Khel Ratna award
-
ఖేల్‌రత్న వివాదం: తొలిసారి స్పందించిన మనూ భాకర్
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్, భారత షూటర్ మను భాకర్(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్‌ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు. తాజాగా ఈ విషయంపై మను భాకర్ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్‌గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్‌లో రాసుకొచ్చారు.కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను నామినేట్ చేసింది. ప్యారిస్ ఒలిపింక్స్-2024 షూటింగ్లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
‘ఖేల్ రత్నా’లు సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ లభించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్‌లకు అందించే ‘ద్రోణాచార్య’ అవార్డును రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి... లైఫ్‌టైమ్ విభాగంలో ముగ్గురికి ప్రకటించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి క్రీడా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ‘ఖేల్ రత్న’ అందుకోనుండగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్) ‘అర్జున’ పురస్కారం పొందాడు. తెలంగాణకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగ్‌లకు కూడా ‘అర్జున’ అవార్డు దక్కింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు. ♦ ‘ఖేల్ రత్న’ అవార్డీలకు మెడల్, ప్రశంస పత్రంతోపాటు రూ. 25 లక్షలు... ‘అర్జున’ విజేతలకు రూ. 15 లక్షలు... ‘ద్రోణాచార్య’ అవార్డీలకు రూ. 15 లక్షలు... ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డీలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ♦గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 33 ఏళ్ల అజయ్ 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అజయ్ సారథ్యంలోనే భారత్ 2017 టి20 వరల్డ్ కప్, 2018 వన్డే వరల్డ్‌కప్, 2022 టి20 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. ♦ నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల హుసాముద్దీన్ ఈ ఏడాది తాషె్కంట్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి ప్లో కాంస్య పతకం గెలిచాడు. ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వ హిస్తున్న హుసాముద్దీన్ 2022 ఆసియా చాంపియన్‌షి ప్లో... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు నెగ్గాడు. ♦ హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది అజర్బైజాన్లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షి ప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు నెగ్గింది. గత ఏడాది జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. నిలకడగా... మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం సాత్విక్–చిరాగ్ జోడీ సూపర్ ఫామ్‌లో ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షి ప్లో... చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ జంట స్వర్ణ పతకాలు సాధించింది. స్విస్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది. చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. దాంతోపాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2022లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ విజేతగా నిలువడంలో సాత్విక్–చిరాగ్ శెట్టి కీలకపాత్ర పోషించారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఇండియా ఓపెన్ సూపర్–500, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీల్లోనూ టైటిల్స్ కైవసం చేసుకుంది. 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు మిక్స్డ్ టీమ్‌లో స్వర్ణం రావడానికి సాత్విక్–చిరాగ్ ముఖ్యపాత్ర పోషించారు. అవార్డు గ్రహీతలు... ‘ఖేల్ రత్న’ (2): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్). అర్జున అవార్డీలు (26): ఒజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అదితి స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్, పారుల్ చౌధరీ (అథ్లెటిక్స్), హుసాముద్దీన్ (బాక్సింగ్), వైశాలి (చెస్), షమీ (క్రికెట్), అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్ ( ఈక్విస్ట్రి యన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను (హాకీ), పవన్ కుమార్, రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో–ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ (స్క్వాష్), అహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్, అంతిమ్ పంఘాల్ (రెజ్లింగ్), రోషిబీనా (వుషు), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్). ద్రోణాచార్య అవార్డీలు (రెగ్యులర్ కేటగిరీ–5): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్). ద్రోణాచర్య అవార్డీలు (లైఫ్‌టైమ్–3): జస్కీరత్ సింగ్ గ్రెవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టేబుల్ టెన్నిస్). ధ్యాన్‌చంద్ అవార్డీలు (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్–3): మంజూషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ). మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (అత్యుత్తమ యూనివర్సిటీలు–3): 1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్సర్), 2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్), 3. కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర, హరియాణా). -
