Malaika Arora Khan
-
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్‌తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్‌ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్‌ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్‌గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
-
రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?
స్టార్ హీరో తమ్ముడు, ప్రముఖ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆదివారం రాత్రి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇంతకీ ఎవరా నటుడు? ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.. నటుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1998లోనే నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నాడు. 2017 వరకు వీళ్లు సంసారం చేశారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. మలైకా- హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. అటు అర్బాజ్.. నటి జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లు ప్రేమలో ఉండి ఇటీవలే బ్రేకప్ చెప్పాడు. అయితే కొన్నిరోజుల నుంచి అర్బాజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) అయితే పెళ్లి నిజమా కాదా? అని అందరూ అనుకున్నారు. తాజాగా ముంబయిలోని తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్‌తో నిఖా చేసుకున్నాడు. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అర్బాజ్ పెళ్లిలో అతడి కొడుకు కూడా కనిపించడం విశేషం. తన పెళ్లి ఫొటోల్ని పోస్ట్ చేసిన అర్బాజ్.. అందరి ఆశీర్వాదం కావాలని క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం కొత్తజంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. హిందీలో నటుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేసిన అర్భాజ్.. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. 2017లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలోనూ నటించాడు. అయితే ఇక్కడ ఆఫర్స్ రాలేదో ఏమో గానీ చాలావరకు హిందీలో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) -
దీపావళి గ్లామర్ ట్రీట్.. ఒకరు క్యూట్ మరొకరు సూపర్ హాట్!
చీరలో హాట్‌గా 'హుషారు' బ్యూటీ ప్రియా వడ్లమాని చీరలో సురేఖావాణి క్యూట్.. మరీ చిన్నపిల్లలా కనిపిస్తూ బంగారంలా ధగధగా మెరిసిపోతున్న మాళవిక మోహన్ దీపావళి స్పెషల్.. నవ్వుతూ మాయ చేసిన అనుపమ భార్యతో కలిసి హీరో నాగశౌర్య దీపావళి సెలబ్రేషన్స్ ట్రెండ్ ఫాలో అయిపోయిన హీరోయిన్ కేథరిన్ గోల్డ్ కంటే బ్రైట్‌గా కనిపిస్తున్న హీరోయిన్ కీర్తి సురేశ్ మోడ్రన్ డ్రస్‌లో వావ్ అనిపిస్తున్న నేహాశెట్టి View this post on Instagram A post shared by Vadlamani Priya (@priyavadllamani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
Malaika Arora Dazzles: గోల్డెన్ త్రీ-పీస్ సెట్లో మలైకా అరోరా స్టన్నింగ్ (ఫోటోలు)
-
49 ఏళ్ల బ్యూటీ హాట్ లుక్.. దేవకన్యలా ఆ తెలుగు హీరోయిన్
వైట్ అండ్ వైట్‌లో రుహానీ అందాల విందు సోఫాపై పడుకుని హీరోయిన్ శ్రద్ధా దాస్ వయ్యారాలు ఈ వయసులోనూ రెచ్చిపోతున్న మలైకా అరోరా చాలారోజుల తర్వాత ఐశ్వర్యా రాజేశ్ గ్లామర్ వీడియో సెల్ఫీ పోజుల్లో హెబ్బా పటేల్ సోయగాలు చీరకట్టులోనూ అందాల్ని చూపిస్తున్న శోభిత బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రస్‌లో నభా నటేశ్ పింక్ ఫ్రాక్‌లో మెగా డాటర్ నిహారిక View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) -
స్నేహితులతో చిందులేసిన మలైకా
-
స్నేహితులతో చిందులేసిన మలైకా
