Kaloji
-
పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్‌లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో బీడీఎస్‌లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది. -
చిరస్మరణీయుడు కాళోజీ
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ సమ్మెలో కూర్చునేవారు
సాక్షి, హన్మకొండ: కాళోజీ సోదరులు ప్రజాస్వామిక విలువలకు దర్పణం వంటివారని కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు డాక్టర్ కాత్యాయనీవిద్మహే అన్నారు. ప్రజాస్వామ్య భావన ఇద్దరిలోనూ సామాన్య లక్షణమని, ఈరోజు కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మెలో కూర్చోవడమే కాకుండా మనల్ని కూడా పాల్గొనమని చెప్పేవారని పేర్కొన్నారు. కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యాన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బుధవారం రాత్రి కాళోజీ యాదిసభ, కాళోజీ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమంలో కాత్యాయనీ విద్మహే మాట్లాడారు. ఆధీకృత హింస రాజ్యమేలుతుంటే ప్రతిహింస తప్పెలా అవుతుందని కాళోజీ ప్రశ్నించారని, వర్తమాన పరిస్థితులలో ప్రతిరోజూ ఆయన గుర్తుకు వస్తుంటారని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాలను గౌరవించడమని, కవులు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పారని గుర్తు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవారని, తాను నక్సలైట్ కానప్పటికీ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు. కుటుంబ విలువలు, సోదర ప్రేమకు చిహ్నంగా నిలిచిన కాళోజీ సోదరులు ఒకే కొమ్మకు రెండు రెమ్మల వంటి వారన్నారు. వేణు సంకోజు ఇప్పటికీ నిజాయితీ, హృదయం గల కవిగా నిరూపించుకున్నారని.. అందుకే కాళోజీ అవార్డును ఇచ్చి గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రముఖ కవి, సుప్రసిద్ధ సాహితీవేత్త వేణు సంకోజు, విజయలక్ష్మి దంపతులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి రామాచంద్రమౌళి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం
సాక్షి, నల్లగొండ: సాహితీసేవకుడు.. వేణు సంకోజుకు ప్రతిష్టాత్మకమైన కాళోజీ–2019 సాహితీ పురస్కారం వరించింది. ఆయన బుధవారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన వేణు సంకోజు 5 దశాబ్దాలుగా అనేక కవితలు, రచనలతో సాహితీ సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జనర్నలిజంలో పీజీడీ సాధించారు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు సాగిస్తున్నారు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన రచనలు 1995లో మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఆవిష్కరించడం విశేషం. 2001లో మలి కవితా సంపుటి మనం, 2008లో నేల కల, ప్రాణ ప్రదమైన కవితా సంపుటిలను ప్రచురించారు. 2008లో స్పర్ష కథల సంపుటి, ఇదే సంవత్సరం తెలుగులో కథా సాహిత్య పరిశోధనకు గాను ఎంఫిల్ పట్టాను పొందారు. విద్యార్థినుల రచనలతో చలనం అనే ఒక ప్రయోగాత్మక సంపుటిని, ప్రతిజ్ఞ అనే శ్రీశ్రీ సాహిత్య విశేష సంచికను ప్రచురించారు. ఉద్యమాల్లోనూ..కీలకపాత్ర 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కీలక సంబంధాలను కలిగి ఉండి అనేక ప్రసంగాలు, కవితా పఠనాలు, పత్ర సమర్పణలు చేశారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించి 2007 వరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2005 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పౌర శాస్త్ర పాఠ్యప్రణాళికా సభ్యునిగా, రచయితగా భూమిక నిర్వహించారు. ఇదే సంవత్సరం సుద్దాల హనుమంతు మోనోగ్రాఫ్ నిర్మాణంలో తెలుగు అకాడమీలో కీలకపాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జేఏసీలో కీలకబాధ్యతలు నిర్వర్తించారు. పురస్కారాలు 2001లో మనం అనే కవితా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందజేసింది. 2014లో తెలంగాణ అమెరికా ఎన్నారైల సంఘం వారు సాహితీ సేవ పురస్కారాన్ని అందజేశారు. 2002లో రామన్నపేట కాళోజీ కళావేదిక పురస్కారం, 2004లో చౌటుప్పల్ అక్షర భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం, 2006లో భువనగిరిలో ప్రజాభారతి పురస్కారం, 2012లో నెలవంక– నెమలీక సాహిత్య మాస పత్రిక వారి వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2012లో స్థానిక తేజస్విని సంస్థ పక్షాన జీవన సాఫల్య పురస్కారం, 2014లో ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారం , కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం, 2018లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. కాళోజీ స్మారక పురస్కారం గర్వకారణం కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం రావడం గర్వంగా ఉంది. నాకు ఆయనతో ఎనలేని అనుబంధం ఉంది. 1995లో నేను రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. నాకు అందిన సాహితీ సా హిత్య పురస్కారాలన్నింటిలో ఇది ఎంతో ఆ త్మీయమైనదిగా భావిసు ్తన్నా. ఆయన ఉద్యమాలు, ఆయన రచనల ద్వా రా నేను ఇప్పటికే స్ఫూ ర్తిని పొందుతుంటాను. నేటి తరం కవులకు, రచయితలకు కాళోజీ నారాయణరావు ఆదర్శనీయులు. – వేణు సంకోజు -
కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరీక్షలో గందరగోళం
సాక్షి, వరంగల్: కాళోజి హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల రాసిన పరీక్షను రద్దు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే. సోమవారం నుంచి యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే నేడు ఉదయం విద్యార్థులు ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహించారు. తీరా ఎగ్జామ్ పూర్తయిన కొద్దిసేపటికి పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ నుంచి విద్యార్థుల ఫోన్లకు అధికారులు సందేశాలు పంపించారు. మరోసారి షెడ్యూల్ ఖరారు చేసి పరీక్ష నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఆ సందేశంలో పేర్కొన్నారు. పరీక్ష జరిగిన రెండు సెంటర్లలో ఒక కోడ్‌కు బదులు.. మరో కోడ్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి పరీక్ష నిర్వహించనందువల్ల.. పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాసిన పరీక్ష రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటు అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలంటే ఇంత నిర్లక్ష్యమా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది తీరును తప్పుబట్టిన విద్యార్థులు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
