Machilipatnam port
-
బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్ మోడల్లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది. న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్íÙప్ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు కూడా.. మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారిప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది. -
డ్రైపోర్టుకు మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరం లేని తెలంగాణలో ఏర్పాటు చేసే డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అడ్డంకిగా ఉన్న చిక్కుముడులను తొలగించే అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. బుధవారం ఆ బృందంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తనను మంగళవారం కలిసిన అధికారులతో కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన చర్చించారు.తెలంగాణలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించిన సమస్యలను తమ స్థాయిలో పరిష్కరించదగ్గవాటిని పరిష్కరిస్తామని, భూసేకరణ అంశాలను కొలిక్కి తెస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రైపోర్టుకు బందరు పోర్టుతో కనెక్టివిటీ ప్రతిపాదనపై చర్చించారు. అలాగే హైదరాబాద్–విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును భారత్‌మాల పరియోజనలో భాగంగా చేపట్టాలని ఇటీవల తాను ప్రధానికి సూచించిన విషయాన్ని వారి ముందు ప్రస్తావించారు. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య 12 రేడియల్ రోడ్లు వస్తాయని, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మిస్తామని వెల్లడించారు.వెంటనే రీజినల్ రింగ్ రోడ్డు పనులను, మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్–కల్వకుర్తి పనులను పూర్తిచేస్తే తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్– ఖమ్మం–విజయవాడ రోడ్డుకు సంబంధించిన భూమి అప్పగింత, ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు, వరంగల్–కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్ సేకరణ, కాళ్లకల్–గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరసల విస్తరణకు భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రత ఏర్పాటు.. తదితర అంశాలను ఎన్హెచ్ఐఏ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై బుధవారం సమగ్రంగా సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. -
వడి వడిగా నీలివిప్లవం దిశగా..!
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సహజ వనరు లకు నిలయం. ప్రపంచంలోని చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా, మారి షస్, ఐరోపా దేశాలు గొప్పగా అభి వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడమే. ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో(జీడీపీ) దాదాపు 35 శాతం ఈ వనరుల ద్వారానే వస్తుంది. అలాంటి గొప్ప అవకాశం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మన సముద్ర తీర వనరులను వినియోగించుకొని నీలి విప్లవం సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం. ఎన్నో పోర్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీన్ని గమ నించే జగన్ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విధానం 2022– 2027’ ప్రకారం అద్భుతమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ తీర రేఖ కలిగిన జిల్లాలో ఎగుమతుల హబ్‌ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర పరిశ్రమల విధానాల్లో సైతం ‘బ్లూ ఎకానమీ’కి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సైతం బ్లూ ఎకానమీ పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సహక రిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తోంది. మేఘవరం పోర్టు (శ్రీకాకుళం), కాయప్ట్సీన్ పోర్టు (కాకినాడ), ముళ్లపేట పోర్టు (మచిలీపట్టణం), నిజాంపట్నం, వాడరేవు లాంటి పోర్టులను రూ. 30,000 కోట్లతో నిర్మిస్తుంది. వీటి ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్ల ఎగుమతుల వ్యాపారం జరగబోతోంది. కడపలోని ఉక్కు, యురేనియం; నెల్లూరులో మైకా; కోస్తా జిల్లాల నుండి అరటి, కొబ్బరి, పంచదార, పండ్లు లాంటి భారీ ఆదాయాన్ని సమకూర్చే వాటిని మన రాష్ట్రం నుండే ఎగుమతి చేయొచ్చు. కేంద్రం నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్లలో మన రాష్ట్రంగుండా మూడు వెళ్తున్నాయి. అందులో ముఖ్యమైంది విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధి వలన విదేశీ పెట్టుబడులు పెరిగి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏపీ చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బ్లూ ఎకానమీలో చేపల ఉత్పత్తి, ఎగుమతులు చాలా కీలకం. కేవలం చేపల ఉత్పత్తే కాకుండా దానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఐరోపా దేశాల తరహాలో ఫిషింగ్ లాండింగ్ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 6 ఫిషింగ్ హార్బర్లతో వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ౖ‘వెఎస్సాఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ప్రతి కుటుంబానికీ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది. బ్లూ ఎకానమీలో సముద్రపు ఖనిజాల వెలికితీత చాలా ముఖ్యమైన లక్ష్యం. కృష్ణ – గోదావరి బేసిన్‌లోని సహజ వాయువు, విశాఖపట్నంలో పాలి మెటాలిక్ నొడ్యూల్స్ వెలికితీతకు మంచి అవకాశాలు ఉన్నాయి. మడ అడవుల అభివృద్ధి, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడం వంటి విధానాలు కూడా బ్లూ ఎకానమీలో ప్రధానం. రాష్ట్రంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. అరుదైన లోహాలు సము ద్రాల్లో లభ్యం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోంది. విద్యారంగంలో సైతం బ్లూ ఎకానమీ ద్వారా మెరైన్ ఇంజ నీరింగ్, షిప్ బిల్డింగ్, ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అధిక అవకాశం ఉంది. ఫిషింగ్ విశ్వ విద్యాలయం పూర్తయినవెంటనే ఈ రంగాల్లో విద్య అవకాశాలు విరివిగా వస్తాయి. రాష్ట్రం కర్కట రేఖ మీద ఉన్నందున మంచి సూర్యరశ్మి సముద్రంపై లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన విద్యుత్తును సముద్రాల్లో తయారు చేయాలని సంకల్పించింది. కేంద్రం ఇటీవల లక్షద్వీప్‌లో సముద్ర ఉష్ణ శక్తి ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అదే తరహాలో మన రాష్ట్రంలో 3 సముద్రపు ఉష్ణ శక్తిప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ముందుకు సాగుతోంది. వచ్చే 2030–2035 నాటికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రాష్ట్రంలో బ్లూ ఎకానమీ ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సుస్థిరత్వం సాధ్యం అవుతుందనేది ఒక అంచనా. - కన్నోజు శ్రీహర్ష, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు -
మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు
కృష్ణా జిల్లా: మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు పడింది. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులకు మాజీమంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన పేర్ని నాని.. ‘ సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ పనులను సమాంతరంగా పూర్తి చేస్తాం. నాలుగు బెర్త్‌ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి. మొన్నటి వరకూ దావాలతో ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బందులను పోర్టు పనులు ప్రారంభించాం. 26 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేస్తాం’ అని అన్నారు. కాగా, మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరింది. -
బందరు పోర్టుకు శంకుస్థాపనపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం (బందరు) పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంకుస్థాపన చేశామని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంఖుస్థాపన చేశాం. 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహ… pic.twitter.com/qLCV0k6Oxp — YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మిస్తున్నామని అన్నారు. కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్టును జాతీయ రహదారి-216కి, అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైనుకి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. కాగా, మచిలీపట్నం ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం సీం జగన్ తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. చదవండి: ఆయన కోరుకున్న అమరావతి అలాంటిది మరి!.. బాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన -
‘కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రమిది’
సాక్షి, కృష్ణా: బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా.. సోమవారం జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారాయన. పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకూ ఇది చేరువలో ఉంటుందని తెలిపారాయన. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మచిలీపట్నం: జగనన్న కోసం పోటెత్తిన జనం (ఫొటోలు)
-
Live: మచిలీపట్నం పోర్టు భూమి పూజ
-
బందరు పోర్టు చిరకాల స్వప్నం: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉంది నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోంది ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నాం అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశాం అన్ని అనుమతులు తీసుకొచ్చాం ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేశాం పోర్టు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తిచేసిన, ఆపనులు ప్రారంభించాం 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయి 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ పెరిగే కొద్దీ… 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాను కూడా నిర్మిస్తున్నాం 6.5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నాం 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నాం బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నాం అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుంది కృష్ణా జిల్లా చరిత్రను ఈ పోర్టు మారుస్తుంది ఈ పోర్టు వల్ల మన రాష్ట్రం మాత్రమే బాగుపడ్డం కాకుండా.. వ్యాపారాలు బాగుపడతాయి మచిలీపట్నం పోర్టు వల్ల పక్క రాష్ట్రాలకు ఉపయోగం ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి డిగ్రీలు పూర్తిచేసుకున్న మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి పోర్టు నిర్మాణంలో గతంలో అనేక అడ్డంకులు వచ్చాయి పోర్టు ఇక్కడ రాకూడదని