McDonalds
-
మెక్ డొనాల్డ్స్ బర్గర్ లో బ్యాక్టీరియా
-
మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్‌లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
ప్రముఖ కంపెనీకి ‘చీజ్’ తిప్పలు..
అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాడ్స్కు భారత్‌లో ‘చీజ్ బర్గర్లు’ తిప్పలు తెచ్చిపెట్టాయి. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు మార్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది నెల రోజులపాటు విచారణ జరిపి ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్లు, నగ్గెట్లలో వెజిటబుల్ ఆయిల్ వంటి చౌకైన చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని తేల్చింది. మెక్‌డొనాల్డ్స్‌లో అందించే బ్లూబెర్రీ చీజ్కేక్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కంటెంట్ ఉన్నందున వాటిని చీజ్కేక్గా నిర్వచించలేమని ఫుడ్ రెగ్యులేటరీ బాడీ తీర్పు చెప్పింది. మెక్‌డొనాల్డ్ సరైన లేబులింగ్ లేకుండా అనేక వస్తువులలో చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని, తద్వారా నిజమైన చీజ్ తింటున్నట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించింది. అహ్మద్‌నగర్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫుడ్ ఐటమ్స్ పేర్లలో "చీజ్" అనే పదాన్ని వెస్ట్‌లైఫ్ లిమిటెడ్ తొలగించిందని, ఈ మేరకు సవరించిన మెనూను మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిందని డిసెంబర్ 18 నాటి లేఖను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనాన్ని ప్రచురించింది. కేసు అహ్మద్‌నగర్‌కు సంబంధించినది అయినప్పటికీ, దిద్దుబాటు చర్యను జాతీయంగా విస్తరించడం కోసం ఫాస్ట్‌ఫుడ్ చైన్‌పై ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి. -
పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు
మనం రెస్టారెంట్‌కి లేదా హోటల్‌కి వెళ్లితే..నిర్వాహకులు మంచి వేడి..వేడిగానే ఆహారం తీసుకొస్తారు. ఒకవేళ తొందరపడి తింటే..కాలినా.. అక్కడ ఉన్న సర్వర్‌పై అరవలేం. పైగా కేసు పెట్టను కూడా పెట్టం. కానీ ఓ కుటుంబం వేడిగా ఉందని మాకు చెప్పలేదు, అందువల్లే మా పాపకు కాలిపోయిందని కోర్టు మెట్లు ఎక్కింది. పైగా మెక్‌డొనాల్డ్స్ కంపెనీని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని ఫిలానా హోమ్స్, ఆమె భర్త, తన నాలుగేళ్ల పాప ఒలివియా కారబల్లోతో కలిసి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లారు. అప్పుడు వారు తమ చిన్నారి కోసం హాట్ చికెన్ మెక్ నగెట్ని ఆర్డర్ చేశారు. అది కాస్త తినే తొందరలో చిన్నారి తొడపై పడటంతో.. తీవ్ర గాయమైంది. దీంతో ఆ జంట ఆహరం వేడిగా ఉందని ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేసింది. తమకు న్యాయం కావలంటూ..కోర్టు మెట్లు ఎక్కింది. చికెన్‌లోని సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి 160 డిగ్రీల హీట్ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. కానీ మెక్‌డొనాల్డ్స్ 200 డిగ్రీ వేడితో ఉన్న చికెన్ నగ్గెట్ని ఇచ్చిందని వాదించింది. తన కూతురు ఒలివియాకు అయిన గాయాన్ని, దానివల్ల ఆమె అనుభవించిన బాధను ఆధారంగా చూపించింది. అంతేగాదు ఇప్పటికీ తన కూతురు చికెన్ నగెట్ని తింటోంది. కానీ ఇలా జరగలేదు కదా అని గట్టిగా తన వాదన వినిపించింది. దీంతో కోర్టు.. అక్కడ చిన్నారుల హక్కుల ప్రకారం ఆమెకి జరిగిన గాయానికి గానూ పరిహారంగా సదరు మెక్‌డొనాల్డ్స్ ఏకంగా ఆరు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత బుధవారమే ఆదేశించింది. అంతేగాదు ముందుగా గత నాలుగేళ్లకు పరిహారంగా రూ. 3.27 కోట్లు చెల్లించాలని ఆ తర్వాత మిగతా డబ్బును నిర్ణిత గడువులోపల చెల్లించాలని పేర్కొంది. పాపం మెక్ డొనాల్డ్‌కి ఓ రేంజ్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా సదరు కుటుంబం. (చదవండి: 'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం) -
మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?
చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!) రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్‌డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్‌లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్‌బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
‘ఊపిరి’ సినిమాలో సీన్ మాదిరిగా, పికిల్ ఆర్ట్ 4 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్
‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన హీరో... జనం వాటికి ఎందుకన్ని లక్షల పెడుతున్నారో అర్థంకాక.. నవ్వుకుంటాడు. ఇంటికొచ్చి తనూ ఓ పెయింటింగ్ వేసి లక్షలకు అమ్మేస్తాడు. గుర్తుందా? అచ్చం అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా లో జరిగింది. ఆర్టిస్ట్ మాథ్యూ గ్రిఫిన్... మెక్‌డొనాల్డ్స్ చీజ్ బర్గర్ తింటుండగా, అందులోని ఓ పికిల్ పీస్ వెళ్లి సీలింగ్‌కు తగిలింది. తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది... ఆ పాపులర్ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్ ఎగ్జిబిషన్లో ఉంచాడు. దానికి ‘పికిల్’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్ వివరాలను సిడ్నీ ఫైన్ ఆర్ట్స్ ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు. ఇప్పుడు మాత్రం కళాఖండమైంది’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. ఇక ‘ఇలాంటి ఆర్ట్‌వర్క్‌ను ఎలా ప్రదర్శిస్తారు?’ అంటూ చిరాకు పడ్డవారూ ఉన్నారు. అయితే ‘ఆన్లైన్లో ఆ పెయింటింగ్‌పై వచ్చిన హాస్యా స్పద స్పందనను పట్టించుకోవద్దు’ అంటున్నా డు ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ ర్యాన్ మూరే. ఫన్నీగా ఉన్నంత మాత్రాన దానికున్న విలువ, దాని అర్థం మారిపోదని చెబుతున్నాడు. -
లోగో మారిందెలాగో..
మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లోగోల్లో ఒకటి. ఎరుపు మీద పసుపుపచ్చ రంగులో అందరికీ తెలిసిందే. కానీ.. అరిజోనాలోని సెడోనాలో ఉన్న ఓబ్రాంచ్లో మాత్రం మెక్‌డొనాల్డ్స్ లోగో నీలిరంగులో ఉంటుంది. ప్రపంచమంతటా బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే... అక్కడ మాత్రమే నీలి రంగులో ఎందుకుంది? ఎందుకో తెలుసా? సెడోనా... ఎర్రరాతి పర్వతాలు, సహజ అందాలతో అలరారే అద్భుతమైన నగరం. అలాంటి నగర ప్రశాంతతకు అంతరాయం కలిగించే ఏ నిర్మాణాలను, కట్టడాలను స్థానిక అధికారులు అనుమతించరు. నగరంలో ఏం నిర్మించాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెక్‌డొనాల్డ్స్ 1993లో సెడోనాలో తన అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా స్థానిక అధికారులు దాని పసుపురంగు లోగోపై అభ్యంతరం చెప్పారు. దానికి బదులుగా ఆహ్లాదకరంగా ఉండే నీలిరంగును వాడాలని సూచించారు. టీంతో అధికారుల ఆదేశాల మేరకు మెక్‌డొనాల్డ్స్ అలాగే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదికూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చినవారెవరూ అరుదైన ఈ లోగోముందు ఫొటో తీసుకోకుండా వెళ్లరు. -
Russia: రష్యాకు మెక్‌డొనాల్డ్స్ గుడ్‌బై
మాస్కో: అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. ఉక్రెయిన్ పరిణామాల తర్వాత ఆంక్షల నేపథ్యంలో.. రష్యా ఒంటరి అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాశ్చాత్య దేశాలకు చెందిన బోలెడు కంపెనీలు రష్యాను వీడాయి. తాజాగా ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్డ్ తమ రష్యా ఆస్తుల్ని.. మాస్కో ప్రభుత్వానికి అప్పజెప్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ తరుణంలో.. మెక్‌డొనాల్డ్స్ మార్చి నెలలోనే రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్లను మూసేసింది. దీంతో 62 వేల మందికి పని లేకుండా పోయింది. అయితే ఈ సంక్షోభ పరిణామంపై తాజాగా సోమవారం మరో ప్రకటన విడుదల చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. అక్కడి మార్కెట్‌ను స్థానిక ఫుడ్ ఫ్రాంచైజీలకు అమ్మేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇకపై మెక్‌డొనాల్డ్స్ అనే బ్రాండ్ రష్యాలో కనిపించబోదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు, సప్లయర్లకు ఈ నిర్ణయం కష్టతరంగానే ఉండొచ్చని తెలిపింది. 32 ఏళ్లుగా మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీలు రష్యాలో కొనసాగుతూ వస్తున్నాయి. ఒకానొక టైంలో అక్కడి ఫుడ్ ఫ్రాంచైజీలను మెక్‌డొనాల్డ్స్ డామినేట్ చేసింది కూడా. -
బర్గరే బంగారమాయేగా!
