Krishnarao
-
ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు అప్రజాస్వామికం
ఓటుకు నోటు వీడియో టేపుల ఆధారంతో చంద్రబాబును బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం(కొత్తపేట) : సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారనే నెపంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడం అప్రజాస్వామికమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. నిజంగా ఇదే కారణమైతే ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయనను కొత్తపేట నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ నాయకులు కలిశారు. వారి ఆవేదనను జగ్గిరెడ్డికి వినిపించారు. దీనిపై ఎమ్మెల్యే మట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో బ్రాహ్మణులను ఎంతగానో గౌరవించే సంస్కృతి ఉందన్నారు. నాడు కళా వెంకట్రావు, భాను తిలకం వంటి బ్రాహ్మణ నాయకులను ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బ్రాహ్మణులను కించపర్చేలా ఉందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో జన్మభూమి కమిటీ ప్రమేయం ఉండకూడదన్న ఐవైఆర్ సూచనలు నచ్చక దానిని పచ్చచొక్కా కార్పొరేషన్‌గా మార్చేందుకే ఆయనను తొలగించారన్నారు. కులాలతో ఆడుకోవడం చంద్రబాబు మానుకోవాలన్నారు. తెలంగాణాలో ఉన్న వారిని ఇక్కడి చైర్మన్‌గా చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రాహ్మణులను బహిరంగ క్షమాపణ కోరి తప్పును సరి చేసుకోవాలన్నారు. అనంతరం స్థానిక జాతీయ రహదారి చెంతన ఉన్న మాజీ మంత్రి కళావెంకట్రావు విగ్రహానికి బ్రహ్మణ సంఘ నాయకులతో కలసి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, బ్రాహ్మణ సంఘ నాయకుల చావలి సుబ్బరాయశాస్త్రి, దొంతికుర్తి సాంబమూర్తి, భమిడిపాటి లక్ష్మీనారాయణ, రాణి శర్మ, ఎం.సుబ్బారావు, రాణి రమేష్, ద్రోణంరాజు రంగమన్నాల్, ఎం.కుమార్‌రాజా గోటేటి మార్కండేయులు, కంభంపాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
కార్మికులపై పక్షపాత ధోరణి వీడాలి
ఆమదాలవలస రూరల్ : కార్మికులపై కాన్‌కాస్ట్ యాజమాన్యం పక్షపాత ధోరణి వీడాలరి కాన్‌కాస్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.కృష్ణారావు, కార్యదర్శి బి.నాగేశ్వరరావు కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని దూసి గ్రామంలో గల కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట శుక్రవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని 28 రోజులుగా ధర్నాలు చేపడుతున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. నూతన వేతన ఒప్పందం అమలు గురించి జేసీఎల్ జాయింట్ సమావేశానికి యాజమాన్యం హాజరుకావడం లేదని తెలిపారు. నిరసనలో పాల్గొన్న సుమారు 140 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించకుండా యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. వేరొక యూనియన్ కార్మికులకు పని కల్పించి ఐఎఫ్టీయూ కార్మికుల పట్ల వివక్ష చూపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వెబ్సైట్లో గురుకుల విద్యార్థుల ఎంపిక జాబితా
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన 21 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతులలో ప్రవేశానికి జూన్ 26న ప్రవేశ పరీక్ష నిర్వహించిందని పేర్కొన్నారు. పరీక్షల్లో ఎంపికై సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు వెబ్సైట్ www.tswreis.mbnrgov.in ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈనెల 31లోపు ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. కులం, ఆదాయం, బోనోఫైడ్, టీసీ, ఆధార్‌కార్డు జిరాక్స్, రేషన్‌కార్డు జిరాక్స్ తదితర సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాలని కోరారు. -
నాన్నకు ప్రేమతో...
