kolleru
-
శీతాకాల అతిథుల సందడి
శీతాకాలం వచ్చేసింది.. కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా ⇒ ఉప్పలపాడు – గుంటూరు ⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం ⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా77,138 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వలస పక్షులకు విడిది వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.పక్షులు మంచి నేస్తాలు పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ఆకాశమే వాటి హద్దుసమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, కైకలూరు. -
కొండెక్కిన కొల్లేరు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల కేరింతలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచిన కొల్లేరు టూరిజంపై కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా కొల్లేరు టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ తూర్పు గోదావరికి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొల్లేరు పర్యాటకాభివృద్ధికి రూ.187 కోట్లతో డీపీఆర్‌లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొద్ది రోజుల క్రితం కొత్త రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం–అఖండ గోదావరి, సంగమేశ్వరం వంటి నాలుగు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి ప్రాంతమైన కొల్లేరు టూరిజానికి ఇందులో చోటు దక్కకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 4 నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. దక్షిణ కశ్మీరంగా దీనికి పేరు. జీవో నంబరు 120 ప్రకారం కొల్లేరు కాంటూరు–5 వరకు 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 9 మండలాల్లో కొల్లేరు పరీవాహక గ్రామాలుగా 122 ఉన్నాయి. మొత్తం జనాభా 3.2 లక్షల మంది ఉండగా, 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన వృత్తి చేపల సాగు. కొల్లేరు కాంటూరును 5 నుంచి 3కు కుదిస్తామని ప్రతి ఎన్నికల్లో టీడీపీ నాయకులు చెబుతున్నా అమలు కావడం లేదు. అటకెక్కిన టెంపుల్ టూరిజం ప్రతిపాదనలుకొల్లేరు విస్తరించిన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికం భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమామహేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వస్వామి ఆలయాలు, భీమవరం మావుళ్లమ్మ దేవస్థానాలు ఉన్నాయి. కొల్లేరు ప్రాంతమైన కైకలూరులో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొల్లేరు టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.వైఎస్ జగన్ పాలనలో రూ.187 కోట్ల ప్రణాళికజిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజానికి రూ.187 కోట్ల ప్రణాళికతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయాలని భావించారు. పర్యాటక శాఖ అధికారులు కొల్లేరులో 10 ప్రాంతాలను టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద డీపీఆర్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. పక్షులపై కానరాని ప్రేమకొల్లేరు సరస్సుపై ఇటీవల జరిగిన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్‌లో మొత్తం 105 రకాల పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులను గుర్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల కేంద్రం వాసికెక్కింది. ఇక్కడ అరుదైన పెలికాన్ పక్షులు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. అటవీ శాఖ 283 ఎకరాల్లో పక్షుల విహారానికి చెరువును ఏర్పాటు చేసింది. పక్షి నమూనా మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రానికి నిధుల కొరత వేధిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పరిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. వలస పక్షుల సందడి షురూకొల్లేరు ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల అందాలను తిలకించడానికి ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన కాలం. కొల్లేరు అభయారణ్యంలో 190 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సంచరిస్తుంటాయి. ప్రధానంగా కొల్లేరులో పెలికాన్ పక్షి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. కొల్లేరు ఇటీవల వరదలు, వర్షాలకు నిండుకుండలా మారింది. ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వచ్చి సంతానోత్పత్తితో తిరిగి స్వస్థలాలకు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. -
AP: భయం గుప్పిట్లో కొల్లేరు
సాక్షి,విజయవాడ: కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది.బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
ఆక్రమణలతోనే కొంప ‘కొల్లేరు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి ఆ నీరు చేరాలి. ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో అక్రమ చెరువు గట్లు అడ్డుపడుతున్నాయి. వరదల సమయంలో కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాల్వల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఇలా చేరిన నీరు కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. నేడు ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సుఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరిధిలో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. పర్యావరణవేత్తల ఆందోళన కారణంగా కొల్లేరు సరస్సును–5 కాంటూరు వరకు 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. ఏలూరు, ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. కొల్లేరుకు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాల్వ వంటి వాగుల ద్వారా భారీగా నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ఏకైక మార్గమైన మండవల్లి మండలం పెద యడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. మరో అడుగు చేరితే 13 లంక గ్రామాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అక్రమ చెరువులే అసలు కారణం.. వరదల సమయంలో కొల్లేరుకు చేరే వరద నీరు సముద్రానికి చేరడానికి అడ్డంకిగా ఉన్నది కొల్లేరు సరస్సులో అక్రమంగా తవి్వన చేపల చెరువులేనని అనేక మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రధానంగా గతంలో టీడీపీ పాలనలో వేలాది ఎకరాల కొల్లేరు భూమి ఆక్రమణలకు గురైంది. దీంతో పర్యావరణవేత్తల ఫిర్యాదులతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఇరు జిల్లాల్లో 25,142 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులను ధ్వంసం చేశారు.ప్రస్తుతం ఇంకా 15 వేల ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్టు అంచనా. తిరిగి కూటమి పాలన రావడంతో అక్రమ చేపల సాగు అధికమైంది. అధికారంలోకి వచి్చన టీడీపీ కొల్లేరు నాయకులు ఇటీవల అక్రమ దందాలకు తెర తీశారు. సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కొల్లేరు ప్రక్షాళనకు ఆదేశాలివ్వాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గ్రామాలకు రాకపోకలు బంద్.. ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, పోల్‌రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి ప్రతి ఏటా నీరు చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు –ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