-
పుతిన్ వార్నింగ్! టెక్ కంపెనీలకు భారీ షాక్, గీత దాటితే తాటతీస్తాం!!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో దిగ్గజ సంస్థలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై చేస్తున్న దాడుల్లో రష్యాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టెక్ దిగ్గజాలకు వార్నింగ్ ఇచ్చింది. గీత దాటితే సదరు సంస్థలకు చెందిన కార్పొరేట్ సంస్థల ఆస్థులతో పాటు ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న వికృత క్రీడను ఆపాలంటూ టెక్ దిగ్గజాలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యురేపియన్ యూనియన్ దేశాలతో పాటు 50కి పైగా టెక్ కంపెనీలు తమ సర్వీసులను రష్యాలో యుద్ధ ప్రాతిపదికన నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం యురేపియన్ యూనియన్ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఇప్పటికే అనేక కంపెనీలను రష్యా ప్రభుత్వం బెదిరించినట్లు తెలుస్తోంది. మెక్‌డొనాల్డ్స్, ఐబీఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్, యమ్ కార్ప్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, సీఈఓ లాంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేస్తామని సూచించింది. దీంతో పలు కంపెనీలు రష్యా నుంచి ఉన్నతస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌లను బదిలీ చేస్తున్నాయి. తాజాగా రష్యాలో తమ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు, కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. రష్యాలో పనిచేస్తున్న 62వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: గూగుల్ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ! -
పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం...
విజయానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. సాధారణంగా 16, 17 యేళ్ల నుంచి అంతకంటే పెద్ద వయసున్నవారు బిజినెస్ లేదా జాబ్ చేయడం చూస్తుంటాం! కానీ 10 యేళ్ల వయసున్న పిల్లలెవరైనా నెలకు ఏకంగా కొట్ల రూపాయలను సంపాదించడం కనీవినీ ఎరుగునా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఐతే ఇదంతా ఎలా సాధ్యపడిందబ్బా! అని ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నారని తెలుస్తుందిలే.. వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్ కర్టిస్ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్ బిజినెస్) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్‌ఫుల్ బొమ్మలతోపాటు, ఆకర్షనీయమైన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ వంటి (హెయర్ యాక్ససరీస్) వాటిని నెముషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది. బాలిక తల్లి రాక్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్‌లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నాచిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్‌డోనాల్డ్స్‌లో పనిచేశాను. కానీ నా కూతురు అంతకంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్ సిడ్నీలో ప్రైమరీ స్కూల్లో చదువుతూ బిజినెస్ చేస్తోంది. తానుకోరుకుంటే 15 యేళ్లకే రిటైర్ అయ్యేలా కూడా ప్లాన్ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్ కారు కూడా నా కూతురికి ఉంద’ని పేర్కొంది. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొని విజయాలు సాధించినవారు కొందరైతే, మరికొందరేమో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, గెలవాలనే తాపత్రయంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే... ఖచ్చితంగా నోరెల్లబెడతారు. ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ (23) అనే వ్యక్తి ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్'లో పాల్గొని కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్ని యేళ్లగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో చూడొచ్చు. ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడండీ..! మరి మీరేమంటారు.. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
డెలివరీ బాయ్ నిర్వాకం: ‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’
