Makar Sankranti
-
సినీ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?
నేడు (జనవరి 14) దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే గాలిపటం ఎగురవేయడానికి ఎంత గాలి అవసరమో మీకు తెలుసా?మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఈ గాలిపటాలను చూసినప్పుడు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.ఆకాశంలో గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవేయలేమని పలువురు చెబుతుంటారు. ఇంతేకాదు గాలి బలంగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం, కత్తిరించడం కష్టం అవుతుంది. నిజానికి పతంగులు ఎగురవేయడానికి, స్థిరమైన గాలి వేగం గంటకు 8 నుండి 20 మైళ్ళు (13 నుండి 32 కిలోమీటర్లు) మధ్య ఉండాలి. దీనికంటే తక్కువ గాలి వీచినా, గాలిపటాన్ని ఎగురవేయడం కష్టమవుతుంది. అలాగే గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులు కూడా గాలిపటం ఎగరవేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది.ఆకాశంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం కష్టమవుతుంది. నిజానికి బలమైన గాలి వీచినప్పుడు గాలిపటం వెంటనే గాలిలో ఎగురుతుంది. ఇంతేకాదు మాంజాను గాలిపటానికి సరిగ్గా కట్టకపోయినా, గాలిపటం వేగంగా ఎగురుతుంది. అయితే బలమైన గాలులకు గాలిపటం ఆ గాలితో పాటు ముందుకు కదులుతుంది. అయితే అప్పుడు ఆ గాలిపటాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇంతేకాదు బలమైన గాలిలో మీ గాలిపటంతో మరొక గాలిపటాన్ని కట్చేయలేరు. గాలి వేగం పెరుగుతున్నప్పుడు, గాలిపటాన్ని వెనక్కి లాగే సందర్భంలో అది చినిగిపోతుంది. ఎందుకంటే గాలి దానిని ముందుకు నెట్టివేస్తుంటుంది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్‌సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్‌లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్‌లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్‌ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్‌లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్‌బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
దేశవ్యాపంగా సంక్రాంతి సందడి
ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 వారణాసిలోని గంగా ఘాట్‌కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు. #WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. #WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9 — ANI (@ANI) January 15, 2024 ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 -
గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి. ఈ రోజున స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, దానాలు చేస్తారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలో చాలా పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణం, పంజాబ్‌లో లోహ్రీ, అస్సాంలో భోగాలి, బెంగాల్లో గంగాసాగర్, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. పతంగుల పోటీలు జరుగుతుంటాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వినోదిస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతిరోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు సూర్యుని నుండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు చలినుంచి రక్షణ దొరుకుతుంది. శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలలోని వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు, ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లింది. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి చిహ్నమని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి? -
ప్రాణం తీసిన చైనా మాంజా!
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్‌హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్‌గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి?
మకర సంక్రాంతి పర్వదినం గుజరాత్‌కు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి కారణం గుజరాత్ అంతటా గాలిపటాలు ఎగరడమే. ఈసారి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు గాలిపటాలు ఎగురవేయడంపై ఆసక్తి చూపారు. మునుపెన్నడూ లేనంతగా పతంగులపై ప్రజలు ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అంతర్జాతీయ పతంగుల పండుగలో గతానికంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో హఠాత్తుగా జరిగినది కాదు. దీని వెనుక 20 ఏళ్లకు పైగా శ్రమ ఉంది. ఈ గాలిపటాల పండుగ గుజరాత్ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో 1989 నుండి అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, 2005లో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గుజరాత్ పతంగులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికను 2003లో అప్పటి ముఖ్యమంత్రి మోదీ సిద్ధం చేశారు. అది గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది. తమిళనాడులోని గాలిపటాల పరిశ్రమలపై అధ్యయనం చేసి, స్థానికంగా గాలిపటాల పరిశ్రమ అభివృద్ధికి వ్యూహాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి సీఎం నరేంద్ర మోదీ అధికారులను కోరారు. 2003లో నిపుణుల బృందం గాలిపటాల పరిశ్రమలు కలిగిన అనేక ప్రదేశాలలో సమగ్ర సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికంగా గాలిపటాల పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2003లో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని గాంధీ లేబర్ ఇన్స్టిట్యూట్లో గుజరాత్ కైట్ ఇండస్ట్రీ వర్క్ క్యాంప్ నిర్వహించారు. దీనిద్వారా గాలిపటాల కళాకారులు, పంపిణీదారులు, ప్రభుత్వ సంస్థలు, డిజైనర్లు, ఆర్థిక సంస్థల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించారు. ఈ వర్క్‌క్యాంప్‌కు భాను భాయ్ షాను కూడా ఆహ్వానించారు. భాను భాయ్ ప్రముఖ కైట్‌సర్ఫర్. 50 సంవత్సరాలుగా గాలిపటాలు సేకరించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అవసరమైన ముడి పదార్థాల లభ్యతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గాలిపటాల పరిశ్రమను మరింత సులభతరం చేయాలని మోదీ కార్పొరేట్ సంస్థలను కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గాలిపటాల పరిశ్రమను మోదీ అభివృద్ది చేశారు. గాలిపటాల తయారీ అనేది 2003-04 లో కుటీర, గ్రామీణ పరిశ్రమల స్థాయికి చేరింది. ఫలితంగా గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ కొత్త మలుపు తిరిగింది. 2003-04 సంవత్సరంలో గాలిపటాల పరిశ్రమ టర్నోవర్ రూ. 15-20 కోట్లుగా ఉంది. కైట్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఈ పరిశ్రమ పరిధి మరింత విస్తరించింది. 2007లో ఈ పరిశ్రమ టర్నోవర్‌తో రూ. 100 కోట్లకు చేరుకుంది. 2010నాటికి ఇది రూ. 400 కోట్ల పరిశ్రమగా మారింది. 2014 సంవత్సరంలో, గుజరాత్ గాలిపటాల ప్రపంచ వ్యాపారం రూ. 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గుజరాత్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా చెబుతారు. గుజరాత్‌లోని గాలిపటాల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. మోదీ అనంతర ప్రభుత్వాలు నేటికీ గాలిపటాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు? -
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో పది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్ల సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టైమ్‌టేబుల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే 20 సంక్రాంతి స్పెషల్ రైళ్లు సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..
పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజంతా మేకప్‌తో ఫ్రెష్ లుక్‌లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. బ్లష్ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్‌గా నేచురల్ లుక్ కావాలంటే బ్లష్ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్‌గా ఉన్నవారు బ్లష్‌తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ తో టచ్ అప్ చేయాలి. హైలైటర్ ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్ మేకప్ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్ ఐషాడో, లిప్‌స్టిక్‌తో పాటు చాలా తేలికపాటి బేస్ ఉంటుంది. దీనికోసం లైట్ హైలైటర్‌ని ఉపయోగించవచ్చు. మెరిసే కనుబొమ్మ గ్లిట్టర్ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. మాట్ లుక్ చాలా మంది సినీ తారలు మాట్ లుక్ మేకప్‌ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్ లుక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ డార్క్ లిప్‌స్టిక్ మీ మేకప్‌ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్‌స్టిక్ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్ లిప్‌స్టిక్ షేడ్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. -
Makar Sankranti 2023: పదపదవె ఒయ్యారి గాలిపటమా..
