marriage ceremony
-
షాకింగ్ ఘటన.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని అర్బన్ అల్లిపురంలో విషాద ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ సడన్‌గా కుప్పకూలింది. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలి పేరు రాణి. బంధువుల పెళ్లికి హాజరై ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. రాణి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఊరేగింపును అర్ధాంతరంగా నిలిపివేశారు. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
పెళ్లి నాటి ప్రమాణం.. అవయవదానం
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుక అవయవదాన హామీ పత్రాల సమర్పణకు వేదికగా మారింది. వధూవరులు సజీవరాణి, సతీష్‌కుమార్‌తోపాటు 66 మంది తమ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. విశాఖలోని అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘం, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అవయవదాన ఆవశ్యకతను తెలియజేస్తూ వివాహ వేదిక వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ట్రస్ట్ ప్రతినిధుల సూచనల మేరకు వధూవరులు, వారి బంధుమిత్రులు 66 మంది అవయవదానం చేస్తామని హామీ పత్రాలపై సంతకాలు చేసి ట్రస్ట్ చైర్çపర్సన్ గూడూరు సీతామహలక్ష్మికి అందజేశారు. ఈ పత్రాలను ప్రభుత్వ సంస్థ జీవన్‌దాన్‌కు అందిస్తామని సీతామహలక్ష్మి తెలిపారు. తాము ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది నుంచి అవయవదాన హామీ పత్రాలను స్వీకరించామని చెప్పారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ విద్యార్థుల బోధన అవసరాల కోసం 2007లో 35 మృతదేహాలను అప్పగించిన తర్వాత అవయవదాన హామీ పత్రాల ఉద్యమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 35 మెడికల్ కళాశాలలకు 400 భౌతికదేహాలను అందజేశామన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ద్వారా 18 మందిని బతికించవచ్చని వివరించారు. అవయవదానం చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో ఒకరికి క్లాస్–4 ఉద్యోగం కల్పించినా మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారన్నారు. -
మర్యాదలు సరిగా జరగలేదని వెళ్లిపోయిన పెళ్లికుమార్తె
-
ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..
పొదిలి/దర్శి టౌన్: అది పొదిలిలోని ఆంజనేయ స్వామి ఆలయం. వివాహ వేడుక సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణ మొత్తం వధూవరుల బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. కళ్యాణ ఘట్టం పూర్తి చేసేందుకు వేద పండితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. కాసేపు ఆగితే పెళ్లి తంతు ముగిసేది! ఇంతలో పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘‘పోలీసులు ఎందుకొచ్చారబ్బా..’’ అని అంతా సంశయించేలోపే పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్శి ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు.. దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే యువకుడు బేల్దారి పనులకు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు సరస్వతిని ప్రేమించాడు. వీరి పెళ్లి విషయమై రెండు కుటుంబాల మధ్య ఇటీవల సంప్రదింపులు నడిచాయి. చదవండి: యువతలో ఇడియట్స్ అయితే డిగ్రీ చదువుతున్న కూతురికి బేల్దారి పనికి వెళ్లే రవీంద్రతో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం పొదిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన తనకు తాళి కట్టిన యువకుడు పొదిలిలో మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని, తనను మోసం చేస్తున్నాడని సరస్వతి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. పొదిలి ఎస్సై శ్రీహరితో కలిసి వివాహం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. పరిస్థితిని పెళ్లి కుమార్తె తరఫు వారికి వివరించారు. అనంతరం రవీంద్రను పెళ్లి దుస్తుల్లోనే దర్శి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై తెలిపారు. చదవండి: దుప్పిని మింగిన కొండచిలువ -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. గన్‌తో వరుడి బంధువుల రచ్చ..!
ఓ వైపు పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. ఓ వైపు బ్యాండ్ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చుట్టాలు మూగే సమయానికి పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. లక్నో: మరికొద్ది గంటల్లో పూర్తి కావాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. వివాహ వేడుక వద్ద వరుడి తరపున బంధువులు జరిపిన కాల్పుల్లో వధువు మామ గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. దీంతో పెళ్లి కొడుకు బంధువుల ప్రవర్తనకు విస్మయం చెందిన వధువు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వధువు తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత పెళ్లి కూరుతు తరపున బంధువులు వరుడి కుటుంబం పై దాడి చేసి, కారును పగలగొట్టి అతని బంధువులను బందించారు. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై వధువు ఇరామ్ స్పందిస్తూ.. ‘‘ నా కుటుంబం మొత్తం ఉన్నప్పుడే.. వాళ్ల కుంటుంబ ఈ విధంగా ప్రవర్తిస్తే.. ఇక నేను వాళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు?’’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పులు జరిపిన వారిని గుర్తించడానికి పెళ్లి వేడుక వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర పలావత్ తెలిపారు. వరుడు షాజాద్ అతని సోదరుడు పప్పు, సానుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైసెన్స్ కలిగి ఉన్న ఆయుధం నుంచి బుల్లెట్ పేలితే, ఆయుధ లైసెన్స్ రద్దుకు నివేదిక పంపిస్తారని తెలిపారు. ఇక గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అలాంటి అబ్బాయితో తిరుపతిలో నా పెళ్లి!
శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్‌కి యూత్‌లో బోలెడంత క్రేజ్ ఉంది. హిందీలో కథానాయికగా మంచి ఫామ్‌లో ఉంది ఈ బ్యూటీ. మంచి మంచి సినిమాలు చేయడంతో పాటు పెళ్లీడులో ఉండే అమ్మాయిలు కలలు కనేట్లు తన పెళ్లి గురించి కూడా జాన్వీకి కొన్ని కలలు ఉన్నాయి. ఇటీవల ఓ ఇంగ్లిష్ మ్యాగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి కబుర్లను ఈ విధంగా పంచుకున్నారు జాన్వీ కపూర్. ►బ్యాచిలరెట్ పార్టీ ఎక్కడ చేసుకుంటారు? జాన్వీ: దక్షిణ ఇటలీలోని కాప్రీలో పడవలో చేసుకుంటాను. ►మరి.. సంగీత్, మెహందీ వేడుకలు? రెండు వేడుకలూ మైలాపూర్ (తమిళనాడులోని శ్రీదేవి ఇల్లు)లో మా ఇంట్లో జరుపుతాం. ►మరి.. పెళ్లి? తిరుపతిలో. ►పెళ్లికి ధరించే బట్టల గురించి? ఎలాంటి కలర్స్ వాడతారు? సంప్రదాయబద్ధంగా ప్లాన్ చేస్తాను. పెళ్లికి కాంచీపురం చీర... మెహందీ, సంగీత్లకి ఎల్లో, పింక్, గోల్డ్ కలర్... వీటితో నా అవుట్‌ఫిట్స్ ఉంటాయి. ►నగలు? డైమండ్‌తో చేసినవి. ►పెళ్లి వేడుకలు ఎన్ని రోజులు జరుపుకుంటారు? రెండు రోజులు. అంతే. ►రిసెప్షన్ ఎక్కడ? రిసెప్షనా? అవసరమా? ►పెళ్లిలో మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఎగరడం, నవ్వడం, ఏడవడం, తినడం... ఇలా. ►పెళ్లి మండపం అలంకరణ ఎలా ఉండాలనుకుంటున్నారు? డెకరేషన్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే ట్రెడిషనల్‌గా ఉండాలి. పెళ్లి స్టేజీని మల్లెపువ్వులు, కొవ్వొత్తులతో అలంకరిస్తే బాగుంటుంది. ►తోడు పెళ్లికూతురిగా ఎవర్ని అనుకుంటున్నారు? నా చెల్లెలు ఖుషీ, అన్షులా (జాన్వీ తండ్రి బోనీ మొదటి భార్య కుమార్తె), స్నేహితురాలు తనీషా సంతోషి. పెళ్లిలో ఒకవేళ మా నాన్న ఎమోషనల్ అయితే అప్పుడు ఆయన్ను ఎలా సముదాయించాలో మా అన్షులాకు తెలుసు. ►ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా? కచ్చితంగా తెలివైనవాడు అయ్యుండాలి. నేనింకా ఎవర్నీ కలవలేదు. -
శోభనం రాత్రి వధువు ప్రశ్నకి బిత్తరపోయిన వరుడు!
పెళ్లి రెండు జంటలను కలుపుతుంది. కొన్ని కుటుంబాలను బంధంతో ముడివేస్తుంది. అలా ఏర్పడిన బంధాలు జీవితంలో ఓ భాగంగా మారిపోతాయి. పండుగలకు.. వేడుకలకు ఇల్లంతా చుట్టాలతో నిండిపోతుంది. ఇలాంటి సన్నివేశాలు భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే బాధ వచ్చినా.. సంతోషమైనా పంచుకునే బంధాలు, అనుబంధాలు ఉండాలి అంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువు అడిగిన ప్రశ్న బంధువులను అయోమయంలో పడేసింది. ఆ తరువాత అందరినీ నవ్వులతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ పెళ్లి వేడుకకు చాలా మంది అతిథులు వచ్చారు. పెళ్లి వేడుక పూర్తైనది. వధూవరులను ఆశీర్వదించిన బంధవులు ఇంటికి పయనమయ్యారు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ రాత్రికి జరగాల్సిన కార్యానికి అంతా సిద్దం చేశారు. మంచాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. వరుడు మంచం మొత్తం గులాబీ రేకులతో కప్పేశాడు. అయితే శోభనం గదిలో అడుగుపెట్టిన పెళ్లి కూతురు ‘‘సోయెంగే కహా పె( మనం ఎక్కడ నిద్రపోవాలి)’’ అని అడిగిన ప్రశ్న బంధువులకు తెగ నవ్వు తెప్పించింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘పడక గదిని పబ్లిక్ చేశారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు నవ్వుతూ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ ఈ వీడియోను దుల్హనియా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa) -
వదినమ్మ స్టెప్పులు.. ఫిదా అయిన నెటిజన్లు.. వైరల్ వీడియో
పచ్చని తోరణం.. చుట్టూ చుట్టాలు.. తప్పెట్లు, తాళాలు.. ఎక్కడ చూసిన హడావుడి. ఇది సాధారణంగా పెళ్లిలో కనిపించే హంగామా. అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్ కళ్యాణ్.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు.. అప్పటి వరకు జరిగిన పెళ్లి వేడుకకు ఓ లెక్క ఉంటే.. బరాత్‌లో ఉండే దూమ్.. దామ్ మరో ఎత్తుకు తీసుకెళ్తుంది. ముంబై: మహారాష్ట్రలోని ఓ పెళ్లివేడుకలో వధూవరులను గుర్రపు రథంపై ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో.. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్' నుంచి 'ఐ హై శుభ్ గదీ, ఆజ్ బని మెయిన్ బాడి' అనే పాటకు ఓ మహిళ వేసిన డ్యాన్స్ నెటిజన్లను మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్రలోని ధరంగన్కు చెందిన దినేష్ దేశ్ ముఖ్ అనే ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 50 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ స్టెప్పులు వేసిన వ్యక్తి పెళ్లి కుమారుడి వదినే కావడం. ఇక ఈ వదినమ్మ డ్యాన్స్‌కు ఫిదా అయిన లక్షల మంది నెటిజన్లు లైక్‌లు కొట్టి, కామెంట్లు చేస్తున్నారు. ‘‘డ్యాన్స్ అదిరింది. వధూవరులతో కూడా ఓ స్టెప్ వేయిస్తే.. బాగుంటుంది వదినమ్మా.’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dinesh Deshmukh (@dinesh.vastav) -