షమీకి అర్జున.. చిరాగ్, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్‌టైమ్), ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు 2023: చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్) రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ (బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు 2023: ఓజాస్ ప్రవీణ్ దియోటలే (ఆర్చరీ) అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్) పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్) మొహమ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్) ఆర్ వైశాలీ (చెస్) మొహమ్మద్ షమీ (క్రికెట్) అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్) దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్) దీక్షా దాగర్ (గోల్ఫ్) కృషణ్ బహదూర్ పాఠక్ (హాకీ) పుఖ్రంబం సుశీల చాను (హాకీ) పవన్ కుమార్ (కబడ్డీ) రీతు నేగి (కబడ్డీ) నస్రీన్ (ఖోఖో) పింకీ (లాన్ బౌల్స్) ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్) ఈషా సింగ్ (షూటింగ్) హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్) అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) సునీల్ కుమార్ (రెజ్లింగ్) అంటిమ్ (రెజ్లింగ్) నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు) శీతల్ దేవి (పారా ఆర్చరీ) ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్) ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్): లలిత్ కుమార్ (రెజ్లింగ్) ఆర్ బి రమేష్ (చదరంగం) మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్) శివేంద్ర సింగ్ (హాకీ) గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్) ఈ భాస్కరన్ (కబడ్డీ) జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్) ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్ (కబడ్డీ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్) కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్) -
ఖేల్ రత్న అవార్డుకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి నామినేట్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా ప్రతిష్టాత్మక ‘ఖేల్‌రత్న’ అవార్డు కోసం రేసులో నిలిచారు. మరోవైపు.. భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు అతని పేరును అవార్డు కోసం బీసీసీఐ సిఫారసు చేసింది. ఇటీవలి వన్డే ప్రపంచకప్‌లో షమీ 24 వికెట్లతో చెలరేగాడు. ముందుగా నామినేట్ చేసిన జాబితాలో షమీ పేరు లేకపోయినా... బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో అతని పేరును చేర్చారు. షమీ కాకుండా మరో 16 మంది ఆటగాళ్లు అర్జున అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇందులో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్, తమిళనాడు చెస్ ప్లేయర్ వైశాలి తదితరులు ఉన్నారు. -
ఖేల్‌రత్నకు శరత్ కమల్.. అర్జున బరిలో నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్‌కు ఖేల్‌రత్న అవార్డు రావడం గ్యారంటీ. ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది. ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్) చదవండి: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్ ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని -
‘ఖేల్ రత్నా’లకు పట్టాభిషేకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’కు ఈసారి ఏకంగా 12 మందిని ఎంపిక చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్)... 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్... పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనీ లేఖరా (పారా షూటింగ్), మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), సుమిత్ అంటిల్ (పారా అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్)... 22 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్, 19 ఏళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్న కెప్టెన్ సునీల్ ఛెత్రిలకు ‘ఖేల్ రత్న’తో గౌరవించారు. ‘ఖేల్ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ‘అర్జున అవార్డు’ను అత్యధికంగా 35 మందికి అందజేశారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులు 15 మంది, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు నుంచి ఇద్దరు ఉన్నారు. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తోపాటు భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా కూడా ‘అర్జున’ అందుకున్న వారిలో ఉన్నారు. ‘అర్జున’ అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డును లైఫ్‌టైమ్ కేటగిరీలో ఐదుగురికి... రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి అందజేశారు. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు
Mithali Raj Becomes First Indian Woman Cricketer To Receive Khel Ratna Award: భారత మహిళా క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించనుంది. క్రీడల్లో భారత దేశపు అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలువనుంది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు పురుష క్రికెటర్లను మాత్రమే వరించింది. 1998లో సచిన్ టెండూల్కర్, 2008లో ఎంఎస్ ధోని, 2018లో విరాట్ కోహ్లి, 2020లో రోహిత్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన 38 ఏళ్ల మిథాలీ.. 10 వేలకు పైగా పరుగులతో పాటు మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ ఆమె 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇదిలా ఉంటే, ఈ అవార్డుకు మిథాలీతో పాటు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు నామినేట్ అయ్యారు. వీరితో పాటు మరో 34 మంది ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు ఉన్నారు. చదవండి: నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా.. -
నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా..
Mithali And Neeraj Among 11 Recommended For Khel Ratna Award: ఒకవైపు ఒలింపిక్ పతక విజేతలు... మరోవైపు ముగ్గురు జాతీయ జట్ల కెప్టెన్లు... దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి తగిన అర్హత ఉన్న ఆటగాళ్లను ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను ఎంపిక కమిటీ ప్రతిపాదించగా... వీటికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఊహించిన విధంగానే ‘ఖేల్‌రత్న’ చెంత చేరగా... సుదీర్ఘ కెరీర్లో జాతీయ జట్టుకు సేవలు అందించిన భారత ఫుట్‌బాల్, హాకీ, మహిళల క్రికెట్ జట్ల సారథులు సునీల్ ఛెత్రి, శ్రీజేశ్, మిథాలీ రాజ్‌లకు ఈ అవార్డు మరింత శోభ తెచ్చింది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచి్చన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) ప్రస్తుతం భారత్‌లో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనడమే గొప్ప విజయంగా ఇన్నాళ్లూ భావిస్తూ రాగా, ఏకంగా స్వర్ణ పతకంతో మెరిసి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఐదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మొదలైన ఈ జావెలిన్ త్రోయర్ విజయ ప్రస్థానం టోక్యోలో ఒలింపిక్స్ గోల్డ్ వరకు చేరింది. 