Krishna District Latest News
-
ఆర్పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ ఆర్పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడలోని రైల్వే స్టేడియంలో ఈ నెల 20 నుంచి జరిగాయి. ఈ టోర్నమెంట్లో జోన్లో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్స్ జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన గుంతకల్లు, హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఇరు జట్లు 20 ఓవర్లకు 178 పరుగులు చేసి స్కోరును సమం చేసి డ్రాగా ముగించాయి. దీంతో రెండు జట్ల మధ్య రెండు సూపర్ ఓవర్లను నిర్వహించగా, అందులో హైదరాబాద్ జట్టు విజయం సాధించి ట్రోఫీ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకల్లో విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని విజేత జట్టును అభినందించారు. అనంతరం విజేత జట్టు క్రీడాకారులకు పతకాలను అందజేసి జట్టు కెప్టెన్ డి.ప్రవీణ్‌కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఎస్సీ బి.ప్రశాంత్ కుమార్, ఏఎస్సీ మధుసూదన్, ఏఓఎం పి.రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. స్మార్ట్ ఎనర్జీ మీటర్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువతకు స్మార్ట్ ఎనర్టీ మీటర్ (విద్యుత్ మీటర్) టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జి. పవన్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది(పాస్/ఫెయిల్), ఐటీఐ, ఆపైన విద్యార్హత కలిగిన వారు, ఎలక్ట్రికల్ వర్క్‌లో అనుభవం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని, మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 78428 17348, 63027 20740లో సంప్రదించాల్సిందిగా కోరారు. -
‘పవర్’ చూపించాలి
మైలవరం: చైన్నెలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే సబ్ జూనియర్ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనేందుకు మైలవరం ఫిట్ జోన్ క్రీడాకారిణి పి. హిమసంజన ఎంపికై నట్లు జిమ్ కోచ్ బుడిపుటి వెంకట్రావు శుక్రవారం తెలిపారు. పోటీలలో పాల్గొనేందుకు వెళ్లున్న హిమసంజనకు డాక్టర్ ఉపేంద్ర, ఫిట్ జోన్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో కోచ్ వెంకట్రావు, తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, ప్రదీప్ , జిమ్ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఎన్టీఆర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి వర్రి మల్లేశ్వరరావు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.సౌత్ ఇండియా సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు హిమ సంజన -
No Headline
గుడ్లవల్లేరు: అనారోగ్యంతో డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా వాకింగ్‌కు వెళ్తున్నారా...అని అడిగిన తర్వాతనే వైద్యం చేస్తున్నారు. దీనిని బట్టి నడకకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్ధం అవుతుంది. 20 ఏళ్ల వరకు కళాశాలలు, మైదానాల్లో పెద్దవారు వాకింగ్, యువకులు జాగింగ్ చేసేవారు. అలా చేసేది కూడా ఆర్థికంగా స్థితిమంతులు, భారీ ఉద్యోగులు మాత్రమే. కాని ప్రస్తుతం కాలం మారింది. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అవకాశం ఉన్న ప్రతి చోట నలుగురు కలిసి నాలుగు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుడ్లవల్లేరు లాంటి మినీ టౌన్లో కూడా వాకర్స్ సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడం గమనార్హం. ఇక్కడ నడకదారులంతా కలసి గుడ్లవల్లేరు వాకర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఆరేళ్లుగా ఈ అసోసియేషన్‌ను నడిపించటమే కాకుండా ఆపదలో ఉన్న పేదలకు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ అసోసియేషన్‌లో వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంకు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఒకరేమిటి ఎన్నో రంగాలకు చెందిన వారంతా ఇందులో ఉన్నారు. నడక అనేది దినచర్యలో భాగం కావాలన్న నినాదంతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలను నూతనంగా చేరిన సభ్యులకు వివరిస్తున్నారు. గతంలో రైల్వేస్టేషన్, పెంజెండ్ర, గుడ్లవల్లేరు, కౌతవరం, కూరాడ రహదారుల వెంబడి వాకింగ్ చేసేవారు. అనంతరం వాకర్స్ ఆసక్తికి అనుగుణంగా స్థానిక ఎస్‌ఈఆర్‌ఎం హైస్కూల్ ప్రాంగణంలో కొన్నాళ్ల క్రితం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. -
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ అందరివీ పని ఒత్తిళ్లతో ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిదీ యాంత్రిక జీవనం అయిపోయింది. ఆర్థిక లావాదేవీలతో వ్యాపారులు, చదువులతో విద్యార్థులు, పోటీ పరీక్షలతో నిరుద్యోగులు, ఇంటి పనులతో గృహిణులు, విధి నిర్వహణతో ఉద్యోగులు నిరంతరం బిజీ..బిజీ.. ఈ హర్రీబుర్రీ జీవన శైలితో ఒత్తిళ్లకు గురై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో చాలామంది చైతన్యవంతులై ఉదయం, సాయంత్రం నడక బాట పడుతున్నారు. తమకు డాక్టర్లు రాసిచ్చిన మందులతో పాటు నడకతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందనే వైద్యుల సలహాలను కూడా పాటిస్తున్నారు. నడక వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పదేళ్లుగా వాకింగ్ చేస్తున్నా. రోజుకు 40 నుంచి 60 నిమిషాల వరకు నడుస్తాను. నడక వలన కలిగే ప్రయోజనాలను మేము కొత్తగా వాకింగ్‌కు వచ్చే వారికి వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నడవటం అలవాటు చేసుకుంటే రోగాలు దరి చేరవు. – పోలవరపు వెంకట్రావు, లయన్స్ మాజీ చైర్మన్ న్యూస్రీల్మనసు ప్రశాంతంగా.. నలుగురితో నడక.. ఆనందంతో పాటు ఆరోగ్య ప్రాప్తి జీవన శైలిలో మార్పులతో ఆయుష్షు పెరుగుదల ఆధునిక సమాజంలో నడకకు పెరుగుతున్న ప్రాధాన్యంతప్పనిసరిగా నడుస్తాం -