స్టేజిపై వరుడుని ఆట పట్టించిన వధువు!
ఒకప్పుడు వధూవరులు తమ వివాహ వేడుకలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సంకోచించేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వధూవరులు చేసే వింత పనులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధూవరుల కబడ్డీ ఆటాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి వేడుకలో వధూవరుల దండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అయితే మొదట వరుడి మెడలో వధువు దండ వేయగా.. వరుడి వంతు వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఆట మొదలెట్టింది. పెళ్లి వేదికపై అటూ.. ఇటూ.. పరుగెత్తుతూ పెళ్లి కొడుకుకి పట్టుకోమన్నట్లు సవాలు విసిరింది. కొంతసేపు ఇద్దరూ పట్టుకో.. పరుగుపందెం ఆట ఆడారు. ఇక వరుడికి బంధువులు కొంత సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆటలు ఆడే స్థలం కాదు.. కొద్దిగా పక్కకు వెళ్లి ఆడుకోండమ్మా!’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ఇద్దరి చెవుల్లో గుసగుసలు మొదలైనపుడే అనుకున్నాను. ఏదో తిక్క పని చేస్తారు.’’ అని అంటూ ఘాటుగా స్పందించాడు. ఈ ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీశ్ మిశ్రా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी। दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx — Manish Mishra (@mmanishmishra) July 23, 2021 -
పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్.. వామ్మో!
ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వరుడు చేసే వింత పనులకు విసుగెత్తిన నవ వధువు వెంటనే కటీఫ్ చెబుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పెళ్లి మధ్యలో ఓ వరుడు లేచి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి మండపంలో వరుడు, వధువు కూర్చుని ఉండగా.. పక్కనే పురోహితుడు పెళ్లి కార్యక్రమాలను నడిపిస్తున్నాడు. అయితే పెళ్లి కొడుకు అకస్మాత్తుగా లేచి.. బాడీ మొత్తం షేక్ చేస్తూ డ్యాన్స్ చేస్తాడు. పట్టరాని ఆనందంలో సంతోషాన్ని వ్యక్త చేస్తాడు. దీంతో పెళ్లి కూతురితో పాటు చుట్టూ ఉన్న బంధువులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: వైరల్: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత!) -
కరోనా విజృంభణ..భయాందోళనలో గ్రామస్తులు
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. 250 జనాభాగల ఆదివాసీ గ్రామం వణికిపోతోంది. ఈ నెల 26వ తేదీన ఈసం భద్రయ్య, కోరం ఎల్లయ్యలు కరోనాతో చనిపోవడం అంతకుముందు కోరం రాయుడు అనే వ్యక్తి సైతం కరోనాతో మృత్యువాత పడడంతో ముత్యాలగూడెం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 6, 14వ తేదీల్లో జరిగిన వివాహ వేడుకలే..గ్రామంలో కరోనా వ్యాప్తికి కారణమని, ఎక్కువ సంఖ్యలో జనం హాజరై విందు భోజనాలు చేశారని, మాస్కులు లేకుండా కలివిడిగా తిరిగారని స్థానికులు కొందరు వాపోతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే గ్రామంలో 70 కరోనా కేసులు నమోదు కావడం, ముగ్గురు చనిపోవడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. కొడుకు పెళ్లి చేసిన ఈసం భద్రయ్య కరోనా సోకి చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తహసీల్దార్ డి.పుల్లయ్య, కారేపల్లి ఎస్ఐ పి.సురేశ్, వైద్య సిబ్బంది, కరోనా బాధితుల కుటుంబాలకు మందులు అందజేశారు. కరోనా బాధితుల్లో మరికొందరిని గాంధీనగర్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. (చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు) -
వివాహ వేడుక.. వినూత్న ఆలోచన
ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు. వీలైనంతవరకు డబ్బు ఇవ్వడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. అలా ఇవ్వటం వల్ల కొత్త జంట వాళ్లకు కావలసింది వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే పెళ్లికి బయలుదేరే ముందు కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావు. ముఖ్యంగా నూతన వధూవరులకు ఇవ్వాలనుకునే నగదును ఉంచటానికి కావలసిన గిఫ్ట్ క్యాష్ కవర్. ఓ పక్కన ముహూర్తానికి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కవరు కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంటుంది. చివరకు ఏమీ చేయలేక, వధూవరుల చేతిలో నేరుగా డబ్బు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక కవరు కోసం వెతుకులాడవలసిన అవసరం లేదు. నేరుగా వారి అకౌంట్లోకి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారు. తమిళనాడులోని మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న టి. జె. జయంతి కుటుంబం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శుభలేఖ మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నూతన వధూవరులకు ఇవ్వాలనుకుంటున్న నగదు బహుమతిని ఈ కోడ్ ద్వారా బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా వివాహానికి హాజరు కాలేని వారి కోసం ఆ ఆలోచనను ఆచరణలో ఉంచారు. ‘‘30 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పెళ్లి కానుకను క్యూఆర్ కోడ్ ద్వారా పంపారు, మా కుటుంబంలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రచురించటం ఇదే ప్రథమం. ఆదివారం నాడు వివాహం జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ కార్డు వైరల్ అవుతోంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు’’ అంటున్నారు జయంతి. ఆన్లైన్ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఒక వివాహం సందర్భంగా, ఇళ్ల దగ్గర నుంచి ఆన్లైన్లో వివాహం వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులకి, వారివారి ఇళ్ల దగ్గరకే విందును ఆర్డర్ చేశారు. ఏ లోటూ రాకుండా, దేనినీ మిస్ అయ్యామనే భావన లేకుండా, ఆన్లైన్ ద్వారా అన్నీ సమకూరుతున్నాయి. టెక్నాలజీకి రెండు చేతులతో నమస్కరించాల్సిందే. -
ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి
ప్రముఖ సినీ గీత రచయిత శ్రీమణి ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పదేళ్లు ప్రేమించిన ప్రేయసి ఫరాను ఆదివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టాడు. ‘ఫరాతో పెళ్లి కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నాను. చివరకి కల నిజమైంది. ప్రియమైన ఫరా.. నా జీవితంలోకి వెలకమ్. మా ప్రేమను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటి చేసినందుకు మా తల్లిదండ్రులకు, దేవునికి కృతజ్ఞతలు. వివాహ జీవితం ప్రారంభం’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా! Welcome to my life My sweet little angel (fara) We r waiting for this moment From past 10 years Finally dream came true Thx to the God and our parents For understanding our hearts 💕 #MarriedLifeBegins pic.twitter.com/2njsfNClqc — ShreeMani Lyricist (@ShreeLyricist) November 22, 2020 కాగా కరోనా మహమ్మారి కాలంలో అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్తోపాటుగా కాజల్ అగర్వాల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో శ్రీమణి కూడా చేరిపోయారు. దీంతో శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైందంటూ ట్వీట్ చేశాడు. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్నమాట అని ట్వీట్ చేశారు. చదవండి: వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి Woww CONGRATS dearest @ShreeLyricist Now I understand d secret of ur Romantic Lyrics😜❤️ ISHQ SIFAAYAA🎶😍 ani paadi..#Ranguladdhukunna ani Secret ga Love Chesi..#EmitoIdhu ani memandaram anukunela Pelli Chesesukunnaru maata.. HAPPY MUSICAL MARRIED Life to both of U❤️🤗 https://t.co/MaTBh8nf0k — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 22, 2020 ఇక తన పాటలతో సంగీత ప్రేమికులను అలరించిన వ్యక్తిగా శ్రీమణికి మంచి పేరు ఉంది. 100% లవ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీమణి.. ఆ తరువాత జులాయిలో చక్కని బైక్ ఉంది, మీ ఇంటికి ముందో గేటు, అత్తారింటికి దారేదిలో ఆరడగుల బుల్లెట్టు, గీతా గోవిందం సినిమాలోని వచ్చిందమ్మా వచ్చిందమ్మా, ఎఫ్ 2లో ఎంతో ఫన్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో జారుకో.. జారుకో వంటి అద్భుతమైన పాటలను రాశారు. అంతేగాక ఉప్పెన సినిమాలో ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడే నా పెళ్లి.. లేదంటే..!: త్రిష -
హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట
ముంబై : ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత వారం కాజల్ తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం కాజల్ భర్త కిచ్లుతో ముంబైలో ఉన్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొననున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్ లీడ్‌లో కాజల్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో కాజల్ మరో వారంలో తిరిగి జాయిన్ కానున్నారని, ఈ షెడ్యూల్డ్ పూర్తి అయిన తరువాత హనీమూన్ ప్లాన్ చేసుకోనున్నట్లు వదంతులు వ్యాపించాయి. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ అయితే ఈ వార్తలకు భిన్నంగా కాజల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌కు ముందే నూతన దంపతులు ఇద్దరు ఇప్పుడే హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. తాము హానీమూన్ వెళుతున్నట్లు శనివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేశారు. తమ పేర్లతో ఉన్న పౌచ్‌లతో పాటు పాస్ట్ పోర్ట్లని షేర్ చేశారు. దీనికి ‘బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో’ అనే కామెంట్ చేశారు. అయితే ఎక్కడికి వెళుతున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా కాజల్, గౌతమ్ జంటకు నెటిజన్స్ హ్యాపీ జర్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కాజల్ నో చెప్పింది ఇందుకే.. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం
నటుడు, బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో బుధవారం మూడు ముళ్లు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. కోవిడ్ కారణంగా ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బిగ్‌బాస్‌లో తన స్నేహితులైన తనీష్, దీప్తీ సునాయనా కూడా హాజరయ్యారు. సామ్రాట్ పెళ్లి వార్త తెలిసిన నెటిజన్లు, అభిమనులు నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించిన వీడియోను సామ్రాట్ సోదరి, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: నటుడు సామ్రాట్ సోదరికి కరోనా ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పేరు సంపాదించాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ టాప్ 5కు చేరాడు. ఇదిలా ఉండగా సామ్రాట్‌కు ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. ఇంతకముందు హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2018లో కట్నం కోసం వేధిస్తున్నాడని, తనపై హత్య ప్రయత్నం చేశాడని సామ్రాట్‌పై హర్షిత కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చదవండి: నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ -
పెళ్లి అయ్యిందని చెప్పిన నటి.. షాక్‌లో అభిమానులు
తెలుగులో తనిష్‌తో కలిసి ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాలో నటించిన నీతి టేలర్ చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత పెళ్లి పుస్తకం సినిమాల్లో నటించినప్పటికీ అప్పటి నుంచి సినిమాల్లో ఎక్కువ కనిపించలేదు. అనంతరం టెలివిజన్ స్టార్‌గా మారి బుల్లితెర షోలో మెరిశారు. తాజాగా ఈ భామ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆగష్టులో తన చిరకాల స్నేహితుడు పరిక్షిత్ భవను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు కనిపిస్తోంది. చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్ అగర్వాల్ ‘మిస్ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆగష్టు 13 2020న పరిక్షిత్‌ను వివాహం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పడు నేను గట్టిగా చెప్పగలను ‘హలో హస్బండ్’ అంటూ పేర్కొన్నారు. అంతేగాక తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ఆలస్యంగా వెల్లడించాల్సి వచ్చిందో కారణం కూడా తెలిపారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న సందర్భంగా వివాహాన్ని దాచిపెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతరించిన అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. చదవండి: నేహా పెళ్లిపై స్పందించిన మాజీ ప్రియుడు! View this post on Instagram My journey from Miss to Mrs is complete. I'd like to share with all my well wishers that I tied the knot with Parikshit on 13 August 2020. We had a very small, quiet and intimate wedding with just our parents, aka, Covid wedding 😉 I can finally say out loud "Hello Husband" ❤️ Making my own happiness in 2020!! Also, I'm announcing this late because we were hoping that the Covid-19 pandemic would die down sooner and we could celebrate in a big way - but hoping for a better 2021 😁 Looking beautiful in - @payalkeyalofficial Jewellery- @purabpaschim 📸- @thebigdaystory #partitayles A post shared by Nititay (@nititaylor) on Oct 5, 2020 at 11:12pm PDT కాగా నీతి పెళ్లి వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో మెహెందీ ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు జరిగిన పనులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదిలా ఉండగా నీతి గతేడాది పరిక్షిత్తో నిశ్చితార్థం జరుపుకుంది. అతడు భారత ఆర్మీ కెప్టెన్. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసినప్పటికీ కరోనా మహమ్మారి సమంలో పెళ్లి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. చివరికి నీతి ఇలా ఊహించని విధంగా పెళ్లి అయిపోయిందని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. -
నటి మూడో పెళ్లి; ఫోటోలు వైరల్
