leak
-
Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్.. సీహెచ్ఓ పరీక్ష రద్దు
పట్నా: బీహార్ రాష్ట్ర ఆరోగ్య కమిటీ డిసెంబర్ ఒకటిన నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) పరీక్ష రద్దయ్యింది. ఈరోజు (డిసెంబర్ 2)న జరగాల్సిన పరీక్ష కూడా రద్దయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు.సీహెచ్ఓ పరీక్ష పేపర్ లీక్‌కు కొన్ని ముఠాలు పాల్పడినట్లు పట్నా పోలీసులకు ఇన్పుట్ అందింది. వీటి ఆధారంగా పట్నా పోలీసులు ఆదివారం అర్థరాత్రి పలు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పట్నా పోలీసు బృందం ఆదివారం ఏకకాలంలో 12 ఆన్లైన్ కేంద్రాలపై దాడులు చేసింది. రామకృష్ణనగర్తో పాటు పలు కేంద్రాలకు చెందిన 12 మందిని ఈ బృందం అదుపులోకి తీసుకుంది. రెండు కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.పోలీసులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి నలుగురిని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ పరీక్షకు సంబంధించిన ఆడియో, వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య కమిటీ ఎస్ఎస్పీకి లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఆదివారం పరీక్షకు ముందు నుంచే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బీహార్‌లో గతంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.ఇది కూడా చదవండి: Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ.. -
ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్ ఆగ్రహం!
దసరా మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.నా మూవీ టైటిల్ లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వాళ్లు సినిమా రంగంలో క్రియేటర్స్ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.కాగా.. శ్రీకాంత్.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. To whomever it may concern,నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024 -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
అల్లు అర్జున్ పుష్ప-2.. నెట్టింట లీకైన క్లైమాక్స్ సీన్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ వీడియో అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వీడియో పుష్ప-2 చిత్రానికి సంబంధించిందా? లేదా ?అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ నెటిజన్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుతున్నారు.మరికొందరు ఫ్యాన్స్ ఈ వీడియోనూ డిలీట్ చేయాలంటూ అతనికి రెక్వెస్ట్లు పెడుతున్నారు. ఎందుకిలా లీక్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి బ్రో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో డిలీట్ చేయకపోతే కొందరి ఉద్యోగాలు కూడా పోతాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్టింట వైరలవుతోన్న వీడియో ఒరిజినలా, కాదా అన్నది తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #Pushpa2 Climax Fight Scene 😉Enjoy pandagowww 💥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/EyGDhWtvzu— Jaisai Nimmala (Allu Arjun Die Hard Fan) (@NimmalaJaisai23) July 30, 2024 -
నీట్ లీక్.. చెరువులోంచి 16 ఫోన్లు స్వాధీనం!
నీట్ పేపర్ లీకేజీలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన అవినాష్ అలియాస్ బంటీని అరెస్టు చేశారు. అనంతరం పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం సీబీఐ అతడిని జూలై 30 వరకు కస్టడీకి తీసుకుంది. నీట్ పేపర్ లీక్ కేసులో గతంలో అరెస్టయిన శశి పాసవాన్ బంధువు ఈ బంటీ కావడం గమనార్హం.నీట్ పేపర్ ప్రశ్నాపత్రాల కీని షేర్ చేయడంలో బంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నీట్-యూజీ పరీక్ష తర్వాత పేపర్ లీకేజీ కోసం ఉపయోగించిన 16 ఫోన్లను సమీప చెరువులో పడేయగా.. కేసు విచారణ నిమిత్తం.. ఫోన్లను పడేసిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి గుర్తించారు. కాగా, నీట్ పేపర్ లీకేజీపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. పరీక్షకు ముందే నీట్ పేపర్ ప్రశ్నాపత్రాలను పొందేందుకు రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అధిక మొత్తంలో చెల్లించినట్లు సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బీహార్ అభ్యర్థులు రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి రూ.55 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు చెల్లించినట్లు విచారణలో తేలింది. హజారీబాగ్ (జార్ఖండ్), లాతూర్ (మహారాష్ట్ర), గోద్రా (గుజరాత్), పాట్నా (బీహార్)లలో పరీక్షా కేంద్రాలను గుర్తించడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 150 మంది అభ్యర్థులు లీకైన పేపర్ల నుండి ప్రయోజనం పొందినట్లు జాతీయమీడియా కథనాలు చెబుతున్నాయి. -
NEET Paper Leak: ఒక్కో పేపర్ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు
పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.దర్యాప్తులో ఎన్టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్బాద్లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్‌పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. నెట్టింట లీకైన వీడియో!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శంకర్ ప్రకటించారు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 థియేటర్లలో రిలీజైంది. #Gamechanger Leaked scene here it's...An Airport sequence 🌟Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx— Vikki (@stupid_guy_07) July 16, 2024 -
ఎన్టీఆర్ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్ఫుల్ డైలాగ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం. 'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్ వింటే ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. Actress Mani Chandana garu has started dubbing for #Devara, She is playing #JanhviKapoor's mother role in the film ❤️సాదా సీదా మగాళ్ళు కావాలా...ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా...! 🔥🔥🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/WcbbRVJ0kk— Dhanush🧛 (@Always_kaNTRi) July 10, 2024 -
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది. -
నీట్ యూజీ -2024 రీటెస్ట్.. 750 మంది విద్యార్ధుల గైర్హాజరు!
