Kiran Rao
-
‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు
‘లాపతా లేడీస్’ పేరు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’గా మారిపోయింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంతా, ఛాయా కందం లీడ్ రోల్స్‌లో నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్ (తప్పిపోయిన మహిళలు అని అర్థం). ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 1న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే వచ్చే ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం నామినేషన్ కోసం ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. కాగా ‘లాపతా లేడీస్’ అనే హిందీ టైటిల్ అంతగా రిజిస్టర్ కాదేమోనని, ఈ సినిమాకు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌లో ‘లాస్ట్ లేడీస్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ రావ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘లాస్ట్ లేడీస్’ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి మహిళలందరూ మా సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు వినోదాత్మకంగా అనిపించింది. పైగా పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న మహిళలకు పురుషులు సపోర్ట్ చేయడం అనే పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆమీర్‌ఖాన్. -
చాలామంది తండ్రులు చేసే తప్పే ఇది..! అమీర్ ఖాన్ సైతం..
బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావు సింగిల్ మదర్‌గా పిల్లల పెంపకం విషయంలో ఎదురయ్యే సాధకభాదల్ని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల కరీనా కపూర్‌తో జరిగిన విమెన్స్ వాంట్ వాంట్ అనే చాట్ షోలో కిరణ్ రావు తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతల్లో పాలుపంచుకోవడంపై చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేగాదు సింగిల్ పేరెంట్‌గా తన అనుభవాన్ని గురించి కూడా చెప్పారు. పిల్లల విషయంలో చాలామంది తండ్రులు చేసే అతి పెద్ద తప్పు గురించి చెప్పడమే గాక అమీర్ ఖాన్ కూడా అంతే అంటూ ఆ షోలో నిజాయితీగా మాట్లాడారు. ఇంతకీ పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పు ఏంటంటే..కిరణ్ రావ్ అమీర్ ఖాన్ దంపతులకు అజాద్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ బిజీ షెడ్యూల వల్ల పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కిరణ్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..మేము వివాహం చేసుకుని ఒక్కటైనప్పటికీ అమీర్ చాలా బిజీగా ఉండేవారని అన్నారు. తాము తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా అతడి తీరులో మార్పులేదు. ఇక తాను ఒక తల్లిగా తల్లిదండ్రులిద్దరూ అందించాల్సిన ప్రేమని కొడుకు ఆజాద్‌కి తానే అందించానని అన్నారు. ఆ సమయంలో అమీర్‌కి ఆజాద్‌కి సమయం కేటాయించడం అనేది ఓ పెద్ద సమస్యాత్మకమైన నిర్ణయంగా ఉండేది. తామిద్దరం కలిసి ఉండటం వల్ల అదంతా నేనే చూసుకున్నాను. ఎప్పుడైతే 2021లో విడాకులు తీసుకున్నామో అప్పుడు ఆజాద్ విషయం సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇక అమీర్ కూడా అజాద్ విషయంలో తానేం చేసింది గ్రహించాడు. నిజానికి చాలామంది తండ్రులు ఇలానే ఉంటున్నారు. పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటారు. అదంతా తల్లి బాధ్యత అన్నట్లుగా వదిలేస్తారు. అని భావోద్వేగంగా మాట్లాడారు కిరణ్ రావ్.సింగిల్ పేరెంట్‌గా..తనకు తన కొడుకుతో గడిపే క్షణాలన్నీ మంచిరోజులే అన్నారు. అతడు తనని నవ్వించే యత్నం చేస్తుంటాడని అన్నారు. తనను ఒక్క క్షణం కూడా నిశబ్దంగా ఉండనివ్వడని కొడుకు ఆజాద్ గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సమయంలో తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దుతగా నిలిచారని అన్నారు. వారి సహాయంతోనే మరింత సమర్థవంతంగా తన పిల్లవాడిని పెంచగులుగుతన్నాని అన్నారు. అయితే తల్లులు ఎప్పుడూ తండ్రుల్లా వారి బాధ్యతల విషయంలో తప్పించుకోరు. ఒకరకంగా ఇలా.. తల్లి పిల్లల మధ్య స్ట్రాంగ్ అనుబంధం ఏర్పడుతుందన్నారు. అంతేగాదు భవిష్యత్తులో సింగిల్ మదర్లకు వారి పిల్లలే పూర్తి ఆసరాగా ఉండి వారి బాగోగులను చూసుకుంటారని చాలా నమ్మకంగా అన్నారు. అయితే సింగిల్ మదర్ రోల్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు తండ్రి లేని లోటుని కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చారు. కాగా, గతంలో అమీర్ రియా చక్రవర్తితో జరిగిన పోడ్కాస్ట్లో "నా బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల కోసం సమయం కేటాయించలేకపోయాను. అందువల్లే ఇరా, ఇరా డిప్రెషన్‌తో బాధపడిందని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇక జునైద్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతడు కూడా నేను లేకుండానే గడిపాడు. కనీసం ఆజాద్ అయినా అలాకాకుడదని భావించి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తున్నా. అయితే నాకు కుటుంబం పట్ల బలమైన అనుభూతి ఉంది, కానీ ప్రేక్షకుల మనసుని గెలుచుకునే హీరో అవ్వాలనే తాపత్రయంలో ఫ్యామిలీకి దూరం అయ్యాను." అని అమీర్ చెప్పారు.(చదవండి: 'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!) -
మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!
‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్ సమ్వాద్’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్ అయిన సందర్భంగా జెండర్ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.మెరుగైన కృషిమహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్ నెక్ట్స్ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.ఆడ–మగ .. వేరుగా చూడనుఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తూ! మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’ అని అన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ఫెమినిజం మెరుపు‘లాపతా లేడీస్’ అని టైటిల్ చూసి ఫెమినిజం ఫైర్ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ -
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. అధికారిక ప్రకటన
హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన సినిమా 'లాపతా లేడీస్'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ కోసం మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)స్పర్ష్ శ్రీ వాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు. 'రేసుగుర్రం' ఫేమ్ రవికిషన్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?) -
అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్ రావ్
హిందీ హిట్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో నిలిస్తే తన కల నిజమౌతుందని దర్శక–నిర్మాత కిరణ్ రావ్ అన్నారు. నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రధారులుగా స్పర్శ్ శ్రీవాస్తవ, రవికిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం 2024 మార్చిలో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘ఆస్కార్‌కు ఈ సినిమాని పంపితే నా కల నిజం అవుతుంది. కానీ ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆస్కార్‌కు పంపే సినిమాలను ఎంపిక చేసేవారు మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ రావ్ పేర్కొన్నారు. మరి... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఎంపిక అవుతుందా? అసలు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ ఫైనల్‌గా ఆస్కార్ బరికి ఏ భారతీయ చిత్రాన్ని పంపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక 97వ ఆస్కార్ వేడుక మార్చిలో జరగనుంది. -
సుప్రీంకోర్టులో 'లాపతా లేడీస్' చిత్ర ప్రదర్శన
భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. దీంతో కోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో బాలీవుడ్ చిత్రాన్ని నేడు ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందించిన 'లాపతా లేడీస్' చిత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ సభ్యులు ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు చూడనున్నారు. ఇలాంటి అవకాశం దక్కించుకన్న ఏకైక సినిమాగా లాపతా లేడీస్‌కు దక్కింది.సుప్రీమ్ కోర్టు ఆవరణలో ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఈ స్క్రీనింగ్‌కు చిత్ర నిర్మాత, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో పాటు చిత్ర దర్శకులు కిరణ్ రావు కూడా హాజరుకానుంది. లింగ సమానత్వం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా స్క్రీనింగ్ సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో జరగనుంది. సమాజంలో లింగ సమానత్వం అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి నొక్కిచెప్పడంలో భాగంగా ఈ స్క్రీనింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈ స్క్రీనింగ్ ఉంటుంది. రిజిస్ట్రీ అధికారులను కూడా సినిమాకు ఆహ్వానించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే 'లాపతా లేడీస్' చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ నటించారు. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమై సినీ ప్రేమికుల ప్రశంసలు అందుకుంది. -
ఈనాడులో నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. ఎంవీవీ సత్యనారాయణ సవాల్
-
సినిమా దారుణంగా ఫ్లాప్.. ఆ బాధ్యత నాదే: దర్శకురాలు
లాపతా లేడీస్.. ఓటీటీలో హిట్ బొమ్మ. కానీ బాక్సాఫీస్ దగ్గరే ఫ్లాప్‌గా నిలిచింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.66 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి దర్శకురాలు కిరణ్ రావు స్పందించింది. 'ఒక రకంగా చెప్పాలంటే ధోబి ఘాట్, లాపతా లేడీస్.. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. బిజినెస్ జరగలేదుపద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ధోబి ఘాట్ మూవీకి ఆ కాలంలో ఓ మోస్తరు బిజినెస్ జరిగింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన లాపతా లేడీస్ ఆ మూవీ కంటే వెనకబడిపోయింది. అంటే ఒకరకంగా ఫ్లాప్ అయినట్లేగా! కలెక్షన్ల పరంగా చూసినా సక్సెస్ కాలేకపోయింది. వందల కోట్లు కాదు కదా కనీసం రూ.30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఫలితాలు ఇలా రావడానికి పూర్తి బాధ్యత నాదే!' అని చెప్పుకొచ్చింది.ఆ ఓటీటీలో..కాగా లాపతా లేడీస్ విషయానికి వస్తే.. నితన్షి గోయల్, ప్రతిభ రంత, స్పర్ష్ శ్రీవాత్సవ, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకనిర్మాత కిరణ్‌రావు డైరెక్ట్ చేసింది. కిరణ్ రావు, ఆమిర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్ -
విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ 'లాల్ సింగ్ చద్దా' ఘోరమైన డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా సరే కిరణ్ ఇంకా ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్నా కానీ తను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'మనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాం. అలానే బంధాలు అనేవి కొత్త రూపు సంతరించుకోవాలి. ఆమిర్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లపాటు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు నాకు ఆజాద్ (కొడుకు) తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరి కాదు. చాలామంది విడాకులు తీసుకున్నా తర్వాత ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటారు. నాకు ఆ విషయంలో భయం లేదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు నాకు ఇప్పటికీ అండగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు' అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చింది.కిరణ్ రావ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 'యానిమల్' రిలీజ్ టైంలో పరోక్షంగా మూవీపై సెటైర్ వేశారు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకు కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఈమె సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్'.. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి, భర్త నుంచి తప్పిపోతే ఏం జరిగిందనేదే స్టోరీ. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మరోసారి తన విడాకులు గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
విడిపోయినా కలిసికట్టుగానే.. మాజీ భార్యతో హీరో ఫన్డే
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి ముఖం మరొకరు చూడటానికే ఇష్టపడరు. అలాంటిది సన్నిహితంగా మెదులుతారా? సమస్యే లేదు! కానీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు మాత్రం విడిపోయినా సరే దంపతుల్లా కలిసి షికార్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన వారెవరూ డివోర్స్డ్ కపుల్ అనుకోనే అనుకోరు.వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసిన వీళ్లు రావ్- ఖాన్ హాలీడే అని రాసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫోటోల కూడా దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుస్సేన్ 90వ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలు స్పెషల్‌గా ఉండాలని బంధువులు, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్‌డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా ఉన్నారు.చదవండి: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ -
రెంట్ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్ హీరో మాజీ భార్య!
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్టైజింగ్ సంస్థల్లో పనిచేశా. లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్టైజింగ్ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్ రావు.. హీరో అమిర్ ఖాన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటివరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు. ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. -
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
లవ్ మ్యారేజ్.. అరేంజ్డ్ మ్యారేజ్.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్ నటి జీనత్ అమన్ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్ ఖాన్- కిరణ్ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.పేరెంట్స్ బలవంతం వల్లే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్స్టిట్యూట్లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది.కోతులుగా ఉన్నప్పుడు..కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్ సైకాలిజస్ట్ ఎస్తర్ పెరల్ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడిదానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్‌లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.అప్పుడు పరిచయం మాత్రమేకాగా ఆమిర్.. కిరణ్ రావు 'లగాన్' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్ హీరోగా నటించగా కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్ మంగళ్ పాండే, కిరణ్ రావు స్వదేశ్ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్ యాడ్స్‌కు కలిసి పని చేశారు. డేటింగ్.. పెళ్లిఅప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. 2021లో ఆమిర్- కిరణ్ విడిపోయారు.చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్ -
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్‌రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్‌కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్‌లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
ఒకరంటే ఒకరికి గౌరవం.. ఒక్కసారి కూడా గొడవపడలే!
