Jayant Sinha
-
గంభీర్ బాటలో.. ఎన్నికలకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి
ఢిల్లీ: బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని.. రాజకీయాల నుంచి వైదొలగానుకుంటున్నట్లు గౌతం గంభీర్ ప్రకటించిన వేళ.. మరోనేత అదే రీతిన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్.. ఎంపీ జయంత్ సిన్హా వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. జయంత్ సిన్హా.. గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.‘నన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా. నేను ప్రపంచ పర్యావరణ మార్పుల విషయంలో భారత్‌పై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా. నేను ఆర్థిక, ప్రభుత్వపరమైన విషయాల్లో బీజేపీ పార్టీకి అన్ని రకాలుగా సేవలందిస్తా. .. గత పదేళ్లుగా హజారీబాగ్‌కు సేవలు అందించినందుకు గర్వపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకత్వం ఆశీస్సులతో చాలా మంచి అవకాశాలు పొందాను. వారందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్’ అని జయంత్ సిన్హా ఎక్స్( ట్విటర్) వేదికగా ప్రకటించారు. I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance… — Jayant Sinha (@jayantsinha) March 2, 2024 ఐఏఎస్ మాజీ అధికారి.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్ సిన్హా అని తెలిసిందే. సుదీర్ఘకాలం బీజేపీతో రాజకీయాల్లో ఉన్న యశ్వంత్ సిన్హా.. తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షల తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా ఇద్దరూ సిట్టింగ్ ఎంపీలు తాము వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయమని.. రాజకీయాలకు దూరం ఉంటామని ప్రకటించటం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు బీజేపీ ప్రకటించే ఎంపీ అభ్యర్థుల జాబితాలో వీరికి టికెట్ లభించకపోవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేవారు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక..బీజేపీ మొదటి జాబితాలోనే సుమారు వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయ. ఆ దిశగా బీజేపీ రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి ఎన్నికలు: మరి ఆయన మద్దతు ఎవరికో?
న్యూఢిల్లీ: మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో.. అధికార, విపక్షాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, సుమారు 22 పార్టీల మద్ధతుతో ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్లు వేయనున్నారు. అయితే.. కుటుంబమా? లేదంటే రాజకీయమా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తోంది. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా తండ్రి యశ్వంత్ సిన్హా.. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల బరిలో, అదీ ప్రత్యర్థి వర్గం నుంచి ఉన్నారు. అదే సమయంలో పార్టీ బలపరుస్తున్న ద్రౌపది ముర్ముకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు. పేద, వెనుకబడిన వర్గాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అందుకోసమే ఆమెకు ఈ గౌరవం దక్కింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు.’’ అలాగే.. ఎన్నికల బరిలో నా తండ్రి(యశ్వంత్ సిన్హా) కూడా ఉన్నారు. అలాగని.. ఈ వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారంగా చూడొద్దని కోరుతున్నారు ఆయన. ఒక బీజేపీ కార్యకర్తగా, పార్లమెంటేరియన్‌గా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటా అని తెలిపారాయన. -
సిన్హా వ్యాఖ్యలతో ఇరకాటంలో కాషాయ పార్టీ
పట్నా : కేంద్ర మంత్రి, హజారిబాగ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్‌ను మసూద్ అజర్‌జీ అని సంభోదించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ‘దేశ భద్రతకు ఇది మైలురాయి వంటిది..మేం చేపట్టిన ప్రయత్నాలు నెరవేరి మసూద్ అజర్‌జీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింద’ని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. బిహార్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మసూద్ అజర్‌ను సాహెబ్‌గా పిలిచిన బిహార్ మాజీ సీఎం, మహాకూటమి నేత జితన్ రాం మాంఝీని బీజేపీ మందలించిన కొద్ది గంటల్లోనే సిన్హా నోరుజారడం గమనార్హం. మన్మోహన్ సింగ్ హయాం నుంచి మసూద్ అజర్ సాహెబ్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించే ప్రయత్నాలు సాగినప్పటికీ ఇప్పటికి ఆ నిర్ణయం వెలువడటం కాకతాళీయమేనని జితన్ రాం మాంఝీ వ్యాఖ్యానించారు. మాంఝీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అభ్యంతరం లేవనెత్తగా తాజాగా తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మసూద్‌జీ అంటూ సంభోదించడం ఆ పార్టీని ఇరకాటంలో పడవేసింది. -
మీడియాతో మంత్రి.. అమ్మాయి కొంటెపని!