2018లో ‘అర్జున’ అందుకున్న 24 ఏళ్ల నీరజ్ ఒలింపిక్ ప్రదర్శనకు ‘ఖేల్‌రత్న’ అవార్డు ఒక లాంఛనంలాంటిదే. సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్ ప్రపంచంలో ఏమాత్రం గుర్తింపు లేకుండా ఎక్కడో మూలన మిణుకుమిణుకుమంటూ కనిపించే భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా సునీల్ ఛెత్రి ఊపిరి పోస్తున్నాడు. 16 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛెత్రి 120 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 80 గోల్స్ సాధించిన అతను ఇటీవలే దిగ్గజ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీతో సమంగా నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్ చేసిన ఛెత్రి... ఫుట్‌బాల్‌లో తొలి ‘ఖేల్‌రత్న’ కావడం విశేషం. 2011లో అతను ‘అర్జున అవార్డు’ గెలుచుకున్నాడు. రవికుమార్ దహియా (రెజ్లింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకానికి దక్కిన గుర్తింపు ఇది. హరియాణాలోని సోనెపట్‌లో ‘మ్యాట్’ల నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచే వరకు రవి తన పట్టుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒలింపిక్ విజయానికి ముందు 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతని అత్యుత్తమ ప్రదర్శన కాగా... రవికి ప్రభుత్వం తరఫున ఇదే తొలి పురస్కారం. ఒలింపిక్స్‌కు ముందే అతని పేరును ‘అర్జున’ అవార్డు కోసం ఫెడరేషన్ ప్రతిపాదించినా... టోక్యో విజయంతో అతని అవార్డు స్థాయి సహజంగానే పెరిగింది. లవ్లీనా (బాక్సింగ్) అసోంకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన లవ్లీనా వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించి ఒలింపిక్స్ దిశగా దూసుకెళ్లింది. గత ఏడాదే ఆమెకు ‘అర్జున’ పురస్కారం దక్కింది. తనకు లభించనున్న ‘ఖేల్‌రత్న’ అవార్డును తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు లవ్లీనా తెలిపింది. మిథాలీ రాజ్ (క్రికెట్) 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్... 10 వేలకు పైగా పరుగులు... ఒకటా, రెండా...అంకెలకు అందని ఎన్నో ఘనతలు భారత స్టార్ మిథాలీ రాజ్ అందుకుంది. భారత మహిళల క్రికెట్‌కు పర్యాయపదంగా మారి రెండు తరాల వారధిగా నిలిచిన మిథాలీ అమ్మాయిలు క్రికెట్లోకి అడుగు పెట్టేందుకు అసలైన స్ఫూర్తిగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్, ఆటతో కొనసాగడమే కాకుండా భారత టెస్టు, వన్డే జట్టు కెపె్టన్‌గా కూడా జట్టును నడిపిస్తోంది. 1999లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాదీ కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు చేరాయి. ఇప్పుడు ‘ఖేల్‌రత్న’ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలవడం సహజ పరిణామం. 2003లోనే ‘అర్జున’ అందుకున్న మిథాలీ సాధించిన ఘనతలకు ‘ఖేల్‌రత్న’ నిజానికి బాగా ఆలస్యంగా వచ్చినట్లే భావించాలి! భారత్ తరఫున మిథాలీ 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. పీఆర్ శ్రీజేశ్ (హాకీ) భారత హాకీకి బలమైన ‘గోడ’లా నిలుస్తూ అనేక అంతర్జాతీయ విజయాల్లో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. గోల్‌కీపర్‌గా అనేక ఘనతలు సాధించిన అతను జట్టు కెపె్టన్‌గా కూడా వ్యవహరించాడు. కేరళకు చెందిన శ్రీజేశ్ 244 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో అతను భాగస్వామి. అంతకుముందే కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, చాంపియన్స్ ట్రోఫీలలో చిరస్మరణీయ విజయాలు సాధించిన జట్లలో శ్రీజేశ్ కూడా ఉన్నాడు. 2015లో అతనికి ‘అర్జున’ పురస్కారం లభించింది. ఐదుగురు పారాలింపియన్లకు ‘ఖేల్‌రత్న’ ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సుమీత్ అంటిల్ (జావెలిన్ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం అవని లేఖరా (షూటింగ్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాక్ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. ఏం చేశారో చూడండి..! -
ఇకనైనా గుర్తించాలి
చెన్నై: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో మనోళ్లు అడుగుపెడితే పతకాలతోనే తిరిగి రావడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ చెస్ క్రీడాకారుల విజయాలను మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని క్రీడాధికారులు గుర్తించడం లేదు. అందుకే ఏడేళ్లుగా ఒక్క చెస్ ప్లేయర్‌కు ‘ఖేల్‌రత్న’గానీ, ‘అర్జున అవార్డు’గానీ, కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డుగానీ, చెస్ క్రీడాభివృద్ధికి పాటుపడిన వారికి ‘ధ్యాన్‌చంద్’ అవార్డుగానీ రాలేదు. అయితే ఆదివారం ముగిసిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో కనబరిచిన ప్రదర్శనతో వచ్చే ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో చెస్ ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయని భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల ముఖాముఖి టోర్నీలు లేకపోవడంతో ఆన్లైన్ ఒలింపియాడ్ నిర్వహించగా భారత్... రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ ఓ ఇంటర్వూ్యలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ► ఒలింపియాడ్ విజయంతో చెస్‌పట్ల అంతా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. చెస్ ఆటగాళ్లకు ‘అర్జున’, కోచ్‌ల ‘ద్రోణాచార్య’ అవార్డులు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. కొన్నిసార్లు కొందరికి మన ఉనికిని చాటు చెప్పాల్సి ఉంటుంది. తాజా ఒలింపియాడ్ స్వర్ణంతో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నాను. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో చెస్ క్రీడాకారులు విజయాలు సాధిస్తున్నా క్రీడా మంత్రిత్వ శాఖ అస్సలు గుర్తించడం లేదు. ► ఇక అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సమాఖ్య వారు ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలపై సుదీర్ఘ లేఖలు రాసే బదులు ఇలాంటి విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించాలి. ► ఈ టోర్నమెంట్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నిజానికి నేను జట్టును ముందుండి నడిపించాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది ముఖాముఖిగా జరగాల్సిన రెగ్యులర్ చెస్ ఒలింపియాడ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాని బదులు ఆన్లైన్లో నిర్వహించడం నిజంగా అద్భుతం. ఈ 2020లో ముఖాముఖి టోర్నీలకైతే చోటే లేదు. దీంతో ఈ ఏడాది ఆసాంతం ఇక ఆన్లైన్ టోర్నీలే నిర్వహించాలి. ► భారత క్రీడాకారులంతా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. నేను ఆట మధ్యలో సహచరుల ఎత్తుల్ని గమనించాను. నిజంగా ప్రతి ఒక్కరు వేసిన ఎత్తులు నన్ను ఆశ్చర్యపరిచాయి. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. ► సీనియర్లే కాదు... భారత్‌లో జూనియర్లు, బాలబాలికలంతా బాగా ఆడుతున్నారు. దీంతో మన బెంచ్ పరిపుష్టిగా ఉంది. దీనివల్ల భవిష్యత్‌లో మన చెస్‌కు, మేటి ఫలితాలకు ఢోకా ఉండదు. ► భారత్, రష్యాల మధ్య జరిగిన ఫైనల్ రౌండ్ పోటీలను దేశవ్యాప్తంగా 60 వేల పైచిలుకు వీక్షించడం సంతోషించదగ్గ విషయం. ఇంతటి ఆదరణ నేను ఊహించలేదు. ఇక భారత్ విషయానికొస్తే ఈ విజయంతో కొత్త తరం కూడా భాగస్వాములవడం సానుకూలాంశం. -
తొలిసారి వర్చువల్‌గా క్రీడా పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి. ఈ ఏదాడి కోవిడ్ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్ నాటికి పతకాల సాధనలో భారత్ టాప్-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్‌లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు. (చదవండి: ఇదే నా నిరసన... ) ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చండీగఢ్, కోల్‌కతా, సోనపట్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది మొత్తం 74 మందికి అవార్డులు ప్రకటించగా.. వారిలో ఐదుగురికి రాజీవ్ ఖేల్ రత్న.. 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డులు అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. అవార్డు దక్కిన వారిలో కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారిలో రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వినేశ్ ఫోగట్ హాజరు కాలేదు. ఇక రోహిత్ శర్మ యూఏఈలోని ఐపీఎల్ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు. -
మెరుపు రత్నాలు
స్వర్ణం సాధించడం గొప్ప. రజతమూ తక్కువేం కాదు. కాంస్యం కూడా విలువైనదే. గెలుపు పతకాలు ఇవన్నీ. ఖేల్ రత్న.. అర్జున.. ఈ గెలుపు పతకాలకు తళుకులు. ఆ తళుకులకే మెరుపులు.. మహిళా క్రీడామణులు!! మహిళకు చిన్న గుర్తింపు రావడమే పెద్ద అవార్డు! ఇక పెద్ద అవార్డు వచ్చిందంటే అది దేశానికే గుర్తింపు. మహిళల నైపుణ్యాల సహాయం తీసుకున్న దేశం ముందుకు వెళుతుంది. మహిళల ప్రావీణ్యాలకు స్థానం కల్పించిన దేశం నాగరికం అవుతుంది. మహిళల ప్రతిభకు పట్టం కట్టిన దేశం ప్రపంచానికే దీటైన పోటీ, వెలుగు దివిటీ అవుతుంది. క్రీడారంగం అనే కాదు, ఏ రంగమైనా దేశానికి మహిళలు ఇచ్చే గుర్తింపు ఇది. అవును. దేశం మహిళలకు ఇవ్వడం కాదు, మహిళలు దేశానికి ఇవ్వడం. ఈ ఏడాది భారతీయ క్రీడారంగంలో వినేష్ ఫొగాట్, రాణీ రాంఫాల్, మణికా బాత్రా, మరో పదకొండు మంది మహిళలు దేశానికి గుర్తింపు ఇచ్చేవారి జాబితాలో ఉన్నారు. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలైన ‘ఖేల్ రత్న’, ‘అర్జున’ అవార్డుల జాబితా అది. వినేశ్ ఫొగాట్, రాణి రాంఫాల్, మణికా బాత్రా ‘ఖేల్ రత్న’ పరిశీలనలో ఉన్నారు. దీపికా ఠాకూర్, సాక్షి మాలిక్, మీరాబాయ్, ద్యుతీచంద్, దివ్య కర్కాన్, లవ్లీనా, మనూ బకర్, దీప్తి శర్మ, మధురిక, అదితి అశోక్, సారిక ‘అర్జున’ బరిలో ఉన్నారు. మరో క్రీడా అవార్డు ‘ధ్యాన్‌చంద్’కు.. విశాఖపట్నం బాక్సర్ నగిశెట్టి ఉషకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అవార్డు విజేతల పేర్లను వర్చువల్‌గా (ఆన్లైన్ కార్యక్రమం) ప్రకటిస్తారు. ఖేల్ రత్న వడపోతలో మిగిలిన ముగ్గురు మహిళలూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవారే. వినేష్ ఫొగాట్ రెజ్లర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు సాధించారు. 2019 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం సంపాదించారు. హర్యానాలోని కుస్తీ యోధుల కుటుంబం నుంచి వచ్చారు వినేశ్. ఈ ఆగస్టు 25కి ఆమెకు ఇరవై ఆరేళ్లు నిండుతాయి. బహుశా ఖేల్ రత్న ఈసారి వినేశ్ పుట్టినరోజు కానుక అవుతుంది. ‘ఫ్రీ స్టెయిల్’లో ఒడుపు ఆమె ప్రత్యేకత. రాణీ రాంఫాల్ మహిళా హాకీ టీమ్ కెప్టెన్. ఖేల్ రత్న అవార్డు పరిశీలనకు ఎంపికైన మూడో హాకీ ప్లేయర్, తొలి మహిళా హాకీ ప్లేయర్ రాంఫాల్. ఆమె నేతృత్వంలోనే 2017 ‘ఉమెన్స్ ఏషియా కప్’లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. 2018 ఏషియన్ గేమ్స్‌లో రాంఫాల్ టీమ్ రజత పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా అర్హత సాధించడానికి అవసరమైన 2019 క్వాలిఫయర్స్ గేమ్‌లో టీమ్ కొట్టిన గేమ్–ఛేంజింగ్ గోల్ ఆమెను ఖేల్ రత్న కమిటీ దృష్టిలో పడేలా చేసి ఉండొచ్చు. రాణీ రాంఫాల్ కూడా హర్యానా అమ్మాయే. వినేశ్ ఫొగాట్ కన్నా నాలుగు నెలలు చిన్న. పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి లాగుడు బండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. రాణి ఆరేళ్ల వయసులోనే హాకీ అకాడమీలో చేరారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఖేల్ రత్నకు కమిటీ పరిశీలనలో ఉన్న మరో మహిళ మణికా బాత్రా టేబుల్ టెన్నిస్ ప్లేయర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్‌లలో సింగిల్స్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. 