తీర్పే బలం, బలగం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు. ⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతిఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానంకొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.పెద్దొడ్డి మాటేశిరోధార్యం..కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించిపొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులుకొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.మగ బిడ్డకూ వాటా..రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు. -
కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. పర్యాటకానికి పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే కొల్లేరులో టూరిస్ట్ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్ మెహరాజ్, పర్యాటక శాఖ అధికారి పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రికుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్టపరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కైకలూరు పర్యాటక రంగానికి ఊతం కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు -
కొల్లేరు ప్రజలకు మంచి రోజులు
కైకలూరు: కొల్లేరు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మంచి రోజులు వచ్చాయి. చిరకాల కలగా మిగిలిన సర్కారు కాల్వపై వారధి ప్రారంభానికి సిద్ధమైంది. సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద అతిపెద్ద అనివేటి మండప నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కారు కాల్వ వారధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారధిగా పేరు ఖరారు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గత ప్రభుత్వం భావించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్కడి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కొల్లేరు ప్రజల ప్రధాన వృత్తి చేపల సాగు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీలను తగ్గిస్తానని సీఎం జగన్ మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. టీడీపీ పాలనలో యూనిట్ ధర రూ.3.85 ఉండగా జగన్ ప్రభుత్వం రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిధుల ద్వారా సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, నాడు–నేడులో పాఠశాలల నిర్మాణాలు కొల్లేరు గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వారధి కల సాకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని తగ్గిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత రూ.3,500 కోట్ల పునరావాస ప్యాకేజీని ప్రజలకు అందించారు. ప్రధానంగా కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కారు కాల్వపై వారిధి నిర్మాణానికి 2009లో రూ.12 కోట్లను వైఎస్ కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పనులు జరగలేదు. గత ప్రభుత్వం అంచనాలు పెంచి రూ.14.70 కోట్లు కేటాయించిన పనులను పూర్తి చేయలేదు. సీఎం ప్రత్యేక శ్రద్ధతో స్థానిక ఎమ్మెల్యే డీఎన్నార్ వారధి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. తుది పనులు పూర్తికావడంతో ప్రారం¿ోత్సవ తేదీ ప్రకటించనున్నారు. అతిపెద్ద అనివేటి మండపం.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం అతి పురాతనమైనది. గత ప్రభుత్వ పాలనలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎండలో నిలబడాల్సి వచ్చేది. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజా విరాళాలు దాదాపు రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 305 మీటర్ల పొడవు, 105 మీటర్ల వెడల్పుతో భారీ అనివేటి మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన పనులు పూర్తయ్యాయి. వివిధ రకాల శిల్పాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా అమ్మవారి జాతరలో కలవబోనాలను అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతోంది పెద్దింట్లమ్మ దేవస్థాన అబివృద్ధికి ఎమ్మెల్యే డీఎన్నార్ విశేష కృషి చేస్తున్నారు. అతిపెద్ద అనివేటి మండపం త్వరలో పూర్తికానుంది. వారధి నిర్మాణం పూర్తికావడంతో ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రానికి అమ్మవారి దేవస్థానం మీదుగా వాహనాలు చేరే అవకావం ఉంటుంది. దీంతో కొల్లేరు పర్యాటకాభివృది్థతో పాటు అమ్మవారి దేవస్థానానికి నేరుగా బస్సు సౌకర్యం ఏర్పడుతోంది. – కేవీ.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థాన ఈవో, కొల్లేటికోట -
కొల్లేట్లో కొండచిలువ.. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో ‘రాక్ పైథాన్’
కొల్లేరంటే కిక్కిస పొదలు.. పెద్దింట్లమ్మ ఆలయం.. విభిన్న రకాల చేపలు.. వలస పక్షులు.. నీటి పిల్లులు.. అరుదైన కుక్కలకు మాత్రమే ప్రసిద్ధి అనేది మొన్నటి మాట. ఆ జాబితాలో ఇప్పుడు కొండ పాములుగా పిలిచే కొండచిలువలు(ఇండియన్ రాక్ పైథాన్లు) సైతం చేరిపోయాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఎగువ అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొల్లేరుకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఉప్పుటేరుల మధ్య పొదలు.. చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. కైకలూరు(ఏలూరు జిల్లా): కొండ చిలువలు చెట్లపై మాత్రమే ఉంటాయని భావిస్తుంటారు. ఇవి నీటిలో సైతం వేగంగా ఈదగలవు. ఎక్కువ సమయం ఇవి నీటిలోనే గడుపుతుంటాయి. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. కోళ్లు, పక్షులు, ఎలుకలు, అడపాదడపా ఇతర జంతువులను సైతం ఆహారంగా తీసుకుంటాయి. అలాంటి కొండచిలువలు ఇప్పుడు కొల్లేరుకు అతిథులయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల పరిధిలో.. 