. రచయిత ఐవైఆర్ మాట్లాడుతూ ఏపీ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఆగమేఘాలపై రాజధాని తరలింపు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, జవాబుదారీతనం లేని సీఎంఓలో పని చేయడం వల్ల జరిగిన నష్టాలను ఇందులో వివరించానన్నారు. -
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్‌కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు. 34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్‌గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు చూపించాం. – 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం. – అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు. – ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి. – ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు. పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తిగా ఉన్నారా.. ఓటు గల్లంతే..!
సాక్షి, అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్న వారి ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తమకు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. అసంతృప్తిగా ఉన్నామని చెపితే ఓటర్ జాబితా నుంచి వారి పేరును తీసివేసే అవకాశం ఉందన్నారు. ఎందుకైనా మంచిది.. కొన్ని రోజుల తరువాత ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒక సారి చూసుకోవడం ఉత్తమం అని ఆయన సూచించారు. ఆదివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనపై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. చాలా మంది ప్రజలు ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. -
అవినీతి నిరోధకచట్టం.. పారదర్శకత
సందర్భం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమిలో ఐఏఎస్ ఆఫీసర్ల శిక్షణ రెండు భాగాలుగా జరుగుతుంది. తొమ్మిది నెలల మొదటి భాగం శిక్షణ తరువాత జిల్లాలలో శిక్షణకు వెళ్లి తిరిగి మూడు నెలల రెండో భాగం శిక్షణకు అధికారులు ముస్సోరికి వస్తారు. మా శిక్షణ సమయంలో రెండో భాగం శిక్షణకు వచ్చినప్పుడు అకాడమి పరిపాలనాధికారిగా అప్పు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ చాలా ఉత్సాహపూరితంగా నడిచింది. చిన్న చిన్న గ్రూపులలో చాలా అంశాలు చర్చించేవాళ్ళం. అందులో ఒక అంశం నాకు బాగా గుర్తు. సమర్థవంతమైన అవినీతి అధికారి లేదా అసమర్థుడైన నిజాయితీపరుడైన అధికారులలో ఎవరు మెరుగు అనే అంశం. తర్వాత మెల్లగా తెలిసిన విషయం ఏమిటంటే అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల మూలంగా నిజాయితీపరుడైన సమర్థవంతమైన అధికారిని అవినీతిపరుడిగా చిత్రీకరించే అవకాశాలున్నాయని. నిర్ణయాలు తీసుకోని అధికారులు, అవినీ తిపరులైన, ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని. చాలామంది నిజాయితీపరులు, సమర్థులు అయిన అధికారులకు ఇబ్బంది కలిగించిన సెక్షన్ 13(1)డి(జీజీ)(జీజీజీ). ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగపరిచి ఎవరికైనా మేలు చేకూర్చినా లేక తన చర్యల ద్వారా ఇంకెవరికైనా మేలు కలగజేసినా.. అది ప్రజాహితానికి అనుగుణంగా లేకపోతే దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా అధికార దుర్వినియోగానికి విస్తృత నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకోవటం నుంచి హేతుబద్ధంగా లేని నిర్ణయాల వరకు, అవసరం లేని అంశాలు పరిగణనలోకి తీసుకోవటం, అవసరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకపోవటం అన్నీ అధికార దుర్వినియోగ నిర్వచనం కిందికి తీసుకొని రావడం జరిగింది. కానీ, అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా అధికార దుర్వినియోగంగా చిత్రీకరించి నేరపూరితమైన దుష్ప్రవర్తన కింద చర్య ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి పరిపాలనాపరమైన చర్య ఎవరో ఒకరికి మేలు చేకూరుస్తుంది. ఇక ప్రజాహితం అనేది కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పరిశీలిస్తే మరొకరకంగా గోచరించవచ్చు. ఈ రెండు సెక్షన్ల కనుగుణంగా పరిశోధనా సంస్థలు నిజాయితీపరులైన సమర్థ అధికారులపై చర్యలు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధివిధానాలను సరిగ్గా పాటించలేదు అనే ఒకే నెపం మీద నేరపూరిత చర్యలు వీరిపై మోపారు. ఎటువంటి అవినీతిగానీ, ఆర్థికంగా లాభపడ్డారని గానీ ఆధారాలు లేకపోయినా కేవలం నిర్ణయం తీసుకునేటప్పుడు జరిగిన విధాన లోపాలను నేరపూరిత లోపాలుగా పరిగణించి చర్యలు ప్రారంభించారు. దీనితో అధికారులలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ అంశాలను గుర్తించే ఈనాడు ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో మౌలికమైన మార్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరి చినా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినా నేరపూరితమైన చర్యగా పరిగణిస్తారు. అంతకు ముందు చట్టంలో ఉన్న 13 సెక్షన్ సమూలంగా మార్చడం జరిగింది. అధికారులు తీసుకున్న చర్యల మూలంగా ఎవరికైనా లబ్ధి జరిగితే వారు నేరపూరిత చర్య జరిపినట్టుగా భావించే విధానాన్ని పూర్తిగా తొలగించారు. నిజాయితీగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే అధికారులకు భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించకుండా పనిచేసుకునే అవకాశాన్ని ఈ మార్పులు కల్పిస్తాయి. కానీ పరిశోధనా సంస్థలు ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా విచారణ చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఈ చట్ట సవరణ ద్వారా తప్పనిసరి చేశారు. ఈ మార్పులు పరిశోధనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిబంధకం కావచ్చు. దీనికి బదులు నిరంతరంగా అనుమతినిచ్చే అధికారాన్ని ఒక అధికారుల కమిటీకి అప్పగించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. ఏ అవినీతి నిరోధక చట్టమైనా ఒక్క నిజాయితీపరుడైన అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఫర్వాలేదు. నిజాయితీపరుడైన అధికారి ఇబ్బందికి గురైతే అధికారుల మనోసై్థర్యం దెబ్బతింటుంది. దీనితో నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతారు. దీని దుష్ప్రభావం అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ఉంటుంది. వ్యాసకర్త ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
వరదలనూ వదలని రాజకీయాలు
విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహాయక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదు. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులే అయినప్పటికీ యూఏఈ వరదసాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావనిపిస్తోంది. మరికొందరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివారణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడటం దురదృష్టకరం. కేరళలో వచ్చిన వర దలు గత వందేళ్లలో ఆ రాష్ట్రం చూడని వర దలు. ఈ ప్రకృతి వైప రీత్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పూర్తి అవగాహన, పరస్పర సహకా రంతో పనిచేశాయి. బాధితులను రక్షించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్), స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు చేతనైతే తమవంతు సహాయం అందించడం లేదా నైతిక మద్దతు ప్రకటించడం వదిలేసి కొంతమంది అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దక్షిణ భార తదేశంలో జరిగే ఉపద్రవాలకు కేంద్రం సరైన సహ కారం అందించడం లేదని బాధ్యతారహితంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపద్రవ సహాయక కార్యక్రమాలతో సంబంధంలేని, అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపద్రవlసహా యక కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటికి ప్రాధాన్యం సంతరిస్తుంది. ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ట్విట్టర్లో రాష్ట్రప్రభుత్వం వరదల సహాయం కోసం కేంద్రాన్ని రూ. 2,200 కోట్లు అడిగిందని. కేంద్రం రూ. 600 కోట్లు ఇచ్చిం దని, యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లు ఇస్తా మంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యానాల ఉచితాను చితాలను విశ్లేషించే ముందు భారతదేశంలో విప త్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థీకృత విధానం ఉన్నదో పరిశీలిద్దాం. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో లేని విధంగా విపత్తులను ఎదుర్కోవడానికి భారత దేశంలో చక్కని విధివిధానాలు రూపొందించారు. అమెరికా కత్రినా తుపాను ఎదుర్కొన్న విధానంతో పోల్చుకుంటే భారతదేశం వరదలు–తుపాన్లు వంటి ఉపద్రవాలు చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నది. 2005లో కేంద్ర ప్రభుత్వం విపత్తుల పర్యవేక్షణ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ ప్రణాళిక తయారుచేశారు. ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి విపత్తుల నివారణ, నిర్వహణ కోసం రూపొందించిన సెండాయ్ సమావేశపు విధి విధానాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ ఉప ద్రవ పర్యవేక్షణ వ్యవస,్థ రాష్ట్రస్థాయిలో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉపద్రవ సమయాలలో సహాయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక బలగం ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. ఉపద్రవ సహాయ రక్షణ కార్యక్రమాలలో శిక్షణనిచ్చి సామర్థ్యాలు పెంచ డానికి ఒక ప్రత్యేక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ దక్షిణభారత కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలో రూపుదిద్దుకుం టోంది. వీటన్నిటికీ మించి ఉపద్రవ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వ ర్యంలో ఒక కమిటీ, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో కమిటీ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తాయి. ఈ కమిటీలు రోజువారీగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా మీటింగులు నిర్వహించుకొని ఉపద్రవ నివారణ రక్షణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి. ఉప ద్రవ నివారణ, రక్షణ కార్యక్రమాలను నిర్వహించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు, అధికా రులు పూర్తి సమన్వయంతో సహకారంతో పనిచేయ డంలో ఈ కమిటీలు చాలా ప్రధాన పాత్ర పోషి స్తాయి. హుదూద్ తుపాన్ సందర్భంలో ఈ కమిటీల పాత్రను, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల నుంచి పూర్తి సహాయ సహకారాలను నేను ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా చూశాను. రక్షణ హోం శాఖ కార్యదర్శులను అర్ధరాత్రి అపరాత్రి సమ యాల్లో కూడా ముఖ్య విషయాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. వారి స్పందన కూడా సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉండేది. నేడు కేరళ వరదలు ఎదుర్కోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశాల్లేవు. వివాదమంతా ఆర్థిక సాయం గురించే! ఇక ఎటొచ్చి సమస్యంతా ఆర్థిక సహాయం గురించే. విపత్తుల నివారణకు, నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సదుపాయాలకోసం విధి విధానాలను ఆర్థిక సంఘాలు నిర్దేశిస్తాయి. 2005 విపత్తుల నిర్వహణ చట్టం తర్వాత వచ్చిన 13, 14 ఆర్థిక సంఘాలు ఈ అంశంపై దృష్టి పెట్టి విపత్తు నిర్వహణకు కేంద్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ఎస్, డీఆర్ఎఫ్ అనే రెండు నిధులను ఏర్పాటు చేశాయి. కేంద్రం కొన్ని ప్రత్యేక డ్యూటీల ద్వారా కేంద్ర స్థాయి నిధికి వనరులు సమీకరిస్తోంది. అదనంగా బడ్జెట్ నుంచి అవసరాన్నిబట్టి కేటాయిస్తోంది. రాష్ట్రస్థాయి నిధికి ఈ కేంద్ర నిధి నుంచే ఆర్థిక సంఘం నిర్ణయించిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ముందు ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం భరించేవి. 14వ ఆర్థిక సంఘం కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరించేటట్లు నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును అనుసరించి 2015 –20 మధ్య వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి విపత్తుల నిర్వహణకు రూ. 55 వేల కోట్ల కేటాయింపులు జరి గాయి. గత సంవత్సరాల్లో విపత్తు నిర్వహణలో రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ఆధారంగా ఈ కేటాయిం పులు జరిగాయి. ఇది శాస్త్రీయ విధానం కాదని గుర్తించి విపత్తుల సూచికను రాష్ట్రాలవారీగా తయా రుచేయాలని 14వ ఆర్థిక సంఘం అభిలషించింది. ఇది కష్టసాధ్యమైన విషయంగా గుర్తించి అంతకు ముందు విపత్తులపై రాష్ట్రాలు చేసిన ఖర్చులను కొలబద్దగా తీసుకుని రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇందువల్ల ఇంతకుముందు ఉపద్రవాలు ఎదుర్కొన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరి గాయి. ఉదాహరణకు ఈ ఐదేళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 దాకా కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 2,186కోట్లు మధ్యప్రదేశ్‌కు రూ. 4,363 కోటు,్ల మహారాష్ట్రకు రూ. 7,376కోట్లు కేటా యించగా, కేరళకు ఈ ఐదేళ్లలో ఈ నిధి కింద కేటాయింపు రూ. 919 కోట్లు మాత్రమే. ఇంతకు ముందు సంవత్సరాల్లో కేరళలో ఉపద్రవాలు లేనం దువల్ల అవి ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి కేటాయింపులు తక్కువే జరిగాయి. అందు వల్ల ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేరళ ఎక్కువ ఆర్థిక సహాయం అడగటానికి హేతుబద్ధమైన ప్రాతి పదిక ఉంది. ఎక్కువ కేటాయింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉపద్రవాలు రానప్పుడు కేటాయించిన నిధులను వెనుకకు తీసుకునే వెసులుబాటునూ 14వ ఆర్థిక సంఘం కల్పించినట్టు లేదు. అలాంటి వెసు లుబాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా ఖర్చు కాని రాష్ట్రాల నుంచి ఈ నిధులను కేరళ లాంటి రాష్ట్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక 15వ ఆర్థిక సంఘం అయినా ఈ అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఏదైనా విపత్తు సంభ వించినప్పుడు ప్రధానమంత్రి విపత్తు ప్రాంతాలు పరిశీలించి ప్రకటించే సాయం తాత్కాలికమైనది. పూర్తి సహాయాన్ని నిపుణుల బృందం వచ్చి పరిశీ లించాక నిర్ధారిస్తారు. వెంటనే నిర్వహించవలసిన రక్షణ, సహాయ కార్యక్రమాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. విదేశీ సాయంపై అధికారం కేంద్రానిదే విదేశీ సహాయం విషయాల్లో ఈ అంశాల్లో నిర్ణయా« ధికారాన్ని విపత్తుల నివారణ ప్రణాళిక కేంద్రప్రభు త్వానికి వదిలేసింది. విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే మరో సారి ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహా యక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు విదేశీ సాయం లేనప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలన్నిం టిని సమగ్రంగా పరిశీలించి జాతీయ విపత్తులకు విదేశీ సహాయం తీసుకోలేదు. అదే సంప్రదాయాన్ని ఈనాడు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించాక కొనసాగించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. యూఏఈ ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న సహాయం ఊహా పరమైనదేనని తెలిసిపోయింది. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులు. పై అంశాలేవి వారికి తెలియనివి కావు. ఈ పై అంశాల దృష్ట్యా వారు చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావ నిపిస్తోంది. మరికొందరు ఉత్తర, దక్షిణ భారత అంశాలను ప్రస్తావించి దక్షిణాది రాష్ట్రాల విష యంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివా రణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడ టం దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఇలాంటి విపత్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ప్రాంతా ల్లో వస్తే దేశం ఇంత నిశితంగా చూసి ఉండేది కాదు. సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉండి ఉండేవి. కారణం ఆ రాష్ట్రాల వెనుకబాటుతనం. సమర్థ నాయకత్వ లోపం. దక్షిణాది రాష్ట్రాల్లో పరి స్థితులు వేరు. భవిష్యత్తులో తమ సమస్యలను స్పష్టంగా వినిపించగల, సాధించుకోగల సమర్థ నాయకత్వాలు కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఈ విషయాల్లో ముందే ఉంటాయి. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
బాండ్ల విక్రయంతో నష్టమే తప్ప లాభం లేదు: ఐవైఆర్