26న జాబ్‌మేళా
కోనేరుసెంటర్: ఈ నెల 26న మచిలీపట్నం పోతేపల్లిలోని ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ ఎ.జితేంద్ర కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో, విజేత గోల్డ్ కవరింగ్స్ వర్క్స్, రవి ఇంజెక్షన్ మౌల్డింగ్ వర్క్స్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. మేళాకు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ చేసిన అభ్యర్థులు కూడా హాజరుకావచ్చన్నారు. వీరితో పాటు ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.8,000 నుంచి రూ.20,000 వరకు వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు బయోడేటా ఫారమ్‌లతో పాటు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 99664 89796ను సంప్రదించాలని తెలిపారు. -
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
కోడూరు: మహిళల భద్రతకు పోలీస్‌శాఖ అత్యధిక ప్రాధాన్యమిస్తూ, వారి సమస్యల విషయంలో వేగంగా స్పందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ శుక్రవారం కోడూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య తమ సిబ్బందితో కలిసి ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్, ఖైదీల గదులు, సీజ్ చేసిన వాహనాలతో పాటు రౌడీషీటర్ల వివరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో మాట్లాడారు. రిసెప్షన్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తూ, ఫిర్యాదు చేయడానికి వచ్చేవారితో పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల సమస్యలను సానుకూలంగా విని సామరస్యంగా పరిష్కరించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను త్వరితగతిన విచారించి ఫిర్యాదుదారులకు చట్టపరమైన పరిష్కారం అందించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన విచారణ చేసి కోర్టుకు నివేదించాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీట్స్, సస్సెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్‌ను పరిశీలించి ఎప్పటికప్పుడు వారి ఫొటోలను, వేలి ముద్రలను అప్డేట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లకు రక్షణగా లాక్ హౌస్ మానిటర్ సిస్టం ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా లాక్ హౌస్ మానిటర్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు స్టేషన్లో సమాచారం ఇస్తే పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తారని తెలిపారు. దీనిపై సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు నేరాల నియంత్రణకు సదస్సులు నిర్వహించి 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులతో పాటు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద నిఘా ముమ్మరం చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి, గ్రామస్తులతో మమేకమవుతూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అనంతరం మహిళా పోలీసుతో ప్రత్యేకంగా సమావేశమై వారి విధుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఎస్పీ సూచించారు. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు -
హ్యాండ్‌బాల్ జాతీయ పోటీలకు జెడ్పీ విద్యార్థులు
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) 68వ హ్యాండ్ బాల్ అండర్–14 జాతీయ పోటీలకు పటమట కేబీసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు. గత నెల 26 నుంచి 28వ తేదీ వరకు తెనాలిలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలుర పోటీల్లో పి.సంతోష్ (తొమ్మిదో తరగతి), ఆర్.ఏసు(ఏడో తరగతి), బాలికల పోటీల్లో పి.సఫియా(ఎనిమిదో తర గతి), బి.జాహ్నవి(ఎనిమిదో తరగతి) సత్తా చాటి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ గఢ్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొన నున్నారు. పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విజేతలను స్కూల్ హెచ్ఎం జి.ఎస్తేరురాణి, వ్యాయామ విద్యా సహాయకుడు, కోచ్ ఎల్. దుర్గారావు, పీఈటీ ఎస్.