గమనం, గమ్యం రెండూ ప్రజల పక్షమే
అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు – అన్న కాళోజీ గౌరవాధ్యక్షుడిగా అంకురించిన సంస్థ తెలంగాణ రచయితల వేదిక (తెరవే). 2001లో పుట్టిన నాటి నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా కవులు రచయితలూ కళాకారుల్ని తెరవే కూడగట్టింది. చరి త్రలో తెలంగాణా రచయితది ఎప్పటికీ ప్రతిఘటన స్వరమే అని నిరూపించింది. మలిదశ ప్రత్యేక రాష్ట్రో ద్యమంలో ధిక్కారానికి నిలువెత్తు రూపమై నిలబడింది. తెలంగాణా ప్రజల ఆకాంక్షల్ని వినిపించే గొంతుక అయ్యింది. తెరవే నడిపిన ‘సోయి’ పత్రిక తెలంగాణ సోయిని ఊరూ వాడా ప్రచారం చేసి అన్నివిధాలా ఉద్యమ వేదికగా మారింది. ఉమ్మడిపాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణా చరిత్రని తవ్వి తీసే పనికి సైతం తెరవే స్వచ్చందంగా పూనుకొంది. సొంత రాష్ట్రం సొంత ప్రభుత్వం యేర్పడ్డాక సైతం తెలంగాణా రచయితల వేదిక తన చారిత్రిక కర్తవ్యాన్ని విస్మరించలేదు. ప్రజల కలల్ని పాలకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయ లేదు. ప్రతి సామాజిక సమస్యకూ ప్రతిస్పందించింది. పాలకులకు దిశా నిర్దేశం చేసింది. ప్రజావసరాల దృష్ట్యా తెరవే సాహిత్య సాంస్కృతిక విధానాలనే కాదు రాజకీయ విధానాల్ని కూడా తెలియజెప్పింది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి సందర్భం లోనూ నిర్మొహమాటంగా ఖండించింది. కానీ ఈ నాలుగేళ్లలో తెలంగాణ బుద్ధిజీవుల సమాజం రెండుగా విడిపోయింది. తెలంగాణా రాష్ట్రోద్యమంలో అన్నిటికీ తెగించి ముందు నిలబడ్డ రచయితలు, కళాకారులు సైతం రాష్ట్రం రాగానే యిక చేయాల్సిందేం లేదని మౌనాన్ని ఆశ్రయించారు. ఉద్యమ కాలంలో యిచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత టైమివ్వాలని కొందరు ప్రజా సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి కిమ్మనకుండా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళని అసంతృప్తవాదులుగా అభివృద్ధి నిరోధకులుగా స్టాంప్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అవార్డులు, సన్మానాలు, సత్కారాల కోసం పాలకుల ముంగిట క్యూ కడుతున్నారు. కొందరు అందివచ్చిన పదవుల్లో సుఖాసీనులై గతాన్ని మర్చిపోయారు. నాగేటి చాళ్ళలో సాయుధమైన పాట ఫామ్ హౌస్‌లో పాలకుల కటాక్షం కోసం పడిగాపులు కాస్తోంది. గడీలను కూల్చిన కవిత చరి త్రని నమోదు చేసే పేరుతో గడీల ఘనతని కీర్తిస్తోంది. ఇలా కవులూ కళాకారులూ ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి చెట్టుకొకరూ పుట్టకొకరూ చెదిరిపోతే తెరవే ఒంటరి పోరాటం చేస్తూ చెట్టుకిందే కవిత్వం వినిపించింది. బాట పొంటే పాటని ఎత్తుకొంది. ఎందరో కొత్త రచయితల పుస్తకాలను ప్రచురించి, ఆవిష్కరించి వారికి దన్నుగా నిలబడి మార్గ దర్శనం చేసింది. కలబుర్గి, గౌరీ లంకేశ్ దుర్మరణం పాలైనప్పుడు కలసి వచ్చిన ప్రజా సంఘాలతో తీవ్రంగా నిరసన తెలియజేసింది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో రచయితలపై, మేధావులపై అమలయ్యే అణచివేతలకు వ్యతిరేకంగా భావప్రకటన స్వేచ్ఛ కోసం ప్రజాస్వామిక హక్కులకోసం గొంతెత్తి సాయిబాబా అక్రమ అరెస్టుని, ఐలయ్యపై దాడుల్నీ, వరవరరావుపై కుట్ర కేసుల్నీ నిర్ద్వంద్వంగా ఖండించింది.ఒక సాహిత్య సంస్థగా తెరవే తనకు పరిమితులు విధించుకోలేదు. ధూళికట్ట స్థూపం, రామప్ప దేవాలయం మొదలైన చారిత్రిక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేసింది. అక్రమ క్వారీల కారణంగా విధ్వాంసమవుతున్న పర్యావరణం గురించి హెచ్చరించింది. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిన తెలంగాణా వనరుల దోపిడీని ఒక రచయితల వేదిక తన ఆచరణలో భాగం చేసుకోవడం గమనిస్తే తెరవే కార్యక్రమాల విస్తృతి అర్థమౌతుంది. తెలంగాణా భాష విశిష్టతల గురించి అధ్యయనం చేయడానికి తొలిసారిగా భాషావేత్తలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణా భాష రూపురేఖల్ని నిర్వచించి అది ప్రత్యేక భాష అని నిరూపించడానికి పూనుకున్న ఘనత తెరవేదే. తెలంగాణా పరివ్యాప్తంగా వున్న సమస్త కళాసంపదనీ కాపాడడానికి తెరవే పూనుకొంది. చెంచు పెంటల్లో మందులు పంపిణీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పాదయాత్రలో అగ్రభాగాన నడిచింది. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల సంస్మరణకు డిమాండ్ చేసింది. ప్రజల జీవన ఆకాం క్షలు నెరవేరాలని కవులూ రచయితలూ కళాకారులూ బుద్ధిజీవులూ కోరుకోవాలి. ఎందరో అమరులు ప్రాణాలు సాకపోసి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి కాకుండా కాపాడుకోవడమే ప్రజల ముందున్నా కర్తవ్యం. దాన్ని కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ ప్రేమగా తలకెత్తుకోవాలని తెరవే రాష్ట్ర సభల్లో మరోసారి తీర్మానించుకుందాం. (రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెరవే మహాసభల సందర్భంగా) ఎ.కె.ప్రభాకర్ వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు -
నా ముఖం చూసి చెప్పు
శారీరకంగా చాలా బలహీనంగా కనపడే కాళోజీ అతి ధైర్యశాలి. ఆ ధైర్యం కూడా అతనిలో గల ఆర్ద్ర హృదయ జనితమే. దుర్మార్గాన్నీ అక్రమాన్నీ ఎదురించవలసి వచ్చినప్పుడు వెనుక ముందు ఆలోచించే ఓపిక కాళోజీకి లేదు. 1948లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకానికి వస్తున్నది. వరంగల్ సెంట్రల్ జైలులో మేమంతా ఖైదీలుగా వుంటిమి. అప్పుడు బురుజు మీద ఉన్న ఒక సిపాయి రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్ములందరినీ ఉద్దేశించి ‘‘తుపాకితో వీళ్లను కాల్చి చంపినా పాపం లేదు’’ అని తన అక్కసు వెల్లడించుకొన్నాడు. కాళోజీ, మిగతా మేమంతా ఆ సమయంలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వున్నాము. విన్నాము. తక్షణమే కందిల్(లాంతరు) తీసుకొని బురుజు దాకా పరుగెత్తి, దీపము వానికి చూపి ‘‘ధైర్యముంటే కాల్చవోయ్’’ అని అతనికి సవాలు చేశాడు. వాడెందుకో భయపడి బురుజు దిగి పోయినాడు. నిజంగా మేమంతా చాలా భయపడ్డాము. కాళోజీ చేసిన సాహసం యితరు లెవ్వరూ చేయరు. ఆ సిపాయీ ఉన్మత్తుడై కాల్చి వున్నటై్టతే పరిస్థితి ఏమై వుండేది? ఆ ఆలోచనే కాళోజీ మనస్తత్వానికి విరుద్ధం. ఆ సమయంలో ఆ సిపాయీలో గల దుష్టత్వాన్ని సహించే ఓపిక కాళోజీకి లేదు. కాళోజీ జీవనంలో ఇదే తత్వము ప్రతి సంఘటనలోనూ కనబడుతుంది. (‘కాళోజీ యాదిలో’ భండారు చంద్రమౌళేశ్వరరావు ) -
దాశరథి, కాళోజీలు ఏం చేశారని విగ్రహాలు?
