kollu ravindra
-
దళారీల ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్లైన్లో భారీగా ఇసుక బుకింగ్ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. తక్కువ రేటుకు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్‌లోడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్‌ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేపట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్‌లు, 25 స్టాక్ పాయింట్లు, 17 మాన్యువల్ రీచ్‌లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్‌లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్లైన్లో చేసుకోలేకపోతే రీచ్ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్‌తో విక్రయంవిశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్‌లు లేనందున చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్‌తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్‌్కగా కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్‌కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకందీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అర్హత గల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దురూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరు చొప్పున అవకాశం. ⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయం. ⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం–1956, డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. ⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ⇒ మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. ⇒ వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.ఆ దళారులు మీవాళ్లే కదా?⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్ మార్కెట్ ఆరోపణల పాటఅధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
మద్యం అమ్మకాల్లో తగ్గేదే లే!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు
-
మంత్రి వర్గంలో ఇద్దరికి చోటు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజకీయంగా ప్రాధాన్యమున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంత్రివర్గంలో రెండు పదవులు మాత్రమే దక్కాయి. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాణస్వీకా రంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రి వర్గంలో చోటు దక్కింది. నూతనంగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. టీడీపీలోని సీనియర్లు, సామాజికవర్గాల పరంగా తమకు మంత్రిపదవి ఖాయమనుకున్న వారికి నిరాశ తప్పలేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన కేపీ సారథికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. బీజేపీ నుంచి గెలుపొందిన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రులే. ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో అమాత్యులుగా విధులు నిర్వర్తించిన వారే. ఉమ్మడి కృష్ణాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అభిప్రాయాలు ఆయా పారీ్టల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొల్లు రవీంద్ర ప్రస్థానం ఇదీ.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్ర స్వగ్రామం బందరు మండలంలోని గరాలదిబ్బ. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసుడిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కనీ్వనర్‌గా, బీసీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రవీంద్ర 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కొలుసు పార్థసారథి ప్రస్థానం ఇలా.. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి చేరిన నూజివీడు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి కొలుసు పెద్ద రెడ్డయ్య మచిలీపట్నం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పార్థసారథి 2004లో అప్పటి ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎన్నికయ్యారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి, పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్లకు నిరాశ ఎనీ్టఆర్ జిల్లాలో పలువురు ఆశావహులకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నిౖకైన గద్దె రామ్మోహనరావు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కుతుందని ఆశించారు. విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమామహేశ్వరరావు కూడా తనకు చోటు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరాం తాతయ్యకు ఈ సారీ నిరాశే మిగిలింది. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కకుండా టీడీపీ సామాజికవర్గం వారే అడ్డుకొన్నారనే భావన నియోజకవర్గంలో వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీని వీడీ టీడీపీలో చేరి మైలవరం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌కు లోకేష్ ఆశీస్సులతో మంత్రివర్గం చోటు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి, జనసేన తరఫున అవనిగడ్డ నుంచి గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో చోటు ఖాయ మనే అనే ప్రచారం జరిగింది. ఎస్సీ మహిళ కోటాలో మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశించారు. గన్నవరం, గుడివాడ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, వెనిగండ్ల రాముకు కూడా అవకాశం లభించొచ్చని పార్టీ నాయకులు భావించారు. -
పోలింగ్ సరళి పరిశీలించాక ఓటమి ఖరారు చేసుకున్న కొల్లు రవీంద్ర
-
కొల్లు రవీంద్రలో కలవరం