అమరావతి: రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని...దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందన్నారు. షేర్ మార్కెట్లో ఓవర్ సబ్‌స్రైబ్ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు. రూ.60 వేల కోట్లతో ఎలక్షన్ ఇయర్లో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందన్నారు. బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్‌లో పెద్దభారం పడుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంది.. ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఆదాయం 29 శాతం ఉంది..బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో అప్పు శాతం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందని, ప్రజలపై మరింత భారం పడే అవకాశముందన్నారు. మహానగర వ్యామోహం అనేది రాష్ట్రానికి గుదిబండగా మారనుందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వరకు అయితే రూ.5 వేల కోట్లు సరిపోతాయని స్పష్టం చేశారు. -
తిరుమలపై ఆధిపత్య రాజకీయం
ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించకపోయినా, సంస్థ ప్రయోజనాలకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసుకొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమించడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాచీన తమిళ సాహి త్యంలో వడ వెంగడం (ఉత్తర దిశగా ఉన్న పర్వ తం)గా అభివర్ణించిన తిరుమల క్షేత్రం చాలా పురాత నమైంది. ఎందరో రాజులు, ఎన్నో రాజవంశాల ఆద రణ ఈ హిందూ దేవాలయానికి లభించింది. వైష్ణవ మతాన్ని అభిమానించిన యాదవ రాజుల కాలంలో, విజయనగర రాజుల పాలనలో∙ఇది వైష్ణవ క్షేత్రంగా రూపుదిద్దుకుంది. రామానుజాచార్యులు ఏర్పరచిన విధి విధానాలను అనుసరించి ఈనాటికీ ఆలయ నిర్వహణ జరుగుతోంది. రామానుజాచార్యులు తిరుమల ఆలయం దర్శించకముందే ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆయన వాటిని స్థిరీక రిస్తూ తిరుమలలో మరికొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆమోదం పొందిన రెండు ప్రధాన సంప్రదాయాలైన సన్నిధి గొల్ల అర్చక వ్యవస్థ, సన్నిధి గొల ్లఅర్చకత్వ కైంకర్యం తిరుమల ఆలయం ఏర్పడిననాటి నుంచీ ఉన్నాయి. విష్ణుమూర్తి శేషాచలం కొండల మీద ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ ఆవు పాలను పుట్టలోకి విడవడం, అది గమనించిన పసు లకాపరి ఆవును అదిలించబోతే ఆ కర్ర విష్ణుమూర్తికి తగులుతుంది. ముందు కోపంతో శపించబోయిన విష్ణుమూర్తి ఆ యాదవుని ప్రార్థన మన్నించి తాను ఆ క్షేత్రంలో వెలసినప్పుడు ప్రథమ దర్శనం కలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఏర్పడిన కైంకర్యమే సన్నిధి కైంకర్యం. నాలుగు కుటుంబాలకు అర్చకత్వం గోపీనాథ్ అనే అర్చకునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి తన విగ్రహం గురించి వివరించడంతో ఏర్పడిన కైంకర్యమే అర్చక కైంకర్యం. గోపీనాథ్ వార సులుగా ప్రకటించుకున్న నాలుగు కుటుంబాలవారు తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమ పద్ధతిలో అర్చ కత్వం నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబాల ఇంటి పేర్లు పెద్దింటి, గొల్లపల్లి, తిరుపతమ్మ, పైడిపల్లి. ఈ రెండు అతి ప్రాచీన కైంకర్యాలే కాకుండా రామానుజాచా ర్యులు పన్నెండో శతాబ్దంలో ఆకాశగంగ నుంచి స్వామివారి కార్యక్రమాలకు జలాలు తెచ్చే కైంక ర్యాలు తన మేనమామ అయిన తిరుమలనంబికి అప్పగించారు. అదేవిధంగా తిరుమలక్షేత్రంపై ఉద్యానవనాన్ని నిర్వహించి స్వామివారిసేవకు పుష్పాలు సమర్పించే సౌకర్యాన్ని తన ప్రియశిష్యుడైన ఆనందాళ్వార్కు అప్పగించారు. అదేవిధంగా ఆలయాల్లో కైంకర్యాలు సక్రమంగా జరిగేటట్టు చూడటానికి, అర్చకులకు సహాయపడటానికి రామానుజులవారు జీయర్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు. కాలక్రమేణా ఈ కైంకర్యాల సంఖ్య 56కు పెరిగింది. ఇందులో పూల దండలు కట్టే యమునోతరి కైంకర్యం నుంచి ముగ్గు వేసే కైంకర్యం వరకు ఉన్నాయి. ఆర్జిత సేవల్లో వచ్చే ఆదాయాల్లో భాగాలు కేటాయించడం ద్వారా ఈ కైంకర్యాలు మిరాశీలుగా రూపొందాయి. ఈమిరాశీ విధానాన్ని 1986 దేవాదాయ చట్టం ద్వారా రద్దు చేశారు. ఈ మిరాశీ వ్యవస్థ రద్దయ్యే దాకా ఈ నాలుగు కుటుంబాల వారు వంతులుగా రెండు సంవత్సరాలకు ఒక కుటుంబం చొప్పున పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒక విధంగా ఈ విధానానికి ఉడుపి శ్రీకృష్ణుని ఆలయ నిర్వహణకు పోలిక ఉంది. అక్కడ మఠాలు వంతుల ప్రకారం ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ కుటుంబాలు వంతుల వారీగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించే విధానం ఏర్పడింది. మిరాశీ వ్యవస్థ రద్దుతో ఈ వంతుల విధానం పోయి ఈ నాలుగు కుటుంబాల నుంచి నలుగురు పెద్దవారిని ప్రధానార్చకులుగా నియ మించే పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ విధానం కొనసాగుతున్న సమయంలో 2007లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ తెచ్చి ఈ కైంకర్యాలకు వారసత్వ హక్కులు పునరుద్ధరించింది. ఆదాయంలో వాటా కల్పించే మిరాశీ విధానాన్ని మాత్రం పునరుద్ధరించలేదు. కేవలం ఈ చట్ట సవ రణ ద్వారా వారసత్వ హక్కులు మాత్రమే గుర్తిం చారు. ఇక ప్రస్తుతం ప్రధాన అర్చకుల్లో ఒకరైన ఏవీ రమణ దీక్షితులు చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని అంశాలను లేవనెత్తడం, వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు 65 సంవత్సరాలు నిండాయనే నెపంతో ఆయనతో పాటు మరికొంత మంది ప్రధాన అర్చకులను తొలగించడం తెలిసిందే. అర్చకులకు ఎన్నికల హామీని మరచిన టీడీపీ తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించినపుడు కొన్ని వర్గాలను పార్టీ చారిత్రకంగా దూరం చేసుకుందనీ, వారిని మళ్లీ ఆకట్టుకోవడానికి ప్రత్యేక కృషి అవసరమని పార్టీ లోని మేధో వర్గం భావించింది. తదనుగుణంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో ఈ వర్గాలను దగ్గర చేసుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమం లోనే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఒక పేజీ బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సామాజిక వర్గ సమస్యలను వివరంగా ప్రస్తావించిన ఈ పేజీలో ఒక ప్రధాన అంశంగా అర్చకుల విషయం పొందు పరచారు. అందులో ఏడో ప్రధాన అంశంగా ‘దేవా లయ పూజారులకు పదవీ విరమణ ఉండద’ని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని ఈ వాగ్దానం చది వారో లేదోగాని అంతవరకు ఓటు వేయటానికి ఆసక్తి చూపని ఈ సామాజికవర్గానికి చెందిన అనేక మంది ఉత్సాహంతో తెలుగు దేశం పార్టీకి ఓటు వేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా అర్చకుడు 65 ఏళ్లకు మించి కైంకర్యం నిర్వహించే హక్కు లేదని ప్రకటించారు. ఒక వంశంలో ప్రధాన అర్చకుడుగా ఒకరే ఉంటే మిగిలిన వారికి అవకాశం ఎలా వస్తుం దనే కోత్త అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఫలితంగా అర్చకుల మధ్య కీచులాటలు మొదల య్యాయి. దీనికంతటికీ కారణం రమణ దీక్షితులు పత్రికా సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించడమే. లేవనెత్తిన అంశాల్లో కొన్ని గంభీరమైనవి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఆ పనిచేయకుండా రమణ దీక్షితులుపై ఎదు రుదాడి ప్రారంభించారు. ఎవరైనా కార్యక్రమాలు సరిగా నిర్వహించక పోయినా, సంస్థ ప్రయోజనా లకు నష్టం కలిగేలా ప్రవర్తించినా వారిపై చర్య తీసు కొనే అధికారం టీటీడీకి, ఆ సంస్థను శాసించే ప్రభు త్వానికి ఎప్పుడైనా ఉంటుంది. సాధారణ పరిస్థి తుల్లో రమణ దీక్షితులు ప్రవర్తనలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కాని ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తినపుడు వాటికి సమాధానం ఇవ్వకుండా, న్యాయపరమైన అధికారాలను పరిశీలించకుండా చర్యకు ఉపక్రమిం చడం దారుణం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి పూర్తి భిన్నంగా ఎందుకు చర్య తీసుకున్నదీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం తిరుమల తప్ప మిగిలిన అన్ని దేవా దాయాలపై అక్కడి ధార్మిక వ్యవస్థ సిబ్బందిపై పూర్తి ఆధిపత్యాన్ని గత 30–40 ఏళ్లలో సాధించింది. పూర్తి ఆధిపత్యం చిక్కని క్షేత్రం తిరుమల తిరుమల అనువంశిక అర్చక వ్యవస్థలో విషయ పరి జ్ఞానం కలిగి, అధికారుల నియంత్రణకు