Lakes
-
హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
హైదరాబాద్: నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరై.. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే.. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. అయితే..మూడు నెలల్లోగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది. -
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్‌ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్‌లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దీనికోసం నిపుణుల సాయాన్ని తీసుకోనుంది. ఇందులో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో శుక్రవారం కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును పరిశీలించారు. సమావేశంలో భాగంగా ఆనంద్.. మురుగుతో నిండిన, నీళ్లు లేకున్న చెరువులను ఏ విధంగా తీర్చిదిద్దారో వివరించారు. బెంగళూరు నగరంలోని మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఆయన రంగనాథ్‌కు వివరించారు. అతి తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించడానికి ఉన్న అవకాశాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, స్వచ్ఛమైన నీరు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పరిశీలించారు. మురుగు నీటి శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందే మూడు నాలుగు దశల్లో ఫిల్టర్ చేసే తీరును హైడ్రా యోచిస్తోంది. మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం ద్వారా చెరువుకు చేరేలోపే ఆ నీరు కొంతమేర శుద్ధి అయ్యేలా బెంగళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా అధ్యయనం చేస్తోంది. త్వరలోనే బెంగళూరు వెళ్లి అక్కడ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని హైడ్రా అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కూల్చివేతల వ్యర్థాలను తొలగించి తొలిదశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్పల్లి చెరువులకు పునరుజ్జీవనం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. అయితే మల్లిగవాడ్‌తో కేవలం చెరువుల పునరుద్ధరణపై సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారా? లేదా ఆయనకు హైడ్రాలో ఏమైనా కీలక పదవిని అప్పగిస్తారా? అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్హైడ్రా కమిషనర్‌తో శుక్రవారం ఆనంద్ మల్లిగవాడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆనంద్ మల్లిగవాడ్ గురించి చర్చ మొదలైంది. సోషల్‌మీడియాలో సైతం ఆయన ఎవరనీ సెర్చ్ చేస్తున్నారు. ఆనంద్ మల్లిగవాడడ్ను ‘లేక్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆయన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు నీటి సంరక్షణ, పర్యావరణవేత్తగా కృషి చేస్తున్నారు. బెంగళూరులో క్షీణించిపోతున్న దశలో ఉన్న సమారు 23 చెరువులను పునరుద్ధరించటంలోకి కీలక పాత్ర పోషించారు. 1981లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జన్మించిన ఆనంద్.. 2017లో అనేకల్ సమీపంలోని క్యాలసనహళ్లి సరస్సు పునరుద్ధరించేందుకు బి.ముత్తురామన్ ‘సన్సెరా’ ఫౌండేషన్‌తో కలిసి పని చేశారు. ఇక.. అప్పటి నుంచి బెంగళూరులో చెరువుల పరిరక్షణకు సంబంధించి పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 2019లో తన ఇంజనీరంగ్ ప్రొఫెషన్‌ను వదిలేసి.. బెంగళూరులో చెరువుల పుణరుద్ధరణ, నీటి సంరక్షణే లక్ష్యంగా ఆయనే స్వయంగా ‘మల్లిగవాడ్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆయన సేవలు గుర్తించిన రోటరీ ఫౌండేషన్ ఆయనకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రధానం చేసింది. ఇక.. ఏప్రిల్ 2024లో ఆయన, ఆయన ఫౌండేషన్‌పై కర్ణాటక లేక్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్-2014లోని సెక్షన్ 430 కింద కేసు నమోదైంది.‘ నీటిపారుదల పనులు ఇబ్బందులు కలిగించటం. నీటిని తప్పుగా మళ్లించడం’ వంటి ఆరోపణలు రావటంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం గమనార్హం. బెంగుళూరు అర్బన్ జిల్లాలోని హీలలిగే అనే గ్రామంలోని రైతు సంఘం ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసింది. హీలలిగే వద్ద నీటి వనరులను పునరుద్ధరించడానికి మల్లిగవాడ్ చేపట్టిన పునరుజ్జీవన ప్రక్రియ అశాస్త్రీయ ఉందని ఆరోపించారు. -
ఈ ఆనంద్ మంచి ‘సరస్సు’ లాంటి వాడు.. ఇంట్రస్టింగ్ స్టోరీ
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి! కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది. తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు. View this post on Instagram A post shared by Wyzr (@wyzr.in) ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి. అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్‌ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం. ఆనంద్ మల్లిగవాడ్ సందేశం ‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్‌ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్‌యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్‌లో పర్యటకులకు భారీ ట్యాక్స్‌లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం! -
షాకింగ్.. హైదరాబాద్ పరిధిలో 134 జలాశయాలు కబ్జా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదించడం గమనార్హం. ఇందులో పలు జలాశయాల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్‌జోన్‌లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది. 51 చెరువులకు ఊరట.. మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. ఇప్పటికే 157 చెరువుల ఎఫ్టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు.. నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. -
Photo Feature: అలుగు దుంకిన అందం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. -
చెరువులు మింగేసి... ఊరు మునకేసి..
వరద వెళ్లిపోవాలంటే కాల్వలు కావాలి.. వాటిని పూడ్చేసి ఇళ్లు నిర్మిస్తే..? నీరు నిల్వ కావాలంటే చెరువులు ఉండాలి.. వాటిలో కాలనీలు కట్టేస్తే..? మరి వాన నీళ్లన్నీ ఎటు పోవాలి? ఎటూ పోలేకనే.. వరద రోడ్ల మీద పారుతోంది.. కాలనీల్లో ప్రవహిస్తోంది.. ఇళ్ల్లను ముంచెత్తుతోంది.. ఎనలేని నష్టాన్ని మిగుల్చుతోంది! ఇలా కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమణల పాలవడం వల్లే.. చిన్న వానకే నగరాలు, పట్టణాలు వణికిపోతున్నాయి. ఒకటీరెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. వివిధ పార్టీల నేతలు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాలాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఆయా చోట్ల వెంచర్లు వేసి కాలనీలు కట్టేస్తున్నారు. అక్కడ ఇళ్లు కొనుక్కుంటున్న సాధారణ జనం ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలైలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి చాలా పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణలు, వాటివల్ల ఉత్పన్నమైన పరిస్థితిని గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. –సాక్షి నెట్వర్క్ ఇది సిరిసిల్ల పట్టణ శివార్లలో కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఉన్న కొత్త చెరువు. ఆధునీకరణ పేరిట చెరువును సగం మేర పూడ్చి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాజీవ్‌నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించారు. ఓవైపు చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు వరద చేరిక పెరిగిపోయి.. కాస్త గట్టివాన పడితే మత్తడి దూకుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా శాంతినగర్ ప్రాంతం జల దిగ్బంధం అవుతోంది. ఇక కొత్త చెరువులోకి మురికినీరు చేరకుండా ఉండాలని మురికినీటి శుద్ధి (ఈటీపీ) ప్లాంటును ఏర్పాటు చేశారు. అది లోపభూయిష్టంగా ఉండటంతో మురికినీరు సిరిసిల్ల పట్టణ వీధులను ముంచెత్తుతోంది. కొత్తచెరువు మత్తడి నీళ్లు వెళ్లేందుకు గతంలో కాల్వ ఉండేది. దాన్ని కొందరు కబ్జా చేసి, ఇళ్లు, ఇతర సముదాయాలు నిర్మించారు. దీనితో మత్తడి వరద రోడ్డుపై ప్రవహిస్తూ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్ బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువులో వాకింగ్ ట్రాక్ పేరిట ఏర్పాటు చేసిన కట్ట ఇది. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామంటూ పోసిన ఈ కట్ట.. చెరువు ఎఫ్టీఎల్ మధ్యలోనే ఉండటం గమనార్హం. దీని అవతల మరింత చెరువు, ఎఫ్టీఎల్ పరిధి భూములు ఉన్నాయి. కానీ ఆ భూములు చెరువు పరిధిలోవి కావని, ఎఫ్టీఎల్ పరిధి ఆ కట్ట వద్దే ముగిసింది అన్నట్టుగా చూపుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖుల భూములు ఉండటంతోనే.. ఇలా కట్ట నిర్మించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పెద్దలు చెరువుల సమీపంలోని భూములను కొనుగోలు చేస్తూ.. మెల్లగా చెరువుల భూములను చెరబడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరువు మధ్యలో రోడ్డు.. నీళ్ల మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఈ రోడ్డు.. ఖమ్మం పట్టణశివార్లలోని ఖానాపురం చెరువులోనిది. ఖమ్మం కార్పొరేషన్‌గా మారినప్పుడు శివార్లలోని ఖానాపురం హవేలి పంచాయతీని విలీనం చేశారు. నాటి నుంచే ఇక్కడి చెరువుపై ఆక్రమణ దారుల కన్ను పడింది. ఖానాపురం చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 133 ఎకరాలు. సర్వే నంబర్ 13లో 75.23 ఎకరాల మేర చెరువు ఉండగా.. ఎఫ్టీఎల్ పరిధిలోని 57.17 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందేది. ఇప్పుడు ఆక్రమణలు పెరిగి కుంచించుకుపోతోంది. ప్రధాన చెరువులోనే రెండెకరాల వరకు కబ్జాలుకాగా.. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఓ రియల్ వెంచర్‌కు దారి కోసం ఇటీవల చెరువు మధ్యలోంచి మట్టిరోడ్డు వేశారు. జనం ఫిర్యాదులు చేయడంతో అధికారులు దానిని తవ్వించేశారు. ఇలాంటి ఆక్రమణలు మరెన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. వరంగల్ శివనగర్‌లో కబ్జాల పాలై ఇరుకుగా మారిపోయిన శివనగర్ నాలా ఇది. ఇదొక్కటే కాదు. వరంగల్‌లో ప్రధాన నాలాలు అయిన నయీంనగర్ నాలా, బొందివాగు నాలా సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి. దీనితో భారీ వర్షాలు పడినప్పుడు వరద అంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. ఇది హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతం. నిండుగా ఇళ్లతో కనిపిస్తున్న ఇక్కడ 25 ఏళ్ల కింద ఓ చెరువు ఉండేది. ఇదొక్కటే కాదు గోపాలపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఆరు చెరువులు ఆక్రమణల పాలయ్యాయి. మెల్లగా నిర్మాణాలు వెలుస్తూ.. ఇప్పుడు చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. దీంతో వానలు పడ్డప్పుడల్లా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ‘గొలుసుకట్టు’తెంపేశారు! రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. హన్మకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేట లో 150 ఎకరాల కోమటి చెరువులో సుమా రు 15–20 ఎకరాలు కబ్జాల పాలైంది. ► కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు సగమే మిగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నా.. కార్పొరేషన్ వారు ఇంటి నంబర్లు ఇస్తున్నారు. ► హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. ఇందులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. ► గొర్రె కుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉండేది. ఇందులో ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమణల పాలైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ► వరంగల్‌కు కీలకమైన భద్రకాళి చెరువు విస్తీర్ణం 336 ఎకరాలుకాగా.. 30 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయినట్టు అంచనా. ► హాసన్పర్తి పెద్దచెరువు 157 ఎకరాలు ఉండాలి. ఇటీవల కొందరు.. పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలోని 30 ఎకరాలను చదును చేయడం వివాదాస్పదమైంది. ► ములుగు రోడ్‌లోని కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉండేది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ తేల్చింది. ► చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలుకాగా.. 20 ఎకరాల వరకు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ► 170 ఎకరాల మామునూరు పెద్ద చెరువు లో 40 ఎకరాలు ప్రైవేటు చెరలోనే ఉంది. ► పాతబస్తీ ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) 126 ఎకరాల్లో ఉండగా.. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ► అమ్మవారిపేట దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు. ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. ► తిమ్మాపూర్ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చే ప్రతిపాదన ఉంది. 6 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువులో.. సగం దాకా ఆక్రమణలోనే ఉంది. వరంగల్ పెరకవాడలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు నాలాపైనే కట్టిన భవనం ఖమ్మం.. ఆక్రమణలకు గుమ్మం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. 2006 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం చెరువు ఎంతగా కుంచించుకుపోయిందో ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి ఈ చెరువు పూర్తిస్థాయి విస్తీర్ణం 163 ఎకరాలు. పాకబండ బజార్, ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని 66, 234 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న ఈ చెరువులో ఆరేడు ఎకరాలకు పైనే కబ్జాల పాలైంది. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాదు ప్రభుత్వ భవనాలు కూడా చెరువు భూముల్లో వెలిశాయి. కొందరు చెరువుల పక్కనే ఉన్న భూములు కొని, ఆ సర్వే నంబర్లతోనే చెరువు భూములకు పట్టాలు చేయించుకున్నారు. తీరా ఇన్నేళ్ల ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు వెళ్తే.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు, తామే హక్కుదారులమంటూ పత్రాలు చూపిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెరిగి.. కబ్జాదారుల కన్నుపడి ఖమ్మం పట్టణం 2012 అక్టోబర్‌లో కార్పొరేషన్ హోదా పొందింది. అప్పటి నుంచి పట్టణం విస్తరణ, భూముల రేట్లు బాగా పెరిగాయి. పట్టణంలోని లకారం చెరువు చుట్టుపక్కల చదరపు గజం రూ.30 వేలకుపైనే పలుకుతుండటంతో కబ్జా దారుల కన్ను పడింది. మెల్లమెల్లగా ఆరేడు ఎకరాలకుపైనే ఆక్రమణలు వెలిశాయి. గతంలో చెరువు పరిధిలో భూమిని లీజుకు ఇచ్చిన ఉద్దేశం కూడా మూలకుపడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. చివరికి 2015లో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఆక్రమణలు ఆగాయి. కానీ ఇప్పటికే కబ్జాల పాలైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు చెరువుల్లోని నీళ్లు వెళ్లే కాల్వలు, నాలాలు కూడా కబ్జా కావడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిర్మల్.. కబ్జాల ఖిల్లా! నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 450 ఏళ్ల క్రితమే కాకతీయుల స్ఫూర్తితో స్థానిక పాలకుడు నిమ్మనాయుడు, ఆయన తర్వాతివారు వీటిని తవ్వించారు. ప్రస్తుతం 11 చెరువులు ఉనికిలో ఉండగా.. దాదాపు అన్నింటిలో ఆక్రమణలు ఉన్నాయి. ఈ చెరువుల మధ్య నీళ్లు తరలిపోయే కాల్వలు కూడా కబ్జాల పాలయ్యాయి. ఈ కారణంగానే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా చెరువుల్లోకి చేరాల్సిన నీళ్లు.. కాలనీలు, ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది జూ లైలో భారీ వర్షాలతో పలు చెరువులు పూర్తిగా నిండాయి. సమీప కాలనీలు నీట మునిగాయి. కొందరు పట్టాభూములుగా చెప్పుకొంటున్న భూములు కూడా ఇప్పటికీ చెరువు నీటిలో మునిగే ఉన్నాయి. అవన్నీ ఆక్రమణలేనని.. అధికారులు పట్టించుకోకున్నా వానలతో బయటపడిందని స్థానికులు అంటున్నారు. నిజానికి నిర్మల్ గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై స్థానిక న్యాయవాది ఒకరు మూడేళ్ల కిందటే హైకోర్టులో పిల్ వేశారు. దానిపై కొద్దినెలల కింద జరిగిన విచారణ సందర్భంగా.. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో కొంతమేర తొలగింపు చేపట్టినా.. ఇంకా భారీగా కబ్జాలు అలాగే ఉన్నాయి. ఆక్రమణలపై టాస్క్‌ఫోర్స్ వేశాం ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటివనరుల ఆక్రమణలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎక్కడికక్కడ పరిశీలన జరిపి.. కేసులు పెడుతున్నాం. పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి అందజేస్తాం. – శంకర్‌నాయక్, సీఈ, జలవనరుల శాఖ, ఖమ్మం చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ►మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ► మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చదవండి: GHMC: కోటికి చేరువలో టీకా -
Telangana: రికార్డు స్థాయిలో వర్షాలు.. 4,943 చెరువులు ఫుల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో చెరువులు నిండుతున్నాయి. ఇప్పటికే 9 వేలకు పైగా చెరువులు పొంగి పొర్లుతుండగా, మరో 7 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 19 ఇరిగేషన్ డివిజన్ల పరిధిలో మొత్తంగా 43,870 చెరువులు ఉండగా, అందులో గురువారానికే 4,698 చెరువులు అలుగు దూకాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రోజంతా వర్షాలు కురవడంతో మరో 4,943 చెరువులు నిండాయి. మొత్తంగా 9,641 చెరువులు నిండు కుండల్లా మారి పొర్లుతున్నాయి. మరో 8,476 చెరువులు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ములుగు, వరంగల్, ఆదిలాబాద్ డివిజన్లలో వెయ్యికిపైగా చెరువులు నిండటం విశేషం. చెరువుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈ వానాకాలంలోనే 20 లక్షల ఎకరాలకు నీరం దే అవకాశాలున్నాయని ఇరిగేషన్ శాఖ అంచనా. చెరువు కట్టలపై అప్రమత్తం ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 చెరువులు పాక్షికంగా దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖకు నివేదికలు అందాయి. ముఖ్యంగా వర్షాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో చెరువుల కట్టలు తెగడం, బుంగలు పడటం వంటివి సంభవించాయని చెబుతున్నారు. నిర్మల్‌లో 3 చెరువుల కట్టలు పూర్తిగా తెగాయని చెబుతున్నారు. కట్టలు తెగిన చోట ఇప్పటికే తక్షణ చర్యలు మొదలయ్యాయి. ఇక ఆగస్టు వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటం, ఇప్పటికే చెరువులు నిండిన నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, కట్టలు, తూములు, కాల్వలపై పర్యవేక్షణ పెంచాలని శుక్రవారం జలసౌధ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు అన్ని డివిజన్ల ఇంజనీర్లను ఆదేశించారు. నిండిన మధ్యతరహా ప్రాజెక్టులు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండుతున్నాయి. గోదావరి బేసిన్లో ఇప్పటికే 90 శాతం నిండ గా, కృష్ణాలోనూ ఇదేమాదిరి వర్షాలు కొనసాగితే ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిగా నిండనున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని పెద్దవాగుకు ఏకంగా 3.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, కుమ్రంభీం ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పటికే నిం డటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వది లేస్తున్నారు. స్వర్ణకు 24 వేల క్యూసెక్కులు, సుద్ద వాగుకు 18 వేలు, శనిగరంకు 12 వేలు క్యూసెక్కుల చొప్పున ప్రవాహాలు కొనసాగుతున్నాయి. -
అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల చెరువుల నుంచి కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరింది. దీంతో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నిండు కుండల్లా ఉన్న చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున గండ్లు పడటం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువులను, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రమాదానికి ఆస్కారమున్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
రాజస్తాన్ ఎడారిలా.. తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువులన్నీ దురాక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టకపోతే తెలంగాణ కూడా రాజస్తాన్ ఎడారిలా మారుతుందని హైకోర్టు హెచ్చరిం చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులు దు రాక్రమణకు గురవుతున్నా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. గతంలో ఆదేశించినా.. చెరువుల పరిరక్షణకు కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. చెరువుల గరిష్ట నీటిమట్టానికి సంబం ధించిన అన్ని మ్యాపులను సమర్పించాలని ప్ర భుత్వాన్ని ఆదేశించింది. (చదవండి: ఉగ్ర గోదావరి..) రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతోందంటూ సోషలిస్ట్ పార్టీ (ఇం డియా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లుబ్నా సావత్ రాసిన లేఖ ను హైకోర్టు సుమోటో ప్రజాహి త వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం దీన్ని విచారించింది. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే తగిన చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్‌ను ఆదేశించినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నిం చింది. ఆ అధికారి బదిలీ అయ్యారని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు. అధికారులు మేల్కొనడం లేదు.. ‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువులన్నీ దురాక్రమణకు గురవుతన్నాయి. అయినా అధికారులు మేల్కొనడం లేదు. ఇప్పటికైనా జంట నగరాల్లో, రంగారెడ్డి జిల్లాలో చెరువుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే రాజస్తాన్‌లోని ఎడారిలా తెలంగాణ మారే ప్రమాదం ఉంది’ అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టబోతున్నారు? కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ? తదితర పూర్తి వివరాలను సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. (ఇంకా వరద బురదలోనే వరంగల్లు) -
దుర్గంచెరువు భాగ్యనగరానికే ఐకాన్
ముచ్చట గొలిపే ప్రకృతి అందాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో చెరువులు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. దుర్గం చెరువుతోపాటు మరో 14 చెరువులు సరికొత్త రూపు దాల్చనున్నాయి. కార్పొరేట్ కంపెనీల సహకరంతో పలు చెరువులు సుందర తటాకాలుగా మారనున్నాయి. ఆయా చెరువులను ప్రభుత్వం టూరిజం కేంద్రాలుగా మార్చనుంది. గచ్చిబౌలి: దుర్గం చెరువు కొద్ది నెలల్లోనే టూరిజం స్పాట్‌గా మారనుంది. అమెరికాలోని లాస్‌వెగాస్ లేక్ మాదిరిగా వాటర్ ఫ్లోటింగ్ లైట్లతో దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జిపై విద్యుత్ కాంతులు వెదజల్లనున్న ఎల్ఈడీ లైట్లకు ఫ్లోటింగ్ లైట్లు తోడుకానున్నాయి. చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు చైనా ఫ్లోటింగ్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మార్చి నాటికి లైట్లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చెరువుపై కేబుల్ బ్రిడ్జి, చుట్టూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీనరీ, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరో వైపు దుర్గం చెరువు అభివృద్ధితో చెరువును చూసేందుకు ఆసక్తి కనబర్చుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుందర తటాకంగా దుర్గం చెరువు భాగ్యనగరానికే ఐకాన్‌గా మారనుంది. ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న ఖాజాగూడలోని పెద్ద చెరువుకు కొత్త హంగులు దిద్దనున్నారు. వెల్స్ ఫార్గో కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సీఎస్ఆర్)లో భాగంగా చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్‌లోని 14 చెరువుల అభివృద్ధి పనులను ఆయా కంపెనీలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల అభివృద్ధికి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులను అందించనుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. దుర్గం చెరువు చుట్టూ ఫ్లోటింగ్ లైట్లు.. కె.రహేజా కార్పోరేట్ కంపెనీ దుర్గం అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించడంతో కె.రహేజా గ్రూపు చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు రూ.3.5 కోట్ల విలువైన వాటర్‌లో ఫ్లోటింగ్ లైట్లు, వాటర్ ఫౌంటేన్లు అమర్చనున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీలకు ప్రతిపాదనలు పంపగా రెండు నమునాలను రహేజా గ్రూపుకు పంపారు. మరో రెండు నమూనాలు రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే జీహెచ్ఎంసీ అమోదం తెలుపనుంది. ►ఎంట్రెన్స్ ప్లాజా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గ్రీనరీ , ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది. ►చుట్టూ 4 కిలో మీటర్ల పొడవునా 7 మీటర్ల వెడల్పులో‡ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. u రెండు ట్రాక్‌ల మధ్య గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ►100 మీటర్ల పొడవున స్కై వాక్ రానుంది. ►ఆంపి థియేటర్ రానుంది. పెద్ద చెరువు కొత్త సొబగులు... ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారి నుంచి ఖాజాగూడ వరకు విస్తరించి ఉన్న పెద్ద చెరువును కొత్త హంగులతో తీర్చిదిద్దనున్నారు. వెల్స్ ఫార్గొ కంపెనీ మూడు కోట్లకు పైనే నిధులతో పెద్ద చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. అభివృద్ధి పనులను యునైటెడ్ వేస్ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. చెరువు చుట్టు రెండు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్, అర కిలోమీటరు సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. గ్రీనరీ, ల్యాండ్‌స్కేప్, చిల్డ్రెన్స్ ప్లే ఏరియా, బటర్ ఫ్లై పార్క్, హెర్బల్ గార్డెన్, చెరువులోని నీటిని శుద్ధి చేసేందుకు 5 వేల వెట్లాండ్ మొక్కలు నాటనున్నారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్ ప్లాజా, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. 14 చెరువుల అభివృద్ధి ... ఐటీ కారిడార్‌లోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసేందుకు వివిద కంపెనీలు ముందకు వచ్చాయి. కొన్ని కంపెనీలు చెరువులæఅభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నాయి. దుర్గం చెరువు– కె.రహేజా గ్రూపు, పెద్ద చెరువు–వెల్స్పార్గొ, మల్కం చెరువు–అపర్ణ, బర్లకుంట–జేపి మోర్గాన్, కుడికుంట–పెర్నాడ్ రికార్డ్, మేడికుంట–ఎక్సిగాన్, నల్లగండ్ల చెరువు–అపర్ణ, ప్రగతినగర్ చెరువు– శ్రీశ్రీ ఫౌండేషన్, నిథమ్ చెరువు, ఎల్లమ్మ చెరువులను ఈఎఫ్ఐ అభివృద్ధి చేస్తోంది. కొండాపూర్‌లోని రంగన్న కుంటతో పాటు మరో మూడు చెరువులను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. చెరువుల అభివృద్ధికి వెయ్యి కోట్లు... వివిధ చెరువుల అభివృద్ధికి దక్షిణి కొరియాలోని గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులు అందించనుంది. జీహెచ్ఎంసీకి రెండు విడతలుగా రూ.400 కోట్లు , హెచ్ఎండీఏకు రూ.600 కోట్లు ఇవ్వనున్నారు. ఇలా 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. – హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ -
తటాక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిస్తోంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో రాష్ట్రం లో చాలా వరకు చెరువులు జలకళను సం తరించుకున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు చాలా చెరువులు అలుగుపారుతున్నా యి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 36% చెరువులు 100% నిండగా మరో 15%వరకు చెరువులు 75%, అదే స్థాయిలో చెరువులు 50%, మిగిలినవి 25% నిండాయి. దీంతో ఈ రబీ సీజన్లో చెరువుల కింద 18 లక్షలకుపైగా ఎకరాలు సాగులోకి వస్తాయని సాగునీటిశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగానే చెరువుల్లో జలకళ సాధ్యమైందని చెబుతున్నాయి. పదేళ్ల్ల తర్వాత నిండిన జగిత్యాల జిల్లా బండలింగాపూర్ చెరువు చెరువుల్లో నీళ్లే నీళ్లు... ఈ ఏడాది రాష్ట్రంలోని మొత్తం 43,855 చెరువులకుగాను 36%అంటే 15,689 చెరువులు 100% నిండాయి. ఈ చెరువుల కింద గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రబీలో వ్యవసాయ పనులు సాగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4,195 చెరువులు పూర్తిగా నిం డాయి. ఈ జిల్లాలో మొత్తం 6,052 చెరువులు ఉండగా అందులో 70% చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. మరో 10 శాతం చొప్పున చెరువుల్లో 25, 50, 75 శాతం నీరు చేరింది. అదే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏకంగా 76 శాతం చెరువులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఇక్కడ మొత్తం 2,702 చెరువులుండగా అందులో 2,050 చెరువులు ఎఫ్టీఎల్ స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా వేల సంఖ్యలో చెరువులు 100 శాతం నిండగా మహబూబ్‌నగర్‌లో 599, నల్లగొండలో 431, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 64 చెరువుల్లో గరిష్టంగా నీరు చేరింది. ఇంకో విషయమేమిటంటే రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో 25 శాతమే నీరు చేరిన చెరువుల కంటే 100 శాతం నిండిన చెరువుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 15,616 చెరువుల్లో 25 శాతం నీరు చేరగా 15,689 చెరువులు నీటితో పూర్తిగా నిండిపోయాయి. మిషన్ కాకతీయ ప్రస్థానం ఇదీ... రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా 2015 మార్చి 12న సీఎం కేసీఆర్ అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా అధ్యయనం చేస్తున్న మిషిగాన్ యూనివర్సిటీ ఈ పథకం అమలు తీరును పరిశీలించింది. వర్సిటీ పరిధిలోని 8 విద్యాసంస్థలకు చెందిన 16 మంది విద్యార్థులు 2016–17 సంవత్సరంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ఏడాదిపాటు ఈ పథకం అమలు తీరును పరిశీలించారు. షికాగో వర్సిటీ–టాటా డెవలప్మెంట్ సెంటర్ రెండేళ్ల సమగ్ర అధ్యయనానికి అప్పట్లో ముందుకొచి్చంది. ఈ పథకం అమలు తీరును పరిశీలించాలని నాబార్డు సంస్థ నాబ్కాన్స్కు సూచించగా ఆ సంస్థ 2017 చివర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరిగిందని, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయని వెల్లడైంది. అలాగే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు భూగర్భ జలాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని, చేపల లభ్యత 39 శాతం పెరిగిందని తేలింది. -
కరువు నేలపై జలసిరులు
సాక్షి, యాచారం: కరువు నేలపై జలసిరులు సవ్వడి చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో.. పదేళ్ల తర్వాత కుంటలు నిండి నీళ్లు అలుగు పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రబీపై ఆశలు కలుగుతున్నాయి. జిల్లాలోని యాచారం, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల మండలాల సరిహద్దులో 15 వేలకు హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం, ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ 20 నుంచి 30 వరకు కుంటలు, ఐదారు చెరువులు ఉన్నాయి. వారంరోజులుగా కురస్తున్న వానలతో యాచారం మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో గండి కుంట, ఎర్ర కుంట, ఎకతాయి కుంట, తాటి కుంట, తమ్మల కుంటలతో పాటు తలాబ్ చెరువు, కుర్మిద్ద చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. అడవీప్రాంతం నుంచి వచ్చే నీటితో తాడిపర్తిలోని బంధం చెరువు రెండుమూడు రోజుల్లో నిండే అవకాశం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో నిండిన కుంటలు ప్రస్తుతం పొంగిపొర్లుతుండడంతో కర్షకుల ముఖాల్లో సంతోషం సుస్పష్టంగా కనిపిస్తోంది. పెరగనున్న భూగర్భజలాలు కుంటలు, చెరువులు నిండడంతో యాచారం, ఆమనగల్లు, కందుకూరు, కడ్తాల్, మాడ్గుల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాడిపర్తిలో కుంటలు అలుగుపోస్తుండడంతో గొల్లగూడెం మీదుగా నీళ్లు పారుతున్నాయి. కుంటల నుంచి లీకేజీలు కావడంతో సర్పంచ్ రమేష్ ఇరిగేషన్ శాఖ ఏఈ శ్రీకాంత్ సాయంతో మరమ్మతులు చేయించారు. గొల్లగూడెం మీదుగా నీళ్లు రాకుండా నానక్‌నగర్ చెరువులోకి నీళ్లు మళ్లించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో దాదాపు 8 వేలకు పైగా బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి 15 నుంచి 20 వేల ఎకరాల్లో రబీ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటలు నిండడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు మేలు జరిగి జీవనోపాధి కలిగే అవకాశం ఉంది. సంతోషంగా ఉంది పదేళ్ల తర్వాత చెరువులు, కుంటలు నిండడం సంతోషంగా ఉంది. ఇక వ్యవసాయానికి ఏ ఇబ్బంది ఉండదు. తాడిపర్తితోపాటు నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి గ్రామాల్లోని బోర్లల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి వానలతో రబీపై ఆశ కలిగింది. – దూస రమేష్, సర్పంచ్ తాడిపర్తి -
చేపల పెంపకానికి చెరువులు సిద్ధం
సాక్షి, వరంగల్ : ఇటీవల కురిసిన వర్షాలతో జలకళ సంతరించుకున్న చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. వరంగల్ అర్బన్ జిల్లాలోని 310 చెరువులు చేపల పెంపకానికి సిద్ధమయ్యాయి. చేప పిల్లల పంపిణీకి కావాల్సిన టెండర్ల ప్రక్రియ గత నెలలోనే పూర్తయినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన మొదటి దశలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలోని మడికొండ, పెద్ద పెండ్యాల చెరువుల్లో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మూడో వంతు నీరు చేరితేనే.. జిల్లాలోని 561 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన ప్రణాళిక జిల్లా మత్స్యశాఖ పూర్తి చేసింది. కాగా చెరువుల్లో మూడో వంతు నీరు ఉంటేనే చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా ఉంటేనే చిన్న చెరువుల్లో ఒక హెక్టారుకు 3వేల చేప పిల్లలు, పెద్ద చెరువుల్లో ఒక హెక్టార్‌కు 2వేల చేపపిల్లలను పంపిణీ చేస్తారు. ఆ ప్రాతిపదికన జిల్లాలోని 310 చెరువులు ప్రస్తుతం సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. ఏ చెరువుల్లో ఎన్ని చేపపిల్లలంటే.. జిల్లాలోని 561 చెరువుల్లో 102 చెరువులు మత్స్యశాఖ పరిధిలో ఉండగా, 459 గ్రామపంచాయతీల ఆధీనంలో కొనసాగుతున్నాయి. అందులో వర్షాధారితంగా నీరు చేరే చెరువులే ఎక్కువ. ఇక 365 రోజులు నీరు నిల్వ ఉండే చెరువుల జాబితాలో ధర్మసాగర్ రిజర్వాయర్, కమలాపూర్, నాగారం చెరువులు ఉన్నాయి. పెద్ద చెరువులుగా గుర్తింపు కలిగిన ధర్మసాగర్, కమలాపూర్, నాగారం చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు చేపపిల్లలు, మిగిలిన చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు పిల్లలు వేయాలని నిర్ణయించారు. చేపల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, మత్స్యశాఖ నిబంధనల ప్రకారం చెరువుల్లో రకాల వారీగా చేప పిల్లలను వదులుతారు. ఈ మేరకు 35శాతం బొచ్చె చేపలు, 35శాతం రోహులు, 30శాతం బంగారు తీగ చేపలను వేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇక మూడు పెద్ద చెరువుల్లో 40శాతం బొచ్చె, 50శాతం రోహు చేప, 10శాతం మ్రిగాల జాతి చేపలను వదలనున్నట్లు చేయనున్నట్లు వెల్లడించారు. సీడ్ పంపిణీకి కమిటీ.. ప్రత్యేక కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో చేపపిల్లలను వేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో కమిటీని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న చేపపిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందకు ఆయా చెరువుల సొసైటీ బాధ్యులు, ఫిషరీస్ అభివృద్ధి అధికారి, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే, చేప పిల్లల పంపిణీ కోసం కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్, భీమారం, ఎల్కతుర్తి, కమలాపూర్ వద్ద శాస్త్రీయంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. రూ.47 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా జిల్లాలో 91 మత్సపారిశ్రామిక సహకార సంఘాల్లో 10,424 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది 561 చెరువులకు గాను నీటి కొరత కారణంగా 108 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. మిగిలిన చెరువుల్లో 4,050 టన్నుల చేపల ఉత్పత్తి కాగా అమ్మకాల ద్వారా సుమారు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5,895 టన్నులు ఉత్పత్తితో దాదాపు రూ.47 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. చేప పిల్లల పంపిణీకి కేంద్రాలు ఏర్పాటు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందిస్తుంది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం జిల్లాలో మూడో వంతు నీరు నిండిన 310 చెరువులను గుర్తించాం. ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందిస్తున్న చేప సీడ్ ను పంపిణీ చేసేందుకు కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశాము. చెరువుల సొసైటీ బాధ్యులు ఆయా పాయింట్ల వద్ద సంప్రదించాలి. – దాహగం సతీష్, ఏడీ, మత్స్యశాఖ, వరంగల్ అర్బన్ -
వనపర్తిలో సప్త సముద్రాలు..
సాక్షి, వనపర్తి(మహబూబ్‌నగర్) : సంస్థానాల కాలం నుంచే.. వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డిరాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకాలు వెల్లడిస్తున్నారు. కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వర్‌రావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ.. రాజ్యపాలన చేసేవారు. రాణి శంకరమ్మ అదే పద్ధతిని అనుసరించి పాలన చేశారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది. రాణిశంకరమ్మ హయాంలో బీజం వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో పదిలమైన స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా.. కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు. పురాణాల్లో ఉన్న సప్తసముద్రాల మాదిరిగా.. తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని బృహత్తరమైన కార్యానికి పూనుకుని తన హయాంలోనే.. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు. ఈ చెరువులకు వర్షం నాటి పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెరువులు అలుగు బారినప్పుడు సప్త సముద్రాల్లోకి చేరేలా.. గొలుసుకట్టు విధానానికి రూపకల్పన చేశారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు (సప్త సముద్రాలు) జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే.. ఉపయోగపడుతున్నాయి. ఇక్కడే గొలుసుకట్టు చెరువులు వనపర్తి సంస్థానాధీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువుల నిర్మాణంతోపాటు అన్ని చెరువులు, కుంటలకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా అన్ని చెరువులకు గుట్టల ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం వరద నీరు చెరువుల్లోకి చేరేలా పాటు కాల్వల నిర్మాణం చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షం నీరు చేలా పాటు కాల్వలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చెన్నై, కోల్కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పల్లిని కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. పల్లి ధరల విషయానికి వస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కంటే వనపర్తిలో మార్కెట్లో ఏటా వేరుశనగ పంట ఉత్పత్తులకు ఎక్కువ ధరలు పలుకుతాయి. ఎక్కువగా జిల్లా రైతులు వేరుశనగను యాసంగి పంటగా సాగు చేస్తారు. వేరుశనగ పంట ఉత్పత్తులు వచ్చే సమయంలో జిల్లాకేంద్రంలోని మార్కెట్ పల్లి రాశులతో కళకళలాడుతుంది. కాలు మోపెందుకు స్థలం లేనంతగా వేరుశనగ రాశులతో నిండిపోతోంది. 2 లక్షల ఎకరాల్లో సాగు.. సంస్థానాధీశుల కాలం నుంచే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు సంతరించుకున్నది వనపర్తి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి పాలకుల కృషి ఫలితంగా కొత్త రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాల్వల నిర్మాణాలను చేపట్టడంతో ప్రస్తుతం జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో మెట్ట, తరి పొలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరిసాగు చేస్తారు. ప్రతి ఖరీఫ్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తూ రాష్ట్రంలోనే.. అత్యధికంగా వరిధాన్యం పండిస్తూ రికార్డు స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంకు మించి ధాన్యం విక్రయిస్తున్నారు. మా తాతముత్తాల నుంచే.. సప్తసముద్రాల్లో ఒకటైన శంకరసముద్రం మా గ్రామ సమీపంలో ఉండటం సంతోషంగా ఉంది. మా తాత, ముత్తాల కాలం నుంచి ఈ శంకరసముద్రం కింద మేం వ్యవసాయం చేస్తున్నాం. వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఈ చెరువు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో పనులు ప్రారంభించారు. శంకరసముద్రంలో మా గ్రామం ముంపునకు గురైంది. ఏళ్లు గడుస్తున్న నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులందరం నిరాశతో ఉన్నాం. – బాలయ్య, రైతు, కానాయపల్లి సాగు, తాగునీరు అందిస్తోంది పెబ్బేరు శివారులో ఉన్న మహాభూపాల్ చెరువును రాజుల కాలంలో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ చెరువు వర్షాలతోనే నిండదంలో పశువులకు, గ్రామ ప్రజలకు తాగునీరు, అవసరాలకు వాడుకోవడంతోపాటు చెరువు కింద రైతులు 2 వేల ఎకరాల్లో వరిసాగు చేసి నీళ్లను వాడుకుంటున్నారు. ఆ రోజుల్లో చెరువు చూడాల్సిన వారు రైతు కమిటీ సభ్యులను నీరేంటులుగా నియమించడంతో నీటి వృథా చేయకుండా వాడుకునేవారు. ప్రస్తుతం జూరాల కాల్వ చెరువు పక్కల ఆనుకొని పోవడంతో పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులను చూసుకునే దిక్కులేకుండా పోయింది. – బాల్‌రాం, రైతు, పెబ్బేరు -
తీరనున్న నీటి కష్టాలు..!
సాక్షి, గుర్రంపోడు : ఏఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేస్తున్నా అటు పొలాలకు చివరి దాకా నీరందక, ఇటు చెరువులు నిండక నీరెటు పోతుందో అధికారులకే తెలియని పరిస్థితి. ఎలాగూ యాసంగి సీజన్ ముగుస్తున్నందున పంటలకు నీటి అవసరం లేని వేసవిలో ఏఎమ్మార్పీ జలాల ద్వారా చెరువులు నింపేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆన్ అండ్ ఆఫ్ నీటి విడుదల విధానంలో ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలనే కార్యాచరణ ప్రణాళికలో అధికారులు రూపకల్పన చేస్తున్నారు. చెరువులు నింపేలా ప్రత్యేక కాల్వలకు భూ సేకరణ సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న మైనర్ కాల్వల చివరిల నుంచి లేదా మేజర్ కాల్వలకు అవసరమైన చోట తూములు అమర్చి దిగువభాగంలోని రైతులకు నీటి విడుదలకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన కాల్వ నుంచి మండలంలోని మేజర్ చెరువులైన చేపూరు, మొసంగి, చామలేడు, తదితర గ్రామాల చెరువులు నింపి వీటి ద్వారా ఇతర లింకు చెరువులు, కుంటలు నింపాలనే ప్రతిపాదన ఉంది. ఆయకట్టులోనూ అడుగంటిన భూగర్భజలాలు.. మండలంలో ఏఎమ్మార్పీ ఆయకట్టులో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇందుకు కారణం ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు ఏఎమ్మార్పీ నీటితో నిండకపోవడమే. గతంలో సరిపడా నీరు విడుదల చేసిన సందర్భాల్లో వర్షాలు తోడై చెరువులు నిండేవి. ఈ ఏడాది భారీ వర్షాలే కరువై ఏఎమ్మార్పీ నీటినే నమ్ముకొవలసి వచ్చింది. అడపాదడపా నీటి విడుదలతో కొంత వరకు బోర్లలో లభిస్తున్న నీటిని కాల్వ నీరు తోడు కాకపోతుందా అనే ఆశతో యాసంగిలో వరిసాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు నష్టపోయారు. పొట్టదశలో నీరందక చెరువుల కింద సాగు చేసిన పొలాలు కొంతవరకు ఎండి, నీరందక దెబ్బతిని సరైన దిగుబడులు వచ్చేలా లేవు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీర్చేందుకు చెరువులు, కుంటలు నింపడమే పరిష్కారం కాగా ఈ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఎమ్మార్పీ పరిధిలో ఆరు మండలాల్లోని 130 చెరువులు, 64 లింక్ చెరువులు నింపేందుకు అవసరమైన చర్యలతో ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గతంలోని లోపాలే.. చెరువులకు శాపాలు ఏఎమ్మార్పీ ఆయకట్టులో చెరువులు, కుంటలు నింపేలా మేజర్, మైనర్ కాల్వలను తవ్వినప్పుడే చెరువులు, కుంటల్లోకి నీరుచేరేలా కాల్వలు తవ్వి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అప్పట్లో రైతులు చెరువులు, కుంటలకు నీరు చేరేలా చివరి వరకు మైనర్ కాల్వలు తవ్వాలని డిమాండ్ చేసినా తాము ఆయకట్టుకు వంద ఎకరాలకు వరకు నీరందేలా మైనర్ కాల్వలు తవ్వుతామని, చెరువుల వరకు నీరు చేరేలా కాంట్రాక్టర్లు కేవలం ఆయకట్టుకు నీరందించేలా కాల్వలను డిజైన్ చేశాడు. ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నేరుగా ఏఎమ్మార్పీకి నీరు చేరితే తప్ప చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. త్వరలోనే ఆయకట్టు చెరువులకు నీరందిస్తాం గత నెల 19న డివిజన్ ఈఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డీఈఈ, ఏఈఈలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఏ చెరువుకు ఎక్కడి నుంచి నేరుగా నీరందించవచ్చునో పరిశీలిస్తున్నాం. వేసవిలో నీటి సమస్యను అధిగమించేలా భూగర్భజలాలను కాపాడేందుకు చెరువులు నింపేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఉదయసముద్రంలో సరిపడా నీరు చేరిన తర్వాత ఇక్కడి చెరువులు, కుంటలకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. – అజయ్‌కుమార్, ఈఈ -
కబ్జాకు గురవుతున్న చెరువు