పచ్చ పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా ఉన్న ఆ నేత నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సముద్ర తీరాన ఉన్న ఆ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. కాని ఈసారి మేమే గెలుస్తాం అంటూ టీడీపీ అభ్యర్థి పోలింగ్ రోజు డప్పు వేసుకున్నారు. అయితే సునామీలా పోటెత్తిన ఓటర్లు వచ్చింది ఎవరికోసం అన్నవిషయం పోలింగ్ ముగిసాక కాని ఆయనకు అర్థం కాలేదట. దీంతో ఆశల మేడలన్నీ కుప్పకూలి నిరాశలో కూరుకుపోయారట ఆ పసుపు పార్టీ అభ్యర్థి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో..? ఆ నేత ఎవరో చూద్దాం.ఎన్నికల్లో గెలిచే నాయకులు పోలింగ్‌కు ముందు..తర్వాత ఒకేలా ఉంటారు. మరింత జోష్‌గా ఉంటారు. కాని ఓడిపోయే అభ్యర్థులు పోలింగ్‌కు ముందు ఎంత హడావుడి చేసినా..పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులు అర్థం కావడంతో నిరాశకు లోను కావడం మామూలే. ఇప్పుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పరిస్థితి అలాగే తయారైందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మాటలు నమ్మిన కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మచిలీపట్నంలో ఈసారి కచ్చితంగా పసుపు జెండా ఎగరేయడం ఖాయమనుకున్నారట. అయితే పోలింగ్ రోజున ఓట్ల సునామీని చూశాక టీడీపీ వారికి కళ్ళు బైర్లు కమ్మాయట. ప్రారంభంలో ఆ ఓట్లన్నీ ప్రబుత్వానికి వ్యతిరేకమే అని సంబరపడ్డాక...సమయం గడిచే కొద్దీ వాస్తవం బోధపడింది. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకే ప్రజలు తరలివచ్చారనే విషయం వారికి ఆలస్యంగా అర్థమైంది.మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 1,96,680 ఓటర్లు ఉండగా.. వీరిలో 1,61,109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే 4,898 మంది మహిళలు అధికంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఆందోళనకు గురిచేస్తోందట. వాస్తవానికి గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి కేవలం ఈ ఐదేళ్లలో మచిలీపట్నం ప్రజలు చూశారు. దశాబ్ధాల కల బందరు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే బందరు పరిసరాలు పరిశ్రమలతో కళకళలాడతాయి. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు బందరులో మెడికల్ కాలేజ్ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొలివిడతలోనే బందరు మెడికల్ కాలేజీని నిర్మించి ప్రారంభోత్సవం కూడా చేశారు. కాలేజ్‌తో పాటు అద్భుతమైన ఆస్పత్రి కూడా కృష్ణా జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చింది.ఇవే కాకుండా ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు..భారీ ఎత్తున సంక్షేమ ఫలాలు కూడా అందుకున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే మచిలీపట్నం ప్రజలు ఓటేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. రాత్రి వరకూ వేచిఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు రావడంతో టీడీపీ నేతలు ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయని ఆశపడ్డారట. కానీ పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రలో కలవరం మొదలైందట. ఓటింగ్ లో భారీగా పాల్గొన్న వారిలో అధికంగా మహిళలే ఉండటంతో ఆందోళన మరీ ఎక్కువైందట.చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ... టీడీపీ సూపర్ సిక్స్ హామీలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేస్తాయని కలలు కన్న కొల్లు రవీంద్రకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదట. 2019లో 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 1.13 శాతం అధికంగా నమోదైంది. పోలింగ్ జరిగిన తీరు గమనించాక కొల్లు రవీంద్ర బందరు సీటుపై ఆశలు వదిలేసుకున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?
సాక్షి, మచిలీపట్నం: ‘ప్రభుత్వ ఆదేశాలతో పని చేసే రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తా అనడం కొల్లు అహంకారానికి నిదర్శనం’ అని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో అధికారులు రాత్రి వేళల్లో పనిచేయలేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పేదలకు మంచి చేసేదీ తామే అని అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని తనపై కొల్లు చేసిన ఆరోపణలకు పేర్ని నాని ఘాటుగా జవాబు ఇచ్చారు. కొల్లు హయాంలో పేదలతో పాటు విలేకరులకు ఇచ్చిన దొంగ పట్టాలు, ఆర్ఎస్సార్ రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను మీడియా ముందు ఆధారాలతో చూపారు. రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు. కొల్లు మంత్రిగా ఉండి మామతో కలిసి ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాడని విమర్శించారు. తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తామన్నారు. తాను ప్రజలకు ఏ రోజూ దొంగ పట్టాలు ఇవ్వలేదన్నారు. పదవి పోయే పది రోజుల ముందు విలేకర్లకు ఎలాంటి వార్డు నంబర్లు లేకుండా కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చారని, ఆ రోజు అందుకు ప్రభుత్వ అనుమతి, జీవో ఉందా అని ప్రశ్నించారు. విలేకరులకే దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసిన కొల్లు శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటన్నారు. 1977–78 తుపాన్లో నష్టపోయిన గిరిపురం మత్స్యకారులకు ఒక్కరికైనా టీడీపీ నేతలు ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, వారికి అండగా నిలిచి, రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించింది తానే అని చెప్పారు. విజయవాడలో నివసిస్తూ ఎన్నికల వేళ ఓట్లు కోసం బందరుకు వచ్చే కొల్లుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తన కుమారుడు పేర్ని కిట్టు బోగస్ శంకుస్థాపనలు చేస్తున్నారని అరోపించారని, అవి 70 శాతం పూర్తయిన పనులని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిట్టు ఎమ్మెల్యే అవటం ఖాయమని.. ప్రజలకు అతడే పట్టాలిస్తాడని అన్నారు. ఈ సమావేశంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు భారతి, విజయలక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఈ పేర్ని నాని ప్రాణం పోయినా దొంగ పనులు చేయడు
-
రెచ్చిపోయిన టీడీపీ నేత కొల్లు రవీంద్ర..