చెన్నై : నటి వనిత విజయ్‌కుమార్ శనివారం(జూన్27) సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. క్రైస్తవ మత ఆచారం ప్రకారం సాయంత్రం 4 గంటలకు చెన్నైలో వీరి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వనితకు ఇది మూడో వివాహం కావడం గమనార్హం. ఈ వేడుకలో వనిత ముందు భర్త పిల్లలు జోవికా, జయనిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (నటి మరో పెళ్లి.. కుమార్తె మద్దతు) ఇప్పటికే 2000 సంవత్సరంలో వనిత విజయ్‌కుమార్ నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోగా, ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. మళ్లీ ఆనంద్‌తోనూ 2012లో విడాకులు తీసుకున్న వనిత శనివారం తన ఇంటి వద్దే పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమెకు నలుగురు సోదరీలు, ఒక సోదరుడు ఉన్నారు. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ మలయాల సినిమాల్లో నటించిన ఈ నటి ఇటీవల తమిళ బిగ్‌బాస్-3లో పాల్గొని మళ్లీ వార్తల్లోకెక్కారు. (బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!) #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram Cooku With கோமாளி 👨🍳🤡 Best Wishes @vanithavijaykumar ❤❤ 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬┃𝐂𝐨𝐨𝐤𝐮 𝐖𝐢𝐭𝐡 𝐂𝐨𝐦𝐚𝐥𝐢┃𝟐𝟒×𝟕 𝐊𝐞𝐞𝐩 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 & 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 #actorajithkumarofficial #cookwithcomali #cookuwithcomali #cookuwithcomalivijaytv #CookwithComali omali #trading #comedy #biggbosstamil #biggbosstroll #actorajithkumarofficial #biggbossunseen #tharshan #tharshanarmy #tharshanbiggboss3 #tharshan #tharshanforever #tharshanfans #tharshanfc #losliya #losliyaarmy #losliyafans #losliya_army #losliya_maria #losliyaarmy #kavin #actorajithkumarofficial #themugenrao_fans #losliyaarmy #losliyafans #losliya_army #iamsandy_off #sandymandy_official #sandymasterarmyofficial #abiramivenkatachalam #shakshiagarwal #sherinshringar #actorajithkumarofficial A post shared by Cooku With கோமாளி 👨🍳🤡🔪🥗🍗🦀🦐🍲🥘 (@cookuwithcomalivijaytv) on Jun 27, 2020 at 3:30am PDT https://t.co/V3roOy1QRW Vanitha and Peter paul wedding clicks....#VanithaPeterpaulWedding#vanithavijayakumar#VanithaVijaykumar#VanithaWedding #Vanithavijayakumarwedding #vanithamarriage#vanithaweddingimages #vanithaweddingpictures #vanithaclicks pic.twitter.com/nUgDVdwozO — Sindhu Ganesh (@SindhuGanesh8) June 27, 2020 -
ఘనంగా రక్షిత వివాహం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం గురువారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని బెంగుళూరు ప్యాలెస్‌లో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవరెడ్డితో రక్షిత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, సీఎం బీఎస్ యడియూరప్ప, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పలువురు. మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. (రక్షిత పెళ్లికూతురాయనే !) -
రక్షిత పెళ్లికూతురాయనే !
సాక్షి, బళ్లారి : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు ఇంట పెళ్లి సందడి మొదలైంది. శ్రీరాములు పెద్ద కుమార్తె రక్షిత వివాహం ఈ నెల 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో హైదరాబాద్‌కు చెందిన లలిత్ సంజీవ్‌రెడ్డితో జరగనుంది. సోమవారం బళ్లారి హవంబావిలో శ్రీరాములు స్వగృహంలో పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించి రక్షితను పెళ్లి కుమార్తెను చేశారు. శ్రీరాములు దంపతులు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు ప్యాలెస్‌లోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా కళా దర్శకులు వివాహ మంటపాన్ని తీర్చిదిద్దారు. (రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం) -
నేపాలీ అమ్మాయిలతో భారతీయ అబ్బాయిల పెళ్లి
లక్నో : వివాదాస్పదమైన అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. తాజాగా కరసేవకులు తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయిన అబ్బాయిలకు, సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్(నేపాల్) అమ్మాయిలను వివాహం పేరుతో ఒకటి చేయబోతున్నట్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి మొత్తం 108 మంది తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ వివాహ వేడుకను' శ్రీరామ్-జానకి వివాహ్ బరాత్ యాత్ర- అయోధ్య సే జనక్‌పూర్' పేరుతో నిర్వహించనున్నట్లు విశ్శ హిందూ పరిషత్‌కు చెందిన ధర్మయాత్ర మహాసంఘ్ వెల్లడించింది. ఈ వేడుకను మొత్తం 13 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 21న అయోధ్యలోని కర్‌సేవక్‌పురమ్ జంకి ఘాట్ నుంచి కన్య పూజ, తిలకోత్సవం పేరుతో మొదలై డిసెంబర్ 4న గోరక్‌పూర్‌లో జరిగే బరాత్ కార్యక్రమంతో ముగుస్తుందని పేర్కొన్నారు. చివరిరోజు వేడుకకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హాజరవనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకుకు సంబంధించి యూపీ నుంచి అంబేద్కర్‌నగర్, మావు, అజామ్‌ఘర్, బీహార్ నుంచి బక్సర్, పటలీపుత్ర, హాజీపూర్, ముజఫర్‌పూర్,సీతామర్హి, దర్బంగా, మోతీహరి ప్రాంతాలను స్వాగత ద్వారాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే వీరి వివాహాలు నేపాల్‌లోని ధశరథ్ మందిర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం భారత్- నేపాల్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని, అంతేగాక సంప్రదాయలో ఒకే విధంగా ఉండే రెండు దేశాల మధ్య అడ్డు ఉన్నది సరిహద్దు మాత్రమేనని పేర్కొన్నారు. ' రామ మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దీనిని ముడిపెట్టొద్దు. ప్రతీ ఐదేళ్లకోసారి ఇలాంటి వేడుకను నిర్వహిస్తుంటాం. అయితే ఈసారి యాదృశ్చికంగానే మాకు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం వరకు ప్రతీ ఒక్కరిని ఆహ్వానించినట్లు' కార్యక్రమ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్ పంకజ్ పేర్కొన్నారు. -
ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్ స్టేషన్
సాక్షి, జోగిపేట(అందోల్): అందోలులోని ఉన్నత పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుధవారం శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక్కటి శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉండటంతో అందోలులో ఏర్పాటు చేసినట్లు అందోలు తహసీల్దార్ బాల్‌రెడ్డి తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కర్టెన్లతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలాగా ఏర్పాటు చేసిన స్వాగతతోరణం బాగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని చూసి వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. -
అన్నవరం సత్యదేవుని పరిణయ వేడుక
భక్తుల పాలిట కొంగు బంగారం... తెలుగు ప్రజల ఇలవేల్పు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. వారి దివ్యకల్యాణ మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలో గల రత్నగిరి ముస్తాబైంది. ఈ నెల 25, బుధవారం, వైశాఖ శుద్ధ దశమి నుంచి, మే 1, వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరగనున్న ఈ వార్షిక కల్యాణ వేడుకలకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో వివాహమైనా, గృహప్రవేశమైనా, మరే ఇతర శుభకార్యమైనా శ్రీసత్యదేవుని వ్రతమాచరించాల్సిందే. తన వ్రతమాచరిస్తేనే కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేత శ్రీసత్యదేవుడు. అటువంటి మహత్తు కలిగిన స్వామివారిని దర్శించినా భాగ్యమే. శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల వివరాలు , ఏప్రిల్ 25, వైశాఖ శుద్ధ , దశమి, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేస్తారు. రాత్రి ఏడు గంటలకు కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం. 26, గురువారం రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరి కల్యాణ వేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవారికి దివ్యకల్యాణ మహోత్సవం రత్నగిరి రామాలయం పక్కనే గల కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. 27, శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్థాన సేవలు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమాలు. 28, శనివారం మధ్యాహ్నం 2–30 గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో వేదపండిత సభ, అనంతరం పండిత సత్కారం. ఈ వేదపండిత సభ కు విచ్చేసి తమ విద్వత్తు ప్రదర్శించి స్వామి వారి సన్నిధిలో సత్కారాలు అందుకోవాలని 140 మంది వేదపండితులకు దేవస్థానం ఆహ్వానం పంపించింది. 29, ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు వనవిహార మహోత్సవం. ఈసారి కొండ దిగువన గల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30, వైశాఖ పౌర్ణమి, సోమవారం: ఉదయం ఎనిమిది గంటలకు పంపా రిజర్వాయర్ నందు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం. సాయంకాలం నాలుగు గంటలకు నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. మే ఒకటి, వైశాఖ బహుళ పాడ్యమి, మంగళవారం రాత్రి ఏడు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారికి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయోగ మహోత్సవం. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, ఆశీర్వచనం శ్రీసత్యదేవుని కల్యాణ వేడుకల విశేషాలు శ్రీ సీతారాములే పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. విశేషమేమిటంటే ఈ ఉత్సవాల ఏడు రోజులు మినహాయిస్తే ఏడాదిలో 358 రోజులు శ్రీసత్యదేవునికి నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఆ నిత్య కల్యాణానికి కూడా సీతారాములే పెళ్లి పెద్దలు. శ్రీరామనవమి నాడు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారే పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు. 