సంప్రదాయాలను చెడగొట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. చైనా మాంజాలూ అనవసర పోటీలతో గాలిపటాలకు అడ్డంకులేర్పరుస్తుంటారు. నిజానికి గాలిపటం ఎగుర వేయడం చలికాలంలో మంచి వ్యాయామం. సంక్రాంతి వేళ ఖాళీ పొలాల్లో పతంగాలు ఎగురేస్తే వినోదమూ ప్లస్ డి విటమిన్. గాలిపటం చుట్టూ ఎన్నో జీవనసత్యాలు. అది ఆకాశాన్ని అందుకోమని అంటుంది. కాని సూత్రం సరిగా లేకపోయినా దారం చేజారినా తనలాగే జీవితమూ గిరికీలు కొడుతుందని హెచ్చరిస్తుంది. దేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగే సమయం ఇది. పిల్లలకు గాలిపటాలు చాలా ఇష్టం. సంక్రాంతి గాలిపటం ఒక పసిడి జ్ఞాపకం. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్‌తో గాలిపటాలు తయారు చేస్తున్నారుగాని ఒకప్పుడు గాలిపటం అంటే రంగు కాగితమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయ రంగు.... డార్క్ కలర్ కాగితాలతో తయారయ్యి, తోకలు తగిలించుకుని దుకాణాల్లో అమ్మకానికి పెట్టి ఉంటే వాటి అందమే వేరు. పిల్లలకు తమ ఇష్టానికి తగిన రంగు గాలిపటం దొరికేది. ‘నీది ఎరుపు... నాది పచ్చ’ అని తగాదాలు లేకుండా గుర్తుగా ఇళ్లల్లో దాచుకునేవారు. మైదానంలో, మిద్దెక్కి ఎగరేసేవారు. గాలిపటం సం΄ాదించడానికి అమ్మ, నాన్నల దగ్గర మారాము చేసేవారు. గాలిపటం, పతంగి, కైట్... పేరు ఏదైనా ఎగిరే కాగితం పిట్ట అది. బాల్య కుతూహలం గాలిపటం ఒక బాల్య కుతూహలం. తాను ఎగరలేక΄ోయినా తాను ఎగిరించగలడు అనే ఇగో సంతృప్తికి సంకేతం. పక్షిలా ఎగరలేని మనిషి పక్షితో సమాంతరంగా ఆకాశంలో గాలిపటం ఎగురవేసి అబ్బురపడ్డాడు. అలా ఎగరడానికి అవసరమైన సూత్రాన్ని కనుగొన్నాడు. కాలాన్ని కూడా గమనించాడు. మితిమీరిన ఎండల కాలం, వానల కాలం గాలిపటం ఎగురవేయడానికి అనువైనది కాదు. ఒకప్పుడు దీపావళి ముగిశాక... అప్పటి నుంచి మొదలయ్యి ఫిబ్రవరి వరకు గాలిపటాలు ఎగుర వేసేవారు. ఇప్పుడు మెల్లగా అది సంక్రాంతి సీజన్‌గా మారింది. దానికి కారణం పొలాలు కోత పూర్తయ్యి ఖాళీగా ఉంటాయి. పల్లెల్లో జనం విశ్రాంతిలో ఉంటారు. సీజన్ అనుకూలంగా ఉంటుంది. సంక్రాంతితో ఎండ మొదలవుతూ ఉష్ణం ఒంటికి తగులుతూ ఉంటుంది. అందుకని ఇది గాలిపటాల సీజన్‌గా మారింది. ఒక్క తెలుగు ప్రాంతంలోనే కాదు... తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. హైదరాబాద్‌లో ఈ క్రీడ విఖ్యాతం. గుజరాత్లో ‘ఉత్తరాయణ్’ పేరుతో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రతాప చిహ్నం ఆధిక్య ప్రదర్శన చేయడం కూడా మనిషికి ఇష్టం. గాలిపటాలు ఎగురవేసి ఏది ఎక్కువ ఎత్తుకు ఎగరితే ఆ ఎగరేసిన మనిషికి ఆ కాసేపు ఆధిక్యం వస్తుంది. ‘కోయడం’ కూడా ఈ ఆటలో ఒక ఆధిక్యప్రదర్శనే. ఎగురుతున్న గాలిపటాల మీదకు వెళ్లి తమ గాలిపటంతో (దారంతో/మాంజాతో) కోసి దానిని నేలకూల్చడం గొప్ప. రాను రాను ఇలా కోతకు గురికాని దారం కోసం అంటే ప్రత్యర్థులు దాడి చేసినా తెగని దారం కోసం రకరకాల ప్రయోగాలు, పదార్థాలు కలిపిన దారం తయారు చేసి నేడు పక్షులకు, మనుషులకు ప్రమాదకరంగా మారి గాలిపటాల ఆటకే చేటుకాలాన్ని తెచ్చారు కొందరు. ఈ ఆధిక్య ప్రదర్శను పక్కన పెడితే గాలిపటం ఎగురవేయడం ఎంతో ఆహ్లాదం కలిగించే ఆట. గాలిపటం పాటలు గాలిపటం పాటలు సినిమాల్లో చాలా ఉన్నాయి. ‘తోడికోడళ్లు’లో ‘గాలిపటం గాలిపటం రయ్యిన ఎగిరే గాలిపటం’ అని అక్కినేని పాడతాడు. ‘కులదైవం’ సినిమాలో హీరో చలం ‘పద పదవే ఒయ్యారి గాలి పటమా’ పాడితే నేటికీ అది హిట్ పాటగా ఉంది. ‘చంద్రముఖి’లో ‘చిలుకా పద పద మైనా పద పద’ అని రజనీకాంత్ కూడా గాలిపటాలు ఎగురవేస్తాడు. గాలిపటంలో తత్త్వం కూడా మనిషి వెతికాడు. అదను మరిస్తే జీవితం తెగిన గాలిపటం అవుతుందని గ్రహించాడు. ఎంత ఎత్తుకు ఎగిరినా దారం లాంటి ఆధారం తప్పక ఉండాలని గ్రహించాడు. గాలిపటంలా మిడిసి పడకూడదని, చివరకు దానిలాగే నేలకు దిగాల్సి వస్తుందని బుద్ధి చెప్పుకున్నాడు. అపశ్రుతులు లేకుండా గాలిపటం మన దృష్టిని పైన ఉంచుతుంది. ముందు వెనుకా చూడ వీలు కల్పించదు. అందుకే పిల్లల చేత మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయించాలి. లేదా రెయిలింగ్ ఉన్న మిద్దెల మీదే ఎగుర వేయించాలి. గోడలు ఎక్కనివ్వరాదు. తెగిన గాలిపటాల కోసం కరెంటు స్తంభాల దగ్గరకు వెళ్లనివ్వరాదు. దారం వదిలేప్పుడు వేలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
సంక్రాంతి: శుభాలకు వాకిలి
మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు. ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం. మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి. సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు. సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు. కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి పండుగ’. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది. – డా. తంగిరాల విశాలాక్షి, – సోమంచి రాధాకృష్ణ -
కాలం మారింది.. హరిదాసులు అప్డేట్ అయ్యారు!
సంక్రాంతి నెల రావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. మోటారు వాహనాలపై తిరుగుతూ దానం స్వీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ హరిదాసులకు పూలు, పండ్లు, ధాన్యం ఇస్తుంటారు. రానురాను ప్రజల్లో భక్తిభావం తగ్గుతుందని, హరిదాసులు జీవించడానికి ఆశించిన విధంగా ఆదాయం రాకపోయినా తాతముత్తాతల నుంచి వస్తున్న ఈ వృత్తినే కొనసాగిస్తున్నామని కొవ్వలి గ్రామానికి చెందిన హరిదాసు మహేష్ అన్నారు. – దెందులూరు(ఏలూరు జిల్లా) -
పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!
ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది. నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్...కాట్’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ. కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే. నవీ ముంబైకి చెందిన సీమా టాంక్ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది. సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు. సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్ వేదికగా హెల్ప్‌లైన్ నంబర్స్, రెస్క్యూ టిప్స్ షేర్ చేస్తున్నాయి. ‘సేవ్ బర్డ్స్’ అనేది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది. -
కవన హేమంతం
హేమంత రుతువులో వచ్చే మకర సంక్రాంతి తెలుగువాళ్ల పెద్ద పండుగ. ముఖ్యంగా ఇది కృషీవలుౖరైన రైతుల పండుగ. పంటలు చేతికంది, ధాన్యరాశులు ముంగిళ్లలో పోగుపడే వేళ జరుపుకొనే అచ్చమైన అన్నదాతల పండుగ. అలాగని ఇది తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను వీలైనంత సంబరంగా జరుపుకొంటారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీనులు మొదలుకొని ఆధునికుల వరకు ఎందరో కవులు తమ కావ్యాల్లో సంక్రాంతి హేలను, హేమంత రుతులీలను అత్యంత హృద్యంగా వర్ణించారు. వర్షరుతువు ప్రారంభంలో వేసిన పంటలు చేతికందే నాటికి హేమంత ప్రభావం తారస్థాయికి చేరుకుంటుంది. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చలి వణికిస్తుంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా వీధుల్లో మంచు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. ‘అహములు సన్నములయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్;/ బహు శీతోపేతంబై/ యుహుహూ మని వడకె లోకముర్వీనాథా!’ అని పోతనామాత్యుడు తన భాగవత కావ్యంలో హేమంత శీతలతను కళ్లకు కట్టాడు. అలాగని, అంతటితోనే ఆగలేదు. ‘పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా/ బరువు లెట్టి యినుడు పశ్చిమాద్రి/ మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత/ జిక్కె జిక్కెననగ జిక్కకున్నె?’ అంటూ, చలి తాకిడి నుంచి తప్పించుకోవడానికే సూర్యుడు ఉరుకులు పరుగులు పెట్టి పడమటి కొండల్లో దాక్కున్నాడని తీర్మానించాడు. హేమంతపు చలిధాటి సూర్యుడినే భయపెట్టిందంటే, ఇక మానవమాత్రుల సంగతి చెప్పేదేముంటుంది? ఇలాంటి హేమంత శీతవేళ వచ్చే పండుగ మకర సంక్రాంతి. చలి తీవ్రతను తట్టుకోవడానికి జనాలు చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు వీధివీధినా ఊరుమ్మడి చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీ. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి వేళ ధాన్యరాశులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఒకవైపు గడగడ వణికించే చలి ఉన్నా, స్థూలంగా ప్రకృతి ఆహ్లాదభరితంగా ఉంటుంది. సంక్రాంతి శోభను ఎందరో ఆధునిక కవులు సైతం అత్యద్భుతంగా వర్ణించారు. ‘కళ్యాణకంఠి ఈ కన్నెసంక్రాంతి/ భోగాలబాల ఈ భోగి సంక్రాంతి/ వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ రాయప్రోలువారు సంక్రాంతి రాకడపై హర్షాతిరేకాలు ప్రకటించారు. సంక్రాంతికి కొత్త అల్లుళ్లను ఆహ్వానించడం, బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగించడం ఆనవాయితీ. ‘జిడ్డుదేఱిన వెన్నెలగడ్డ పెరుగు/ గరగిరకజాటు ముంగారు చెఱకురసము/ సంతరించితి విందుభోజనము సేయ/ రండురండని పిలిచె సంక్రమణ లక్ష్మి’ అని చవులూరించేలా వర్ణించారు ‘తెనుగు లెంక’ తుమ్మలవారు. సాహితీ ఉపాధ్యాయుడే కాక, స్వయంగా కృషీవలుడైన ఆయన సంక్రాంతిపై విరివిగా పద్యాలను అల్లారు. ఆధునికుల్లో జంటకవులైన పింగళి–కాటూరి ‘దినకరుడు శాంతుడై తోచె దినములింత/ కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె/... మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి/ సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె’ అంటూ ‘తొలకరి’ కావ్యంలో పుష్య సౌభాగ్యాన్ని వర్ణించారు. వీరు ఇదే కావ్యంలో సంక్రాంతి వేడుకలను వర్ణిస్తూ, ‘రండు మాయింటి కీరు పేరంటమునకు/ బొమ్మలెత్తును మా పిల్లయమ్మలార’ అంటూ సంక్రాంతి బొమ్మల కొలువుల వేడుకను ప్రస్తావించారు. దసరాకే కాదు, కొన్నిప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టడమూ ఆనవాయితీ. సంక్రాంతి బొమ్మల కొలువుల్లో ప్రధాన దైవం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అని పిలుచుకుంటారు. కాలపురుషుడే సంక్రాంతి పురుషుడిగా మకర సంక్రాంతినాడు భూమిపైకి దిగివచ్చి, భూలోక వాసులను పరిపాలిస్తాడని ఒక నమ్మకం. సంక్రాంతి రైతుల పండుగే కాదు, ముదితల పండుగ, ముగ్గుల పండుగ కూడా! ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వీధుల్లో ప్రతి ముంగిటా ముగ్గులు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముగ్గులు ప్రాచీన కళారూపాలు. కామశాస్త్రం ప్రస్తావించిన అరవైనాలుగు కళల జాబితాలో ముగ్గులు వేయడం కూడా ఒక కళ. తెలుగు కవిత్వంలో ముగ్గుల ప్రస్తావన నన్నయ నాటి నుంచే ఉంది. పాండవులు వారణావతంలోని లక్క ఇంటికి వెళుతున్నప్పుడు వారణావత పుర ప్రజలు వారికి భారీగా స్వాగతం పలికారట. స్వాగత మర్యాదల్లో భాగంగా ఇంటింటా ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దారట. ఆ ఘట్టంలోనే నన్నయ ‘అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు..’ అంటూ ముచ్చటైన పద్యం రాశాడు. ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడూ ముగ్గు ముచ్చట్లు చెప్పాడు. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, పేకాటల సందళ్లు ఒకవైపు కోలాహలంగా కొన సాగుతుంటే, మరోవైపు కవి సమ్మేళనాల వంటి సాహితీ కార్యక్రమాలు కూడా సందడిగా జరుగుతుంటాయి. సంక్రాంతి కర్షకుల పండుగే కాదు, కవుల పండుగ కూడా! సంక్రాంతి నాటికి ధాన్యరాశులే కాదు, కవనరాశులు కూడా తెలుగునేల మీద భారీగానే పోగుపడతాయి. వాటి వాసిని నిర్ణయించాల్సింది మాత్రం ప్రజలే! -
నర్మదా నదిలో పడవ మునక : ఆరుగురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం నుంచి 36 మందిని కాపాడి స్ధానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీమతల్లికి పూజలు చేసేందుకు మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్‌గావ్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులని చెప్పారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. -
