mallesh
-
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
వివాహేతర సంబంధమే కారణమా..?
మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ గురువారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చేధించినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఓ మహిళతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చిందని, త్వరలోనే నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ రమేశ్‌బాబు తెలిపారు. ఇవి చదవండి: కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్లు అరెస్ట్ -
కాల్చిన కొడవలితో దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొడవలితో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. కాల్చిన కొడవలితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల(35), మల్లేశ్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హమాలీ పనిచేసే మల్లేశ్.. వచ్చిన డబ్బులతో మద్యం తాగి రోజూ భార్యను కొడుతున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లేశ్.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లగా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్ కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి మల్లేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కొడవలిని కాల్చడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి తొలగించేందుకు ప్ర యత్నం చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశ్.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్‌తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
ఆ తల్లిదండ్రులకు ఇది అంతులేని వేదన!
సాక్షి, పెందుర్తి: ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కుమార్తె మృతి చెందింది. ఆ బాధలోంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు.. చేతికందిన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు కూడా తనువు చాలించాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే కుమార్తె, కుమారుడు మృతి చెందడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇంకెందుకు మేం బతకాలంటూ వారి వేదన అక్కడ ఉన్నవారిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం దార్లపూడి గ్రామానికి చెందిన గొంతుమూర్తి లోవరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు మల్లేష్ (22) పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో నగరంలో జరుగుతున్న ఓ పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం దార్లపూడి నుంచి స్నేహితుడు భీముని ధనరాజుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. పెందుర్తి కూడలి వద్దకు వచ్చే సరికి వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. మల్లేష్ తీవ్రంగా గాయపడగా, ధనరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు) మల్లేష్‌ను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించగా...చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహిత అయిన మల్లేష్ సోదరి ఆరునెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తె మరణించిన కొద్ది రోజులకే కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు లోవరాజు, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదవండి: (అద్దెకున్న మహిళే హంతకురాలు) -