తపన, తాపత్రయ పడ్డాడు చంద్రబాబు 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశాడు: దీనివల్ల పోర్టు అడగరని చంద్రబాబు ఇలా చేశాడు ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినామీగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని తీరని ద్రోహం చేశాడు పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నాం ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పాను రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నాం 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి.. మచిలీపట్నంలో మన ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి గతంలో బందరు ముఖ్యపట్టణమైనా.. కలెక్టరుతోపాటు ఏ ఒక్క అధికారీ ఇక్కడ ఉండలేదు:ప్రజలకు మంచిచేస్తూ ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్ మాత్రమే కాదు, మొత్తం యంత్రాంగం జిల్లాలో ఉండేట్టుగా మచిలీపట్నాన్ని జిల్లాకేంద్రంగా చేశాం జిల్లాల విభజన వల్ల ఇది సాధ్యమైంది మరో మూడు నెలల్లో బందరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి ఏ సమయంలో నైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా జరుగుతున్నాయి 60శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి నాలుగు నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోంది ఇమిటేషన్ జ్యుయలరీ తయారీకి మద్దతుగా… పాదయాత్రలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా రూ.7.60 యూనిట్ ధరను.. రూ.3.75లకు తగ్గించాం దాదాపు 45వేలమందికి బతుకుతున్న ఈపరిశ్రమకు మంచిచేశాం ఈ జిల్లా ముఖ్యపట్టణంగా ఎదగడమే కాకుండా.. భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి మచిలీపట్నం కేరాఫ్ అడ్రస్‌గామారబోతోంది రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి మన ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025-2026 నాటికి అదనంగామరో 110 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నాం: 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఉన్న పోర్టులు నాలుగు పోర్టులు అయితే.. అక్షరాల రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో జోరుగా అడుగులు పడుతున్నాయి కాకినాడ గేట్‌వే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడ్డాయి ఒక్కో పోర్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయి పోర్టు ఆధారిత పరిశ్రమల కారణంగా లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలకు వస్తాయి మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే.. గొప్ప కార్యక్రమం జరగబోతోంది గతంలో చరిత్రలోఎప్పుడూ చూడని విధంగా.. మన ప్రభుత్వంలో అడుగులు ముందుకేశాం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా నిర్మిస్తున్నాం మరోవంక పేదల సంక్షేమానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలూ చేస్తున్నాం పేదరికాన్ని సమూలంగా తీసివేయాలని అక్షరాల రూ.2.10లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం నాన్ డీబీటీ ద్వారా మరో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం ప్రజలకు అందించే సేవల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పల్లె పల్లెల్లో ప్రజల ముంగిటకే సేవలు తీసుకు వచ్చాం ప్రజల ప్రభుత్వంగా మార్పులు తీసుకు వచ్చాం ఇప్పటికే 30 లక్షల ఇళ్లపట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో వారికి అందించాం ఇలా రూ.1.5 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టాం అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించాం కాని ఆ యజ్ఞానానికి రాక్షసులు అడ్డు పడ్డారు టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోంది దోచుకోవడం… పంచుకోవడం.. వీరి పని టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరికి తోడు ఒక దత్తపుత్రుడు కలిశాడు అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలంట అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట ఇంతకన్నా.. సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నాం వారి వికృతఆలోచనలకు మద్దు ఇవ్వగలమా? పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలి ఈ నెల 26l అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగాచేస్తున్నాను పేదలంటే చంద్రబాబుకు చులకన ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్నాడు బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు ఈ బాబు మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు ఈ చంద్రబాబు మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు చంద్రబాబు తాను కనీసం ఒక్క సెంటైనా కూడా పేదవాడికి ఇచ్చిన పోలేదు చంద్రబాబు ఒక్క ఇళ్లస్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని… సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుతోపాటు.. ఈ దుష్టచతుష్టయం.. ఈ గజదొంగల ముఠా అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు కాని మనం ఇస్తే.. వాటిని స్మశానంతో పోలుస్తాడు ఇలాంటి చంద్రబాబుకు అవగాహనైనా ఉందా? కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు కాని చంద్రబాబుకు మానవత్వం లేదు ఇలాంటి కార్యక్రమాన్ని దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు పలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వారిది వారి ఆలోచనలన్నీ.. వారి కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కటే ఒక్క దత్తపుత్రుడ్ని, ఎల్లోమీడియాను మాత్రం నమ్ముకుంటారంట మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. .