kalluru
-
'మేమంతా సిద్ధం' సభతో.. కపట కూటమిలో మొదలైన వణుకు!
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. కపట కూటమి నేతల్లో వణుకుపుట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ఈ బస్సు యాత్రలో మరోసారి పల్లెలను పలుకరిస్తూ.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఈనెల 2న ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చౌడేపల్లి, పుంగనూరు, సదుం, కల్లూరు, పాకాల, ఐరాల, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, గూడూరు మండలాల మీదుగా సాగింది. బస్సు యాత్ర సాగినంత దూరం సీఎం వైఎస్ జగన్‌ని చూసేందుకు జనం బారులు తీరారు. సీఎం బస్సు దిగి వారందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. దామలచెరువుకు ముందే ఉగాది పండుగ వచ్చిందా? అనిపించేలా పండుగ వాతావరణం కనిపించింది. ఆత్మీయ సమావేశం కల్లూరు శివారు ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని భరోసా కల్పించారు. వారి ఆత్మీయతతో సీఎం వైఎస్ జగన్ పులకరించిపోయారు. ఇదిలా ఉంటే.. కల్లూరులో నిర్వహించిన బస్సు యాత్రకు ముస్లింమైనారిటీ మహిళలు పోటెత్తారు. దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేటలో ట్రాంజెండర్స్ సీఎం వైఎస్ జగన్‌కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆశీర్వదించి ముందుకు సాగనంపారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా.. పనులన్నింటినీ పక్కనబెట్టి జననేతను ఒక్కసారి చూసేందుకు పరితపించిపోయారు. ఆయా పార్లమెంట్ పరిధి నుంచి వచ్చిన వారితో సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. పచ్చ కూటమిలో కుదేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించడంతో పచ్చ కూటమి నేతల్లో వణుకు పుట్టింది. చంద్రబాబు వెంకటగిరి, గంగాధరనెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కుప్పంలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు హాజరైన జనం ఒక ఎత్తైతే.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ ఒక్కటే ఒక ఎత్తుగా నిలిచిందని జనం చర్చించుకోవడం కనిపించింది. అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని అనేక మంది టీవీలకు అతుక్కుపోయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన, ప్రసంగాన్ని వినడం విశేషం. మారుమూల గ్రామాల నుంచి మేమంతా సిద్ధం సభలకు తరలిచ్చే జనాన్ని చూసిని జనం, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ‘కూటమి కుదేలవ్వడం ఖాయం’ అని చర్చించుకోవడం గమనార్హం. ఇవి చదవండి: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తొమ్మిదో రోజు షెడ్యూల్ ఇలా.. -
చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించిన తహశీల్దార్.. వీడియో వైరల్
సాక్షి మహబూబాబాద్: ఆయన తహశీల్దార్.. నిత్యం ఆఫీస్‌లో ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. ఎప్పుడూ రెవెన్యూ పని మీదే బిజీగా ఉంటారు. అయితే పనులన్నింటినీ కాసేపు పక్కకుపెట్టి సరదాగా గడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన తహశీల్దార్ నూతన సంవత్సరం వేడుకల్లో డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని బలపాలపల్లి గ్రామం.అయితే అక్కడ జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో స్నేహితులతో కలిసి చిందేశారు. డ్యాన్సర్లకు ధీటుగా స్టెప్పులు వేస్తూ అలరించారు. అచ్చం మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు. ప్రస్తుతం తహశీల్దార్ మంగీలాల్ డ్యాన్స్ చేసిన వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది. చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. -
సోనూసూద్ దాతృత్వం.. ఖమ్మం నుంచి ముంబై రప్పించుకుని..