-
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్‌లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని.. ఇంగితజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారని, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికీ మేలు చేయలేదంటూ దుయ్యబట్టారు. ‘‘కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు. నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా?. 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి. నీలాంటి స్థాయిలేనివాడితో.. గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి?. ఏనాడైనా పేదవాడికి మేలు చేశావా?. మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు. మీ కుటుంబం కోసం నేను మాట్లాడను.. నాకు సభ్యత ఉంది’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బతికి చూపించు. మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర. ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు. రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి సీఎం జగన్ అండగా ఉంటారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్‌ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్‌ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
టీడీపీ కొల్లు రవీంద్రకి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
అది కొల్లు రవీంద్ర దిగజారుడుతనం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాజకీయాల్లో టీడీపీ నేత కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బురదజల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని కొల్లు రవీంద్ర చూస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు తననానికి నిదర్శనమని నాని మండిపడ్డారు. ‘‘గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు?. పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు?. సంపత్ అనే మున్సిపల్ కమీషనర్‌ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు? మీరు కాదా? అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చేయడు కూడా. రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేనే. పేదవాళ్లకు అండగా ఉండే వ్యక్తి పేర్నినాని అయితే.. తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు తాను అండగా నిలబడతా అని పేర్ని నాని ప్రకటించారు. చాలా మంది టీడీపీ నేతలు, ప్రత్యర్ధులతో తాను రాజకీయాల్లో పోటీ పడి నెగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
కొల్లు రవీంద్రకు పేర్నినాని స్ట్రాంగ్ వార్నింగ్
-
కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలని సూచించారు. బందరు అభివృద్ధి రవీంద్ర చేసిందేమిటో తాను చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్ విసిరారు. కాగా, పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడమనే ఒక శాపం ఇచ్చాడు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు. మదర్సా స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. మీ హయాంలో పోర్ట్ కట్టకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్. పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్ కాలేజ్ నీ హయంలో అంటున్నావ్. ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్. నువ్వు కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా?. ఇస్తే చూపించు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పేర్ని నాని చలవే. ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్‌ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం. కానీ, నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి. నేను నా కొడుకుని క్రొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి?. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. -
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణం ద్వారా అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన మాజీ సీఎం చంద్రబాబు నిర్వాకాలు సంతకాలు సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఆయనకు ఏమీ తెలియదంటూ బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాదనలో ఏమాత్రం నిజం లేదని నోట్‌ఫైళ్ల సాక్షిగా తేటతెల్లమైంది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, గుట్టు చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్‌కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, బార్లపై ఉన్న 9 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీని తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. ఈమేరకు సంబంధిత నోట్ ఫైళ్లపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!! ఆర్థిక శాఖ అనుమతి లేదు... కేబినెట్ ఆమోదం లేదు అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే కథ నడిపించింది. రెండు జీవోలకు కేబినెట్ తీర్మానం చేసి ప్రివిలేజ్ ఫీజు తొలగించే కీలకమైన జీవోను మాత్రం అడ్డదారిలో తేవడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు (ఏ 4 షాపులు) ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోతోంది. సాయంత్రం గుట్టుగా జీవో చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్లో చర్చించలేదు. అజెండాలో ఆ అంశమే చేర్చలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయలేదు. అనుమతి తీసుకోలేదు. అంటే కేబినెట్‌కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. బార్లలోనూ అదే బరితెగింపు... మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. ఈమేరకు చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని, అందుకోసం ఎకైŠస్జ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న ఓ సర్కుల్యర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఈమేరకు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యూలర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయించారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. నాటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు బుకాయించారు. తీవ్రంగా తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడాన్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈమేరకు తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. -
ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
సాక్షి, అమరావతి: మద్యం ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు లబ్ధి పొందారని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి పార్టీ నేతలకు, కావాల్సిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డబ్బు లావాదేవీల వ్యవహారాలు తదుపరి దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చారని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నోట్ ఫైల్‌ను సిద్ధం చేశారని, దీనికి అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని కాగ్ సైతం ధ్రువీకరించిందని చెప్పారు. ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపలేదని, మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించలేదని తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు పూర్తిగా రాజకీయ నిర్ణయమని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు తదితరులకు పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2018 జూలైకి ముందు నేరం జరిగినందున గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ముందుకెళ్లదన్నారు. అంతేకాక 31–10–23న పిటిషనర్లపై సీఐడీ కేసు నమోదు చేసిందని, ఆ వెంటనే వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అనంతరం చంద్రబాబు, రవీంద్రల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు ఫైల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరనేలేదన్నారు. అప్పటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లను క్రిమినల్ చర్యలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాతపూర్వక వాదనలను సమర్పించిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయనుంది. -
అస్మదీయులకు అడ్డగోలుగా..