రథయాత్ర: తీవ్ర విషాదంలో కుటుంబం
సాక్షి, నిర్మల్: జాతరకు వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... అక్కాపూర్‌కు చెందిన మల్లేష్(45) ముజ్గి మల్లన్న జాతరకు వెళ్ళాడు. కాగా అక్కడి రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కిందపడిపోయిన మల్లేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకురాగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అక్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీర్థయాత్ర ఇలా అంతిమయాత్రగా మారుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరిచేతా కన్నీళ్లుపెట్టిస్తోంది. మరోవైపు.. ఇదే ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్స్ కోలుకుంటున్నారని, వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. -
భూతవైద్యం పేరిట బాలింతకు చిత్రహింసలు
జైపూర్ : భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వైపు ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు.. మరోవైపు చేతబడులకు గురైందన్న నెపంతో బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలు గురి చేయడం సంచలనం రేపింది. మాంత్రికుడి దెబ్బలకు యువతి స్పృహ కోల్పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో మూడు నెలల పసికందు ఆ తల్లికి దూరమైంది. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత గర్భిణి అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు పలు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె కొంత వింతగా ప్రవర్తిస్తోందని సమాచారం. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన మల్లేశ్ కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ విషయం రజిత బాబాయ్ జమ్మికుంట మండలం శ్యాంపేట్‌కు చెందిన రవీందర్‌కు తెలియడంతో ఆయన దొంగల శ్యామ్ అనే భూత వైద్యుడిని ఆశ్రయించాడు. సదరు భూత వైద్యుడు మల్లేశ్ ఇంటికొచ్చి రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని నమ్మబలికాడు. బాలింత అని కూడా చూడకుండా తల వెంట్రుకలు పట్టుకుని ఇష్టారీతిన కొట్టడంతో రజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడామె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జైపూర్ ఏసీపీ భూపతి నరేందర్ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
దుబాయ్
‘‘స్వర్ణా... అంతా బాగేనా?’’ మల్లేష్.‘బాగే మల్లేషన్నా.. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా.. ఈలోపు నువ్వే..’’ ‘‘షాలినీ కలుస్తుందా స్వర్ణా?’’ ఆమె మాటను పూర్తికానివ్వని మల్లేష్ ఉత్సుకత..‘‘ఫోన్?’’ ‘‘విల్సన్‌తో మాట్లాడకపోయినవా?’’ మల్లేష్.‘‘ఫోన్ చేశా. చాలా రాష్‌గా మాట్లాడాడు షాలినీ గురించి’’ అని ఓ క్షణం ఆగి.. ‘‘ఏం కథ పెట్టింది నీ ఫ్రెండ్? అబార్షన్ ఇల్లీగల్ అని తెలియదా? పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎరక్కపోయి ఇరుకున్నా. ఇలాంటిదని తెలిస్తే.. వీసానే ఇప్పించకపోదును అంటూ చాలా అసహ్యంగా వాగాడు! షాలినీని కలవడానికి, మాట్లాడ్డానికి చాలా ట్రై చేశా. ప్చ్..! ఇప్పుడైతే ఫోన్‌కూడా పనిచేయట్లేనట్టుంది. ఎక్కడుందో.. ఏమో’’ బాధగా స్వర్ణ.‘‘షాలిని వాళ్ల అమ్మ నంబర్ ఏమన్నా ఉందా? ఆమెతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా?’’ అడిగాడు.‘‘ఉన్నట్టుంది.. ఆమెతో మాట్లాడి..నీకు కాల్ చేస్తా..’’ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్వర్ణ. షర్ట్ పాకెట్లో ఫోన్ పడేసుకుంటూ గతంలోకి జారుకున్నాడు మల్లేష్. షాలిని ప్రెగ్నెంట్ అని తెల్వంగానే ఇండియా వచ్చేసిండు. అంతకుముందే.. మస్తు సార్ల సేuŠ‡ని చుట్టీ అడిగిండు. ఇయ్యలే. కరెక్ట్‌గా శాలినీ కడుపుతో ఉన్నా అని చెప్పుడు.. చుట్టీ దొరుకుడు ఒక్కసారే అయినయ్. ‘‘మా అమ్మకు బాగాలేదంట షాలినీ..! సోనాపూర్ క్యాంప్‌లో ఉండే మా ఊరాయన మొన్ననే ఇండియా నుంచి అచ్చిండు. మా అమ్మ మంచలకెంచి అస్సలు లేస్తలేదని చెప్పిండు. నేను బోవాలే. పదిహేను రోజులల్ల అస్తా మల్లా!’’ తెల్లవారి ప్రయాణం అనగా ముందు రోజు రాత్రి ఎప్పటిలెక్కనే గ్యారేజ్‌లో కల్సుకున్నడు షాలినీని. గుడ్ల నిండా నీళ్లు దీసుకుంది తప్ప ఏం మాట్లాడ్లే ఆ పిల్ల. దగ్గరకు దీసుకుంటూ చెప్పిండు ‘‘ఏం ఫికర్వెట్టుకోకు. తొందరగనే అస్తా..ఒకవేళ రాకపోతే మా అమ్మ ప్రాణం కిందమీదైంది అనుకో. ఫోన్ చేస్తా. ఏజెంట్‌తో మట్లాడి నువ్వే ఇండియాకు వచ్చేటట్టు చేస్తా. సరేనా..’’అని. అయినా ఆమె ఏం మాట్లాడ్లే. ఒక్కసారి తన కండ్లల్లకు జూసింది. గద్వ వట్టుకుని మళ్లా అన్నడు. ‘‘సరేనా’’ అని. కౌగిలి ఇడిపించుకుని ఎన్కకు తిరిగి చూడకుండా పోయింది. అబద్ధం చెప్తుండని ఆ పిల్లకు అర్థమైందా? ప్రెగ్నెంట్ అని తెల్వంగనే పారిపోతున్నడు అనుకుందా? పారిపోవుడు.. భయపడుడు నివద్దే కదా! ఊర్ల పెండ్లాం ఉందని నిజం చెప్పలే. ఇద్దరు పిల్లల తండ్రి అనీ చెప్పలే. లేని అమ్మకు రోగం అంటగట్టిండు. ఏం జేస్తడు? అప్పటికే తుట్టి యెవుసంతో పుట్టెడు అప్పులు. పెండ్లం మెడల పుస్తె అమ్మి మరీ దుబాయ్వాయే. ఎప్పుడో చిన్నప్పుడు గమ్మత్గా నేర్సుకున్న కార్ డ్రైవింగ్ అక్కరకొచ్చింది. తాను డ్రైవర్‌గా చేసే సేuŠ‡ ఇంట్లనే షాలిని పని మనిషి. తనను జూసి ఆ పిల్ల తెలుగు మాట్లాడేసరికి ప్రాణం లెషొచ్చిన్నట్టయింది. అట్ల అయిన దోస్తాని దొంగతనంగా రొట్టెలు, కూరలు తెచ్చిచ్చేదాకా వెరిగింది. ప్రేమిస్తున్నా అని ఇంకా దగ్గరైండు. ఇల్లు, పిల్లలు ఎవ్వరు గుర్తురాలే. మూడ్నెల్లకు ఒకసారి ఇంటికి పైసలు పంపిస్తున్నప్పుడు ఇంటోల్లకు ఒక కాల్ చేస్తుండే గంతే. ఆ పిల్ల గర్భవతి అని తెల్సినంకనే ఇల్లు, పెండ్లాం, పిల్లలు గుర్తొచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పిచ్చుకొని ఇండియాకొచ్చేషిండు. టపాటపా వేప చెట్టు ఆకులు రాలుతూండడంతో వాస్తవంలోకి వచ్చాడు మల్లేష్. చుట్టూ చూశాడు. ఎండ మండుతోంది. తను కూర్చున్న చెట్టు తప్ప ఇంకే చెట్టూ ఊగట్లేదు. ఉక్కపోత ఉగ్గబట్టి రవ్వంత గాలికీ చోటివ్వట్లేదు. ఆ పెద్ద వేప చెట్టు మాత్రం వేర్లు పెకలి నేల కూలుతుందా అన్నంతగా ఊగుతోంది.. వింతగా! దడ పట్టుకుంది మల్లేష్‌కి. లేచి నిలబడ్డాడు.అతని ముందుకు ఒక్కసారిగా సుడి గాలి.. మనిషి ఆకారంలో! గిర్రున తిరుగి మాయమైంది. రెండు మొహాలు.. కనిపించాయి.. మల్లేష్‌కి.. అంత వేగంలో కూడా ఒక మొహాన్ని గుర్తుపట్టగలిగాడు.. శాలిని! మరి ఇంకో మొహం..? అపరిచితమైందీ కాదు.. సుపరిచితం అంతకన్నా కాదు. ఎవరు ఆమె.. ఎక్కడ చూశాడు? చూశాడా? లేక భ్రమా?మొహం పాలిపోయింది.. ఎండకు గొంతు తడారి పెదవులు పొడిబారాయి!దాహం.. దాహం.. మంచి నీళ్లు.. నోరు ఎండిపోతోంది. చేనును తడుపుతున్న బోర్ పంప్ దగ్గరికి వెళ్లాడు. నీటి ధారకు దోసిలి పట్టాడు. ఠక్కున నీళ్లు ఆగిపోయాయి. బోర్ మాత్రం నడుస్తూనే ఉంది. ‘‘ఎడారి దేశంలో ఉండొచ్చావ్.. దప్పిక అలవాటవలేదా?’’ వినిపించింది వెనకనుంచి.షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. ఓ స్త్రీ.. ఇందాకటి ఇంకో మొహం.నవ్వుతోంది.. తనను చూసి. నల్ల చీర.. చెవులదాకా వెడల్పు.. మెడ మీద పడేంత పొడవు ఉన్న దట్టమైన తెల్లటి జుట్టు ముడి.. రూపాయి బిళ్లంతా నల్లటి బొట్టుతో ఉంది ఆ స్త్రీ. జలజలమని నీటి ప్రవాహం పంప్ వెంట. ఆ చప్పుడికి అటు వైపు చూశాడు. ‘‘పో..’’ గద్దించింది ఆమె.తన ప్రమేయం లేకుండానే ఎవరో వెనక నుంచి తోసినట్టు.. వచ్చి పంప్ దగ్గర పడ్డాడు. దోసిలి పట్టాడు. మళ్లీ ఆగిపోయింది. బిత్తరపోయి వెనక్కి తిరిగాడు. ఆవిడ లేదు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు దీశాడు. పది అడుగులు వేస్తే వచ్చే ఇల్లు.. ఎంత పరిగెత్తినా రావట్లేదు. మధ్యాహ్నం మొదలుపెడితేపొద్దుగుంకింది.. చూస్తుండగానే చీకట్లూ అలుముకున్నాయి. అల్లంత దూరంలోనే కనపడుతోంది ఇల్లు.. అయినా చేరుకోలేకపోతున్నాడు. మొసతో వగరుస్తున్నాడు. ఇంట్లో లైట్వెలుగుతోంది. భార్య చేటలో బియ్యం చెరుగుతోంది. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నీడలుగా కనపడుతున్నారు. చేయి చాస్తే అందుకునేంత చేరువగా ఉన్నారు. ఆయసంతో అడుగులు వేయలేక చేయి చాచాడు.. ఎవరినీ అందుకోలేకపోతున్నాడు. గుండెలో నొప్పి.. ఓ చేత్తో గుండెను పట్టుకొనే ఇంకో చేత్తో తన వాళ్లను అందుకోవాలనే ఆరాటంతో పరిగెడ్తున్నాడు.. అర్ధరాత్రి అయింది.. అయినా ఇల్లు చేరలేదు మల్లేష్. ఆగిపోయాడు.. తన వల్ల కాదు.. మాట్లాడలేనంత ఎండిపోయి ఉంది నోరు.. దాహం.. దాహం.. మాట గొంతులో ఉంది.. బయటకు రావట్లేదు..కళ్లు మూతలు పడ్తున్నాయి..ఎదరుగా ఆమె.. ‘‘చేరుకున్నావా నీ వాళ్లను? వీళ్ల కోసమే కదా.. షాలినీని ఒంటరిగా వదిలి వచ్చేశావ్? పిరికితనంతో బిడ్డను పుట్టకుండానే చంపేశావ్.. వెళ్లు... నీ వాళ్ల దగ్గరకు వెళ్లు.. పో... ఊ.. ’’ గర్జించింది ఆ స్వరం. మళ్లీ అప్రయత్నంగానే పరుగు మొదలుపెట్టాడు మల్లేష్. జేబులో ఉన్న ఆయన ఫోన్ మోగుతోంది.. చాలా సేపటి నుంచి.. ఛాతి దగ్గర ఎడమవైపు కలుక్కు మంటూంటే.. చేత్తో పట్టుకున్నాడు. ఆ స్థానంలోనే ఉన్న జేబులోని ఫోన్ ప్రెస్ అయి స్పీకర్‌తో సహా ఫోన్ కాల్ ఆన్ అయింది..‘‘మల్లేషన్నా.. షాలినీ మీద బెంగతో వాళ్లమ్మ చనిపోయిందట అన్నా.. ’’ కుప్పకూలిపోయాడు మల్లేష్. - సరస్వతి రమ -
ఈటలపై కారు మాజీ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మంత్రి ఈటల రాజేందర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన కారు మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్‌యాదవ్ ప్రకటించారు. శుక్రవారమిక్కడ ప్రెస్‌క్లబ్‌లో మల్లేశ్ మాట్లాడుతూ.. ఈటల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు గుర్తుచేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30లక్షలు దాతలు ఇచ్చారని, వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని, తర్వాత కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఈటలతోపాటు, అందరూ తన కు అన్యాయం చేశారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. -