గడ్డకట్టించే శీతలం.. అడుగు తీసి అడుగువేయలేనంత మంచు.. నిమిషాల్లో మారిపోయే శిఖరాగ్ర వాతావరణం.. అయినా సరే, ఆ అడుగులకు ఏవీ అడ్డు కాలేదు. ఆ తపనకు ఏదీ అడ్డురావడం లేదు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని.. భారతీయ ఆత్మను కవచంగా చేసుకొని.. ప్రపంచంలోని ఎత్తై పర్వతాలను అధిరోహిస్తూనే ఉంది. ఆ పర్వతారోహకురాలే... జాహ్నవి శ్రీపెరంబుదూరు. చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తై శిఖరాలన్నింటిని అధిరోహించాలని దీక్ష పట్టిన జాహ్నవి ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహణకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు తన వయసు పద్నాలుగు. నలభై కేజీల బరువున్న ఈ ఎర్లీ టీనేజ్ అమ్మాయి అంతకు రెట్టింపు బరువును భుజాల మీదకు ఎత్తుకొని అవలీలగా పర్వతాలను ఎక్కుతూ ‘భారత్ అమ్మాయిలు ఎంత బలవంతులో చూడండి’ అని నిరూపిస్తోంది. ఇప్పటికే ‘మిషన్ 7 సమ్మిట్’ కార్యక్రమం మొదలుపెట్టిన జాహ్నవి ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని, యూరోప్‌లోని అతి ఎత్తై ఎలబ్రుస్ పర్వతాన్ని ఎక్కి రికార్డులు సొంతం చేసుకుంది. వీటితో పాటు ‘అస్సీ 10 ఛాలెంజ్’గా పిలిచే పది ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించి మరో సరికొత్త రికార్డును సాధించింది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఎత్తయిన ‘మౌంట్ కొసియుజ్కో’ పర్వతంపై కాలుమోపి భారతీయుల్లో ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అధిరోహణం మొదలైంది ఇలా... జాహ్నవి తండ్రి కృష్ణారావు మానసిక వైద్యుడు. తల్లి సరస్వతి ఉపాధ్యాయురాలు. తండ్రి పర్వతారోహకుడు కూడా కావడంతో కూతురిలో శిఖరమంత ఆశయాలను నింపాడు. జాహ్నవికి రెండేళ్ల వయసు ఉండగానే తనతో పాటు కొండల మీదకు ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాడు. కొడుకు ఉన్నప్పటికీ కూతురినే ఈ లక్ష్యసాధనకు ఎంచుకోవడానికి కారణాలను వివరిస్తూ - ‘భారతీయ స్త్రీలు పర్వతారోహణలో వెనుకంజలో ఉంటారు అని హేళనగా నవ్వుకునే విదేశీయుల మాటలు నన్ను బాధించేవి. నా కూతురు వారి హేళనలకు సరైన సమాధానం అనిపించేది. పర్వతారోహణకు కొండ ప్రాంతాలు నడకదారి ఏవీ సవ్యంగా ఉండవు. పైగా దారిలో పాములు, విపరీతంగా గాలులు... వీటికి భయపడి స్త్రీలు ఎక్కువగా ఈ రంగంలోకి రారు. కాని వీటినేవీ లెక్కచేసేది కాదు జాహ్నవి. ప్రతికూల పరిస్థితులు ఏవైనా తట్టుకోవడం నిత్యం సాధన చేసేది. చిన్న చిన్న బరువులు మోస్తూ కొండలెక్కడం అలవాటు చేసుకుంది. యోగా, రన్నింగ్, ఫిట్నెస్లకు సంబంధించిన సాధన కూడా మొదలుపెట్టింది. తనలోని పట్టుదల చూసి చాలా ఆశ్చర్యమేసేది. భారతీయ స్త్రీలను చులకన చేసేవారికి తనే సరైన సమాధానం అని ప్రతీసారీ చేతల్లో నిరూపిస్తూనే ఉంది’’ అని కూతురి పట్టుదలను వివరించారు కృష్ణారావు. తొమ్మిదేళ్ల వయసులో... తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని 16 వేల అడుగుల ఎత్తున్న రూప్‌కుండ్ పర్వతం అధిరోహించిన జాహ్నవి ఆ తర్వాత చలికాలంలో గడ్డకట్టుకుపోయే హిమాలయాల్లో సాహసయాత్ర చేసింది. ఆ వివరాలను జాహ్నవి తెలియచేస్తూ ‘ముందు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ఇంత చిన్నవయసు అమ్మాయేంటి? అంత పెద్ద శిఖరాలేంటి? అనే ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ఎన్నో విడతలుగా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. లేహ్‌లో ఎంతో కష్టమైన 20 వేల అడుగుల ఎత్తున్న ‘స్టోక్ కాంగ్రీ’ పర్వతాన్ని అధిరోహించినప్పుడు నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. స్త్రీగా ఎదురయ్యే ఇబ్బందులేవీ ఇప్పటి వరకు నేను ఎదుర్కోలేదు. పైగా వాటిని జీవనశైలిలో భాగం చేసుకున్నాను. అమ్మాయిలకు ఆకాశమే హద్దుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిలో పర్వతారోహణ ఒకటిగా నేను భావిస్తున్నాను. భయం అనే మాటకు తావు లేకుండా నేను వేసే ప్రతి అడుగు అమ్మాయిలకు స్ఫూర్తికావాలని, భారతీయ ఖ్యాతిని పెంచాలనే భావనను ఎప్పుడూ వీడను’ అని వివరించింది ఈ పిన్నవయసు పర్వతారోహకురాలు. భూమ్మీద ఎత్తై శిఖరం... త్వరలో దక్షిణ అమెరికాలో 6,962 మీటర్ల ఎత్తున్న మౌంట్ అకన్కాగ్వా పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతోన్న జాహ్నవి భూమ్మీద ఎత్తయిన ఎవరెస్ట్‌తో సహా మిగతా ఖండాల్లోని పర్వత శిఖరాలన్నింటినీ అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న సాహస యాత్రికురాలిగా రికార్డు సాధించాలన్న ఆశయాన్ని ఏర్పరచుకుంది. ఈ సాహస బాలిక హైదరాబాద్‌లోని రికెల్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పెయింటింగ్, కథలు రాయడం ఇష్టమని చెప్పే జాహ్నవి భరతనాట్యమూ నేర్చుకుంటోంది. ఆర్థికభారం అవరోధం... ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆశయంతో ముందుకు అడుగువేస్తున్న జాహ్నవికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అడ్డం పడుతున్నాయి. ఆ తపనకు ఆర్థిక ఇబ్బందులే ఊపిరి అందకుండా చేస్తున్నాయి. తండ్రి క్యాన్సర్ బారిన పడటం, సరైన స్థోమత లేని కారణంతో ఆత్మవిశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ విషయాల గురించి జాహ్నవి తండ్రి కృష్ణారావు మాట్లాడుతూ ‘పర్వతారోహణకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును ఇన్నాళ్లూ సొంతంగా భరిస్తూ వచ్చాను. ఇకపై జాహ్నవి లక్ష్యానికి ఊతం కావల్సింది సమాజమే.....’ అంటూ చేతులెత్తి విన్నవించుకున్నారు. జాహ్నవి శిఖరాగ్రం మీదకు చేరి భారతదేశ విజయకేతనాన్ని సగర్వంగా ఎగురవే యాలన్న ఆరాటానికి అంతా కలిసి ఊతమిద్దాం. - ఎన్.ఆర్ జాహ్నవి కోసం వైద్యవృత్తిని వదిలేశాను జాహ్నవి తండ్రి కృష్ణారావు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘నా గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. వృత్తిరీత్యా ‘మెంటల్ హెల్త్’ వైద్యుడిని. నాకు కూడా సాహసక్రీడల్లో చాలా ఆసక్తి. అందుకే జాహ్నవిలో ఇలాంటి అభిరుచి పెంపొందించేలా పెంచాను. దాంతో ‘మెంటల్ డాక్టర్‌కు మెంటల్ వచ్చింది’ అని కొందరు కామెంట్స్ చేశారు. ఇక్కడ మన దేశంలో మానసిక సమస్యలను ఒక జబ్బులా చూస్తారు. కానీ నేను కెనడాలో పనిచేసే చోట దాన్ని జబ్బులా కాకుండా ఒక వేదనలా చూస్తారు. కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. హిప్నోథెరపీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు (ఆల్టర్నేటివ్ థెరపీస్) చేస్తారు. అవేవీ ఫలితాలు ఇవ్వనప్పుడు మాత్రమే మందులు రాస్తారు. ఇక నా కూతురు జాహ్నవి విషయానికి వస్తే ఆమె కోసం నేను నా వైద్యవృత్తిని వదిలేశాను. నేను సాహసక్రీడల్లో పాల్గొనేవారిని రక్షించడం, వారికి చేయూత నివ్వడం వంటి కార్యకలాపాలకు ఆస్కారం ఇచ్చే ‘రెస్క్యూవర్’గా పనిచేస్తున్నాను. ఇక నా వ్యక్తిగత అంశాల విషయానికి వస్తే నాకు ముందుగా ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చింది. నేను ఫిట్‌గా ఉండటం, చాలా ఆరోగ్యకరంగా కనిపిస్తూ ఉండటం వల్ల లక్షణాలను గుర్తించలేదు. దాంతో అది బాగా ముదిరిపోయి నాలుగో దశకు చేరింది. వెన్నుపూసల్లోకి, కాలేయానికి కూడా పాకింది. నా గురించి, నా జబ్బు గురించి దృష్టిపెట్టడం కంటే జాహ్నవి లక్ష్యం, దాని సాధన కోసమే అందరి దృష్టి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణారావు జాహ్నవి తండ్రి Sriperambuduru Jaahnavi AXIS Bank A/c No. 914010036210131 Dr.A.S.Rao Nagar Branch IFSC Code: UTIB0000427 జాహ్నవి ఫోన్ నంబర్: +91 8464858658 -
తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణారావు కన్నుమూత
ఆంధ్రావాసి అయినా... తెలంగాణ కోసం ఉద్యమించిన వ్యక్తి రామచంద్రాపురం: తను ఆంధ్రాలో పుట్టినా తనకు ఉద్యోగ జీవితాన్నిచ్చిన తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో 18 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసిన కృష్ణారావు శనివారం కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఆయన ఏళ్ల క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం నివాసంలో మృతి చెందా రు. కృష్ణారావుకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. మెదక్ జిల్లాలోని భెల్ పరిశ్రమ ప్రారంభంలో కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన కృష్ణారావు భెల్ కార్మిక సంఘంలో తన ప్రత్యేకతను చాటారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలిగారు. సామాజిక సేవలు చేసిన ఆయనకు మదర్‌థెరిసా కూడా ప్రశంసాపత్రాన్ని పంపించారు. అదే స్ఫూర్తితో తనకు నీడనిచ్చిన తెలంగాణ గడ్డకు న్యాయం చేయాలన్న సంకల్పంతో 2006, 2007లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన 18 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర, మాజీ ఎంపీలు విజయశాంతితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు నచ్చజెప్పినా చావడానికైనా సిద్ధం కానీ, తెలంగాణ కావాలంటూ ఆయన తెగేసి చెప్పారు. పోలీసులు ఆసుపత్రి తరలించినా ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించారు. భెల్ మొదటి ఫేజ్ ఎంఐజీ కోసం తన భార్యతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, భెల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మల్లెపల్లి సోమిరెడ్డి ఆయన పార్ధివదేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఐఏఎస్‌లు!
పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనం గా ఐఏఎస్‌లను కేటాయించేందుకున్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి ఈ అంశంపై చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపు, ఉద్యోగుల విభజనపై సచివాలయంలో ఆయ న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. అదనంగా 30మంది ఐఏఎస్ అధికారులను కేటాయించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి చెంది న ఐఏఎస్ అధికారులు సరిపడా లేనప్పటికీ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియా ణాకు చెందిన ఐఏఎస్‌లు డిప్యుటేషన్‌పై తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సంజయ్ అభిప్రాయపడ్డారు. అంతకుముందే కమలనాథన్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. -
సర్కారీ భూ‘దందా’ నిగ్గు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అత్యంత విలువైన భూములను ప్రభుత్వం అత్తెసరు ధరలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖ జిల్లా మధురవాడలో రూ.336 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐఐసీకి చెందిన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీంకోర్టు 2012 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములు కేటాయించే సమయంలో ప్రజా ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థత కలిగిన సంస్థలకే ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు లేకుండా విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వవచ్చు. కానీ, 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపులను పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. వీటిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
వర్షాలు లేవన్న భావన రాకూడదు
విజయనగరం కంటోన్మెంట్: వర్షాలు కుర వడం లేదనే భావన రైతుల్లో రాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వ్యవసాయం, ఉద్యాన పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయన తాగునీరు, సాగునీరు, ర్యాగింగ్, విత్తన సరఫరా, టోల్గేట్ల నిర్మాణం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండిస్తున్న పంటలు నష్టపోకుండా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే వ్యవసాయ బోర్ల ద్వారా సాగునీటిని అందించాలని ఆయన తెలిపారు. ప్రతి మండలంలోనూ చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోచ్చన్నారు. సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, క్రిమి సంహారక మందులు, అవసరమైన పనిముట్లను అందించాలన్నారు. బోర్ల ద్వారా నీరు అందించడమే కాకుండా వారికి అండగా ఉండి ధైర్యం కల్పించాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, మరమ్మతులకు గురయిన రక్షిత మంచినీటి పథకాలు, బోర్లను త్వరితగతిన రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు దగ్గరలోనే నీటి వనరులు కల్పించే విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రా దావరా మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని, కఠినంగా వ్యవహరించాలన్నారు. ర్యాగింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై ఆమె మాట్లాడుతూ 1997 ర్యాగింగ్ చట్టం ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష, ఎక్కడైనా చదువుకునేందుకు అర్హత లేకుండా చేస్తామన్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన ర్యాగింగ్ కమిటీ తరచూ రివ్యూ చేసి పర్యవేక్షించాలన్నారు. ర్యాగింగ్ చట్టంపై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ బి.రామారావు, డీఆర్వో జితేంద్ర, డ్వామా పీడీ ప్రశాంతి, సీపీఓ బి.మోహనరావు, డీఎంహెచ్ఓ యు స్వరాజ్యలక్ష్మి, పశుసంవర్థక జేడీ వై సింహాచలం ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా: రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ వాహనం కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కేంద్రంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. చెన్నై నుంచి ఒంగోలు వెళ్తున్న కారును రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న టిప్పర్ వాహనం ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కృష్ణారావు (45), ఆదాం (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు కనిగిరికి చెందిన మేస్త్రీలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఉలవపాడు) -
మా ఆదేశాలే పట్టించుకోవడం లేదు
రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమాచార కమిషనర్ల అసంతృప్తి హైదరాబాద్: చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే తీవ్ర నిర ్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ సాక్షాత్తూ రాష్ట్ర సమాచార కమిషనర్లే అసంతృప్తి వ్యక్తంచేశారు. సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి తామిచ్చే ఆదేశాలకు ఇరు రాష్ట్రాల అధికారులెవరూ వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదని ఏపీ సమాచార కమిషన్‌లోని 8 మంది క మిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు వారోత్సవాలను నిర్వహించారు. తమ ఆదేశాలనే పట్టించుకోవడం లేదని కమిషనర్లు అసంతృప్తి వ్యక్తంచేయడంతో.. కార్యక్రమానికి వచ్చిన ఆర్టీఐ ఉద్యమకారులు కంగుతిన్నారు. తమ ఆవేదన లను వెళ్లబోసుకునేందుకు కూడా కమిషనర్లు సమయం ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు కాసేపు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం ఆర్టీఐ ఆమలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ చట్టంతో పలువురు అధికారులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్‌హుస్సేన్, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన వారికి సమాచారం ఇచ్చేందుకు పలు ప్రభుత్వ విభాగాలు ఇష్టపడడం లేదని, అప్పిలేట్ అథారిటీలు పట్టించుకోవడం లేదన్నారు. విభాగాధిపతులు కనీసం స్పందించడం లేదన్నారు. మరో కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ.. సమాచార కమిషన్ నిర్వహిస్తున్న వారోత్సవాలకు ప్రభుత్వ విభాగాలకు చెందిన పీఐవోలు, అప్పిలేట్ అథారిటీలు, విభాగాధిపతులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ప్రస్తావించారు. ఆర్టీఐ అమలు మొక్కుబడి కార్యక్రమంగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హోదా కలిగిన కమిషనర్ల పట్ల పలువురు ఐఏఎస్ అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్
హైదరాబాద్: విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, రైలు కనెక్టివిటీపై గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుతో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దేవేందర్ సింగ్, బోర్డుకు చెందిన ఏడుగురు సభ్యుల బృం దం సమావేశమైంది. దేవేందర్ సింగ్‌తో పాటు సభ్యులు అశోక్‌కుమార్, విజయ్ కుమార్, కె. గుప్త, ఎ.సి.రే, ఎస్.పి. సమంత రే సీఎస్‌తో భేటీ అయ్యారు. విశాఖను జోనల్ కేంద్రంగా చేసి విజ యవాడ, గుంటూరు, గుంతకల్ డివిజ న్లను ఒకే జోన్‌గా చేసి ఈస్ట్-కోస్టల్ రైల్వేను ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. ఏపీలో ఓ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రైల్వే బోర్డుకు వినతి చేయడంతో బోర్డు సా నుకూలంగా స్పందించింది. విజయవాడలో కో చ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించనున్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో ఉండే రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. విశాఖపట్టణం, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు ఏర్పాటుపైన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని బోర్డు తెలిపింది. -
‘జన్మభూమి’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
ఏలూరు : రాష్ట్రంలో కొత్తగా 5.23 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కొత్తగా అందిన పింఛన్ దరఖాస్తుల్లో 5.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కలె క్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 23,367 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నీరు- చెట్టు కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో జన్మభూమి సభలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 13 నియోజకవర్గాల్లో జన్మభూమి సభలు ఏలూరు (టూటౌన్) : జిల్లాలో సోమవారం 13 నియోజకవర్గాల్లో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నిర్వహించి 82.78 లక్షల రూపాయలను 9వేల 231 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 52 గ్రామాలు, 6 పురపాలక సంఘాలు, 1 నగరపాలక సంస్థ పరిధిలలోని 17 వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. 69 వైద్య శిబిరాలు నిర్వహించి 5 వేల 35 మందికి వైద్యసేవలు అందించామని, 494 హెల్త్‌కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 51 పశు వైద్య శిబిరాలు నిర్వహించి, 4 వేల100 పశువులకు వైద్య సేవలు అందించామన్నారు. ప్రజల నుంచి 7 వేల 196 విజ్ఞప్తులను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలలో ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆన్లైన్లో పొందుపరిచి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు. -
‘రైతు సాధికారిక సంస్థ’ ఏర్పాటు
