love marraige
-
ఫ్రాన్స్ అమ్మాయి.. గొల్లపల్లి అబ్బాయి
హిందూపురం: ప్రేమకు హద్దులు లేవని ఓ జంట నిరూపించింది. ఫ్రాన్స్ దేశస్తురాలైన ఆడ్ సవివ్, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లికి చెందిన గొల్లసందీప్ యాదవ్ శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో హిందూపురంలో ఘనంగా జరిగింది. గొల్లపల్లికి చెందిన సామాన్య రైతు కేశప్ప, గంగమ్మ 11వ సంతానమైన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సీఎన్‌ఆర్‌లో సైంటిస్ట్‌గా స్థిరపడ్డారు. అక్కడ గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశస్తురాలు ఆడ్ సవివ్తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. సందీప్ యాదవ్ అన్న ‘అక్షరమాల’ శ్రీనివాసులు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. -
నేను చనిపోతున్నా.. నా బిడ్డ జాగ్రత్త
జ్యోతినగర్(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో నివసిస్తున్న నరేందర్ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. -
పెళ్లి కోసం షారుఖ్ ఖాన్ పేరునే మార్చుకున్నాడా?
బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడట. అప్పటికి షారుఖ్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్ పేరుని అభినవ్‌గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌కి అభినవ్ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.చాలా గొడవల షారుఖ్-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు. ‘నాలాగే షారుఖ్ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్ ఒకరు. -
ఛేజ్ చేసి పట్టుకుంటే.. చాల్లే ఊరుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024కు అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ ప్యానల్ స్పీకర్‌గా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) క్యాడర్‌కు రావడానికి ముందు ఆయన కొన్నాళ్లు మణిపూర్‌లో పని చేశారు. వివాహాలకు సంబంధించి అక్కడ, భద్రత కోణంలో న్యూయార్క్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. అక్కడ ఎస్పీ కూడా అలానే వివాహం చేసుకున్నారట...నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లో ట్రైనీ ఏఎస్పీ హోదాలో మణిపూర్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పని చేశా. ఓ రోజు ఠాణాలో ఉండగా నలుగురు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్లు వెళ్లిన వాహనం నెంబర్ కూడా చెప్పారు. వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి రంగంలోకి దిగా. నాలుగు కిలోమీటర్లు ఛేజ్ చేసి కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకుని యువతిని రెస్క్యూ చేశాం. వాళ్లను ఠాణాకు తీసుకువచి్చన తర్వాత మా ఎస్పీకి ఫోన్ చేసి పెద్ద ఆపరేషన్ చేశానని చెప్పాం.దీనికి ఆయన ఫక్కున నవ్వుతూ తానూ అలాంటి గాంధర్వ వివాహమే చేసుకున్నానని అన్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు, కేసు ఎందుకని ప్రశ్నించా. ‘‘అది అక్కడ ప్రొసీజర్ అని, కేసు పెట్టి ఇరుపక్షాలను ఠాణాకు పిలవాల్సిందేనని’’అన్నారు. ‘‘ఆపై యువతీయువకులు తమ సర్టిఫికెెట్లు చూపించి మేజర్లుగా నిరూపించుకుంటారు. వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తే మూడునాలుగు రోజులకు మరోసారి ఘనంగా వివాహం చేస్తారు ’’అని ఎస్పీ చెప్పడంతో నాకు ఆశ్చర్యమేసింది. అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగితే అనుమానించారు...అమెరికాలో వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 2001లో జరిగిన 9/11 ఎటాక్స్ తర్వాత ఇది చాలా పెరిగింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిజం శిక్షణ కోసం ఓ పోలీసు బృందాన్ని అమెరికా పంపింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నా. అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువగా ఉండటంతో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేవాళ్లం. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగా. విక్రయించనంటూ నిర్మొహమాటంగా చెప్పేసిన దాని యజమాని బయటకు వచ్చి నేను వినియోగించిన వాహనం నెంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి ఓ దుకాణానికి వెళ్లి అడిగితే.. వారి వద్ద లేకపోయినా పది నిమిషాలు కూర్చోమంటూ ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి ఇస్తామంటారు. ఈ ధోరణి మారి వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి పెరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయడమే సవాల్... ఇక్కడ నివసిస్తున్న ప్రజలను నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడేలా మోటివేట్ చేయడమే పెద్ద సవాల్. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌లో సరాసరిన రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించడానికి పోలీసు విభాగం తరఫున సుశిక్షితులైన సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఆ ఉదంతం జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు మాత్రం స్పందించరు. తొలి ప్రాధాన్యం వీడియో చిత్రీకరించడానికే ఇస్తారు. తాము ఫస్ట్ సేవర్ కావాలని ఆశించడం కన్నా సోషల్‌మీడియాలో పెట్టడానికి ఫస్ట్ రికార్డర్ కావాలని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రజలను మోటివేట్ చేయడమే ప్రస్తుతం సమాజంలో ఉన్న పెద్ద సవాల్. -
కూతురి కోసం తల్లిదండ్రుల ఆక్రోశం
యశవంతపుర: మంగళూరులో మతాంతర పెళ్లి కలకలం రేపింది. హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు. వివరాలు.. మంగళూరుకు చెందిన విస్మయ అనే యువతి బీసీఎ పూర్తి చేసింది. పొరుగున కేరళకు చెందిన మహమ్మద్ అషా్వక్‌తో ఆమెకు పరిచయమై ప్రేమలో పడ్డారు. రెండు నెలల పరిచయంతోనే విస్మయను బ్రెయిన్‌వాష్ చేసి లవ్‌లో పడేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. జూన్ 6న ఉళ్లాల నుంచి విస్మయను అషా్వక్ తీసుకెళ్లగా తల్లిదండ్రులు ఉళ్లాల పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు గాలించి విస్మయను తల్లిదండ్రులకు అప్పగించారు. మళ్లీ జూన్ 30న ఉళ్లాల నుంచి విస్మయను తీసుకెళ్లాడు. విస్మయను తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోయారు. కేరళలో మతమారి్పడి చేసి పెళ్లి చేసుకున్నాడని విస్మయ తండ్రి వినోద్ తెలిపారు. తల్లిదండ్రులు, హిందూ సంఘాల నాయకులు విస్మయకు నచ్చజెప్పినా వినలేదు. మరోవైపు తన భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ భర్త కేరళలో హైకోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ జంట కేరళ కాసరగోడు విద్యానగరలో కాపురం పెట్టారు. తన కూతురిని కాపాడాలంటూ తండ్రి హిందూసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే వేధించాడు!
మొయినాబాద్: ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అదనపు కట్నం కోసం వేధించడంతో ఇంట్లోనే ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌కు చెందిన నర్లకంటి మల్లేశ్ కూతురు కల్పన(22) బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వారి బంధువు బైరంపల్లి శ్రీశైలం కొంత కాలంగా కల్పనను ప్రేమించాడు. గత ఏడాది అక్టోబర్ 29న ఇద్దరూ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఈ ఏడాది ఫిబ్రవరి 11న హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి చేశారు. అప్పటి నుంచి శ్రీశైలం కుటుంబం మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటోంది.కాగా కల్పన ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన శ్రీశైలం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు అదనపు కట్నంగా స్విఫ్ట్ కారు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అతనికి తల్లి స్వరూప, బాబాయి రాజు సైతం సహకరించి కల్పనను వేధించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య
సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది. వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్‌కుమార్ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు. -
స్పెయిన్ వరుడు, కర్ణాటక వధువు
కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌లో యోగా టీచర్‌గా పనిచేస్తోంది. స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు!
సంగారెడ్డి: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ గౌస్ కథనం మేరకు.. సంగముల రాములు (52)కు కుమారుడు మహేశ్ ఉన్నాడు. అదే గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని తండ్రి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించాడు. ఇది తెలిసిన అమ్మాయి వర్గపు వారు గురువారం రాములు ఇంటికొచ్చి తమ అమ్మాయికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు శుక్రవారం ఉదయం పాడి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ఇవి చదవండి: మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు.. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్‌కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్‌పోర్ట్ టౌన్‌కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
పెళ్లికి సిద్ధమైన వరుణ్ సందేశ్ హీరోయిన్..!