పరిమిత పొత్తయితే ఇరుపార్టీలకు మంచిది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశంతో సయోధ్య పార్టీకి లాభం కలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ పొత్తును పరిమిత స్థాయిలో ఉండాలని సూచించారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన రాహుల్.. మహాకూటమి, టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఆరాతీశారు. మనం బలంగా ఉన్న సెగ్మెంట్లను వారికిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, కేడర్‌లో కూడా అసంతృప్తి పెల్లుబికే ఆస్కారముందని మల్లేష్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏడు చోట్ల గెలిచిందని, అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కంకణబద్దులైన వారికే టికెట్లను కేటాయించే అంశంపై తెలుగుదేశం అధిష్టానంతో చర్చించాలని కోరారు. టీడీపీకి ముందున్న బలం ఇప్పుడు లేదని, రెండు స్థానాలు కేటాయిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
రక్త సంబంధీకుడు!.. 95 సార్లు రక్తదానం
బోడుప్పల్ : ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆయనో ప్రాణదాత. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సివారికి రక్తదాతగా పేరు పొందారు బోడుప్పల్‌కు చెందిన మరాఠి మల్లేష్. ఆయన 44 ఏళ్ల వయసులో సైతం రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తం అవసరముందని ఎవరైనా ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని మరీ అక్కడ వాలి రక్తదానం చేయడమే ఆయనకు తెలిసింది. ఇప్పటివరకు 95సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఇవీ సంఘటనలు.. నల్గొండ జిల్లా అడ్డగూడూరు మండలానికి చెందిన మరాఠి మల్లేష్ బ్లడ్ గ్రూప్ ఏ+పాజిటివ్. బోడుప్పల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా సీతారాంపురానికి చెందిన జెట్ట అశ్విని(10)కి గుండెకు రంధ్రం పడింది. ఆమెకు నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిర్ణయించారు. బాలికకు కావాల్సిన రక్తం గ్రూపు అందుబాటులో లేదు. దీంతో విషయం తెలుసుకున్న మల్లేష్ ఆస్పత్రికి వెళ్లి రక్త దానం చేశారు. దీంతో ఆ బాలిక ప్రాణం పోసుకుంది. అలాగే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కుమారుడు రాము(12) రక్త హీనతతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు నాంపల్లిలోని ఓ హాస్పిటల్ చేర్పించారు. సకాలంలో రక్తం దొరకక ఇబ్బందిపడుతున్నారు. దినపత్రికలో ప్రకటనను చూసి హాస్పిటల్‌కు వెళ్లి రక్త దానం చేసి బాబుకు ప్రాణదానం చేశారు మల్లేష్. మరో సంఘటనలో.. బోడుప్పల్‌కు చెందిన జోగు యాదమ్మ (50) రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో రక్తం చాలా వరకు పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. బ్లడ్ లేక డాక్టర్లు ఆపరేషన్ చేయడం లేదని స్నేహితుల ద్వారా తెలుసుకున్న మల్లేష్ ఆమెకు రక్తదానం చేశారు. అలాగే.. పఠాన్ చెరువు రాంచంద్రాపురానికి బాలుడు బండ శ్రీకర్ (3), బోడుప్పల్‌కు చెందిన వేముల సంతోష్ (22)లకు కాకుండా మరెందరికో రక్తదానం చేసి ప్రాణదాతగా మారారు. -
సీఎం క్యాంపు ఆఫీసు వద్ద కలకలం
సికింద్రాబాద్: పంజాగుట్టలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. గద్వాల జోగులాంబ ప్రాంతానికి చెందిన మల్లేష్ అనే రైతు ఐదు సార్లు బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మల్లేష్ ముఖ్యమంత్రిని కలవాలని మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. అక్కడున్న పోలీసులు రైతును అడ్డుకున్నారు. దీంతొ ఆవేదన చెందిన రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే రైతును గాంధీ ఆస్పత్రికి తచరలించారు. ప్రస్తుతం మల్లేష్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
కళారంగ కనకం మల్లేష్..
- 22 ఏళ్లుగా కళాప్రదర్శనలు - పతకాలు, ప్రశంసాపత్రాలే ఆస్తులు - అందని గుర్తింపు.. కరువైన ప్రొత్సాహం చిట్యాల(భూపాలపల్లి): పేదరికం వెంటాడుతున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా.. పోత్సహం కరువైనా..పట్టువిడవకుండా గత 22 ఏళ్లుగా కళామాతల్లిని నమ్ముకుని జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న కళారంగానికి జీవం పోస్తూ..ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు భూపాలపల్లి జల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామానికి చెందిన మోతె మల్లేష్. నిరుపేద బుడిగజంగం కులంలో పుట్టిన మల్లేష్ చిన్నప్పటి నుంచి నాటికల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పలు జిల్లాలో ధూంధాం సభలలో పాల్గొని పాటలు, మిమిక్రీ, ఏకపాత్రాభినేయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. రాజు,రాణిపాత్రలకు కేరాఫ్ మల్లేష్.. నాటకాలలో రాజు, రాణి పాత్రలు నటించడంలో మల్లేష్‌కు ఎవరూ సాటి రారు. పాత్రలో లీనమై రక్తికట్టిస్తాడు. రామాయణం, సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, వాలీసుగ్రీవుల వధ, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, పాండవుల ఆరణ్య వాసం, సారంగధర, మాయల ఫకీరు లాంటి నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు. కరువైన ప్రోత్సాహం కళారంగమే ప్రాణంగా భావిస్తున్న మల్లేష్‌కు ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో కుటుంబపోషణ భారమై ఇటు కళాప్రదర్శనలు నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కాగా, ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్యం అందడంతో రోగులు తమ వద్దకు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా కళాకారుడిగా రాణిస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను వేడుకుంటున్నాడు. -
మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి
సిద్దిపేట: దుబ్బాకలో మంత్రాల నెపంతో దాడి.. ఘటనలో గాయపడిన భార్యాభర్తలు శుక్రవారం మృతి చెందారు. బంధువులు, స్థానికులు స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని గాంధీ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో గురువారం సుదర్శన్ సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సుదర్శన్‌కు సోదరులు మల్లేష్, శ్రీనివాస్‌లతో గత కొంత కాలంగా ఆస్తితగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వారు స్థానికులను రెచ్చగొట్టి సుదర్శన్‌పై దాడి చేశారని సమాచారం. నిందితులు మల్లేష్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: దంపతుల సజీవ దహనం -
తండ్రి అదృశ్యంపై ఫిర్యాదు
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన తండ్రి మల్లేష్ ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రాజు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జనవరి 29 నుంచి కనిపించడం లేదని, ఎన్ని చోట్ల వెతికినా జాడ కానరాలేదని పేర్కొన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 96181 50227 నంబరుకు లేదా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరాడు. -
మూసీ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
మూసీ కాలువలో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మల్లేష్(40) మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అనుమానంతో భార్యను గొంతునులిమి చంపిన భర్త