కాసిపేట: ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి రైతులను, గ్రామాలను పచ్చగా ఉంచుతామని చేపట్టిన చెరువు మరమ్మతులు కాసిపేట మండలంలో మాత్రం రైతులకు శాపం గా మారాయి. మిషన్ కాకతీయ పేరుతో కంట్రాక్టర్ అవతారమెత్తి చెరువు మరమ్మతులు పనులు చేపట్టినా.. అధికార పార్టీ నాయకులు మత్తడిని పూర్తిగా తొలగించడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించి గతంలో చెరువులో మా భూములను కోల్పోయామని కబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో చెరువు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మండలంలోని పల్లంగూడ గ్రామశివారు ఊరచెరువు అభివృద్ధి పనులకు 2016లో టెండర్లు పిలిచి రూ. 25లక్షలు నిధులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న కంట్రాక్టర్‌ను బెదిరించి అధికార పార్టీ నాయకులు చెరువుల పనులు చేయడం సర్వసాధారణంగా మారింది. మిషన్‌కాకతీయతో చెరువులు వినియోగంలోకి రావడం మాట పక్కన పెడితే ఊరచెరువు విషయంలో మాత్రం నాయకుల తీరు రైతులకు శాపంగా మారుతోంది. దీంతో మూడేళ్లుగా పోలా లు బీడులుగానే ఉంటున్నాయి. టెండరు వచ్చిన కంట్రాక్టర్ నుంచి పనులు తీసుకున్న మండల నాయకులు మరమ్మతుల పేరుతో మొదట చెరు వు మత్తడిని పూర్తిగా తొలగించి, పనులు చేపట్టకపోవడంతో చెరువులో చుక్కనీరు లేకుండా పో యింది. దీంతో చెరువుపై సుదీర్ఘకాలంగా ఆధారపడి పోలాలు చేసుకుంటున్న రైతులు మూడేళ్లుగా భూములను బీడులుగా వదులుతున్నారు. ఈ వి షయమై రైతులు అధికార పార్టీ నాయకులు, ఎ మ్మెల్యే, అధికారులను కలిసి పలుమార్లు విన్న వించినా.. ప్రయోజనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిషన్ కాకతీయతో ఉన్న చెరువు అనవాలు లేకుండా పోయిందని రైతులు నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్వా కంతో ప్రస్తుతం చెరువుకబ్జా అవుతుందని నాయకులు, అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. వెంటనే చెరువు సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. నీరు లేకపోవడంతో చెరువు కబ్జా.. 60 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువులో మరమ్మతులు లేకున్న ప్రతి ఏడాది ఆయకట్టు కింద కనీసం 50 ఎకరాలు వరి పంట సాగు అయ్యేది. మత్తడి తొలగించి తూములు తీసి ఉంచడంతో చెరువులో చుక్కనీరు లేకుండా అయింది. చెరువులో పోయిన తన భూమికి పరిహారం ఇవ్వలేదంటూ ప్రస్తుతం చెరువు భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా రు. సంబంధిత రైతులు మిషన్‌కాకతీయ పనులు అడ్డుకుంటున్నట్లు తెలిపి పనులు నిలిపివేసిన వా రు ప్రత్యమ్నాయ మార్గాలు చూడలేదు. 60 ఏళ్ల క్రితం నుంచి ఉన్న చెరువు విషయంలో భూమి విషయం మాట్లాడకుండా ప్రస్తుతం నీరు లేకపోవడంతో కబ్జాకు దిగడంతో సంబంధిత నాయకులు కబ్జాను ప్రోత్సహించేందుకే అధికారికంగా మరమ్మతుల పేరుతో మత్తడి కూల్చివేశారని రై తులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి చెరువును అభివృద్ధిలోకి తీసుకురావా లని పలువురు కోరుతున్నారు. చెరువు మీద ఆధారపడిన రైతు కుటుంబాలకు అన్యాయం చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నురగ’ ఎలాగ?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు చెరువులు విషాన్ని చిమ్ముతున్నాయి. బుసలు కొడుతున్న నురగ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని విధంగా చెరువుల్లో నురగ ప్రమాదకర స్థాయికి చేరుకుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దఎత్తున వచ్చి చేరుతున్న విష రసాయనాలు, పారిశ్రామిక, గృహ వ్యర్థాలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు చెరువుల్లో నురగపై కొన్ని తాత్కాలిక నివారణ పద్ధతులను అమలు చేస్తున్నప్పటికీ అలాంటి తాత్కాలిక చర్యలు ఎంతో కాలం కొనసాగించలేమని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు నిపుణులు హెచ్చరించారు. సీఎస్ఐఆర్ అనుబంధ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి) గత రెండు సంవత్సరాలుగా నగరంలోని పలు చెరువులపై అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నురగ నివారణ కార్యాచరణలో భాగంగా మంగళవారం మొట్టమొదటిసారి ‘నురగపొంగుతున్న చెరువులు– కారణాలు, నివారణ చర్యలు’ అన్న అంశంపై మేధోమధన సదస్సు నిర్వహించింది. బెంగళూరు, కోల్కత్తా, చెన్నై, ముంబయి, దిల్లీ, తదితర నగరాలకు చెందిన పర్యావరణ నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యర్ధాలను చెరువుల్లోకి వదలకుండా అరికట్టడమే తక్షణ నివారణ మార్గమని, వరద నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు నిపుణులు సూచించారు. ఆదమరిస్తే బెలందూర్ చెరువే... గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటిలో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. చాలా వరకు చెరువులన్నీ రకరకాల వ్యర్ధాలతో నిండిపోయినట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా సంస్థల నుంచి వచ్చే ప్రమాదకరమైన విషరసాయనాలతో చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయని, అలాగే పరిశ్రమలు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు కూడా చెరువులకు ముప్పుగా పరిణమించిందని పేర్కొంటున్నారు. ఈ వ్యర్ధాల మూలంగానే వెల్లువెత్తుతున్న నురగ కొన్ని చెరువుల్లో ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరంలోని ఇబ్రహీం చెరువు, ఆర్కె పురం చెరువు, హస్మత్‌పేట్, ఉప్పల్ నల్లచెరువు, కూకట్పల్లి చెరువులలో నురగ స్థాయిలు బాగా పెరిగినట్లు ‘నీరి’ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నురగను నిర్లక్ష్యం చేస్తే బెంగళూర్‌లోని బెలందూర్ లేక్ తరహాలో నురగ పొంగి రోడ్లపైకి, ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉన్నట్లు ‘నీరి’ హెచ్చరించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ నురగ వల్ల బెలందూర్ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషపూరితమైన రసాయనాలతో కూడిన నురగ పొగలుకక్కుతూ ఇళ్లల్లోకి ప్రవహించింది. దీంతో చర్మవ్యాధులు ప్రబలాయి. తలనొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తాయి. రోడ్లపైన నురగ కారణంగా వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఆటంకం తలెత్తింది. వర్షం వచ్చినప్పుడు పోటెత్తే వరద నీటితో పాటు మురుగు నీరు, వ్యర్ధాలు ఈ చెరువులో పెద్ద ఎత్తున వచ్చి చేరినట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాంటి ముప్పే నగరంలోని చెరువులకు కూడా ఉన్నట్లు నీరి సైంటిస్టుల అధ్యయనం స్పష్టం చేస్తోంది. యాంటీ ఫోమింగ్ ఏజెంట్లు తాత్కాలికమే... ‘ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లోను నురగ ముప్పు ఏదో ఒక స్థాయిలో ఉంది. దీనిని నివారించేందుకు చేపట్టవలసిన చర్యలపైన ఇది మొట్టమొదటి మేధోమధన కార్యక్రమం. ఇలాంటివి మరిన్ని నిర్వహించవలసి ఉంది.’ అని సీఎస్ఐఆర్–నీరి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ షేక్ బాషా తెలిపారు. ఇప్పటి వరకు యాంటీ ఫోమింగ్ ఏజెంట్లను వినియోగిస్తూ నురగను నియంత్రిస్తున్నారు. కొన్ని చోట్ల నానో పార్టికల్స్‌ను చెరువులపైన చల్లుతున్నారు. ఇలాంటివి తాత్కాలికమే. వరద నియంత్రణ, చెరువుల పరిరక్షణ మాత్రమే సరైన పరిష్కారం.’ అని చెప్పారు. నగరంలోని చెరువులన్నీ పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయని, రూ.వందల కోట్లు వెచ్చించి చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్క చెరువులోని వ్యర్ధాల ప్రవాహాన్ని ప్రభుత్వం నిలపలేకపోయిందని సామాజిక కార్యకర్త, పర్యావరణ నిపుణులు లుబ్నా సర్వత్ ఆందోళన వ్యక్తం చేశారు. రూ.360 కోట్లతో హుస్సేన్‌సాగర్ చెరువు ప్రక్షాళన చేపట్టారు. కానీ పారిశ్రామిక, ఫార్మా వ్యర్ధాల వెల్లువ ఏ కొంచెం కూడా తగ్గలేదని విస్మయం వ్యక్తం చేశారు. వరద నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయేవిధంగా చర్యలు తీసుకొంటే తప్ప చెరువులను కాపాడుకోవడం సాధ్యం కాదన్నారు. ఈ మేదోమధన సదస్సులో ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ అండ్ జినోమిక్స్ హెడ్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ హెమంత్ జె.పురోహిత్, గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునూరే, డాక్టర్ అత్యా కప్లే, తదితరులు పాల్గొన్నారు. -