రమేష్ అభినందించారు. సరుకు రవాణాలో రైల్వే ట్రాన్స్‌పోర్టు ఉత్తమంరైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సరుకులను సురక్షితంగా, వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే ట్రాన్స్‌పోర్టు ఉత్తమం అని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే ఫ్రైట్ కస్టమర్స్‌తో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. సరుకు లోడింగ్ అంచనాలు, ఆదాయం, రేక్‌ల సరఫరా తదితర విషయాలపై వారితో సమీక్షించారు. సకాలంలో లోడింగ్ పూర్తిచేసేలా, వ్యాగన్ డ్యామేజ్ చార్జీలను నివారించేలా లోడింగ్ పక్రియ పూర్తిచేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. గూడ్స్ షెడ్లలో సౌకర్యాల పునరుద్ధరణకు పూర్తి సహకారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నర్రేంద్ర వర్మ, సీనియర్ డీఎంఈ సంజయ్, సీనియర్ డీఎఫ్ఎం సందీప్, డీసీఎం ఎండీ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణరామవరప్పాడు: క్రెడాయ్ విజయవాడ 10వ ప్రాపర్టీ షో బ్రోచర్‌ను శుక్రవారం హోటల్ హయత్‌లో ఎస్బీఐ డీజీఎం మనీష్‌కుమార్ సింగ్ ఆవిష్కరించారు. క్రెడాయ్ అధ్యక్షుడు డి.రాంబాబు మాట్లాడుతూ వచ్చే జనవరి 10, 11, 12 తేదీల్లో నగరంలోని ఎ.కన్వెన్షన్‌లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త ప్రాజెక్టులతో పాటు స్టీల్, సిమెంట్, శానిటరీ వేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్, సొల్యూషన్స్, ఇంటీరియర్ డెకరేటర్లు, హౌసింగ్‌కు సంబంధించిన ఇతర అనుబంధ పరిశ్రమల నుంచి కొత్త ఉత్పత్తి లైనప్‌లను ప్రదర్శించనున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, బ్యాంకింగ్ హోమ్ లోన్లు అన్నింటినీ ఒకే వేదిక పైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వరదా శ్రీధర్, కోశాధికారి టి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై నేడు, రేపు ప్రత్యేక క్యాంపులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2025లో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక క్యాంపులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం, ముసాయిదాలో అభ్యంతరాలను సరిచేయడం, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, ఓటరు కార్డులలో తప్పులు సరిచేయడం వంటివి బీఎల్వోలు చేస్తారన్నారు. -
అగమ్యగోచరంలో అంగన్వాడీలు
గుడివాడరూరల్: నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా మెనూ ప్రకారం చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అప్పులు చేసి చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణం, మూడు మండలాల్లో కలిపి 251 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాల్సి ఉంటుంది. అంగన్వాడీలకు ప్రభుత్వమే బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, పాలు అందజేస్తుంది. చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమేరకు సరుకులు అవసరమో నివేదిక అందజేస్తే ఆ మేరకు సరుకులు పంపిణీ చేస్తారు. కందిపప్పు, బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అంగన్వాడీలు ప్రతి నెలా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సరుకులు తరలించేందుకు, కేంద్రంలో జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి నగదు చెల్లించదు. కేటాయింపులు ఇలా... ఒక్కో చిన్నారికి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనెను మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది. నెలసరి కూరగాయల కోసం రూ.400 చెల్లిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం నెలకు రూ.150 ఇస్తోంది. వీటితోనే చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలతో... ప్రస్తుతం కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం కూరగాయల నిమిత్తం నెలకు కేటా యించే రూ.400 ఏ కోశానా సరిపోవడం లేదు. గ్యాస్‌కు సైతం నగదు సక్రమంగా చెల్లించడం లేదు. పలు సందర్భాల్లో సొంత సొమ్ము పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మెనూ తప్పక పాటించాలని చెప్పే ఉన్నతాధికారులు పెరిగిన ధరలకు అనుగుణంగా నగదు మొత్తాన్ని మారిస్తే బాగుంటుందని అంగన్వాడీలు అంటున్నారు. దీపం పథకం కింద ఇస్తున్న ఉచిత గ్యాస్ అంగన్వాడీ కేంద్రాలకు కూడా అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మెనూ చార్జీలను పెంచితే తమకు ఊరటగా ఉంటుందని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. కేంద్రాల నిర్వహణకు సొంత సొమ్ము... అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, చీపుర్లు, చాపలు తదితర వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం నగదు అందజేయాలి. ప్రభుత్వం నుంచి ఇందుకు సొమ్ము అందకపోతుండటంతో అంగన్వాడీలు తమ సొంత సొమ్ము వెచ్చించి వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు పాత చార్జీలతోనే మెనూ అమలు చేయాలంటున్న ప్రభుత్వం అప్పులపాలవుతున్న అంగన్వాడీ కార్యకర్తలు మెనూ చార్జీలు పెంచాలంటూ వేడుకోలు -