కల్లూరు రూరల్(ఖమ్మం): మూడు నెలల పసికందు గుండెలో తీవ్ర సమస్య.. వైద్యం చేయించటానికి లక్షల రూపాయలు వెచ్చించలేని నిరుపేద కుటుంబం. ఈ విషయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నటుడు సోనూసూద్ స్పందించారు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలొని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు 2021 జులైలో బాబు పుట్టాడు. మూడు నెలల బాబుకు సాత్విక్ అనే పేరుపెట్టారు. బాబు పట్టుకతోనే గుండెలో సమస్య ఏర్పడింది. హైదరాబాద్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి సాత్విక్ కు గుండెలో తీవ్ర సమస్య ఉందని, ఆపరేషన్ చేయటానికి రూ.6లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. (చదవండి: చెరుకు రసం ఆశ చూపి యువకుడిపై అత్యాచారం) చిన్నారి తండ్రి కంచపోగు కృష్ణ హైదరాబాద్‌లోని ఒక ప్రవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్నారి బాబు వైద్యం కొసం రూ.6లక్షలు లేక తల్లి తండ్రులు తల్లడిల్లి పోతున్నారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి తల్లిదండ్రులు కంచెపోగు కృష్ణ, బిందు ప్రియ, చిన్నారి సాత్విక్ ప్రేమ్‌ను ముంబై పిలిపించుకొని ప్రఖ్యాత వాడియా ఆస్పత్రిలో సాత్విక్‌కు శనివారం అత్యంత కష్టమైన గుండె ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం బాగుందని, తల్లిదండ్రులు కృష్ణ, బిందు తెలిపారు. నిరు పేద చిన్నారి ఆరోగ్య సమస్యను తెలుసుకొని చలించి పోయి, గుండె ఆపరేషన్ చేయించిన నటుడు సోనూసూద్‌కు కల్లూరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం) -
అడవిలోకి నడిచొచ్చిన ‘సంక్షేమం’
సాక్షి, తిరుపతి : అదంతా దట్టమైన అటవీ ప్రాంతం... అక్కడకు వెళ్లాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. సుమారు 12 కి.మీ పైనే నడవాలి. జనావాసాలకు దూరంగా తరతరాలుగా కీకారణ్యంలో గడుపుతున్న నాలుగు ముస్లిం కుటుంబాలకు దాదాపు శతాబ్దం పాటు సర్కారు పథకాలు ఏవీ దరి చేరలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వారు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్నారు. రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ఇళ్లు కూడా ఇస్తుందని చెప్పినా ఎందుకనో ఆగిపోయిందని నిట్టూరుస్తున్నారు. ఇల్లు ఇస్తే తాము కూడా జనావాసాల్లోకి వస్తామని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం కల్లూరు రిజర్వు ఫారెస్టులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శ్రమించి అక్కడకు చేరుకుంది. నాలుగు తరాలుగా అక్కడే.. సుమారు వందేళ్ల క్రితం ముర్తుజాఖాన్ అనే వ్యక్తి చిట్లిగుట్టకు అటవీ ప్రాంతానికి చేరుకుని నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు మల్కీఖాన్ కూడా అక్కడే నివసిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఐదుగురు కుమారులు కూడా అడవితల్లి ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వీరంతా పిల్లలతో కలసి అక్కడ ఉంటున్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో సయ్యద్‌ఖాన్ (16) పాముకాటుకు బలి కాగా మరో నలుగురు చిన్నారులు పాముకాటు, ఫిట్స్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఒకసారి అడవికి నిప్పు అంటుకున్న సమయంలో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. అడవి ఒడిలోనే చిన్నారులు.. చిట్లిగుట్టలో 18 మంది చిన్నారులుండగా వీరెవరూ పాఠశాల ముఖం చూసిన దాఖలాలు లేవు. బడికి పంపాలంటే సుమారు 12 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోవడంతో చిన్నారులు అడవికే పరిమితమయ్యారు. పంటలు, పండ్లతోటలు.. అక్కడ ఉంటున్న నాలుగు కుటుంబాలు రాళ్లు రప్పలు, చెట్లను తొలగించి సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వరి, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు పెంపకం ద్వారా పండ్లు, కాయలను సమీపంలోని కల్లూరులో విక్రయిస్తుంటారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, కల్లూరు: కుటుంబ కలహాల వల్ల మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కల్లూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు (32) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పురుగు మందు తాగి మృతి చెందాడు. వెంకటేశ్వర్లు కులాంతర వివాహం చేసుకుని ఖమ్మంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. శివరాత్రి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కల్లూరు వచ్చారు. బుధవారం రాత్రి వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె మొదటి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం భార్య, భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య సౌజన్య ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. ఆమెను వెంటనే కల్లూరులోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కప్పలబంధం రోడ్ సమీపంలో శ్మశాన వాటిక దగ్గర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వెళ్తున్న హోమ్‌గార్డు గమనించి కొన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. -