న్యూఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి జయంత్ సిన్హా మీడియాతో సీరియస్‌గా మాట్లాడుతుండగా.. ఓ అమ్మాయి చేసిన తమషా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలోనే ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో రైతులు, వేతన జీవులపై వరాల జల్లు కురిపించారు. అయితే బడ్జెట్ సెషన్ అనంతరం జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఆయన సీరియస్‌గా తమ ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతుండగా.. ఆయన వెనకాల ఉన్న ఓ అమ్మాయి కొంటె పనిచేసింది. కెమెరాను చూసి నాలుకను బయటపెట్టి వెక్కిరిచ్చింది. అయితే ఆమె తమాషా కొద్ది చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ అమ్మాయి బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని తెలిపిందని ఒకరు, బడ్జెట్‌కు సూపర్బ్ రివ్యూ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడగా.. ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శిస్తున్నాయి. Who's this kid? Photo bombing a minister outside parliament on budget day is no mean feat. #Budget2019 pic.twitter.com/pwIpGXaF9e — Devjyot Ghoshal (@DevjyotGhoshal) February 1, 2019 -
‘వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడదు’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ గత నవంబర్ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలాంటి మేజర్ ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడం వలన దానిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కొండపల్లి ఆయిల్ పైపులైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్‌లైన్ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు. -
డ్రోన్ ద్వారా అవయవాలు!
న్యూఢిల్లీ: ఓ నగరంలోని ఆసుపత్రిలో దాత నుంచి సేకరించిన అవయవాలను నిమిషాల వ్యవధిలో మరో ఆసుపత్రిలోని రోగికి అమర్చవచ్చు. ఒకచోటి నుంచి మరోచోటికి అత్యవసర పరిస్థితుల్లో మందుల్ని అప్పటికప్పుడు చేరవేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త డ్రోన్ ద్వారా ఈ రెండు ఘటనలు వాస్తవరూపం దాల్చనున్నాయి. ఈ విషయమై పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ..‘ఆసుపత్రుల మధ్య డ్రోన్ల రాకపోకల కొత్త డ్రోన్ విధానానికి సంబంధించి డిసెంబర్ 1(నేటి) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించిన నెలరోజుల తర్వాత డ్రోన్ల వినియోగానికి లైసెన్సులు జారీచేస్తాం. దేశవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో డ్రోన్ల ప్రయాణ దూరాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలను 2019, జనవరి 15న భారత్‌లోని ముంబైలో జరిగే ప్రపంచ విమానయాన సదస్సులో విడుదల చేస్తాం. అంతేకాకుండా కొత్త డ్రోన్ విధానంలో భాగంగాసరుకుల రవాణాకు ఒకే ఆపరేటర్ బహుళ డ్రోన్లను వినియోగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత్ తొలి డ్రోన్ విధానాన్ని, నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందిస్తూ..‘సహాయక చర్యలు, ఏరియల్ సర్వే, పంటల అంచనా, సరుకుల చేరవేత తదితర రంగాల్లో డ్రోన్ల సేవలను గణనీయంగా వాడుకోవచ్చు. వీటి వినియోగానికి డిజిటల్ ‘కీ’ని జారీచేస్తాం. ఓటీపీ ద్వారా రిజస్టర్ అయ్యాక మాత్రమే డ్రోన్లు టేకాఫ్ కాగలవు’ అని ఆయన వెల్లడించారు. -
కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్ వారించిన కూడా వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
విద్వేషానికి వీర సత్కారం
-
విద్వేషానికి వీర సత్కారం