విడాకులెందుకు తీసుకుంటారు? సఖ్యత లేకో, భేదాభిప్రాయాలు రావడం వల్లో, గొడవలు తలెత్తడం వల్లో, ప్రేమ తగ్గిపోవడం వల్లో.. దూరమవుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెలబ్రిటీ జంట మాత్రం మాకసలు గొడవలే లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిరణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమిర్.. రీనా దత్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అతడికి రెండో పెళ్లి. విడాకులు తీసుకునేముందు గొడవ? ఆమిర్-కిరణ్.. సరోగసి ద్వారా 2011లో ఆజాద్ రావుకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడవపడ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భర్తతో నేను బాగానే ఉంటాను. తల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్దరం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి అంటుంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మా అనుబంధం అలాంటిది కానీ ఆమిర్, నేను మాత్రం ఎప్పుడూ గొడవపడలేదు. వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చావి కానీ ఎన్నడూ గొడవపడలేదు. మేము ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం, ఒకరినొకరం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒకరు చెప్పేది మరొకరు వింటుంటాం. బహుశా దానివల్లే మా మధ్య ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. మా అనుబంధం అలాంటిది. అల్లకల్లోలానికి దారితీసే గొడవలు, చర్చలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజన్లు.. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మరి అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: బేబీ బంప్లో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమన్న మనోజ్ -
అమిర్ ఖాన్ మాజీ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్‌తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
మాజీ భార్యతో జతకట్టిన అమిర్ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి లాపాటా లేడీస్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ధోబీ ఘాట్ తర్వాత మరోసారి అమిర్ ఖాన్ తన మాజీ భార్యతో జతకట్టడంపై బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) కాగా.. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లపాటా లేడీస్ అనే చిత్రాన్ని ఇద్దరు నవ వధువుల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2001లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. కిరణ్ రావు, అమిర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వీరి బంధానికి 2021లో ముగింపు పలికారు. (ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions) -
అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనగానే అందరికీ హీరో ఆమిర్‌ఖాన్ గుర్తొస్తాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుండేవాడు. అయితే గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో దెబ్బ గట్టిగా తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దారుణంగా ఫెయిలయ్యేసరికి ఆలోచనలో పడిపోయాడు. కొన్నాళ్లపాటు నటన, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలా అని ఖాళీగా ఏం లేడు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్నాడు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) మాజీభార్యతో కలిసి ఆమిర్ ఖాన్.. తొలుత నిర్మాత రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట.. 2002లో విడిపోయింది. 2005లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్న ఆమిర్.. ఈమెతోనూ 16 ఏళ్లు సంసారం చేసి 2021లో విడాకులు ఇచ్చేశాడు. రిలేషన్ లో విడిపోయినప్పటికీ.. ఫ్రొఫెషనల్ గా వీళ్లు కలిసే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ నిర్మాణంలో కిరణ్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది. రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తోనూ ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. 'దంగల్' ఫేమా ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకుంటాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు మూవీస్ లోని ఒక దానిలో ఫాతిమా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'జయజయజయహే' రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ కానుంది. అటు మాజీ భార్య ఇటు ప్రేయసిని ఆమిర్ ఖాన్ భలే బ్యాలెన్స్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
ఎవరో గుర్తుపట్టారా? అబ్బే, ఆయన మాత్రం కాదు!
పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా? విలక్షణ నటుడు జగపతిబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! మరింకెవరునుకుంటున్నారా? బాలీవుడ్ బడా హీరో ఆమిర్ ఖాన్. తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఆమిర్ హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు చేపట్టాడు. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈ పూజ పూర్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమిర్ నుదుటన బొట్టుతో, చేతికి కంకణంతో, అదే చేత్తో కలశం పట్టుకుని కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్లు సడన్‌గా నాటకం మొదలుపెట్టాడేంటి?', 'నీ సినిమాలు ఫ్లాప్, నువ్వూ ఫ్లాప్.. మళ్లీ కొత్తగా ఇదేంటో', 'ఇండస్ట్రీ నిన్ను బయటకు గెంటేయకుండా ఉండేందుకు ఇలా ప్లాన్ చేశావన్నమాట' అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఆమిర్, కిరణ్.. మీ ఇద్దరినీ మేమెల్లప్పుడూ గౌరవిస్తాం' అని మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఆమిర్-కిరణ్‌లు గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇకపోతే ఆమిర్ నటించిన లాల్‌సింగ్ చడ్డా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన ఆయన ఏడాది తర్వాతే సినిమాల్లో నటించనున్నాడు. Guess the man in the pic.. pic.twitter.com/z0QugsVLYx — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) December 8, 2022 చదవండి: బ్రేకప్దాకా వెళ్లాను, ఎవరికీ కనిపించకుండా పోదామనుకున్నా: సిరి నన్నెవరూ బ్యాన్ చేయలేదు: రష్మిక మందన్నా