Kashi
-
గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు
న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.1. హరిద్వార్హరిద్వార్లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.2.బుద్ధగయబీహార్లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు. Foreigners perform Pitru Paksha Tarpan rituals at GayaGaya is Mokshbhumi and it attracts sanatan dharma followers across the world Our rituals Our traditions 🔥🙏🏼 pic.twitter.com/Nru3esLfUo— Viक़as (@VlKAS_PR0NAM0) September 30, 20243. కురుక్షేత్రహర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు ఇక్కడే పిండప్రదానం చేశాడు.4. కాశీకాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్ సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
'మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదు'.. విక్రమ్‌కు వార్నింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు. -
కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.ఐఆర్సీసీటీ వెబ్సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024 -
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ దాతృత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి చాలా సింపుల్‌గా ఉంటారు. చెప్పాలంటే సింపుల్ సిటీకి కేరాఫ్ ఆమె అన్నంతగా చాలా సాదాసీదాగా ఉంటారామె. అయితే ఆమె వద్ద ఎన్నో చీరలు ఉండవని, షాపింగ్ చేయరని కథలు కథలుగా విన్నాం. రెండు లేదా మూడో చీరలే ఉంటాయని సుధా కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేంటి ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత భార్య వద్ద అన్నే చీరలా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా. నేటి రోజుల్లో చిన్నగా స్టార్డమ్ వచ్చి, పేరు ప్రఖ్యాతలు వస్తేనే..వారి రేంజ్, లుక్కు మారిపోతుంది. ఏదో గోల్డ్స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుది వ్యవహారం. కానీ ఆమె ఆహార్యం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఇటీవలే అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఆమె రాజ్యసభ ఎంపీగా నామనేట్ అయ్యిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో రాజ్యసభ ఎంపీగా తొలి ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ సైతం ఆమె ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు? తాను ఎందుకు కొనుగోలు చెయ్యరో తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను 30 ఏళ్లుగా చీర కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్లినప్పుడూ మనకు బాగా ఇష్టమైనది వదిలేయాలి అని అంటారు. అందుకోసం తాను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని అన్నారు. తనకు పొదుపుగా, సింపుల్‌గా ఉండటం తన తల్లిదండ్రులు, తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడూ ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరంగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికీ ఆమె వద్ద కేవలం నాలుగు చీరలు ఉన్నాయి. ఇలా సింపుల్‌గా బతకడం వాళ్ల పెంపకం నుంచి మొదలయ్యింది కాబట్టి చాలా సులభంగా సాదాసీదాగా జీవిస్తున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా తన సోదరీమణులు, సన్నిహితులు, తాను పనిచేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటినే తాను ధరిస్తానని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవే తన వద్ద ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేగాదు తన సోదరీమణులు ప్రతి ఏడాది బహుమతిగా ఇస్తున్న చీరల సేకరణ పెరుగుతున్నందున నిర్వహించడం కష్టంగా ఉందని వారికే నేరుగా చెప్పేశానని అన్నారు. అంతేగాదు సుధామార్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా, మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్దమొత్తంలో చీరలు కావాల్సిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ..అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధా. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పతనం, పొదుపుగా ఉండటం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుమధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆమె అనేక పుస్తకాలు రచించారు, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా రాశారు.(చదవండి: ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!) -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్‌గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్‌కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
వారణాసిలో వార్ వన్ సైడే
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశలో జూన్ 1న పోలింగ్ జరుగనున్న వారణాసిలో వార్ వన్ సైడే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం ప్రధాని మోదీకే పడటం ఖాయమన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసిలో మోదీ విజయం ఖాయమని, అయితే దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. తెలుగు ఓటర్ల పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని శ్రీరామ తారక ఆంధ్రాఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వి.వి.సుందర శాస్త్రిని కోరారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత పాల్గొన్నారు. -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
కాశీలో హిందువుగా మారిన రష్యన్ మహిళ
విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు. వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు. అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
బాలరామునికి బొమ్మల బహుమానం
అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్ చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు. మెటల్ క్రాఫ్ట్‌లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు -
సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు?