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.80 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు సాగవుతున్నాయి. ఈ చెరువుల చెంతకు సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండచిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పొదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్టవేశాయి. ఇట్టే పెరిగిపోతాయి ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, వరాహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. చేపల చెరువులపై కొండచిలువలు సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువల శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఇవి పుట్టిన తర్వాత త్వరగా పెద్దవి అవుతాయి. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి జత కడుతుంటాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పొడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఇవి మాంసాహారులు. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ప్రపంచంలో అతి పెద్ద పాముల్లో ఇది కూడా ఒకటి. కొండచిలువలకు అండ ఏదీ! కొండచిలువలు విషసర్పాలు కానప్పటికీ ప్రజల చేతిలో హతమవుతున్నాయి. వీటి ఆకారం భారీగా ఉండటంతో ప్రజలు భయపడి చంపేస్తున్నారు. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీ శాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు గ్రామాల్లో ఏటా 30 నుంచి 40 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. అటవీ శాఖ కొండచిలువలను కూడా షెడ్యూల్–1లో చేర్చింది. వీటిని చంపటం నేరమని ప్రకటించింది. చంపొద్దు.. సమాచారం ఇవ్వండి.. ఇండియన్ రాక్ పైథాన్లు అరుదైన సరీసృపాలు. ఇవి విషపూరితం కావు. చేపల చెరువుల వద్ద ఇవి సంచరిస్తున్నాయి. అరుదుగా జనాలకు తారసపడుతున్నాయి. ఇటీవల మత్స్యకారుల వలల్లో ఇవి చిక్కాయి. అటవీ శాఖ సిబ్బంది వీటిని అడవుల్లో సురక్షితంగా వదులుతున్నారు. కొండచిలువలు కనిపిస్తే వాటిని చంపొద్దు. వీటిని చంపటం నేరం. అందువల్ల ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం తెలియజేయండి. – జె.శ్రీనివాస్, అటవీ శాఖ రేంజర్, కైకలూరు -
కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ
సాక్షి, అమరావతి: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ(స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్‌గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వారం దేశవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేలలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్‌గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పెలికాన్ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని, అందుకే దీన్ని అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్‌ను నియమిస్తామని తెలిపారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి
కైకలూరు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లు చిదిమేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో గురువారం జరిగిన కొల్లేరు గ్రామాల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)తో కలసి ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 110 మంది కొల్లేరు గ్రామాల పెద్దలు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. మరో 15 గ్రామాల ప్రజలు పార్టీలో చేరాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కుల కట్టుబాట్ల కారణంగా ఒకే పార్టీకి చెందిన వ్యక్తికి ఓట్లు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనైనా కొల్లేరు ప్రజలు కట్టుబాట్లు కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని భూములు రీ సర్వే జరుగుతుందని, కొల్లేరు భూములు ఇందులో ఉంటాయని తెలిపారు. వైఎస్సార్ సీసీ నాయకులు ముంగర నరసింహారావు, కొండలరావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, పంజా రామారావు, కొల్లేరు పెద్దలు సైత సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, పెదవేగి రూరల్/ఏలూరు(సెంట్రల్): మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.. కొల్లేరు విషయంలో శాశ్వత పరిష్కారం చూపించేందుకు తిరిగి సర్వే చేయిస్తాం.. కొల్లేరువాసులు ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో కొల్లేరు ప్రజలు, మహిళలు, మత్స్యకారులతో ఏర్పాటుచేసిన ముఖాముఖీలో బుధవారం ఆమె మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, కొల్లేరు సమస్యలపై ప్రజలు ఆమె వద్ద ఏకరువు పెట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీకాకపోవడంతో వడ్డీకి అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించామని, పసుపు–కుంకుమ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తన బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందిస్తున్నారని షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకార అభివృద్ధి బోర్డు, రెగ్యులేటర్, ఎస్సీ సొసైటీలు, ఐదో కాంటూర్‌లో జిరాయితీ భూములు, నష్టపరిహారం, రీ సర్వే తదితర సమస్యలను కొల్లేరు గ్రామస్తులు షర్మిలకు వివరించారు. చింతమనేనికి ఓటుతో బుద్ధి చెప్పండి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహిళా తహసీల్డార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టిన సంఘటన తాను టీవీలో చూశానని.. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే అతను మనిషా.. పశువా అని ప్రశ్నించారు. చింతమనేనికి పోయేకాలం వచ్చిందని అతడిపై 38కి పైగా కేసులు ఉన్నాయంటేనే అర్థమవుతుంది అతడు ఏలాంటి వాడో అని అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. ఇది అతడిని చంద్రబాబు ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌కు ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని, కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని, కొల్లేరును రీసర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు జగనన్న నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని, పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని, డ్వాక్రా రుణమాఫీ చేసి ఆ సొమ్మును నేరుగా అక్క, చెల్లెమ్మలకు అందిస్తారని షర్మిల అన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలు చేస్తారని, జగనన్నకి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరి కష్టాలు తీరుస్తారన్నారు. పిల్లల చదువులకు ఎంత ఖర్చయినా ప్ర భుత్వమే భరించేలా జగనన్న చూస్తారన్నారు. దీంతో పాటు మెస్ ఛార్జీలకు రూ.20 వేలు ఇస్తారన్నారు. ప్రతి రైతుకు మే నెలలో రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తారని, రూ.3 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని, కరువు, వరదలతో పంటలు నష్టపోతే ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో నిధి ఏ ర్పాటుచేస్తారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసీ టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్నారు. రాజన్నరాజ్యం జగనన్నతోనే సా ధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ హామీతో సంతోషం: మండల కొండలరావు నా పేరు మండల కొండలరావు, మాది శ్రీపర్రు. కొల్లేరు చెరువులను చాలా వరకు ధ్వంసం చేయడంతో ఉపాధి కోల్పోతున్నాం. సుమారు లక్ష మంది వరకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయాలని, సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్రెడ్డికి కొల్లేరు ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో వినతిపత్రం ఇచ్చాం. మా సమస్యలు చట్టసభల్లో చెప్పేందుకు కొల్లేరు ప్రాంతానికి ఎమ్మెల్సీని ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలోని ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. జగన్ ఇచ్చిన మాట తప్పరు. ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. చింతమనేని వేధింపులు ఎక్కువయ్యాయి: జీవమణి నాపేరు జీవమణి, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలిని. మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్న నన్ను కాలపరిమితి ఉన్నా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కావాలనే పదవి నుంచి తొలగించారు. మానసికంగా వేధింపులకు దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. దీంతో నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే..: భలే జయలక్ష్మి నా పేరు భలే జయలక్ష్మి, గుడివాకలంక. ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది కదా అని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. అయినా సబ్సిడీ రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. మొదట డ్వాక్రా రుణమాఫీ విషయంలో మోసపోయాం. ఇళ్ల సబ్సిడీ విషయంలో మరోసారి మోసపోయాం. కేసులన్నీ బయటకు తీస్తాం: వైఎస్ షర్మిల బాధ్యత గత ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఆడామగా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళా తహసీల్దార్‌పై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ మనిషా లేక పశువా. 34 కేసులు ఉన్న ఈ రౌడీ ఎమ్మెల్యేకే సీఎం చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లడం అవసరమా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసులన్నీ బయటకు తీస్తాం. వలసలు పోవాల్సిన దుస్థితి: ఘంటసాల దుర్గ నా పేరు ఘంటసాల దుర్గ, మాది గుడిపాడు గ్రామం. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయని చెప్పి పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నారు. ఇవి వడ్డీలకు కూడా సరిపోవు. కొల్లేరు ప్రాంతంలోని చెరువులను కొట్టివేయడంతో ఉపాధి లేక వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఓట్ల కోసం మోసం చేస్తున్నారు: వైఎస్ షర్మిల గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయని పసుపు–కుంకుమ అంటూ డబ్బులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. ఆ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోదు. ఓట్ల కోసం చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మహిళలంతా గుర్తించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చెరువులను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే: తిరుపతిరావు నా పేరు సైదు తిరుపతిరావు, మాది ప్రత్తికోళ్లలంక గ్రామం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు గ్రామాల్లోని చెరువులన్నీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వాధీనం చేసుకుని, చెరువుల్లో చేపలను అమ్ముకున్నారు. ఇలా మూడేళ్లుగా రూ.13 కోట్ల వరకు దోచుకున్నారు. ఐక్యంగా ఉండే గ్రామస్తుల మధ్య గొడవలు పెట్టి వర్గాలుగా తయారుచేయడంతో గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. ఏడు నెలల నుంచి ఏలూరులో తలదాచుకుంటున్నా. ఎమ్మెల్యే చింతమనేని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోగా తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే..: వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు అలా ఉన్నారు కాబట్టే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, చింతమనేని ప్రభాకర్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేయండి. త్వరలో రాబోయే రాజన్న రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వే చేయిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. -
‘వైఎస్సార్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. -
జేపీ, జేడీలకు లేని ఆంక్షలు నాకెందుకు: పవన్
కొల్లేరు(పశ్చిమగోదావరి జిల్లా) : జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే ఎందుకు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొల్లేరులో యాత్రకు కట్టుబాట్లు విధించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని తానంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని ఆరోపించారు. గత రాత్రి తనపై దాడి చేయడానికి కూడా వచ్చారని తెలిపారు. తాను చేతులు కట్టుకుని కూర్చోనని, తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరికలు పంపారు. తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయితే రూ.110 కోట్లు పెట్టి కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. తనను గెలిపించకపోయినా పర్వాలేదు గానీ, తన వెనక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని కొల్లేరు పర్యటనలో పవన్ పిలుపునిచ్చారు. -
కొంప ‘కొల్లేరు’ చేసింది బాబే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘కొల్లేరు’ రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కొల్లేరు రైతుల గురించి ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,600 ఎకరాల జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం చూసి అధికార యంత్రాంగం విస్తుబోతోంది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సాధికార కమిటీ అనుమతి లేనిదే కొల్లేరు అభయారణ్యంలో సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 20,600 ఎకరాలను అభయారణ్యం నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, రైతులకు ఇచ్చేస్తామని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని అధికారులు, పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదు? వాస్తవానికి కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 3 నుంచి 5కు పెంచడం ద్వారా రైతులను దగా చేసింది చంద్రబాబే. మూడో కాంటూరు వరకూ 135 చదరపు కిలోమీటర్ల పరిధిలో 33,750 ఎకరాలకే పరిమితమైన