ముంబై : ఇటీవలే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్.. 46 సంవత్సరాల వయస్సులోనూ తన అందచందాలతో అభిమానులను మత్తెక్కిస్తున్నారు. అంత్యంత సన్నిహితులు మలైకాను ‘మల్లా’అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా తన డాన్స్‌తో మళ్లీ తెరమీదకు వచ్చారు ఈ బీ-టౌన్ బ్యూటీ. త్వరలో రానున్న క్రిస్మస్ సందర్భంగా తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. క్రిస్మస్కు ముందే ఏర్పాటు చేసిన పార్టీలో అమ్మాయిల గ్యాంగ్‌తో కలిసి కాసేపు చిందులేశారు. రెడ్ కలర్ డ్రెస్‌లో ఆడి పాడి అదరగొట్టారు. కాగా ఈ గ్యాంగ్‌లో మిత్రురాలు సీమ ఖాన్, సోదరి అమిత్ర అరోరాతో పాటు మరికొంత మందితో మలైకా ఎంజాయ్ చేశారు. మలైకా ఫ్యాన్ క్లబ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక భర్తతో విడిపోయిన మలైకా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్‌తో ప్రేమ వ్యవహారంలో ఉన్న విషయం తెలిసిందే. -
పెళ్లిపై నమ్మకం ఉంది : అర్జున్ కపూర్
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కపుల్స్ లిస్ట్‌లో ఓ జంట ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆ జంటలో అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఉండే వయసు తేడానే వారిని ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తుంది. అర్జున్ కపూర్, మలైకా అరోరా వ్యవహారంపై నిత్యం బీటౌన్‌లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. త్వరలోనే వీరు పెళ్లి పీఠలెక్కబోతున్నారని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని, అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటామని అర్జున్ కపూర్ కుండబద్దలు కొట్టేశాడు. అయితే మీడియాతో ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేని అర్జున్ కపూర్.. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను వెల్లడించారు. పెళ్లిపై నమ్మకం ఉందా అని తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంగా.. తన చుట్టూ పెళ్లి చేసుకున్నవారు ఎంతో మంది సంతోషంగా ఉన్నారని, తాను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ (బోనీ కపూర్ రెండు వివాహాలు చేసుకోవడం గురించి మాట్లాడుతూ) నుంచి వచ్చానని అయినా తనకు పెళ్లిపై నమ్మకం ఉందంటూ, బందంలో ఉండే ఎత్తుపల్లాలను అన్నింటిని చూడాలని, చివరకు ఆ బంధం ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి అంటూ వేదాంతం వల్లించాడు. -
ఆ జాబితాలో నేను లేను: హీరో
ముంబై: తన పెళ్లిపై మీడియాలో వస్తున్న ఊహాగానాలను బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కొట్టిపారేశాడు. పెళ్లి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని, అందరికి చెప్పే పెళ్లాడతానని అన్నాడు. ఈ యువహీరో త్వరలో మలైకా అరోరాను పెళ్లాడనున్నట్టు మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అతడు తేల్చిచెప్పాడు. ‘నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెబుతాను. దాయాల్సిన అవసరం ఏముంది? నా సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకునే వారి జాబితాలో నేను లేను. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోన’ని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. తన గురించి ఎటువంటి గాసిప్స్ పుట్టించినా లెక్కపెట్టనని, సినిమా వాళ్లకు ఇవన్నీ మామూలేనని తేలిగ్గా తీసుకున్నాడు. మీడియా అంటే తనకు గౌరవం ఉందన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు. అర్జున్ కపూర్ నటించిన ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు. చరిత్ర నేపథ్యంలో అశతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘పానిపట్’ సినిమాలోనూ కనిపించనున్నాడు. -
అవును... ఆమె స్పెషల్!