2019 జనవరి నాటికి మణిక టాప్ ర్యాంక్ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రపంచంలో 47 ర్యాంకర్. (జనవరి 1–డిసెంబర్ 31 మధ్య క్రీడాకారులు సాధించిన విజయాలను అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటారు). మణిక న్యూఢిల్లీ అమ్మాయి. వినేశ్, రాంపాల్‌ల కన్నా వయసులో ఏడాది చిన్న. ‘షేక్‌హ్యాండ్ గ్రిప్’ ప్లేయింగ్ స్టయిల్లో నిష్ణాతురాలు. అది యూరోపియన్ స్టెయిల్. రాకెట్ హ్యాండిల్‌ని బిగించి పట్టుకుని ఉన్నప్పుడు ఆ పొజిషన్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోతున్నట్లుగా ఉంటుంది. పవర్‌ని, స్పిన్ని ఈ రకం గ్రిప్‌తో కావలసిన విధంగా నియంత్రించవచ్చు. పెన్హోల్డ్ గ్రిప్, వి–గ్రిప్, సీమిల్లర్ గ్రిప్ అనేవి కూడా ఉంటాయి. ఆ గ్రిప్‌లు కొట్టే బంతుల్ని షేక్‌హ్యాండ్ గ్రిప్‌తో ఎదుర్కోడానికి ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మణిక అందులో చెయ్యి తిరిగిన ప్లేయర్. ఇక ‘అర్జున’ అవార్డు పరిశీలనకు ఎంపికైన పదకొండుమంది మహిళలు కూడా మణికలా తమ ఆటల్లో ఏదో ఒక ప్రత్యేకమైన ‘గ్రిప్’ ఉన్నవారే. రాష్టపతి భవన్లో ప్రదానం చేసే అవార్డును ఆ ఉద్వేగంలో, ఆనందంలో.. పొదవి పట్టుకోడానికి ఎలాగూ ఆ గ్రిప్ ఉపయోగపడుతుంది. అయితే కరోనా వల్ల ఈసారి విజేతలు ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే ఆన్లైన్లో అవార్డుల ప్రకటనను వినవలసి ఉంటుంది. చిన్న నిరాశే అయినా.. చరిత్రలో ఆ నిరాశ పక్కనే సాధించిన ఘనతా ఉండిపోతుంది. నగిశెట్టి ఉష (బాక్సర్) ‘ధ్యాన్‌చంద్’ క్రీడా అవార్డు బరిలో ఉన్న ఉష సీనియర్ బాక్సర్. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో రెండు రజత పతకాలు, ఒక స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉంది. ఆట నుంచి రిటైర్ అయ్యాక అనేక మహిళా బాక్సర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఉష ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వేలో (విశాఖ) పని చేస్తున్నారు. -
‘పంచ’ ఖేల్‌రత్నాలు!
న్యూఢిల్లీ: భారత క్రీడా అవార్డుల చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదుగురిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ కోసం సెలెక్షన్ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మేటి క్రికెటర్ రోహిత్ శర్మ (మహారాష్ట్ర), మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (హరియాణా), టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా (ఢిల్లీ), భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ (హరియాణా), 2016 రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం నెగ్గిన దివ్యాంగ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు (తమిళనాడు) పేర్లను 12 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీ ఖరారు చేసింది. సోమ, మంగళవారాల్లో సమావేశమైన ఈ కమిటీ ‘ఖేల్‌రత్న’తోపాటు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ‘అర్జున’ కోసం ఎంపిక చేసిన జాబితాలో భారత సీనియర్ క్రికెటర్ ఇషాంత్ శర్మతోపాటు ఆర్చర్ అతాను దాస్, కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తదితరులు ఉన్నారు. సెలెక్షన్ కమిటీ పంపించిన అవార్డుల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం కేంద్ర క్రీడా శాఖకు ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో సెలెక్షన్ కమిటీ పంపించిన జాబితానే కేంద్ర క్రీడా శాఖ ఆమోదించి అవార్డీలను ఖరారు చేస్తుంది. కేంద్ర క్రీడా శాఖ ఆమోదించాకే అధికారికంగా జాతీయ క్రీడా పురస్కారాల జాబితాను ప్రకటిస్తారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో క్రీడా అవార్డులను అందజేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరగనుంది. రియో ఒలింపిక్స్ జరిగిన 2016లో అత్యధికంగా నలుగురికి ఏకకాలంలో ‘ఖేల్‌రత్న’ ఇచ్చారు. ‘రాజీవ్‌ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయిన ఐదుగురు ఆటగాళ్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘ధ్యాన్‌చంద్’ అవార్డు బరిలో ఉష జీవితకాల సాఫల్య అవార్డు ‘ధ్యాన్‌చంద్’ కోసం కమిటీ పంపించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మహిళా బాక్సర్ నగిశెట్టి ఉష కూడా ఉంది. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం... 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్లో పని చేస్తోంది. అర్జున అవార్డుల కోసం ప్రతిపాదించిన పేర్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్) పేరు కూడా ఉంది. -
శ్రీకాంత్‌పై అనుగ్రహం.. ప్రణయ్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శుక్రవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ పేరును ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం సిఫారసు చేసింది. మరోవైపు ‘అర్జున’ అవార్డు కోసం తన పేరును పంపకపోవడం పట్ల బహిరంగ విమర్శ చేసిన కేరళ ఆటగాడు, ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తప్పును అంగీకరించిన శ్రీకాంత్... గత ఫిబ్రవరిలో మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్ మ్యాచ్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ చివరి నిమిషంలో తప్పుకొని బార్సిలోనాలో మరో టోర్నీ ఆడేందుకు వెళ్లిపోయారు. భారత్ సెమీస్‌లో పరాజయం పాలై పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తూ ‘బాయ్’ అవార్డుల కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ‘బాయ్’ అతడిని క్షమించేసింది. ‘శ్రీకాంత్ తన తప్పు ఒప్పుకుంటూ మాకు మెయిల్ పంపించాడు. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడు. అతని ప్రతిభ, ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఖేల్‌రత్నకు అతని పేరును ప్రతిపాదించాం’ అని ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. మరోవైపు ప్రణయ్ మాత్రం పదే పదే ‘బాయ్’పై విమర్శలకు దిగుతున్నాడని ఆయన అన్నారు. అర్జున అవార్డుకు తనను కాకుండా సమీర్ వర్మ పేరును ప్రతిపాదించడంతో అసంతృప్తి చెందిన ప్రణయ్ ‘మళ్లీ అదే పాత కథ’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ప్రణయ్‌ను వివరణ కోరినట్లు సింఘానియా చెప్పారు. ‘గతంలోనూ ప్రణయ్ ఇలాగే చేశాడు. కానీ మేం చూసీ చూడనట్లు వదిలేశాం. ఈసారి మాత్రం అతని ప్రవర్తన మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశాం. సంతృప్తికర సమాధానం ఇస్తే సరి. లేదంటే అతనిపై గట్టి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘ఖేల్‌రత్న’కు అంజుమ్ నామినేట్