కొత్త ఏడాదిలో బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసేందుకు రెడీ అయిపోయింది. 2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్. ఆ తర్వాత ఫిర్ భీ నా మానే...బడ్తమీజ్ దిల్ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అస్మితా తన ప్రియుడు సిద్ధ్ మెహతాను పెళ్లాడనుంది. త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త సిధ్ మెహతాతో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది. ఈ జంట ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో అస్మిత, సిద్ధ్ మెహతాతో కలిసి వేకేషన్ వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పట్లో ఆమె ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఏడాదిన్నర కాలంగా డేటింగ్లో ఉన్నా ఈ జంట.. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకుంది.కాగా.. అస్మితా సూద్ చివరిగా ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అల్లుడయ్యాడు!
సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రేమకు హద్దులు కుల, మత ప్రాంత, భాష బేధాలు ఏమీ ఉండవని నిరూపించింది. ఈ జంట దేశాలు వేరైనా ప్రేమించుకొని పది సంవత్సరాల తర్వాత గురువారం అలుగునూర్‌లో ఒక్కటయ్యారు.. వివరాలలోకి వెళితే... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్‌లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ 2014లో ఇద్దరు ఒకరి ఒకరు పరిచయమయ్యారు. ఇలా వారి మధ్య ప్రేమ మొదలై ఇద్దరు మనసులు కలిశాయి. తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు అంగీకరించడంతో అజ్జురా శ్రీలంక నుండి తల్లిదండ్రులతో అలుగునూర్ వచ్చారు. అరుణ్ కుమార్ పెళ్ళి అజ్జురాతో పెద్దల సమక్షంలో గురువారం అంగరంగ వైభోగంగా వివాహ వేడుక జరిగింది. ఇదీ చదవండి: TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్? -
ఏకంగా మూడు పెళ్లిల్లు! చివరికి అత్తమామలను దారుణంగా..
మహబూబ్‌నగర్: యువతిని ప్రేమించి మూడో వివాహం చేసుకున్న వ్యక్తి తనకు కట్నం కావాలంటూ అత్తమామను ఇంటికి పిలిపించి కత్తితో పొడిచిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగంపేట్‌తండాకు చెందిన సభావత్ సాగర్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో చేర్పించకపోవడంతో ఆమె మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఖిల్లాఘణపూర్ పక్కనే ఉన్న మరో తండాకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈమె గర్భిణిగా ఉన్న సమయంలో గండేడ్ మండలం పంచలింగాల్‌తండాకు చెందిన మోహన్, మంగమ్మల కూతురు మాయను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ ఇంటికి రాకుండా బయటనే ఉన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు తండాకు రావాలని తెలపడంతో మాయ, సాగర్ శనివారం మంగంపేట్‌తండాకు వచ్చారు. తనకు రూ.2లక్షలు కావాలని ఇస్తే ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటానని తెలిపాడు. ఈ విషయం మాట్లాడటానికి అత్తమామలను, రెండో భార్యను కూడా పిలిపించాడు. డబ్బులు ఇవ్వడానికి అత్తమామలు ఒప్పుకుని ఫోన్లో బంధువులతో ఈ విషయమై మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో కోపోద్రిక్తుడైన అల్లుడు సాగర్ అప్పటికే తెచ్చుకున్న కత్తులను తీసి అత్తమామలను పొడిచాడు. వారు అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని వారించారు. కత్తిపోట్లతో గాయాలపాలై ఉన్న వారిని వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడిని ఆయన తల్లి సహకరించడంతో అక్కిడి నుంచి పారిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇవి చదవండి: తప్పిపోయి రెండేళ్లు దాటింది! ప్రస్తుతం.. -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి..సోషల్ మీడియాలో వైరల్!