పూర్తిగా దాసోహం అనకుండా నిలబడగలిగిన అర్చకులు రమణ దీక్షితులు. మిగిలిన వారికి ఆయనకున్న శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన తొలగింపుతో తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుకూల అధి కారగణం సాయంతో అప్రతిహతంగా ఏలవచ్చు. పదవీ విరమణ అనే అంశం తిరుమల కన్నా చిన్న దేవాలయాలకు చాలా ప్రధాన సమస్య. సరైన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించకుండా 1986 దేవాదాయ చట్టం ద్వారా అనువంశిక ధర్మకర్తలను తొలగించడం, ఈనాములను రద్దు చేయడం, వారసత్వ హక్కులను తీసేయడం జరి గింది. దీనితో చిన్న దేవాలయాల పరిస్థితి దారు ణంగా తయారైంది. అనువంశిక ధర్మకర్తల స్థానంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవస్థాన పాలక మండలులు ఏర్పాటు చేసి వాటి పెత్తనం కింద అర్చకుడిని పెట్టారు. ఇక దేవాదాయ, ధర్మాదాయ శాఖను విస్తరించి అధికారుల అజమాయిషీ పెంచారు. వీరందరి కిందా ఆదాయం లేని, జీతాలు చాలని అర్చక, ధార్మిక సిబ్బంది నలిగిపోతున్నారు. విచిత్రమేమిటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం దేవాలయానికి వచ్చే ఆదాయంలో మొదట అర్చ కులు, ధార్మిక ఉద్యోగుల జీతాలు భరించాలి. అయితే ఆచరణలో ముందు లౌకిక ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే ఆదాయం ఉపయోగిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రశ్నించేవారే కనిపించడం లేదు. అర్చకులకు, ధార్మిక సిబ్బందికి అక్కడ సంభావన ఇవ్వడానికి ఏమీ మిగలడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందించినదే ముసాయిదా ప్రభుత్వ ఉత్తర్వు 76. అర్చకులకు, ఇతర ధార్మిక సిబ్బందికి పదవీ విరమణ లేకుండా చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వు రూపొందించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని అంశాలకను గుణంగానే దేవాలయాల నిర్వహణపై రూపొందిం చిన ఉత్తర్వు ఇది. కానీ ఈ ప్రభుత్వం ఈ ముసా యిదా ఉత్తర్వుకు పురిటిలోనే సంధి కొట్టింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించడా నికి నాలుగేళ్లుగా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు రమణ దీక్షితులు వివాదం రావడంతో ఒక నెలలో ముసా యిదా ఉత్తర్వు అంశం పరిష్కరిస్తామని అస్మదీయ ప్రసార మాధ్యమాల ద్వారా లీకులు ఇచ్చారు. ఉత్తర్వు ఇవ్వదల్చుకుంటే ఒక్కరోజులో పని. ఇది ప్రాథమిక ప్రకటన తర్వాత అభ్యంతరాలు తెలిపే గడువు ముగిసి ఏడాది దాటినా ఉత్తర్వు వెలువడ లేదు. ఇప్పటికైనా ఈ ఉత్తర్వును వెంటనే జారీ చేస్తే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపే వారిలో నేను ప్రథముడిగా ఉంటాను. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అమరావతి–ఎవరి రాజధాని?
ఇటీవల రాజకీయ వర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తల్లో ఉన్న పుస్తకం శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు రాసిన ‘‘అమరావతి – ఎవరి రాజధాని?’’. ఈ పుస్తకం మార్చి–2018లో ప్రచురితమైంది. రాజధాని నగరానికి అంతకుముందే పునాదులుపడ్డాయి, భవనాలు వెలిశాయి, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం గత జల సేతుబంధనమేనా (వెళ్ళిపోయిన నీటికి ఆనకట్ట కట్టడం) అనే భావన పాఠకుల మనస్సులో మెదిలే అవకాశం ఉంది. అంతమాత్రమే అయితే పుస్తకానికి చారిత్రక విలువ మాత్రమే ఉంటుంది. కానీ అందులో మిగతా అంశాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఏవిధంగా సమతౌల్యం సాధించాలి అనే విషయాన్నీ, ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పారు. అంతేకాక వాస్తవాల్ని తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్న ఉద్దేశం రచయితది. వివిధ దేశాల్లో రాజధానులు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి ప్రాతిపదికల్ని విశ్లేషించి నిర్మిం చారు అన్న విషయంపై రచయిత పరిశోధన చేశారు. భౌగోళిక ఉనికి, అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండటం, ఏ ప్రాంతానికీ, వర్గానికీ అక్రమ లాభాన్ని చేకూర్చకుండా ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలుండటం మొదలైన వాటిని పరిగణనలో తీసుకుని రాజధాని నగరాల్ని ఎన్నుకుంటారు. చారిత్రక నేపథ్యాన్నీ, మిగతా దేశాల్లో అనుభవాన్నీ, మనదేశంలో మిగతా నగరాల అనుభవాన్నీ మొదటి ఐదు అధ్యాయాలలో రచయిత అందించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో ఉన్న ఆలోచనావిధానం 2014లో ప్రభుత్వం మారగానే పూర్తిగా మారింది. శివరామకృష్ణన్ కమిటీ ఎన్ని అడ్డంకుల్నీ, సహాయ నిరాకరణను ఎదుర్కొని తమ నివేదిక అందించిందీ ఇందులో చూడగలం. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన స్పష్టమైన నివేదికను పూర్తిగా తృణీకరించి తమదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకోవడం అప్రజాస్వామికంగా జరిగిందని రచయిత అభిప్రాయం. నిజానికి కొత్త రాజధాని ఏర్పాటు వినూత్నంగా ఆలోచించడానికి ఒక గొప్ప అవకాశం. సంకుచిత రాజకీయ, వర్గ, వ్యాపార ప్రయోజనాల్నీ ఎంచుకున్నందువల్ల వినూత్నంగా ఆలోచించే అవకాశాన్ని ప్రభుత్వం ఎలా కోల్పోయిందీ ఈ పుస్తకంలో పలుచోట్ల చూడగలం. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని నగరాన్ని ప్రభుత్వ మోతుబరి పెద్దలే ఎలా నిర్ణయించారు అని పుస్తకం వివరిస్తుంది. సంబంధిత వర్గాలతోనూ, ప్రతిపక్ష పార్టీలతోనూ ఏ సంప్రదింపులూ జరగలేదని రచయిత అభిప్రాయం. ఎన్నికల ముందు చేసిన ప్రభుత్వ అధ్యయనాలన్నింటినీ పక్కన ఉంచి కొత్త ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయం తీసుకుని ఒక ప్రాంతానికీ, ఒక వర్గానికీ లాభదాయకంగా ఉండేట్టు పనిచేసిందని రచయిత వివరించారు. ప్రభుత్వ యంత్రాంగానికంతటికీ అధిపతిగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అధికారులు ఎలా నిస్సహాయంగా ఉంటారో రచయిత స్పష్టంగా చెప్పారు. ఉద్యోగంలో చేరినపుడు ప్రభుత్వాధికారులు రాజ్యాంగానికీ, రాజ్యాంగ విలువలకూ కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. రాజకీయనాయకులు కూడా ఇలాంటి ప్రమాణమే చేస్తారు. అయినా అధికార యంత్రాంగానికీ, అధికార పార్టీకీ అభిప్రాయభేదాలు వస్తూంటాయి. ఇద్దరూ ప్రజల సంక్షేమాన్ని గూర్చి మాట్లాడినా రాజకీయ వర్గాలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ మారుతున్న రాజకీయ వర్గాల గూర్చి రచయిత ‘కాంట్రాక్టర్ క్లాస్ నాయకులు’( p.76) అని నిర్మొహమాటంగా చెప్పారు. రాజధాని నగరాన్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మరొకచోట (p.81) పేర్కొన్నారు. పట్టణ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్నీ, కొత్త ఆలోచనల్నీ ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ (పొలాల స్థలంలో కొత్త పట్టణాలు తయారుకావడం) అనే ప్రయోగం మనదేశంలోనే కొన్నిచోట్ల విఫలమైన విషయాన్ని ఇందులో చూస్తాం. అలాగే భూమి సేకరణ (land pooling) చేయాల్సిన విధానం, చేసిన విధానం రెంటినీ రచయిత విశ్లేషిం చారు. బెదిరింపులు, ఊహాలోక నిర్మాణం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం భూసేకరణ చేయడం విచారకరమైన విషయం. తరతరాలుగా వచ్చిన భూముల్ని, తాము ఎంతో ప్రేమగా చూసుకున్న భూముల్ని వదులుకోవడంలో రైతులు ఎంత మానసిక క్షోభను అనుభవించారో రచయిత (p.90) వివరించారు. గొప్ప నైతిక రాజ్యంగా అందరూ భావించే సింగపూర్ లాంటి దేశాలు విదేశవిధానాల్లో ఎంత అనైతికంగా ఉంటాయి అన్నది అందరికీ తెలి యని విషయం. సింగపూర్ డొల్లతనాన్ని కూడా (p.94) రచయిత వర్ణించడాన్ని చూడగలం. ఎవరి రాజధాని? అనే ప్రశ్నతోనే ఇది ప్రజల రాజధాని కాదని స్పష్టంగా చెప్పారు. రచయిత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కావడం వల్ల వారికి విషయాలపై పూర్తి అవగాహన, పూర్తి సమాచారం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పంపకం ఉండాలని రచయిత సూచించారు. ప్రజాసమస్యలపై ఆలోచించే ప్రతి పౌరుడూ, విద్యార్థులూ అందరూ చదవాల్సిన పుస్తకమిది. కేవలం వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిపై నిర్ణయాలు తీసుకున్నారని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇద్దరు ప్రముఖులూ తెలపడం కూడా గమనించదగింది. కె. అరవిందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ -
ప్రజాధనం కాదు ప్రజలపై భారం..!
ప్రజాధనంతో ప్రజా రాజధాని అనే పేరిట 3.5. 2018 నాడు నేను రాసిన వ్యాసానికి 8.5.2018 నాడు సాక్షి దినపత్రికలో సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ శ్రీని వాస్ వివరణ ఇచ్చారు. దానిపైన నాస్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. గ్రీన్ ఫీల్డ్ మహా నగర నిర్మాణం వ్యాపారపరంగా లాభసాటికరమైన కార్యక్రమం కాదని అందుచేత దీనికోసం అప్పులు చేస్తే అప్పులను తీర్చే భారం ప్రజల మీద పడుతుందనేది నా వ్యాసంలోని ప్రధాన అంశం. సీఆర్డీఏ వారు పేర్కొన్న ఉదాహరణలు పూర్తిగా పోల్చడానికి వీలులేనివి. ఈ సందర్భంగా బొంబాయి నగరానికి దగ్గరగా ఉన్న బాంద్రా కుర్ల కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో వనరులు సేకరించడాన్ని ఉదాహరిం చారు. ముంబై చాలా అభివృద్ధి చెందిన నగరం. దాని పరిసర ప్రాంతాలైన బాంద్రా కుర్ల ప్రాంతాల్లోని భూమి ధరలు సహజంగానే ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు టౌన్‌షిప్‌లు నిర్మించటానికి బాండ్ల రూపంలో ధనాన్ని సేకరిస్తే దానిని తిరిగి అక్కడ జరిగే వాణిజ్య కార్యక్రమాల ద్వారా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా మనం రూపొందిస్తున్నాం. కృత్రిమంగా ఈనాడు నెలకొన్న భూమి ధరలు శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. అటువంటి ధరలను ఆధారం చేసుకుని ప్రణాళిక రూపొందించుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆ చుట్టుపక్కల జరిగే వాణిజ్య కార్యక్రమాలను అనుసరించి కానీ అమరావతిలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కానీ అటువంటి ధరలు దీర్ఘకాలంలో కొనసాగే అవకాశాలు కనిపిం చటం లేదు. ఈ స్థితిలో ఈ ప్రణాళిక లాభసాటిగా లేనప్పుడు దీని ద్వారా వచ్చే లాభాలతో అప్పులు అవకాశం చాలా తక్కువ. అప్పుడు ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడే పడుతుంది. ఈ విధంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులుగా మహానగర నిర్మాణాలు చేసిన దేశాలలో ఆర్థికపరమైన ఒడుదుడుకులు సంభవించాయి. ఉదాహరణకు బ్రెజిల్ దేశంలోని రాజధాని నిర్మాణ కార్యక్రమం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలాకు కారణమైంది. ఆ దేశంలో సైనిక పరిపాలనకు దారి తీసింది. ఊహించని ఆర్థిక వనరులు ఉన్న ఉన్న నైజీరియా, మలేషియా లాంటి దేశాలు మాత్రమే పెట్రోల్ ఆదాయాన్ని మహా నగర నిర్మాణానికి ఉపయోగించి ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకోగలిగాయి. కాబట్టి బాంద్రా కుర్ల కాంప్లెక్స్ ఉదాహరణలు చూపించి అమరావతి నగర నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల ద్వారా వనరుల సేకరణను సమర్థించుకోవటం పొరపాటు. ఇక రెండో ఉదాహరణ ఎన్టీపీసీ లాంటి వాణిజ్య సంస్థలు. ఈ వాణిజ్య సంస్థలలో వాణిజ్య పరమైన లావాదేవీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకు వారు వనరుల సేకరణ బ్యాంకుల ద్వారా సేకరించవచ్చు బాండ్ల రూపంలో ప్రజల నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణాలను వాణిజ్యపరమైన కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల నుంచి మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రుణాల సేకరణకు వెళ్ళకుండా ప్రజల ద్వారా బాండ్లను స్వీకరించటంలో ఆర్థిక సంస్థలకు కొంత వెసులుబాటు ఉన్నది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని పన్ను రాయితీలు ప్రకటించటం ద్వారా మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా వనరులు సేకరించవచ్చు. కానీ ఏదైనా వాణిజ్యపరంగా లాభసాటి అయిన కార్యక్రమానికి మాత్రమే ఈ వనరుల సేకరణ జరిగినప్పుడు తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఆ సంస్థ పైనే ఉంటుంది. వాణిజ్యపరంగా లాభసాటి కానప్పుడు తప్పకుండా ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడుతుంది. అమరావతి నిర్మాణానికి ఇటువంటి బాండ్ల రూపంలో ప్రజల నుంచి వనరులు సేకరించిన తిరిగి వాటిని తీర్చే బాధ్యత పన్నుల రూపంలో ప్రజల మీద పడే అవకాశం ఉన్నది. ఒక గ్రీన్‌ఫీల్డ్ నగరం వాణిజ్యపరంగా లాభదాయకంగా నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ప్రయత్నాలు జరిగిన చోట అనూహ్యమైన వనరులు ఉంటే తప్పితే ఆర్థిక సంక్షోభాలు చోటుచేసుకున్న దాఖలాలే కనిపిస్తాయి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
సీమలో హైకోర్టు ఎందుకు పెట్టరు ?
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం అనంతపురం లలిత కళా పరిషత్తులో అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ లో హైకోర్టు అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు, రాయలసీమలో హైకోర్టు ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని, దానివల్లే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఐవైఆర్ అన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల సీమకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని, వెంటనే ఈ డిమాండ్‌ను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు లక్ష్మణ్ రెడ్డి, రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డు జడ్జి కృష్ణప్ప, జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాణ్యం సుబ్రమణ్యం, గోవిందరాజు, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పద్మ పాల్గొన్నారు. -
అమరావతి జన రాజధాని కానే కాదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల ఆమోదం పొందేలా చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజారాజధాని అయ్యే అవకాశాలు లేవని విభజనానంతర ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అంటూ ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదని, ఒక నిర్దిష్ట వర్గం తప్పితే మిగతా సామాజిక వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదనే అంశంపై ప్రభుత్వం, పాలకులు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలూ వాస్తవికతా ప్రాతిపదికన జరిగి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు కానీ లక్షకోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణం అనే భ్రమల్లో మునిగితేలుతున్నందువల్లే అక్కడ నాలుగేళ్ల తర్వాత కూడా ఒక శాశ్వత నిర్మాణమూ చోటు చేసుకోలేదన్నారు. తటస్థత, ఉమ్మడి అభిప్రాయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలిచిన అమరావతి నిర్మాణం భవిష్యత్తులో పలు సమస్యలను ఎదుర్కోక తప్పదంటున్న ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకం రాశారు. ఎవరి రాజధానిగా ఉంది? పుస్తకం శీర్షికలోనే ప్రశ్నను వదిలాను కదా. కొన్ని ప్రధాన అంశాలను ఆ పుస్తకంలో లేవనెత్తాను. వాటిపై చర్చ జరగాలన్నది నా అభిమతం. ఆ శీర్షికే సమాధానాన్ని సూచిస్తోంది. ఏ అంశంమీదైనా దాని నేపథ్యం తెలిసినవాళ్లు మాట్లాడితే అది మంచి ట్రెండ్‌ని సెట్ చేస్తుంది అనే ఉద్దేశంతో రాశాను. అమరావతిపై మీకున్న ప్రధానమైన అభ్యంతరం ఏమిటి? రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరంగా ఏకీకృత స్వభావంతో ఉంటుంది. అదే ఆంధ్రరాష్ట్రం విభిన్నత్వం ఉండే ప్రదేశం. ఆంధ్రలో ఎవరు రాష్ట్ర పాలన చేసినా ఈ వైవిధ్యతను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఇబ్బంది అని నా ఆలోచన. రాజధాని ప్రాంతంతో సహా అన్ని విషయాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రక్రియను అనుసరించకుండా 2014లో నిర్ణయం తీసుకున్నారు. ప్రక్రియ అంటే ఇక్కడ విస్తృత స్థాయి చర్చ, దాంట్లో చాలామందిని భాగస్వామ్యులను చేయడం, ఈ వ్యత్యాసాలను చైతన్యవంతంగా పరిష్కరించే క్రమంలో వెళ్లడం. ఆ క్రమం జరగలేదు. రాజధానిగా ఈ ప్రదేశం సరైనదా కాదా అనే సాంకేతిక పరిశీలన అసలు చేయలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది. దేశంలో, ప్రపంచంలో వివిధ రాజధానుల నిర్మాణాలను, వారి అనుభవాలను పరిశీలించినప్పుడు వాటితో పోల్చుకుంటే ఏపీ రాజధానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు అనే చట్రాన్ని పెట్టుకుని అధ్యయనం చేశాను. థియరీ ప్రకారం రాజధానికి సంబంధించి కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్ అంశాలున్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని ఏర్పర్చాలని అంతర్జాతీయ అనుభవం చెబుతోంది. ఆ రకంగా చూస్తే రాయలసీమలో రాజధాని పెట్టడం చాలా సబబుగా ఉండేది. ఇక నెగటివ్ అంశం ఏదంటే మన తెగ ఉన్న చోటే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. వాళ్లకే పరిమితమై. మిగిలినవాళ్లతో సంబంధం లేకుండా ఉండే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. ఇలాంటి వాటికి దీర్ఘకాలంలో మనుగడ తక్కువ. దీని ప్రకారం అమరావతి తటస్థ రాజధాని కాదు. చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదిరి, అన్ని ప్రాంతాల అంగీకారంతో ఏర్పడిన రాజ ధాని కాదు అమరావతి. అందుకే ఇది తటస్థ రాజధాని కాదు. అమరావతి రాజధానిగా ఉండటంలో అభ్యంతరాలేమిటి? సానుకూల అంశాల ప్రాతిపదికన అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నట్లు కనపడదు. కాగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానిని పెట్టవద్దని ఎవరూ అనటం లేదు. విశాల దృక్పథంతో చర్చించి పెట్టవచ్చు. కానీ కీలకమైన అంశం ఏదంటే, స్టడీ చేయకుండా దేశంలో ఏర్పాటు చేసిన ఒకే ఒక రాజధాని అమరావతి. ఆఫ్రికా ఖండంలో తమ జాతి, తమ తెగ ఉన్నచోట రాజధానిని పెట్టుకుని వారే లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లే అమరావతి విషయంలో కూడా జరిగిందని ఒక సంశయం. అంటే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ లాభం చేకూరేలా పెట్టారనా? అవును. ఒక వర్గానికే ఎక్కువ ప్రయోజనం వచ్చేలా చూసుకున్నారు. అంటే కమ్మ కులానికి అధిక లాభం చేకూరేలా చేశారనేనా మీరంటున్నారు? అంత దూరం పోవలసిన అవసరమేంటి? ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. రాజధాని అంశంలో చాలా కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపణ? ఈ ఆరోపణల లోతులోకి నేను వెళ్లను కానీ అప్పటికే రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రయోజనం ఏర్పడి ఉన్న చోటే రాజధానిని పెట్టారని చెప్పగలను. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి అదే కారణమని చెప్పవచ్చు. రైతులు పూలింగ్ కింద భూమిని ఎలా ఇచ్చారు? వారికి లాభం జరిగిందా? నిర్దిష్టంగా స్టడీ చేసి మిగిలిన ప్రాంతాల్లో దీని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలకు వస్తే దీర్ఘకాలంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేదానికి అమరావతి ఒక ఉదాహరణ. దేశంలో ఒక గుజరాత్‌లోనే ల్యాండ్ పూలింగ్ విజయవంతంగా జరిగింది. గుజరాత్లో జరిగిన భూ సేకరణ అంతా చిన్న చిన్న ఏరియాల్లో అంటే వంద ఎకరాల లోపు స్థలాల్లో మాత్రమే చేశారు. అది కూడా పట్టణ ప్రాంతాల్లోనే చేశారు. మౌలిక వసతులు పెంచితే మీ భూములకూ విలువ పెరుగుతుందని చిన్న చిన్న ప్రదేశాల్లో ఉన్నవారికి నచ్చచెప్పడమే కాకుండా వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రయోగాన్ని గుజరాత్లో మరొక చోట పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేశారు. బొంబాయి–ఢిల్లీ పారిశ్రామిక కారిడార్‌లో ఒకరోడ్డు అభివృద్ధి చేయడానికి 20, 30 వేల ఎకరాల భూమిని పూలింగ్ కింద తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. 2006 నుంచి 2016 వరకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పూర్తిగా విఫలమైంది. మరి ఏపీలో 30 వేల ఎకరాల పూలింగ్ చేసేశామని చెప్పుకున్నారు కదా? రామచంద్రయ్య గారు ఈ అంశంపై ఈపీడబ్ల్యూలో నిర్ధిష్టంగా రెండు వ్యాసాలు కూడా రాశారు. ల్యాండ్ పూలింగ్ ఎలా జరిగిందో ఆయన వివరించారు. పెద్దపెద్ద రైతులు, ఎవరి పిల్లలైతే అమెరికాలోనో మరే దేశంలోనో సెటిలై ఉన్నారో, ఇక మళ్లీ వ్యవసాయానికి తిరిగి రారు అని నిర్ధారించుకున్నారో అలాంటి వారిని అందరినీ కో ఆప్ట్ చేసుకున్నారు. మీరు భూములు గనుక ఇస్తే ఇంత విలువకు పెరిగిపోతాయని, కోటీశ్వరులైపోతారని భ్రమల్లో పెట్టి తీసుకున్నారు. అలా దారికి రానివారిని కాస్త భయపెట్టడం కూడా జరి గింది. ఇబ్బంది పెట్టారు. పంటలు తగులబెట్టారు. ఇవన్నీ రామచంద్రయ్య గారు క్షేత్ర పరిశోధన ద్వారా తెలుసుకుని చెప్పిన అంశాలు. దీనంతటికీ నేపథ్యం ల్యాండ్ ఆక్యుపేషన్. నువ్వు గనుక పూలింగ్‌లో భాగంగా భూమి ఇవ్వకపోతే, నీ భూమిని ఆక్రమించేస్తాం అని బెదిరించడం అన్నమాట. 32 వేల ఎకరాలను ఆ ఏరియాలో భూసేకరణ చేయాలంటే అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. కానీ ఆ భూ సేకరణ అనే కత్తిని చూపించి పని జరిపించేశారు. పైగా మీరు భూములు ఇవ్వకపోతే అవి గ్రీన్ బెల్ట్ కింద పోతాయి అని భయపెట్టారు కూడా. అయినా సరే కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వలేదు. ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఎక్కువ మంది ఇచ్చేశారు. పూలింగ్ వరకు అయింది. ఏపీలో జరిగిన భూ సేకరణ దేనికి? రాజధాని కోసం కాదు. మహానగరం నిర్మాణానికి తీసుకున్నారు. మహానగరం తక్షణం నిర్మించడం సాధ్యమా? సాధ్యం కానప్పుడు, ఇంత భూమిని సేకరించారు కనుక తన భూమికి ఎంత వస్తుందనే అంచనాలు రైతులు కలిగి ఉంటారు. వారి భూములకు విలువ రావాలంటే అంత మేరకు ఆర్థిక కార్యాచరణ జరగాలి. అది కూడా అతితక్కువ కాలంలో రావాలి. కానీ అది 50 ఏళ్లకు వస్తుంది. కానీ తక్కువ సమయంలో 32 వేల ఎకరాల భూమిలో అంత అధికంగా ఆర్థిక కార్యాచరణ తీసుకురావడం సాధ్యపడే విషయం కాదు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరిపాలనా రాజధానిని కట్టి దాన్ని మహానగరంగా పరిణతి చెందడానికి వదిలేయడం ఒక ఐచ్ఛికం. రెండు మూడేళ్లలో మహానగరం కావాలని అనుకోవడం సరైన మోడల్ కాదు. కట్టాలి అనే ఆశావాదం మంచిదే కానీ అది వాస్తవికంగా ఉండటం అవసరం. లక్షకోట్లతో రాజధాని అని బాబు చెప్పడం జనాల్ని మోసం చేయడం కాదా? కేంద్ర వార్షిక బడ్డెట్ 22 లక్షల కోట్లు. దీంట్లో లక్ష కోట్లు అంటే దాదాపు 5 శాతం. ఒక రాష్ట్రానికి కాదు ఒక రాజధానికి లక్ష కోట్లు ఇస్తారనుకోవడం రియలిస్టిక్ కాదు. ఎన్నికల మ్యానిఫెస్టోను, వాగ్దానాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను అంచనా వేసుకోవడం తప్పు. భారత ప్రభుత్వం ఇవ్వాళ ఏపీ రాజధానిపైన వాస్తవ ప్రాతిపదికనే స్పందిస్తోంది. మోదీ సమాధానం చెప్పాలన్నది కరెక్టే. కానీ ఎంత వస్తుంది, ఎంత ఇస్తుంది అనేది వాస్తవికంగా ఉండాలి. చట్టంలో ఏదయితే ఉందో ఆ మేరకే కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి రాదు. లక్షకోట్ల రాజధాని అసలు సాధ్యమే కాదు. కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని తాత్కాలిక భవనాలకు ఖర్చుపెట్టేశామంటున్నారే? తెలంగాణలో ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్‌లో శాశ్వత సచివాలయం కడతామంటున్నారు. దాని ఖర్చు అంచనా రూ. 180 కోట్లు. ఈ స్థాయిలోనే మన ఆలోచనలు కూడా ఉండి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు. అంతే కానీ రాజధానికి లక్షకోట్లు అవసరమే లేదు. మన రాజధాని సఫల రాజధాని అవుతుందా విఫల రాజధాని అవుతుందా? పరిపాలనా రాజధానిగా చేస్తే సక్సెస్ అవుతుంది. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అనే అరోపణలకు, ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదు. ఒక వర్గం తప్పితే మిగతా వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదు అనే అంశంపై ప్రభుత్వం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమరావతిని రాష్టంలోని అన్ని ప్రాంతాలూ, ప్రజలూ, ఇతర సామాజిక వర్గాలూ తమ సొంతంగా భావించే పరిస్థితి ఈ రోజుకయితే లేదు. రాజ ధానిపై చర్చను ఎవరు స్వీకరిస్తున్నారు, ఎవరు మొరటుగా దాడి చేసే స్వభావంతో స్పందిస్తున్నారు అని పరిశీలిస్తే చాలు రాజధానిని ఎవరు సపోర్టు చేస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూస్తే చాలు తెలిసిపోతుంది. ఈ రాజధాని కొందరి రాజధానా, ప్రజా రాజధానా? థియరీ ప్రకారం రాజీ ధోరణితో తటస్థ ప్రాంతంలో ఏర్పర్చిన రాజధాని కాదు అమరావతి. వెనుకబడిన ప్రాంతాన్ని మనతోపాటు తీసుకుపోదామని ఎంచుకున్న ప్రాంతం కాదు. సానుకూలం కంటే ప్రతికూల అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజా రాజధాని అయ్యే అవకాశాలు లేవు. ఇక తక్షణం మహానగర నిర్మాణం ఆచరణ సాధ్యం కానే కాదని నా స్పష్టమైన అభిప్రాయం. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో..) https://bit.ly/2GO13S5 / https://bit.ly/2HqbHv4 -
ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ
-
వితండవాదమే ఒక విధ్వంసం
విశ్లేషణ విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు. గుంటూరు జిల్లా కాకానిలో ఈమధ్య జరిగిన ఒక బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలగకపోయినా, కేంద్ర మంత్రిమండలి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమనే చెప్పాలి. కొందరు వ్యక్తులు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు చూపించమని అడుగుతున్నాయనీ, కానీ అది సాధ్యం కాదనీ, అడగడం సరికాదనీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలేనని ఆయన వాదన. ఒకవేళ దేని గురించి అయినా సమాధానమో, వివరణో ఇవ్వవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కూ, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకూ సమాధానం చెప్పుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంతేతప్ప ఇంకెవరికీ జమాఖర్చులు చెప్పవలసిన అవసరం లేదని భాష్యం చెప్పారు. అంతేకాదు, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదనీ, దీనితో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లిందనీ అంటూ, ఇందువల్ల పంజాబ్, అస్సాం రాష్ట్రాల తరహాలో వెళితే ఆంధ్రప్రదేశ్ మరింతగా నష్టపోక తప్పదని కూడా చంద్రబాబు విశ్లేషించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోకుండా, దానికి బదులు నవ నిర్మాణదీక్షా దినాన్ని జరుపుకోవడం వెనుక ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి న్యాయం జరగని పక్షంలో విభజన శక్తులు విజృంభిస్తాయని పార్లమెంట్ సభ్యుడొకరు హెచ్చరిక వంటి వ్యాఖ్య కూడా చేశారు. పైగా ఆ ఎంపీ ముఖ్యమంత్రికి సన్నిహితునిగా పేర్గాంచారు కూడా. ఆ వ్యాఖ్యలు అవాంఛనీయం దేశంలో ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రి పదవిని చిరకాలం నిర్వహించిన వ్యక్తిగా పేరున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలలోని ఔచిత్యాన్ని చర్చిద్దాం. వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వాలు లెక్కలు చూపించవలసిన అవసరం లేదన్నది చంద్రబాబు చేసిన మొదటి వ్యాఖ్య. ఇలా భావించడం సహేతుకమే. సరైనదే కూడా. సమాచార హక్కు చట్టం కిందనే అయినా కూడా, ఇవ్వవలసిన సమాచారం కన్నా ఎక్కువ సమాచారాన్ని ఏ ప్రభుత్వమూ అటు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ చట్టం పరిధి మేరకు ప్రజలు కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పొందవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి వినియోగ పత్రాలను (యుటిలైజేషన్ సర్టిఫికెట్) సమర్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఉంది. ఈ బాధ్యత నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన వెసులుబాటు, మినహాయింపు లేవు. రాష్ట్రాలలో చేపట్టవలసిన కొన్ని పథకాలు, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా కొన్ని నిధులు వస్తాయి. ఆ నిధులు ఎలా ఖర్చు చేసినదీ లెక్క చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణలో కీలకమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలంటే ఎవరికీ పేచీ ఉండదు. కానీ అవి సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలు కావని మాత్రం గుర్తించాలి. ఏ దేశంలో అయినా రక్షణ, విదేశీ వ్యవహారాలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికే సార్వభౌమాధికారం ఉంటుంది. చంద్రబాబు భావనలోని సార్వభౌమాధికార వ్యవస్థ చాలా కఠినమైన నిబంధనలతో రూపొందించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా లేదు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా విభజించారని చంద్రబాబు ఆరోపణ. అందుకు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అసలు జరిగిన పరిణామాలు, గడచిపోయిన కాలం నేపథ్యంలో ఇలాంటి వాదనలోని సహేతుకత ఎంత? పైగా ఈ అంశాన్ని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ఎప్పుడు అవకాశం వచ్చినా జార విడుచుకోకూడదన్నట్టు చర్విత చర్వణంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన అనే ఆ ‘అశాస్త్రీయ’ పరిణామంలో, అందుకు అంకురార్పణ చేసిన అనేక శక్తులలో ముఖ్యమంత్రిగారి పాత్ర కూడా లేదని చెప్పలేం కదా! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలుకుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అక్టోబర్ 8, 2006లో చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అందువల్ల రాష్ట్ర విభజన నిర్ణయానికి ఆయన కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ఆయన కట్టుబడి ఉన్న సంగతి తేలిపోయినప్పుడు, ఇక మిగిలేది ఏమిటి? హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారన్న అంశం. బిల్లుకు ప్రతిపాదనలు చేస్తే బాగుండేది పార్లమెంట్లో ప్రవేశ పెట్టదలిచిన బిల్లు ఏదైనప్పటికీ దాని ప్రతులను ముందుగానే సభ్యులందరికీ అందచేస్తారు. అలాగే విభజన బిల్లు ప్రతులు కూడా తెలుగుదేశం సభ్యులందరికీ ముందుగానే అంది ఉంటాయి. మరి, విభజన నిర్హేతుకమన్న అభిప్రాయం కలిగి ఉన్నవారు ఆ బిల్లును అధ్యయనం చేసి, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన మార్పులను ఆనాడే ఎందుకు ప్రతిపాదించలేదు? తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కూడా ఆ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిశీలించి తన పార్టీ సభ్యులకు ఎందుకు తగిన విధంగా దిశా నిర్దేశం చేయలేదు? విభజన బిల్లు పార్లమెంట్లో గందరగోళం మధ్య నెగ్గింది. నిజమే. అయినా కూడా ఆ బిల్లుకు లిఖిత పూర్వకంగా మార్పులూ చేర్పులూ సూచించడానికి పార్లమెంట్ సభ్యులకు చాలినంత సమయం ఉందన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఆనాడు రాజకీయ ప్రయోజనాల కోసం వారు మౌనం దాల్చారు. ఇప్పుడుమాత్రం విభజన అశా స్త్రీయం, నిర్హేతుకం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ధోరణి వల్ల ముఖ్యమంత్రి విశ్వసనీయతపైనే అనుమానం కలుగుతుంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు జరిగిన నష్టాలతో పోల్చడం మరొకటి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఈ తరహా పోలికలు తేవడం సుదీర్ఘ రాజకీయ, పాలన కలిగిన నాయకుల స్థాయికి ఎంత మాత్రం తగదు. అసలు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయకుండా ఉంటే బాగుండేది. పంజాబ్, అస్సాం రాష్ట్రాల పరిస్థితికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ పరిస్థితికీ పోలికే లేదు. అనాలోచితంగా జరిగిన రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బ తిన్నాయని అభిప్రాయపడడం, భావించడం తప్పు కాదు. కానీ, తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఆనాడు విభజనను అంగీకరించిన అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు బాధ్యత వహించవలసిందే. మరొక విషయం. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందించవలసిన చేయూత గురించి నాలుగేళ్లుగా రాష్ట్రం తరఫున మంతనాలు సాగించారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని చెబుతూ వచ్చారు. పురోగతి కూడా తృప్తికరంగానే ఉందని చెప్పారు. కానీ మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా వేరొక ధోరణి ప్రదర్శిస్తూ పంజాబ్, అస్సాంల స్థితిగతులతో రాష్ట్ర పరిణామాలను పోల్చడం చాలా ప్రమాదకరమైన ఎజెండాను తెర మీదకు తీసుకురావడమే అవుతుంది. ముఖ్యమంత్రితో పాటు, పార్టీలో ముఖ్యునిగా భావించే మరొక ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వ్యాఖ్యానాలు పరిశీలిస్తే అవన్నీ దేశ ప్రయోజనాలకు, వాటి స్ఫూర్తికి భిన్నమైన ధోరణులని చెప్పక తప్పదు. ఇక, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి బదులు నవ నిర్మాణ దీక్షను జరుపుకోవడం గురించి కొంచెం. ముఖ్యమంత్రికి అపార పాలనానుభవం ఉంది. కొత్త రాష్ట్రం సమస్యలు, ఆర్థిక సమస్యలు తెలుసు. కానీ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఆర్థిక క్రమశిక్షణ కనిపించదు. ఎటు చూసినా హద్దులెరుగని ఖర్చు. వీటిని గమనించకుండా ఇప్పుడు బీద అరుపులు శోచనీయం కాదా! ఇలాంటి ధోరణికీ, ఆ బీద అరుపులకు ఇకనైనా స్వస్తి పలకవలసిన అవసరం చాలా ఉంది. నవ నిర్మాణదీక్ష పేరుతో, హేతుబద్ధత లేకుండా విభజన జరిగిందంటూ కాంగ్రెస్ అనే చచ్చిన గుర్రాన్ని మళ్లీ మళ్లీ బాదుతున్నారు. ఇలాంటి ధోరణితో చల్లారిన మనోభావాలను రెచ్చ గొట్టే యత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సరికాదు. ఆశావాదంతో అడుగేద్దాం! నిజమే, మనకు 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సంక్రమించిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు దక్కింది. మళ్లీ ఇందులో భద్రాచలం మినహాయింపు. విభజనకు ముందే దూరదృష్టితో భద్రాచలానికి ప్రత్యేక జిల్లా హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి ఉంటే ఆ ప్రాంత వాసులు కూడా ఆంధ్రప్రదేశ్‌తో కలిసేవారు. కానీ రాజధాని సమస్య ఒకటి ఉంది. మళ్లీ ఎక్కడ రాజమండ్రి, కాకినాడ పరుగెత్తవలసి వస్తుందోనని వారు తెలంగాణ వైపు మొగ్గు చూపారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు. అందుకు బదులు కొత్త రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆశావాదులమై ముందడుగు వేయడం అత్యంత అవసరం. అలాంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది కూడా. ముఖ్యమంత్రికి నా విన్నపం ఏమిటంటే– అక్టోబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. విశాలాంధ్ర విభజనతోనే నవంబర్ 1 తన ఉనికిని కోల్పోయింది. అక్టోబర్ 1, 1953 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే స్ఫూర్తితో ఆశావాదంతో అవతరణ దినోత్సవాన్ని జరుపుకుందాం. నిరాశావాదానికి ప్రతిబింబించే నవ నిర్మాణ కార్యక్రమానికి చరమగీతం పాడదాం. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములుగారికీ, తన సంపదనంతా త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అప్పుడే నిజమైన నివాళి ఘటించినట్టు అవుతుంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి -
ఐవైఆర్‌పై ఆనంద్ సూర్య ధ్వజం
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ధోరణిపై ఐవైఆర్ ఘాటు వ్యాఖ్యలు
-
నేను చూసిన ముఖ్యమంత్రుల్లో ఆయన బెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను చూసిన ముఖ్యమంత్రుల్లో చెన్నారెడ్డి బెస్ట్. ఆయన సమావేశాలకు వెళ్లాలంటే అధికారులకు ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండేది. యారోగెన్స్‌తోపాటు ఇంటెలెక్చువల్ ఉన్న సీఎం ఆయన’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సాక్షి టీవీ స్పెషల్ లైవ్ షోలో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో ఆయన మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంపై తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉందని, న్యాయపరిధిలో ఉండటంతో దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు. ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు. విజయవాడతోపాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివృద్ధి జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరణ సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితి వేరు అని చెప్పారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను తాను విభేదించానని, అందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు ధోరణిలో సంకుచితత్వం కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపికలో కొందరి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంత తేలిగా వస్తుందని అనుకోవడం లేదని అన్నారు. కేంద్రం దృష్టిలో టీడీపీ ఊడిపోయే ముక్కు అని, ఊడిపోయే ముక్కు బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా అని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యం కలిగిందని, అంచనాలకు మించి రూ. 7వేల కోట్లు వస్తాయని చూపారని, రెవెన్యూ లోటు నుంచి సడన్‌గా మిగులు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బడ్జెట్ అంకెల్లో ఏదో వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. -
జేపీ వ్యాఖ్యలు అభ్యంతరకరం
సాక్షి, హైదరాబాద్ : 'జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ' (జేఎఫ్సీ) సమావేశంలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ లేదా పథకానికి కేంద్రం నిధులు కేటాయిస్తే ఆ నిధులకు సంబంధించిన లెక్కలను కేంద్రం అడగకూడదని జేపీ అన్నారు. జేపీ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. నిధులు కేటాయించినప్పుడు వాటిని దేనికి ఖర్చు చేశారో, అడిగే హక్కు కేంద్రానికి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా జేఎఫ్సీ విధివిధానాల్లో చేర్చితే అర్థవంతంగా ఉంటుంది.’ అని అభిప్రాయపడ్డారు.