ఉత్తర భారతదేశంలో ఈవీ రామసామి నాయకర్ ‘పెరియార్’.. నాస్తికునిగా, హిందీ వ్యతిరేకిగా పేరొందారు. పెరియార్‌కు సంబంధించి ఇటువంటి పరిచయం తప్పు కానప్పటికీ, ఇది ఏకపక్ష భావన అనే వాదన కూడా వినిపిస్తుంటుంది. పెరియార్ సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశానికి వచ్చి, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీలో నివసించాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక ఘటన పెరియార్‌ను నాస్తికునిగా మార్చివేసింది. పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి పేరు వెంకట్ నాయకర్. తల్లి పేరు చిన్న తాయమ్మాళ్ అలియాస్ ముత్తమ్మాళ్. పెరియార్ తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న వ్యాపారవేత్త. 1944 డిసెంబర్లో కాన్పూర్‌లో ఒక ప్రసంగంలో పెరియార్ స్వయంగా ఇలా అన్నారు.. ‘నా కుటుంబం సనాతన సంప్రదాయాన్ని పాటించే కుటుంబం. దేవాలయాలు, సత్రాలు నిర్మించి ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి పాటుపడిన కుటుంబం. మా కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు అందించారు. అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ నన్ను చాలా మంది విప్లవవాది, అతివాది అంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. మన సమాజంలో ఉండకూడని కొన్ని అంశాలపై నేను దాడి చేశాను’ అని పేర్కొన్నారు. పెరియార్ జీవితంపై రాజ్‌కమల్ ప్రకాశన్ మూడు సంపుటాలుగా పుస్తకాలను ప్రచురించింది. పెరియార్‌కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇదే పెరియార్‌ను సన్యాసం దిశాగా తీసుకువెళ్లింది. పెరియర్ తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి, గంగా నది ఒడ్డున ఉన్న కాశీ (వారణాసి)కి చేరుకున్నారు. సన్యాసి అయినందున అక్కడి ధర్మశాలలో లభించే ఉచిత ఆహారం కోసం ఆశించారు. అయితే అతనికి ఎక్కడా ఉచితంగా ఆహారం లభించలేదు. ఉచిత భోజన సౌకర్యం కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనని అక్కడున్నవారు పెరియార్‌కు చెప్పారు. కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించిన యువ పెరియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. అంతే.. పెరియర్ బ్రాహ్మణ వేషం ధరించారు. జంధ్యాన్ని ధరించి, ఆహారం కోసం ధర్మశాలకు వెళ్లారు. అయితే ఇందుకు అతని మీసం అడ్డంకిగా మారింది. పెరియార్ పుస్తకంలోని వివరాల ప్రకారం.. గేట్ కీపర్ పెరియార్‌ను లోపలికి రాకుండా ఆపడమే కాకుండా, రోడ్డుపైకి నెట్టివేశాడు. అప్పటికే లోపల భోజన కార్యక్రమం పూర్తికావడంతో, ఎంగిలి ఆకులను రోడ్డుపై పడేశారు. చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్న పెరియార్ మరోమార్గం లేక ఆ ఎంగిలి ఆకుల్లో మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది. ఈ సమయంలో వీధి కుక్కలు కూడా ఆ ఆకులలోని ఆహారాన్ని తినడానికి ఎగబడ్డాయి. ఎంగిలి ఆహారం తింటున్నప్పుడు పెరియార్ దృష్టి ఎదురుగా గోడపై రాసిన అక్షరాలపై పడింది. ‘ఈ ధర్మశాల ముఖ్యంగా అత్యున్నత కులానికి అంటే బ్రాహ్మణులకు చెందినది. ఈ ధర్మశాలను తమిళనాడుకు చెందిన ధనిక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించారు’ అని రాసివుంది. పెరియార్ మనసులో అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి..‘ఈ ధర్మశాలను ఒక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించినప్పుడు, బ్రాహ్మణులు..ఇతర ద్రావిడులు ఇక్కడ ఆహారం తినకుండా ఎలా అడ్డుకుంటారు? బ్రాహ్మణులు క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ద్రావిడులతో సహా ఇతర వర్గాలను ఆకలితో చంపడానికే నిశ్చయించుకుని, కుల వ్యవస్థ పేరుతో ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడరా?' పెరియార్ మదిలో మెదిలిన ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కాశీలో బ్రాహ్మణులు చేసిన అవమానం పెరియార్ హృదయాన్ని గాయపరిచిందని ఆ పుస్తకం వెల్లడించింది. ఇదే అతని మనసులో కుల వ్యవస్థపై తీవ్ర ద్వేషాన్ని రగిలేలా చేసింది. దీంతో కాశీ ఒక పవిత్ర నగరం అని అనడాన్ని పెరియార్ ఒక భ్రమగా భావించారు. కొంతకాలానికి సన్యాసాన్ని వదిలివేసి, కుటుంబ సభ్యులు చెంతకు చేరారు. ఇది కూడా చదవండి: నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి.. -
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?