కొల్లేరు అభయారణ్యాన్ని ఐదో కాంటూరుకు పెంచారు. దీనివల్ల కొల్లేరు అభయారణ్యం విస్తీర్ణం 77,138 ఎకరాలకు(308 చదరపు కిలోమీటర్లకు) విస్తరించింది. ఈ మేరకు 1999 అక్టోబరు 4న చంద్రబాబు ప్రభుత్వం జీవో 120ను జారీ చేసింది. దీనివల్ల 20,000 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములు కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి కొత్తగా చేరాయి. ఫలితంగా ఆయా భూముల్లో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం లేక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలని, తమ భూములను అభయారణ్యం నుంచి మినహాయించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పలు మండలాల రైతులు ఉద్యమించారు. తర్వాత కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలంటూ చంద్రబాబు సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని ప్రకారం సీఎం నేతృత్వంలోని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు ఇదే తీర్మానం చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపించి చేతులు దులుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు 2015 సెప్టెంబరులో ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. దీన్నిబట్టే కాంటూరు కుదింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం ఆమోదం కోసం మోదీపై చంద్రబాబు ఏమాత్రం ఒత్తిడి తేలేదని తేటతెల్లమవుతోంది. తాజాగా కొల్లేరు రైతులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో చంద్రబాబు కళ్లు తెరుచుకున్నాయి. 3–5 కాంటూరు పరిధిలోని జిరాయితీ, పట్టా భూముల రైతులకు ఏదో మేలు చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నిజంగా తమ మేలు కోరే వారే అయితే ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పరిధిలోని అంశమని తెలిసినా.. కొల్లేరు కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,000 ఎకరాలకు పైగా జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇస్తామని చంద్రబాబు చెప్పడం వారిని మోసగించడమేనని అధికారులు అంటున్నారు. జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు నేతృత్వంలోని సాధికార కమిటీ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం (జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డు) ప్రతిపాదన పంపితేనే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. అయినా ఆయా భూములను తానే రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు చెప్పడం మోసగించే ప్రయత్నమేనని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామన్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కొల్లేరు రైతుల గోడు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరు వాసుల నుంచే ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. కొల్లేరు భూములు రీ సర్వే చేస్తామని ప్రకటించారు. నిర్ణయాధికారం సుప్రీంకోర్టుదే.. ‘‘కొల్లేరు సరస్సు కాంటూర్ కుదింపు లేదా భూముల మినహాయింపు అధికారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సెంట్రల్ సాధికార కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు కొల్లేరులో భూములను చేపల చెరువులుగా మార్చేసి, వ్యాపారం చేస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొల్లేరు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ – తల్లవజ్జుల పతంజలిశాస్త్రి, పర్యావరణవేత్త, రాజమండ్రి(ఫోటో నెంబర్ 1001) చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు ‘‘కొల్లేరు భూముల విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కొల్లేరు భూములు పంపిణీ చేయాలంటూ నాలుగేళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తిప్పి పంపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండంతో మళ్లీ భ్రమల్లో ముంచుతున్నారు’’ – ఘంటసాల లక్ష్మీ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు (1002) జగన్ హామీ ఇవ్వడం వల్లే.. ‘‘కొల్లేరు కాంటూరును కుదిస్తామంటూ నాలుగేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆశ పెట్టింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారం దక్కించుకున్న తర్వాత మోసం చేసింది. నాలుగేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మా సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు భూములపై మాట్లాడుతున్నారు’’ – ఘంటసాల బలరామయ్య, గుడివాకలంక (1004) -
మరోసారి రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
-
పేట్రేగిన చింతమనేని
- కొల్లేరులో చేపల పెంపకాన్ని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు - అనుచరులతో వచ్చి దూషణలు, బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే ఏలూరు రూరల్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. అక్రమ చేపల సాగును అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై జులుం ప్రదర్శించారు. కొల్లేరులో శనివారం జరిగిన ఈ సంఘటన అధికార పార్టీ నాయకుల దుర్మార్గాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంక పరిధి అటవీ భూమిలో 100 ఎకరాల విస్తీర్ణం గల 2 చెరువుల్లో చింతమనేని చేప పిల్లలు వేసేందుకు ప్రయత్నించారు. 10 లారీలలో చేప పిల్లలను చెరువు వద్దకు తరలించి అనుచరులకు సూచనలు చేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పెదపాడు, ఏలూరు, భీమడోలు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్లు గంగారత్నం, వెంకటరెడ్డి, ఈశ్వర్ సిబ్బందితో చెరువుల వద్దకు చేరుకుని, చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న చింతమనేని 50 మంది అనుచరులతో చెరువు వద్దకు చేరుకుని ‘ఎవడ్రా ఇక్కడ పనులు అడ్డుకున్నది. ఏమనుకుంటున్నార్రా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. చెరువులో పిల్లలు వేయండి’ అని అనుచరులకు చెప్పాడు. అనుచరులు చెరువులో పిల్లలు వేసేందుకు మరోసారి ప్రయత్నించడం తో సిబ్బంంది అడ్డుపడ్డారు. రెచ్చిపోయిన చింతమనేని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. ఈ సంఘటనతో అధికారులు వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా చూసుకుని ఆయన అనుచరులు చేప పిల్లలను చెరువుల్లో వేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ఫొటో లేదా వీడియో తీశారనే అనుమానంతో చింతమనేని అనుచరులు కొందరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్స్ లాక్కుని ఫొటోలు డిలీట్ చేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఏలూరు రేంజర్ శ్రావణ్‌కుమార్ నిర్ణయించారు. -
నో నెట్వర్క్.. ఓన్లీ వర్క్!