ఈ సంస్థే రైతు రుణ విముక్తి పథకాలకు ప్రధాన ఏజెన్సీ విజయవాడ కేంద్రంగా విధులు.. 22 కల్లా కార్యకలాపాలు ప్రారంభం రూ. కోటి మూలధనంతో కంపెనీల చట్టం కింద సంస్థ ఏర్పాటు రూ.5వేల కోట్లను సంస్థకు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు సాధికారిక సంస్థ’ను ఏర్పాటు చేసింది. రూ.కోటి మూలధనంతో కంపెనీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యవస్థాపక డెరైక్టర్లుగా వ్యవహరిస్తారు. వ్యవసాయ శాఖ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. ఈ నెల 22కల్లా సంస్థ పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. రైతుల రుణ విముక్తికి బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.5 వేల కోట్లను రైతు సాధికారిక సంస్థకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంస్థ సమర్థంగా పనిచేసేందుకు, లక్ష్యాలను సాధించేందుకు జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు, అధికారులు, రైతు ప్రతినిధులు, తదితరులకు దీన్లో స్థానం కల్పిస్తారు. మున్ముందు వ్యవసాయ, సహకార శాఖ అధీనంలో పనిచేసే కార్పొరేషన్లు, సొసైటీలను దీన్లో విలీనం చేస్తారు. ఈ సంస్థ సమర్థంగా పనిచేసేందుకు తగు విధానాలను రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలతో సంస్థాగత, నిర్వహణపరంగా సంస్థను అనుసంధానం చేయాలని కూడా ఆదేశించింది. రైతులు రుణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు, అప్పులు తీసుకునేందుకు ఈ సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలో రైతు రుణ విముక్తి పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికిది ప్రధాన ఏజెన్సీగా ఉంటుంది. ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌కు, 22వ తేదీకల్లా కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాక లబ్ధిదారులు, వ్యవసాయ శాఖ, ఇతర బ్యాంకులు, కీలక సంస్థలను సంప్రదించి రైతు రుణ విముక్తికి అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. సంస్థ ప్రధాన లక్ష్యాలు.. ► రాష్ట్రంలో వ్యవసాయ రంగం విలువ పెం చడం, అత్యధిక ఉత్పాదకత సాధించే దిశగా రైతుల్ని ప్రోత్సహించటం.. అవసరమైన ప్రణాళికలు, అమలు, సంక్షేమ సమీక్ష, అభివృద్ధి, సామర్థ్యం పెంపు, ఇతర కార్యకలాపాలకు ఏకీకృత సాధికార సంస్థను ఏర్పాటు చేయడం. ► రైతులకు సాధికారికత కల్పించేలా ఆర్థిక మద్దతు, సాంకేతిక సాయం, సాంకేతిక అంశాల బదిలీ, వ్యసాయ రుణ విముక్తి తదితర చర్యలు చేపట్టడం. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, పశు, మత్స్య, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత రంగాల విలువను పెంచి, అత్యధిక ఉత్పాదకత కార్యక్రమాలు చేపట్టడం. ► వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన మద్దతు, సాయం, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడం. అలాగే రైతుల బృందాలు, సంఘాలు, సొసైటీలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, ఇతర రకాల సాయం అందించడం. ► వ్యవసాయ వృద్ధిని వేగవంతం చేసేందుకు, రైతుల సాధికారత కోసం సమర్థవంతమైన విధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం, సలహాలు ఇవ్వడం. ► ఈ లక్ష్యాలన్నింటినీ సాధించేందుకు గ్రాంట్లు, సబ్సిడీ, సెస్, లెవీల రూపంలో ప్రభుత్వ, ఇతర సంస్థల ద్వారా నిధులు స్వీకరించడం. ► బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫండ్స్, ప్రజల, ప్రభుత్వాల నుంచి రుణాలు, బాండ్లు, డిబెంచర్లు, మానిటరీ వాల్యూ సర్టిఫికెట్లు తదితరమైన వాటి ద్వారా నిధులు సేకరించడం. రూ.5వేల కోట్లు ఏ మూలకు? రుణ మాఫీ కోసం సాధికారిక సంస్థను ఏర్పాటు చేయటం వరకూ బాగానే ఉన్నా... రుణ మాఫీపై మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండానే రోజులు నెట్టుకొచ్చేస్తోంది. ఎందుకంటే సాధికారిక సంస్థకోసం సర్కారు కేటాయించింది రూ.5వేల కోట్లు. కానీ మాఫీ చేయాల్సిన మొత్తం మాత్రం వ్యవసాయ రుణాలు రూ.87వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్లు కలిపి మొత్తం రూ.1.01 లక్షల కోట్ల మేర ఉంది. దీనిపై గడిచిన ఏడాదికి గాను ప్రస్తుతం వడ్డీయే రూ.14 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. మరి ప్రభుత్వం జీవో ద్వారా కేటాయించిన రూ.5వేల కోట్లు వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోవు. ఈ లెక్కన రుణాలెలా మాఫీ అవుతాయి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఏమాత్రం స్పష్టతనివ్వకపోవటంతో ఆంధ్రప్రదేశ్ రైతులు ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి పైసా కూడా రుణ రూపేణా తీసుకోలేకపోయారు. -
ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి
గవర్నర్‌కు లేఖ రాసిన ఏపీ సీఎస్ కృష్ణారావు ఏపీ ఫుడ్స్ పేరు తెలంగాణ ఫుడ్స్‌గా మార్చే హక్కెక్కడుంది? పీసీబీని మూడు నెలల నుంచి పనిచేయనివ్వడం లేదు షెడ్యూల్స్‌లో లేని 38 సంస్థలనూ విభజించండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను పనిచేయనివ్వటం లేదని, వెళ్లిపోవాలంటూ వారిపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలియజేశారు. ఈ సంస్థల్లో ఏపీ ఉద్యోగులపై వివక్ష కనబరుస్తున్నారని, అందుకని వీటిని విభజించాలని లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయాలని గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు గవర్నరుకు ఆయనొక లేఖ రాశారు. ‘‘విభజించటమో లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయటమో రెండు ప్రభుత్వాలూ కలసి చేయాలి. కానీ అలాకాక వీటిలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయి. ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా అక్కడి ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. షెడ్యూలు 10లోని సంస్థలు గత ఐదు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి. రెండు రాష్ట్రాల ఉద్యోగులూ పనిచేస్తున్నారు. ఏడాదిలోగా ఈ సంస్థల విషయంలో రెండు ప్రభుత్వాలూ అవగాహనకు రావాల్సి ఉంది’’ అని సీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ ప్రాంతంలో ఉంటే వారికే చెందుతాయనేది ధర్మం కాదు. అది అన్యాయం... అక్రమం. కొన్నింటిని విభజించటం సాధ్యం కాదు కాబట్టి ఇరు రాష్ట్రాలూ ఆ సేవల్ని సంయుక్త నిర్వహణ ద్వారా వినియోగించుకోవాలి. దురదృష్టవశాత్తూ ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఏపీఉద్యోగులపై వెళ్లిపోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో ఆంధ్రా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. మూడు నెలలుగా వారిని పనిచేయనివ్వడం లేదు. జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో... ఏ షెడ్యూల్లో లేని 38 సంస్థలను కూడా పదోషెడ్యూల్లోని సంస్థల్లానే ఇరు రాష్ట్రాలూ పరస్పరాంగీకారంతో విభజించుకోవాలి లేదా ఉమ్మడిగా వాడుకోవాలి. న్యాక్ డీజీని రానివ్వకుండా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం పనిచేయలేదు కనక తక్షణం జోక్యం చేసుకోవాలి’’ అని ఆ లేఖలో కోరారు. లేఖ ప్రతులను తెలంగాణ సీఎస్‌కు, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించారు. -
కృష్ణారావు కుటుంబానికి మనోధైర్యం నింపిన అధినాయకుడు
-
కృష్ణారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారావు కుటుంబాన్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. వారిని ఓదార్చి మనోధైర్యం నింపారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, గ్రామస్తులకు కొండంత ధైర్యం లభించినట్టయ్యింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే. గొట్టుముక్కలలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణారావు హత్యను తీవ్రంగా ఖండించారు. ఓటు వేయలేదనే కారణంతో ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి హత్య చేయడం దారుణమని అన్నారు. కృష్ణారావును చంపవద్దని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా హంతకులు కనికరం లేకుండా చంపడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుటే దారుణాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డ ప్రాంతంలో ఇంతకుముందు టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారని, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ఆయన నిలదీశారు. పార్టీ కార్యకర్తలు హత్యలు, దాడులకు గురైన సంఘటనల గురించి ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని వైఎస్ జగన్ చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. దాడుల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, చంద్రబాబును నిలదీస్తామని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ వెంట కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్
-
నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ఆదివారం రాత్రి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత అలోకం కృష్ణారావు కుటుం బాన్ని పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళుతున్నారు. జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9 గంటలకు గన్నవరం చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా గొట్టుముక్కల గ్రామానికి వెళ్తారని పార్టీ ప్రోగాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనమవుతారని చెప్పారు. -