వినోబా భావే పాత్ర భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినోబా భావే స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే, దేశానికి సేవ చేయాలనే తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగించారు. గాంధీజీని కలిసిన తర్వాత తన జీవిత లక్ష్యాలను వినోబా భావే అంకితభావంతో ఎలా సాగించాడో అతని జీవిత ప్రయాణం చెబుతుంది. గాంధీజీ మరణానంతరం మహాత్ముని జీవన విధానాలను సజీవంగా నిలిపివుంచి, దేశ సేవను కొనసాగించిన వారిలో ఆయన ఒకరు. భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ వినోబా భావే 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. చిత్పావ్ బ్రాహ్మణ నరహరి భావే, రుక్మణి బాయిల ఐదుగురు పిల్లలలో వినోబా పెద్దవాడు. వినోబా చిన్నప్పటి నుంచి తెలివైన పిల్లాడిగా గుర్తింపు పొందారు. తల్లి సాంగత్యంలో ఆయనకు మొదటి నుంచీ భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ ఏర్పడింది. తార్కిక ఆలోచనలు కలిగిన వినోబా తన తండ్రి నుండి గణితం, సైన్స్ నేర్చుకున్నారు. తండ్రి చెప్పారని ఫ్రెంచ్, తల్లి కోరిక మేరకు సంస్కృతం.. వినోబా హైస్కూల్‌కు చేరుకున్న తర్వాత అతని తండ్రి వినాయక్ ఫ్రెంచ్ నేర్చుకోవాలని కోరగా, అతని తల్లి సంస్కృతం నేర్చుకోవాలని కోరింది. వినాయక్ హైస్కూల్లో ఫ్రెంచ్ను ఎంచుకున్నారు. తల్లి కోరిక మేరకు ఇంట్లో సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌కు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా మతపరమైన పుస్తకాలు చదివేవారు. ఫ్రెంచ్ సాహిత్యంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు కూడా శ్రద్ధగా చదివారు. ఈ నేపధ్యంలో వినోబా ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతూ వచ్చింది. అతను తన జీవిత లక్ష్యాలపై మరింత లోతుగా ఆలోచించేవారు. కాశీలో రైలు దిగిపోయి.. ఆ రోజుల్లో వినోబా చదువుకోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. 1916 మార్చి 25న ముంబై వెళ్లేందుకు రైలు ఎక్కారు. అయితే అక్కడ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి? తన జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేయాలి అనే ప్రశ్నలు మనసులో కలకలం రేపాయి. ఇంతలో వినోబా ప్రయాణిస్తున్న రైలు సూరత్ చేరుకుంది. ఆయన అక్కడ రైలు దిగి, హిమాలయాలవైపు పయనమయ్యేందుకు తూర్పు వైపునకు వెళ్లే రైలులో కూర్చున్నారు. అయితే కాశీలో రైలు దిగిపోయాడు. శివుని నివాసమైన కాశీలో తనకు సరైన మార్గాన్ని చూపించగల ఋషులు, సాధువులను కలుసుకోవచ్చని భావించారు. గంగా తీరంలో చాలా కాలం పాటు తిరిగారు. అక్కడ తాను ఆశించినది దొరకకపోవడంతో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా... ఆ సమయంలో యాదృచ్ఛికంగా హిందూ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దీనిలో గాంధీజీ ధనవంతులకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు తమ సంపదను పేదల సేవకు వినియోగించాలని కోరారు. అ అంశంపై జరిగిన చర్చ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది. వినోబాకు ఈ వార్తాపత్రిక కనిపించింది. అందులో గాంధీజీ గురించి చదివిన తర్వాత, గాంధీజీ మాత్రమే తనకు సరైన మార్గాన్ని చూపగలరని వినోబా భావించారు. దీంతో వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా, గాంధీజీ దానికి సమాధానమిస్తూ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వినోబా.. గాంధీజీ ఆశ్రమం ఉన్న అహ్మదాబాద్‌కు బయలుదేరారు. వారిద్దరూ 1916 జూన్ 7న తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. గాంధీజీ అతనికి వినోబా అని పేరు పెట్టారు. అంతకు ముందు అతని పేరు(వినాయక్ నరహరి భావే). గాంధీజీని కలిసినది మొదలు వినోబా గాంధేయవాదిగా మారారు. అదే బాటలో జీవితాన్ని కొనసాగించారు. ఇది కూడా చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
ఆలయానికి ఇటలీ యువతి, కాశీ యువకుడు.. వదంతులకు పూజారి చెక్!