సాక్షి,న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీలో మరో కీలక మలుపు తిరిగింది. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. 1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్‌లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయితే దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాటను దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపించనుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్‌లో కనిపించడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ప్రింట్‌ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు వద్దు
పంజగుట్ట: ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది సీఎంకు తగదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. ఇప్పటికీ లీకేజీ అసలు బాధ్యులను గుర్తించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు కాబట్టే విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థులు, పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘గ్రూప్ 2 వాయుదాకై నిరుద్యోగుల విన్నపం’ పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ గురుకుల టీచర్ల పరీక్షల నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. దీనివల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆదివారం వరకు వేచి ఉండి అప్పటికీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే అన్ని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్నారు. -
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్‌ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్‌కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ట్విటర్ సోర్స్ కోడ్ ఆన్లైన్లో లీక్ అయిందన్న తాజా అంచనాలు కలకలం రేపాయి. 44 బిలియన్డాలర్లతో సంస్థను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సవాళ్లను మధ్య నెట్టుకొస్తున్న మస్క్‌కు ఇది మరో సవాల్ అని నిపుణులు భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ GitHub నుండి లీక్ అయిన సమాచారాన్ని తీసివేసేలా ట్విటర్ చట్టపరమైన చర్య తీసుకున్న తర్వాత ఈ కోడ్ లీక్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కోడ్‌లో భద్రతా లోపాలు హ్యాకర్లకు వినియోగదారు డేటాను దొంగిలించడానికి లేదా సైట్‌ను తీసివేయడానికి అవకాశం ఇస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకైన్ సోర్స్ కోడ్‌లో ట్విటర్, ఇంటర్నల్ టూల్స్ ప్రాపర్టీ సోర్స్ కోడ్ ఉంది, అయితే ఇది ట్వీట్లను సిఫార్సు చేసే సోర్స్ కోడ్ లీక్‌లో భాగమేనా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. (మస్క్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్!) దీనికి సంబంధించి కాలిఫోర్నియాలోని నార్తర్న్ కోర్ట్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు అనుమతి లేకుండా దాని సోర్స్ కోడ్ స్నిప్పెట్లను షేర్ చేసిన తర్వాత GitHubకి నోటీసు లిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన నోటీసు తర్వాత కంటెంట్‌ను తక్షణమే తీసివేయడానికి GitHub అంగీకరించింది, అయితే కోడ్ ఆన్లైన్లో ఎంతకాలం ఉందో అస్పష్టంగా ఉంది. డేటాను షేర్ చేసిన యూజర్ పేరు “FreeSpeechEnthusiast” గా తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. గత ఏడాది మస్క్ ట్విటర్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ట్వీట్లను సిఫార్సుకుఉపయోగించే కోడ్ మార్చి 31న ఓపెన్ సోర్స్ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు ట్విటర్ విలువ దాదాపు సగానికి పడిపోయిందని అంగీకరించిన మస్క్, యూజర్లకు బ్లూ సబ్స్క్రిప్షన్, ప్రకటనదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్‌మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్‌పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
షావోమి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫోటోలు లీక్, లుక్ మాములుగా లేవుగా!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్‌గా అరంగేంట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో తీసుకొస్తున్న సెడాన్ డిజైన్, లుక్ ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో షావోమి ఈవీ డిజైన్ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్ ఆధారంగా ఇది అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు. షావోమీ 4 డోర్ ఎంఎస్11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్‌షీల్డ్ పెద్దగా ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్‌తో టెస్లా మోడల్‌లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఈ వీల్స్ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్‌ను కూడా చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. రూ. 1.2కోట్ల ఫైన్..! అయితే తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లీక్ కావడంపై షావోమీ సీరియస్‌గా స్పందించింది. బీజింగ్‌కు చెందిన మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనే వెండర్ ద్వారా ఈ ఫొటోలు లీక్ అయినట్టు గుర్తించారు. ఈ లీక్‌ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని సీఈఓ లీ జున్ మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు. సంస్థపై 1 మిలియన్ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా విధించనుందట షావోమీ. -
నిర్మాత దిల్‌రాజు కొడుకును చూశారా? ఫోటో వైరల్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని ఈ ఏడాది జూన్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దిల్‌రాజు ఇప్పటివరకు తన కొడుకు ఫోటోను రివీల్ చేయలేదు. అయితే తాజాగా దిల్‌రాజు వారసుడి ఫోటో నెట్టింట లీక్ అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్ దిల్‌రాజు కొడుకును ఎత్తుకున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంశీ పైడిపల్లి దర్శక్తవం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో దిల్‌రాజు ఇంటికి వచ్చిన విజయ్ ఆయన కొడుకును ఎత్తుకొని ఆడించారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స చేస్తున్నారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మాస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.