Jerusalem
-
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్‌లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్‌యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్‌లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి!
హమాస్‌ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. Israel claims to have killed Yahya Sinwar in the Gaza StripBut nothing has been confirmed yet, as soon as it is confirmed, we will inform you pic.twitter.com/5xWYZpWJ69— Mustafa Gujjar (@MGujjar94) September 22, 2024అయితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్ కూడా అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్‌కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f— Israel Defense Forces (@IDF) February 13, 2024 #Breaking Reports that Israel is investigating whether Hamas chief Yahya Sinwar was killed in IDF strikes in Gaza. There is no clear intelligence to support the claim. Discussions are taking place as to whether Sinwar's communications have been cut off or he has been ki||ed. pic.twitter.com/Jkif0b9HmH— GLOBAL BREAKING NEWS (@tararnews) September 23, 2024ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యంత పురాతన 'పబ్'..సందర్శకులు మాత్రం దాన్ని..
ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మధుశాల. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఎనిమిది శతాబ్దాల కాలానికి పైగా ఇది పనిచేస్తోంది. ‘ది ఓల్డె ట్రిప్ టు జెరూసలేం’ పేరుతో ఉన్న ఈ పబ్ 1189 సంవత్సరంలో ప్రారంభమైంది. జెరూసలేంపై క్రూసేడ్ కోసం బయలుదేరడానికి ముందు అప్పటి ఇంగ్లండ్ రాజు కింగ్ రిచర్డ్ ది లయన్ హార్ట్, ఆయన సహచరులు ఈ పబ్‌లోనే మందు విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారట! అప్పట్లో ఒక కొండను తొలిచి, ఈ పబ్ భవనాన్ని నిర్మించారు. ఇందులోని గదులు గుహల్లోనే ఉంటాయి. గుహల్లో కూర్చుని పార్టీ చేసుకోవాలనుకునే పర్యాటకులు ఇప్పటికీ ఇక్కడకు పనిగట్టుకుని మరీ వస్తుంటారు. ఈ పబ్‌లో గుహల్లోని బార్లు మాత్రమే కాకుండా, దీనిలో నేల దిగువన సొరంగం కూడా ఉంది. ఈ పబ్ ప్రాంగణంలో చక్కని కోట, లోపలి పురాతన వాతావరణం చూస్తే, మధ్యయుగాల్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. ఇది పబ్ మాత్రమే కాదు, మ్యూజియం కూడా అని ఇక్కడకు వచ్చే పలువురు సందర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కారు! చూస్తే చిన్నసైజు కొండలా..!) -
ఈ మార్పు మంచికేనా?
ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది. రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు. మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్‌ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్ రాయబారి వెల్లడించడం గమనార్హం. ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్‌ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి. నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది. అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన. ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది. పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్‌ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్‌కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం. జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు. -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్‌వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్‌ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు
జెరూసలేం: విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో ప్రయోగాత్మకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇజ్రాయెల్‌లో బెన్నెట్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించింది. రద్దు ప్రతిపాదనను గురువారం పార్లమెంటు ఆమోదించింది. దీంతో నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవి కోల్పోయారు. విదేశాంగ మంత్రి యాయెర్ ల్యాపిడ్ ఎన్నికల వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. 2021 మార్చిలో ఆఖరిసారిగా ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంటుకి నాలుగేళ్లలోనే నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. -
వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్
ఇజ్రాయెల్: బైజాంటైన్ యుగంనాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్‌ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల వైన్‌ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్‌కి దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. (ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) క్రీస్తూ శకం 70లలో జెరుసలేం నాశనమైన తరనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్ కాంప్లెక్స్‌లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్‌ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది. ఈ వైన్‌ని గాజా, అష్కెలోన్ వైన్ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వాకల్లో రెండు వేల ఏళ్లనాటి పర్షియన్ కాలపు వైన్లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు. (చదవండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!) -
2700 నాటి పురాతన టాయిలెట్.. ఎలా ఉందంటే?
జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్రూమ్లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే. చదవండి: Taliban: సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం -
తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల కోడిగుడ్డు లభ్యం
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజులకే చెడిపోతున్న తరుణంలో వేయి సంవత్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భద్రంగా ఉందో కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్బుక్లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొరకడం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పురవాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. -
జెరూసలెంలో తిరిగి తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ ఓపెన్ అయింది. ఇజ్రాయెల్ పోలీసు పర్యవేక్షణలో నేడు 50 మంది యూదు సందర్శకులు టెంపుల్ మౌంట్ ను సందర్శించారు. ఇజ్రాయెల్- గాజాను పాలిస్తున్న హమాస్ సంస్థ మధ్య కాల్పుల విరమణ జరిగిన మూడు రోజుల తర్వాత మొదటి సారిగా వారు టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్లారు. మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య జరిగిన 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్‌లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని ఇరు ప్రాంతాలకు పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యులు శనివారం ఒక ప్రకటనలో ‘హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం ప్రకటించారు. అలాగే, పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది. మే 10న గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ మొదటి సారి దాడి చేయడంతో ఇజ్రాయెల్ రక్షణ చర్యలలో భాగంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఇజ్రాయెల్ లో ఎక్కువ ప్రాణ ఐరన్ డోమ్ అనే క్షిపణి నిరోదక వ్యవస్థ రక్షించింది. చదవండి: రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్ -
జెరూసలేంలో రణరంగం: 20 మంది మృతి
జెరూసలేం: పవిత్ర నగరం జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంగణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్ పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరోవైపు 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు. ఏడుగురు ఇజ్రాయిల్ పౌరులు కూడా గాయాలపాలైనట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాల్లో అల్–అక్సా మసీద్ కూడా ఒకటి. రంజాన్ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనావాసులు వస్తుంటారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తూర్పు జెరూసలేం శివారులోని షేక్ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆగ్రహంతో రగిలిపోతు న్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థనల సందర్భంగా ఇజ్రాయిల్ పోలీసులపై విరుచుకుపడ్డారు. మసీదు బయట గస్తీ కాస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ప్రతిదాడికి దిగా రు. అల్–అక్సా ప్రాంగణం రణరంగాన్ని తలపిం చింది. పాలస్తీనా ప్రజల విషయంలో ఇజ్రాయిల్ తీరును అంతర్జాతీయ సమాజం తప్పుపడుతోంది. విమాన దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు అల్–అక్సా మసీదు కాంపౌండ్ నుంచి ఇజ్రాయిల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గాజాలోని హమాస్ మిలిటెండ్ సంస్థ డిమాండ్ చేసింది. అనంతరం జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు వినిపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లో పేలుడు భారీ పేలుడుతో సోమవారం ఉత్తర గాజా స్ట్రిప్ వణికిపోయింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు ప్రకటించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా వైమానిక దాడులకు దిగామని ఇజ్రాయిల్ తెలిపింది. చదవండి: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి -
ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం
‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రకటించాడు. అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!! ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది. క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది. అది సమాప్తమే... కాని అంతం కాదు... శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది. శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే. ఆరున్నర అడుగుల ప్రభువు యూదుల అత్యున్నత చట్టసభ సన్ హెడ్రిన్లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41). ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్ పేర్కొంది. ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్ టూంబ్’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్ రాబిన్సన్ అనే అమెరికన్ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్ రీసెర్చ్ ఇన్ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్ టూంబ్’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది. ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సువార్త ప్రబోధకులు -
తెరిచిన సూళ్లను మళ్లీ మూసివేస్తున్నారు
జెరూసలెం : ఇజ్రాయెల్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కాగా మే మొదటివారంలోనే ఇజ్రాయిల్‌లో పాఠశాలలు తెరిచారు. అయితే కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న చోట తెరిచిన స్కూళ్లను మళ్లీ మూసేస్తున్నారు. గురువారం ఇజ్రాయిల్‌లోని రెండు ప్రాంతాల్లో మరో 20 స్కూళ్లను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఒకే పాఠశాలలో 301 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారీన పడినట్లు తేలింది. వీరంతా వైరస్ బారిన పడటం వల్ల మరో 13,696 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. (వలస కార్మికులతో క్రైమ్ పెరుగుదల!) కాగా మూసివేసిన పాఠశాలల్లో టెల్ అవీవ్‌లో ప్రాంతం నుంచే రెండు ఉన్నాయి, ఇక్కడి పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు సహా అనేక మంది విద్యార్థులు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారింపబడ్డారు. కాగా సఫేద్ నగరంలోని స్కూల్ సిబ్బందిలో ఒకరితో పాటు వ్యాన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్కూల్లోని దాదాపు 250 మంది విద్యార్థులతో పాటు సిబ్బందిని కూడా హోం క్వారంటైన్‌కు తరలించారు.దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్ధేశంతో పాఠశాలలు తెరవాలని నెల క్రితం అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రెండు నెలల తర్వాత తరగతులు ప్రారంభం కాగా ప్రతీ విద్యార్థితో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరగతి గదుల్లో కఠినమైన పరిశుభ్రత పద్దతులను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు(మే 3న) 60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రమంగా ఆ సంఖ్య ఫుంజుకున్నా క్రమేపీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలను మూసివేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌లో 17,495 కరోనా కేసులు నమోదవ్వగా 291 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2191గా ఉంది. (జూలై నెలాఖరుకు 1.5 లక్షల కేసుల నమోదు) -
దురాక్రమణకు ట్రంప్ వంతపాట
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన రెండేళ్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ప్రయోజనం కలిగించే మరో నిర్ణయం తీసుకున్నారు. వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించి అక్కడ ఇజ్రాయెల్ ఏర్పాటుచేసిన ఆవాసాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణ మైనవేనని గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మంగళవారం ప్రకటించారు. 