ఎన్నికల్లో గెలవడమే కష్టమట మీ బిడ్డ పాలనలో మీకు జరిగి ఉంటే.. మీరే సైనికులుగా తోడుగా నిలవండి పేర్ని నాని కామెంట్స్ ► బందరు అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు ► బందరకు సీఎం జగన్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు ► పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు ► బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు ► నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు ► బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు ► బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ► బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు ► రూ. 197 కోట్ల విలువైన భూములను పేదలకు పంపిణీ చేశారు ► బందరు వాసుల కలను సీఎం జగన్ నెరవేర్చారు ► బందరుకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌ది ► 64 ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు ► ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు ► బందరులో గోల్డ్ కవరింగ్ యూనిట్లను నిలబెట్టిన ఘనత సీఎం జగన్‌ది ► సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే ► 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా? ఎంపీ బాలశౌరి కామెంట్స్ ► బందరు పోర్టు శతాబ్దాల కల ► రామాయపట్నం, భావనపాడు పోర్టులతో లక్షలాది మందికి ఉపాధి ► నిజాయితీగా పోర్టు పనులు ప్రారంభించిన నాయకుడు సీఎం జగన్ ► బందరు పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది 👉బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్ 👉పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయల్దేరిన సీఎం జగన్ 👉పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం జగన్ 👉 సీఎం జగన్ బహిరంగ సభ నేపథ్యంలో.. ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జననేతకు హృదయపూర్వక స్వాగతమంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు కొందరు. 👉 మచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయమే తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారాయన. ఇక.. సీఎం జగన్‌ను చూసేందుకు జనం అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లను చూసి ఆయన అభివాదం చేశారు. కాసేపట్లో బహిరంగ సభకు చేరుకుని ఆయన ప్రసంగించనున్నారు. 👉బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్ 👉తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులు ప్రారంభించిన సీఎం జగన్ 👉గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించిన సీఎం జగన్ 👉సీఎం పర్యటన నేపథ్యంలో మచిలీపట్నంలో పండగ వాతావరణం 👉 మచిలీపట్నం చేరుకున్న సీఎం జగన్ 👉 బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కృష్ణాజిల్లా మచిలీపట్నం పర్యటనకు బయల్దేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 👉 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 👉 ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది. 👉 తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. 👉 ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్టు, ఐదు నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే.. ► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది. ► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు. 👉 మచిలీపట్నం పోర్టు విశేషాలు.. ► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు ► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు ► బెర్తుల సంఖ్య 4 ► భూసేకరణ.. 1,923 ఎకరాలు ► ఎన్‌హెచ్ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి ► పెడన రైల్వేస్టేషన్ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం ► బందరు కెనాల్ నుండి 11 కి.మీ పైప్‌లైన్ ద్వారా 0.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా ► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్ యాంప్) విద్యుత్ సరఫరా -
బందరు పోర్టు పనులకు నేడే శుభారంభం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రారంభించనున్నారు. భూసేకరణ పూర్తిచేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఖరారుచేసి, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పనులు ఆగకుండా శరవేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది. 75 ఏళ్లలో ఆరు, ఈ నాలుగేళ్లలో నాలుగు.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం నుంచి ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరనుంది. 25వేల మంది ఉపాధి.. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది. తొలి ఏడాదే కార్పొరేషన్, పరిపాలనా అనుమతులు.. తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. మారనున్న సముద్ర తీర ప్రాంత ముఖచిత్రం ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్టు, ఐదు నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే.. ► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది. ► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు. హడావుడిగా బాబు శంకుస్థాపన నిజానికి.. అధికారంలో ఉన్న కాలంలో పోర్టు నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టని చంద్రబాబు 2019 ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బందరు పోర్టుకు ఎటువంటి అనుమతులు, నిధులు లేకుండా హడావుడిగా శంకుస్థాపన చేశారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్, రోడ్డు కనెక్టివిటీ, భూసేకరణ చేయకుండానే మొక్కుబడిగా శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మాయచేశారు. మచిలీపట్నం పోర్టు విశేషాలు.. ► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు ► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు ► బెర్తుల సంఖ్య 4 ► భూసేకరణ.. 1,923 ఎకరాలు ► ఎన్‌హెచ్ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి ► పెడన రైల్వేస్టేషన్ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం ► బందరు కెనాల్ నుండి 11 కి.మీ పైప్‌లైన్ ద్వారా 0.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా ► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్ యాంప్) విద్యుత్ సరఫరా నేడు మచిలీపట్నానికి సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి మచిలీపట్నం మండల పరిధిలోని తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
బందరు కల సాకారం
-
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో మరో ముందడుగు
-
ఇక మచిలీపట్నం పోర్టుకు పూర్వవైభవం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చుతోంది. సుమారు రూ.11,464 కోట్ల భారీ పెట్టుబడితో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో.. 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.5,156 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దక్షిణాసియాకు ముఖద్వారంగా.. దేశ తూర్పుతీరంలో దక్షిణాసియా దేశాలకు అత్యంత దగ్గరగా మచిలీపట్నం పోర్టు ఉండటంతో పూర్వకాలంలో మసూలీపటా ఓడరేవు పేరుతో ఇక్కడి నుంచి పర్షియన్ (గల్ఫ్) దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిలీపట్నం ప్రాంతపు చేనేత, కలంకారీ, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఆంగ్లేయులతోపాటు, డచ్, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించిన బందరు పోర్టు కాలక్రమంలో కనుమరుగైపోయింది. అన్ని అనుమతులతో ముందుకు.. స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్ అకాల మరణానంతరం నిర్మాణ పనులు అటకెక్కాయి. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి అసలు పట్టించుకోలేదు. 2019లో ఎన్నికలకు నెలన్నర ముందు పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన అంటూ ఒక కొబ్బరికాయ కొట్టి మమ అనిపించారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా నిధులను కూడా సమకూర్చారు. ఆ తర్వాత రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలకమైన పర్యావరణ అనుమతులు ఫిబ్రవరి 28న వచ్చాయి. పోర్టును జాతీయరహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ నాలుగులైన్ల రహదారి, ఏడు కి.మీ రైల్వే లైన్ నిర్మాణాలకు కూడా అనుమతులు సాధించారు. తీర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పం. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఏకకాలంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు నాన్ మేజర్ పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులుగా ఉంది. 2022–23లో 175 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. 2025–26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులతో పాటు పీపీపీ విధానంలో కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ నాలుగు పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా 75 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ అండ్ ఎండీ ఏపీఐఐసీ -
మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో...‘నవయుగ’కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: మచిలీపట్నం పోర్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు ఇప్పుడు సుప్రీంకోర్టులోను అదే పరిస్థితి ఎదురైంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం నిమిత్తం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలన్న నవయుగ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాము మధ్యవర్తిని నియమించబోమని స్పష్టంచేసింది. మధ్యవర్తి నియామక అభ్యర్థనతో హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదీ నేపథ్యం.. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో 66 జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఆ జీవోను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. అదే సమయంలో ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు పలు అభ్యర్థనలతో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసింది. వాటిని న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి కొట్టేసింది. అలాగే తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో 66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీవో 9 అమలును నిలిపేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం కొట్టేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తుది విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకోర్టులో నవయుగ పిటిషన్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశాలపై నవయుగ పోర్ట్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం గురువారం విచారించింది. నవయుగ పోర్ట్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ నవయుగ విజ్ఞప్తిపై స్పందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమని తెలిపారు. ఒప్పందం రద్దులో తమ తప్పేమీ లేదన్నారు. ఒప్పందం చేసుకుని భూమి కేటాయించినా నిర్మాణ పనుల్లో నవయుగ అసాధారణ జాప్యం చేసిందని చెప్పారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రిట్ పిటిషన్ దాఖలు చేసి ప్రాజెక్టు పనులను ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు నవయుగ ప్రయత్నించిందని, అయితే హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. -
నవయుగ కంపెనీకి సుప్రీంకోర్టులో షాక్
సాక్షి, ఢిల్లీ: మచిలీపట్నం పోర్టు పనుల రద్దుపై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూమి కేటాయించినా పోర్టు నిర్మించడంలో నవయుగ ఆలస్యం చేసిందని కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు -
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై పేర్ని నాని ఫైర్
-
మచిలీపట్నం పోర్టుకు రుణం మంజూరు
-
ఏపీ: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మరో ముందడుగు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. తాజాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 3, 940 కోట్లు మంజూరు అయ్యింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరమయ్యే వంద శాతం రుణం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి మంజూరు ఉత్తర్వులు పంపింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం (బందరు) పోర్టుకు ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. తాజాగా గురువారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవహారంలో నవయుగ పోర్టు లిమిటెడ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కావడమే ఇందుకు కారణం. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ‘నవయుగ’ సంస్థ దాఖలు చేసిన మూడు అనుబంధ పిటిషన్లనూ హైకోర్టు గురువారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది. అలాగే, తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. అంతేకాక.. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీఓ–9 అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ పోర్టు నిర్మాణం విషయంలో యథాతథస్థితి ఉత్తర్వులతో సహా నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పింది. టెండర్ ఖరారు, లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ, లోయస్ట్ బిడ్డర్ ఒప్పందం కుదుర్చుకోవడం వంటి విషయాల్లో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేసింది. పోర్టు నిర్మాణంపై ముందుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనలనూ తోసిపుచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2,360 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైనా కూడా నవయుగ తిరిగి కొత్త షరతులను విధిస్తూ వచ్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను డిసెంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్ నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ గత నెల 25న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ‘నవయుగ’ అప్పీల్ చేసింది. దీంతోపాటు పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు చేయడంతో పాటు సింగిల్ జడ్జి తీర్పు అమలును, ఒప్పందం రద్దు ఉత్తర్వుల జీఓ అమలును నిలిపేయాలని కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఈ నెల 20న మధ్యంతర ఉత్తర్వుల జారీపై తన నిర్ణయాన్ని రిజర్వ్‌చేసింది. తాజాగా గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. అప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ‘ఒప్పందం రద్దును సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత లోయస్ట్ బిడ్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న నవయుగ అభ్యర్థనను మన్నించలేకున్నాం. ఇక పోర్టు కొత్త మోడల్ ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని 830 ఎకరాలకు కుదించారు. అలాగే, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.700 కోట్లకు తగ్గించారు. అందువల్ల జీఓ–9 అమలు నిలుపుదల సాధ్యంకాదు. జీఓ–66 సంగతికొస్తే, సింగిల్ జడ్జి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నవయుగ పిటిషన్‌ను కొట్టేశారు. అందువల్ల దాని అమలును నిలుపుదల చేయలేం’.. అని ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలని ఎక్కడాలేదు... ‘2008లో ఒప్పందం కుదిరినప్పటికీ, ఎప్పటికప్పుడు అవసరమైన భూమిని అప్పగిస్తూ వచ్చినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలన్న నిబంధనలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఒప్పందంలోని బా«ధ్యతలను నిర్వర్తించడంలో రాయితీదారు (నవయుగ) విఫలమైతే ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకోవచ్చునని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ఇక పోర్టు అభివృద్ధి కోసం 2,360 ఎకరాలతోపాటు మరో 519 ఎకరాల అసైన్డ్ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించింది. 