బాలీవుడ్ నటుడు అర్జున్‌కపూర్ త్వరలో నటి మలైకా అరోరాఖాన్‌తో అర్జున్ ఏడడుగులు వేయనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అర్జున్ కపూర్ తాజాగా మాట్లాడుతూ– ‘‘జూన్‌లో నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొన్ని వార్తలతో మీడియా బిజీగా ఉంది. ఖాళీ సమయంలో వాటిలో కొన్ని సినిమా గాసిప్లను చదువుతూ ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు. యాక్టర్‌గా ‘పానిపట్’ సినిమా షూటింగ్, ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ నా పని నేను చేసుకుంటున్నాను. నాకిప్పుడు 33 ఏళ్లు. పెళ్లి విషయంలో నాకు తొందరలేదు. నిర్ణయించుకున్నప్పుడు నేనే చెబుతాను’’ అన్నారు. మరి.. ‘మలైకా అరోరాఖాన్ మీౖ లెఫ్‌లో స్పెషల్ పర్సన్నా?’ అనే ప్రశ్నకు ‘‘అవును.. స్పెషలే. మలైకానే కాదు.. కరీనా, అమృత, రణ్‌బీర్‌కపూర్ వీరంతా నా క్లోజ్ ఫ్రెండ్స్’’ అన్నారు. -
‘సమాధానం రేపు చెప్పనా’
గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో మళ్లీ పెళ్లి వార్తల హవా ఎక్కువయ్యింది. మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్లు ఈ నెల 19న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో మలైకా, అర్జున్‌ల పెళ్లి గురించి అర్బాజ్ ఖాన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. విలేకరుల సమావేశంలో భాగంగా ఓ జర్నలిస్ట్ అర్బాజ్ ఖాన్‌ను ‘వచ్చే నెలలో మీ మాజీ భార్య మలైకా అరోరా, అర్జున్ కపూర్లు వివాహం చేసుకోబోతున్నరటగా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే అర్బాజ్ ఖాన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. దాంతో అక్కడ ఉన్న విలేకరులు కూడా నవ్వడం ప్రారంభించారు. ఇదే ప్రశ్నను మరో సారి అడగ్గా అందుకు అర్బాజ్ ఖాన్ ‘ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా సమయం ఆలోచించే ఉంటారు కదా. నేను కూడా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి కాబట్టి.. రేపు చెప్పనా’ అంటూ ఆన్సర్ చెప్పకుండా దాటవేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవోతుంది. ఇదిలా ఉండగా మలైకా, అర్జున్ కపూర్లు ఈ నెల 19న వివాహం చేసుకోబోతున్నారని.. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం మలైకా బ్యాచిలరేట్ పార్టీలో భాగంగా స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram Repost @lnbolly Arbaaz reaction on Arjun and Malaikas marriage A post shared by instabollywoodfc (@lnstabollywoodfc) on Mar 28, 2019 at 11:38am PDT -
ఫ్యాషన్ 'జిమ్'దగీ
సిటీలోని జిమ్‌లు, ఫిట్నెస్ క్లబ్‌లు, యోగా కేంద్రాలు ర్యాంప్లనుతలపిస్తున్నాయి. అక్కడి ఫిట్నెస్ ఔత్సాహికుల వస్త్రధారణ ఫ్యాషన్ షోలకు తీసిపోవడం లేదు. వర్కవుట్ సమయంలో మాత్రమే కాదు... బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫిట్నెస్ కాస్ట్యూమ్స్‌తో యూత్ సందడి చేస్తోంది. సిటీజనులకు ఫిట్నెస్ అవుట్‘ఫిట్’ ఇంటాబయటా ఇంత క్రేజీగా మారడమనేది మెట్రో నగరాలన్నింటినీ కుదిపేస్తున్న లేటెస్ట్ ఫీవర్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య సాధనలో తలమునకలవుతున్న సిటీజనులతో ప్రస్తుతం నగరంలోని ఫిట్నెస్ సెంటర్లు రద్దీగా మారడంతో పాటు... సిటీలో హైక్లాస్ వెల్నెస్ స్టూడియోలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో వర్కవుట్స్‌కు సంబంధించిన వస్త్రధారణలోనూ భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘వేర్’.. వెరీ ఇంపార్టెంట్ వ్యాయామ సమయంలో ధరించే దుస్తులు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల బిగుతైన దుస్తులు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలను మెరుగుపరిచి క్రీడా సామర్థ్యాన్ని పెంచేందుకు కారణమవుతాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ డాక్టర్ స్టిక్ఫోర్డ్ పేర్కొన్నారు. సరైన వస్త్రధారణ వ్యాయామ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని, అంతేకాకుండా వ్యాయామం తర్వాత వేగంగా రికవరీ అయ్యేందుకు దోహదం చేస్తుందని ఆమె తన పరిశోధన ఫలితాల్లో స్పష్టం చేశారు. వెరైటీలెన్నో... గతంలోలా ఫిట్నెస్ స్టూడియోలో ఇప్పుడు సాదా సీదా టీషర్ట్స్, రెగ్యులర్ ట్రాక్స్ కనపడడం అరుదైపోయింది. కాటన్ టీషర్ట్ వేసుకునో, లేకపోతే జాగింగ్ సూట్స్ ధరించేసో, స్పాండెక్స్ జంప్సూట్స్తోనో సరిపెట్టుకోవడం లేదు. యోగాసనాల సాధకుల కోసం, డ్యాన్స్ ఎరోబిక్స్ చేసేవాళ్ల కోసం... ఇలా వ్యాయామ తీరుతెన్నులకు అనుగుణంగా ఈ వస్త్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో స్పాంకీ ట్యాంక్ టాప్స్, కలర్‌ఫుల్ టైట్స్, గ్రాఫిక్ టీషర్ట్స్, మెష్ డిజైన్డ్ బ్రాస్... తదితర ఇప్పుడు ఫ్యాషన్ ఫర్ ఫిట్‌లో భాగంగా మారాయి. ఇవి జిమ్ స్టైల్‌కి అనుగుణంగా ఉండడం మాత్రమే కాదు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. చెమట పట్టే పరిస్థితులకు అత్యంత అనువుగా సౌకర్యవంతంగా సాగే గుణంతో వీటిని రూపొందిస్తున్నారు. రీబాక్ తాజాగా నిర్వహించిన ఫిట్ ఇండియా సర్వేలో తమ వర్కవుట్ దుస్తుల విషయంలో సౌకర్యానికే ప్రాధాన్యమిస్తామని 56శాతం మంది మహిళలు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి డిజైనర్లు కెల్విన్ క్లీన్, స్టెల్లా మైక్ కార్ట్నీ, అలెగ్జాండర్ వాంగ్... వంటివారు ప్రత్యేకంగా ఫిట్నెస్ క్లోతింగ్ లైన్స్‌ను విడుదల చేస్తున్నారు. అలాగే గ్యాప్, ఫరెవర్ 21, విక్టోరియా సీక్రెట్, మెర్సీస్... వంటి బ్రాండ్స్ కూడా యాక్టివ్‌వేర్ పేరుతో వీటిని అందిస్తున్నాయి. అవుట్ ఫిట్.. అదరహో ఇలాంటి ఆలోచనలు, స్టైల్‌గా ఉండాలనే ఆకాంక్షలకు అనుగుణంగా డిజైనర్లు ఫిట్నెస్ అవుట్ ఫిట్‌ను డిజైన్ చేస్తున్నారు. వీటిలో కొన్ని కదిలే సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా, ఎక్కువ కండరాలు పనిచేయాల్సిన అవసరాన్ని తగ్గించి.. తద్వారా తక్కువ అలసట కలిగేందుకు కారణమవుతాయి. అలాగే వ్యాయామానంతరం కండరాల నొప్పులు రాకుండా వాటికి సున్నితంగా మసాజ్ చేసేలాంటి ఫ్యాబ్రిక్స్, రక్త సరఫరాను పెంచి, వ్యాయామం ద్వారా ఉత్పన్నమైన అనవసరమైన రసాయనాలు ఏవైనా ఉంటే వాటిని దేహం నుంచి బయటకు పంపేలా రూపొందిస్తున్నారు. చెమటను వేగంగా పీల్చుకునే మెష్ బ్యాక్ టెక్నాలజీతో జాగర్ టైట్స్, వర్కవుట్ లుక్‌కి స్టైల్‌ని జత చేసే విధంగా బ్రైట్ స్టిప్పర్స్, స్పోర్టీ బ్రాలో ఇన్‌బిల్ట్ ప్యాడ్స్ కూడా అమరుస్తున్నారు. కదలికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్వేచ్ఛగా కదిలేందుకు వీలుగా ఎలాస్టిక్ స్ట్రాప్స్‌తో డిజైన్ చేస్తున్నారు. స్పీడ్ విక్ టెక్నాలజీ ద్వారా ఇవి దేహాన్ని అవసరమైనంత కూల్‌గా ఉంచుతున్నాయి. కలర్ బ్లాక్డ్ కాప్రి పేరుతో నడుం నుంచి పిక్కల వరకు మాత్రమే ఉండే టైట్ ట్రాక్స్ కూడా సిటీలో బాగా ఫేమస్. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ మేళవించిన స్పీడ్ విక్ మాయిశ్చర్ మేనేజ్మెంట్ టెక్నాలజీతో వీటిని రూపొందిస్తున్నారు. నడుము దగ్గర ఓ వెయిస్ట్ బ్యాండ్‌ను కంఫర్ట్, ఫిట్‌కు అనువుగా అమరుస్తున్నారు. టైట్స్ ఆఫ్ ది మూమెంట్ పేరుతో జామెట్రిక్, నియోన్ ప్రింట్స్‌తో టైట్స్ అందుబాటులోకి తెస్తున్నారు. రైట్ యాక్ససరీస్... వ్యాయామాలకు తగిన యాక్ససరీస్ సైతం సిటీజనులకు అందుబాటులోకి వచ్చాయి. క్లోజ్డ్ సెల్ టెక్నాలజీతో తయారైన యోగా మ్యాట్స్ స్వేదాన్ని తగ్గిస్తాయి. ఆసనాలు వేయడానికి అనువుగా కుషనింగ్‌తో మ్యాట్స్ లభిస్తున్నాయి. వర్కవుట్స్ పూర్తయ్యాక ధరించేందుకు లెదర్, నైలాన్ల మేళవింపుతో స్లిమ్ ఫిట్ బాంబర్ జాకెట్స్ అందిస్తున్నారు. వర్కవుట్ అనంతరం వెంటనే హైడ్రేట్ కావడానికి గాను కూల్సిప్పర్ వంటి పేర్లతో ప్రత్యేకమైన వాటర్ బాటిల్స్ సైతం లభిస్తున్నాయి. క్రాస్‌ఫిట్ లాంటి కొత్త కొత్త ఫిట్నెస్ ట్రెండ్స్ కూడా తయారీదార్లను ప్రభావితం చేస్తున్నాయి. మోకాలి వరకు ఉండే సాక్స్, కలర్‌ఫుల్ ట్యాంక్స్, హెడ్ బ్యాండ్స్ తరహా యాక్ససరీస్, బిగుతైన ఆర్మ్ బ్యాండ్స్ తదితర మార్కెట్లో లభిస్తున్నాయి. షూ లేకుండా చేసే పిలాట్స్ వర్కవుట్స్ కోసం కూడా నైక్... లైట్ వెయిట్ ఫుట్ ర్యాప్‌ని స్పెషల్‌గా సృష్టించిందంటే ఫిట్నెస్ ఉత్పత్తులపై కంపెనీలు ఎంత కుతూహలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జాగ్రత్తలు అవసరం.. వర్కవుట్ సమయంలో ధరించే దుస్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ సూచించారు. యోగా క్లాసెస్ అయితే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్స్ ఎంచుకోవాలి. జంపింగ్‌లు ఎక్కువగా ఉండే కార్డియో వ్యాయామాలైతే బిగుతైన లైనింగ్ ఉండే లూజ్ షార్ట్స్ ధరించాలి. ఇలా వర్కవుట్‌కి అనుగుణంగా దుస్తులు ధరించాలని, వ్యాయామానంతరం దుస్తులను తప్పనిసరిగా వాష్ చేయాలని చెప్పారు. ♦ వదులైన దుస్తులు మెషిన్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఏ దుస్తులైనా ముందస్తుగా వ్యాయామం చేసి పరీక్షించుకోవడం అవసరం. వీలైనంత వరకు వ్యాయామ సమయంలో ఎలాంటి ఆభరణాలు గానీ, వాచ్ లాంటివి గాని లేకుండా చూసుకోవాలి. ♦ రన్నింగ్ షూస్ క్రాస్ ట్రైనింగ్ వర్కవుట్‌కి పనికిరావు. అలాగే సరిగా ఫిట్ అవని సాక్స్ కూడా రకరకాల సమస్యలకు దారి తీస్తాయి. వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకం... యోగా, జిమ్, డ్యాన్స్... ఫిట్నెస్ కోసం ఇవన్నీ తప్పదు. అలాగే వర్కవుట్‌కి అనుగుణంగా డ్రెస్సింగ్ అవసరం. ఫిట్నెస్ అవుట్ ఫిట్ కోసం నా వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయించాను. దాదాపు ప్రతి నెలా వర్కవుట్‌కి సంబంధించిన ఏదో ఒక అవుట్ ఫిట్ లేదా యాక్ససరీస్ కొనాల్సిన అవసరం ఏర్పడుతోంది. – సుశీలా బొకాడియా, పేజ్‌త్రీ సోషలైట్ -
మహేష్ భార్యపై నటి షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేహ ధూపియా నిర్వహిస్తున్న 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్రమానికి మలైకా హాజరైంది. ఆ సందర్భంగా నేహా అడిగిన పలు ప్రశ్నలకు మలైకా షాకింగ్ సమాధానాలు చెప్పింది. మోడలింగ్‌లో ఎదురైన అనుభవాల గురించి మలైకా ప్రస్తావిస్తూ 'నమ్రతా శిరోద్కర్, మోహర్ జెస్సియా మోడలింగ్‌లో నాకు సీనియర్లు. అప్పటికే వారు టాప్ మోడల్స్‌గా కొనసాగుతున్నారు. దాంతో కొత్తగా వచ్చిన వారితో వారు పొగరుగా ప్రవర్తిస్తూ సీనియారిటీ చూపించేవారు. అయితే ఇప్పుడు వారిద్దరితో స్నేహం కొనసాగిస్తున్నాను' అని తెలిపింది. కాగా, బాలీవుడ్‌లోకి రాకముందు మలైకా మోడలింగ్ రంగంలో రాణించింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తున్నారు. -
విడిపోయిన భర్తకు నటి బర్త్‌డే విషెస్!