మూడు రోజుల మహాపర్వం
ముద్దబంతులు, రంగవల్లులు, నేతి అరిశలు, గారెలు, బూరెల వంటి పిండి వంటల ఘుమఘుమలు, హరిదాసుల మేలుకొలుపులు, పశువుల మువ్వల పట్టెడల ధ్వనులు, గుంపులు గుంపులుగా జరుపుకునే కోడిపందాలు, ఆకాశంలో చుక్కలతో పోటీపడే రంగు రంగుల గాలి పటాలు మనకు కనువిందు చేస్తున్నాయంటే అది కచ్చితంగా సంక్రాంతి నెలే అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి.పెద్ద పండగ అని పిలిచే ఈ పండగ హడావుడి డిసెంబర్ 17 నుంచి జనవరి 16 వరకు ఉంటుంది. అసలు సంక్రాంతి పండగ అంటేనే ప్రకృతి పండగ. ప్రకృతితో మనిషి సహజీవనం చేస్తున్నాడని స్పష్టమైన సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. ముచ్చట గొలిపే గొబ్బిళ్లు సంక్రాంతి నెల పట్టగానే ఇంటిముందు వేసిన ముగ్గులో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టి వాటికి పసుపు కుంకుమతో అలంకారం చేస్తారు. ఆ గొబ్బెమ్మ మధ్యలో ముళ్లగోరింట, గుమ్మడి, ముద్దబంతి పూలను ఉంచుతారు. ఇంటిముందు తెల్లవారు జామున పెట్టిన ఈ గొబ్బెమ్మల్ని అసుర సంధ్య వేళ తీసి పిడకలాగా చేస్తారు. నెలరోజుల పాటు పెట్టిన ఈ గొబ్బెమ్మల పిడకలను భోగిపండగ రోజు పొయ్యి కింద పెట్టి ఆ మంటతో పాయసం చేస్తారు. తీర్చిదిద్దే ముత్యాల ముగ్గులు మామూలు రోజుల్లో ఇంటి ముందు ముగ్గు ఎన్ని గంటలకు వేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే పండగ నెలలో మాత్రం మా ఇంటి ముందే ముందు ముగ్గు ఉండాలని మహిళలు పోటీ పడి మరీ వేస్తారు. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఆ ముగ్గులకు అందమైన రంగులు అద్దడం ముచ్చట గొలుపుతుంది. సంక్రాంతి సందర్భంగా రథం ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తారు. శ్రీమద్రారమణ గోవిందో హరి అంటూ ఈ నెలలో మాత్రమే మన ఇంటిముందుకు వస్తారు హరిదాసులు. మెడలో పూలమాల, పట్టుపంచె, తలపైన పూల సజ్జ, చేతిలో చిడతలతో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ, ఇల్లిల్లూ తిరుగుతూ సందడి చేస్తారు హరిదాసులు. సంక్రాంతినెల మొత్తం హరిదాసులకు బియ్యం పోసి, పండగరోజు మాత్రం ప్రత్యేకంగా పిండివంటలు, ధాన్యాలు ఇస్తారు. గంగిరెద్దుల విన్యాసాలు అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టమని అంటుంటే, గంగిరెద్దులు చేసే విన్యాసాలు చూడాలంటే సంక్రాంతి నెలలోనే సాధ్యం. పెద్ద మూపురం ఉన్న ఎద్దుల కాళ్ళకి గజ్జెలు కట్టి, కొమ్ములకు పూలను చుట్టి, వీపుపైన అద్దాలతో కుట్టిన రంగురంగుల వస్త్రంతో ముస్తాబు చేసి ఊర్లోకి తీసుకు వస్తారు గంగిరెద్దుల వాళ్లు. అవి ఊళ్లోకి అడుగు పెట్టగానే అందరికీ దండాలు పెట్టి రకరకాల విన్యాసాలు చేస్తాయి. వీటిని చూసి ఆనందించిన వారు కానుకలు కురిపిస్తారు. భోగ భాగ్యాలనిచ్చే భోగిమంటలు... భోగిపండ్లు మూడు రోజుల ముఖ్య పండగలో మొదటి రోజు భోగి. ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువుల్ని తీసుకు వచ్చి వాకిలి ముందు మంటల్లో వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఈ మంటలతో శీతాకాలం చలి బారి నుంచి తప్పించుకోవడంతో పాటు ఇంట్లోని చెత్తాచెదారం కూడా వదిలిపోతుంది. భోగి రోజు సాయంత్రం చిన్నారులకు రేగుపండ్లతో భోగిపండ్లను పోస్తారు. చిన్నారులకు ఏదైనా బాలారిష్టాలు ఉంటే తొలగి పోవాలని ఆశీర్వదిస్తూ, పెద్దలు భోగిపండ్లు పోస్తారు. మహా పర్వదినం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి తన దిశ మార్చుకునే రోజును మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకు ప్రయాణిస్తాడు. ఈ రోజునే పెద్దల పండగ చేస్తారు. చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టి తమ గౌరవ మర్యాదలు చాటుకుంటారు. పతంగుల సంబరాలు పశువుల పండగ రోజునే చిన్నా పెద్దా అందరూ కలిసి ఉత్సాహంగా గాలి పటాలు ఎగరేస్తారు. అందమైన, విభిన్నమైన గాలిపటాలను ఎగరేసి సంబరాలు చేసుకుంటారు. గాలిపటాన్ని ఎగురవేసే దారాన్ని మనం ఎలా పట్టుకుని సమతులనం చేస్తామో, అదేవిధంగా జీవితాన్ని కూడా సమతూకంలో చూడాలని దీని అంతరార్థం. ఎనుములకు సింగారం... చేలల్లో ఉన్న కొత్త పంటను ఈరోజే ఇళ్లకు తీసుకు వస్తారు. పశువులకు పూజ చేసి, బండ్లను సింగారించి రైతులు భార్యా పిల్లలతో కలిసి పొలాలకు వెళ్లి ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకు వస్తారు. కనుమ రోజునే కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. మరికొన్ని చోట్ల ఎద్దుల పందాలు నిర్వహిస్తారు. మాంసాహారులు ఈ వేళ తప్పనిసరిగా మాంసాన్ని స్వీకరిస్తే, శాకాహారులు మినుములతో తయారు చేసిన గారెలు తినడం వాడుకలో ఉన్న సంప్రదాయం. – డి.వి.ఆర్. -
వైఫ్ ఆఫ్ రామ్
వినూత్న క్యారెక్టర్లు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీ మంచు. ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే సినిమాతో మరో కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో అబద్ధాన్ని నిజమని నమ్మే పాత్రలో కనిపిస్తారట లక్ష్మి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ‘ఈగ’, ‘బాహుబలి 1’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విజయ్ యలకంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంగీతం: రఘు దీక్షిత్, కెమెరా: సామల భార్గవ్, మాటలు: సందీప్ గుంటా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుహాసిని రాహుల్. -
జన్మకో శివరాత్రి