పదవీ బాధ్యతల స్వీకారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌గా తేజశ్వి పొడపాటి పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో వాటికి పునర్ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. సమితి చైర్పర్సన్ తేజశ్వి మాట్లాడుతూ తనకు ఇచ్చింది పదవి కాదని, ఒక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు విచ్చేసి తేజశ్విని అభినందించారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మూడు బైక్‌లు స్వాధీనం విజయవాడస్పోర్ట్స్: గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను సీసీఎస్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన నిందితుడు తమ్మిశెట్టి వెంకటేష్ నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రల్ ఏసీపీ దామోదర్, సీసీఎస్ సీఐ రామ్‌కుమార్, పటమట సీఐ పవన్‌కిశోర్ శుక్రవారం వెల్లడించారు. సీసీఎస్ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆటోనగర్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించామని, తనిఖీలు జరుగుతున్న సమయంలో నిందితుడు అటుగా వస్తూ.. ఒక్కసారిగా బైక్ వెనక్కి తిప్పుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడని వారు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో నిందితుడు బైక్‌లను చోరీ చేస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల వయసున్న నిందితుడు వెంకటేష్ గంజాయి, మద్యపానానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఐదు చోరీ కేసులున్నాయని, నిందితుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. -
ఇద్దరు బాలురు గల్లంతు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువలో ఇద్దరు బాలురు ఘల్లంతైన ఘటన శుక్రవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలురు స్నానం చేసేందుకు జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువకు వెళ్లారు. అయితే వారిలో సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ. మునీర్(18), శివ తేజ(18) గల్లంతు కాగా, మిగిలిన నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఇద్దరు బాలురు ఆచూకీ కోసం కొత్తపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. -
ప్రణాళికాబద్ధంగా ఎంఎస్ఎంఈ సర్వే
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వేను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి క్షేత్రస్థాయి అధికారులతో సర్వే నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు పారిశ్రామిక, వ్యాపార, వర్తక, వాణిజ్య యూనిట్లపై సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. జనవరిలోగా ఈ సర్వేను పూర్తి చేయాలన్నారు. సర్వేలో సేకరించాల్సిన సమాచారానికి ముందుగా వ్యాపారసంస్థల అసోసియేషన్‌తో సమావేశాలు నిర్వహించి వారి వద్దనున్న సమాచారాన్ని తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయండి.. జిల్లాలో ఎస్సీలు అధికంగా నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన పథకం అమలుకై సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవోలతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన పథకం ద్వారా తొలిదశలో 2018 నుంచి 2021 వరకు 38 గ్రామాలను, రెండో దశలో 2022–23 సంవత్సరానికి 40 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. మొదటి విడతలో గ్రామాల అభివృద్ధికి రూ. 6.24 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ నిధుల ద్వారా సీసీ రహదారులు, మురుగుకాలువల నిర్మాణంతో పాటు తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల కోసం ఖర్చు చేయాల్సి ఉందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహెద్‌బాబు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, డీపీవో జె. అరుణ, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం అవసరం
ఏడీఎంఈ డాక్టర్ వెంకటేష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి వైద్య విద్యార్థికి క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరమని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ) డాక్టర్ డి. వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా చేరిన వైద్య విద్యార్థులకు శుక్రవారం వైట్‌కోట్, ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ డి. వెంకటేష్ కొత్తగా చేరిన వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు ఒక ఉన్నతమైన గౌరవం ఉందని, దానిని కాపాడుకునేందుకు చిత్తశుద్ధి, సేవాభావం అవసరమని ఆయన సూచించారు. ఈ కళాశాలలో ర్యాగింగ్ లాంటి విష సంస్కృతి లేకుండా నివారించామన్నారు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా అందరూ స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్ మాట్లాడుతూ వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ పట్టుదలతో చదివాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, రేడియాలజి విభాగాధిపతి డాక్టర్ పర్వతేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శిశువు సహా తల్లి అనుమానాస్పద మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పుడే పుట్టిన బిడ్డతో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని విద్యాధరపురం రావిచెట్టు సెంటర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొదిలి సమ్మక్క దుర్గాఘాట్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమెకు భర్త ఒక బాబు ఉన్నారు. కొంత కాలం క్రితం భర్తను వదిలివేసింది. బాబును గుంటూరు హాస్టల్లో చదివిస్తోంది. ఈ క్రమంలో దుర్గాఘాట్‌లోనే స్వీపర్‌గా పనిచేస్తున్న నాగరాజు పరిచయం అయ్యాడు. ఇద్దరు ఇష్టపడి 2021 పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క 8 నెలల గర్భిణీ. ఈనెల 19న నాగరాజు దుర్గాఘాట్‌లో పనికి బయలుదేరాడు. ఆ సమయంలో సమ్మక్క తాను గుంటూరు వెళ్లి హాస్టల్లో ఉంటున్న బాబును చూసి వస్తానని చెప్పింది. సరే అంటూ నాగరాజు పనికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను ఘాట్ వద్దే ఉంటూ పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి చుట్టు పక్కల వారు వచ్చి మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. నాగరాజు వెళ్లి వంట గది కిటీకిలోంచి చూశాడు. సమ్మక్క మగ శిశువుకు జన్మనిచ్చి రక్తమడుగులో చనిపోయి ఉంది. తలుపులు తీసి చూడగా పుట్టిన మగబిడ్డ కూడా చనిపోయి ఉన్నాడు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విజయవంతంగా ‘దీపం–2’