17 ఏళ్లు ఆనందంగా కొనసాగిన వైవాహిక జీవితం వారిది. కొన్ని నెలల కిందటే వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తాము విడిపోయామని బాలీవుడ్ దంపతులు ఆర్బాజ్ ఖాన్, మలైకా ఆరోరా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వేరువేరుగా ఉంటున్న ఈ జంట మళ్లీ రాజీ కుదుర్చుకొని కలిసిపోయే దిశగా ముందుకుసాగుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం (ఆగస్టు 4న) ఆర్బాజ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో మలైకా ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పింది. ఆనందం ఎప్పుడూ ఆర్బాజ్ వెంటే ఉండాలని కోరుకుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆర్బాజ్తో కలిసి తాను కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఒకదానిని పోస్టు చేసింది. ఆర్బాజ్ ఖాన్-మలైకా ఆరోరా దంపతులకు 13 ఏళ్ల కొడుకు ఆర్హాన్ ఉన్నాడు. గతంలో వేరయిన ఈ ఇద్దరిని మళ్లీ కలిపేందుకు కుటుంబపరంగా అడుగుల పడుతున్నట్టు తెలుస్తోంది. రంజాన్ ఈద్ సందర్భంగా ఆర్బాజ్ కుటుంబంతో మలైకా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోలోనూ కనిపించింది. తాజాగా ఆర్బాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో బీటలువారిన వీరి వైవాహిక బంధం మళ్లీ నిలపుకొనేందుకు దంపతులు ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని సన్నిహితులు చెప్తున్నారు. -
విడిపోయిన భార్యకు ఓ సందేశం!!
17 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ చెరో దారి చూసుకున్నారు బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా. బాలీవుడ్లో అన్యోన్యమైన దంపతులుగా పేరొందిన వీరు గత ఏప్రిల్‌లో వేరయ్యారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా మగ్గుతున్న అర్బాజ్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ తాత్వికమైన వ్యాఖ్య పోస్టు చేశాడు. 'కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు వెనుదిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది నీకే అర్థమవుతుంది' అంటూ ఓ తాత్వికమైన సందేశాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. భార్యతో వీడిపోయిన బాధలో ఆయన కామెంట్ పెట్టి ఉంటారని అభిమానులు భావించారు. 'మీ మాటల వెనుక దాగున్న బాధను మేం అర్థం చేసుకోగలం.. మక్కీ భయ్యా మేం మీ వెంట ఉన్నాం' అంటూ ఓ అభిమాని ఈ పోస్టుపై కామెంట్ చేశాడు. ఇంతటి తాత్వికమైన కామెంట్‌ను సడన్‌గా అర్బాజ్ పోస్టు చేయడం వెనుక స్పష్టమైన కారణాలు బయటకు తెలియనప్పటికీ, భార్య మలైకతో ఇటీవల బ్రేకప్ అయిన నేపథ్యంలోనే దీనిని పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. తాము వీడిపోతున్నామని ఈ జంట సంయుక్తంగా గత ఏప్రిల్ నెలలో సంయుక్తంగా ఓ ప్రకటన చేసింది. మలైక లైఫ్‌స్టైల్ అర్బాజ్ కుటుంబానికి నచ్చకపోవడం, మలైకకు ఓ వ్యాపారవేత్తతో ఎఫైర్ ఉందని వదంతులు రావడం తదితర పరిణామాల వల్లే వీరి వైవాహిక బంధానికి బీటలు పడినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్-3' దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. 'దబాంగ్' సీరిస్ సినిమాలకు అతను గతంలో నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
'అవును మేమిద్దరూ విడిపోతున్నాం'