హన్మకొండ చౌరస్తా/కోరుట్ల: దాశరథి, కాళోజీ నారాయణరావు తెలంగాణకు ఏం చేశారని వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రశ్నించారు. మాజీ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ మంగళవారం హన్మకొండలో పబ్లిక్‌గార్డెన్‌లో జరిగింది. ప్రజాగాయకుడు గద్దర్, విమలక్కతో కలసి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 1969లో జరిగిన ఉద్యమంలో సంగంరెడ్డి సత్యనారాయణ చురకైన పాత్ర పోషించార న్నారు. విగ్రహాలు పెట్టాలంటే పోరాట యోధులు కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సత్యనారాయణలవి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న అని.. తాము పులులను పూజించం, ప్రజలను మాత్రమే పూజిస్తామన్నారు. నేడు సీఎం కేసీఆర్ ఆర్య దేవతలను పూ జిస్తున్నారని, బ్రా హ్మణ సంస్కృతిని పెంచి పోషిస్తున్నార న్నారు. సద్దుల బతుకమ్మకు చీరలు ఇవ్వమని మహిళలు అడిగారా? అని ప్రశ్నించిన కంచ ఐలయ్య.. మీరేమో పట్టుచీరలు కట్టుకుని మాకు పీలికలు ఇస్తారా.. అని దుయ్య బట్టారు. మరోసారి చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలను అవమానించాలని చూస్తే సహిం చేది లేదన్నారు. మాదిగలు చెప్పులు, డప్పులు తయారు చేస్తూ పౌరుషంగా బతుకుతారని, మాలలకు కర్రలు తిప్పే దమ్ముందన్నారు. అలాగే, గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్న నారాయణ, చైతన్యలను మూసి వేయించే వరకూ పోరాడుతామన్నారు. ఐలయ్యకు కోరుట్ల కోర్టు సమన్లు హిందూ దేవుళ్లను అవమానించడంతో పాటు ఆర్యవైశ్యులు దొంగ వ్యాపారాలు చేస్తున్నారని కించపరిచే రీతిలో ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’అనే రచన చేసిన కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కోరుట్ల ఆర్యవైశ్య సంఘం నాయకుడు మంచాల జగన్ పదిహేను రోజుల క్రితం కోరుట్ల కోర్టులో అడ్వకేట్ బోయిని సత్యం ద్వారా కంచ ఐలయ్య రచనపై పిటిషన్ వేశారు. విచారించిన కోరుట్ల మున్సిఫ్ కోర్డు జడ్జి ఏ.వెంకటేశ్వరరావు.. కంచ ఐలయ్యను కోరుట్ల కోర్టుకు హాజరు కావాలని కోరుతూ సమన్లు జారీ చేశారు. కాగా, కోర్టు కంచ ఐలయ్యకు కోర్టు సమన్లు జారీ చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక మండల కేంద్రాల్లోనే భూసార పరీక్షలు
జిల్లాకు చేరిన పది పరికరాలు ఏఈఓలకు పూర్తయిన శిక్షణ జిల్లా కేంద్రానికి వెళ్లే బాధ నుంచి రైతులకు విముక్తి కాళోజీ సెంటర్ : రైతన్నల ముంగిట్లోకే ఇక భూసార పరీక్ష కేంద్రాలు రానున్నాయి. దీంతో మట్టి పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే ఇబ్బందులు వారికి తప్పనున్నాయి. అయితే ఇంతకాలం వరకు పరీక్షలపై ఆసక్తి చూపని వారు కూడా తమ మండలంలోనే మట్టి నాణ్యతను తెలుసుకునే అవకాశం ఉండడంతో ముందుకొస్తున్నారు. కాగా, జిల్లాకు ప్రభుత్వం పది పరిశోధన పరికరాలను మంజూరు చేసింది. ఈ మేరకు భూసార పరీక్షల నిర్వహణపై ఏఈఓలకు శిక్షణ కూడా పూర్తయింది. నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు.. సహజంగా చాలా మంది రైతులు తమతోటి వారు ఎలా సాగు పనులు చేస్తే అలాగే ముందుకు సాగుతుంటారు. గత ఏడాది ఏ పం టకు ఎక్కువ ధర పలికిందో చూసుకుని అదే పంటను మరుసటి సారి వేయాలని నిర్ణయించుకుంటారు. తాము పంటలు పండించే నేల స్వభావం ఎలాంటిదో తెలియకున్నా.. ఫర్టిలైజర్ వ్యాపారులు ఇచ్చిన విత్తనాలు, పురుగు మందులు వినియోగించడం పరిపాటిగా వస్తోంది. దీంతో నేలకు కావాల్సిన సారం అందకపోగా.. అవసరం లేని ఎరువులు, పురుగు మందుల వాడకంతో వట్టిపోతున్నాయి. ఫలితంగా వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడి రావడం లేదు. ఈ నేపథ్యంలో మట్టిలోని సాంద్రత దెబ్బ తినకుండా కాపాడేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతులకు కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తోంది. అయితే ఇప్పటివరకు భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాలోనే ఉండడంతో రైతులు వాటిపై పెద్దగా ఆసక్తి చూపిం చడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు తాజాగా 10 భూసార పరీక్షల పరికరాలను మంజూరు చేసింది. అందుబాటులో పది భూసార పరికరాలు.. వరంగల్ రూరల్ జిల్లాలో సుమారు 1.96 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా ఏటా 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పం టలను సాగుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొత్తగా 38 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లను జిల్లాకు కేటాయించగా.. ఇటీవల వారు విధుల్లో చేరారు. ఇందులో భాగంగా వారు భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలి, వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకునేలా అధికారులు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పదిహేను మండలాలు ఉండగా.. పది భూసార పరీక్షల పరికరాలు రావడం, ఏఈఓలు విధుల్లో చేరడంతో దాదాపు జిల్లా రైతులందరి భూముల భూసార పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఏర్పడింది. ఇదే జరిగితే భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏఈఓలు ఇచ్చే సూచనలతో రైతులు తగిన మోతాదులో మందులు వాడుతూ అధిక దిగుబడిలు సాధించి సాగులో విజయం సాధిస్తారు. -
కవిత్వంతో ప్రజల్లో చైతన్యం
గన్‌ఫౌండ్రీ: శాంతియుత పోరాటాలతో ఫలితం రానప్పుడు ప్రజలు హింసాత్మక పంథా ఎంచుకుంటారని తన కవితల ద్వారా చెప్పిన వ్యక్తి కాళోజీ అని విరసం నేత వరవరరావు అన్నారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పారు. సోమవారం నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వరవరరావు కీలక ఉపన్యాసం చేస్తూ కాళోజీ చిన్న నాటి నుంచే ప్రజల తరపున కవిత్వాలు రాసే వారని అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆనందకరమన్నారు. పలుకుబడుల భాషను పూర్తి స్థాయిలో తీసుకువచ్చినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ వర్సిటీలో మరిన్ని ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రవేశపెట్టిన కాళోజీ బంగారు పతకాన్ని బీఏ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ప్రకాశ్ అనే విద్యార్థికి ప్రదానం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహమాన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, నిజాం కళాశాల తెలుగుశాఖ ప్రొఫెసర్లు కాసీం, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆత్మకు ప్రతీక