న్యూఢిల్లీ: భారత స్టార్ రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్‌ను అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేసినట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. యువ షూటర్లను మెరికల్లా తీర్చిదిద్దుతోన్న ప్రముఖ కోచ్ జస్పాల్ రాణాను ఈ సారీ ‘ద్రోణాచార్య’ అవార్డు బరిలో ఉంచినట్లు తెలిపింది. వీరితో పాటు పిస్టల్ షూటర్లు సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, మను భాకర్... రైఫిల్ షూటర్ ఎలవనీల్ వలరివన్ పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. అర్హులైన అత్యుత్తమ షూటర్లనే అవార్డుల కోసం నామినేట్ చేశామని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ పేర్కొన్నారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల అంజుమ్ 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది. షూటింగ్లో సంచలనాలు నమోదు చేస్తోన్న టీనేజ్ షూటర్లు మను భాకర్, సౌరభ్, అనీశ్ భన్వాలాలను... ప్రపంచ స్థాయి షూటర్లుగా తీర్చిదిద్దిన 43 ఏళ్ల జస్పాల్ రాణా ఈసారి ద్రోణాచార్య పురస్కారాన్ని ఆశిస్తున్నారు. గతేడాదే రాణాకు ద్రోణాచార్య దక్కకపోవడంతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా సెలక్షన్ ప్యానల్‌ను బహిరంగంగా విమర్శించాడు. -
అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. (చదవండి : సాయి ప్రణీత్‌కు ‘అర్జున’) భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందాడు. -
ప్రతిభకు పట్టాభిషేకం
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డును సగర్వంగా అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రీడాపురస్కారాలు ప్రదానం చేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డును కోహ్లితో పాటు ప్రపంచ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుకకు కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, మాతృమూర్తి సరోజ్ కోహ్లి, సోదరుడు వికాస్ హాజరయ్యారు. ‘ఖేల్ రత్న’ అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లి. గతంలో సచిన్ టెండూల్కర్ (1997–98), ధోని (2007)లు ఈ అవార్డు అందుకున్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లి గత కొన్నేళ్లుగా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. 2016, 2017లలో కూడా ఖేల్‌రత్న నామినీల్లో ఉన్నప్పటికీ అప్పుడు దక్కని అవార్డు మూడో నామినేషన్‌తో లభించింది. ఐదేళ్ల క్రితం (2013) ‘అర్జున’ అందుకున్న కోహ్లికి గతేడాది ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. తెలంగాణకు చెందిన భారత మహిళల డబుల్స్ నంబర్‌వన్ షట్లర్ నేలకుర్తి సిక్కి రెడ్డి ‘అర్జున అవార్డు’ను అందుకుంది. ఆమె గత మూడేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు మేటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్లను తయారుచేసిన ఆచంట శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాసరావు చెన్నైలో స్థిరపడ్డారు. ‘ఖేల్ రత్న’ విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు... ‘అర్జున’ గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీ అందించారు. ఈ రెండు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్, కోచ్‌లకు ద్రోణాచార్య, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్, టెన్సింగ్ నార్కే జాతీయ అడ్వెంచర్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. జాతీయ అడ్వెంచర్ పురస్కారాల్లో భాగంగా టెన్సింగ్ నార్కే అవార్డును ఈసారి ఆరుగురు అమ్మాయిలకు అందజేశారు. భారత నావిక దళానికి చెందిన బొడ్డపాటి ఐశ్వర్య, పాతర్లపల్లి స్వాతి, పాయల్ గుప్తా, వర్తిక జోషి, విజయా దేవి, ప్రతిభ జమ్వాల్ ఈ అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య, వైజాగ్ అమ్మాయి స్వాతి తదితరులు లెఫ్టినెంట్ కమాండర్ వర్తిక జోషి నేతృత్వంలో ఐఎన్ఎస్వీ తరిణి నావలో 254 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. ఈ ఏడాది ఇద్దరికి ఖేల్‌రత్న దక్కగా, 20 మంది అర్జునకు, ఎనిమిది మంది కోచ్‌లు ద్రోణాచార్య అవార్డులకు ఎంపికయ్యారు. జీవిత సాఫల్య పురస్కారమైన ధ్యాన్‌చంద్ అవార్డును నలుగురు మాజీ క్రీడాకారులు సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ చెత్రీ (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ చౌగలే (రెజ్లింగ్)లకు అందజేశారు. ప్రతీ ఏటా దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేసేవారు. ఈ సారి అదే సమయంలో ఆసియా క్రీడలు జరగడంతో వేడుక తేదీని మార్చాల్సి వచ్చింది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా అవార్డుల అంశం వివాదాస్పదమైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన రెజ్లర్ బజరంగ్ పూనియా ‘ఖేల్‌రత్న’ విషయమై న్యాయపోరాటం చేస్తానన్నాడు. క్రీడలమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌తో భేటీ అయ్యాక మెత్తబడ్డాడు. ఆర్చరీ కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజను ద్రోణాచార్య జాబితా నుంచి తప్పించడంతో ఆయన కోచ్ పదవికి రాజీనామా చేశారు. గతంలో క్రమశిక్షణ రాహిత్యం వల్లే ఆయన్ని తప్పించినట్లు తెలిసింది. విజేతల వివరాలు అర్జున: సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమ దాస్ (అథ్లెటిక్స్), సతీశ్ (బాక్సింగ్), స్మృతి మంధాన (క్రికెట్), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్‌ప్రీత్ సింగ్, సవిత పూనియా (హాకీ), రవి రాథోడ్ (పోలో), రాహీ సర్నోబత్, అంకుర్ మిట్టల్, శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బత్రా, సత్యన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), పూజ కడియాన్ (వుషు), అంకుర్ ధామ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య: సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్) విజయ్ శర్మ (వెయిట్‌లిఫ్టింగ్), ఆచంట శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్), సుఖ్‌దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). -
రాష్ట్రపతి భవన్లో ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానోత్సవం
-
రాజీవ్ ఖేల్‌రత్న అందుకున్న కోహ్లి