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఓ భర్త, భార్యను టవల్‌తో గొంతు నులిమి హత్య చేశారు. హత్యను మధ్యాహ్నం జరిగిన గొడవ కారణంగా దెబ్బలు తాళలేక మృతి చెందిందంటూ కట్టు కథ అల్లాడు. అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించే సరికి అసలు విషయం తెలిపాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండెడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కె.మల్లేష్(32)కు అదే ప్రాంతానికి చెందిన కె.వెంకటమ్మ(28)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి శ్రీధర్(5), శ్రీదేవి(3) సంతానం. బ్రతుకుదెరువు కోసం 8 నెలల క్రితం బండ్లగూడ సన్‌సీటీ ప్రాంతానికి వలస వచ్చారు. స్థానికంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో వెంకటమ్మ వాచ్‌మెన్‌గా పని చేస్తూ అందులోనే ఈ కుటుంబం అంతా ఉంటుంది. మల్లేష్ కూలి పని చేస్తున్నాడు. తాగుడుకు బానిసైన మల్లేష్ ప్రతి రోజు తాగి వస్తూ భార్య వెంకటమ్మకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ గొడవకు దిగుతున్నాడు. ఇదిలా ఉండగా వీరు ఉంటున్న నిర్మాణంలో పని కోసం వచ్చిన ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు కరెంటు విషయమై ఆమెతో గొడవపడ్డారు. ఆ సమయంలో వెంకటమ్మ కరెంట్ కుక్కర్లో అన్నం వండుతున్నానని అయిన అనంతరం ప్లగ్ పెడతానని తెలిపింది. ఇదే విషయమై సెంట్రింగ్ కార్మికుడు, వెంకటమ్మకు మధ్య మాటల యుధ్దం జరిగింది. ఇదే సమయంలో సెంట్రింగ్ కార్మికుడు వెంకటమ్మపై చేయి చేసుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన భర్త మల్లేష్‌కు వెంకటమ్మ గొడవ విషయం తెలపడంతో మల్లేష్ సెంట్రింగ్ కార్మికులతో గొడవ పడ్డాడు. సెంట్రింగ్ కార్మికులు ఇద్దరు మల్లేష్‌ను కొడుతుండడంతో అడ్డు వచ్చిన వెంకటమ్మను సైతం కొట్ట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి భార్య, భర్తల ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. అనంతరం పిల్లలకు అన్నం తినిపించి వెంకటమ్మ నిద్రపోయింది. మద్యం మత్తులో ఉన్న మల్లేష్ భార్యపై అనుమానంతో పాటు కోపం ఉండడంతో టవల్‌తో వెంకటమ్మ మెడకు ఉపిరి బిగించి హత్య చేశాడు. ఉదయం ఏమీ తెలియనట్లు గోలగోల చేశాడు. శనివారం రాత్రి గోడవ జరిగిన విషయం, దాడి విషయం స్థానికులు చూడడంతో నిజమే అని నమ్మి విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి భర్తతో పాటు పిల్లలను, స్థానికులను విచారించారు. సెంట్రింగ్ కార్మికులను స్టేషన్‌కు తీసుకువెళ్ళి విచారించారు. విచారణలో తరచూ గొడవ విషయమై వారు చెప్పడంతో భర్తపై అనుమానంతో స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయం తెలిపాడు. భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని దాని విషయమై రోజూ గొడవ జరిగేదని, ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదని, అనుమానంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్!
ఆసిఫాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు ఓ బాలికను చెరబట్టారు. లైంగికదాడికి పాల్పడి సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాగజ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మల్లేశ్ తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం మల్లేశ్ తన మిత్రుడితో కలిసి ఆసిఫాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆసిఫాబాద్‌లో ఉన్న బాలికకు ఫోన్ చేయడంతో బస్టాండ్ వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను చిన్నరాజూర రోడ్‌కు తీసుకవెళ్లారు. వీరిని గమనించిన ఆసిఫాబాద్‌కు చెందిన మాచెర్ల రాజు, రౌతు రంజిత్, సయ్యద్ మతీన్ అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురూ కలసి మల్లేశ్‌ను, అతడి స్నేహితుడు బాలికను బెదిరించి సెల్ఫోన్లు లాక్కున్నారు. అనంతరం బాలికను పక్కకు తీసుకెళ్లి రాజు(27), రంజిత్(25), మతీన్(23)లు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సామూహిక అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
నిలదీసిందని నిప్పు పెట్టారు...