- ఠాగూర్ మాదిరి కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు: స్పీకర్ - ఆయన రచనలను నోబెల్‌కు ప్రతిపాదించాలి - ఘనంగా కాళోజీ 102వ జయంతి ఉత్సవం - గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆత్మకు ప్రజాకవి కాళోజీ ప్రతీక అని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రవీంద్ర నాథ్ ఠాగూర్‌కు విశ్వకవి బిరుదు ఎలా ఇచ్చారో అలాగే కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు ఇచ్చేలా కాళోజీ ఫౌండేషన్ వారు కృషి చేయాలని సూచించారు. కాళోజీ రచనలను, వ్యక్తిత్వాన్ని, పోరాటాలను, జీవన విధానాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నారు. తెలిపారు. ఎక్కడ అవమానం, అణచివేత ఉంటుందో అక్కడ తాను ఉంటానని కాళోజీ తన రచనల ద్వారా నిరూపించాడని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవం-తెలంగాణ భాషాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడు తూ కాళోజీ పురస్కారానికి గోరటిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కాళోజీ రచనలు విశ్వజనితమైనవని, నోబెల్ పురస్కారానికి ఆయన రచనలు పంపే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలని సూచిం చారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. 1970 నుంచి కాళోజీతో తమకు పరిచయం ఉందన్నారు. ‘‘మాది తాత, మనవడు అనుబంధం. ఏదైనా నచ్చితే నెత్తికి ఎత్తుకోవడం కాళోజీ తత్వం. నచ్చకపోతే మాత్రం చీల్చి చెండాడుతాడు. ఆయన బతికినంత కాలం తెలంగాణ కోసం పరితపించారు. గోరటి వెంకన్న పాట లు మనుషులు ఉన్నంతవరకు సజీవంగా ఉంటాయి’’ అని అన్నారు. కడియం మాట్లాడుతూ.. కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం, సాహిత్య పురస్కారాన్ని ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. వరంగల్‌లో రెండున్నర ఎకరాల్లో రూ.60 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాళోజీ పాటలను సీడీ రూపంలో భావితరాలకు అందించడానికి సాంస్కృతిక శాఖ కృషి చేయాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గోరటి వెంకన్నకు డాక్టరేట్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాళోజీ 102వ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం అదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు ఆరాధ్యుడన్న కాళోజీ తెలుగువారందరికీ ఆదర్శప్రాయుడ న్నారు. కాళోజీది ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వరం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వక్తలు కొనియాడారు. శుక్రవారం టీఎన్జీవో భవన్లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. అన్యాయాన్ని ఎదిరిం చడంలో, అణచివేతను ఎదుర్కోవడం లో కాళోజీ ధైర ్యం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్‌లో ఆయన పేరిట హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, కాళోజీ జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. నా పాట నాన్న భిక్ష: గోరటి కాళోజీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన పాట నాన్న పెట్టిన భిక్ష అని అన్నారు. పురస్కారం అందించిన ప్రభుత్వానికి, సభకు హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. గోరటిని పురస్కారంతో సత్కరించి రూ.1,01,116 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై తన తల్లి ఈరమ్మకు పాదాభివందనం చేశారు. అనంతరం తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వ ర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, కాళోజీ ఫౌండేషన్ నాగిళ్ల రామ శాస్త్రి మాజీ ఎమ్మల్యే నోముల న ర్సింహయ్య, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
అలుపెరగని యోధుడు కాళోజీ
కలెక్టర్ జగన్మోహన్ కలెక్టరేట్లో ఘనంగా కాళోజీ జయంతి ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జగన్మోహన్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాళోజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్వో సంజీవరెడ్డి తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు రావడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, ట్రెజరీ అధికారి షాహిద్ అలీ, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, అసిస్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు. ఆశయ సాధనకు కషి చేయాలి : మంత్రి అల్లోల నిర్మల్‌టౌన్ : కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని రాష్ట్ర దేవాదాయ, గహనిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో శుక్రవారం కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కాళోజీ సేవలను గుర్తు చేశారు. ఇందులో ఆర్డీవో శివలింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీకి ఘన నివాళి
రాంనగర్ : కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. అనంతరం కాళోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా అన్ని జిల్లాలో నిర్వహించుకోవాలని ఆదేశించిందని, అందుకే కాళోజి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కాళోజి తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడని, తాను నమ్మిన సిద్ధాంతంపై చివరి వరకు నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఇక్కడి ప్రజలకు నీరు, నిధులు, నియామకాలు సక్రమంగా అందుతాయని నమ్మిన వ్యక్తి కాళోజి అని, అందుకే తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను మేలుకొల్పారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసి వెంకట్రావు, డీఆర్ఓ రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జన వాగ్గేయ ఝరి..గోరటి
సాక్షి, సిటీబ్యూరో: శ్రమ జీవుల చెమట చుక్క అతడి కలానికి ఇంధనం. కూలీల కష్టమే అతడి అక్షరానికి ఆలంబన. బడుగు జీవుల బతుకు చిత్రాన్ని తన పాటల్లో ఆవిష్కరించి ఎలుగెత్తి చాటే ఎర్రజెండా అతడు. సామాన్యుల వెతల పల్లకీని మోసే ఉద్యమ బోయీ. అతడే ప్రజా కవిగా జగమెరిగిన గోరటి వెంకన్న. మహబూబ్ నగర్ జిల్లా గౌరారం చెక్కిన శిల్పం. ఆకలి, దోపిడీ ఉన్నచోట పాటై పల్లవించే ఈ తెలంగాణ బిడ్డడు నేడు ‘ప్రజా కవి కాళోజీ నారాయణరావు’ సాహితీ పురస్కారం అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే.. ‘మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో ఆదర్శ భావజాలం ఉన్న నరసింహ, ఈరమ్మ దంపతులకు 1965లో ఏప్రిల్ 4న పుట్టాను. టీచర్ కావాలని ఎంఏ తెలుగు సాహిత్యం చదువుకున్నా. అయితే, కో–ఆపరేటివ్ శాఖలో ఉద్యోగిగా మారాను. చిన్నప్పటి నుంచి ప్రజలు పడే కష్టాలను అక్షరబద్ధం చేసి గొంతు విప్పడం, వారి తరఫున పాటై ప్రశ్నించడం అలవాటు. శతకోటి వందనాలు.. నా కవిత్వం, పాటను ఆదరించిన సమాజానికి శతకోటి నమస్కారాలు. ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కార ఎంపిక కమిటీ నాపై చూపిన వాత్సల్యానికి, వారి ప్రతిపాదనను అంగీకరించిన సీఎం కేసీఆర్‌కి వందనాలు. నా ఈ కవిత్వం.. పాట ప్రయాణంలో ప్రతి సందర్భంలో సహరించిన అందరికి వందనాలు. మహాకవి కాళోజీ పేరు మీద పురస్కారం అందుకోవడం మాటల్లో వర్ణించలేను. నా కవిత్వానికి, పాటకు ప్రకృతి తల్లి అందజేస్తున్న మహా కానుకగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నా. కానీ రెండు ముద్దు.. తొలిది 70 ఏళ్లు పైబడిన సాహితీ యోధులకు ఇచ్చే హంస అవార్డును 43 ఏళ్లకే అందుకున్న. అప్పటి సీఎం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నన్ను గుర్తించి, అభిమానంగా పురస్కారం అందించారు. కారణం 1996లో ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాట రాశాను. మొహర్రం పండుగకు గౌరారం వెళ్లా. జనాలే లేరు. బాధేసింది. ఆ బాధను బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో రాశాను. ఆ పాట సమాజంలోని ప్రతి ఒక్కరి గుండెను తాకింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు మహాకవి కాళోజీ పురస్కారం అందిస్తోంది. ఇప్పుడు మళ్లీ అంతే ఆనందంగా అందుకోబోతున్నాను’ అంటూ ముగించారు. -