బాలుడి కిడ్నాప్.. డ్రామ
-
పిల్లాడి పిట్టకథ..ప్రజల భయాందోళన
కల్లూరు : కల్లూరుకు చెందిన బాలుడి కిడ్నాప్.. కట్టు కథగా తేలింది. కల్లూరు శాంతినగర్‌కు చెందిన గుండ్ర ప్రమోద్(13)ను ఇన్నోవాలో వచ్చిన ముగ్గురు కిడ్నాప్ చేసి ఖమ్మం తీసుకెళ్లారని, తప్పించుకుని బయటపడ్డానని, ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఖమ్మం వాసులు అప్పగించారని ప్రమోద్ చెప్పిన వివరాలతో పత్రికల్లో ఆదివారం వార్త ప్రచురితమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తానే కట్టుకథ అల్లానని ఆ పిల్లాడు పోలీసులతో చెప్పాడు. తానే కల్లూరు నుంచి బస్సు ఎక్కి ఖమ్మం వెళ్లానని చెప్పాడు. కల్లూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్, ఎస్ఐ పవన్‌కుమార్ సమక్షంలో ప్రమోద్ ఇలా చెప్పాడు. ‘‘మా ఇంటి పక్కనున్న బాబాయికి చెందిన న్యూడిల్స్ బండిని కదిలిస్తుండగా, పక్కనున్న స్కూటర్ కింద పడిపోయింది. దాని ట్యాంకులోని పెట్రోల్ కారిపోయింది. బాబాయి అరవడంతో భయపడ్డాను. ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని కల్లూరు మెయిన్ రోడ్డు వద్దకు వెళ్లాను. అప్పుడే ఖమ్మం బస్సు రావడంతో ఎక్కాను. ఖమ్మం బస్టాండులో దిగాను. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళుతుండగా ఎవరో ఆపారు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని కట్టు కథ చెప్పాను. వారు పోలీసులకు అప్పగించారు. ఖమ్మం పోలీసులు మా అమ్మానాన్నను పిలిపించి అప్పగించారు’’. ప్రమోద్, ప్రస్తుతం సత్తుపల్లి మండలం తాళ్ళమడ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సీఐ, ఎస్ మాట్లాడుతూ.. ఇంటి వద్ద బాబాయి అరవడంతో ప్రమోద్ భయపడి కిడ్నాప్ కథ అల్లాడని చెప్పారు. వదంతులు నమ్మొద్దు కల్లూరురూరల్ : గ్రామాలలో కొంతమంది అనవసరంగా వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వాటిని నమ్మవద్దని సత్తుపల్లి రూరల్ సీఐ మడత రమేష్, కల్లూరు ఎస్ఐ డి.పవన్‌కుమార్ కోరారు. ఆదివారం కల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దొంగల ముఠాలు లేవని, కిడ్నాపర్లు లేరని స్పష్టం చేశారు. గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై దాడి చేస్తే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు గ్రామాలలో తిరుగుతుంటారని, వారిపై దాడి చేయడం సరికాదని అన్నారు. దొంగల ముఠాలు, కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కల్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇమ్మడి శాంతాదేవి (47) మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇమ్మడి చిన్న వీరభద్రరావు, శాంతాదేవి దంపతులు ద్విచక్ర వాహనం పై యోగా క్లాసుకు స్థానిక షుగర్ ఫ్యాక్టరీకి వెళుతుండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో అంతకు ముందే మృతి చెందిన గేదె పైకి ద్విచక్ర వాహనాన్ని ఎక్కించడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న శాంతాదేవి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పెనుబల్లి తరలించారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కల్లూరులోని చిన్న వీరభద్రం ఇంటికెళ్లి శాంతాదేవి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
కల్లూరులో పర్యావరణ రైలు
నేడు చివరి ప్రదర్శన పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు వివిధ ప్రదర్శనలతో కూడిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలు శనివారం నుంచి కల్లూరు రైల్వేస్టేషన్లో విడిది చేసి ఉంది. ప్రతి రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ రైలులో సందర్శకులను అనుమతిస్తున్నారు. శని, ఆదివారాల్లో దాదాపు 14 వేల మంది విద్యార్థులు ఈ రైలును సందర్శించారు. సోమవారం (నేడు) ఈ రైలు సందర్శనకు చివరి రోజు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ రైలు కల్లూరులోనే ఉంటుంది. మంగళవారం బెంగళూరు మీదుగా తమిళనాడులో ప్రవేశించనుంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, భూ ఉపరితలంపై వాటి దుష్ర్పభావం, పర్యావరణ పరిరక్షణ.. తదితర అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఇక్కడి గైడ్లు వివరిస్తున్నారు. సైన్స్‌పై విస్తృతంగా అవగాహన పెంచే ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలును చూసొద్దాం రండి.. - గార్లదిన్నె (శింగనమల) సైన్స్‌పై ఆసక్తి పెరిగింది సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎన్నో అంశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రైలును సందర్శించిన తర్వాత నాకు సైన్స్‌పై ఆసక్తి పెరిగింది. పుస్తకాల్లో ఉన్న సమచారాన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన రైలు ఇది. – నుష్రత్, పదో తరగతి, ఇల్లూరు, గార్లదిన్నె మండలం విజ్ఙాన ప్రపంచం ఈ రైలును చూసిన వచ్చిన తర్వాత విజ్ఞాన ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లైంది. రైలంతా విజ్ఞాన, రంగుల ప్రపంచం. విశ్వం.. అందులోని అంశాలు పూర్తిగా తెలుసుకున్నాను. మాటల్లో చెప్పలేను గాని ఈ రైలును చూసి తీరాల్సిందే. – ప్రత్యూష, ఆరో తరగతి, ఎగువపల్లి, గార్లదిన్నె మండలం అవగాహన పెరిగింది ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను. సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలులోని చాలా అంశాలను కళ్లతో చూసిన తర్వాత పుస్తకాల్లో చదువుకున్న అంశాలు బాగా అర్థమయ్యాయి. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. – జిలాన్ బాషా, ఇంటర్, కల్లూరు, గార్లదిన్నె మండలం పర్యావరణంపై అవగాహన పెంచేందుకు పర్యావరణంలో వచ్చే మార్పులు, పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత వంటి అంశాలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు అవగాహన పెంచేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో దోహద పడుతోంది. - విశ్వేశ్వరయ్య, రైల్వే స్టేషన్ మాస్టర్, కల్లూరు ఆర్ఎస్ -
కల్లూరుకు చేరిన పర్యావరణ రైలు
పామిడి : పర్యావరణ అంశాలతో కూడిన ఎగ్జిబిషన్ ట్రైన్ గుల్బర్గా నుంచి శనివారం ఉదయం 9 గంటలకు గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ సందర్భంగా 10 గంటలకు గుంతకల్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుబ్బరాయుడు రిబ్బన్ కట్‌చేసి ట్రైన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. రైల్వే ఫ్యాకల్టీలు ట్రైన్‌లోని పర్యావరణ అంశాలతో కూడిన సైన్స్ ఎగ్జిబిషన్‌పై అవగాహన కల్పించారు. వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై వారు డెమో ఇచ్చారు. రెండురోజులపాటు కల్లూరులో ఈ ట్రైన్ ఎగ్జిబిషన్ ఉంటుందని స్టేషన్ మాస్టర్ రాజేంద్రనాయుడు తెలిపారు. -
పోటా పోటీగా రాతిదూలం పోటీలు
గార్లదిన్నె : మండల పరిధిలోని కల్లూరులో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎగువపల్లి వద్ద రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుపోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 16 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలను వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రదీప్‌రెడ్డి ప్రారంభించారు. పోటీల్లో అనంతపురముకు చెందిన ఆచారి ఎద్దులు మొదటి స్థానంలో, పెద్దవడుగూరుకు చెందిన దస్తగిరి, అనిమిరెడ్డి ఎద్దులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మినారాయణ, బృందావన్ రామాంజనేయులు, కేశవయ్య, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్ర, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చీమల రామక్రిష్ణ, తిరుపాల్, చితంబరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బురదలో గార్దబాల పదక్షణ
-
గార్దబాలతో వచ్చి.. మొక్కులు తీర్చి
- చౌడేశ్వరీదేవి గుడిచుట్టూ బురదలో గార్దబాల పదక్షణ - తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చి జనం కల్లూరు : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు శ్రీచౌడేశ్వరిదేవి ఆలయం చుట్టూ బురదలో గురువారం గార్దబాల ప్రదక్షణ ఆనందోత్సాహాల మధ్య సాగింది. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా గార్దబాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం వద్దకు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన బురదనీటిలో దింపి మూడు ప్రదక్షణలు చేయించారు. నగరంలోని బుధవారపేట, వన్‌టౌన్, సాయిబాబానగర్, పెద్దపడఖానా, కల్లూరు, శరీన్‌నగర్, శ్రీరామనగర్తోపాటు శింగవరం, మునగాలపాడు, తాండ్రపాడు, పంచలింగాల తదితర గ్రామాల రజకులు తమ గార్దబాలతో ప్రదక్షణకు పోటీ పడ్డారు. ప్రదక్షణలు చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. ఏటా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులమంతా పాల్గొంటామని రజక సంఘం నాయకులు ఎల్లప్ప తెలిపారు. ఈ ఏడాది బురదలో తగిన మేరకు నీరు లేకపోవడంతో ఒక ప్రదక్షణతోనే సరిపెట్టుకున్నామన్నారు. బురదలో నీళ్లు పలుచగా ఉంటే 3 నుంచి 5 ప్రదక్షణలు తీయించి సంతోషంగా ఇంటికి వెళ్లే వాళ్లమని తెలిపారు. -