ఆఫీసులో పనిలేదు. నేను ఒంటరిగా ఖాళీగా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను, అన్యమనస్కంగా. నా మనసు తేలిక పడినట్టనిపించింది. ఎంతో సంతోషంగా వుంది. అకారణంగా ఉల్లాసపడుతోంది మనసు. గాలి మధురంగా సుతిమెత్తగా వీస్తూంది. మనసు దూది పింజెలా గాలిలో తేలిపోతోంది. ఏవిటీ విచిత్రం? వసంత ఋతువు వచ్చేసిందా? ఇంత తొందరగానా? జనవరిలోనే వసంతమా? తొందరేమిటి? మకర సంక్రాంతి వచ్చేసింది గదా? ఇరవయ్యో తారీఖున వసంత పంచమి, అరె, నిజమేనా ఐతే వసంతం వచ్చేసింది! కిటికీ లోంచి చూస్తుంటే తోటలోని ఓ మామిడి చెట్టు పూతమీద వుందని తెలుస్తూంది. నేను కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాను. నాకు హుషారుగా ఉంది. చేతులు నలుపుకుంటూ ఆలోచించాను, సాయంత్రం యింటికి వెడుతుంటే ఏం తీసుకువెళ్లాలా అని. మల్లెపూలు తీసుకు వెడితే బాగుంటుంది. రాత్రంతా మొత్తం యిల్లంతా మల్లెల గుబాళింపుతో మత్తెక్కిపోతుంది. ఛ.. నాకు మతి గాని పోయిందా? ఏభై అయిదేళ్ల వయసులో ఈ ఆలోచనలేమిటి? కిటికీలు లేని వంట యింట్లో ఉడుకుతూన్న మాంసం వంటకాల వాసనతో నిండివుండే యింట్లో – ఎపుడు ఏ ఋతువు మారుతుందో తెలుస్తుందా? పిల్లల జంఝాటంలో వుండే ఆమెకు మల్లెలు ముడిచే తీరికా కోరికా ఎక్కడ? అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చక్కగా బఠానీ, కాలీఫ్లవరూ తీసుకు వెడితే మంచిది. ∙∙ అంతలో తలుపు తోసుకు లోపలికి వచ్చి వార్తనందించారు స్టాఫు.‘‘అయ్యా! త్వరగా రండి. ఢిల్లీ డైరెక్టరేటు నుంచి మీకు ఫోనొచ్చింది. డైరెక్టరుగారు లైన్లో ఉండి, సేనాపతిగారిని పిలు– అంటున్నారు.’’ నా పేరు నిశాకర సేనాపతి. ప్రభుత్వంలో డెప్టీ డైరెక్టరుగా పనిచేస్తున్నాను. రిటైరవ్వడానికి యింకా రెండు సంవత్సరాల నాలుగు మాసాలు బాకీ వుంది.‘‘ఢిల్లీ నుంచా? నన్నెవరు పిలుస్తారు? అరె, ఆ కాల్ మరెవరిదో అయివుంటుందయ్యా!’’‘‘ఔన్సార్! మీకే ఫోన్..’’ ఢిల్లీ నుంచి నన్నెవరు పిలుస్తారు? అందులోనూ డైరెక్టరుగారు స్వయంగా ఫోను పట్టుకుని పిలుస్తున్నారు కాబట్టి వెళ్లక తప్పదు. మరో దారిలేదు.నేను మా డైరెక్టరుగారి గదిలోకి ప్రవేశించగానే డైరెక్టరుగారు అప్రయత్నంగానే కుర్చీలోంచి సగం లేచి నుంచున్నారు. నేనంటే ఆయనకొక ప్రత్యేకమైన గౌరవభావం ఉంది. ఆయన ప్రతీ మాటలో, కదలికలో అది ఇలా తొంగి చూస్తూ ఉంటుంది. ‘‘అహుజా గారు మిమ్మల్ని పిలుస్తూ లైన్లో ఉన్నారు’’అహుజా?నేను ఫోనులో ‘‘సేనాపతి స్పీకింగ్’’అటువైపు నుంచి అట్టహాసంగా నవ్వు వినిపించింది. – ‘‘అబె స్పీకింగ్ క్యా బోయ్.. మై జాన్ బోల్ రహా హూ...’’హఠాత్తుగా ముప్ఫై సంవత్సరాల క్రిందటి స్ఫురద్రూపం గుర్తుకొచ్చింది. నన్ను నేను మర్చిపొయి ‘‘అబె తూ జాన్ బోల్రహా హై? కహాసే?’’ఫోన్ పెట్టేసి నేను చూస్తుంటే డైరెక్టర్‌గారు నిలబడే ఉన్నారు. ఆయన ప్రక్కన మరో ముగ్గురు ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రిగారు స్వయంగా వాళ్లను పంపించారు. చీఫ్ సెక్రెటరీగారు ఆజ్ఞాపించగా వారు వచ్చారు.‘‘అయ్యా! నమస్కారం ఢిల్లీ నుంచి వార్త వచ్చింది, ఆహుజా సాబ్ వస్తున్నారని. ఆయనతో మరో ఏడుగురు అధికార్లు కూడా వస్తున్నారు. ముగ్గురు ఆఫీసర్ల కోసం హోటలు ఓబెరాయ్‌లో రూములు బుక్ చేశాం. కానీ అందులో ఒకరు యిక్కడ తమ స్నేహితుల యింట్లో ఉంటామంటున్నారు.’’ ‘‘నిశాకర్ బాబు. అహుజాసాహెబ్ మంచి స్నేహితులండి.’’ డైరెక్టరు గారు కలగజేసుకుని చెప్పేరు.‘‘కూర్చోండి సార్!’’ అంటూ ఆ వచ్చిన అధికార్లు నాకోసం ఒక కూర్చీని దగ్గరగా లాగేరు. నేను కూర్చునే వరకూ అంతా నిలబడే ఉన్నారు.డైరెక్టరుగారు బెల్ కొట్టి కాఫీ ఆర్డరు ఇచ్చి, నా గుణవర్ణనను సాగించేరు. ఈ వుదయం నేనొక ఫైలు విషయం మీద మాట్లాడాలనుకుని వచ్చి తిరిగి వెళ్లిపోయాను. కారణం డైరెక్టరుగారు అప్పుడు కాళ్లు బార జాపుకుని అమెరికాలో వున్న వాళ్ల అమ్మాయితో కష్టసుఖాలు మాట్టాడుకుంటున్నారు. ‘‘మీకు మరే రకమైన ఇబ్బంది వుండదు. నిశాకర్బాబు అహుజా సాహెబ్‌కి కొద్దిగా నచ్చచెబితే సరిపోతుంది. మీరా రకంగా నిశాకరబాబు గారికి చెప్పండి.’’ ‘‘విషయం ఏవిటంటే సార్.. అహుజా సాహెబు కీలక వ్యక్తి. ఆయన ఎలా చెబితే అలా జరుగుతుంది. మేం వరదల గురించి ఒక నివేదికను పంపేము. ఆ తర్వాత లెక్క జూస్తే మేం ఇచ్చిన ఫిగరు సరికాదని తేలింది. అన్ని హెడ్స్ క్రిందా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బొత్తిగా చాలడంలేదు. అందువల్ల కనీసం ఎంత లేదన్నా మరొక పదికోట్లు పెంచాల్సి వుంటుంది. ఈ విషయం అహుజాగారికి చెప్పడానికి ఎవరికి సాహసం రావడం లేదు. అలా చెప్పిన వాడిని అహుజాగారు నమిలి మింగేస్తారని వాళ్ల భయం. గతంలో ఒకసారి ఆ రుచి చూసిన వాళ్లే వీరంతా.’’ ‘‘సామల్ బాబూ! మీరుండండి. సార్‌కి నేను వివరంగా చెబుతాను. అదేం లేదు సార్! అహుజా సాహెబు మీకు సన్నిహితులు. మా రివైజ్డు ఎస్టిమేటునొకసారి చూడమని చెప్పండి చాలు. నేను మీకు ఆ కాపీని యిస్తున్నాను. దానిని మీరాయనకు చూపించండి. చూస్తేచాలు ఆయనకు విషయం అర్థం అవుతుంది. ఒక వేళ ఏదైనా అడగాలనుకుంటే, నేను.. అంటే నిరంజన్ ఖుంతియా అక్కడే హాజరుగా వుంటాను.’ డైరెక్టరు అన్నారు ‘‘సార్ తమరు స్వయంగా వెళ్లకపోతే..’’‘‘ఉండండీ, మీకేం తెలుసు? నేను లేకపోతే అహుజా గారిని ఫేస్ చెయ్యలేరు. తర్వాత నాకేసి చూసి ‘‘అలా అయితే నడవండి సార్ ముందుగానే అంతా చూసి, మొత్తం ప్రోగ్రాం సిద్ధం చేసి ఉంచుదాం!’’నేను మా డైరెక్టరుగారి అనుమతి కోసం అడిగాను – ‘‘సార్ నేను వెళ్లనా?’’‘‘సార్! వెళ్లండి సార్! ఇది దేశం పని కదా?’’నాకు నమ్మబుద్ధి కావడం లేదు. బహుశా ఆయన వెళ్లమన్నది ఖుంతియా బాబునేమో! నాకు కాళ్లు తేలిపోతున్నట్టు అనిపించాయి. నన్ను వాళ్లు గాలిలో ఎక్కడికో నడిపిస్తున్నారనిపించింది.ఒబెరాయ్‌లో కూర్చోబెట్టి వాళ్లు తర్ఫీదు యిస్తుంటే, నేను గుడ్లగూబలా చూస్తూ అన్నింటికి ఔనంటూ ఉండాలన్న మాట. ఖుంతియా అన్నారు – ‘‘సార్, నేను మీ అనుమతి లేకుండా డిన్నర్ కోసం ఆర్డరిచ్చాను’’ ‘‘ఐయామ్ సారీ! నేను కొంచెం ముందుగా వెళ్లకుంటే రేపటికోసం ఏర్పాట్లు జరగవు!’’ ‘‘ఔను.. ఆ మాట నిజమే’’ అన్నారు సామల్.ఖుంతియా కోపంగా అన్నారు – ‘‘హాత్, ఆ మాటా నిజమే! మనం వుండగా సార్ ఏర్పాట్లు చేయాలా? సార్! ఏమేం ఏర్పాటు చెయ్యాలో చెప్పండి. మేం చేస్తాం. రేపు లంచ్ యిక్కణ్ణుంచే తీసుకువెడితే ఎలా ఉంటుంది సార్? అంటే అహూజా సాబ్గారి ఇష్టాయిష్టాలు ప్రకారం.. కావలసినవన్నీను.’’ ‘‘సార్‌ని యివన్నీ అడగడవేవిటి? మనం మొత్తం ఫ్యామిలీ కోసం తీసుకుంటాం. ఇంట్లో తయారైనట్లుగానే ఉంటాయి వంటకాలు. హోటల్ తిండిలా వుండనే ఉండదు. ఇవాల్టి నుంచి 5271 వెహికలు సార్ నిమిత్తం మూడురోజుల పాటు ఉంచండి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు బిస్వాల్గారికి చెప్పండి. జీప్తో పాటు మరో యిద్దరు స్టాఫ్‌తో డ్యూటీలో సిద్ధంగా ఉండమని.’’నేను తాపీగా దృఢ స్వరంతో అన్నాను – ‘‘మీరు నన్ను కాస్తంత మా యింటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా? అంతకన్నా మీరేం చెయ్యనక్కర్లేదు. తర్వాత రేపు ఏరోడ్రోమ్కి వెళ్లే ముందు నన్ను పికప్ చేస్తే చాలు, మీకు వీలయితే. లేకపోయినా ఫరవా లేదు. నా ఏర్పాట్లు నేను చేసుకుంటా.’’