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరని అంటారు. దీనికి ఇప్పుడు మరో తాజా ఉదాహరణ మనముందు నిలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ ఆలయంలో సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఒక జంట వచ్చారు. ఆలయంలో మహాశివుడిని దర్శించుకున్న ఆ జంటను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ జంట వేర్వేరు దేశాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. వారణాసికి చెందిన యువకుడు, ఇటలీకి చెందిన యువతి జంటగా వచ్చారు. వారు ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే వారు త్రిలోచన్ ఆలయంలో వివాహం చేసుకున్నారనే వదంతులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ దంపతులు త్రిలోచన్ మహాదేవ్ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేపధ్యంలో వారికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటకు సంబంధించిన వివరాలను త్రిలోచన్ మందిరం ప్రధాన పూజారి సోనూ గిరి మాట్లాడుతూ ఆ జంటకు ఈ ఆలయంలో పెళ్లి జరిగిందనేది అవాస్తవమని, రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ పెళ్లిళ్లి చేయమని అన్నారు. వారణాసికి చెందిన అఖిలేష్ విశ్వకర్మ, ఇటలీకి చెందిన తానియా ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ పూజలు చేసేందుకు మాత్రమే వచ్చారన్నారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం వారణాసి జిల్లాలోని కార్ఖియాం గ్రామ నివాసి అఖిలేష్ విశ్వకర్మ 2016లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేసిన తరువాత కతర్ దేశం వెళ్లాడు. అక్కడ కతర్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉద్యోగం పొందాడు. కొద్దిరోజుల తరువాత అతనికి ఇటలీకి చెందిన తానియాతో ప్రేమ ఏర్పడింది. తరువాత వారిద్దరూ జార్జియాలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే అఖిలేష్ తన భార్యతో పాటు ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే వారు త్రిలోచన్ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ తానియా ఇటలీలో పుట్టిందని, ఆమె ఫిలిప్పీన్స్‌లో చదువుకున్నదని తెలిపారు. తానియా తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారన్నారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! -
బెయిల్ ఇప్పించి చంపేశాడు
బరేలీ: ప్రతీకారంతో రగిలే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి అదే చేశాడు. తన కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి మరీ హత్య చేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) అనే కొడుకున్నాడు. 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుంచి బయటికొచ్చాడు. కొడుకును పొట్టనపెట్టుకున్న లాలాపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సొంత ఖర్చుతో లాయర్‌ను ఏర్పాటు చేసి మరీ లాలాను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు. -
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
Rk Roja: రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
నగరి(చిత్తూరు జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆర్కే రోజా వెళ్లారు. అయితే వారణాశిలోని వీధుల్లో మంత్రి రోజా రిక్షాలో తిరుగుతూ సందడి చేశారు. 144 ఏళ్ల తరువాత శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రావడంతో ఈ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని శనివారం ఆమె దర్శించుకున్నారు. గంగా హారతి అనంతరం తానో మంత్రి, సెలబ్రిటీ అని మరచి కాసేపు ఓ సాధారణ భక్తురాలిలా రిక్షాలో ప్రయాణించారు. -
మహా శివరాత్రికి కాశీలో ఏపీ మంత్రి రోజా
-
RK Roja: కాశీలో ఏపీ మంత్రి రోజా
సాక్షి, వారణాసి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై.. కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చదవండి: సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు -
పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాశీలో నేటి నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న పురాతన సంస్కృతి, శతాబ్ధాల జ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ‘సంగమం’ భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుక అని అన్నారు. మన దేశంలోని నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ-తమిళనాడు సంగమం, గంగా యమునా సంగమం లాగే పవిత్రమైనదని తెలిపారు. కాశీ.. భారత దేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని అయితే తమిళనాడు.. దేశ పురాతన చరిత్రను కలిగి ఉందని వ్యాఖ్యినించారు. చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు.. కథలేమైనా ఉంటే ఆ డైరెక్టర్‌కి చెప్పండి.. సినిమా తీస్తారు! ఇక కాశీలో 30 రోజుల పాటు తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళ వంటకాలు యూపీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. తమిళ సంగీతం కాశీలో మారుమోగనుంది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు. In Varanasi, addressing the 'Kashi-Tamil Sangamam.' It is a wonderful confluence of India's culture and heritage. https://t.co/ZX3WRhrxm9 — Narendra Modi (@narendramodi) November 19, 2022