రేపు విజయవాడ వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడ వెళ్లనున్నారు. గొట్టిముక్కలలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. సోమవారం కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేశారు. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి నరికి చంపారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లా గొట్టుముక్కలలో టీడీపీ శ్రేణుల కిరాతకం అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో దాడులు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదు నందిగామ/కంచికచర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొట్టుముక్కల ఉప సర్పంచిని టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షతో పాశవికంగా పొట్టనబెట్టుకున్నాయి. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరమూకలు ఆటవికంగా హత్య కు పాల్పడ్డాయి. మరో నేత ఇంటిపైనా దాడులకు దిగాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. మంత్రి అండతోనే దాడులు! గొట్టుముక్కలకు చెందిన ఆలోకం కృష్ణారావు(55) వైఎస్సార్ సీపీలో చురుకైన నేతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన ఎదుగుదలను చూడలేక దాడి చేసేందుకు టీడీపీ నాయకులు పథకం వేశారు. తద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనలకు గురి చేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి కృష్ణారావును రోడ్డుపైకి లాక్కొచ్చి తీవ్రంగా హింసించారు. చేతులు వెనక్కి విరిచేసి కర్రలు, రాళ్లతో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడి ఇంటిపైనా దాడి కృష్ణారావును హత్యచేసిన అనంతరం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుదె అక్కారావు ఇంటిపై కూడా దాడికి దిగారు. ‘కృష్ణారావును చంపేశాం. నిన్ను కూడా చంపుతాం. బయటికి రా..’ అని కేకలు వేశారు. ఆయన బయటకు రాకపోవడంతో ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఫోన్ చేసినా.. పోలీసులు రాలేదు! తన తండ్రిని ఆరుగురు కలిసి హత్య చేశారని కృష్ణారావు కుమారుడు శ్రీనివాసరావు సోమవారం కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో త్రివిక్రమరావు(త్రివి), కంచా రమేష్‌బాబు, పాతూరు వెంకటేశ్వరరావు, సామినేని గోపి, చాగంటి రమేష్, చింతల కోటేశ్వరరావు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దాడులకు దిగిన సమయంలో కంచికచర్ల పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, వారు స్పందించి ఉంటే తన తండ్రి బతికేవాడని ఎస్పీ విజయ్‌కుమార్ ఎదుట శ్రీనివాసరావు విలపించాడు. వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో టీడీపీ అకృత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో కృష్ణారావు మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి తరలించి రాస్తారోకో చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదన్నారు. -
'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'
విజయవాడ : గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి చేసిన హత్య అని ఆయన ఆరోపించారు. -
కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
గొట్టిముక్కల : పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి...అతన్ని నరికి చంపారు. కాగా టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడ పోలీసు కమిషనరేట్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: విజయవాడ నగరం పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ కమిషనరేట్‌కు కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియమించేవారు. తాజా మార్పుచేర్పులతో అదనపు డీజీ స్థాయికి పెంచి, ప్రస్తుతం ప్రత్యేక భద్రతా బలగం (ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. దీంతో సహా మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీలో 15 నుంచి హెల్త్‌కార్డుల పథకం!
సీఎస్, ఉద్యోగ సంఘాల నేతల భేటీలో నిర్ణయాలు హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేసే దిశగా ముందడుగు పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల మధ్య మంగళవారం సచివాలయంలో జరిగిన చర్చలు ముగిశాయి. ఉచిత అవుట్ పేషెంట్(ఓపీ) ట్రీట్మెంట్ మినహా మిగతా డిమాండ్లకు సీఎస్ సానుకూలంగా స్పందించారు. చికిత్స గరిష్ట వ్యయాన్ని రూ.2 లక్షలకే పరిమితం చేశారు. పరిమితి దాటితే ప్రత్యేక అనుమతితో చికిత్స కొనసాగించడానికి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి నివేదికను బుధవారం ముఖ్యమంత్రికి సీఎస్ సమర్పించనున్నారు. -
అన్ని పథకాలకూ ఆధార్ లింకు
సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదేశం హైదరాబాద్: అన్ని ప్రభుత్వ పథకాలకు శల వారీగా ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత హాస్టళ్లలో విద్యార్థుల చేరికకు, అలాగే విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికకు ఆధార్ అనుసంధానాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే రెవెన్యూ రికార్డులకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. అధార్ అనుసంధానం చేయడం ద్వారా పథకాల భారాన్ని తగ్గించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం ద్వారా రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో ఈ-గవర్నెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించారు.