Maha Kumbh Mela 2025
-
Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్
ప్రయాగరాజ్: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో గత ఐదు రోజులుగా కిలోమీటర్ల పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో రెండు గంటల్లో చేరుకునే దూరానికి ఇప్పుడు 10 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులను తరలించే రవాణా వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించలేకపోతున్నాయి.ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాణిజ్య వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్‌లో పాలు, బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన మార్కెట్ అయిన ముత్తిగంజ్‌లోని పలు వ్యాపారులకు చెందిన గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు రిటైల్ దుకాణాల డిమాండ్‌ను తీర్చలేకపోతున్నారు. జనవరి 26 నుంచి ప్రయాగ్‌రాజ్‌లోనికి వాణిజ్యవాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వసంత పంచమి తరువాత కొన్ని వాహనాలకు అనుమతులిచ్చారు. దీంతో కొంతమేరకు సమస్య పరిష్కారమయ్యింది. ఇయితే ఇప్పుడు తిరిగి ఆ ఆహార నిల్వలు ఖాళీ అయిపోయాయి.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రిటైల్ వ్యాపారి దీపక్ కేసర్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను చక్కెర కొనడానికి హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లగా, అక్కడ చక్కెర నిల్వలు లేనట్లు తెలిసిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ తాను 50 కిలోల చక్కెర కోసం ప్రయత్నించగా, 15 కిలోలు మాత్రమే దొరికిందన్నారు. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్‌ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయని, వాటిని ప్రయాగ్‌రాజ్‌లోనికి అనుమతించడం లేదని గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కేసర్వానీ తెలిపారు. నగరంలో ఆహారధాన్యాలు, నిత్యావసరాల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు నేడు (మంగళవారం) 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పకడందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. #WATCH प्रयागराज: त्रिवेणी संगम पर पवित्र डुबकी लगाने के लिए महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/Qp7OYkvCVA— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ప్రయాగ్‌రాజ్‌లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజిమెంట్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సంగమానికి ఎలా వెళ్లాలి?సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/mXgJqnT7lg— ANI_HindiNews (@AHindinews) February 11, 2025అధికారులకు సీఎం ఆదిత్యనాథ్ సూచనలుమహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.1.మహా కుంభ్ మార్గ్‌లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.2 ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.8 ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.9. ప్రయాగ్‌రాజ్‌లోని ఏ రైల్వే స్టేషన్లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో -
Sonal Chauhan : మహా కుంభమేళాలో బాలయ్య హీరోయిన్ పవిత్ర స్నానం (ఫోటోలు)
-
Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్‌లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్‌ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్‌లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన -
Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు ఈరోజు(సోమవారం) భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక, సంగమం స్టేషన్‌ను తిరిగి తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజూ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. ఇదేతరహాలో సంగమం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఈస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అలాగే కుంభమేళాకు వచ్చే భక్తులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇది కూడా చదవండి: Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి.. -
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
మహాకుంభమేళాలో విజయ్.. గెటప్ కనిపించొద్దని...!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. ముఖానికి మాస్కుతో..అక్కడికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.సినిమావిజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 12వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించనున్నాడు.చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి -
కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో ఎంతో వైభవంగా మహా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం… pic.twitter.com/sZSvsV4tCd— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 10, 2025 -
Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా పొడవైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చిన భక్తులు రాష్ట్రంలోని అయోధ్య, వారణాసి, మధుర తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో కాలుమోపేందుకు కూడా స్థలం కనిపించని విధంగా ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 9) సెలవు దినం కావడంతో లెక్కకుమించినంతమంది భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలామంది అయోధ్యను సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్ పలు ఏర్పాట్లు చేసింది.భక్తుల రద్దీ కారణంగా అయోధ్యలో విపరీతమైన ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ విభాగం వాహనాలను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఈ నేపధ్యంలో పలు సమస్యలు తలెత్తాయి. ఇదేవిధంగా యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి నుంచి భారీసంఖ్యలో జనం కుంభమేళాకు తరలివెళుతుండటంతో నేషనల్ హైవే వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.మధురలోని బృందావనం(Vrindavan in Mathura) కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు మధురకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినవారంతా నేరుగా మధురకు చేరుకుని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో మధురలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఇదే తరహాలో వారణాసిలోనూ భక్తుల కోలాహలం కనిపించింది. కాశీలోని అన్ని గల్లీలు భక్తులతో నిండిపోయాయి. ఇక్కడి అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇది కూడా చదవండి: భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి.. -