చింతకాయలు తిని ఐదు మేకలు మృతి
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన సీకే రామాంజికి చెందిన ఐదు మేకలు చింతకాయలు తిని శుక్రవారం ఉదయం మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఎప్పటిలాగే మేకలను మేపుకోవడానికి పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం చింతచెట్లలో కాయలు దులిపి కుప్పగా వేశారు. వాటిని మేకలు తిన్నాయి. కాపరులు కూడా వీటిని గమనించలేకపోయారు. అదే రోజు రాత్రి 20 మేకలలో మూడు మృతి చెందాయి. మరో ఐదు మేకల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరో రెండు మేకలు మృతిచెందాయి. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు వైద్యాధికారి ఆస్పత్రికి రాకపోవడంతో రెండు మేకలు చనిపోయాయని బాధితుడు రామాంజి వాపోయారు. డాక్టర్ సకాలంలో వచ్చి ఉంటే ఆ రెండు మేకలు ప్రాణాలతో బయట పడేవన్నారు. రూ.30 వేల దాకా నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు. -
ముగ్గురు నిందితులు అరెస్ట్
కల్లూరు (రూరల్): అరుంధతినగర్‌కు చెందిన చాకలి లింగాల బాలాంజనమ్మతో వ్యభిచారం చేయించేందుకు కుట్ర పన్నిన ముగ్గురిని గురువారం ఉలిందకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు రూరల్ సీఐ నాగరాజు యాదవ్ వివరాల మేరకు .. అరుంధతినగర్‌కు చెందిన మహమ్మద్బీబీ ద్వారా గణేష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సూరి, దేవనకొండ మండలం ప్యాలకుర్తికి చెందిన రాజుకు బాలాంజనమ్మతో పరిచయం ఏర్పడింది. రాజు కోరిక తీర్చితే రెండెకరాల పొలం, రూ.2 లక్షల నగదు, బంగారం ఇస్తానని మహమ్మద్ బీబీ, సూరి ప్రలోభ పెట్టగా బాధితురాలు నిరాకరించింది. ఈ క్రమంలో ఈ నెల 2న బాధితురాలిని హనుమన్న ఆటోలో ఎక్కించుకుని వెళ్తుండగా కల్లూరు మండలం పెద్దటేకూరు ఫ్లైఓవర్ సమీపంలో బోల్తాపడి గాయపడగా స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డోన్‌లో రుణం ఇప్పిస్తానని సూరి ఆటోలో తీసుకెళ్లాడని మార్గమధ్యలో టీ తాగాక స్పృహ కోల్పోయానని ఉలిందకొండ ఎస్ఐ వాగ్మూలం తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గురువారం మహమ్మద్బీబీ, ఆటో డ్రైవర్ సూరి, రాజు, హనుమన్నను అరెస్ట్ చేశారు. సూరి, హనుమన్న ఆటో(ఏపీ 21టీజెడ్ 4967, ఏపీ 21టీడబ్ల్యూ 6958) స్వాధీనం చేసుకున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం
కల్లూరు (ఖమ్మం) : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
కల్లూరులో స్వచ్ఛంద బంద్
రాజకీయాలు ఎన్నికలకే పరిమితం రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుదాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరులో బుధవారం నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటన వరకు కలిపి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భౌగోళిక స్వరూపాన్ని మార్చి చూపించడం వల్లనే శాస్త్రీయత లోపించిందన్నారు. ఇది కాస్త రెండు ప్రాంతాల ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కి.మీ పరిధిలో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉండాలనే నిబంధన ఉన్నా వైరాను ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. కల్లూరు అన్ని మండలాలకు సమానదూరంలో ఉంటుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. దీనిపై జిల్లా మంత్రి తుమ్మల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్యను కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. హేతుబద్ధత గల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించి ప్రభుత్వం కల్లూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్రతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీందర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కాటమనేని వెంకటేశ్వరరావు, కర్నాటి అప్పిరెడ్డి, ఎ. వెంకన్న, గొర్రెపాటి రాధయ్య, గంగుల పుల్లారావు, జాస్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. – బంద్ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు, హోటళ్లు మూసివేశారు. -
నేడు కల్లూరు బంద్