‘‘సార్! మీకు కోపం వచ్చిందనుకుంటాను. మా ఉద్దేశం అదికాదు! నేను సార్‌ని యింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను.’’‘‘అవసరం లేదు. మీరు మీ ఏర్పాట్లు చూసుకోండి. రానున్న యేడుగురు అధికార్లకూ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. డ్రయివరుకి చెబితే అతను నన్ను డ్రాప్ చేసి వస్తాడు.’’5271 వెహికలు డ్రయివర్ని పిలిపించి ఖుంతియా చెప్పారు – ‘‘అరె సుదామ్! నువ్వు సార్ దగ్గర డ్యూటీలో ఉండు. బన్వారీ నుంచి నీకు కావాల్సిన పెట్రోలు తీసుకో!’’ నేను కార్లో కూర్చుని ఆలోచించాను.‘జ్ఞాన్ ప్రకాష్ అహూజా! నువ్వెంతగా ఎదిగిపోయేవు? ఇంత పవరుందా నీ చేతిలో? నిన్ను నా యింట్లో ఉంచుకోవడమంటే మహాప్రభువుని యింట్లో ఉంచుకున్నట్టేను. ఇవాల్టి నుంచే వీళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రేపు ఏమవుతారో ఏమిటో?’‘‘సుదామ్! కొంచెం అలా బజార్లోకిపోనీ!’’ నిర్జన రాస్తాలో అదే చల్లని గాలి మెలమెల్లగా వీస్తూంది. ఆ ఎదురుగా రెక్కలు చాచుకున్న నీలాకాశం. కాలి ఫ్లవరు, బఠాణీ, టమాటా, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. రేపు రోజే వేరు. రేపు యిల్లంతా శుభ్రపరచుకోవాలి.మంచి ఉత్సాహంగా యింట్లోకి అడుగుపెట్టి, మాటల మధ్యలో అహూజా రాక గురించి చెప్పేను. ఢిల్లీ నుంచి ఎవరొస్తున్నారో మా పిల్లలు ఊహించలేకపోతున్నారు. మా ఆవిడ నిర్వికారంగా కూర్చుని నేలకేసి చూస్తు అంతా వింటూంది, మాటామంతీ లేకుండా. ఉత్కంఠ ఉత్సాహం బొత్తిగా ఉండవు ఆవిడ అంతే.‘‘నువ్వేమీ మాట్లాడవేవిటి? రేపు ఏమేం కావాలో చెబితేకదా అవి ఏర్పాటు చెయ్యచ్చును.’’ ‘‘ఇంకేం చెప్పమంటారు? అక్కర్లేని తద్దినాన్ని నెత్తినేసుకుని వచ్చారు. అంత పెద్దాయన్ని చర్చల కోసం మన యింటికే ఎందుకు తెస్తున్నట్టు?వాళ్లందరి మంచీ మర్యాదా ఎవరు చూస్తారు? రాత్రి యింటికొచ్చి చల్లగా వార్త చెప్పికూర్చున్నారు. ప్రొద్దున్నే తీసుకొచ్చి నా నెత్తిన కూర్చోబెడతారు. ఇవన్నీ ఎలా చెయ్యాలి? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాకు రిక్షా ఏర్పాటు చెయ్యండి. ఓ మూడురోజులు మా మావయ్య యింట్లో వుండి వస్తాను, ఎన్నిసార్లో రమ్మని చెప్పాడు.’’నాకు చెమటలు పట్టేశాయి. నిజమే, నేననుకున్నంత సులువేంకాదు అంత పెద్దవాడికి ఆతిథ్యం యివ్వడం. నేను కళ్లు తేలేసుకుని కూర్చున్నాను. పిల్లలు చల్లగా జారుకున్నారు. పెద్ద విపత్తు యేదో మీదపడనుందని వాళ్లకు అర్థమయింది.అతి కష్టం మీద ఆవిడను రాజీకి తీసుకరాగలిగేను. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే ప్రణాళికను తయారు చేసుకోవచ్చును. ‘‘చూడు, అహూజా ఎంత పెద్ద అధికారి అయినా అతను నాకు స్నేహితుడు. అతనికి అంటూ ప్రత్యేక ఏర్పాట్లు యేమీ చెయ్యనవసరం లేదు. నేనాలోచిస్తున్నది అతని భార్య గురించి. నా భయమంతా ఆమెకు ఎలా మర్యాదలు చేయడమా అని!’’ ∙ ‘‘వాళ్లు రాంగానే కప్పు చాయి యిస్తావు. మన యింట్లో వున్న పెద్దకప్పులు సరిపోతాయా?’’‘‘ఎక్కడ కూర్చోబెట్టాలి? సోఫాదిళ్ల అవస్థ ఎలా వుందో చూస్తున్నారా? నేను ఎన్నిసార్లో మీకు చెప్పాను, విన్నారు కాదు. ఇప్పుడు మన దరిద్రమంతా బయటపెట్టుకోవాలి.’’ ‘‘ఇంకా వినండి. వాళ్లు డైనింగు టేబిలుకి అలవాటుపడ్డవాళ్లు. మన టేబిలుకి ఒక కాలు లేదు. దాన్ని తీసుకొచ్చిన రోజు నుంచి దాని మీద అక్కర్లేని వస్తువులన్నీ పెట్టాం. క్రిందపెట్టెలూ. కుర్చీలు ఏనాడో విరిగి మూలన పడ్డాయి. పిల్లలు డైనింగ్ టేబిలు కావాలంటూ ఎప్పట్నుంచో చెబుతున్నారు, విన్నారా మీరు? ఇప్పుడు క్రింద పీటలు వేసి కూర్చోబెడతారా? పోనీ ఆ పీటలయినా ఉంటేను కొంపలో?’’ నా తల తిరిగిపోయింది.‘‘భోజనంలోకి ఏం వడ్డిస్తారు? అప్పడాలు, వడియాలు, తోటకూర వేపుడూనా? వాళ్లకు యిష్టమయిన వంటకాలు ఏమిటో మీకు తెలుసా? ఒక వేళ తెలుసున్నా అవన్నీ వండి వార్చడానికి మనుషులేరి? నా వల్లకాదు. ఎందులో పెడతారు? సీమవెండి కంచాల్లోనా?’’నేను కళ్లూ చెవులూ మూసుకున్నాను. చెమటలతో నా నుదురు తడిసి ముద్దయింది. ఆవిడ మాట ప్రకారం అసంభవ కార్యక్రమం యిది. నిజంగా నాకు కోర్టులో మరణశిక్ష విధించినట్టుగా ఉంది. నేనీ రాత్రే చచ్చిపోతానా? ఉదయాన్నే అహూజా నాకు దండవేసి వెళ్లిపోతాడా? అలాగైతేనే నయం. అన్ని లోపాల్నీ దాచుకున్నట్టూ గౌరవాన్ని దక్కించుకున్నట్టూ అవుతుంది. ‘‘నా మాట విని, యేదో వంక చెప్పి వాళ్లని ఒక హోటల్లో దింపండి. ఒకసారి మన యింటికి తీసుకుని వస్తే, నేను పక్కింటి మంగతాయారు యింటి నుంచి కప్పులూ, ప్లేట్లూ పట్టుకొచ్చి టీ బిస్కెట్లు యిచ్చి సాగనంపుతాను.’’నా గొంతుక ఎండిపోయింది. అతి కష్టం మీద నా మనసులోని మాట చెప్పేను.‘‘వాళ్లు మన యింట్లో ఉంటారు.’’ ‘‘ఏవిటీ? ఇక్కడ ఉంటారా? ఎక్కడుంటారు? డాబాపైనా? మెట్లమీదనా? సాబ్ యిక్కడే మిగతా వారితో కలిసి వుండడమే మంచిది. మాయింట్లో వుంటే ఆయనకు యిబ్బందేను.’’ ‘‘ఆ విషయం మేం ముందే ఆలోచించాం. ఆయన వ్యవహారశైలి మేం ఢిల్లీలో చూసేం కదా? అరెబాబా! ఎంత టిప్ టాప్ ఆఫీసరు? కాస్తంత తేడా వస్తే తినేస్తాడు. ఆయనతో వ్యవహారం మాటలుకాదు.’’‘‘సామల్ నీకు అర్థం కాలేదా? నీకు కామన్సెన్సు లేదు. సార్, మీరు మరొకలా అనుకోకండి. అతను కొంచెం తాగేడు. సార్, నేను ఊరికే కంపెనీ యిద్దామని కూర్చున్నాను. విషయం ఏవిటంటే, ఒకవేళ అహూజా సాహెబ్ మీ యింట్లో వుండేందుకు నిర్ణయించుకునే వుంటే, ఆయన రాజీపడేది ఉండదు. అహూజా గారి నిర్ణయం మారడమంటూ ఉండదు. అందువల్ల మీ యిబ్బందులు ఏవిటో చెబుతే వాటిని సవరిద్దాం.’’ ‘‘ఒక యిబ్బంది అయితే చెప్పొచ్చు. అన్నీ యిబ్బంది గానే వున్నాయి. ఉండడానికి, తిండికీ, పడకకీ, స్నానానికి అన్నీ యిబ్బందులే. ఇల్లు కూడా ప్రభుత్వం వారిదేను. సీలింగు పెచ్చులూడి ఊసలు బయట పడి కనబడుతున్నాయి. తలుపులకు రంగు వేసి ఏనాడో అయింది. గోడలు నాచుపట్టి ఉన్నాయి. కిటికీలకు అద్దాలు లేవు. ాయిఖానాలో ఫ్లష్ అవుట్ లేదు. ఫ్యాను తిరగడం లేదు.’’‘‘అర్థమయింది. యు ఆర్ రైట్సార్! అహుజా సాబ్ అక్కడ ఉండలేరు. ఉంటే మాకు తలలు öట్టేసినట్టవుతుంది.’’సామల్ బుర్ర బరుక్కుని అన్నాడు– ఖుంతియాతో, ‘‘సార్, మీ ఇంట్లో ఉంటే యిబ్బంది ఉండదనుకుంటా.’’ ఖుంతియా ఎగిరి గంతేస్తూ అయిడియా అంటూ అరిచాడు. ‘‘ఐడియా! సామల్! ఐడియా! ఈ మూడు రోజులు సార్, తమ క్వార్టరు వదిలేస్తారు. నేను సర్క్యూట్ హౌస్‌కి వెళ్లిపోతాను. నేను ఒక్కణ్నే ఉంటున్నాను. మా ఆవిడ అస్సాం వెళ్లింది. నెల రోజుల తర్వాత గానీ రాదు. మంచి అయిడియా, తెలిసిందా సార్! మీరు మరేం ఆలోచించకుండా మా ఇంటికి మారిపోండి. అక్కడొక పని కుర్రాడిని ఫ్యూను లాగ కూర్చోబెడదాం. వాడే వంటా వార్పూ అన్నీ చేస్తాడు.’’ ‘‘పిల్లలు, వాళ్ల పుస్తకాలు, మా యితరత్రా వాడుకునే సామాను వెళ్లినా ఫరావాలేదు కదా?’’‘‘నో ప్రాబ్లమ్! మూడు రోజులు మీరు ఒక పిక్నిక్కి వెడుతున్నారనుకోండి! ఆ విధంగా మీ సామానంతా ఓ రెండు పెట్టెల్లో సర్దుకుంటే సరి! త్వరపడండి..’’అతనికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకర్థం కాలేదు– ‘‘మీ ఋణం తీర్చుకోలేను’’‘‘ఏమిటి మీరలా అంటారు? మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మేం మీకోసం.. అదే అహుజా సాబ్ కోసం – యేదేనా చేయగలం!’’ఖుంతియా గారింట్లో రాత్రి ఒక గంట సమయం అటూ యిటూ తిరిగాం. మెరిసిపోయే టేబిలు, అద్దం, సోఫా, మూడు పరుపులు, పడక గదిలో డన్లప్ పరుపులు, ముందు గదిలో కార్పెట్టు. పెద్ద బరువుని దించుకున్నట్లయింది నాకు. వీస్తున్న గాలి కూడా హాయి గొలుపుతూంది. కిటికీ లోంచి వస్తూన్న పూల వాసన యిల్లంతా నిండిపోయింది. వసంతపు వెల్లువ నిలువునా ముంచెత్తింది. నా శరీరం, మనసు, ప్రాణం పులకించిపోయేయి. ఇంతటి సౌభాగ్యానికి నోచుకున్న ఆనందంతో నాకు నిద్రపట్టలేదు ఆ రాత్రంతా.తెలతెలవారుతుండగానే వెచ్చటి తేనీటి వాసన మేలుకొలుపు పాడింది. పని కుర్రాడు కప్పు సాసరుతో టీని అందించాడు పడగ్గదిలో. పిల్లలు ఉత్సాహంగా తిరుగుతున్నారు యిల్లంతా. మా ఆవిడకు యిదంతా అలవాటు చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. ఇంటి చూట్టూ పెద్దతోట. తోటనిండా పూలు. ఇల్లంతా పూలవాసన. నాకు రెక్కలొచ్చినంత సంబరం కలిగింది. గాలిలో పక్షిలా తేలగలననిపించింది. పిల్లలు, బ్రెడ్డు, బట్టరు ఎగ్గు తింటూ కనిపిస్తున్నారు. వాళ్ల మొహాలు ఉదయాన్నే లేలేత ఎండకు వికసించిన మొగ్గల్లా మెరుస్తున్నాయి.ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకున్న నా భార్యాపిల్లలు పెద్దింటి, కాదు గొప్పింటి గొప్ప వ్యక్తుల్లా యేదో కలలోలా చాలా సుకుమారంగా మనోహరంగా కనిపిస్తున్నారు. అపూర్వ వసంతం యింటాబయటా లోలోపలా. ఏభైయేళ్ల మధ్యకాలంలో యిటువంటి మరచిపోలేని వసంతాన్ని అనుభవించి ఉండలేదు. నాకు తెలుసు.. ఈ వసంత ఋతువు మూడు రోజులేనని! ఇందులో కొంత దగా, కొంత మోసం, కొంత ఆత్మవంచన దాగివున్నాయని కూడా నాకు తెలుసు. ఇతరుల నాటకంలో మేం కొద్ది పాత్రలమేనని కూడా తెలుసు. కానీ వసంతానుభవం మాత్రం మి«థ్యకాదు. అయితే, మధ్యమధ్య ఎంతో కొంత అనుతాపం కూడా కలుగుతూంది కలుపుమొక్కల్లా. దీని తరువాత ఏమైంది? అహూజ్సాబ్ వచ్చేరా? వెళ్లేరా? ఈ విషయాల గురించి మీరాలోచిస్తున్నారా? వాటికంత ప్రాధాన్యత ఉందా? నేను మూడు రోజులపాటు ఉచితంగా వాళ్లతో సమానంగా ధౌళి, కోణార్క్ తిరగడం, పక్షిలా ఎగిరినట్లు వేగంగా కదలడం, ముప్ఫై సంవత్సరాల గతాన్ని ఒక్క అంగలో దాటడం, సరిగ్గా ముప్ఫై సంవత్సరాల క్రిందటి చాపల్యాన్ని నా కళ్ల ముందుకు తెచ్చుకోవడం ప్రాధాన్య విషయం కాదా? మేం మాత్రం ఉద్వేగపూరిత ఉన్మత్త వసంతంలో నిమగ్నమై ఉంటిమి అన్న విషయం యదార్థం.వసంతం వెళ్లిపోయింది, మరిరాదు. కిటికీలు లేని వంటిల్లు జీవితం కూడా ముగిసిపోతున్నట్లేను.ఒడియా కథల సంకలనం ‘తరగని చీకటిరాత్రి’ సౌజన్యంతో.. -
లండన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
లండన్: లండన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులందరూ ఒకే చోట చేరి సంక్రాతి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. చిన్నారుల బోగి పళ్ళ కార్యక్రం వీక్షకులను అలరించింది. నూతన పరిచయాలతో కూడిన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక నృత్యాలతో ఆడి పాడారు. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు అధికంగా నివసించే లండన్‌లో ఇలాంటి పండుగలు జరుపుకోవటం ద్వారా యావత్ బ్రిటన్‌లోని తెలుగు వారికి, ప్రవాస భారతీయులకి చేరువవటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని యుక్తా కార్యవర్గం తెలిపింది. రానున్న సంవత్సరంలో మరిన్ని జనరంజకమైన కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారి సమైక్యతకు, గుర్తింపుకు కృషి చేయనున్నట్లు యుక్తా నూతన అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2016-18కుగానూ ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు - ప్రసాద్ మంత్రాల ఉపాధ్యక్షుడు - రాజశేఖర్ కుర్బా కార్యనిర్వహణాధికారి - సత్య ప్రసాద్ మద్దసాని కోశాధికారి - నరేంద్ర మున్నలూరి మీడియా, సామాజిక మాధ్యమాలు - రుద్ర వర్మ బట్ట సాంఘిక సంబంధాలు - బలరాం విష్ణుభొట్ల ఐటి - అమర్నాథ్ రెడ్డి చింతపల్లి, ఆదిత్యవర్ధన్ అల్లాడి, కృష్ణ యలమంచిలి సాంస్కృతిక విభాగం - పూర్ణిమా రెడ్డి చల్లా వాణిజ్య విభాగం - ఉదయ ఆర్యన్ ఆరేటి క్రీడలు, సామాజిక కార్యక్రమాలు - కృష్ణ సనపల, సుధీర్ కొండూరు అధికార ప్రతినిధి - శ్రీ సత్య ప్రసాద్ కిల్లి గీతా మోర్ల, డాక్టర్ అనిత రావు, డాక్టర్ పద్మ కిల్లి ట్రస్టీలు గా వ్యవహరించనున్నారు. -
'కైట్స్ ఎగరవేయడం నా చిన్నప్పటి ప్యాషన్'
ముంబై: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను గాలిపటం ఎగరవేస్తున్న ఫొటోను ఆయన గురువారం ట్విట్టర్లో షేర్ చేశారు. చిన్నప్పుడు గాలిపటాలు ఎగరవేయడం తనకెంతో ఇష్టమని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సాధారణంగా గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. 'పీకే' సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ఆమిర్‌ఖాన్ ఇటీవల మతఅసహనంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ను తొలగించారు. Wishing everyone a very happy Makar Sankranti!!! Flying kites is one of my childhood passions! Love. a. pic.twitter.com/VaWNc0Gudw — Aamir Khan (@aamir_khan) January 14, 2016 -
పందెం.. పరుగు