సాక్షి, న్యూఢిల్లీ : అది రాంచీలోని జయప్రకాష్ నారాయణ్ కేంద్ర కారాగారం. శుక్రవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రెండు బృందాలు జైలు వెలుపల ఆత్రుతతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. జైలు తలుపులు తెరుచుకున్నప్పుడల్లా ఆ రెండు బృందాలు ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో జైలు తలుపులు తెరచుకోగానే ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అంతే రెండు బృందాలు పోటీ పడి వారి వద్దకు దూసుకెళ్లి వారి మెడల్లో దండలు వేశాయి. తమ వెంట రావాలంటే తమ వెంట రావాలంటూ ఆ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించాయి. ఆ రెండు బృందాల్లో ఒకటి రామ్‌గఢ్ మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శంకర్ చౌధరి అనుచర బృందం కాగా, మరో బృందం కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా విధేయుడైన రామ్‌గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పప్పు బెనర్జీ అనుచర బృందం. చివరకు ఆ రెండు బృందాల మధ్య ఏదో అంగీకారం కుదిరింది. ఆ ఆరుగురు నిందితులు పప్పు బెనర్జీ వెంట కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ ఆ ఆరుగురు వ్యక్తులకు బంతిపూల దండలతో సాదరంగా స్వాగతం చెప్పారు. ఆయన వారికి స్వీట్లు కూడా తినిపించారు. అటు జైలు ముందు, ఇటు జయంత్ ఇంటి ముందు సత్కార ఆర్భాటాలు చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లి తిరుగొచ్చిన వీరులకు ఇలాగే సత్కారం లభించేది. ఇప్పుడు సత్కారం అందుకుంటున్న ఈ వీరులెవరు? వారు దేనికోసం పోరాటం జరిపారు? సత్కారం అందుకున్న ఆరుగురు వ్యక్తులు ఏడాది క్రితం జరిగిన అమీలుద్దీన్ అన్సారీ హత్య కేసులో శిక్ష పడిన నేరస్థులు. వారికి జార్ఖండ్ ట్రయల్ కోర్టు ఆ ఆరుగురు సహా 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, అది పెద్ద శిక్షంటూ దాన్ని రద్దు చేసిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 29న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లాంఛనాలు పూర్తిచేసి ఏడుగురు నేరస్థుల్లో ఒకరు గురువారమే జైలు నుంచి విడుదలకాగా, ఆరుగురు శుక్రవారం విడుదలయ్యారు. మరో నలుగురు జైలు నుంచి ఇంకా విడుదల కావాల్సి ఉంది. వారి న్యాయపోరాటానికి మొత్తం ఖర్చును జయంత్ సిన్హా పెట్టారని పప్పు బెనర్జీ చెబుతుండగా, ఆయన క్రెడిట్ కోసం కేసు చివరి దశలో జోక్యం చేసుకున్నారని, మొదటి నుంచి కేసుకు ఖర్చు పెడుతున్నదే తానని మాజీ బీజేపీ ఎంపీ శంకర్ చౌధరి మీడియాతో వ్యాఖ్యానించారు. హంతకులతో కలిసి దిగిన జయంత్ సిన్హా ఫొటో జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడంతో చౌధరి నొచ్చుకున్నారు. నాడు ఏంజరిగింది? అమీలుద్దీన్ అన్సారీ హత్య 2017, జూన్ 27వ తేదీ ఉదయం జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలోని మనువా గ్రామానికి చెందిన అన్సారీ బొగ్గుల వ్యాపారి. ఆ రోజున మారుతీ వ్యాన్‌లో రామ్‌గఢ్‌కు వెళ్లారు. అక్కడ ఓ అల్లరి మూక ఆయన కారును అడ్డగించి ఆవును చంపి మాంసాన్ని కారులో తరలిస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. రామ్‌గఢ్ జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి నిత్యానంద్ మెహతో (శిక్షపడిన వారిలో ఒకరు) అన్సారీని కారు నుంచి లాగగా అల్లరి మూక ఆయన్ని కొట్టడం మొదలుపెట్టింది. దీన్ని అల్లరి మూకలో ఒకరిద్దరు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అన్సారీ 16 ఏళ్ల కుమారుడు సహబాన్ ఆ వీడియోను చూశారు. తండ్రిని కాపాడుకోవాలనే తొందరలో ఆ కుర్రాడు డ్రైవింగ్ రాకపోయినా తండ్రి స్కూటర్‌ను తీసి స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గేర్ మార్చి వదిలేయడంతో అది ముందుకు ఎగిరి పడిపోవడంతో కాలుకు గాయం అయింది. తల్లి వచ్చి స్కూటర్ ఎందుకు తీశావంటూ కొట్టబోతే వాట్సాప్ వీడియోను చూపించారు. అప్పుడు అన్సారీ భార్య, కుమారుడు ఇరుగు పొరుగు వారి సహాయంతో హుటాహుటిన రామ్‌గఢ్ వచ్చారు. అప్పటికే అన్సారీ రోడ్డుపై శవంగా పడి ఉండగా, ఆయన మారుతి వ్యాన్‌ను అల్లరి మూక ధ్వంసంచేసి తగులబెట్టింది. ఆ వీధిలో దాదాపు 200 కిలోల మాంసం ముద్దలు పడి ఉండడం కూడా ఫొటోల్లో కనిపించింది. అవి కారులో నుంచి పడ్డాయనే దానికి వీడియోలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. అంత పెద్ద మొత్తంలో మాంసం తీసుకెళ్లడానికి అన్సారీ మాంసం వ్యాపారీ కాదు. ఇంట్లో ఫంక్షన్ కూడా లేదు. ఆ మాంసం ముద్దలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష కేసును విచారించిన రామ్‌గఢ్ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కీలక సాక్షి తన భార్యతో పాటు కోర్టుకు వచ్చారు. అన్సారీ కుమారుడు సహబాన్తో (అప్పటికి స్కూటర్ నడపడం నేర్చుకున్నారు) ఆమెను స్కూటర్‌పై పంపారు. స్కూటర్‌పై వెళుతున్న వీరిని వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సాక్షి భార్య మరణించింది. సాక్షిని బెదిరించడంలో భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా భయపడకుండా అన్సారీ భార్య, కుమారుడు పోరాడటం వల్ల నేరస్థులకు శిక్ష పడింది. నేరస్థులకు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారని తుది విచారణలో కోర్టు జడ్జీ ప్రశ్నించినప్పుడు కూడా అన్సారీ భార్య ‘నా భర్త హత్య కేసులో న్యాయం చేయండని కోరుతున్నాను. అంతుకుమించి నేనేమి చెప్పలేను. నాకేమీ అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష పడిన నేరస్థుల్లో స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. అంత ఉన్నత చదువులు చదివి కూడా విడుదలైన వారిని స్వాగతించడంలో బీజేపీ నాయకులు ఇక్కడ పోటీ పడుతుంటే అంత ఉన్నత చదువులు చదివిన జయంతి సిన్హాకు ఏమైందంటూ సోషల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎంఎస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన జయంత్ సిన్హా కొంతకాలం బాస్టన్‌లోని ‘మ్యాక్‌కిన్సే అండ్ కంపెనీ’లో పనిచేసి భారత్‌కు వచ్చి రాజకీయాల్లో స్థిరపడ్డారు. జయంత్ సిన్హాను బీజేపీ హయాంలో కేంద్రంలో విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తండ్రి యశ్వంత్ సిన్హా కూడా ఘాటుగానే విమర్శించారు. అప్పుడు నేను ‘నాలాయక్’:యశ్వంత్ సిన్హా ‘ఒకప్పుడు నేను మంచి కొడుక్కి మంచి తండ్రిని కాదు (నాలాయక్ బాప్ ఆఫ్ లాయక్ బేటా). ఇప్పుడు మా పాత్రలు తిరగబడ్డాయి. అదే ట్విట్టర్ మహిమ. నా కొడుకు చర్యను నేను ఎప్పటికీ ఆమోదించలేను. నాకు తెలుసు ఇది కూడా మరింత ఛండాలానికి దారితీస్తుంది. అయినా నీవెప్పటికీ గెలవవు’ యశ్వంత్ సిన్హా తన కుమారుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. Earlier I was the Nalayak Baap of a Layak Beta. Now the roles are reversed. That is twitter. I do not approve of my son's action. But I know even this will lead to further abuse. You can never win. — Yashwant Sinha (@YashwantSinha) 7 July 2018 -
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్‌ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎయిర్ ఇండియాలో వాటా విక్రయిస్తాం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక వాటా విక్రయానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఒక ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాలో తాము ఆఫర్ చేసిన 76 శాతం వాటా విక్రయానికి ఏ కంపెనీ కూడా స్పందించకపోవడంతో ఈ వాటా విక్రయాన్ని ప్రసుత్తం పక్కకు పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరైనది కాదనే భావనతో ఎయిర్ ఇండియా వాటా విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపేశామని మంగళవారమే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. విదేశీ రూట్లలో ’మహారాజా’ సీట్లు: మరింత మంది ప్రయాణికులను ఆకర్షించే దిశగా అంతర్జాతీయ రూట్లలో నడిపే ఎయిరిండియా ఫ్లయిట్స్‌లోని బిజినెస్ తరగతిలో ’మహారాజా’ సీట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాం, కొంగొత్త వంటకాలు మొదలైన హంగులను ప్రవేశపెట్టనున్నట్లు జయంత్ సిన్హా తెలిపారు. సుదీర్ఘ, స్వల్ప దూరాల ప్రయాణాలకు ఉపయోగించే బోయింగ్ 777, 787 విమానాల్లో ప్రస్తుతమున్న ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ సీట్లను ఈ మేరకు మార్చనున్నట్లు వివరించారు. -
మహారాజాను బికారీ చేశారు!
రాంచీ: యూపీఏ సర్కారు ‘మహారాజా’ (ఎయిరిండియా)ను బికారీ (బిచ్చగాడి)గా మార్చిందని పౌర విమానయాన మంత్రి జయంత్ సిన్హా విమర్శించారు. మహారాజాకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ఎయిరిండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందన్నారు. ఎయిరిండియాను మళ్లీ లాభాల బాట పట్టిస్తామన్నారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను విక్రయిస్తామని తెలిపారు. ఎయిరిండియా సంస్థకు ‘మహారాజా’ లోగో ఉన్న సంగతి తెలిసిందే. ఇకనుంచి ఈ సంస్థ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుందని అన్నారు. అయితే సంస్థ ఉద్యోగులే పెద్ద మొత్తంలో వాటాలను సొంతం చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సంస్థ పురోగతి మరింత వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన వివేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. ‘మీ తండ్రి యశ్వంత్ సిన్హా బుధవారం బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలిశారు కదా.. దాని పై మీ స్పందన? అని విలేకరులు అడగ్గా.. అది పూర్తిగా ఆయన సొంత వ్యవహారం. అయినా రాజకీయల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం అని బదులిచ్చారు. -
‘ఆటో కంటే విమానయానమే చౌక’
ఇండోర్: దేశంలో ఆటోల కంటే విమానాల్లో ప్రయాణమే చౌకగా మారిందని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇండోర్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శనివారం నాడిక్కడ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సిన్హా మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్‌లో విమానాల్లో ప్రయాణం ఆటో రిక్షాల కంటే చౌకగా మారింది. కొందరు వ్యక్తులు నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటారు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఈ రోజుల్లో ఇండోర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే కిలోమీటర్‌కు రూ.5 వరకూ అవుతోంది. అదే ఆటోలో వెళ్లాలంటే కి.మీకు రూ.8–10 ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని సిన్హా తెలిపారు. -
ట్రాఫిక్ చిక్కులకు డ్రోన్లతో చెక్!
ముంబై: ప్రయాణికుల్ని తరలించే డ్రోన్ల తయారీతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ను తగ్గించవచ్చని కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్లకు సంబంధించి అధునాతన పరికరాలను అభివృద్ధి చేయవచ్చని వెల్లడించారు. ఆదివారం ఐఐటీ–బాంబే నిర్వహించిన టెక్‌ఫెస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో డ్రోన్ల తయారీరంగం వేగంగా విస్తరించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే డ్రోన్ల రూపకల్పనపై పలువురు దృష్టి సారించారనీ.. ఈ రంగంలో భారీ వాటా పొందేందుకు మనం కూడా దేశీయంగా ఆ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. సమర్థవంతంగా డ్రోన్లను తయారుచేయగలిగితే వాటి రవాణా వ్యయం ఆటో ప్రయాణానికయ్యే స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. తగిన చర్యలు తీసుకుంటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలుస్తుందని సిన్హా తెలిపారు. -
‘ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ కల్చర్ లేదు’
న్యూఢిల్లీ : ఇంఫాల్ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్ కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్‌ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్‌పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్‌ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్‌పోర్టులో నిలదీశారు. -
ఇక ఆ బుకింగ్‌లకు డిజిటల్ ఐడీ
న్యూఢిల్లీ: విమాన టికెట్ బుకింగ్‌కు ప్రత్యేకమైన డిజిటల్ ఐడిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు ఎయిర్ ట్రావెలర్లు ఆధార్, పాన్ లాంటి ఇతర గుర్తింపుకార్డుల కాపీలను తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే ఇక మీదట విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం డిజిటల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ను పద్ధతిని ప్రవేశ పెట్టేందుకు విమానయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. మరో మూడు నెలల్లో దీన్ని మాండేటరీ చేయనుంది. దీనికోసం ఒక టెక్నికల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్ టికెట్ బుకింగ్ సమయంలో "డిజిటల్ ప్రత్యేక గుర్తింపు" అవసరాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), పాప్‌పోర్ట్ నంబర్ లాంటి ఇతర అనలాగ్ యూనిక్ ఐడీ ఉన్నప్పటికీ ఈ తరహాలోనే ఒక డిజిటల్ ప్రత్యేక గుర్తింపు కోసం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి తగిన సలహాలను అందించడంకోసం డిజిటల్ ట్రావెలర్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 30 రోజులలో తన రిపోర్ట్ సమర్పించమని కోరినట్టు చెప్పారు. అనంతరం ఇతర పరిశ్రమ వాటాదారుల సలహాలను కూడా ఆహ్వానించనున్నట్టు సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందనీ, ప్రయాణీకుల భద్రత, సౌకర్యం గోప్యతల ఆధారంగా విస్తృతమైన సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పథకంలో ఆధార్ తప్పనిసరి కాదు. కానీ ఇతర డిజిటల్ గుర్తింపు ఒక ఆప్షన్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు. అయితే ప్రయాణీకులు కోరుకుంటే ఇప్పటికీ బోర్డింగ్ పాస్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. Air travellers already require analog unique ID. A digital unique ID such as Aadhar, PAN, passport number, etc. is now proposed 2/2 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017 Chaired a discussion on #DigiYatra with industry stakeholders and asked them to submit recommendations in 30 days. pic.twitter.com/snq3omLX83 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017 -
ఇక్కడే విమాన చార్జీలు చౌక
⇒ ఈ రంగంలో పోటీవల్లే: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ⇒ ఇంధన ధరలు, పన్నులు ఎక్కువే న్యూఢిల్లీ: విమాన చార్జీలు చౌకగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. విమానాలతో పాటు ఇంధనం ధరలు, పన్నులు కూడా అధికంగా ఉన్నప్పటికీ, అత్యంత పోటీ ధరలున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ఆయన తెలియజేశారు. విమానయానం మరింత చౌకగా ఉండేందుకు, సర్వీసులు లేని విమానాశ్రయాల అనుసంధానత కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అనుసంధానత స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు. ఈ ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్‌లో భాగంగా గంట విమాన ప్రయాణానికి రూ.2,500 పరిమితిని విధించామని చెప్పారాయన. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
అనారోగ్యంతో ఉన్న ఒక ప్రయాణికురాలి కోసం తన సీటును కేంద్ర మంత్రి జయంత్ సిన్హా త్యాగం చేశారు. దాంతో ఎంతగానో ఆనందపడిన ఆమె కూతురు.. 'అచ్ఛేదిన్' అంటే ఇవేనంటూ ట్వీట్ చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. బెంగళూరు నుంచి రాంచీ వెళ్లే ఇండిగో విమానంలో శ్రేయా ప్రదీప్ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే శ్రేయా తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె కాళ్లు చాపుకుని పడుకోవాల్సి వచ్చింది. కానీ, వాళ్లు ప్రయాణించేది ఎకానమీ క్లాస్‌లో కావడంతో అది సాధ్యం కాలేదు. అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. విషయం తెలిసిన ఆయన.. తమ రెండు సీట్లను తల్లీ కూతుళ్లకు ఇచ్చి, తాను భార్యతో సహా ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లారు. దాంతో శ్రేయా తల్లికి కాస్త ఊరట లభించింది. ఈ విషయాన్ని శ్రేయాప్రదీప్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పోస్టును 3,000 మంది రీట్వీట్ చేయగా, 2,900 మంది లైక్ చేశారు. మంత్రి జయంత్ సిన్హాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను కూడా ఆమె ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఆమె ట్విట్టర్ ఖాతా మోతెక్కిపోతూనే ఉంది. పలువురు ఆమెను, మంత్రి జయంత్ సిన్హాను, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విషయం తెలియగానే స్పందించి, సమస్యలను పరిష్కరించడంలో ముందున్నందుకు జయంత్ సిన్హా కూడా మరికొందరు మంత్రులతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందంజలో ఉన్నారు. పెళ్లి గురించిన సలహాల దగ్గర్నుంచి అత్యవసరంగా రైల్లో తమ పిల్లలకు డైపర్లు కావాలని కూడా వాళ్లకు జనాలు ట్వీట్ చేస్తున్నారు. మరోవ్యక్తి తన ఖరీదైన కారు రోడ్డు మధ్యలో ఆగిపోయిందని.. ఆ కంపెనీవాళ్లు సరిగా స్పందించడం లేదని సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. @jayantsinha @IndiGo6E Ache din is wen Aviation Minister gives his 1st class seat 2 me n my ill mother, sits in d eco class himself Thnx Sir pic.twitter.com/A8Ys7hJ8Wa — SHREYA PRADIP (@ShreyaPradip) 6 November 2016 -
ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం
న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్‌ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
ఎయిర్ పోర్టులో మంత్రి ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నిన్నటికినిన్న సమాచార శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉద్యోగుల ఆలస్యంపై మండపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో పౌరవిమాయనయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్(టెర్మినల్1) కు వెళ్లిన మంత్రి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. గతవారం ఇదే టెర్మినల్ లో ఎయిర్ కండీషనర్ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతను అనుభవించిన సంఘటన దృష్యా ఏసీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జులై 5 నాటి పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయానానికి మారిన జశ్వంత్ సిన్హా.. గత వారం దేశీ విమాన సేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. -
మరింత బ్లాక్‌మనీ బయటికొస్తుంది
♦ వేగంగా దర్యాప్తు నిర్వహిస్తాం: జయంత్ సిన్హా ♦ నల్లధనం వెల్లడిపై నేడు వివిధ వర్గాలతో జైట్లీ భేటీ న్యూఢిల్లీ: విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు పనామా పత్రాలతో సహా వివిధ మార్గాల్లో తెలిసిన సమాచారం ఆధారంగా వేగవంతమైన దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని నల్లధనం కలుగుల సమాచారం బయటకు వస్తుందని చెప్పారాయన. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా ఈ అంశంపై మాట్లాడుతూ... ‘‘హెచ్ఎస్బీసీ, ఐసీఐజే పత్రాల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా విదేశీ బ్యాంకుల్లో దాచి ఉంచిన రూ.13వేల కోట్ల రూపాయల నల్లధనం వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరించింది. ఇక దేశీయంగా దాచి పెట్టుకున్న నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ తర్వాత జరిమానాలు విధిస్తాం’’ అని చెప్పారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. ఇదే చివరి అవకాశమని, దీన్ని కోల్పోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. ⇒ బ్రెగ్జిత్తో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు: బ్రెగ్జిట్‌పై ఓ ప్రశ్నకు సిన్హా స్పందిస్తూ... ‘‘ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి రెండు మూడేళ్ల సమయం పడుతుంది. తగిన సర్దుబాటు చేసుకునేందుకు, మార్పులను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఉంది’’ అన్నారు. మరోవైపు, దేశీయంగా దాగి ఉన్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై (ఐడీఎస్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వివిధ వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏ), ఇతర వృత్తి నిపుణులతో సమావేశమవుతారు. నిబంధనల గురించి వారికున్న సందేహాలు తీరుస్తారు. ⇒ సెప్టెంబర్ 30 వరకూ అవకాశం: స్వచ్చందంగా నల్లధనం వివరాలు వెల్లడించేందుకు వీలుగా ‘ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) 2016’ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టింది. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇందులో భాగంగా తమ రహస్య ఆస్తులు, నిధుల వివరాలు స్వచ్చందంగా వెల్లడించి వాటి మొత్తం విలువపై పన్ను, జరిమానా రూపంలో 45 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలకూ ఐడీఎస్.. పాన్ తప్పనిసరి నల్లధనం వెల్లడికి ప్రభుత్వం కల్పించిన ఏకైక అవకాశం ‘ఐడీఎస్’ విషయంలో తలెత్తే పలు సందేహాలకు స్పష్టతనిస్తూ ఆదాయపన్ను శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో 14 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా... తాజాగా మరో 11 సందేహాలకు స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం... స్వచ్చందంగా నల్లధనం గురించి సమాచారం బయటకు వెల్లడించే వారు తమ పాన్ నంబర్ ను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు నిబంధనల మేరకు పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యక్ష పన్నులకు పాన్ నంబర్ ప్రత్యేక గుర్తింపు అని, ప్రయోజనాలు, మినహాయింపులు పొందాలన్నా ఇది తప్పనిసరి అని పేర్కొంది. దేశంలో నివసించే వారితోపాటు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ)లు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, ఐటీ శాఖ ఎవరి విషయంలోనైనా దాడులు నిర్వహించి, సెక్షన్ 153ఏ కింద నోటీసులు జారీ చేస్తే అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. పన్ను వర్తించే ఆదాయ శ్లాబ్‌లో ఉండి రిటర్నులు దాఖలు చేయనందుకు సమన్లు అందుకుని, తదుపరి చర్యల విషయంలో ఎలాంటి నోటీసులు జారీ కాకుండా ఉంటే అటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైనా లేదా పరిమిత బాధ్యతతో కూడిన భాగస్వామ్యం కుదుర్చుకున్నా (ఎల్ఎల్పీ)... విలీనం చేసుకున్న కంపెనీ పేరుమీద లేదా ఎల్ఎల్పీ పేరు మీద అయినా ఆస్తులు వెల్లడించవచ్చు. -
అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్‌కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే... స్థిరత్వం కొనసాగుతుంది పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. - జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి కలిసి వచ్చే అంశమే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్‌కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే. - అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు భవిష్యత్ బాగుంటుంది బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్‌పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు భారత్‌కు చక్కటి మార్కెట్‌ను సృష్టించే అవకాశం ఉంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఎగుమతులకు దెబ్బే... భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య భారత్-బ్రిటన్ బంధం పటిష్టం తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్‌వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ -
మొండిబకాయిల సమస్య ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా ♦ రుణ నాణ్యతా సమీక్షలు తరచూ జరగాలని సూచన ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ఆందోళనకరంగా ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా పేర్కొన్నారు. రుణ నాణ్యతకు సంబంధించిన సమీక్ష (ఏక్యూఆర్)లు ఒక్కసారితో సరిపెట్టకుండా తరచూ జరపాలని సైతం ఆయన సూచించారు. అనుమానాస్పద రుణాలను వెలికితీయడానికి గడచిన డిసెంబర్లో ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు జరిపింది. ఇందుకు సంబంధించి 130 అకౌంట్లను ఖరారు చేసింది. కంపెనీలు పనిచేస్తున్నా లేకున్నా... ఏ పరిస్థితుల్లో ఉన్నా సంబంధిత అకౌంట్లు అన్నింటినీ మొండిబకాయిల జాబితాలో చేర్చాలని రెగ్యులేటర్ సూచించింది. దీనితో భారీగా అదనపు ప్రొవిజన్ కేటాయింపులతో బ్యాంకింగ్ రంగం లాభాలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.70,000 కోట్ల మేర నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ తరహా సమీక్షలు తరచూ చేయాలన్నది తన సూచనని జయంత్ సిన్హా ఇక్కడ మంగళవారం క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎన్పీఏ ఫండ్ ఏర్పాటు కసరత్తు... సమస్య పరిష్కారంపై సిన్హా మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయం ♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయంత్ సిన్హా వ్యాఖ్య బెంగళూరు: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీనం, పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్న ఆయన... తదుపరి బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తుం దన్నారు. చివరకు పోటీపడే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 నుంచి పదే ఉంటాయని అన్నారు. మిగిలినవి ‘డిఫరెన్షియేటెడ్’ (నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే) బ్యాంకులుగా మిగులుతాయని వివరించారు. ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు అవసరమన్నారు. ‘‘ప్రస్తుతం 27 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారం అయిన తర్వాత, కేవలం 8 నుంచి 10 పోటీ పూర్వక బ్యాంకులే ఉంటాయని నేను భావిస్తున్నాను. వీటిలో కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులుగా అవతరించే వీలుంది. మరికొన్ని డిఫెరెన్షియేటెడ్ బ్యాంకులుగా కొనసాగుతాయి’’ అని అన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వం, దాని మిత్రపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లాలో ఆయా ప్రభుత్వాల దిష్టిబొమ్మలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం రోడ్డుపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి టీడీపీ మద్ధతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.