అఖిలపక్ష సమావేశానికి హాజరుకాని నాయకులు బంద్‌కు సహకరించాలని కోరిన జేఏసీ కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. అఖిలపక్షం నాయకులను ఆహ్వానించారు. అధికార పార్టీ నాయకులు సమావేశానికి హాజరుకాలేదు. కేవలం అఖిలపక్షం జేఏసీ చైర్మన్ చారుగుండ్ల అచ్చుతరావు, కొప్పురావూరి ఆంజనేయులు మాత్రమే హాజరయ్యారు. దీంతో బంద్ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఎంపీపీ వలసాల జయలక్ష్మి, జెడ్పీటీసీ లీలావతి, ఆత్మ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, భూక్యా రామూనాయక్, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, వలసాల నర్సింహారావు, ఆత్మ డైరెక్టర్ పుసులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, కల్లూరును రెవెన్యూ డివిజన్ చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఇది ఏర్పాటవుతుందని, బంద్ పిలుపును ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నాయకులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఫోన్లో సమాచారం అందించారు. బంద్‌కు సహకరించాలి.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ల యజమానులు, పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కర్నాటి అప్పిరెడ్డి, గొర్రెపాటి రాధయ్య, కాటమనేని వెంకటేశ్వరరావు, ఏ.వెంకన్న, జాస్తి శ్రీనివాసరావు, దామాల రాజు కోరారు. -
కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. అనేక ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ జిల్లా ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు కూడా వినతిపత్రం అందించారు. వినతి అందించినవారిలో ఆఖిలపక్ష నాయకులు గొర్రెపాటి రాధయ్య, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, జాస్త్రీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, రామలరాజు, అప్పిరెడ్డి, వెంకటేశ్వరరావు, అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. అనేక ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ జిల్లా ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు కూడా వినతిపత్రం అందించారు. వినతి అందించినవారిలో ఆఖిలపక్ష నాయకులు గొర్రెపాటి రాధయ్య, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, జాస్త్రీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, రామలరాజు, అప్పిరెడ్డి, వెంకటేశ్వరరావు, అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేఈ ఆకస్మిక తనిఖీలు
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్టమూర్తి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడం గుర్తించిన ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు ఆలస్యంగా రావద్దంటూ ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. బ్రోకర్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి రానివద్దంటూ కేఈ క్రిష్ణమూర్తి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. -
నేడు కౌన్సెలింగ్‌కు సెలవు
కల్లూరు రూరల్: జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రెండు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 209 మంది విద్యార్థులు హాజరైనట్లు కో ఆర్డినేటర్ సంజీవరావ్ తెలిపారు. బి.తాండ్రపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 101 మంది, రాయలసీమ యూనివర్సిటీలో 108 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ వై.విజయభాస్కర్, సంజీవరావ్ పేర్కొన్నారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాలలో 90001 నుంచి 97వేలు, ఆర్‌యూలో 97,001 నుంచి 1,05,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు 111 మంది హాజరు నూనెపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 111 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం 75,001 నుంచి 90వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు క్యాంప్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. 11 మంది ఎస్సీ, 100 మంది ఓసీ, బీసీ అభ్యర్థులు హాజరైనట్లు ఆయన చెప్పారు. శనివారం 90,001 నుంచి 1,05,000 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు కూడా రావచ్చన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కౌన్సెలింగ్‌కు జరగదన్నారు. క్యాంపులో సిస్టమ్ అధికారులుగా మంజునాథ్, సుబ్బరాయుడు, అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి, లలిత, రఘునాథ్ రెడ్డి, చీఫ్ వెరిఫికేషన్ అధికారిగా కృష్ణమూర్తి, వెంకట్రావు వ్యవహరించారు. 17 నుంచి వెబ్ కౌన్సెలింగ్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి తెలిపారు. వెబ్ ఆప్షన్ల తర్వాత 26, 27 తేదీల్లో సవరణ ఉంటుందని చెప్పారు. అయితే తెలంగాణాలో ఈనెల 19న సర్వే నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్ ఉండదని ఆయన చెప్పారు. -