పక్క జిల్లాకు వెళ్తున్న కోడిపందేల రాయుళ్లు సత్తుపల్లి బిర్రు శీతానగరంలో... మరోవైపు లక్షల్లో పేకాట పల్లెల్లో సందడే సందడి సత్తుపల్లి : సంక్రాంతి వచ్చేసింది. పండుగ సరదాలు తీర్చుకునేందుకు పందెం రాయుళ్లు పక్క జిల్లాలకు తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో కోడిపందాల సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈసారి పందాలు జరుగుతాయో.. లేదో అంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారి కోడిపందాలకు అనుమతి వస్తుందని పందెం రాయుళ్లు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ డబ్బులతో ఆంధ్రలో పందాలు కాయాల్సి వస్తోందని సరదా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శీతానగరంలో సత్తుపల్లికి చెందిన కొందరు పందెం రాయుళ్లు బిర్రు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోతునూరు, ఉండీ భీమవరం, నాగిరెడ్డిగూడెం, కళ్లచెరువు, చింతంపల్లి, ముల్కలంపాడు, ధర్మాజీగూడెం, కలరాయిగూడెం, కృష్ణాజిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్సాహంగా.. ఉల్లాసంగా సంక్రాంతి సందర్భంగా మూడురోజులు పందాలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎక్కడ చూసినా చంకలో కోడిపుంజు పట్టుకొని పందాలకు వెళ్లేవాళ్లే ఈ ప్రాంతంలో కనిస్తున్నారు. కోడి పందాలను వేసేందుకు.. తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో పల్లె ల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద యం నుంచే పందాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆరా తీసే పనిలో పందెం రాయు ళ్లు నిమగ్నమయ్యారు. పట్టణాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. లక్షల్లో కోడి కోసాట ఉదయం పూట కోడి పందాలు అయిపోగానే రాత్రి వేళ్లల్లో ప్లడ్‌లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతోందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోన, బయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందాలు ఓవైపు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసాహారం, బిర్యానీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. రాత్రి వేళ్లల్లో జనరేటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ నిఘా ఉన్నా.. కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినా పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గురు, శుక్రవారాల్లో సత్తుపల్లి డివిజన్లో చిన్నచిన్న పందాలు ఎక్కడపడితే అక్కడ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది పండుగ మూడురోజులు పోలీసులు పందాలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ చేస్తున్నా పందెం రాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందాల స్థావరాలను చేరుకుంటున్నారు. ఒక్కోసారి పోలీసులకు పందాలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి అటు పోలీసులను పంపించి వేరేచోట దర్జాగా పందాలు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పండగ మూడురోజులు కోడిపందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు డిమాండ్ చేయడం గమనార్హం. -
సంక్రాంతి సంబురం
నేడు సంక్రాంతి రేపు కనుమ నిజామాబాద్‌కల్చరల్: మూడు రోజుల ముచ్చటైన పండుగలో మొదటిరోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే చిన్నా,పెద్దా అందరూ లేచి, ఒంటికి నువ్వులనూనె రుద్దుకొని స్నానాలు ఆచరించారు. పిల్లలకు నేరేడుపళ్లు, చెరుకుముక్కలు, బంతిపూలతో భోగి(బోడు) పళ్లను పోశారు. యువతులు, మహిళలు పొద్దున్నే లేచి ఇళ్లముందు ముగ్ధమనోహరమైన ముగ్గులు వేశారు. అందమైన రంగులు అద్ది.. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టారు. పాలను పొంగించి భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. భగవద్భక్తి పూజా కార్యక్రమాలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు ఇంటిం టికి తిరుగుతూ హరినామస్మరణ చేస్తూ.. బసవన్నను ఆడిస్తూ.. సందడి చేశారు. వారికి తోచిన ధనధాన్యాలను దానం చేశారు. హరిదాసులు సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ముందుకు సాగారు. బసవన్న సైతం అందరినీ దీవించారు. గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ పర్వదినాలను జిల్లావాసులు సంబురంగా జరుపుకోనున్నారు. పతంగులు ఎగరేసిన యెండల వినాయక్‌నగర్ : పండుగ కంటే నెల రోజుల ముందు నుంచే చిన్నారులు పతంగులతో సందడి చేస్తున్నారు. ఇక భోగి నాడు వీరి జోరు మరింత ఎక్కువైంది. యువకులు,చిన్నారులు దాబాలపెకైక్కి గాలిపాటలను పోటాపోటీగా ఎగురవేశారు. ‘పతంగుల పండుగ’ కార్యక్రమంలో భాగంగా గాయత్రీనగర్‌లో బీజేపీ మాజీ శాసనసభా పక్షనేత యెండల లక్ష్మీనారాయణ కూడా యువకులతో కలిసి పతంగులను ఎగురవేశారు. యువమోర్చ నగర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్‌లో స్థానిక యువకులతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించే పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో యువ మోర్చ జిల్లా అధ్యక్షుడు గాదె కృష్ణ, నాయకులు రోషన్‌బోరా, సంతోష్‌గౌడ్, సుభాష్‌గౌడ్, అనిల్, చరణ్, సృజన్గౌడ్, టింకుల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బెటాలియన్‌లో అంబరాన్నంటిన సంబురాలు డిచ్పల్లి : డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్‌లో సంకాంత్రి సంబురాల్లో భాగంగా బుధవారం భోగి పర్వదినాన్ని సం ప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే సందడి మొదలైంది. కమాండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకట్రాములు, అమృతరావు, ప్రసన్న కుమార్ దంపతులతో పాటు బెటాలియన్ సిబ్బంది భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కమాండెంట్ శ్రీనివాసరావు ముం దుగా భోగి మంటలు వెలిగించారు. కమాండెంట్ సతీమణి రజిని ఆధ్వర్యంలో మహిళలు కొత్త కుండల్లో పాలు పొంగించారు. అనంతరం బెటాలియన్‌లో ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, యువతులు కోలాటం ఆడారు. సంప్రదాయబద్ధంగా చిన్నారులపై భోగి(బోడు) పండ్లు పోశారు. సంప్రదాయ పిండి వంటలు తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళలు మంగళహారతులతో శ్రీలక్ష్మి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వారు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ సంబరాల్లో బెటాలియన్ బీడబ్ల్యుఓ మహేందర్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.