Jani Master
-
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం.. స్పందించిన జానీ మాస్టర్
లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌కి ఊహించని షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఆయనను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా జానీ మాస్టర్ తన సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.మొన్నటివరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో.. ఇతడి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ.. తన పదవీ కాలం 2025 వరకు ఉంది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా అసోషియేషన్‌లో ఎలక్షన్లు నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారువారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: జానీతనను అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్ తెలిపారు. సోషల్‌మీడియాలో కావాలనే ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు. 'నన్ను ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. నేను డ్యాన్సర్ యూనియన్‌లో మెంబర్. అందులో నుంచి శాశ్వితంగా ఎవర్నీ తొలగించలేరు. నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్ చేస్తాను. నా పదవీ కాలం ఇంకా ఉంది. కొందరు అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకున్నారు. వారికి ఆ హక్కు లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.' అని జానీ అన్నారు.డ్యాన్స్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 15 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని. ఆ స్కామ్ వివరాలను జానీ మాస్టర్ బయటకు తీయడం వల్లే జానీ మాస్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో కూడా భారీగా వసూళ్లకు పాల్పిడినట్లు జానీ ఆరోపించడంతో తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv— Jani Master (@AlwaysJani) December 9, 2024 -
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్‌కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'కు బెయిల్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం జానీ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దానిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బెయిల్ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్ఐఆర్లో పోక్సో కేసుగా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబర్ 25న చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల కానున్నారని సమాచారం. -
జానీ మాస్టర్‌కు భారీ షాక్
-
కోర్టులో జానీ మాస్టర్‌కు చుక్కెదురు
లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కొద్దిరోజుల క్రితం జానీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ క్రమంలో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో జానీ ఒక పిటీషన్ పెట్టుకున్నారు. తాజాగా న్యాయస్థానంలో తన బెయిల్‌పై విచారణ పూర్తి అయింది.ఇప్పటికే పలుమార్లు జానీ బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. కానీ, నేడు (అక్టోబర్ 14) జానీ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. కేసు విచారణ పూర్తి అయిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జానీకి కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఆయన ఉన్నారు.జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ భయపెట్టాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్ఐఆర్లో పోక్సో కేసుగా నమోదు చేశారు. -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్ బంధువు ఫిర్యాదు
నెల్లూరు (క్రైమ్): సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీమాస్టర్ కేసులో బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తోందని ఓ యువకుడు శుక్రవారం నెల్లూరు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేకరించిన సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన సమీర్ ప్రస్తుతం బిటెక్ చదువుతున్నాడు. అతను కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ మేనమామ కుమారుడు. సమీర్ ఎక్కువగా హైదరాబాద్‌లో జానీమాస్టర్ వద్ద ఉండేవాడు. ఆయనతో పాటు షూటింగ్‌లకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతితో అతనికి పరిచయం అయింది. ఆమె 2020 నుంచి తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసిందని సమీర్ ఆరోపించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదరు యువతి జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం తెలిసిందే. తాజాగా ఆ యువతిపై జానీమాస్టర్ మేనమామ కొడుకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ, చైన్నె రాష్ట్రాల్లో జరగడంతో పోలీసులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
నా మధ్యంతర బెయిల్ రద్దు చేయండి: జానీ మాస్టర్
రంగారెడ్డి కోర్టులు: లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తనకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన పోక్సో కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు గత గురువారం జానీ మాస్టర్‌కు ఈ నెల 6నుండి 9వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు తెలియడంతో ఆయన తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ సాధారణ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. -
జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి
బిగ్‌బాస్ 8 తెలుగు షోలో కాస్త జోష్ వచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు గతవారం మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో నైనిక ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమె తల్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ ప్రస్తావన రావడమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు)ఢీ షోలో డ్యాన్సర్‌గా కాస్త గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. గత కొన్నాళ్లు నుంచి మాత్రం నటిగా అవకాశాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ పట్టుమని ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.గతంలో ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు వచ్చాయని తాను పంపించలేదని నైనిక తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని అన్నారు. రీసెంట్గా తన అసిస్టెంట్‌ని వేధించారనే ఆరోపణలతో జానీ అరెస్ట్ అయ్యారు. దీంతో నైనిక తల్లి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!) -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు బిగ్ షాక్
-
బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగలనుంది. అక్టోబర్ 8న జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్ కోసం జానీ మాస్టర్ పిటీషన్ వేశారు. దీంతో రంగారెడ్డి కోర్టు ఈనెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.2022లో తమిళ సినిమా 'తిరుచిత్రబలం' తెలుగులో 'తిరు' చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే జానీ మీద పోక్సో చట్టం కింద వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఈ కారణంతో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో జానీమాస్టర్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదుతో జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉన్నారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు
-
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్
-
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్.. కారణం ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్ 3 తో ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 70వ జాతీయ అవార్డ్స్‌లో జానీ మాస్టర్‌కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. -
నేషనల్ అవార్డు తీసుకోవాలి బెయిల్ ఇవ్వండి..
-
ముగిసిన జానీ మాస్టర్ కస్టడీ.. మళ్లీ జైలుకు తరలింపు
లైంగిక ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు. ఈనెల 25వ తేదీ నుంచి జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు విచారించారు. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, జానీ మాస్టర్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు.పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి..? ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది..? ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్ ముందు ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నాలుగు రోజులపాటు అతడిని విచారించిన నార్సింగి పోలీసులు.. అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను మైనర్‌గా ఉన్నప్పడే ఈ ఘాతుకానికి జానీ పాల్పడినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. అక్టోబర్ 3న జానీ మాస్టర్ రిమాండ్ గడువు ముగుస్తుంది. -
‘నా భర్తను ట్రాప్ చేసింది.. ఇంటికి రాకుండా అడ్డుకునేది’
సాక్షి, హైదరాబాద్: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆయన భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా నరకం అంటే చూపిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ ఫిర్యాదులో తెలిపింది.‘‘నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ నా భర్తపై తీవ్ర ఒత్తిడి చేసింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన భర్త లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది’’ అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.‘‘పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె వేధింపులకు గురిచేస్తుంది. ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అని సుమలత తెలిపింది.ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్ -
పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను విచారించేందుకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని జానీ మాస్టర్ ముందు ఉంచి నార్సింగి పోలీసులు విచారించారు. అయితే, బాధితురాలే తనను గతంలో వేధించిందని తాజాగా జరిగిన పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.పోలీసుల విచారణలో నేడు (సెప్టెంబర్ 27) పాల్గొన్న జానీ మాస్టర్ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో జానీ మాస్టర్ ఏకీభవించలేదని తెలుస్తోంది. తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు. తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా.. బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. రేపటితో (సెప్టెంబర్ 28) జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
మరికాసేపట్లో నార్సింగి పోలీస్ కస్టడిలో జానీ మాస్టర్
-
జానీ మాస్టర్ కి.. 4 రోజుల పోలీస్ కస్టడీ
-
జానీ మాస్టర్ కి 4 రోజుల పోలీస్ కస్టడీ