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో మంగళవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు వరించాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సైతం అవార్డు స్వీకరించారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో 20 మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకున్నారు. ఖేల్ రత్న పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు... ‘అర్జున’ అవార్డీలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం అందజేశారు. వాస్తవానికి జాతీయ క్రీడల దినోత్సవం (ఆగస్టు 29) రోజునే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగాలి. కానీ ఏషియన్ గేమ్స్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నేడు (సెప్టెంబర్ 25) నిర్వహించారు. ఈ రోజే ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులను కూడా అందజేశారు. అర్జున అవార్డు గ్రహితలు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డు గ్రహితలు: (రెగ్యులర్): ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్). లైఫ్‌టైమ్ విభాగం: క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు అందుకున్నవారు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
నేను అనర్హుడినా?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న దక్కకపోవడంపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బజరంగ్ ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య అత్యున్నత క్రీడా పురస్కారానికి బజరంగ్ పేరు సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు ఆ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఆవేదనకు గురైన బజరంగ్ నేడు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోనున్నాడు. ‘ఈ నిర్ణయం నన్ను విస్మయానికి గురిచేసింది. నిరాశలో కూరుకుపోయాను. యోగి భాయ్ (యోగేశ్వర్ దత్)తో మాట్లాడిన అనంతరం క్రీడల మంత్రితో సమావేశమవుతా. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ ఏడాది ఈ పురస్కారానికి నేను అర్హుడిగా భావిస్తున్నా. అందుకే ఈ అంశంపై మాట్లాడుతున్నా. అవార్డులు అడుక్కోవడం కాదు. కానీ... ఓ క్రీడాకారుడిగా ఖేల్‌రత్న అందుకోవడం చాలా పెద్ద గౌరవం’ అని బజరంగ్ వ్యాఖ్యానించాడు. -
కోహ్లికి ఖేల్‌రత్న.. సిక్కి రెడ్డికి అర్జున
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయమైంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి అర్జున అవార్డు పురస్కారం అందుకోనున్నారు. ఇక గతకొంత కాలంగా టేబుల్ టెన్నిస్‌లో ఎంతో మందికి శిక్షణనిస్తూ ఎన్నో పతకాలు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు అందుకోనున్నారు. ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కోచ్ శ్రీనివాసరావు, బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఇరువురుకి లభించిన అవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వ కారణమని పేర్కొన్నారు. ఇక గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అవార్డులకు ఎంపికైన ఇరు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి, కోచ్ శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు ఎంపికైనది వీరే.. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్). అర్జున అవార్డు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్) క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
‘ఖేల్ రత్నాలు’ కోహ్లి, మీరాబాయి
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి... 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాది ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేశారు. రిటైర్డ్ జస్టిస్ ఇందర్మీత్ కౌల్ కొచ్చర్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన అవార్డుల సెలెక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరితోపాటు ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డుల కోసం 20 మంది పేర్లను సెలెక్షన్ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆమోదం లభించాక ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను క్రీడాకారులు స్వీకరిస్తారు. ‘ఖేల్ రత్న’ పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు... ‘అర్జున’ అవార్డీలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఆసియా క్రీడల షూటింగ్లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ షూటర్‌గా గుర్తింపు పొందిన రాహీ సర్నోబాత్... ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన హిమ దాస్... కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో రెండు స్వర్ణాలు సాధించిన మనిక బాత్రాల ప్రదర్శనకు ‘అర్జున’ రూపంలో సముచిత గుర్తింపు లభించింది. మూడోసారి ఖాయం... టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న కోహ్లికి మూడో ప్రయత్నంలో ఖేల్ రత్న ఖాయమైంది. 2016, 2017లలోనూ బీసీసీఐ కోహ్లి పేరును నామినేట్ చేసినా తిరస్కరణకు గురైంది. 29 ఏళ్ల కోహ్లి ఇప్పటివరకు 71 టెస్టులు ఆడి 6147 పరుగులు... 211 వన్డేలు ఆడి 9779 పరుగులు... 62 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2102 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (58) రెండో స్థానంలో ఉండటం విశేషం. ‘డబుల్స్’ రాకెట్... తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయం కానుంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి పేరును సిఫారసు చేశారు. గత నాలుగేళ్లలో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు సాధించిన గొప్ప విజయాల్లోనూ సిక్కి భాగస్వామ్యం కూడా ఉంది. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి ఆమె ఇప్పటివరకు 10 స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 2014 ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ విభాగంలో కాంస్యం... 2014, 2016 ఉబెర్ కప్‌లో కాంస్యం... 2018 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం... మహిళల డబుల్స్ విభాగంలో కాంస్యం సిక్కి ఖాతాలో ఉన్నాయి. శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టి... గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ‘ఖేల్ రత్న’ రేసులో నిలిచినప్పటికీ... 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన మణిపూర్ లిఫ్టర్ మీరాబాయి చానువైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించింది. అయితే గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ప్రతిపాదిత పేర్లు: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్). అర్జున అవార్డులకు ప్రతిపాదిత పేర్లు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డులకు ప్రతిపాదిత పేర్లు (రెగ్యులర్): జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్). లైఫ్‌టైమ్ విభాగం: క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డులకు ప్రతిపాదిత పేర్లు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