కొడుకును ఎందుకు కొట్టారని అడిగినందుకు.. ఇంటిపై దాడి, మహిళపై పెట్రోల్ పోసి నిప్పు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితురాలు ఎనిమిది మంది రిమాండ్.. పరారీలో ఇద్దరు అడ్డగుట్ట: తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీసిన పాపానికి మహిళపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. తన కుటుంబసభ్యులతో ఆమె ఇంటిపై దాడి చేశాడు. అందరినీ చితకబాదాడు. అడ్డువెళ్లిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన మల్లేష్ ఆదివారం తన వీధిలో నుంచి కారు తీస్తుండగా అదే ప్రాంతానికి చెందిన వేణు(11) అనే బాలుడు అడ్డంగా వచ్చాడు. ఆగ్రహానికి గురైన మల్లేష్ కారుదిగి ఆ బాలుడ్ని కొట్టాడు. ఇది గమనించిన శ్రీకాంత్ అనే యువకుడు ఎందుకుకొడుతున్నావని ప్రశ్నించడంతో మల్లేష్ అతడిని కూడా కొట్టాడు. దీంతో శ్రీకాంత్ తల్లి చంద్రకళ (40)(గాయపడిన మహిళ) వచ్చి ఎందుకు నా కొడుకును కొడుతున్నావని అడిగింది. దీంతో మల్లేష్-చంద్రకళల మధ్య వాగ్వాదం జరిగింది. బస్తీ నాయకులు వచ్చి ఉదయం మాట్లాడుదామని చెప్పి గొడవను అదుపు చేశారు. ఉదయాన్నే దారుణం... తనతో గొడవపడిన చంద్రకళపై కక్షగట్టిన మల్లేష్ సోమవారం ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. చంద్రకళ కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తన పిల్లలను కాపాడుకొనేందుకు అడ్డువెళ్లినచంద్రకళపై మల్లేష్ మేనల్లుడు బంటీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాలినగాయాలతో పడివున్న చంద్రకళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 శాతం కాలిన గాయాలతో చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడవ కారణమైన మల్లేష్(50), శివకుమార్, పొట్టికుమార్, శివ, సాయికిరణ్, బంటి, వెంకటేష్, కేతమ్మ, శంకరమ్మ, సాలమ్మ (మొత్తం 10 మంది)పై పోలీసులు 147, 148, 149 ఐపీసీ, 307 కేసులు నమోదు చేశామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే శంకరమ్మ, సాలమ్మలు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మంది నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. -
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్
నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
రూ.500 కోసం గొడవ..జీవితకాలం శిక్ష
-రూ. 2000 జరిమానా.. -వికారాబాద్ కోర్టులో వెలువడిన తీర్పు పరిగి: రూ. 500 ల కోసం పెట్టుకున్న గొడవ ఓ యువకుడిని జీవితాంతం జైలుకే పరిమితం చేసింది. యువకుడికి శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలవరించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సెషన్స్ కోర్టులో జిల్లా అడిషనల్ సెషన్ జడ్జ్ కే.రంగారావ్ ఈ శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు.. జిల్లాలోని పరిగి మండల పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన పిచ్చకుంట్ల మల్లేశ్(25) తనకు ఇవ్వాల్సిన రూ.500 అప్పు తీర్చాలంటూ అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల హన్మంతుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో చెలరేగిన గొడవలో మల్లేశ్ హన్మంతును కత్తితో పొడవగా అతను మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2011 ఆగస్టు 10వ తేదీ కేసు నమోదు చేసుకుని, అప్పటి సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ రాజయ్యలు దర్యాప్తు ప్రారంభించారు. చార్జిషీట్ దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా కేసుకు సంబందించి ట్రాయల్స్ జరగగా వాదనలు ముగిసి నేరం రుజువు కావటంతో గురువారం తీర్పును వెలువరించారు. మల్లేశ్ కు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
రుణ భారంతో రైతు ఆత్మహత్య
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్‌లో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపురం మల్లేశం(45)కు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. గత ఏడాది పొలంలో ఉన్న బోరు ఎండిపోవడంతో పంట సాగుచేయలేదు. అప్పటికే ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అప్పు తీర్చేందుకు తన పొలాన్ని అమ్మేందుకు మల్లేశం సిద్ధపడ్డాడు. అయితే, రుణ దాత ఒకరు తను చెప్పిన వారికి మాత్రమే పొలాన్ని అమ్మాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మల్లేశం తిరిగిరాలేదు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి పొలంలోని గుడిసెలో ఉరి వేసుకొని కనిపించాడు. మల్లేశం భార్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై రమేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరి మృతి
రామగుండం: కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రామగుండం మండలం బసంత్‌నగర్ ఏయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండంకు వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎన్టీపీసీకి చెందిన మిట్టా రాజ్‌కుమార్(20), మల్లేష్(21)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
సంక్రాంతి వేడుకల్లో విషాదం