ఓ ఎస్సెమ్మెస్ అలర్ట్ లేదు... వాట్సాప్ చాటింగ్ లేదు... మనుషులంతా మొబైల్స్‌తో మింగిల్ అవుతోన్న ఈ రోజుల్లో ఎవరి చేతుల్లోనూ ఫోనులే లేవు. మొన్నటి వరకూ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్లో కనిపించిన దృశ్యమిది. ఓ ఇరవై రోజుల పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేనిచోట షూటింగ్ చేశారు. లొకేషన్ కొల్లేరుకు షిఫ్ట్ అయిన తర్వాత సిగ్నల్స్ వచ్చాయి. దీనిపట్ల సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందిస్తూ – ‘‘20 రోజులు చేతిలో మొబైల్ లేకపోవడం పీడకలలా అనిపించింది. సిటీకి వచ్చిన తర్వాత మొబైల్ డిటాక్స్ మంచిదే అనిపించింది’’ అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో చరణ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజులు గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతారట. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
కొల్లేరు కటకట
ఏలూరు : జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది. ఆసియాలోని పెద్ద మంచినీటి సరస్సు దుస్థితి ఇది. నిత్య జలం.. పచ్చతోరణం అన్నట్టుండే కొల్లేరును కరువు కాటేసింది. ఏప్రిల్ మొదట్లోనే కష్టాలను తెచ్చిపెట్టింది. సరస్సులో పలు ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. బీటలు వారడంతో పచ్చదనం కనుమరుగై పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. చుక్కనీరు జాడ లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న కొద్దిపాటి నీటి వద్ద విదేశీ పక్షులు సేద తీరుతున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు దుర్భిక్షానికి సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు. -
ఆక్వా ’బడా’యి
సిండికేట్‌గా బడా రైతులు ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం కొల్లేరులోకీ ప్రవేశం నిబంధనలకు తూట్లు జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా) చెరువులు అధికారికం అనధికారికం మొత్తం (ఎకరాల్లో ) చేపలు 2,00,000 20,000 2.20,000 రొయ్యలు 15,000 65,000 80,000 ==================================== మొత్తం 2,15,000 80,000 3,00,000 ఆకివీడు : జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు. బోదెలు, కాలువలు çకనుమరుగు భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కాలవల్లోకి ఉప్పునీరు రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది. ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులోకి తిమింగలాలు కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. నాలుగు సార్లు నారుమళ్లు చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి. ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప. వరి దండగ అనిపిస్తోంది పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. సత్యనారాయణ, రైతు, పెదకాపవరం అనుమతుల్లేకుండానే అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ -
ఆక్వా ’బడా’యి
సిండికేట్‌గా బడా రైతులు ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం కొల్లేరులోకీ ప్రవేశం నిబంధనలకు తూట్లు జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా) చెరువులు అధికారికం అనధికారికం మొత్తం (ఎకరాల్లో ) చేపలు 2,00,000 20,000 2.20,000 రొయ్యలు 15,000 65,000 80,000 ==================================== మొత్తం 2,15,000 80,000 3,00,000 ఆకివీడు : జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు. బోదెలు, కాలువలు çకనుమరుగు భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కాలవల్లోకి ఉప్పునీరు రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది. ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులోకి తిమింగలాలు కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. నాలుగు సార్లు నారుమళ్లు చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి. ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప. వరి దండగ అనిపిస్తోంది పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. సత్యనారాయణ, రైతు, పెదకాపవరం అనుమతుల్లేకుండానే అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ -
కేంద్రం దృష్టికి కాంటూరు సమస్య
తాడేపల్లిగూడెం : జిల్లాలో నెలకొన్న కొల్లేరు కాంటూరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ మద్దతు ధర పడిపోయిన సమయంలో ధరను పెంచి రైతులకు ఊరట ఇచ్చామన్నారు. రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే క్రమంలో కేంద్రం భూసారపరీక్షలు చేసి శాయిల్ హెల్త్‌కార్డులు ఇచ్చిందన్నారు. ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. పంట రుణాలు ఆరుశాతం అతితక్కువ వడ్డీకే బ్యాంకులద్వారా అందించడం, రైతులకు వ్యవసాయ ఆదాయం రెట్టింపు కోసం చర్యలను కేంద్రం చేపడుతోందన్నారు. పప్పుధాన్యాల కొరత నివారణకుగాను వాటి కనీస మద్దతు ధర పెంచడం ద్వారా ధరల పెరుగుదలకు కేంద్రం కళ్లెం వేసిందని హరిబాబు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం సంచలనాత్మకం లంచగొండితనం, అవినీతి, నల్లధనం కట్టడి చేయడం కోసం మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 17 లక్షల 50 వేల కోట్ల రూపాయల్లో 85 శాతం పెద్దనోట్లే అన్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చాయన్నారు. దేశంలో నల్లధన ం వెలికితీయడం, పాకిస్తా¯ŒS నుంచి దేశంలోకి వచ్చే నకిలీ కరెన్సీని అడ్డుకోవడం ద్వారా పారదర్శక లావాదేవీలకు అవకాశం కలిగిందని చెప్పారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అ««దl్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఎస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, కార్యదర్శి వేమా, ఐటీ సెల్ ఇ¯ŒSచార్జి సత్యమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు. -
కథ కాదు.. కొల్లేరు వ్యథ!
ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లూరు అక్రమంగా కొనసాగుతున్న చేపల సాగు జలమార్గం ద్వారా చేప పిల్లల రవాణా మంత్రి కామినేని పేరు చెప్పి హల్చల్ మూడేళ్లకు పెంచిన లీజులు కొల్లేరమ్మ.. కన్నీరు పెడుతోంది. అక్రమార్కులు చేస్తున్న గాయాలతో చిక్కిశల్యమైన కొల్లేరు తల్లి వ్యథ వర్ణనాతీతంగా మారింది. ఆపరేషన్ కొల్లేరును వెక్కిరిస్తూ ఆక్రమణల పర్వం మళ్లీ కొనసాగుతోంది. కొల్లేరు స్వచ్ఛతకు తూట్లు పొడిచేలా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది. అక్రమంగా చేపల చెరువులను సాగు చేస్తున్నా ఎవ్వరికీ పట్టని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కైకలూరు : కొల్లేరుకు అక్రమార్కుల చెర వీడడంలేదు. పేదల పేర్లు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా చేపల చెరువులు సాగు కొనసాగుతున్నా అటవీశాఖ అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. పట్టపగలు అభయారణ్యంలో చెరువుల తవ్వకం, అటవీ అధికారులు సీజ్ చేసిన వాహనాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లడం, ఇష్టారాజ్యంగా వ్యర్థాలు వేయడం ఇటీవల కొల్లేరులో బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతంలేని అక్రమాల పర్వం.. కొల్లేరు అభయారణ్యంలో ధ్వంసం చేసిన చేపల చెరువులతో పాటు ఇటీవల కొత్తగా తవ్విన వందలాది ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో 1200 ఎకరాలు, శృంగవరప్పాడులో 1500, గుమ్మళ్లపాడులో 800 ఎకరాల్లో ధ్వంసం చేసిన చెరువుల్లో తిరిగి చేపల సాగుకు సిద్ధమవుతున్నారు. వీటిలో ఇప్పటికే గుమ్మళ్లపాడులో జీరో సైజు చేప పిల్లలను వదిలారు. మండవల్లి మండలం దయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, పెనుమాకలంక, నందిగామలంక, కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, చటాకాయి, నత్తగుళ్లపాడు గ్రామాల్లో అభయారణ్యలో సాగు కొనసాగుతోంది. గతంలో జీరో పాయింట్ చేపల సాగు ఏడు నెలలకు పాట పెట్టేవారు. ఇప్పుడు మూడేళ్లకు రూ.కోట్లలో పాట పెట్టారు. జలమార్గం ద్వారా చేప పిల్లలు.. అక్రమ చెరువుల్లోకి చేప పిల్లల తరలింపునకు కొల్లేరులో జలమార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఆకివీడు, జంగంపాడు రేవుల నుంచి కొట్టాడ, కోటలంక, గుమ్మళ్లపాడు, సింగరాలతోటకు బోట్లలో చేప పిల్లలను తరలిస్తున్నారు. ఇందుకోసం పందిరిపల్లిగూడెం, గుమ్మళ్లపాడు వద్ద 11 పెద్ద బోట్లను సిద్ధం చేశారు. ఒక్కో బోటులో రెండున్నర టన్నుల చేప పిల్లలను తరలించవచ్చు. ఇవేకాకుండా 17 చిన్న బోట్లను సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి శృంగవరప్పాడుకు చేప పిల్ల రవాణా అవుతోంది. మంత్రి పేరు చెప్పి హల్చల్.. ఈ నెల 11న సీఎంతో జరిగిన కొల్లేరు సమావేశానికి ఓ చోట నాయకుడు వెళ్లాడు. అక్కడ నుంచి రాగానే ‘కొల్లేరులో ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు.. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్ అభయం ఇచ్చారు’ అంటూ నమ్మబలుకుతున్నాడు. అటవీ అధికారులకు ఇదే విషయం చెబుతున్నాడు. గతంలో అటవీ, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేయాలంటూ ఎకరానికి రూ.1500 వసూలు చేసి, స్వాహా చేశాడనే ఆరోపణలు ఆ చోటా నాయకుడిపై ఉన్నాయి. చెప్పగానే పార్టీ సమావేశాలకు లారీల్లో జనాలను తరలిస్తుండడంతో పాలకులు కూడా అతను ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారనే భావన అందరిలో ఉంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లేరును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చేప పిల్ల విడుదలను అడ్డుకుంటాం.. అభయారణ్యంగా గుర్తించిన కొల్లేరులో చేపల సాగు నిషేధం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చేపల చెరువులకు గట్లు ఏర్పాటు చేసుకుని మళ్లీ చేపల సాగుకు సిద్ధమవుతున్నారనే సమాచారం అందింది. సిబ్బందిని ఇప్పటికే గస్తీ పెట్టాం. జంగంపాడు నుంచి చేప పిల్లలు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండటంతో అటవీ శాఖ సిబ్బందిని నియమించాం. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. - జి.ఈశ్వరరావు, అటవీశాఖ డెప్యూటి రేంజ్ ఆఫీసరు, కైకలూరు -
కొల్లేరు ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారు?