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
Mahakumbh-2025: పెట్టుబడి పిసరంత.. ఆదాయం కొండంత.. ఏం ఐడియాలు గురూ!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలుమరోవ్యక్తి మహా కుంభ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని టీ తోపాటు భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలుమహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలుకుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
Mahakhumb 2025 : తండ్రితో కలిసి సైనా నెహ్వాల్ పడవ ప్రయాణం (ఫొటోలు)
-
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
Maha Kumbh: భూటాన్ రాజు పుణ్య స్నానం
మహాకుంభ్ నగర్: భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ మంగళవారం మహాకుంభ్ నగర్‌ను సందర్శించారు. త్రివేణీ సంగంలో పుణ్య స్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అంతకుమునుపు వీరు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పణ తదితర పూజలు చేశారు. భూటాన్ సంప్రదాయ దుస్తుల్లో విమానాశ్రయంలో ల్యాండైన వాంగ్‌చుక్ కాషాయ రంగు కుర్తాపైజామా ధరించి పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. వాంగ్‌చుక్, యోగితోపాటు సతువా బాబాగా అందరూ పిలిచే జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ కూడా ఉన్నారు. అనంతరం భూటాన్ రాజు అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. డిజిటల్ మహా కుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను కూడా సందర్శించారు. వాంగ్‌చుక్ సోమవారం థింపూ నుంచి లక్నోకు చేరుకున్నారు. -
కుంభమేళాలో అయోధ్య రాముని రెప్లికా
మహా కుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్లట్లేదా! అయోధ్య నుంచి బాలరాముడు కూడా మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకున్నాడు. నిజమా! అవును నిజమే. అయోధ్య వెళ్లలేని వాళ్ల కోసం రాముడే స్వయంగా త్రివేణి సంగమానికి (Triveni Sangam) తరలి వచ్చాడని సంబరపడుతున్నారు భక్తులు. అచ్చం అయోధ్యలోని బాలరాముడి ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని యూపీలోని కుంభమేళాలో ఆవిష్కరించాడు మన హైదరాబాదీ. ఆయన పేరు రమణ వంక (Ramana Vanka). సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా సొబగులద్దే రమణ ఈ మహాకుంభమేళా సందర్భంగా అయోధ్యరాముడి ఆలయాన్ని, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‘భీమ సినిమాకు టెంపుల్ సెట్ వేసిన అనుభవం ఉంది. అది తెలిసి ఆద్యశ్రీ ఎన్ఫోటైన్మెంట్, శ్రీ గరుడ రామ్‌మందిర్ వారు పిలిచారు. ‘శతమానం భవతి’ సినిమా కోసం దాదాపు యాభై రోజులు నియమనిష్ఠలు పాటించాను. అలాగే రాముడి మందిరానికి భూమి పూజ చేసిన డిసెంబర్ 26 నుంచి నిష్ఠలో ఉన్నాను. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగుస్తుంది. కానీ శ్రీరామనవమి వేడుకల వరకూ (మార్చి 15) మందిరాన్ని ఉంచాలని అనుకుంటున్నారు. అప్పటి వరకూ నిష్ఠను కొనసాగిస్తాను’ అన్నారు రమణ వంక.అయోధ్య మందిరాన్ని చూడలేదు.. అయోధ్య మందిరానికి ప్రతిరూప నిర్మాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేశారు రమణ. ఒక ఆలయానికి రూపకల్పన చేయాలంటే శాస్త్రాలను, మత విశ్వాసాలను, నిర్మాణశైలిని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది. అప్పటికే ఉన్న ఆలయానికి రెప్లికా కాబట్టి రోజుల్లోనే చేయగలిగానని, ఇది నా అదృష్టమని రమణ చెబుతున్నారు. అయితే ‘అయోధ్య మందిరాన్ని సందర్శించలేదని, కానీ నిర్మాణాన్ని ఫొటోలో చూడగానే ఒక అవగాహన వచ్చిందని, ఈ నిర్మాణంలో వెదురు, ఫైబర్, ఫోమ్, క్లాత్ వాడామని, ఎనిమిది డిగ్రీల చలిలో, మంచుతో తడిసిన వెదురు కర్రల మీద 80 అడుగుల ఎత్తులో పని చేస్తున్నప్పుడు ఆందోళనగా ఉండేదని, ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా పని పూర్తి చేయగలిగామని, అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని చెబుతున్నారు రమణ. కాగా కుంభమేళాలో అయోధ్య రాముడి నమూనా నిర్మాణం చేపట్టిన ఘనత హైదరాబాదీది, పైగా తెలుగువాడిది కావడం గర్వకారణం.అయోధ్యలో సగం! ప్రయాగ్‌రాజ్ రామ మందిరానికి అయోధ్య మందిరం కొలతల్లో యాభై శాతం తీసుకున్నారు. 161 అడుగుల ఎత్తును 81 చేశారు. 360 అడుగుల పొడవు, 161 అడుగుల వెడల్పు 140, 120గా తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని అసలు రూపం కంటే మూడు అంగుళాలు తక్కువగా తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ బదులు జల ప్రతిష్ఠ చేశారు. నిత్యపూజలు దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.చదవండి: ప్రత్యక్ష దైవమా.. ప్రణామంసర్వమతం.. శ్రీరామం.. ప్రయాగ్‌రాజ్ రామమందిరం రూపశిల్పి రమణ తెలుగు వాడు. అయితే హిందీ, బెంగాలీ వాళ్లు మొత్తం రెండు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. నిత్యం ‘జై శ్రీరామ్’ అంటూ దీక్షగా పని చేసుకుపోయిన వారిలో వివిధ భాషలే కాదు, మతాలు కూడా ఉన్నాయి. ఈ 200 మందిలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఉంది. త్రివేణి సంగమం, సెక్టార్ 1, గ్రౌండ్ 17లో ఉంది.రాముడే పిలిచాడు! బీఎస్సీ చదివి 10–5 జాబ్ చేశాను. సంతృప్తినివ్వలేదు. దీంతో నాకిష్టమైన డ్రాయింగ్‌లో ఎమ్ఎఫ్ఏ చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌గా పాతికకు పైగా సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్నాను. నా కెరీర్లో ది బెస్ట్ టాస్క్ అయోధ్య ఆలయ రెప్లికా నిర్మాణం. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చరిత్రలో రాముడున్నాడు. జీవితానికి ఇది చాలు. – రమణ వంక, సినీ ఆర్ట్ డైరెక్టర్ -
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
మోడీ కుంభమేళ షెడ్యూల్
-
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్‌సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
5న ప్రధాని మోదీ కుంభస్నానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ? -
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే.. -
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.