‘ఖేల్‌రత్న’కు కోహ్లి
కోల్‌కతా: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కోహ్లిని ‘ఖేల్‌రత్న’కు నామినేట్ చేయడం ఇది రెండోసారి. 2016లోనూ అతని పేరును పంపినప్పటికీ ఒలింపిక్స్ జరిగిన ఏడాది కావడంతో పతక విజేతలు పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్)లతోపాటు దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్)కు ఉమ్మడిగా ఆ అవార్డు ఇచ్చారు. దీంతో కోహ్లికి నిరాశే ఎదురైంది. ఈసారి అతనికి ఈ అవార్డు వచ్చే అవకాశముంది. గత ఏడాది కోహ్లి నాయకత్వంలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 46 మ్యాచ్‌లు ఆడి 31 విజయాలు సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వ్యక్తిగతంగా కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 52 ఇన్నింగ్స్‌లు ఆడి 2,818 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. మరోవైపు కుర్రాళ్లను, యువ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దిన జూనియర్ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు... ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను క్రికెట్ బోర్డు నామినేట్ చేసింది. పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ బీసీసీఐ నామినీలను ధ్రువీకరించారు. ‘వివిధ కేటగిరీలకు బోర్డు తరఫున భారత ప్రభుత్వానికి నామినేషన్లను పంపాం. ద్రోణాచార్య అవార్డుకు ద్రవిడ్‌ను నామినేట్ చేశాం’ అని ఆయన తెలిపారు. ‘మిస్టర్ డిపెండబుల్’ మార్గదర్శనంలో జూనియర్ టీమిండియా ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. భారత్ ‘ఎ’ జట్టు కూడా విదేశీ గడ్డపై విజయాలు నమోదు చేసింది. గతంలో క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్‌లను ‘ద్రోణాచార్య’ కోసం బోర్డు సిఫార్సు చేసేది. కానీ ఒక క్రికెటర్‌కు పలువురు కోచ్‌లు నేనంటే నేనని ప్రకటించుకోవడంతో కొంతకాలంగా ‘ద్రోణాచార్య’ నామినీలను నిలిపివేసింది. కోహ్లి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు ‘ద్రోణాచార్య’ లభించినప్పటికీ అది బోర్డు నామినేషన్ ద్వారా కాదు. వ్యక్తిగత దరఖాస్తుతో దక్కింది. ‘అర్జున’కు బాక్సర్లు గౌరవ్, సోనియా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) గౌరవ్ బిధురి, సోనియా లాథర్‌లను ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. మహిళల కోచ్ శివ్ సింగ్, అతని సహాయకులు భాస్కర్ భట్, సంధ్య గురుంగ్లను ‘ద్రోణాచార్య’ పురస్కారానికి సిఫారసు చేసింది. -
పీవీ సింధు, సాక్షిలకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు, కాంస్యపతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ కు సముచిత గౌరవం దక్కింది. సింధు, సాక్షిలతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ లకు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం నలుగురు క్రీడాకారులకు ఈ అవార్డును ప్రకటించింది. సింధు ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకుంది. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా ఆమె రికార్డు నెలకొల్పింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె, అథ్లెట్ లలితా బాబర్, శివ థాపా, అపూర్వి చండీలా సహా మొత్తం 15 మందికి అర్జున అవార్డులను ప్రకటించారు. ఆరుగురుకి ద్రోణాచార్య అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగువ్యక్తి నాగపురి రమేష్ కు ఈ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలు: ఖేల్ రత్న: పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్ ద్రోణాచార్య: దీపా కోచ్ విశ్వేశ్వర్ నంది, నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్), సాగర్ మల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్) ధ్యాన్ చంద్ అవార్డు: రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్), సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వాన్ ధంగ్ ధంగ్ (హాకీ అర్జున అవార్డు: రహానె (క్రికెటర్), రజిత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), శివథాప (బాక్సింగ్), రాణి (హాకీ), విఘ్నేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్), సుబ్రతా పాల్ (ఫుట్ బాల్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా, సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్) -
దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు?
ఇప్పటివరకు జిమ్నాస్టిక్స్‌లో ఎక్కడా వినిపించని భారతదేశం పేరును తొలిసారి అంతర్జాతీయ యవనికపై గౌరవనీయమైన స్థానంలో నిలిపిన దీపా కర్మాకర్ పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నారు. దేశంలో క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం అయిన ఖేల్‌రత్నతో ఈ త్రిపుర జిమ్నాస్టును సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్ అంశంలో దీపకు కొద్దిలో కాంస్యపతకం తప్పింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్నకు పోటీ పడుతున్నట్లు తెలిసింది. అలాగే దీపకు చిన్నతనంలో శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా, సదుపాయాలు శూన్యమైనా.. పేదరికాన్ని సైతం తోసిరాజని దీప తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో ఆమె ప్రతిభ అద్భుతమని క్రీడా పండితులు అంటారు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు జిమ్నోవా అనే సంస్థ ఆమెకు జిమ్నాస్టిక్స్ దుస్తులు ఇచ్చింది. గత మూడు నెలల క్రితం వరకు ఆమె అవే దుస్తులను ఉపయోగించిందంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌లో జరిగిన రియో టెస్ట్ ఈవెంట్లో ఆమె క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా ఆమెకు గుర్తింపు వెల్లువెత్తింది. స్పాన్సర్లు కూడా ఆమెవెంట పడ్డారు. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలోనే నిలిచినా, దీప భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిందంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెను ప్రశంసించారు. దాంతో ఇప్పుడు ఆమె పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించాలని భావిస్తున్నారు.