ప్రస్తుతం బాలీవుడ్లో వెడ్డింగ్ మూడ్ నడుస్తోంది. తాజాగా మరో బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'యే రిష్తా క్యా కెహ్లతా హై','దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర భామ వృషికా మెహతా తన ప్రియుడు సౌరభ్ ఘెడియాను పెళ్లాడింది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 10న వరుడి స్వస్థలమైన అహ్మదాబాద్‌లో జరిగింది. ఆమె ప్రియుడు సౌరభ్ ఘెడియా ప్రస్తుతం టొరంటోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 11 వీరికి ఎంగేజ్మెంట్ జరగ్గా.. సరిగ్గా ఏడాది తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి బంధువులు పెళ్లికి సంబంధించిన ఫోటోలను వృషికా మెహతా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఆనంద సమయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. వృషికా మెృహతా దిల్ దోస్తీ డ్యాన్స్ (D3)షోలో షారన్ రాయ్ ప్రకాష్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఇష్క్బాజ్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' సీరియల్స్‌లో వృషికా కనిపించింది. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Vrushika Mehta (@vrushyy) -
భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
భూదాన్‌పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’
అనంతపురం క్రైం: ‘ప్రేమించి పెళ్లాడిన వాడే కులం తక్కువ దానివని నిందిస్తున్నాడు’ అంటూ బాధితురాలు దిశ మహిళా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను దిశ పోలీసుస్టేషన్ సీఐ చిన్నగోవిందు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఎరుకల చందన, ఎన్పీకుంట మండలం పట్టంవారిపల్లికి చెందిన వడ్డే నవీన్ ప్రేమించుకున్నారు. ఇరువురూ పెద్దలను ఎదిరించి ఈ ఏడాది మే 29న కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అనంతపురం నగరంలోని మున్నానగర్‌లో వారు కాపురం పెట్టారు. కొంతకాలం వారి సంసారం సజావుగా సాగింది. అయితే భర్త తరఫువారు వారి సంసారంలో జోక్యం చేసుకోవడంతో చందనకు కష్టాలు మొదలయ్యాయి. వరకట్నం తీసుకురావాలని చందనపై ఒత్తిడి తీసుకువచ్చారు. కులం తక్కువదానివంటూ హేళన చేస్తూ వచ్చారు. రూ.3 లక్షలు తీసుకువస్తే కాపురానికి రావాలని, లేకపోతే ఇంట్లోకి ఉండనివ్వమంటూ దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దలు కూడా పంచాయితీలు చేసి ఇరువురికి సర్దిచెప్పారు. అత్తింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలని చెప్పడంతో చందన పుట్టింటికి వెళ్లింది. అయితే నవీన్ అక్కడికి వెళ్లి చందన పెళ్లి సమయంలో తీయించుకున్న ఫొటోలను చింపేసి సెల్‌ఫోన్‌ని పగుల గొట్టాడు. నవీన్‌తో పాటు అతని తండ్రి రమణప్ప, బావ నిరంజన్ దాడిలో పాల్గొనడంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వింటుంటాం. అయితే అంబానీ సోదరీమణులు అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికీ తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. అందుకే వారి గురించిన సమాచారం బయటకు రాదు. ముఖేష్, అనిల్ అంబానీ సోదరీమణుల పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. నీనా కొఠారి ఏం చేస్తుంటారు? 1986లో హెచ్‌సి కొఠారీ గ్రూప్ చైర్మన్ భద్రశ్యామ్ కొఠారితో నీనా వివాహం జరిగింది. అయితే భద్రశ్యామ్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు. హెచ్‌సీ కొఠారి గ్రూప్ ప్రధానంగా చక్కెర, కెమికల్, పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంది. నీనాకు కూతురు నయనతార, కొడుకు అర్జున్ కొఠారి ఉన్నారు. వీద్దరికీ పెళ్లయింది. నయనతార కేకే బిర్లా మనుమడు షమిత్ను వివాహం చేసుకుంది. ఆమె ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్‌కూ నీనా హాజరవుతుంటారు. దీప్తి సల్గాంకర్ ఎక్కడుంటారు? అంబానీ కుటుంబంలో మొదట దీప్తి ప్రేమ వివాహం చేసుకుంది. దీప్తికి 1983లో దత్తరాజ్ సల్గాంకర్తో వివాహం జరిగింది. దీప్తి తండ్రి ధీరూభాయ్.. రాజ్ తండ్రి వాసుదేవ్ సల్గాంకర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే భవనంలో ఉండేవారు. దత్తరాజ్ సల్గాంకర్..ముఖేష్ అంబానీ మంచి స్నేహితులు. దీప్తి సల్గాంకర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవాలో ఉంటున్నారు. ఆమె భర్త దేశంలోని ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు సల్గావ్కర్ యజమాని. అలాగే ఖనిజ మైనింగ్, ఇనుప ఖనిజం ఎగుమతి, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగాలకు చెందిన వీఎం సల్గావ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు యజమాని. ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు ధీరూభాయ్ అంబానీ 1978లో ముంబైలోని ఉషాకిరణ్ సొసైటీలోని 22వ అంతస్తులో ఉండేవారు. ఈ భవనంలోని 14వ అంతస్తులో వ్యాపారవేత్త బాసుదేవ్ సల్గావ్కర్ తన కుటుంబంతో కలిసి ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఒకరి ఇంటికి ఒకరు వస్తూవెళుతూ ఉంటేవారు. ఈ నేపధ్యంలోనే రాజ్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులయ్యారు. తరువాతి కాలంలో రాజ్ సల్గావ్కర్.. ముఖేష్ అంబానీ సోదరి దీప్తితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పెళ్లికి అంగీకరించారు. దీప్తి, రాజ్‌ల వివాహం 1983లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రమ్, కూతురు ఇషేత. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
స్మశానంలో కూతురికి ప్రేమపెళ్లి జరిపించిన తండ్రి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్‌లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక స్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తైంది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ స్మశానంలో పెళ్లి చేసుకోవడం కొత్త కాన్సెప్టా? దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది. 12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట. ఈ విషయాన్నే అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇక ఆయన కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
యద్దనపూడి: కులాలు వేరుకావడంతో ఇంట్లో పెద్దలు ఒప్పుకోరేమోనని భయంతో ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఇరుకుటుంబాల పెద్దలను పిలిచి వారి సమక్షంలో ప్రేమికులకు పెళ్లి చేసిన ఘటన యద్దనపూడి పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన పఠాన్‌బాజీ, చింతపల్లిపాడు గ్రామానికి చెందిన సంధ్యారాణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు మేజర్లు కావటంతో పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి, వారిని ఒప్పించి ప్రేమజంటకు వివాహం జరిపించారు. కలిసిమెలిసి ఉండాలని ఇరువర్గాల బంధువులు, పోలీసులు నూతన జంటను ఆశీర్వదించారు. ఎస్ఐ అనూక్, ఏఎస్ఐ శేషసాయి, గన్నవరం మాజీ సర్పంచ్ నల్లపునేని రంగయ్య పాల్గొన్నారు. -
ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుందని కుమార్తెకు పిండ ప్రదానం..
మధ్యప్రదేశ్: బతికుండగానే కన్నకూతురికి అంతిమ సంస్కారాలు చేశారు తల్లిదండ్రులు. ఇతర మతస్థుడిని వివాహమాడిందనే కోపంతో కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన మధ్యపదేశ్లోని జబల్పూర్లో జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ వారి కలలేవీ ఆ కూతురు నెరవేర్చలేదు. ఇతర మతస్థుడిని వివాహమాడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఏకంగా అంతమ సంస్కారాలు కూడా చేశారు. జబల్పూర్కు చెందిన అనామిక దూబె ఇతర మతస్థుడిని వివాహమాడింది. అడ్డగించిన బంధువులతో గొడవపడింది. న్యాయస్థానాన్ని సంప్రదించి జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చి ఉజ్మ ఫాతిమాగా పేరు పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డను వదిలేశారు. నర్మదా నది ఒడ్డున ఆదివారం రోజున గౌరీ ఘాట్‌లో కూతురుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పిండప్రదానం చేసి నదిలో కలిపేశారు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అనామిక సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి:ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే! -
టిప్పర్ బీభత్సం.. ముగ్గురి మృతి
తొండంగి: నిశి వేళలో... కళ్లెం లేని వేగం ఉసురు తీసింది.. నిండు ప్రాణాలను నింగిలో కలిపేసింది.. ఆ దారిలో మృత్యుకేళి మోగించింది.. అయినవారికి విషాదం మిగిల్చింది.. అతివేగం ఆపై నిద్రమత్తు కారణంగా టిప్పర్ తొండంగి మండలం ఎ.కొత్తపల్లిలో వినాయకుని ఆలయంలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రౌతులపూడి మండలం నుంచి తొండంగి మండలం తీర ప్రాంతానికి టిప్పర్ వెళ్తుంది. అది అన్నవరం నుంచి తొండంగి వైపు వస్తుండగా ఎ.