చెరువులకు పూర్వ వైభవం తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో మురికి కూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లోకి వ్యర్థాలను వదిలే మార్గాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని హైదరాబాద్ సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేయాలంది. అవసరమైతే కఠిన చర్యలకు సైతం వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. లోటస్ పాండ్, ఖాజాగూడ పెద్ద చెరువు, నాచారం పెద్ద చెరువు, మీర్ ఆలం చెరువు, కూకట్పల్లి రంగథాముని చెరువుల నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణ, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అం శంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగాఇప్పటికే పలుమార్లు విచారించింది. ఏమైనా చేయండి.. చెరువుల్లోకి మురికి నీటిని వదలకూడదని ప్రజలకు తెలియజేయాలని, పరిస్థితిని బట్టి హెచ్చరికలు కూడా చేయాలని ధర్మాసనం పేర్కొంది. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలు చేరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని, ఇందుకు ఏం కావాలంటే అది చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. చెరువుల్లోకి వ్యర్థాలను తీసుకొచ్చే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాదిని ప్రశ్నించింది. 4 వారాలు పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాది చెప్పగా, అంత గడువు ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పగా, ఈ సమాధానం తమకు అవసరం లేదంది. ఏది అడిగినా కూడా ఎన్నికలని చెప్పడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి... మొత్తం వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలని, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయి. వీటి ధ్వం సానికి ఎన్నిరోజుల సమయం పడుతుంది తదితర వివరాలను అందులో పొందుపరచాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితరులను ఆదేశించింది. ఈ సమయంలో హెచ్ ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు జోక్యం చేసుకుంటూ, తాము చర్యలు తీసుకుంటే, వా టిపై కొందరు హైకోర్టును ఆశ్రయించి, సింగిల్ జడ్జి వద్ద స్టే పొందుతున్నారని ధర్మాసనం దృష్టి కి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఏవైనా వస్తే వాటిని తమ దృష్టికి తీసుకురావాలంది. ఇదే ధర్మాసనం చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్ టెక్నాలజీ అత్యుత్తమమైనదని, ఇందుకు చాలా తక్కువ వ్య యం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పై ఓ నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
పులికాట్‌ను మింగేస్తున్న కాలుష్య భూతం
ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి.. అందాల తీరంగా ఉన్న పులికాట్.. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో సహజత్వానికి దూరమవుతోంది. జీవవైవిధ్యాన్ని కోల్పోతోంది. మత్స్య సంపద తగ్గిపోతోంది. సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటం వల్ల మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతుంది. వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో సెలైనిటీ శాతం 65 శాతం దాటిపోతోంది. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉత్పత్తి ఐదువేల టన్నుల నుంచి రెండువేల టన్నులకు పడిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని మత్స్యకారులు జీవన పోరాటం చేస్తున్నారు. సూళ్లూరుపేట (నెల్లూరు) : ఆంధ్రా – తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సు తీరప్రాంతంలోని మత్స్యకారులు నిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 20 వేలకు మందికి పైగా మత్స్యకారులు చేపలవేటే ప్రధానవత్తిగా జీవనం సాగిస్తున్నారు. అంటే దాదాపుగా 20 వేల మందికిపైగా సరస్సు అన్నం పెడుతోంది. 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. గతంలో సుమారు 3 వేల నుంచి 5 వేల టన్నులు చేపలు, రొయ్యలు, పీతలు పట్టేవారు. ప్రస్తుతం రెండు వేల టన్నులు మత్స్యసంపద మాత్రమే దొరుకుతున్నట్లు జాలర్లు లెక్కలు చెబుతున్నాయి. సరస్సు జీవవైవిధ్యాన్ని కోల్పోయి కాలుష్యకోరల్లో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోతుండటంతో మత్స్యసంపద కూడా నానాటికి తగ్గిపోతూ వస్తోంది. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులు, కాలువల నుంచి వచ్చే మంచినీరు, సముద్ర ముఖద్వారాల నుంచి వచ్చే ఉప్పునీరు కలవడంతో ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో పులికాట్ సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటంతో మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతోంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో వర్షాభావంతో మంచినీళ్లు సరస్సుకు చేరడంలేదు. కేవలం ఉప్పునీళ్లు మాత్రం ఉండటంతో సెలైనిటీ 65 శాతం పైగా దాటి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో మత్స్య సంపద వృద్ధి చెందడం లేదని జాలర్లు అంటున్నారు. తరచూ వివాదాలే.. సరస్సులో నీరు తగ్గినప్పుడల్లా సరిహద్దు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ç1983 సంవత్సరం నుంచి వివాదాలున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తరంవైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారింది. దీంతో మన రాష్ట్రానికి చెందిన జాలర్లు ఇక్కడ మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో మత్స్య సంపద దొరుకుతుండటంతో అక్కడికి వెళుతున్నారు. అయితే ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలలు ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులు చూపించమని 1989 నుంచి మత్స్యశాఖ అధికారులు, అందుకు సంబంధించిన మంత్రుల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన జాలర్లు సరిహద్దు వివాదాలతో కుమ్ములాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 1989లో రెండు రాష్ట్రాల మధ్య జాలర్లకు భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. అటు తర్వాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రం ఎంత ఉంది?, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? అనే అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా చెల్లించారు. 1994లో సర్వే చేయాలని మన రాష్ట్ర అధికారులు సిద్ధమవగా తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో ఆగిపోయింది. తర్వాత ఈ వివాదం తరచుగా కొనసాగుతూనే ఉన్నా 2007లో రెండు రాష్ట్రాల మత్స్య శాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలు కార్యరూపంలోకి రాకపోవడంతో వివాదం ఇంకా ఉంది. పూడికతీత పనులు గాలికి.. తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారాన్ని ప్రతిఏటా ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల దక్షిణ భాగం సరస్సు ఎప్పుడూ జలకళతో ఉంటుంది. వాకాడు మండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకుపోవడంతో వేసవి కాలంలో ఉత్తరవైపు సరస్సు ఎడారిలా మారింది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలకు పూడిక తీయించాలని ఆందోళనలు చేశారు. దీనిపై 2007లో కేంద్ర డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఓషన్ టెక్నాలజీ అధికారులు, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు వచ్చి ముఖద్వారాలను పరిశీలించారు. 