1978లో వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ నిర్మాణాలు మొదలెట్టినప్పుడు ఆ చర్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతుందని, తక్షణం దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో హెచ్చరించాయి. అప్పట్లో ప్రపంచ ప్రజానీకం అభీష్టాన్ని మన్నించి ఆనాటి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జిమ్మీ కార్టర్ సైతం ఇజ్రాయెల్ చర్య చట్టవిరుద్ధమని ప్రకటించారు. అమె రికా–ఇజ్రాయెల్ దేశాలది జన్మజన్మల బంధం. డెమొక్రాట్ల ఏలుబడిలో ఉన్నా, రిపబ్లికన్లు అధికా రంలో ఉన్నా అది కొనసాగుతూనే ఉంటుంది. కానీ డెమొక్రాట్లతో పోలిస్తే రిపబ్లికన్లు ఇజ్రాయెల్‌తో అంటకాగడం అధికం. కార్టర్ అనంతరం అధికారంలోకొచ్చిన రిపబ్లికన్ రోనాల్డ్ రీగన్ కూడా కార్టర్ నిర్ణయాన్ని సవరించడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ఇజ్రాయెల్ చర్య ‘చట్టవిరుద్ధం’ అనడాన్ని వ్యతిరేకించి అది ‘అక్రమం’ మాత్రమేనని చెప్పారు. 2016లో బరాక్ ఒబామా మరో అడుగు ముందు కేసి ఇజ్రాయెల్ చట్టవిరుద్ధ ఆవాసాలకు స్వస్తి పలకాలని కోరే భద్రతామండలి తీర్మానాన్ని వీటో చేసే సంప్రదాయాన్ని సైతం మార్చారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విధానాన్ని ట్రంప్ అడ్డగోలుగా రద్దు చేశారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో ఉన్న యూదు ఆవాసాలపైనే ఇజ్రాయెల్, పాల స్తీనాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ చట్టవిరుద్ధ ఆవాసాల సమస్య ఆ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు... మొత్తంగా పశ్చిమాసియాలో కల్లోలం రేపుతోంది. ఈ విషయంలో రెండు దేశాలనూ చర్చలకు ఒప్పించి సుస్థిర శాంతి స్థాపించాలన్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మోకా లడ్డుతోంది. రెండేళ్లక్రితం బెంజిమిన్ నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా భూభాగంలోని వివాదాస్పద ఆవాసాలకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. తనకు సార్వభౌమాధికారం లేని ప్రాంతాలపై ఇలా ఇష్టానుసారం చట్టాలు చేయడం తగదని ఎందరు చెప్పినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. ఈ చర్యకు ట్రంప్ లోపాయికారీ మద్దతు ఉన్నదని ఆరో పణలొచ్చినా ఆయన స్పందించలేదు. ఇన్నాళ్ల తర్వాత అమెరికా వైఖరి మారిందంటూ ప్రకటించి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క ఇరు దేశాల మధ్యా సంధి కుదిర్చి, శాంతి స్థాపనకు పాటుపడతామని చెబుతూ వచ్చిన అమెరికా ఇలా ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని భగ్గున మండించే చర్యకు ఎందుకు దిగజారిందన్నది చూడాలి. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడం కోసం ట్రంప్ ఈ ఎత్తు వేశారు. అమెరికాలో ఉన్న యూదు ఓట్లు ఒక్క కలంపోటుతో సొంతం చేసుకోవచ్చునన్నది ఆయన ఎత్తుగడ సారాంశం. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో జరిగిన రెండు వరస ఎన్నికల్లో మెజారిటీ దక్కక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నెతన్యాహును ఏదో మేరకు గట్టెక్కించడానికి ఇది తోడ్పడుతుందన్న అభిప్రాయం ట్రంప్‌కు ఉంది. ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని నెతన్యాహు పాకులాడుతున్నా ఇజ్రాయెల్‌లోని మరో ప్రధాన పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీ ససేమిరా అంటున్నది. మరోపక్క అవినీతి కేసులు నెతన్యాహును వెంటాడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం తన ప్రయత్నం పర్యవసానమేనని చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందాలని నెతన్యాహు చివరి ప్రయత్నం చేస్తున్నారు. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరుసలేం ప్రాంతాలు రెండింటినీ 1967నాటి పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించింది. దాదాపు 7 లక్షలమంది ఇజ్రాయెల్ పౌరులను అక్కడకు తరలించి ఆవా సాలు ఏర్పరుచుకోవడానికి సహకరించింది. అప్పట్లో ఆరురోజులపాటు సాగిన యుద్ధంలో పాల స్తీనాకు చెందిన ఈ రెండు ప్రాంతాలతోపాటు సిరియాలోని గోలన్‌హైట్స్, ఈజిప్టులో భాగంగా ఉన్న సినాయ్ ద్వీపకల్పం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈజిప్టుతో 1979లో ఒప్పందం కుదిరాక సినాయ్‌లో ఏర్పాటు చేసిన 18 ఆవాసాలనూ కూల్చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ నిష్క్ర మించింది. అలాగే గాజాలోని 21 సెటిల్మెంట్లను, వెస్ట్‌బ్యాంక్‌లోని నాలుగింటిని సైతం 2005లో వదులుకుంది. అయితే ఈ ప్రాంతాలను అంతర్జాతీయ అభిశంసనలకు జడిసి, లాంఛనంగా విలీనం చేసుకోలేదు. దురాక్రమించినవాటని ఖాళీ చేయాల్సిందేనని ఐక్యరాజ్యసమితి అనేకసార్లు ఇజ్రా యెల్‌కు తెలియజేసింది. 