5 రోజులు అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలలో ఐదు రోజులు రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ శ్రీసత్యదేవుడు, అమ్మవారిని అన్నవరం కొండదిగువన వివిధ వాహనాలపై ఘనంగా ఊరేగిస్తారు. 29, 30 తేదీలలో చాగంటి వారి ప్రసంగం స్వామివారి కల్యాణ మహోత్సవాలలో 29, 30 వ తేదీలలో సాయంకాలం ఆరు గంటలకు రత్నగిరిపై ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీసత్యదేవుని వైభవం గురించి ఉపన్యసిస్తారు. అన్నవరం రావాలంటే... చెన్నయ్– కలకత్తా హైవే–15 మీద గల అన్నవరానికి చేరుకోవాలంటే రోడ్డు లేదా రైళ్ల ద్వారా రావచ్చు. రాజమండ్రి నుంచి గంటన్నర ప్రయాణం. విశాఖపట్నం నుంచి రెండున్నర గంటలు ప్రయాణం. అన్ని ముఖ్యమైన రైళ్లు అన్నవరం రైల్వేస్టేషన్లో ఆగుతాయి. విశాఖపట్నం, రాజమండ్రి (మధురపూడి) విమానాశ్రయాలు ఉన్నాయి. – అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం -
మంతనాలు
* స్టాలిన్‌తో వాసన్ సమాలోచన * వేదికగా పెళ్లి వేడుక సాక్షి, చెన్నై : డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్(టీఎంకే) నేతల కుటుంబాల మధ్య జరిగిన శుభకార్యం రాజకీయ చర్చకు వేదికగా మారింది. ఈ వేడుకలో డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్, టీఎంకే నేత జీకే వాసన్లు నలభై నిమిషాలు పక్కపక్కనే కూర్చుని సమాలోచనలో మునగడం గమనార్హం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డీఎంకే వర్గాలతో జీకే.వాసన్ స్నేహ పూర్వకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ను వీడినానంతరం టీఎంకేకు పునర్జీవం పోసిన వాసన్ డీఎంకే వర్గాల్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, చివరకు ప్రజా సంక్షేమ కూటమిలో సర్దుకున్నారు. ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన వాసన్ స్థానిక ఎన్నికల్లో పొత్తు అడుగులు జాగ్రత్తగా వేస్తామని స్పందించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం మధురైలో జరిగిన వివాహ వేడుకలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో మరీ సన్నిహితంగా మెలుగుతూ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. మధురైలో డీఎంకే మాజీ మంత్రి తంగం తెన్నరసు, టీఎంకే నేత, మాజీ ఎంపీ సిత్తన్ కుటుంబం మధ్య కుదిరిన వియ్యంతో వివాహ వేడుక జరిగింది. ఇందుకు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. అందరి కన్నా ముందుగానే అక్కడకు చేరుకున్న వాసన్ స్టాలిన్‌ను ఆహ్వానంగా పలకరించారు. వీరిద్దరూ ఏదో అంశం గురించి చర్చించుకున్నంతగా నలభై నిమిషాలపాటు మంతనాల్లో మునిగారు. అయితే, వీరి సమాలోచన ఏ అంశంపై సాగిందో అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంట్లో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయని చెప్పవచ్చు. -
వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు
చత్తీస్ఘడ్: పెళ్లి ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పును వెలువరించింది. ఒప్పందం ప్రకారం చేయడంలో విఫలమైనందుకు గాను లక్షరూపాయలు, కోర్టు ఖర్చులకోసం మరో అయిదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఫోరం అధ్యక్షురాలు మైత్రి మాధుర్ ఈ తీర్పును వెలువరించారు. బిలాయ్ కి చెందిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ తమ కూతురి పెళ్లి విందుకోసం స్తానిక వెడ్డింగ్ ప్లానర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఎడ్వాన్స్ చెల్లించారు. ఈ పెళ్లికి మూడు రోజుల పాటు భోజన సదుపాయం కల్పించేట్టుగా మాట్లాడుకొని, మెనూని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అనుకున్నట్టుగా మూడు రోజులు భోజనం ఏర్పాట్లు చేయడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మూడు రోజులు వడ్డించాల్సిన భోజనాలు కాస్తా ఒక రోజుతో ముగించేశారు. కనీసం ఆ ఒక్కరోజుఏర్పాట్లు కూడా సవ్యంగా చేయలేదు. భోజనం బెండకాయ వేపుడు, అప్పడం వడ్డించడం మర్చిపోయారు. వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకుల నిర్వాకం ఇంతటితో ఆగిపోలేదు. మరో ఘోరమైనపొరపాటు చేశారు. ఏకంగా పెళ్లివేదిక అలంకరణలో వధూవరుల పేర్లు రాయడం మర్చిపోయారు...ఆహూతులకోసం వేసిన కుర్చీలను అస్తవ్యస్తంగా అమర్చారు. దాదాపు 100 కుర్చీలను వైట్ క్లాత్ తో కవర్ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పెళ్లివారిమధ్య వివాదం రేగింది. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సిన సదరు కంపెనీ,అదనంగా డబ్బులు చెల్లించాలని వేధించడం మొదలు పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిర్వాకంతో ఆడపెళ్లి వారుగా తాము అనేక అవమానాలను, అవహేళనను ఎదుర్కొన్నామని దీనికి వారు తగిన మూల్యం చెల్లించాలని కోరారు. దీంతో అత్యుత్సాహంగా ప్రవర్తించిన వెడ్డింగ్ ప్లాన్ నిర్వాహకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. -
నూతన దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు