Jagitial District Latest News
-
No Headline
సాక్షి, పెద్దపల్లి●: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చు పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కు నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు. -
ఈ–పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి
మల్లాపూర్: రైతులకు ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని డీఏవో రామచందర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సాతారం, సిరిపూర్, మొగిలిపేట, రాఘవపేట గ్రామాల్లో ఏవో లావణ్యతో కలిసి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రిజస్టర్, ఈ–పాస్ మిషన్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసినా.. అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, వాటిని పంట పూర్తయ్యేవరకూ భద్రపరుచుకోవాలని కోరారు. ఏఈవో గజానంద్ తదితరులు పాల్గొన్నారు. యాంటీబయటిక్స్ అతిగా వాడొద్దుజగిత్యాల: రోగులు అతిగా యాంటీబయటిక్స్ వాడకూడదని, వాడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హేమంత్ అన్నారు. గురువారం ఐఎంఏ హాల్లో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. యాంటీబయటిక్స్ వాడటంద్వారా దీర్ఘకాలికంగా ఇబ్బందులు కలుగుతాయని, మోతాదుకు మించి వాడొద్దని, నియంత్రణే మార్గమని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందిస్తున్న పలువురు వైద్యులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురువారెడ్డి, అర్చన పాల్గొన్నారు. జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉపాధ్యాయుడురాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం మహేశ్ జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపికయ్యాడు. మహేశ్ మండలంలోని భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. టీజీపీఎస్సీ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్స్ ఫలి తాల్లో ప్రతిభ కనబర్చాడు. ఆయనను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. రైతుల వివరాలు నమోదు వేగవంతం చేయాలి రాయికల్: ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాల నమోదును వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని అల్లీపూర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేలా ఓపీఎంఎస్ వివరాలు నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ ఖయ్యూం, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, సీనియర్ ఇన్స్పెక్టర్ స్వప్న, ఏఈవో సుమలత, కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ రుణాలు మల్లాపూర్: రుణమాఫీ అయిన రైతులకు త్వరలోనే మళ్లీ రుణాలు అందిస్తామని మనోజ్‌కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, ముత్యంపేట సహకార సంఘాలను తనిఖీ చేశారు. రుణమాఫీ ఖాతాలు, ఫర్టిలైజర్స్ స్టాక్ రిజస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట నోడల్ అధికారి ఎండీ.కలీం, ప్యాక్స్ సీఈవోలు రమేశ్, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైలుమెట్పల్లి: కరీంనగర్ నుంచి కాచిగూడకు ఈనె ల 24, 25, 26, 28 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరీంనగర్ నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభ మై జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల మీదుగా కాచిగూడకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి కరీంనగర్‌కు రాత్రి 11.55 గంటలకు చేరుకుంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది
జగిత్యాలరూరల్: ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో టీవీ ప్రొజెక్టర్‌ను అందించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాంపూర్ పంప్‌హౌస్‌నుంచి పైప్‌లైన్ వేసి చెరువు నింపామని, చెరువు జలకళ సంతరించుకుందని, భూగర్భజలాలు పెరిగి సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్‌రెడ్డి, బోనగిరి నారాయణ, రాజిరెడ్డి, శ్రీనివాస్, నోముల శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో గాయత్రి పాల్గొన్నారు. సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. 17 మంది లబ్ధిదారులకు రూ.4.90 లక్షల విలువ గల చెక్కులు అందించారు. గంగపుత్రులకు అండగా ప్రభుత్వం జగిత్యాలటౌన్: గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొన్నారు. మత్స్యకార్మికులు చనిపోతే రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని జాప్యం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్ జుంబర్తి రాజ్‌కుమా పాల్గొన్నారు. దివ్యాంగులకు ఐదుశాతం డబుల్ ఇళ్లు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడా మహోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్లు, కృత్రిమ అవయవాలు అందించామన్నారు. దివ్యాంగుల సంక్షేమ అధికారి భోనగిరి నరేశ్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ లక్ష్మీరాంనాయక్, ఏఓ శ్రీనివాస్, డీవైఎస్ఓ రవికుమార్ పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
చెరువులు, కుంటల పునరుద్ధరణకు కృషి
జగిత్యాలటౌన్: నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు ఎమ్మెల్సీని ఇందిరాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే అధికారమని, ఇది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ ఏలో చేరుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దులు కోరారు. మంచినీళ్ల బావి చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. పెద్దమ్మతల్లికి జీవన్‌రెడ్డి పూజలు రాయికల్: మండలంలోని రామాజీపేటలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్సీ పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు నారాయణ, మోహన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, కిరణ్, సుదీర్‌రెడ్డి, హరీశ్‌రావు, శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. హామీలన్నీ నెరవేరుస్తాం.. మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తుందని ఎమ్మెల్సీ అన్నారు. మండలంలోని నడికుడలో మాట్లాడారు. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే పెట్టుబడిసాయం అందిస్తుందన్నారు. కిసాన్కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నల్ల బాపురెడ్డి, ముద్దం రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వెల్లడి -
మధ్యాహ్న భోజనం దుర్వాసన
సారంగాపూర్: బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండి మధ్యాహ్న భోజనం దుర్వాసన రావడంతో విద్యార్థులు తినకుండానే ఇంటికి వెళ్లిపోయారు. విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో పప్పు నుంచి నురగ రావడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు వాసన చూశారు. దుర్వాసన రావడంతోపాటు అన్నంలో కలిపి తింటే చేదుగా వస్తోందని ఉపాధ్యాయులకు సమాచా రం ఇచ్చారు. వారు విషయాన్ని ఎంఈవో నాగభూషణం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎంపీడీవో లచ్చాలుతో కలిసి పాఠశాలకు చేరుకుని వంటలను పరిశీలించారు. పప్పులో పాలకూర మోతాదు ఎక్కువైందని, అందుకే చేదు వచ్చిందని గుర్తించారు. పాలకూర మోతాదు మించితే వాసన రాదని, నాసిరకం పప్పు పెట్టడంతోనే వాసన వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి తరగతులకు హాజరయ్యారు. తినకుండానే వెళ్లిపోయిన విద్యార్థులు బీర్పూర్ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసిన ఘటన -
అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ తప్పనిసరి
రాయికల్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని మైతాపూర్లోగల అంగన్వాడీ కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. పిల్లలకు సంబంధించి రిజిస్టర్ నమోదు చేస్తున్నారా..? మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు..? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేయాలని సూ చించారు. అనంతరం నర్సరీని సందర్శించారు. సీసీరోడ్లు, ఇటిక్యాలలో బ్రిడ్జి నిర్మాణ పనులు, వీరాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చపట్టాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఈఈ అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల తనిఖీ మేడిపల్లి: మేడిపల్లి మండలంలోని కట్లకుంట, పోరుమల్లలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సెంటర్ల వారీగా ట్యాబ్ డాటా ఎంట్రీ వివరాలు అడిగి తెలసుకున్నారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, సివిల్ సప్లె అధికారులు ఉన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
ధర్మపురి ఆలయ అభివృద్ధికి కృషి
● ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ధర్మపురి: ధర్మపురి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వేములవాడకు వెళ్తున్న ఆయన విప్ ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాన్ని సందర్శించారు. నృసింహుడి ఆశీస్సులతో పార్టీ అధికారంలోకి వచ్చిందని, స్వామివారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నామని, రూ.రెండు లక్షల రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. నాయకులు ఎస్.దినేశ్, చీపిరిశెట్టి రాజేశ్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్, కస్తూరి శ్రీనివాస్, సుముఖ్, స్తంభంకాడి గణేశ్ తదితరులున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దుజగిత్యాల: ఆర్ఎంపీలు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆర్ఎంపీ, పీఎంపీలతో సమావేశమయ్యారు. తప్పుడు వైద్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్ఎంపీలు డాక్టర్ అని పెట్టుకోవద్దని ఆదేశించారు. సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండాలని అన్నారు. రోగులకు ప్రిస్క్రిప్షన్ రాయకూడదన్నారు. చాలామంది ఆర్ఎంపీలు ఔషధాలు విక్రయిస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారని తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్, అర్చన, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం 8.30 గంటల వరకు భీమారం మండలం మన్నెగూడెం, పెగడపల్లి మండల కేంద్రం, బీర్పూర్ మండలం కొల్వాయి, మల్యాల మండల కేంద్రంలో 12.8 డిగ్రీల చొప్పున, ఎండపల్లి మండలం గుల్లకోట, కథలాపూర్, భీమారం మండలం గోవిందారంలో 12.9 డిగ్రీల సెల్సి యస్‌గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కృంగి‘పోతున్న’
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024పండుటాకులు● కొడుకుల ఆదరణ కరువై.. వేధింపులు పెరిగి ● ఇంటిని వదిలి వెళ్తున్న కొందరు.. ● ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు.. ● ప్రజావాణి, ఠాణాల్లో పలువురి ఫిర్యాదు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల మిస్సింగ్ కేసులు ● చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులుఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.● జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు. ● సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ● సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.పెద్దపల్లిసిరిసిల్లజగిత్యాల008కరీంనగర్2735ఈ ఏడాది ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదులు జిల్లా వచ్చినవి పరిష్కారం విచారణ దశ కరీంనగర్ 48 19 25 జగిత్యాల 66 55 11 సిరిసిల్ల 38 12 26 పెద్దపల్లి 34 19 15న్యూస్‌రీల్ -
పూర్తి చేస్తాం
● ఈనెల 30న ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష చేస్తారు ● కాళేశ్వరంతో పనిలేకుండా అత్యధిక వరి ఉత్పత్తి ● పాదయాత్ర సమయంలో వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్న సీఎం ● కేసీఆర్ పాలనపై మంత్రుల విమర్శలు ● ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం, అభివృద్ధని స్పష్టీకరణ ● రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపనపెండింగ్ ప్రాజెక్టులుమాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సీఎం రేవంత్ పర్యటన ఇలా..● ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా వేములవాడ గుడి చెరువు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆలయ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. ● మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ దంపతులు ఒకేచోట కలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న క్రమంలో అన్నా, వదిన ఒకేచోట అంటూ సీఎం మాట్లాడారు. ● గెస్ట్‌హౌస్ నుంచి సీఎం లుంగీ–కండువా ధరించి రాజన్న దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్/వేములవాడ/వేములవాడఅర్బన్: అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఈ నెల 30 లోపు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎన్ని నిధులు కావాలి అనేది సమీక్షలో మాట్లాడుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ఆలయ గుడి చెరువు ఖాళీ స్థలంలో రూ.679 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు దేశానికి దిశ దశ చూపి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ బిడ్డ పరిపాలన అంటే ఎంటో చూపించారన్నారు. అలాగే పెద్దలు చొక్కారావు, ఎం.సత్యనారాయణరావు లాంటి వారు కరీంనగర్ నుంచి నాయకత్వం అందించారని గుర్తు చేశారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ అభివృద్ధికి అన్ని శాఖల మంత్రులు సంపూర్ణ సహకారం అందించారన్నారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరిపీఠాధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నామని వివరించారు. వేములవాడలో రూ.35 కోట్లతో నిత్య అన్నదానసత్రానికి సీఎం సభకు వచ్చే ముందు ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ పట్టణ పునర్నిర్మాణం పనులను 10 నెలల కాలంలో ప్రారంభించుకున్నామని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులు మరణిస్తే దేశంలోనే రాష్ట్రంలో రూ.5 లక్షల పరహారం అందిస్తున్న ఏకై క ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 ఏళ్ల చిరకాల కోరిక యారన్ డిపో ఏర్పాటు చేశామని వెల్లడించారు. 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందన్నారు. రాజన్న దయతో దేశంలోనే అత్యధికంగా వరిపంట దిగుబడి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, కులాలకతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చిరకాల ఆకాంక్ష నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ ఆలయానికి నేడు అభివృద్ధి బాటలు వేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల ఉపాధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి విప్ ఆది శ్రీనివాస్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఎకరం సాగయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రుద్రంగి ఇవతల మర్రిపల్లి అమ్మమ్మ ఊరు, అవతల నాన్నమ్మ ఊరని తెలిపారు. పది నెలల కాలంలోనే 50 వేల ఉద్యోగాలు అందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెడుతామన్నారు. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్– 2, ఫేజ్– 1 పనులు పూర్తి చేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ– 2లో పెండింగ్ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. సిరిసిల్లలో కాళేశ్వరం ప్యాకేజీ 9,10,11 పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్, విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు. ఆదిపై ప్రశంసల జల్లు.. వేములవాడకు బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.679 కోట్ల నిధులు, ఆలయ విస్తరణ పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌పై ప్రశంసల జల్లు కురిసింది. సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మని వెళ్లాల్సి వచ్చేదని కానీ, ఈ ప్రభుత్వంలో ఆది వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల వద్దకు స్వయంగా వెళ్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాలు మినహా ఏనాడు హైదరాబాద్ రాడని, నియోజకవర్గ అభివృద్ధి తప్ప పైరవీలు చేయడని స్పష్టం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నా రు. అలాగే వేములవాడలో ఆలయ విస్తరణ, సాగునీటి పనుల పూర్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చొర వ ఆది శ్రీనివాస్ కృషి అని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు అభినందించారు. సీఎంకు విప్ ఆది శ్రీనివాస్, ఆయన కుమారుడు కార్తీక్ తలపాగా ధరింపజేసి స్వామివారి చిత్రపటం, త్రిశూలం బహూకరించారు. 