2007లో మెరైన్ ప్రదేశాల యాజమాన్య సంస్థ దీనిపై బేస్‌లైన్ సర్వే చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లతో అంచనాలు వేసి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. అయితే దీనికి సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇందులో మొదట విడుతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేనెలలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీని తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక మాట కొండెక్కేసింది. పరిశ్రమల కాలుష్యంతోనే.. తమిళనాడు పరిధిలో ఎళ్లావూరు, గుమ్మిడిపూండి, తడమండలం ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు పెరిగిపోయి ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీల నుంచి వ్యర్ధాలుగా వచ్చే నీళ్లు, కాలుష్యం సరస్సుకు వదిలేయడంతో సహజత్వాన్ని కోల్పోతూ వస్తోంది. అదే వి«ధంగా ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పన్నంగాడు సమీపంలో అధికంగా రొయ్యల సాగు చేస్తున్నారు. తీరప్రాంతానికి సుమారు 5 కిలోమీటర్లు మేర రొయ్యలసాగు చేయకూడదనే నిబంధన ఉన్నా వాటిని తమిళనాడుకు చెందిన వారు పట్టించుకోకుండా రొయ్యలు సాగు చేస్తున్నారు. మడఅడవులు అంతరించిపోవడంతో సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయిందని జాలర్లు చెబుతున్నారు. అదే విధంగా శ్రీహరికోట దీవిలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు పులికాట్ సరస్సును రెండుగా చీల్చి రోడ్లు వేయడంతో దీని సహజత్వం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత ప్రజావసరాల నిమిత్తం పేరుతో దొరవారిసత్రం మండలం వేలికాడు, కారికాడుకు రోడ్డు, తడమండలం వేనాడు, సూళ్లూరుపేట మండలం పేర్నాడు, చిట్టమూరు మండలంలో కూడా పలు దీవులకు సరస్సులోనే రోడ్లు వేయడంతో ఉత్తరం వైపు సరస్సు ఐదు చీలికలుగా మారింది. దీంతో ఉత్తరం వైపు భాగమంతా ఎడారిని తలపించే విధంగా ఎండిపోతోంది. దక్షిణం వైపు సరస్సు మాత్రం ఇప్పటికి నీళ్లు తగ్గినా నిండుగా కనిపిస్తుంది. దీంతో జాలర్లకు చేతి నిండా పనిలేకుండా పోయింది. చేపల వేటకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా వారు ప్రత్యామ్నాయ ఉపాధివైపు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రా జాలర్లుకు భృతి అందించాలి పక్కపక్కనే ఉన్న తమిళనాడు పరిధిలో పులికాట్ జాలర్లకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వేటలేని సమయంలో జీవనభృతి కోసం రూ.4 వేలు నగదుతో పాటు నిత్యావసరాలు కూడా అందుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రా జాలర్లుగా ఉన్న మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. గతేడాది నుంచి కరువు పరిస్థితుల నేపథ్యంలో వేటలేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పస్తులతో కాలయాపన చేస్తున్నారు. : స్వామి, కాశింకాడుకుప్పం మహిళల సంపాదనతో.. ప్రస్తుతం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోవడంతో మూడురోజుల పాటు వేటసాగించినా పూటగడవడం లేదు. రొయ్యలు, పీతలు కోసం ఎన్నిరోజులు వలలువేసినా దొరకడం లేదు. దీంతో మా ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చిచేపలు, చెన్నై నుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట – పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా సరస్సులో సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. -కేసీ రమేష్, భీములవారిపాళెం కొత్తకుప్పం -
కాలుష్య కాసారాలు!
కందనూలు : జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం, నాగనూల్ చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పట్టణం నుంచి వెలువడే మురుగును మొత్తం ఈ చెరువుల్లోకి మళ్లించడంతో తమ అసలు స్వరూపాన్ని, వైభవాన్ని కోల్పోతున్నాయి. పట్టణం విస్తరించడం, జనావాసాలు పెరుగుదల నేపథ్యంలో నిత్యం వందల లీటర్ల మురుగు వెలువడుతోంది. మినీ ట్యాంక్‌బండ్‌గా కేసరిసముద్రం కేసరి సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.8కోట్లు నిధులు కూడ మంజూరు చేసింది. దీనితో చెరువు కట్ట విస్తరణ, చెరువు మధ్యలో విగ్రహం, పచ్చిగడ్డి పరచడం వంటి పనులు జరుగుతున్నాయి. కాని పట్టణంలో నుండి చెరువులోకి వచ్చే మురుగు నీరుకు అడ్డుకట్ట వేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల మురికి కుంపాలా తయారవుతోంది. ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి.. ప్రసిద్ధిగాంచిన కేసరి సముంద్రం చెరువు మరో ట్యాంకు బండ్‌గా మారక ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెరువులో కలుస్తున్న మురుగును శుద్ధి చేసేందుకు ప్లాంట్ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నాగనూలు పంచాయతీ పరిధిలోని నాగనూలు చెరువు దుర్గంధభరితంగా మారింది. కాలకృత్యాలు తీర్చుకోవడం, జంతుకళేభరాలను పారవేయడం వల్ల మరీ అధ్వానంగా మారింది. పాలకులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
చెరువు‘మట్టి’లూటీ..!
► ఇటుకబట్టీలకు తరలుతున్న చెరువు మట్టి ► యథేచ్ఛగా అక్రమ రవాణా ► చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు కొందరు టీడీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు ఇసుకను తవ్వి రూ. కోట్లను అక్రమంగా సంపాదించారు. ఇప్పుడు వారి కన్ను ‘చెరువు’ మట్టిపై పడింది. సమీప చెరువుల్లోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఒంటిమిట్ట(రాజంపేట): రాజంపేటలో కృష్ణమ్మ చెరువు, ఒంటిమిట్టలో గం గపేరూరు చెరువు.. ఇలా ఊరికొక చెరువును మట్టిమాఫియా చెరపట్టింది. అధికార అండదండలతో టీడీపీ నా యకులు బరితెగిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పొలా లకని చెప్పి మట్టిని కడప నగర సమీపంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో పూడిక తీత పనులు చేపట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మట్టిని సమీప ప్రాంతంలోని రైతులు తమ పొలాలకు వాడుకోవచ్చని పేర్కొంది. అయితే టీడీపీ నాయకులు ఇవేమీ పట్టించుకోకుండా అక్రమంగా చెరువుమట్టిని లారీల్లో తరలిస్తున్నారు. పచ్చనేతలంటే హడల్..! ఒంటిమిట్ట–దర్జిపల్లె రహదారిలో గంగపేరూరు చెరువు కింద 441 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు మట్టిపై అధికారపార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. చెరువులోని మట్టి నాణ్యమైనది కావడంతో ఎడాపెడా చెరువును తవ్వేస్తున్నారు. కళ్లముందే పరిస్థితి కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మిన్నకుండిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనర్ ఇరిగేషన్ అధికారులకు విషయం తెలిసినప్పటికీ పచ్చనేతల జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అడ్డుకుంటే అక్రమ కేసులు.. గంగపేరూరు చెరువు మట్టిని తరలించడాన్ని అడ్డుకుంటుంటే తమపై అక్రమకేసులు పెట్టి వేధిస్తామని తెలుగు తమ్ముళ్లు భయపెడుతున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు మట్టి తరలింపుపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నాయకుడు వారిపై ఎస్టీ, ఎస్టీ కేసు పెట్టించారు. పట్టించుకునేవారెవరు..? గంగపేరూరు చెరువులో యంత్రాలు పెట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునేవారే లేరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణాతో ఇప్పటికే చెరువులో పెద్ద, పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా మట్టి తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలలో కడప, భాకరాపేట తదితర ప్రాంతాలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. -
2 కోట్ల చేప పిల్లల పెంపకం లక్ష్యం
శివ్వంపేట: డివిజన్ పరిదిలోని చెరువుల్లో 2కోట్ల25లక్షల చేప పిల్లలను పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మెదక్ డివిజన్ మత్స్యకార అదికారి ఎం.వెంకయ్య అన్నారు. సోమవారం శివ్వంపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు వర్షాలు సమృద్దిగా కురిసినందున గ్రామాల్లోని చెరువుల్లో జలకల సంతరించుకుందని చేపలపై జీవనోపాది పొందుతున్న మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేప పిల్లలను ప్రతి చెరువులో వేయడం జరుగుతుందన్నారు. మెదక్ డివిజన్ పరిదిలోని 300 చెరువుల్లో 2కోట్ల 25లక్షల బొచ్చ, రౌ, మిర్గ రకాల చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వేయడం ప్రారంబించడం జరిగిందని చెప్పారు. డివిజన్ పరిదిలో తూప్రాన్ పెద్దచెరువు, పోచారం ప్రాజెక్టుల్లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా చేపలను వదిలే కార్యక్రమం జరుగనుందన్నారు. చేపలను పెంచుకొని ఆర్థిక అభివృద్ది చెందాలని మత్స్యకారులకు ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సోమశిల అందాలు అద్భుతం
కొల్లాపూర్‌రూరల్: ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే సోమశిలలోని కృష్ణానది, నల్లమల అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా బృందం సభ్యులు ఫిలిప్స్, తెలంగాణ బృందం సభ్యులు హరీశ్ అన్నారు. శనివారం మండలపరిధిలోని సోమశిల, అమరగిరి గ్రామాలను సందర్శించిన వారు కృష్ణానది, నల్లమల అందాలను వీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ మంచి అందమైన ప్రదేశాలు ఉన్నాయని, ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. కంటికి కనువిందుగా ఉన్నాయని, ఇక్కడి అందాలు చాలా అద్భుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.