సకల హంగులతో కాళోజీ కళా కేంద్రం
హన్మకొండ : తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు కృషిచేసిన కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్లకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. హన్మకొండలో జరుగుతున్న కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కాళోజీ కళా కేంద్రం ఆవరణ, హరిత కాకతీయ హోటల్ ఆవరణల్లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్వారం రాములు మాట్లాడారు. కాళోజీ కళా కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంలను సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు. రూ.50 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళా కేంద్రం నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.84.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద రెస్టారెంట్, పార్కింగ్, సోలార్ లైటింగ్ పనులు చేపడతామన్నారు. లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగతా జలపాతం వద్ద పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాట్లు చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగుతాయన్నారు. దీనికి వెళ్లేవారి కోసం తాము టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా బీచ్పల్లి పుష్కరఘాట్‌కు ప్యాకేజీని రూపొందించామన్నారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామేల్, ఏఈ రామకృష్ణ, హరిత కాకతీయ హోటల్ యూనిట్ మేనేజర్ సురేష్,తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొడవే... కాళోజీ ‘నా గొడవ’
కాళోజీ జయంత్యుత్సవంలో కడియం శ్రీహరి {పశ్నించేతత్వాన్ని అందరూ అలవరచుకోవాలి అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం-2015 ప్రదానం హైదరాబాద్: ప్రజల గొడవను తన గొడవగా సమాజంలోని సమస్యలను రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మహావ్యక్తి కాళోజీ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కితాబునిచ్చారు. బుధవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం -2015 ప్రదానం చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ కాళోజీ ఎవరికీ బయపడని ధీరత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. ప్రాంతాల వారీగా మాండలికాలు ఉన్నాయని, తెలంగాణ మాండలికం కూడా భాషే అని తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ఆయనపై ఉన్న గౌరవంతో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ క్షేత్రానికి ప్రభుత్వం భూమి, నిధులు కేటాయించిందని చెప్పారు. కాళోజీ ప్రశ్నించేతత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ రోజుల్లో ధైర్యంగా తిరుగుతూ తన రచనలు చదువుతూ ప్రజల్లో ప్రసంగాలు చేసేవారన్నారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కాళోజీతో కలసి పనిచేశానని చెప్పారు. రాజ్యహింసకు వ్యతిరే కంగా ‘మూమెంట్ ఫర్ అప్రెషన్’ స్థాపించారని, దానికి తానూ కాళోజీ నాయకత్వం వహించేవారమని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాళోజీ పేరిట భాషాదినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ‘ఆగిపోయిన.. ముందుకు సాగలేవు నీవు’ అనే కాళోజీ కవితను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మహనీయులకు మరణాలు ఉండవని, జయంతులు మాత్రమే ఉంటాయన్నారు. తెలంగాణ మట్టి గడ్డపై పుట్టిన ప్రతివారికీ తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన మహారుషి కాళోజీ అని కొనియాడారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది కాళోజీ జయంతిని వరంగల్‌లోని కళా క్షేత్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరికి సూచించారు. కాళోజీ పురస్కార స్వీకర్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ మహనీయుని పేరిట ఏర్పాటుచేసిన తొలి పురస్కారం తనకి ప్రదానం చేసిందుకు ప్రభుత్వానికి, సీఎంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహాకవి కంటే ప్రజాకవి అయిన కాళోజీనే గొప్పవారన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి గాయకుడు జంగిరెడ్డి బృందం కాళోజీపై పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహితీవేత్త డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, వి.ఆర్. విద్యార్థి, కాళోజీ కుమారుడు రవికుమార్ పాల్గొన్నారు. -
'అక్షర చైతన్య దీప్తి రగిల్చిన కాళోజీ'
హైదరాబాద్: తెలంగాణ పోరాటానికి తన అక్షరాలతో చైతన్య దీప్తిని రగిల్చిన యోధుడు కాళోజీ నారాయణ రావు అని పలువురు టీఆర్ఎస్ నేతలు కొనియడారు. కాళోజీ101 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని రహమత్‌నగర్ డివిజన్ ఎన్.ఎస్.బీ నగర్ లో బుధవారం ఆయన చిత్ర పటానికి టీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ తెలంగాణ వెనుక బాటుతనాన్ని, అనాటి పాలకుల దమన నీతిని సరళమైన తెలంగాణ యాస భాషలో ఎండగట్టిన ఘనత కాళోజీకి మాత్రమే దక్కుతుందన్నారు. కాళోజి సేవలను గుర్తించిన తెలంగాణ ముఖ్య మంత్రి కేసిఆర్ ఆయన పేరుతో మెడికల్ ఇనిస్టిట్యూట్‌ను తన స్వస్ధలమైన వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఆయన రాసిన 'నాగొడవ' కవిత సంపుటిలో తెలంగాణ అణచి వేత ప్రతిభింబిస్తుందన్నారు. అనంతరం విద్యార్ధులకు మిఠాయిలను పంచి పెట్టారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ సంఘం బోర్డు సభ్యుడు గంధం అంజన్న, డివిజన్ అధ్యక్షుడు నరసింహా, నాయకులు పద్మ యాదవ్, మేఘన పద్మ,మహేష్ యాదవ్, ప్రసాద్, యాదిగిరి,చంద్రమౌళి,ఎన్.ఎస్.బీ నగర్ ప్రభుత్వ పాఠాశాల ఉపాధ్యాయుడు శ్యాంసుందర్, జహంగీర్, లడ్డు, రాఘవ, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
సెప్టెంబర్ 9న నిర్వహణకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా పరిగణించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో, హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 9న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితల పోటీలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారం అందివ్వనున్నామని తెలిపారు. -