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో దీపం–2 పథకం ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడ కృష్ణలంకలోని కోతమిషన్ రోడ్డులో జరిగిన దీపం–2 ప్రత్యేక కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 55 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దీపావళి రోజున ప్రతి మహిళ కళ్లల్లో సంతోషం నింపే విధంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా అందించే దీపం–2 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలని, దీపం–2 పథకం ద్వారా లబ్ధిపొందవచ్చన్నారు. 48 గంటల్లోనే లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో నిధులు జమ అవుతున్నాయని వివరించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ జి.వీరపాండ్యన్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీవో కె.చైతన్య, డీఎస్వో ఎ.పాపారావు, తహసీల్దార్ ఎం.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర పోరాటంతోనే మహిళా సాధికారత
సీఐటీయూ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఆర్.సింధు పెనమలూరు: దేశంలోని కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిరంతర పోరాటంతోనే సాధ్యమవుతుందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఆర్.సింధు అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్మికుల (సీసీజీఈడబ్ల్యూ) 6వ జాతీయ స్థాయి రెండు రోజుల సదస్సు కృష్ణాజిల్లా పోరంకిలో శుక్రవారం ప్రారంభమయింది. ముఖ్యఅతిథిగా హాజరైన సింధు మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు మహిళా ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టాల కంటే మరింత కఠినమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్యాలయాలలో నిర్లక్ష్యం చేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీజీఈడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు రూపక్సర్కార్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై జరుగుతున్న అఘాయిత్యాలపై విచారణ 90 రోజుల్లో పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్. సీతాలక్ష్మికి ఘన నివాళులర్పించారు. వివిధ సంఘాల నేతలు అజీజ్, మనీషా ముంజుందార్, ఐ.సుశీలరాణి, బోనేపల్లి ఉష, ఎస్బి.యాదవ్, కె.రమాదేవి, ఎం.రాజ్యలక్ష్మి, వి.నాగేశ్వరరావు, కేవీ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం
తరలివచ్చిన భవానీలు, అయ్యప్పలు, శివ దీక్షధారులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భవానీలు, అయ్యప్పలు, శివ దీక్ష స్వీకరించిన భక్తులతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన రెండు షిఫ్టులు నిర్వహించగా, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, ఛండీహోమంలోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గత మూడు రోజులుగా మూసివేసిన ఘాట్‌రోడ్డును శుక్రవారం తెల్లవారుజాము నుంచి తెరిచి కొండపైకి ద్విచక్ర వాహనాలు, దేవస్థాన బస్సులను అనుమతించారు. ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద నుంచి చైనావాల్ వరకు భక్తుల ద్విచక్ర వాహనాలతో పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్లేశ్వరుని సన్నిధిలో.. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలను వెలిగించారు. మల్లేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, సాయంత్రం ఆకాశ దీపంతో పాటు సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తీర్థయాత్రలు చేస్తున్న అయ్యప్పలు, యాత్రికులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. -
సిబ్బంది సంక్షేమమే లక్ష్యం
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: జిల్లాలోని ఏఆర్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలోని ఆర్మడ్ రిజర్వ్, హోంగార్డ్స్ సిబ్బందికి శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఐ సతీష్ కుమార్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. తొలుత ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ ప్లటూన్ల వారీగా ఇన్స్పెక్షన్ చేసి, సిబ్బంది టర్న్ అవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకు ఏఆర్ విభాగం వెన్నెముక లాంటిదని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తినప్పుడు ఏఆర్ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించి అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన, పోలీస్ శాఖ ప్రతిష్టకు కళంకం తెచ్చే విధంగా సిబ్బంది వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహించిన ఎస్పీ.. సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. అలాగే వృత్తిపరంగా ఏవైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ డేలో తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, ఏఆర్డీఎస్ పి. వెంకటేశ్వరరావు, ఆర్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరు బాలురు గల్లంతు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువలో ఇద్దరు బాలురు ఘల్లంతైన ఘటన శుక్రవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు బాలురు స్నానం చేసేందుకు జక్కంపూడి సమీపంలోని పోలవరం కాలువకు వెళ్లారు. అయితే వారిలో సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ. మునీర్(18), శివ తేజ(18) గల్లంతు కాగా, మిగిలిన నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఇద్దరు బాలురు ఆచూకీ కోసం కొత్తపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. -
పదవీ బాధ్యతల స్వీకారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌గా తేజశ్వి పొడపాటి పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో వాటికి పునర్ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. సమితి చైర్పర్సన్ తేజశ్వి మాట్లాడుతూ తనకు ఇచ్చింది పదవి కాదని, ఒక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు విచ్చేసి తేజశ్విని అభినందించారు. -
ఆకాశంలో మబ్బులు.. గుండెల్లో గుబులు
తుపాను వస్తోందన్న ప్రచారంతో వరి రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. శుక్రవారం మబ్బులతో కూడిన వాతావరణం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. ఫలితంగా గుడ్లవల్లేరు మండలంలో హార్వెస్టర్లు రయ్.. రయ్ మంటూ దాదాపు అన్ని గ్రామాల్లో పని చేశాయి. తమ పొలాలను ముందు కోయాలంటే.. కాదు తమ పొలాలు ముందు అంటూ రైతులు కోతలు కోసే యంత్రాల కోసం పోటీ పడ్డారు. కోతల అనంతరం బస్తాల్లోకి ధాన్యాన్ని ఎత్తుకుని గూటికి చేర్చుకునేందుకు వేగిరపడ్డారు. రోడ్ల మీద ఆరబోసిన ధాన్యాన్ని ఎత్తుకునే అవకాశం లేని కొన్ని చోట్ల రోడ్లపైనే ఆ ధాన్యపు రాశులను వదిలేసి పరదాలను కప్పేశారు. – గుడ్లవల్లేరు -
No Headline
మచిలీపట్నంటౌన్: బందరు నగరపాలక సంస్ధ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గుక్కెడు నీళ్లు గత 12 రోజులుగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోని ఆర్వో ప్లాంట్ చిన్న పాటి మరమ్మతుకు గురై 12 రోజులైనా దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో కార్యాలయంలోని పలు విభాగాల సిబ్బంది కార్యాలయం పక్కనున్న దుకాణాల వద్దకు వెళ్లి తాగునీరు తెచుకుంటున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ విభాగానికి చెందిన సిబ్బంది ఖాళీ బాటిళ్లతో తాగునీటి కోసం మరో విభాగానికి వెళ్లి అడుగుతుండటంతో మాదీ మీ పరిస్థితేననే సమాధానంతో నిరాశతో వెనుతిరిగి బయటకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దుర్వాసన ఇదిలా ఉంటే కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది వినియోగించే మరుగుదొడ్లు, యారినల్ విభాగాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. మరుగుదొడ్లు దుర్వాసన వస్తుండటంతో వీటిని వినియోగించే సాహసం ఉద్యోగులు చేయటం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేసి రెండు నెలలైనా అధికారులు సమస్యను పరిష్కరించకుండా మిన్నకుండటంతో ముఖ్యంగా కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది పురుష ఉద్యోగులు అత్యవసరమైతే సమీపాన ఉన్న సినిమా హాళ్లలోని టాయిలెట్స్‌ను వినియోగించేందుకు వెళుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కార్యాలయంలోని మరుగుదొడ్లను శుభ్రం చేసే ఉద్యోగిని రెండు నెలల క్రితం డివిజన్లలో పారిశుద్ధ్య పనులకు వినియోగిస్తుండటంతో సమస్య మొదలైంది. పురుషుల యూరినల్స్ విభాగమైతే మరీ గబ్బు పట్టి, మరమ్మతులకు గురై ఉన్నాయి. యూరినల్స్ సింక్లు పగిలిపోయి, నీటి సరఫరా లేక దుర్వాసన వస్తోంది. కొంతమంది ఉద్యోగులు ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని వినియోగిస్తుండటంతో ఆ ప్రాంత మంతా దుర్వాసన వెదజల్లుతోంది. మరమ్మతులకు నోచుకోని ఎంఎంసీ కార్యాలయంలోని ఆర్వో ప్లాంట్ -
భూముల రీసర్వేపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో భూముల రీసర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీవోలు, సర్వేశాఖ అధికారులతో గురువారం ఆయన రీసర్వే నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో భూముల రీసర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో సమగ్ర రీసర్వే చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రీసర్వేను తూతూమంత్రంగా చేస్తే కుదరదని, ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. రీసర్వే కోసం వచ్చే వారం తహసీల్దార్లు, డీటీ, సర్వేయర్లతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి భూమికి ప్రత్యేక ఎల్పీఎం నంబరు ఇవ్వాలని, యజమాని పేరు రెవెన్యూ రికార్డుల్లో రావాలని