5,324 ఎకరాలను ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టింది. వీటన్నింటి దృష్ట్యా మొత్తం భూమిని ఒక్కసారే ఇవ్వలేదు కాబట్టి ప్రాజెక్టును చేపట్టలేదన్న నవయుగ వాదనను ఆమోదించలేకున్నాం. పరస్పర విరుద్ధంగా ‘నవయుగ’ లేఖలు ‘నిజానికి.. 2019 ఏప్రిల్‌లో పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖల్లో ప్రాథమిక పనులను మొదలుపెట్టినట్లు నవయుగ చెప్పింది. అయినప్పటికీ నవయుగ ముందుకెళ్లలేదు. అంతేకాక.. నవయుగ రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నవయుగ బాధ్యతలను నిర్వర్తించలేదు. పైపెచ్చు కొత్త షరతులు విధిస్తూ వచ్చింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనను తోసిపుచ్చుతున్నాం. సింగిల్ జడ్జి తీర్పులో వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. వీటన్నింటి దృష్ట్యా నవయుగ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
‘నవయుగ’ అనుబంధ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని నవయుగ పోర్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎ.వి.రవీంద్రబాబు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను మంగళవారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కి ఏ మాత్రం లేదని, అందుకే ఒప్పందంలోని నిబంధనలను బేఖాతరు చేస్తూ వచ్చిందని చెప్పారు. రాయితీల కల్పనకు ఉద్దేశించిన స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎస్ఎస్ఏ) ఖరారు విషయంలో కూడా ఆ సంస్థ ఏ మాత్రం చొరవ చూపలేదన్నారు. భూములన్నీ ఒకేసారి అప్పగించాల్సిన అవసరం లేదని, ఇలా అప్పగించాలని ఒప్పందంలో ఎక్కడా లేదని తెలిపారు. ప్రస్తుతం ఏ భూములు కూడా నవయుగ పోర్ట్ లిమిటెడ్ స్వాధీనంలో లేవని చెప్పారు. ఈ పోర్టు నిర్మాణంలో విస్తృత ప్రజాప్రయోజనాలు, భారీ ప్రజాధనం ముడిపడి ఉన్నట్లు తెలిపారు. అందువల్ల ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. శ్రీరామ్ వాదనలకు నవయుగ పోర్ట్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం ప్రకారం నడుచుకోలేదన్నారు. ఒప్పందం ప్రకారం అప్పగించాల్సిన భూములను అప్పగించలేదని తెలిపారు. సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించే ఆస్కారం ఉందన్నారు. అందువల్ల యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
ఉల్లంఘనవల్లే ‘నవయుగ’ ఒప్పందం రద్దు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు దక్కించుకున్న నవయుగ పోర్టు లిమిటెడ్.. తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని, అందుకే ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఏ దశలో కూడా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. ప్రాజెక్టు పనులను కనీస స్థాయిలో కూడా ప్రారంభించలేదన్నారు. నిధుల లభ్యతనూ చూపలేదని తెలిపారు. తప్పులన్నీ వారి వైపు పెట్టుకుని, ప్రభుత్వమే ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుందంటూ ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణం ఏ రోజూ నడుచుకోలేదని తెలిపారు. 5,342 ఎకరాల భూమిని ఏకమొత్తంగా అప్పగిస్తే ఆ భూమిని తాకట్టు పెట్టి తద్వారా నిధులు లభ్యతను చూపుతామని నవయుగ చెప్పిందన్నారు. సముద్రానికి పక్కనే ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పినా వినిపించుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం 2018 మార్చికల్లా నిధుల లభ్యతను చూపాల్సి ఉండగా, అందులో నవయుగ విఫలమైందని, ఇది ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడమేనని శ్రీరామ్ వివరించారు. పోర్టు పనులు ప్రారంభం కాకపోవడానికి నవయుగ వైఖరే కారణమని.. అందుకే ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసుకున్నామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని చెప్పారు. ఏజీ వాదనల కొనసాగింపు నిమిత్తం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూమి మొత్తాన్ని ఏకమొత్తంగా అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దమ్మాలపాటి తెలిపారు. దశల వారీగా భూమిని అప్పగిస్తామనడం సరికాదన్నారు. పైపెచ్చు తమకు అప్పగించిన 2,900 ఎకరాల భూమి ఆక్రమణలతో పాటు పలు వివాదాల్లో ఉందన్నారు. ప్రభుత్వమే ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
‘నవయుగ’ అప్పీల్లో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో తమతో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై నవయుగ పోర్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అప్పీల్‌ను విచారిస్తున్న ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి (జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు) గతంలో నవయుగ కంపెనీతో కలిసి పని చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ అప్పీల్‌ను జస్టిస్ సోమయాజులు సభ్యుడిగా లేని ధర్మాసనం విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఈ అప్పీల్ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటవుతుందని, విచారణను ఈ నెల 9న చేపడతామని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్.. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో 66 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నవయుగ హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల తుది విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందనరావు ప్రభుత్వ జీవోను సమర్థించారు. జీవో 66ను సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల ప్రకారం బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందన్నారు. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని తేల్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ప్రస్తావించిన ఏజీ శ్రీరామ్.. తాజాగా ఈ అప్పీల్ విచారణకు రాగా నవయుగ పోర్ట్ లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని,అప్పీల్‌ను విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఒకరు గతంలో నవయుగ కంపెనీతో ఉన్నారని తెలిపారు. ఏదైనా కేసును విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఎవరికైనా ఆ కేసుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలుంటే ఆ విషయాన్ని ముందుగానే వారి దృష్టికి తేవాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిందని ప్రస్తావించారు. దాని ప్రకారం ఈ కేసులో ఓ న్యాయమూర్తి గతంలో నవయుగ కంపెనీతో ఉన్నారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెస్తున్నట్లు ఏజీ చెప్పారు. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కు నవయుగ కంపెనీ లీడ్ ప్రమోటర్‌గా ఉందని వివరించారు. అయితే తామేమీ ఆ న్యాయమూర్తిపై ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు. ఏజీగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని తెలిపారు. కొంత సమయం పడుతుంది.. నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ బందరు పోర్టు పనులను మరో కంపెనీకి అప్పగించేందుకు సర్వం సిద్ధమైందన్నారు. ఈ విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఇందుకు ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ ఈ ప్రాజెక్టు మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఇప్పటికి ప్పుడు అయ్యేదేమీ లేదన్నారు. అలా అయితే తమ అప్పీల్‌పై శుక్రవారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని దమ్మాలపాటి పేర్కొనడంతో దీన్ని ప్రత్యేక ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేస్తూ సీజే ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ప్రొసీజర్ అందరికీ ఒకేలా ఉండాలి... ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఈ అప్పీల్ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తామిద్దరిలో ఒకరికి మాత్రమే ఈ కేసులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ తామే ఈ అప్పీల్‌ను విచారిస్తే దీన్ని ప్రధాన కారణంగా చూపుతూ సుప్రీంకోర్టుకెళ్లే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితికి తావు లేకుండా ఈ అప్పీల్‌ను మరో ధర్మాసనం విచారించడం నైతికంగా ఉత్తమమని సీజే స్పష్టం చేశారు. కేసుల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ కోర్టు విధి విధానాలు మాత్రం అందరికీ ఒకేలా ఉండాలని సీజే తేల్చి చెప్పారు. -
బందరు పోర్టుతో ఉద్యోగాలే ఉద్యోగాలు
-
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. నవయుగ పోర్టు లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఒప్పందం రద్దును ప్రశ్నిస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందని తేల్చిచెప్పింది. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. మొత్తం 5,342 ఎకరాల భూమిని ఒకేసారి అప్పగిస్తేనే ప్రాజెక్టు పనులు చేపడతామని నవయుగ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఆ కంపెనీ పెట్టిన కొత్త ఏకపక్ష నిబంధన అని ఆక్షేపించింది. ఒప్పందంలో ఎక్కడా భూమిని ఒకేసారి ప్రారంభంలోనే ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. సముద్రానికి పక్కన ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించిందని పేర్కొంది. తమకు ఒకేసారి 5,342 ఎకరాలను ఇవ్వాలని పట్టుబట్టిందని తెలిపింది. మొత్తం 5,342 ఎకరాల భూమిని అప్పగిస్తే తప్ప, నిధుల లభ్యతను సాధించేందుకు.. పోర్టు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ కంపెనీ చెప్పిందంది. తద్వారా పోర్టు అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నవయుగ నిరాకరించినట్లైందని స్పష్టం చేసింది. 2018 మార్చి కల్లా నిధుల లభ్యతను సాధించడంలోనూ ఆ కంపెనీ విఫలమైందని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీవో 66 జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం.. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి పదకొండున్నరేళ్ల క్రితం నవయుగ పోర్టు లిమిటెడ్ నాటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం 412 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ తర్వాత 2,601 ఎకరాల భూమిని అప్పగిస్తామని ప్రతిపాదించినా నవయుగ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. పోర్టు శంకుస్థాపన శిలాఫలకం తప్ప.. ఏ రకమైన పనులు చేపట్టలేదు. సవరణ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించడం తప్ప ఇన్నేళ్లలో ఆ కంపెనీ చేసిందీ ఏమీ లేదు. ప్రతి విషయంలో మినహాయింపులు కోరడం తప్ప ఏమీ చేయలేదు. ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోకపోవడం, నిర్దేశిత కాల వ్యవధిలోపు పనులు ప్రారంభించకపోవడంతో నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019లో జీవో 66 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నవయుగ పోర్టు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్