కొత్తపల్లిలో వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న జీఎస్‌ఎల్‌ఆర్ ట్యాంకును ఢీకొట్టింది. వెంటనే ఎదురుగా ఉన్న వినాయకుని ఆలయంలోకి దూసుకెళ్లింది. టిప్పర్ వేగానికి వినాయకుని ఆలయం పూర్తిగా నేలమట్టల అయ్యింది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జ అయ్యింది. ఈ ఘటనతో గజ్జనపూడి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ చుక్కల శేఖర్ (28), క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆలయం వద్ద నిద్రిస్తున్న ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన తూము లక్ష్మణరావు (47) కూడా దుర్మరణం పాలయ్యారు. అక్కడ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో జేసీబీ సాయంతో లారీ క్యాబిన్, ఆలయ శిథిలాలను తొలగించి చుక్కల శేఖర్, కానూరి సూర్యనాగేంద్ర, తూము లక్ష్మణరావు మృత దేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తొండంగి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తెకు సారె పంపి వచ్చి.. మృతుల్లో ఒకరైన లక్ష్మణరావుకు భార్య లోవలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎ.కొత్తపల్లి గ్రామంలో కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 1న తన పెద్ద కుమార్తె నాగలక్ష్మి వివాహం జరిగింది. శనివారం కొమ్మనాపల్లిలో తన వియ్యపు వారింటికి కుమార్తెకు సారెను కుటుంబ సభ్యులతో కలసి తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి ఒంటి గంటకు స్వగ్రామం ఎ.కొత్తపల్లికి వచ్చారు. పెళ్లింట బంధువులు ఎక్కువగా ఉండటంతో ఖాళీ లేక లక్ష్మణరావు దగ్గరలోని వినాయకుని ఆలయంలో సేద తీరారు. ఇంతలో టిప్పర్ లారీ మృత్యువు రూపంలో కబళించింది. దీంతో లక్ష్మణరావు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లింట బంధువుల రోదనలతో విషాదం నెలకొంది. చిన్న కుటుంబం.. పెద్ద కష్టం ప్రత్తిపాడు రూరల్: గజ్జనపూడికి చెందిన టిప్పర్ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ శేఖర్ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్య లోకేశ్వరి, కుమారుడు లలిత దుర్గామనీష్ (2), కుమార్తె అనితశ్రీ (10 నెలలు) ఉన్నారు. ఆ చిన్న కుటుంబానికి అతనే ఆధారం. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాదికే.. లారీ క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర (23) ఏడాది కిందట పొదురుపాకకు చెందిన శివకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఇంతలో ఈ ప్రమాదం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వివాహం కావాల్సిన సోదరితో పాటు తల్లిదండ్రులు నాగేంద్రతో ఉంటున్నారు. అతని మృతితో ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. మృతుల కుటుంబాలు ప్రధాన జీవనాధారమైన పెద్దదిక్కులను కోల్పోయి రోడ్డున పడ్డాయి. -
పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ
టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా కాలేదని చెబుతుంది ఈ జంట. పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడట. మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతోనే అలా చేశాడట. ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది ఈ జంట. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్ ) మధుమిత మాట్లాడుతూ.. ‘దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు శివ బాలాజీ ఫోన్ చేసి ‘మనకు సెట్ అవ్వదు. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు. ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశాను. మనం ఫ్రెండ్స్‌గా ఉందామని బాలాజీ చెప్పినా నో చెప్పాను. ఎందుకంటే అతన్ని నేను భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లోవాళ్లు జాతకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ అత్తమ్మ వాళ్లు జాతకాలను నమ్ముతారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బాలాజీ టచ్‌లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పుడు జాతకాలు చూపిస్తే.. బాగున్నాయని చెప్పారు. అప్పుడు మా పెళ్లి జరిగింది’ అని మధుమిత చెప్పుకొచ్చింది. ఇక శివ బాలాజీ మాట్లాడుతూ.. మధమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఒక్క ఏడాది చూస్తా.. అప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోతే.. ఎలాగైనా ఇంట్లో వాళ్లని ఒప్పిద్దామనుకున్నాను. ఆమెకు ఎన్ని సంబంధాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని తెలిసింది. మా ఎలక్షన్ల సమయంలో మధుని మళ్లీ కలిశా. మాట్లాడలేదు. ఒకరోజు ‘మళ్లీ ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు’అని నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలిసి.. కొన్నాళ్లకు ఇంట్లో ఒప్పించాం’ అని శివబాలాజీ చెప్పుకొచ్చాడు. -
ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్‌నగర్‌కు చెందిన ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది. -
Valentines Day 2023: ప్రేమతో దగ్గరై పెళ్లితో ఒక్కటైన సెలబ్రిటీ కపుల్ (ఫొటోలు)
-
Valentines Day 2023: ఏళ్లు గడిచిన.. చెరిగిపోని ప్రేమబంధానికి సాక్ష్యం (ఫొటోలు)