2.55 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించి 3.30 గంటలకు ముగించారు. సభా వేదికపైనుంచి కిందకు దిగిన సీఎంతో పోలీసు ఉన్నతాధికారులు ఫొటో దిగారు. 3.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. – వేములవాడ 11.41 గంటలకు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. మంత్రులందరికీ ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కొబ్బరికాయలు అందజేశారు. కార్యక్రమానికి శృంగేరి అర్చకులు హాజరయ్యారు. 11.45 గంటలకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. 11.55 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి మంత్రులతో కలిసి 12.20 వరకు దర్శనాలు పూర్తిచేసుకున్నారు. 12.25 గంటలకు స్వామివారి అద్దాల మంటపంలో సీఎం, మంత్రులకు దేవాదాయశాఖ అధికారులు, ప్రభుత్వవిప్ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చుకులు ఆశీర్వచనం గావించారు. అనంతరం సీఎంతో ఫొటో దిగారు. 12.45 గంటలకు దర్శనాలు పూర్తిచేసుకుని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభోత్సవాలు పూర్తి చేసి, 1.25 గంటలకు సీఎం వేదికపైకి చేరుకున్నారు. 1.35 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గీతం ఆలపించారు. 1.40 గంటలకు యార్నడిప్ వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. 1.45 గంటలకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ స్వాగత వచనాలు చేశారు. -
జ్యోతక్కకు మంత్రి నివాళి
మెట్పల్లి: మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డికి జ్యోతక్కకు మంత్రి శ్రీధర్‌బాబు నివాళి అర్పించారు. పట్టణంలోని వీఆర్ఎం గార్డెన్లో జ్యోతక్క పెద్దకర్మ నిర్వహించగా.. మంత్రి శ్రీధర్‌బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ఎల్.రమణ, రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్ తదితరులు హాజరయ్యారు. జ్యోతక్క కుమారులు కరం, విజయ్‌అజాద్, కపిల్‌ను పరామర్శించారు. జిల్లా మేజిస్రేట్ నీలిమ, పలువురు న్యాయమూర్తులు కూడా నివాళులర్పించారు. -
బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ–గుట్రాజ్‌పల్లి గ్రామాల మధ్య రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం బ్రిడ్జి పనులను పరిశీలించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగయ్యేలా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి సారంగాపూర్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లో ఆన్లైన్ చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో చెల్లించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని కోనాపూర్, సారంగాపూర్, లక్ష్మీదేవిపల్లి, పోతారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలని, రైతుల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. పలు కేంద్రాల్లో నమోదులో జాప్యం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. డీఎస్వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ లాస్య, సీఈవో లైశెట్టి శివకుమార్, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, ఏపీఎం రాజయ్య తదితరులు ఉన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
తిట్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి
జగిత్యాల: తిట్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను తర్వాత చేయొచ్చుగానీ.. మహిళలకు ఇస్తామన్న రూ.2500, తులం బంగారం ముందుగా ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అనేక పథకాలు తెచ్చారని, దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఇచ్చిన ఆరు హామీలను అమలుచేసే శక్తి లేకనే కేసీఆర్‌ను దూషిస్తున్నారని తెలిపారు. దూషణలు మానుకుని ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను ప్రజల గుండెల్లోంచి తొలగించడం ఎవరివల్లా కాదన్నారు. కేసీఆర్ ఒక మహావృక్షమన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో కేసీఆర్‌ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు రాంమోహన్‌రావు, కొల్ముల రమణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు -
రాష్ట్రస్థాయి పోటీల్లో కండ్లపల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు పీడీ వినీత్, అజీమ్ తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన అండర్ –19 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాస్కెట్‌బాల్ జట్టులో మోడల్‌స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. వారిని బుధవారం ప్రిన్సిపాల్ సరితాదేవి అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ నగేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు 25మంది ఎంపిక మెట్పల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత జెండా ఊపి ప్రారంభించారు. పోటీలకు వెయ్యి మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చూపిన 25మందిని వచ్చే నెల ఒకటిన మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరికి చైర్పర్సన్ చేతులమీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. నైపుణ్యం పెంచడానికి క్రీడలు దోహాదపడుతాయన్నారు. అసోసియేషన్ కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి, ఉపాధ్యక్షులు రాందాస్, కొమురయ్య, ఆల్‌రౌండర్ గంగాధర్ తదితరులున్నారు. 25న బీసీ సమరభేరి సభ జగిత్యాలటౌన్: ఈనెల 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీల సమరభేరి సభ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్రంలో వెనుకబడిత తరగతుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ముసిపట్ల లక్ష్మీనారాయణ, టి.నందగోపాల్, చిగుర్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవారి లత, నాయకులు కొక్కు గంగాధర్, తిరుపురం రాంచంద్రం, దండుగుల వంశీ, బండపెల్లి మల్లేశ్వరి, రాపర్తి రవి, కోటగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలిమెట్పల్లి: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతిస్వామి అన్నారు. పట్టణంలోని శివభక్త మార్కండేయ ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం ఆయన చేతులమీదుగా భూమిపూజ నిర్వహించారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షులు ధ్యావన్పల్లి రాజారాం, సంకు ఆనంద్, గుంటుక గౌతమ్ తదితరులున్నారు. -
ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం
కథలాపూర్: ఎన్నికల వేళ ఇచ్చి న హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కథలాపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారని, రూ.126 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని పేర్కొన్నారు. సభకు భారీగా తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ.అజీమ్, తొట్ల అంజయ్య, పూండ్ర నారాయణరెడ్డి, ఆకుల సంతోష్, తలారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సూరమ్మ’ ప్రాజెక్టు పనుల్లో కదలిక
కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లోని 50 వేల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి 520.29 ఎకరాలు భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. కాలువల నిర్మాణానికి 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో భూసేకరణకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్వాసితులకు పరిహారం కోసం రెండు రోజుల క్రితం రూ.10 కోట్లు మంజూరయ్యాయి. వాల్గొండలో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణంమల్లాపూర్: మండలంలోని వాల్గొండలో మంగళవారం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ భక్తులతో పూజలు చేయించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎస్కేఎన్ఆర్ విద్యార్థిజగిత్యాల: మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన అండర్–19 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జగన్నాథం అఖిల్ సత్తా చాటి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. అఖిల్‌ను ప్రిన్సిపాల్ దాసరి నాగభూషణం అభినందించారు. కళాశాల నుంచి అఖిల్ ఎంపికవడం అభినందనీయమని, పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. పదిలో వందశాతం ఫలితాలు సాధించాలిసారంగాపూర్: పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలని డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు. బీర్పూర్ మండలం తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. వందశాతం ఉత్తీర్ణతకు అదనపు తరగతులు నిర్వహంచాలన్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయులు డీఈవోకు తెలిపారు. తుంగూర్‌లో కస్తూరిబా బాలికల గురుకులం విద్యాలయాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేశామని, వారికి సారంగాపూర్ కేజీబీవీలో తరగతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈవో నాగభూషణం, హెచ్ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త బల్దియాలకు పోస్టులు మంజూరుజగిత్యాల: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రాయికల్, ధర్మపురి బల్దియాలకు పూర్తిస్థాయి అధికారులను నియమించారు. బల్దియాలో కీలకమైన శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ వంటి పోస్టులు లేకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. తాజాగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన బల్దియాలో పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపాలిటీల్లో పౌరసేవలు ప్రజలకు త్వరితగతిన అందే అవకాశాలుంటాయి. -
ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
జగిత్యాలటౌన్: దేశం కోసం ఇందిరగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్ర భుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆమె జయంతిని జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి పాతబస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఇందిర విగ్రహానికి పూలమాల వేశారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన వనిత అని కొనియాడారు. ఆమె తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంతో ప్రజలందరికీ న్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సా గాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొత్త మోహ న్, బండ శంకర్, దుర్గయ్య, శోభా రాణి, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ధర రమేష్, చందా రాధాకిషన్ పాల్గొన్నారు. -
సీఎం సారూ.. స్పందించాలి మీరు!
‘రాజన్న’కు స్వయం ప్రతిపత్తి కావాలి ● టీటీడీ తరహాలో అటానమస్ హోదా కల్పించాలంటున్న భక్తులు ● హైదరాబాద్ సంస్థానంలో అత్యంత ప్రాచీన ఆలయంగా ఎములాడ ● వేములవాడ రాజరాజేశ్వరునికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి కోడె మొక్కులు ● బసంత్‌నగర్ విమానాశ్రయం, నిజాం షుగర్స్ హామీలపై చర్చసాక్షిప్రతినిధి,కరీంనగర్●: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత పురాతన, చారిత్రక ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్ సంస్థానంలోనూ నిజాంరాజులు పెద్దపీట వేసిన ఏకై క ఆలయం. 1830 లోనే దక్షిణ భారతదేశంలో రోజుకు రూ.4 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు రెండే. ఒకటి తిరుపతి, రెండోది వేములవాడ. అంతటి ఘనచరిత్ర కలిగిన ఆలయంలో బుధవారం కోడెమొక్కులు చెల్లించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ, యాదాద్రి(ప్రతిపాదన దశ) తరహాలో స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అటానమస్ హోదాకు ప్రయత్నాలు రాజన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులకు రాజరాజేశ్వర స్వామివారు ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా అనాదిగా పూజిస్తున్నారు. ఒకప్పుడు భక్తుల రద్దీని గమనించిన నాగిరెడ్డి అనే ధర్మకర్త వేములవాడలో మరో కోనేరు నిర్మించారు. ఇది నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉండేది. క్రమంగా ఇది పాడవుతోంది. ప్రధాన ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాలు కూడా పురాతనమైనవే. దేవస్థానానికి ఉప ఆలయాలుగా ఉన్న నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి తదితర ఆలయాలను కలిపి క్లస్టర్‌గా అటానమస్ బోర్డును ఏర్పాటు చేసి(వీటీడీఏ కాకుండా), అభివృద్ధి చేయాలని రాజన్న ఆలయ ఉద్యోగులు, భక్తులు కోరుతున్నారు. యాదాద్రికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సమయంలో వేములవాడలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. వెంటనే అప్పటి సీఎం కేసీఆర్ ఇక్కడ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యాదాద్రికి అటానమస్ హోదా కల్పించేందుకు ప్రయత్నాలు మొదలైన దరిమిలా.. వేములవాడకూ కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం జీతాలు, పింఛన్లకే.. ఆలయానికి ప్రధానంగా కోడె మొక్కులు, హుండీ ద్వారా ఆదాయం వస్తుంది. ఆలయ నిర్వహణ ఖ ర్చు ఏటా రూ.200 కోట్ల పైమాటే. ఇందులో అధికశాతం దాదాపు రూ.30 కోట్ల వరకు జీతాలు, పింఛన్లకే వెచ్చిస్తుండటం వల్ల ఆలయ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు. ఇవిగాక కరెంటు బిల్లులు, ప్రసాదాలు, శివరాత్రి, ఇతర ఉత్సవాలు కలిపితే వచ్చే ఆదాయం కన్నా ఖర్చయ్యేదే ఎక్కువ. అందు కే, ప్రత్యేక అటానమస్ బోర్డు ఉంటే తప్ప అభివృద్ధి ఊపందుకోదని పలువురు భక్తులు అంటున్నారు. తాజా నిర్ణయాలపై హర్షం.. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు విడుదల చేయడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. ఇందులో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది. అలాగే, మూలవాగులో బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు రూ.3.8 కోట్లతో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే, వీటీడీఏ పరిధిని మొత్తం జిల్లాకు విస్తరించడం, పట్టణీకరణకు పెద్దపీట వేయడంపై రాజన్నసిరిసిల్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంపై చర్చ.. వరంగల్‌లో మామునూరు విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బసంత్‌నగర్ విమానాశ్రయంపై మరోసారి చర్చ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ విషయమై సానుకూలత వ్యక్తం చేయడంతో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించినా పురోగతి లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టు సాకారమవుతున్న వేళ.. బసంత్‌నగర్ విమానాశ్రయంపైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కోరుతున్నారు. నిజాం షుగర్స్‌పై గంపెడాశలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాల్సి ఉంది. వాస్తవానికి రూ.210 కోట్ల బ్యాంకు బకాయిలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.192 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లింపు, ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల సర్దుబాటుకు పరిష్కార మార్గాలు వెతుకుతోంది. ఫ్యాక్టరీ పునః ప్రారంభమైతే ఉపాధితోపాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. దుష్ప్రచారానికి తెర ఒకప్పుడు రాజన్న ఆలయానికి వస్తే పదవీ గండం అన్న దుష్ప్రచారం ఉండేది. కానీ, అదంతా వట్టిదే అని తేలిపోయింది. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజయాలే ఇందుకు నిదర్శనం. పాత ప్రచారం పోయి, ఇప్పు డు రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తే విజయం తథ్యమన్న మాట విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.రాజన్న ఆలయం వద్దనే అన్నీ.. వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదీ సిరిసిల్ల/వేములవాడఅర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం వద్దనే బుధవారం నాటి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ఉద యం 9గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.45కు వేములవాడ చేరుకుంటారు. ఉద యం 9.55గంటలకు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 10గంటల నుంచి 10.15 వరకు ఆలయ అతిథిగృహంలో రెస్ట్ తీసుకుంటారు. 11గంటలకు రాజన్న ఆలయానికి చేరుకుని, స్వామివారికి పూజలు నిర్వహిస్తా రు. 11.45 గంటలకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.15 గంటలు అతిథి గృహానికి చేరుకుంటారు. 12.30 నుంచి 1.40 వరకు రాజన్న ఆలయ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గుడిచెరువు గ్రౌండ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయల్దేరి 2.30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.పకడ్బందీ ఏర్పాట్లువేములవాడలో బుధవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్, ఇతరశాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు ఉదయం చేరుకుంటారని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభ అనంతరం అతిథిగృహం వద్ద లంచ్‌చేసి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందిస్తామని, అవి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తారని తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో పూర్తి సిబ్బందితో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగసభ వద్ద మెడికల్‌క్యాంపు పెట్టాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఇతరశాఖల పాల్గొన్నారు.ధార్మిక.. కార్మిక క్షేత్రంలో సమస్యలు ఇవీ..రాజన్నసిరిసిల్ల జిల్లా ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 261 గ్రామాలతో విస్తరించి ఉంది. చిన్నజిల్లాగా పేరున్న ఈ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రజలకు ప్రతిబంధంకంగా మారాయి. ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఇక్కడికి అనేక పర్యాయాలు వచ్చినా.. సీఎం హోదాలో వేములవా డకు తొలిసారి బుధవారం వస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సీఎం రేవంత్‌రెడ్డిపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండు పాయలుగా అటు మానేరు.. ఇటు మూలవాగు పారుతోంది. ధార్మిక క్షేత్రమైన వేములవాడ, కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, కర్షకుల నిలయాలైన పల్లెల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు ఇవీ.. –సిరిసిల్ల8లోu -
లక్ష్యంతో ముందుకుసాగాలి
మల్లాపూర్: విద్యార్థులు సమున్నత లక్ష్యంతో ముందుకు సాగితే విజ యం వరిస్తుందని కోరుట్ల ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌ను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థి దశ నుంచే కష్టపడేతత్వాన్ని అలవర్చుకుని గొప్ప లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు. పరీక్షలంటే భయం వీడాలని, ప్రశాంతంగా సిద్ధం కావాలని సూచించారు. సిలబస్ పూర్తయిందా అని అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ కాలనీలో వీధి దీపాలు లేవని, ఇతర సమస్యలు పరిష్కరించాలని మండలకేంద్రంలోని దుర్గమ్మ కాలనీవాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో జగదీశ్, ప్రిన్సిపాల్ భూమేశ్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ ఉన్నారు. పదినెలల్లో రాష్ట్రం పదేళ్లు వెనక్కి.. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలన వైఫల్యంతో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేశారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, పథకాల్లో కోత పెడుతూ ప్రజలు, రైతులను వంచిస్తోందన్నారు. -
జగిత్యాల అభివృద్ధే లక్ష్యం
జగిత్యాలటౌన్: జగిత్యాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి, ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్నారు. 170మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తమది మొదటి నుంచే కాంగ్రెస్ కుటుంబమని, అంతర్గాంలో దళితుల కోసం నాడే ఎనిమిది ఎకరాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలుతో ప్రజల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి
జగిత్యాలటౌన్: ఆర్టీసీ కార్మిక సంఘాలపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సంస్థ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, సామాజిక భద్రత పథకాల్లో కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్టు ఆఫ్ ట్రస్టీలను నియమించాలని కోరారు. కార్మికులపై పనిభారం పెంచుతున్నారని, మహిళలకు అర్ధరాత్రి వరకూ డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ డ్యూటీల పేరుతో డిపో మేనేజర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటచారి, బొర్ర శేఖర్, గర్వందుల రమేశ్, మల్యాల సురేష్, ఎండీ.రఫిక్, అజయ్ పాల్గొన్నారు. -
No Headline
ప్రయాణికుల తిప్పలుజగిత్యాలటౌన్: హన్మకొండలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు వరంగల్, కరీంనగర్ డిపోల నుంచి బస్సులు తరలించారు. సమయానికి బస్సులు రాకపోవడంతో జగిత్యాల బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరతతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అప్పుడప్పుడు వచ్చిన బస్సులు ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. ఒకదశలో తొక్కిసలాట జరిగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్టీలు, ప్రభుత్వం నిర్వహించే సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడం షరామామూలుగా మారిందని, ప్రతిసారి ఇదే ఇబ్బంది ఎదురవుతోందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సున్నా
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల/కోరుట్లరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్రానికి చేసింది సున్నా అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కేసీఆర్ హయాంలో నాణ్యమైన కరెంట్, రైతుబీమా, రైతుబంధు పథకాలు అందించారని, కరోనా కష్టకాలంలోనూ పథకాలు కొనసాగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. సన్నాలకు బోనస్ పేరుతో రైతులను మభ్యపెట్టటం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అనంతరం 189 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మాజీ ఎంపీపీ తోట నారాయణ, మాజీ వైస్ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్ రెడ్డి, సుదవేణి భూమయ్య, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
జలుబు.. దగ్గు.. జ్వరం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మొన్నటి వరకు ఎండ.. ఇప్పుడు చలి.. అదికూడా పొద్దంతా ఎండ.. రాత్రిపూట చలి.. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు 35డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఒక్కసారిగా 24 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం రాత్రి ఉష్ణోగ్రతలు 20డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం 18 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. పలువురు చిన్నారులు, వృద్ధులు జ్వరం, జలుబు, వాంతులతో బాధ పడుతున్నారు. ప్రతీ ఇంటా జ్వర పీడితులు ఉంటున్నారు. వాతావరణ మార్పులు, అపరిశుభ్రతతో జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరమే కదా అని కొందరు సొంత వైద్యం చేసుకోవడం.. ఆర్ఎంపీల వద్ద చికిత్సలు చేయించుకోవడం.. పరిస్థితి విషమించిన తర్వాత పెద్దాసుపత్రులకు వెళ్లడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జబ్బులు వచ్చాక ఇబ్బంది పడే బదులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా లబ్ధిపొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగులతో కిటకిట.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వారం క్రితం వరకు జిల్లా ప్రధానాసుపత్రులతో 700–800 ఓపీ నమోదు కాగా ప్రస్తుతం వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులుగా 1,500 మందికిపైగా ఓపీలో వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా రోగుల సంఖ్య పెరగడంతో వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో అంతంత మాత్రంగానే వచ్చిన రోగులు గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది రోజుల వ్యవధిలోనే కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఔట్‌పేషెంట్ విభాగంలో ప్రతీరోజు 1200–1500 మంది వరకు వైద్యం పొందారు. ఇందులో చాలా మంది వైరల్ జ్వరాలతోనే వచ్చిన వారుండగా.. మిగిలిన వారు దగ్గు, జలుబు, జ్వరం బాధితులున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ఓపీలు 15వ తేదీన 708, 16న 1,096, 18న 1,267గా నమోదైంది. జగిత్యాలలో సగటు ఓపీ 700 మంది, సిరిసిల్ల 600 ఓపీ కొనసాగుతోంది.వారంరోజుల్లో కరీంనగర్ జీజీహెచ్‌లో ఓపీ ఇలా11 1,529 12 1,411 13 1,140 14 1,126 15 514 16 935 18 1383 అకస్మాత్తుగా అనారోగ్యం బాధితుల్లో అధికశాతం చిన్నారులే వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ కిక్కిరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులుఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా వీర్నపల్లి(సిరిసిల్ల) 12డిగ్రీలు జూలపల్లి(పెద్దపల్లి) 13.7 డిగ్రీలు గోవిందారం( జగిత్యాల) 13.1 డిగ్రీలు ఆసిఫ్‌నగర్ కొత్తపల్లి(కరీంనగర్) 13 డిగ్రీలువాతావరణ మార్పులే వాతావరణంగా చోటుచేసుకున్న అనూహ్య మార్పులతోనే ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులకు గురవుతున్నారు. వీటిని నిర్లక్ష్యం చేయడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాయి. మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి. – డాక్టర్ సాయిని నరేందర్, పల్మనాలజిస్టు, జీజీహెచ్, కరీంనగర్ -
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్–3 పరీక్షలు
జగిత్యాల: గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం నిర్వహించిన పరీక్షకు 10,656 మందికి 5,501 మంది మాత్రమే హాజరయ్యారు. 34పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బంది కలకుండా ఏర్పాట్లు చేశారు. జవాబుపత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్టీయూకు తరలించారు. పరీక్షాకేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ కోరుట్ల/కోరుట్ల రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అరుణోదయ డిగ్రీ కళాశాల్లోని పరీక్షాకేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, మెట్పల్లి సీఐ నీరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసుల భారీ బందోబస్తు జగిత్యాలక్రైం: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. జిల్లాకేంద్రంలో పరీక్ష సరళిని పరిశీలించారు. అన్ని రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా, ఎస్సై స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించామన్నారు. భర్త సహాయంతో.. కోరుట్ల: ఓ నిండు గర్భిణి భర్త సహాయంతో వచ్చి పట్టణంలోని డిగ్రీ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసింది. జగిత్యాలకు చెందిన రీనా కథలాపూర్ మండలం అంబారిపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. గ్రూప్–3 పరీక్షలకు ప్రిపేర్ అయిన ఆమె.. భర్త రామకృష్ణ సహాయంతో కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. జేఎన్టీయూ(హెచ్)కు జవాబుపత్రాలు తరలింపు రెండోరోజు 51.61 శాతం మాత్రమే హాజరు -
సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించండి
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాయికల్: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండలం అల్లీపూర్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. అధికారులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించి వివరాలు చెప్పాలని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వీటి ద్వారానే సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందుతాయన్నారు. నిధుల కొరతతో కొన్ని పథకాలు జాప్యం అవుతున్నాయని, త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తారని వివరించారు.