2004లో అంతర్జాతీయ న్యాయస్థానం సైతం తప్పుబట్టింది. అంతర్జాతీయ వేదికలు తరచు చెప్పే హితవచనాలను తలకెక్కించుకోని ఇజ్రాయెల్, తన దురాక్రమణకు వ్యతి రేకంగా ఉద్యమించిన పాలస్తీనా పౌరులపై బాంబుల వర్షం కురిపించి వందలమంది ఉసురు తీస్తోంది. ‘ఆత్మరక్షణ’ కోసమే ఈ దాడులని దబాయిస్తోంది. వేరొకరి భూభాగాన్ని కబ్జా చేయ డమేకాక... ప్రశ్నించినవారిని, బయటకు పోవాలన్నవారిని పొట్టనబెట్టుకోవడం ఇజ్రాయెల్ అనుస రిస్తున్న రాజనీతి. తమ ప్రాంతాలకు చొచ్చుకొచ్చి సైనికులను మొహరించి, రహదారులు మూసేసి, చెక్‌పోస్టులు ఏర్పరిచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై పాలస్తీనావాసులు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్జాతీయ అభిశంసనల పరంపర కారణంగా ఎంతో కొంత తగ్గి ఉన్న ఇజ్రాయెల్ ట్రంప్ తాజా చర్యతో మరింత పేట్రేగుతుంది. ఇదంతా సహజంగానే ఆ ప్రాంతాన్ని రణరంగంగా మారుస్తుంది. నిస్సహాయ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. తమకంటూ ఒక భూభాగం ఏర్పడి, స్వతంత్ర దేశంగా మనగలగాలన్నది పాలస్తీనీయుల చిరకాల స్వప్నం. ఇజ్రా యెల్‌తో చేతులు కలిపి దానికి భంగం కలిగిస్తున్న అమెరికా చర్యను ప్రపంచ ప్రజానీకం నిరసిం చకమానదు. -
హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది. -
జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్ వాసులు
సాక్షి, ఆర్మూర్ : జెరూసలెం పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇజ్రాయిల్ తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్‌కు చెందిన ఆర్మూర్ వాసులు శనివారం కలిసి తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో తన కొడుకుకు వైఎస్సార్ అని నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి వేటలో తాము ఇజ్రాయిల్ వచ్చినా ప్రతీ ఏటా తమ ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న తీరును జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో అంకాపూర్ తిరుపతిగౌడ్, ప్రశాంత్, కలిగోట్ చరణ్‌గౌడ్ తదితరులున్నారు. -
ఆగస్టు 1న జెరూసలేంకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లోని జరూసలేం పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూవా పర్యటనలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇదివరకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చింది. -
పటాలను చూస్తే భయపడి పోతున్న ఇజ్రాయిల్
-
గాలిపటాలు వస్తాయి.. కాల్చి పడేస్తాయి
జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే భయపడి పోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా పరిగెడుతున్నారు. గాలి పటాలు చక్కగా ఎగరేయాలి గానీ భయపడటం దేనికి? అనుకుంటున్నారా. అవి మామూలు గాలి పటాలు కాదు మరి.. అడవులను, ఊర్లను తగలపెట్టే నిప్పు పటాలు. అసలు సంగతేంటంటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో, మిసైల్లతో, పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ పాలస్తీనాకు ఇప్పుడు వినూత్నంగా గాలి పటాలను రంగంలోకి దింపింది. చిన్న, భారీ సైజులో ఉండే ఈ గాలి పటాల తోకల చివర నిప్పుపెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి ఎగరేసింది. అంతే అలా ఆ గాలి పటాలు అడవులను, ఊర్లను తగుల బెట్టుకుంటూ పోయాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కేవలం గాలి పటాలనే కాదు బెలూన్లను సైతం ఇజ్రాయెల్ దేశంలోకి వదిలింది పాలస్తీనా. వీటి కారణంగా శనివారం ఒక్క రోజే పది చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ఈ దాడులకు ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చిసింది. -
దేశాధ్యక్షుడు ‘చికెన్ డాన్స్’ స్టెప్పులు