సూచించారు. రీసర్వేలో తొలుత నిర్వహించే ప్రీ డ్రోన్ ఫ్లయింగ్ ప్రతి గ్రామంలో దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయని, గ్రౌండ్ ట్రూతింగ్, డిజిటల్ మ్యాప్, చెక్‌లిస్ట్ ఆధారంగా భూమిపై నిజనిర్థారణ చేయాలన్నారు. వెబ్‌ల్యాండ్, ఎఫ్‌ఎంబీలో వివరాలు విస్తీర్ణం సరిపోలాలన్నారు. గ్రామాల్లో ఉదయం వేళల్లో భూముల రీసర్వే చేపట్టాలని, గ్రౌండ్ ట్రూతింగ్కు ముందుగా గ్రామ సభ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో చేసిన పనిని అదేరోజు కంప్యూటర్లలో నమోదు చేస్తే రీసర్వే సులువుగా పూర్తవుతుందన్నారు. తహసీల్దార్, మండల సర్వేయర్, డీటీలు సమావేశమై రీసర్వే ప్రక్రియపై సమీక్షించుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తులు పంచుకునే వారు, సబ్ డివిజన్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుందన్నారు. సర్వే పనుల రోజువారీ పర్యవేక్షణ కోసం ఆర్డీవో, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి కార్యాలయంలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, కెఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవోలు కె.స్వాతి, బీఎస్ హేళాషారోన్, బాలసుబ్రహ్మణ్యం, జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి జోషీలా తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో వసతులకు కేంద్రం నిధుల కేటాయింపు
పరిటాల(కంచికచర్ల): గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రణాళిక(జీపీఎస్డీపీ) రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనాథ్ నైనీ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు గురువారం డ్రోన్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రహదారుల అభివృద్ధి, అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, తాగునీటి సరఫరా చేసేందుకు డ్రోన్‌తో పనులు గుర్తిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 29 రాష్ట్రాల్లో 34 గ్రామ పంచాయతీలను గుర్తించి వాటిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రామంలో మూడు రోజుల పాటు డ్రోన్ సర్వే జరుగుతుందని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ వినోద్కుమార్నుల్, జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్యకుమారి, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ బొజ్జగాని శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో మరమ్మతులను పూర్తి చేయాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గురువారం మరమ్మతులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయినప్పటికీ వాటికి రంగులతో పాటు చిన్న, చిన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రహరీ బయట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, వర్షపునీరు కలెక్టరేట్ నుంచి బయటకు వెళ్లేందుకు మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా ఖనిజాల ట్రస్ట్ నుంచి చెల్లింపులు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి చెల్లింపు – వినియోగం పద్ధతిలో నిర్వహించాలన్నారు. ఖజానా స్ట్రాంగ్‌రూమ్ పైకప్పు పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కురిసినప్పుడు కలెక్టరేట్ పైకప్పు నుంచి నీరు కారకుండా ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను జిల్లా ఖనిజాల ట్రస్ట్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలన్నారు. ఎన్నికల విభాగం పైభాగాన, కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఏర్పాటు చేసిన టైల్స్ పరిస్థితిపై నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఎంయూడీఏ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్‌గౌడ్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈడీ కృష్ణారాయన్, కలెక్టరేట్ ఏఓ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 20247వైవీకి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్ వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యం పదేపదే అడుగుతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ కావడంతో సెమిస్టర్ పరీక్షలకు ఇబ్బంది అవుతుందేమో అనే ఆందోళనగా ఉంది. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ మంజూరు చేసి ఆదుకోవాలి. – ఎన్.ఎల్. విఠల్, బీటెక్ ఫైనల్ ఇయర్, పెడన. పేదల చదువులు ప్రమాదంలో పడ్డాయి...ఐదేళ్లుగా నిరాటంకంగా సాగిన పేదల చదువులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి...పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థులకు నేటివరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదలగాక పోవడమే ఇందుకు ప్రధానకారణం. ఫీజుల కోసం కళాశాలలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న వైనంపై ప్రత్యేక కథనం. సాక్షి, మచిలీపట్నం: ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో ఫీజు పరేషాన్ మొదలైంది. రాష్ట్రప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజులను సకాలంలో మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం, లబ్ధిదారులకు మాత్రం ఆయా పథకాలను అందించడం లేదు. అందులో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఒకటి. గత ఐదేళ్లుగా నిరాటంకంగా అందిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధు లను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు చెల్లించలేక..