ఇద్దరు మిత్రులు...
నువ్వు రాసిన కవితలు గుబాళిస్తోంటే నువ్వు తాగిన ఖాళీ సీసాల కంపు నాకెందుకు! అన్నాడు కాళోజీ. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ పాట రాశాడు. ఆ నేరం చాలదా సాహితీ క్రీడాంగణంలో ఫుట్‌బాల్ అయ్యేందుకు? అందరూ తలో కాలూ వేస్తున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన శ్రీశ్రీని నెత్తురు కక్కుకుంటూ నేల రాల్చాలని ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత లోపాలు ఎత్తి చూపుతూ రెండు శ్రీలను ధరించినవాడు మహాకవి అవునోకాదో కాని రెండు పెగ్గులను బిగించినవాడు నిశ్చయంగా తాగుబోతే అని డయాగ్నస్ చేశారు. అటువంటి నిస్సహాయ నిస్త్రాణ పరిస్థితుల్లో ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు’ అన్నట్లుగా శ్రీశ్రీకి తోడున్నవాడు కాళోజీ. వీరిద్దరి అనుబంధం ఇప్పటిదా? కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నేపథ్యంగా ముడిపడినది. ఆ వైనం ఆసక్తికరం. నిజాం స్టేట్‌లో ఉర్దూ అధికార భాష. తెలుగు బడులను నిరసించారు. మెడ్రాస్ స్టేట్‌లో తెలుగు బడులపై నిర్బంధం లేదు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాలకు సాహిత్య వారధులు ఏర్పడ్డాయి. హైద్రాబాద్‌లో, ఆ తర్వాత కొన్నేళ్లకు హనుమకొండలో, ఆ తర్వాత వరంగల్లులో, ఆపైన కాళోజీ స్వగ్రామం మడికొండలో ఆంధ్రభాషా నిలయాలను స్థాపించుకున్నారు. మహామహుల రాకపోకలు జరుగుతున్నాయి. సురవరం వారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నదిలా రెండు ప్రాంతాల్లో సౌభ్రాతృత్వాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ వరంగల్ వచ్చేవారు. మడికొండకూ వచ్చేవారు. ‘ఈసారి వరంగల్ పోయినప్పుడు గార్లపాటి రాఘవరెడ్డిగారనే మంచి కవి పరిచయం, కాళోజీగారి ఆతిథ్యం మరచిపోలేని విషయాలు’ అని వానమామలై వరదాచార్యులవారి ‘మణిమాల’ కావ్యానికి రాసిన పీఠికలో విశ్వనాథ అన్నారు. అయితే అదే ముందుమాటలో ‘వానమామలై తెలంగాణకు చెందిన కవులలో ప్రసిద్ధుడు’ అని కూడా అన్నారు. ఈ మాటకు కాళోజీకి కోపం వచ్చింది. నన్నయ నుంచి విశ్వనాథ వరకూ అందరం ఒక్కటే అందరూ మనవాళ్లే అనుకుంటూ ఉంటే తెలుగు ఆణిముత్యమైన వానమామలై వరదాచార్యులను ‘తెలంగాణకు చెందిన’ అని విడదీస్తరా? ‘తెలంగాణ వాదా’నికి బీజం వేసింది తాము మాత్రమే ఆంధ్రులం అనుకుంటున్న ఇలాంటివారు కాదా? అని అప్పట్లోనే ప్రశ్నించారు. మరో సందర్భంలో విశ్వనాథను ఆహ్వానించిన వరంగల్ మిత్రులు రామాయణ కల్పవృక్షాన్ని కవిగారితో చదివిద్దాం అనుకున్నారు. ఏ ఘట్టం? అని చర్చ వచ్చింది. ఏదైనా ఒక్కలాగే ఉంటది, ఆయన్నే ఎంచుకోమందాం అన్నాడు కాళోజీ. ఈ వైనాన్ని విశ్వనాథ చెవిలో వేశారు అభిమానులు. ఏదైనా ఒక్కలాగే ఉంటుందంటాడా అని ఆయన మనసులో పడింది. విశ్వనాథ తన ‘ఆంధ్ర ప్రశస్తి’ని తొలితరం చరిత్రపరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితం చేస్తూ ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని ఈ పాడు కాలమున బుట్టినట్టి...’ అని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. అయితే అదే విశ్వనాథ ఆ తర్వాత ‘పులుల సత్యాగ్రహం’ రచనలో ‘మాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడు మెట్రికో ఇంటరో పాసయ్యాడో, ఫెయిలయ్యాడో. ఆ చదువు చదివే సరికి వానికి అర ఎకరం భూమి పోయింది. తర్వాత ఉద్యోగం లేదు. ఏం చేయాలో తోచక చరిత్ర పరిశోధన మొదలు పెట్టాడు. మహా పండితుడు-చరిత్ర పరిశోధకుడు అని పెద్దపేరు సంపాదించాడు’ అని మల్లంపల్లిని ఉద్దేశించి రాశారు. ఈ వెక్కిరింపుకు ఏమన్న అర్థమున్నదా ? అని విశ్వనాథను కాళోజీ ముఖం మీదనే అడిగాడు. విశ్వనాథ కవిత్వం తనవంటి తెలుగువారిక్కూడా అర్థం కాని సంస్కృతభూయిష్టం అని కాళోజీ అనేవాడు. కాళోజీదీ కవిత్వమా? అనుకునే కొందరు సాంప్రదాయవాదులు విశ్వనాథ అభిమానుల్లో ఉండేవారు. అయితే శ్రీశ్రీ దృష్టిలో కాళోజీకి ఉన్నతమైన స్థానం ఉంది. కాళోజీ ఎవడు? నిజాంను ఎదిరించిన వాడు. వేమనలా అందరికీ అర్థమయ్యే కవిత్వాన్ని రాసినవాడు. ఈ నేపథ్యంలో 1953లో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలు జరిగాయి. కాళోజీ సహాధ్యాయి దేవులపల్లి రామానుజరావు, మిత్రుడు పులిజాల హనుమంతరావు దీని నిర్వాహకులు. భారత ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వనాథ ప్రభృత ప్రముఖులూ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ రచయితల సంఘం (తెరస) సమావేశాలూ జరిగాయి. మహాకవి శ్రీశ్రీ తదితరులు ‘తెరస’ ఆహ్వానంపై వచ్చారు. అయితే కాళోజీ సమావేశాలకు రాలేదు. సాంప్రదాయ-ఆధునిక తరాల మధ్య (కాంగ్రెస్ అనుకూలురు కమ్యూనిస్ట్ అనుకూలురు) వైరుధ్యాలు నెలకొన్న వాతావరణంలో తన మిత్రులయిన నిర్వాహకులకు ఇబ్బంది కలగకూడదని కాళోజీ అభిమతం. ఈ సమావేశాల్లో కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని దాశరధి కృష్ణమాచార్య, బిరుదురాజు రామరాజు, డి.రామలింగం వంటి మిత్రులు ప్రయత్నించారు. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరఫున ‘నా గొడవ’ను ప్రచురించారు. అయితే ఆవిష్కరణకు నిర్వాహకులు సహకరించలేదు. ఎవరి వేదికలు, ఎవరి క్యాంపులు వారివి. రాత్రి భోజనాలైన తర్వాత 11 గంటల వేళ యువరచయితలు ఒక క్యాంపులో శ్రీశ్రీతో ‘నా గొడవ’ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. ఆ మరుసటి రోజు ‘కాళోజీ మన లూయీస్ అరగాన్’ అన్న శ్రీశ్రీ వ్యాఖ్యతో వార్తలు వచ్చాయి. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! శ్రీశ్రీకి ఉత్తరం రాశాడు కాళోజీ. ‘తక్కిన వాళ్లందరూ యుద్ధంలో పారిపోతున్నపుడు లూయీస్ అరగాన్ ప్రజల తరఫున నిలుచున్నాడు ’ అని శ్రీశ్రీ వివరణ ఇచ్చాడు. గురజాడ వారసుడైన శ్రీశ్రీని రష్యన్ కవి మయకోవిస్కీతో, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్జాయిస్తో పోలుస్తారు. అరగాన్‌తో కూడా! శ్రీశ్రీ పోలికలో ఔచిత్యం ఉంది! కాళోజీతో మమేకత ఉంది! ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! - పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత, 7680950863 -
కాళోజీ జీవితం... సాహిత్యం
కాళోజీ ప్రజాకవి. రచయిత. ఉద్యమకారుడు. నిత్య చైతన్యశీలి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ వైతాళికుడు. వ్యక్తి ఉన్నతుడై వ్యక్తిత్వం సమోన్నతమైతే ఆ రెంటి కలయిక కాళోజీ అనంటారు. రాజీ పడి బతికేవాడి ఆయుష్షు కన్నా ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడి యశస్సు గొప్పది అని నిరూపించి అలాంటి యశస్సును మూటగట్టుకున్న గొప్ప కవి కాళోజీ. ఆయన జీవిత చరిత్రే- 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్ర. అందుకే ఆయన ప్రభావం నాడూ ఉంది. నేడూ ఉంది. రేపూ ఉంటుంది. అందుకే నల్లగుంట్ల యాదగిరి రావు ఆయన పట్ల ఆరాధ్యం పెంచుకున్నారు. తాను చదివిన ఎమ్మెస్సీ మేథ్స్ను అక్కడితో వదిలి కేవలం కాళోజీ కోసమే ఎంఏ తెలుగు చేసి ఆ తర్వాత కాళోజీ సాహిత్యాన్ని ిపీహెచ్.డి అంశంగా ఎంచుకున్నారు. ఇదంతా తెచ్చిపెట్టుకునే అభిమానంతో జరిగే పని కాదు. దానికి లోలోపలి అర్పణభావం ఉండాలి. 500 పేజీల ఈ పుస్తకంలో రచయిత వదిలిపెట్టిన అంశమంటూ ఏదీ మిగల్లేదు. కాళోజీ బాల్యం, చదువు, వివాహం, జైలు జీవితం, గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమ ప్రభావం, కవిత్వం (నా గొడవ, పరాభవ వసంతం, పరాభవ గ్రీష్మం, పరాభవ వర్షం, పరాభవ శరత్తు, పరాభవ హేమంతం, పరాభవ శిశిరం), ఎమర్జెన్సీ జీవితం, కథలు (మనమే నయం, ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ, ఆగస్టు 15, భూతదయ), ఆత్మ కథ (నా గొడవ)... వీటన్నింటినీ సాకల్యంగా చిత్రించడం, చర్చించడం కనిపిస్తుంది. ముఖ్యంగా కాళోజీ వ్యక్తిత్వంలోని లక్షణాలు- స్వేచ్ఛా పిపాస, నిర్భయత్వం, ధైర్యం, సంచార గుణం, జ్ఞాన తృష్ణ, గాంధేయవాదం, స్నేహశీలత్వం, జ్ఞాపక శక్తి... వీటన్నింటినీ తగు దృష్టాంతాలతో తెలుసుకుంటూ ఉంటే కొత్తతరాలకు ఈ వ్యక్తిత్వాన్ని ఎంత చేరువ చేస్తే అంత బాగుణ్ణు కదా అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ కల సాకారమైంది. కాని ఈ కల సాకారం కావడం వెనుక కాళోజీ వేసిన బీజాలూ అవి చూపిన ప్రభావమూ అందుకొరకు ఆయన స్థిరపరచిన కార్యరంగం అత్యంత శక్తిమంతమైనవి. తెలంగాణవారిపై తెలంగాణేతరుల పెత్తనాన్ని నిరసిస్తూ ఆ రోజుల్లోనే కాళోజి రాసిన ‘లంకా పునరుద్ధరణ’ కథ ఇటీవల వరకూ సాగిన ఒక ధోరణికి చెంపపెట్టు. కాళోజీ సాహిత్యమూ, జీవితమూ లేవనెత్తిన అంశాలపై, చూపిన దిశపై జరగవలసిన చర్చ చాలా ఉన్నది. తెలంగాణ భవిష్యత్తులోని ప్రతి మలుపులోనూ ఆయన నుంచి స్వీకరించాల్సింది ఎంతో ఉంటుంది. అందుకు ఉపయుక్తంగా సమగ్రమైన పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని అందించిన నల్లగుంట్ల యాదగిరిరావు ధన్యులు. ప్రతి సాహితీ ప్రేమికుడూ, ప్రతి తెలంగాణ చదువరి తప్పకుండా పరిశీలించదగ్గ పుస్తకం ఇది. దిశ: కాళోజీ సాహిత్య సమగ్ర పరిశీలన- డా. నల్లగుంట్ల యాదగిరి రావు వెల: రూ.360; ప్రతులకు- 9848382555 -
కాళోజీ పేరుతో వరంగల్‌లో హెల్త్ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాళోజీ పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించింది. కాకతీయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.‘కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్’ను వరంగల్‌కు మంజూరు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం ఈమేరకు ఒక సంక్షిప్త సందేశం ద్వారా వెల్లడించింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైద్యవిద్య అడ్మిషన్లు, పరీక్షలను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే నిర్వహిస్తోంది. కేసీఆర్ తాజా నిర్ణయంతో అడ్మిషన్ల ప్రక్రియ మినహా తెలంగాణ వైద్య, దంత, నర్సింగ్ కళాశాలలకు సంబంధించిన అంశాలన్నీ తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి రానున్నాయి. మెడిసిన్ అడ్మిషన్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నందున ఇకపై తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ కూడా అడ్మిషన్లలో భాగస్వామి కానున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశాలున్నాయని వైద్యశాఖవర్గాలు అభిప్రాయపడ్డాయి. సెప్టెంబర్ 30లోపు ఆరోగ్య విశ్వవిద్యాల య ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పలుమార్లు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ రాష్ట్రం లో ప్రవేశపెట్టే నూతన ఆరోగ్య విధానంపై డిప్యూటీ సీఎం టి. రాజయ్య ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు నేడు చర్చించనున్నారు. ఇదిలాఉండగా, వరంగల్ జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య పలుమార్లు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 9 తేదీన వరంగల్‌లో జరిగిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రకటనలను ప్రస్తావిస్తూ, రాజయ్యను బహిరంగంగా మందలించారు. అయితే చివరకు సీఎం వరంగల్‌కే తెలంగాణ హెల్త్వర్సిటీ మంజూరు చేయడం గమనార్హం. నా జన్మ ధన్యమైంది : రాజయ్య వరంగల్ జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తన జన్మ ధన్యమైందని వైద్య,ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. గురువారం రాత్రి రాజయ్యను ‘సాక్షి ’ సంప్రదించగా ‘కేసీఆర్ ఆశీస్సులు, సహచర మంత్రులు, వరంగల్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంవల్లే ఇది సాధ్యమైంది. ఇదే కళాశాలలో చదువుకున్నాను. డాక్టర్‌గా ఇక్కడే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు హెల్త్వర్సిటీ ఏర్పాటు కావడం నా పూర్వజన్మ సుకృతం’ అన్నారు. ‘కాకతీయ వైద్య కళాశాలలో వెయ్యి పడకల ఆస్పత్రి ఉంది. 23 కోట్ల రూపాయలతో కొత్తగా పిల్లల విభాగం ఏర్పాటు కానుంది. పీఎంఎస్ఎస్వై కింద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ. 150 కోట్లు మంజూరయ్యాయి. పైసాఖర్చు లేకుండా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు భవనాలున్నాయి.’ అని అన్నారు. -
తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ
కళా కేంద్రం జిల్లాకు అతుకుతున్న తునక నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు కాళోజీ కుటుంబానికి చేయూత జయశంకర్ పట్టుదలకు కాళోజీయే స్ఫూర్తి మహనీయుడి ఆశయూలను కొనసాగిద్దాం కాళోజీ శత జయంతి సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ముద్దు బిడ్డ కాళోజీ విశ్వమానవుడు, విశ్వకవి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొనియాడారు. జీవిత పయనంలో ఏ సందర్భంలోనూ పదవులకు, డబ్బుకు ఆయన లొంగలేదని పేర్కొన్నారు. కాళోజీ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాల వారు వరంగల్ జిల్లాలోనే ఎక్కువ అని కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వానికి కొలమానం లేదని కేసీఆర్ అన్నారు. ప్రజాకవి కాళోజీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. అంతకుముందు కాళోజీ సెంటర్లోని విగ్రహానికి పూలతో నివాళర్పించారు. బాలసముద్రంలో మూడున్నర ఎకరాల్లో నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిట్ ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ... ‘కాళోజీ మహనీయుడికి చంద్రునికో నూలుపోగులా కాళోజీ కళా కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఒక మంచి సంస్థను మూడున్నర ఎకరాల్లో కాళోజీ పేరు మీద నిర్మించే కళాకేంద్రం వరంగల్ పట్టణానికే అద్భుతమైన ఒక కానుక. కళా కేంద్రం ప్రపంచ స్థాయిలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపలికి పోగానే కాళోజీ కాంస్య విగ్రం, 1500 మంది కూర్చునే ఎయిర్ కండిషనర్ కళాక్షేత్రం ఉంటుంది. రూ.12 కోట్లు మంజూరు చేస్తున్నాం. అక్కడే అర ఎకరంలో కాళోజీ ఫౌండేషన్ భవన్ ఉంటుంది. అర ఎకరం రిజిస్ట్రేషన్ సైతం ఫౌండేషన్ పేరిటే ఉంటుంది. రేపు కలెక్టర్లు మారొచ్చు... తర్వాత వచ్చేవాళ్లు ఫౌండేషన్‌ను చిన్నచూపే చూస్తరో, సన్నచూపే చూస్తరో.. దేనిది దానికి ఉంటే లెక్క అయిపోతది. ఫౌండేషన్ భవన నిర్మాణానికి రూ.12 కోట్లలోనే రూ.50 లక్షలు కేటాయిస్తం. ఈ భవనంలో కాళోజీ పుస్తకాలు, ఫొటోలు చరిత్ర అంశాలు ఉంటాయి. వచ్చినవాళ్లు చూసుకునేందుకు వీలుంటుంది. మొత్తంగా కళా కేంద్రం వరంగల్‌కు అతుకుతున్న అందమైన తునక. ఇది వరంగల్ నగరానికి కాళోజీ గౌరవం. కార్యక్రమం ఎక్కడ జరిగిందయ్యా అంటే... కాళోజీ కళా కేంద్రంలో అంటే నా హృదయం పొంగిపోతది. నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆ మహనీయుడి పేరు ఉండాలే. కాళోజీ వారి స్ఫూర్తి చిస్థాయిగా ఉంటది’ అని కేసీఆర్ అన్నారు. కాళోజీ కుటుంబానికి చేయూత కాళోజీ కుటుంబానికి కేసీఆర్ కొంత సహకారం అందించారు. ‘కాళోజీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మనకు తలవంపులు తెచ్చే విషయం. అలా ఉండదానికి వీల్లేదు. ఇయ్యాల ఎవడు అవునన్నా.. కాదన్నా ఇది తెలంగాణ రాష్ట్రం. కాళోజీ లాంటి మహనీయుని కుటుంబం ఇలా ఉండవద్దు. రూ.10 లక్షలు కాళోజీ ఫౌండేషన్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఫౌండేషన్ వారు ఆ మొత్తం ద్వారా వచ్చే డబ్బులను కాళోజీ కుటుంబానికి ఇవ్వాలి. కాళోజీ రచనలను ఇతర, జాతీయ భాషల్లోకి అనువదిస్తాం. ఆంధ్రావాళ్లు మామూలు పొట్టోన్ని కూడా పొడుగోనిగా చేసి చూపించిన్రు. మన కాళోజీని, దాశరథిని పట్టించకోలేదు. మన పాల్కురికి సోమనాథుడే ఆదికవి. నన్నయ్య ఆది కవి అని అబద్ధాలు చెప్పిన్రు. ఇది కాళోజీ శతజయంతి కాబట్టి చేబుతున్నా.. లేకుంటే ఆయన ఆత్మ నా మీద కోపానికి వస్తంది. సీరియల్ అంటే బాగుంది గని సిల్సిలా(ఉర్దూలో) అంటే వికారమా అని కాళోజీ అన్నడు. చెప్పాలంటే చానా దూరం ఉంటది. నాకు కూడ జరంత కవిత్వం పైశ్చం ఉంది. కాళోజీకి స్వార్థం లేదు కాబట్టి భయం లేదు. మనందరికీ ఆదర్శప్రాయుడు. కేబినెట్లో తీర్మానం చేసి కాళోజీ పేరిట పోస్టల్ స్టాంప్ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తాం. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని ఈ రోజే ప్రకటిస్తున్నా. ప్రతి జయంతి తెలంగాణ నుడికారాన్ని, యాసను అతిగా ప్రేమంచిన వ్యక్తి. నా భాషే గొప్పది అని చెప్పిన వ్యక్తి’ అని వివరించారు. వరంగల్‌కు రావాలనే వచ్చా... కాళోజీ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం హైదరాబాద్‌లో రాష్ట్ర తరఫున ఉన్నా... కాళోజీ సొంత ప్రాంతంలో పాల్గొనాలనే ఇక్కడికి వచ్చానని కేసీఆర్ చెప్పారు. ‘నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత వారి ఇంటికి వెళ్లి కలిశాను. కంట నీరు పెట్టుకుని ఆశీర్వదించారు. అప్పటి నుంచి కాళోజీకి నాగిళ్ల రామశాస్త్రి ప్రధాన సన్నిహితుడిగా ఉన్నారు. కాళోజీ ఫౌండేషన్ తరఫున రామశాస్త్రి, అంపశయ్య నవీన్, ప్రభాకర్‌రావులను అభినందిస్తున్నా’ అని అన్నారు. జయశంకర్ పట్టుదలకు కాళోజీయే... ఏదైనా అంశంపై మొదలుపెడితే కొసదాకా పట్టుబట్టే అలవాటు కాళోజీ నుంచే తనకు వచ్చిందని జయశంకర్‌సార్ చెప్పేవారని కేసీఆర్ వివరించారు. ‘జయశంకర్ సార్ శనివారం ఉపవాసం ఉండేవారు. మంచినీళ్లు మాత్రమే తాగేవారు. 72 ఏళ్ల వయసులో అలాగే ఉండేవారు. నేను వారించేవాన్ని. సార్ మా కోసం మీరు బతికి ఉండాలే అని నచ్చజెప్పగా మజ్జిగ తీసుకునేవారు. ఎందుకు ఇంత మొండిగ ఉంటరు అని అడిగిన. కాళోజీ నుంచి అబ్బిన అలవాటు అని జయశంకర్‌సార్ అన్నరు. ఏదైనా అంశాన్ని ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే చివరిదాకా పోరాడాలి. రాజీ పడవద్దు. అని జయశంకర్‌సార్ చెప్పేవారు’ అని కేసీఆర్ తెలిపారు. మనమంతా కాళోజీ ఆశయూలను కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో స్పీకర్ సరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు కె.కేశవరావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖ, ఎ.చందులాల్, డి.ఎస్.రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, నాగపురి రాజలింగం, బి.వెంకటేశ్వర్లు, కలెక్టర్ జి.కిషన్, ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి టి.రామచంద్రునాయక్, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ సేవలు ఎనలేనివి
రాంనగర్ : తెలుగు సాహిత్య రంగంలో కాళోజీ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ టి.చిరంజీవు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచనల ద్వారా సమాజానికి మేలు జరగాలని, సాహిత్యం సమాజ గమనాన్ని మార్చి మేలుకొల్పేలా ఉండాలని చాటి చెప్పిన వ్యక్తి కాళోజీ అన్నారు. తెలుగు సాహిత్యానికి కాళోజీ చేసిన సేవకు ప్రశంసగా భారత ప్రభుత్వం పద్మవిభూషన్‌తో సత్కరించడం అభినందనీయమన్నారు. మరణాంతరం తన భౌతికకాయాన్ని కాకతీయ వైద్య కళాశాలకు దానం చేసిన గొప్ప సంకల్పం గల వ్యక్తి అన్నారు. తాను వరంగల్‌లో పనిచేసిన కాలంలో కాళోజీని కలిసిన రోజులను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ చూపిన బాటలో సమసమాజ తెలంగాణను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఏజేసీ వెంకట్రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.విశ్వనాథరావు మాట్లాడుతూ ‘నా గొడవ’ ద్వారా ప్రభుత్వ ధమన నీతిపై, ప్రతి సంఘటనపై కాళోజీ స్పం దించారని పేర్కొన్నారు. రాజకీయ సామాజిక పరిస్థితులకు కాళోజీ రచనలు అద్దంపట్టాయన్నారు. అంతకు ముందు అధికారులు కాళోజీ చిత్ర పటం ఎదుట నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ ప్రీతి మీనా, సీపీఓ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను'
హైదరాబాద్ : మహాకవి కాళోజీ వ్యక్తిత్వాన్ని కొలవలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మంగళవారం వరంగల్‌లో కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కాళోజీ కళాక్షేత్రం కోసం 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన ఏనాడూ పదవులకూ, డబ్బుకూ లొంగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాళోజీది రాజీపడి మనస్తత్వమన్నారు. ఒక విషయాన్ని తీసుకుంటే....కొసదాకా కొట్లాడు బిడ్డా అని తనను కాళోజీ ఆశీర్వదించారన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కాళోజీ విశ్వమానవుడని కేసీఆర్ ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్లలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఎన్నికల ప్రచారంలో తాను ముందే చెప్పానన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమించి తీరుతామన్నారు. దాన్ని కూడా వ్యతిరేకంగా రాయటం దురదృష్టకరమన్నారు. ఏడాది... ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి మెరుగుపరుచుకుంటూ.. వచ్చే మూడేళ్లలో కనురెప్ప కొట్టే సమయం కూడా కరెంట్ పోనివ్వమని కేసీఆర్ తెలిపారు.