సాగర్ రెండో జోన్‌కు సాగునీరు సరఫరా చేయాలి
కల్లూరు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రెండో జోన్ పరిధిలోని ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సీజన్‌కు సత్వరమే సాగునీరందించాలని కల్లూరు డివిజన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీమన్నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లూరులో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వ మొదటి జోన్ పరిధిలో సాగర్ ఆయకట్టు భూములు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, అదే క్రమంలో రెండో జోన్‌కు కూడా సత్వరమే సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే రైతులు సరైన వర్షాలు లేక నష్టపోయారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లో పుష్కలంగా వరద నీరు చేరి నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో అధికారులు తగిన విధంగా నిర్ణయం తీసుకుని షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15 నుంచి రెండో జోన్‌కు సాగునీరు విడుదల చేయాలని కోరారు. సాగు నీటి విడుదల విషయంలో టేకులపల్లి సర్కిల్ ఎస్ఈ అప్పలనాయడు రెండో జోన్‌కు సాగునీరు విడుదల చేసే విషయమై ఈనెల 15 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో మొదటి జోన్ ఆయకట్టు రైతులకు నీటి పంపిణీ విషయంలో ఏ విధంగైతే వాటా హక్కు ఉందో ఆదే ధామాషా ప్రకారం రెండో జోన్ ఆయకట్టు రైతులకు నీటి సరఫరా విషయంలో వాటా హక్కు ఉందని పేర్కొన్నారు. రైతులు రెండో జోన్ పరిధిలో సాగర్ జలాలు వస్తాయనే ఆశతో వరిసాగుకు వేలాది ఎకరాల్లో నార్లు ముమ్మరంగా పోసి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుతం, ఎన్ఎస్పీ అధికారులు స్పందించి రెండో జోన్‌కు నీటిని విడుదల చేయాలని కోరారు. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా సోమవారం కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్‌లో ట్రేడ్‌మెన్ అభ్యర్థుల ఎంపికకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నిపుణతను పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా లేదా అనేది పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరవగా వీరికి జులై 27వ తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కల్నల్ జాఫ్రి తెలియజేశారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మెన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అయితే ఈనెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ఇది ముగుస్తుందన్నారు. -
జననేతను ముఖ్యమంత్రి చేద్దాం
వైఎస్సార్సీపీతో అభివృద్ధి సాధ్యం చంద్రబాబు పాలనను కోరుకోవద్దు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి షర్మిల రోడ్‌షోలో గౌరు వెంకటరెడ్డి కల్లూరు, న్యూస్‌లైన్: జననేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చెన్నమ్మ సర్కిల్ వద్ద సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించారు. ఈ సదర్భంగా గౌరు వెంకటరెడ్డితోపాటు ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రసంగించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమైందన్నారు. ఆ మహానేత ఆశయాలను సాధించేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కరువు విలయతాండవం చేసిందని గుర్తుచేశారు. వ్యవసాయం దండగన్న బాబు.. ఎన్నికల సమయంలో రైతులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనను మళ్లీ కోరుకోవద్దని సూచించారు. ఎంపీ ఎస్పీ వై రెడ్డి మాట్లాడుతూ... రైతుల గురించి టీడీపీ అధినేత ఏనాడు పట్టించుకోలేదన్నారు. అన్నదాతల సంక్షేమం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పగటి పూట ఏడు గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని, అలాగే ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు అవుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మార్చివేస్తారని గౌరు చరితారెడ్డి అన్నారు. అమ్మ ఒడి పథకం, డ్వాక్రా రుణాల మాఫీ.. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వివరించారు. వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ చంద్రకళాదరరెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.