-
టీడీపీ నాయకుడి దాష్టీకం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నానిపై కిడ్నాప్ కేసు నమోదైంది. వడ్డీ చెల్లించడం లేదంటూ అప్పు తీసుకున్న వ్యక్తిని బంధించగా.. తప్పించుకున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడైన కుంచే నాని వద్ద వర్రేగూడెంకు చెందిన ఎస్కే అమీన్ అలియాస్ మున్నా కుటుంబ సభ్యులు ఆర్థిక అవసరాల నిమిత్తం 2014లో రూ.4 లక్షల అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోకపోవడంతో అమీన్ కుటుంబం కొన్ని నెలలుగా వడ్డీ చెలించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుంచే నాని.. తాతా సురేష్ అనే వ్యక్తి సహాయంతో బుధవారం అమీన్ ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగా అతన్ని దుర్భాషలాడి బలవంతంగా బైక్ ఎక్కించుకొని బైపాస్‌రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో అమీన్‌ను బంధించి, అప్పు కట్టే వరకు వదిలేది లేదంటూ భీష్మించాడు. అతనిపై కర్రలతో దాడి చేశారు. జేబులో నగదు బలవంతంగా తీసుకుని సుమారు రెండు గంటల పాటు హింసించి వదిలారు. అక్కడి నుంచి బయట పడిన అమీన్ నేరుగా ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కుంచే నాని, తాతా సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కుంచే నాని, తాతా సురేష్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ ఇదే తీరు.. గత ప్రభుత్వంలో వడ్డీ వ్యాపారం పేరుతో అనేక మందిని హింసించిన కుంచె నాని.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేని వారిని బంధించి హింసిస్తున్నారు. ఇప్పుడు అమీన్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో కుంచే.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కుంచే నాని అతని అనుచరుడు సురేష్‌లపై కిడ్నాప్ కేసు నమోదు కాగా విషయం తెలుసుకున్న ఇరువురు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నారు. అయితే పోలీసులు ఇరువురిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మూడు బృందాలుగా ఏర్పడి కుంచే నాని, సురేష్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
‘కొల్లు రవీంద్ర.. బందరు కమల్‌హాసన్’
సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులని.. కానీ చేసేదంతా వేరేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బందరులో కొల్లు రవీంద్ర చేసిన నటన ముందు కమల్ హాసన్, ఎస్వీ రంగారావు లాంటి నటుల యాక్టింగ్ కూడా దిగదుడుపేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తాజాగా మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై కొల్లు రవీంద్ర దాడి చేశారు. డ్రామాలు చేసి.. దాడులు చేసి.. కేసులు పెట్టించుకుని మరీ బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటాడు. పదవి ఉన్నప్పుడు పని చేయడు. కానీ, పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలు ఆడతాడు. కొల్లు రవీంద్ర బందరుకు కమల్ హాసన్ లాండోడని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఆస్తులపై కన్నేసింది ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ ఉన్న స్థలం ఎవరిది?.. ప్రభుత్వ భూమి కాదా?. అబద్ధాలు, మోసాలు, డ్రామాలు ఆడే ఈ జన్మ అవసరమా? కొల్లు రవీంద్ర అని విమర్శలు గుప్పించారు పేర్ని నాని. మచిలీపట్నం టీడీపీ కార్యాలయానికి యాభై సెంట్ల ప్రభుత్వ భూమి లీజుకి కావాలని అడిగింది నువ్వు కాదా? మీ పార్టీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా? పోలీసులపై దాడులు చేసి.. మళ్లీ రక్షణకు పోలీసులనే ఆశ్రయిస్తారా?. బందరులో పోలీసులను ఎందుకు కొట్టారు?. కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తుల వల్లే రాజకీయ నాయకుల విలువలు ప్రజల్లో దిగజారిపోతున్నాయని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. -
మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పోలీసులపై పిడిగుద్దులతో కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఆర్ఎస్ఐ శంకర్ కిందపడిపోయారు. డీఎస్పీ అడ్డుకున్నా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చెప్పులు చూపిస్తూ పోలీసులపైకి టీడీపీ మహిళా కార్యకర్తలు దూసుకువచ్చారు. చదవండి: నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన బాలకృష్ణ -
కోర్టుకు హాజరైన లోకేశ్
విజయవాడ లీగల్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ నేతలు పలువురు ఓ ధర్నా కేసులో సోమవారం విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని 2020 జూన్ 12న అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై దాఖలైన కేసులో మాజీ మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలతో పాటు నాయకులు పట్టాభిరామారావు, దేవినేని చంద్రశేఖర్, జాస్తి సాంబశివరావులపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. విచారించిన న్యాయాధికారి జ్యోత్స్న కేసును జూలై 28కి వాయిదా వేశారు.