సర్టిఫికెట్లు అందక.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలోని 32,260మంది విద్యార్థులకు రూ.28.03కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో జూన్, ఆగస్టు, నవంబర్ మాసాలకు సంబంధించి మూడు విడతలుగా విడుదల చేయాల్సిన ఫీజు రీయిం బర్స్మెంట్ నిధుల ఊసే మరిచింది. దీంతో రూ.50కోట్ల వరకు బకాయిలు విద్యార్థులకు అందాల్సి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు పీజురీయింబర్స్మెంటు కోసం 26,321 మంది రిజిస్టేషన్ చేసుకున్నారు. ఈప్రక్రియ కొనసాగుతోంది. అయితే జూన్ నుంచి ఇప్పటివరకు మూడు విడతలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెమిస్టర్ పరీక్ష రాయాలంటే ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని, కోర్సు పూర్తయిన విద్యార్థులు బకాయి ఫీజును చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందజేస్తామంటూ పలు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో చెల్లించే స్థోమత లేక, సర్టిఫికెట్లు పొందలేక, పైచదువులకు వెళ్లలేక పేద విద్యార్థులు అవస్థలుపడుతున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లికి వందనం అని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి, ఊరూరా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. – ఎండి. సాధిక్ బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ●దీవెన..ఆవేదన.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ‘జగనన్న విద్యాదీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పేరుతో విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఏటా జూన్ మాసంలో విద్యా దీవెన నిధులు విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాల పేర్లు మార్చడం వరకు పరిమితమైంది తప్ప అమలుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సజావుగా అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంలో లేకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. న్యూస్రీల్దాళ్వా ఆశలపై నీళ్లు! చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాడెల్టా పరిధిలోని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కలెక్టర్ డీకె బాలాజీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కృష్ణానదిలో ఎప్పుడూ రానివిధంగా వరద ప్రవాహం ఉన్నందున శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ ద్వారా ఖరీఫ్ పంటకు సమృద్ధిగా 290 టీఎంసీల నీటిని సరఫరా చేశామన్నారు. గతనెల నుంచి కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గిపోగా, ప్రస్తుతం జలశయాల్లో నిల్వ ఉన్న నీటిలో 167 టీఎంసీలను సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు సరఫరా చేయాల్సి ఉందన్నారు. 2025 జూన్ నెలాఖరు వరకు తాగునీటి కోసం 22టీఎంసీలతో కలిపి 185 టీఎంసీలు అవసరమవుతాయని పేర్కొన్నారు. పులిచింతల్లో ఇప్పుడున్న నీటి నిల్వ పరిమాణం 39 టీఎంసీలను తాగునీటికి, రాబోయే ఖరీఫ్ పంటకు ముందస్తుగా జూన్ నెలలోనే సరఫరా చేసేందుకు నిల్వ చేయాల్సి ఉంది. ఇందుకోసం రబీ పంటకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆరుతడి పంటలను మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచించారు. ఐదేళ్లలో రూ.466.74 కోట్లు విడుదల.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పాలనలో జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.466.74 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను 2,65,045 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. వీటితోపాటు 2017–18, 2018–19లో చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన బకాయిలను సైతం విద్యార్థులకు అందించి వారిని ఆదుకుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్షగా నిర్దేశిస్తే, ఎక్కువమందికి ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశ్యంలో జగన్ ప్రభుత్వం ఆదాయం పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచింది. ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని లక్షలాదిమంది విద్యార్థులకు వందలాది కోట్లను అందించి వారి అభ్యున్నతికి కృషిచేయగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల చేయకుండా మిన్నకుంటుండటంతో పేదల చదువులకు పెద్దగండమే ఏర్పడినట్లయింది. సంక్షేమ శాఖల వారీగా విద్యార్థుల వివరాలు వెల్ఫేర్ శాఖ 2023–24 విడత–1 జమ అయిన రెన్యూవల్ 2024–25 విద్యార్థుల సంఖ్య సొమ్ము (రూ.కోట్లు) విద్యార్థులు కొత్త రిజిస్ట్రేషన్లు ఎస్పీ వెల్ఫేర్ 7590 6.26 7605 5276 ఎస్టీ వెల్ఫేర్ 471 0.36 909 596 బీసీ వెల్ఫేర్ 14579 12.63 16615 12212 ఈబీసీ 2321 2.31 3769 2779 కాపు 5259 4.65 5118 3766 మైనారిటీ 2102 1.81 2054 1520 క్రిష్టియన్ మైనారిటీ 298 0.28 277 172 మొత్తం 32620 28.03 కోట్లు 36347 26321