కైకలూరు : ఎన్నికల ప్రచారంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5 నుంచి 3వ కాంటూరుకు కుదిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని నాయకులు పెద్దింట్లమ్మ వారధి శంకుస్థాపన పేరుతో అమాయక కొల్లేరు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పాట్రిక్పాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు శంకుస్థాపనకు వస్తున్నారన్నారు. వారు కాంటూరు కుదింపు, సొసైటీ, జిరాయితీ భూముల పంపిణిపై స్పష్టమైన హామీ ప్రకటించాలని కోరారు. కొల్లేరు ప్రజలకు న్యాయం జరగకపోతే పార్టీ తరుపున నిరాహార దీక్ష చేపడతామన్నారు. కొల్లేరులో తాగునీటి చెరువులను మంత్రి కామినేని తవ్వుకోమని చెబుతూ, మరో వైపు కేసులు పెట్టిస్తున్నారని డీఎన్నార్ ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి పంజా రామారావు, మండల మహిళా అధ్యక్షురాలు చింతల శ్యామలా, రైతు విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లూరి మంగారావు, నాయకులు అబ్దుల్ హమీద్, దండే రవిప్రకాష్, షేక్ సాలర్, బొల్లా సత్యనారాయణ, శ్యామ్‌సుందర్, మాలిక్, రామ్మోహనరావు, నంగెడ్డ నాగరాజు, సిరాజుద్దిన్, బాషా, రాము, ర ఫాయేలు, మంగిన భాస్కర్లు పాల్గొన్నారు. -
పోలవరం కాలువకు భారీ గండి
సీతారామపురం(నూజివీడు): నూజివీడు మండలం సీతారామపురం వద్ద రామిలేరుపై ఉన్న పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్ వింగ్‌వాల్‌కు అడుగుభాగంలో సోమవారం తెల్లవారుజామున భారీ గండి పడింది. దీంతో గోదావరి జలాలు రామిలేరు లోకి చేరి అక్కడి నుంచి కొల్లేరుకు తరలుతున్నాయి. గతనెల 8వ తేదీ నుంచి గోదావరి జలాలు వస్తుండగా గండిపడిన సమయంలో దాదాపు 4,800ల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. గతంలో పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద తమ్మిలేరుపై ఉన్న అక్విడెక్ట్‌కు గండి పడిన విధంగానే కాలువ లోపల భాగంలో నుంచి అండర్‌టన్నెల్ వింగ్‌వాల్(గోడ) కిందిభాగం గుండా గండి పడింది. భారీ గండి కావడం, నీటి ఉధృతి బాగా ఎక్కువగా ఉండడంతో రామిలేరులోకి 1200ల క్యూసెక్కుల వరకు వెళుతోంది. గండి పడిన విషయం తెలిసిన వెంటనే జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్ఈ వై శ్రీనివాస్‌యాదవ్, ఈఈ చినబాబు, నూజివీడు డీఎస్పీ వల్లూరి వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తదితరులు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సీతారామపురం, ఎంఎన్పాలెం, పల్లెర్లమూడికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలోనే హెచ్చరించిన ‘సాక్షి’ ..... రామిలేరుపై పోలవరం అండర్‌టన్నెల్ నిర్మాణపనులు జరుగుతున్నప్పుడే ‘సాక్షి’ హెచ్చరించింది. పనులను హడావుడిగా చేయడం వల్ల నీటి సరఫరా జరిగే సమయంలో లీకేజీలు ఏర్పడి గండి పడే అవకాశాలున్నాయని గతనెల 7వ తేదీన సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అండర్‌టన్నెల్ కాంక్రీట్పనులు హడావుడిగా చేయడం వల్ల ఎక్కడ ఏ చిన్నలోపం జరిగినా గండ్లు పడే అవకశాలుంటాయని కథనంలో హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదేపదే ఇంజినీరింగ్ అధికారుల వెంటపడి పనులను పూర్తిచేయించారు. దీనికి పోలవరం ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎన్నెస్పీ ఇంజినీరింగ్ అధికారులకు కూడా విధులు కేటాయించి రాత్రిపగలు అక్కడే డ్యూటీలు వేసి మరీ హడావుడి పనులు చేయించారు. ఎక్కడైనా లోపముంటే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గండి వద్దే కూర్చున్న మంత్రి దేవినేని ఉమా: గండి వద్దకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉదయం 11గంటలకు చేరుకొని పరిశీలించారు. పోలవరం కాలువ ఉన్నతాధికారులతో మాట్లాడి గండి పూడ్చేవరకు ఇక్కడే ఉండి పరిశీలిస్తానని తెలిపి పొద్దుపోయే వరకు అక్కడే ఉన్నారు. సీతారామపురం, పల్లెర్లమూడికి చెందిన స్థానిక రైతులు కూడా తరలివచ్చి గండి పూడ్చే పనుల్లో నిమగ్నమయ్యారు.