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విడిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 'అవును, మేమిద్దరమూ విడిపోతున్నాం' అంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అర్బాజ్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించింది. అర్బాజ్‌తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరింది. మలైకా, అర్బాజ్ విడిపోవడానికి పలు కారణాలున్నట్టు సమాచారం. మలైకా లైఫ్ స్టయిల్ ఖాన్ ఫ్యామిలీకి నచ్చలేదని, ఓ బిజినెస్‌మన్‌తో ఆమెకు ఎఫైర్ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిని మలైకా, అర్బాజ్ తోసిపుచ్చారు. తమపై వచ్చే రూమర్లను నమ్మవద్దని విన్నవించారు. -
విడాకుల కోసం లాయర్‌ను కలసిన నటి
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగింపు దశకు వచ్చింది.? అర్బాజ్‌తో విడాకులు తీసుకోవాలని మలైకా నిర్ణయించినట్టు సమాచారం. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. ఇటీవల ఓ ఫంక్షన్లో అర్బాజ్, మలైకా కనిపించడంతో ఈ జంట రాజీపడ్డారని బాలీవుడ్ వర్గాలు భావించాయి. అయితే సల్మాన్ రాజీ ప్రయత్నాలు ఫలించలేదని, అర్బాజ్‌తో కలసి జీవించేందుకు మలైకా సుముఖంగా లేదని తెలుస్తోంది. అర్బాజ్‌తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరుతోంది. వివాహ బంధం తనకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వలేదని, అర్బాజ్ కుటుంబం తాను గృహిణిగా ఉండాలని భావిస్తోందని, ఇది తనకు ఇష్టంలేదని మలైకా చెప్పినట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. మలైకా ఇంకా విడాకులకు దరఖాస్తు చేయకున్నా, ఏ రోజైనా నోటీసులు పంపే అవకాశముందని సమాచారం. -
'పర్సనల్ విషయాలు అడగొద్దు'
న్యూఢిల్లీ: వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉంటోంది బాలీవుడ్ నటి మలైకా ఆరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో ఆమె తెగతెంపులు చేసుకోనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో పర్సనల్ విషయాలు బయటకు చెప్పకూడదని మలైకా నిర్ణయించకుంది. మందిరా విర్క్ ఫ్యాషన్ షో కోసం ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆమె.. ఎవరూ తన వ్యక్తిగత విషయాలు అడగొద్దని కోరింది. చాలా కాలం తర్వాత ఢిల్లీకి వచ్చానని, మందిరా విర్క్ కోసమే తానిక్కడకు వచ్చానని వెల్లడించింది. మందిర తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. తానెప్పుడు ఇక్కడకు వచ్చినా ఇద్దరం కలిసి బయటకు వెళతామని, కష్టసుఖాలు కలబోసుకుంటామని వెల్లడించింది. ష్యాషన్ షో మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు వేదిక వద్దకు వచ్చిన మలైకా... షో ముగియగానే వెళ్లిపోయింది. వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా అడుగుతారనే ఉద్దేశంతోనే ఆమె ఇలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే విడాకుల గురించి అర్బాజ్ ఖాన్, మలైకా ఆరోరా ఇప్పటివరకు పెదవి విప్పలేదు. -
'లవ్.. బ్రేకప్స్ గురించి నన్ను అడగొద్దు'
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా చివరకు విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సయోధ్య కుదరక ఇక కలిసి సాగకూడదని అనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. ఆఖరికి సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మలైకాతో మాట్లాడిన ఆమె అతడి మాటలు వినేందుక ఆసక్తి చూపలేదని తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయించుకొని డైవర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అర్బాజ్ తండ్రి సలీం ఖాన్‌ను ప్రశ్నించగా 'నేనొక రచయితను. బ్రేకప్ ల గురించి, ప్రేమ వ్యవహారాల గురించి నన్ను అడగకండి. నా పిల్లల విషయాల్లో నేనెప్పుడూ తల దూర్చను. నాకు అసలు ఈ విషయంపై మాట్లాడాలని లేదు. మరోపక్క, మలైకా తల్లి జాయ్స్ పోలీకార్ప్ కూడా మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 'వాళ్లిద్దరు ఎదిగినవారు. అది వారి వ్యక్తిగత వ్యవహారం. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. నాకు మీడియాతో మాట్లాడాలని కూడా లేదు' అని ఆమె చెప్పింది. -
'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా'
ముంబయి : భార్య మలైకా అరోరా ఖాన్‌తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తెలిపారు. 'పవర్ కపుల్' అనే రియాల్టీ షోలో మలైకాతో కలిసి పాల్గొనుండటంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను నిర్వహించనున్న ఈ షో షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామనన్న అర్బాజ్ తెలిపాడు. ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును హుషారెత్తించే మలైకా టాలీవుడ్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన స్టెప్పులేసిన విషయం విదితమే. సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇజ్రాయెల్‌లో చేసిన కార్యక్రమానికి ఇది భారతీయ వర్షన్ అని అదే పేరుతోనే షో చేస్తున్నట్లు అర్బాజ్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలు ఏ మేరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు.. ఒకరి గురించి మరొకరికి ఏమేరకు తెలుసు అనే విషయంపై ఈ షో ఉంటుంది. పది జంటలు ఈ షోలో పాల్గొంటాయని, ఈ మేరకు కొన్ని లవ్లీ కపూల్స్ ను తాను కలుసుకున్నట్లు తెలిపాడు. భార్య మలైకాతో కలిసి ఈవెంట్ చేయనుండటం తనను చాలా థ్రిల్లింగ్ అవుతున్నట్లు అర్బాజ్ అంటున్నాడు. -
అర్బాజ్‌ను మలైకా ఎలా పడేసింది?
ప్రముఖ నటి.. నిర్మాత మలైకా అరోరా ఖాన్ తన ప్రేమకు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించబోతోంది. 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఆమె ఈ విషయాలు చెబుతుందట. తన భర్త అర్బాజ్‌ఖాన్‌తో ప్రేమలో పడేందుకు తాను వండిన వంటకాలు కూడా ఓ కారణమని మలైకా చెబుతోంది. ఆమె అర్బాజ్‌ఖాన్‌తో డేటింగ్లో ఉన్న సమయంలో వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ప్రత్యేక వంటకాలు చేసి అతడికి రుచి చూపించిందట. అప్పటికి తనకు పెద్దగా వంట రాకపోయినా.. ఆ రుచి చూసే అర్బాజ్ ఖాన్ పడిపోయాడని, అదికూడా తమ ప్రేమ పండేందుకు ఓ కారణమని మలైకా చెబుతోంది. 1998లో అర్బాజ్, మలైకా పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అర్హాన్ అనే 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కలర్స్ చానల్లో ప్రసారమయ్యే 'ఫరా కీ దావత్' కార్యక్రమంలో ఇలాంటివే మరికొన్ని రహస్యాలను మలైకా అరోరా ఖాన్ చెబుతుందట. -
మళ్లీ మలైకా మాయాజాలం
దేశం మొత్తాన్నీ తన ఆటతో, అందుకు తోడైన పాటతో ఉర్రూతలూపిన మలైకా అరోరా ఖాన్ ఇప్పుడు మరోసారి తన మాయాజాలం చూపనున్నారు. గతంలో ‘మున్నీ బద్నామ్ హుయీ...’ పాటతో అన్ని రికార్డులూ బద్దలుకొట్టిన ఈ అమ్మడు తాజాగా ‘ఫ్యాషన్ ఖతమ్ ముఝ్పే...’ అనే పాటలో తన ఒయ్యారాలు ఒలకబోస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్, సోనమ్ కపూర్లు సైతం ఆ పాటలో కనిపించనున్నారు. సాజిద్ - వాజిద్‌లు సంగీతం కూర్చగా, మమతా శర్మ పాడిన ఈ ప్రత్యేక నృత్యగీతం ‘డాలీ కీ డోలీ’ చిత్రంలో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్ళినాటి రాత్రే అబ్బాయిలను మోసం చేసి, దోచుకొనే ఒక మోసగత్తె పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ డోగ్రా దర్శకుడు. ఇది ఇలా ఉండగా, ఈ ప్రత్యేక నృత్యగీతం ద్వారా ‘బాలీవుడ్ మున్నీ’ మలైకా అరోరా మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. మరి, మలైకా అందచందాలు, ఆటపాటలు చూడడానికి ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే! -
లాక్మేలో ఇలియానా, మలైకా, కరిష్మా మెరుపులు