పిల్లలు ఆకలి అనడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది ఓమహిళ. ఆర్డర్ పెట్టిన తర్వాత తన అడ్రస్ బదులు స్నేహితురాలి ఇంటి చిరునామా ఇచ్చినట్లు గుర్తించింది. వెంటనే డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. ఆర్డర్లో ఉన్న అడ్రస్‌కు కాకుండా.. తన ఇంటికి ఫుడ్ తీసుకురమ్మని కోరింది. అందుకు అంగీకరించని డెలివరీ బాయ్.. ఆమె ఆర్డర్ చేసిన ఆహారాన్ని చెత్తలో పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు డెలివరీ బాయ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. జీనెట్ ఎరిక్సన్-గ్రే అనే మహిళ తన ఏడు సంవత్సరాల కుమార్తె కోసం ఉబర్ ఈట్స్‌లో మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్స్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత అడ్రస్‌లో తన ఇంటి చిరునామాకు బదులు.. ఫ్రెండ్ అడ్రస్ ఉన్నట్లు గుర్తించింది. వెంటన్ డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. అడ్రస్ తప్పుగా ఉంది.. అందులో ఉన్న చిరునామాకు కాకుండా.. ఇప్పుడు తాను చెప్పబోయే అడ్రస్‌కు ఆర్డర్ తీసుకురావాల్సిందిగా కోరింది. (చదవండి: కాఫీ లేట్ అవుతుందని చెప్పినందుకు ఎత్తి పడేసింది.. అంతా షాక్!) అందుకు డెలివరీ బాయ్ ఒప్పుకోలేదు. ‘‘మొదట ఇచ్చిన అడ్రస్‌కే ఆర్డర్ తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. కావాలంటే మీరే మీ స్నేహితురాలి ఇంటికి రండి’’ అని తెలిపాడు. అందుకు ఆ మహిళ బయట వర్షం వస్తుంది.. ఆర్డర్లో ఉన్న అడ్రస్‌కు సమీపంలోనే మా ఇల్లు ఉంది.. దయచేసి రండి.. కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేస్తాను అని తెలిపింది. తన ఇంటి అడ్రస్ని సెండ్ చేసింది. కానీ డెలివరీ బాయ్ అందుకు ససేమీరా అన్నాడు. ఆ తర్వతా సదరు డెలివరీ బాయ్ జీనెట్కు ఓ ఫోటో షేర్ చేశాడు. మీ ఆర్డర్‌ని ఇక్కడ పడేశాను.. వెళ్లి తీసుకోండి అని మెసేజ్ చేశాడు. తీరా చూస్తే అది తన స్నేహితురాలి ఇల్లు కూడా కాదు.. ఎక్కడో రోడ్డు పక్కన చెత్తలో తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని పడేసి వెళ్లాడు. ఇక చేసేదేం లేక జీనెట్ తన పిల్లలను తీసుకుని.. డెలివరీ బాయ్ పంపిన ఫోటోలోని చోటకు వెళ్లింది. కానీ అక్కడ వారికి తాము ఆర్డర్ చేసిన ఫుడ్ కనిపించలేదు. చేసేదేం లేక ఉత్త చేతులతో అక్కడ నుంచి వచ్చేశారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఇక దీని గురించి జీనట్ ఉబర్ యాప్‌లో ఫిర్యాదు చేసింది. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించలేదు. జరిగిన సంఘటన గురించి జీనట్ సోషల మీడియాలో షేర్ చేయగా.. సదురు డెలివరీ బాయ్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. వ్యవహారం కాస్త ముదరడంతో ఉబర్ యాజమాన్యం దీనిపై స్పందించింది. ‘‘మా డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. జీనట్కు క్షమాపణలు తెలుపుతున్నాం. ఆమె డబ్బులను పూర్తిగా తిరిగి ఇవ్వడమేకాక.. ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని జీనట్కు టిప్‌గా ఇస్తున్నాం’’ అని తెలిపారు. కానీ జీనట్ మాత్ర మళ్లీ జన్మలో ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనని తెలిపింది. చదవండి: మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్ -
కాఫీ లేట్ అవుతుందని చెప్పినందుకు ఎత్తి పడేసింది.. అంతా షాక్!
ఇటీవల కాలంలో బయట ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. రెస్టారెంట్స్, హోటల్స్ తిరుగుతూ నచ్చిన ఫుడ్‌ను తెగ లాగించేస్తున్నారు. ఒక్కోసారి అక్కడి ఫుడ్ లేదా సర్వీస్ నచ్చనప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ వింతగా ప్రవర్తించడం సహజమే. తాజాగా ఓ రెస్టారెంట్ సిబ్బందిపై అసంతృప్తి చెందిన మహిళ అక్కడ వస్తువులను చెల్లాచెదురు చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అర్కాన్సాస్లో ఓ మహిళ మెక్డొనాల్డ్స్లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసింది. అయితే కాఫీ తయారికీ నిమిషాలు సమయం పడుతుందని వెయిట్ చేయాలని సిబ్బంది కోరింది. దీంతో కాఫీ కోసం అయిదు నిమిషాలు ఆగాలా అని అసహనానికి లోనైన మహిళ షాప్‌లో బీభత్సం సృష్టించింది. చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు అక్కడున్న ఆహార ట్రేలను కొట్టింది. టేబుల్ నంబర్లను కింద పడేసింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. మహిళ ప్రవర్తనపై మెక్‌డొనాల్డ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మహిళ తనకు డయాబెటిస్ ఉందని, లో బ్లడ్ షుగర్ వల్ల ఇలా ప్రవర్తించానని తెలిపింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికి దీనిని 10 లక్షల మంది వీక్షించారు. చదవండి: ‘ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తావా? Karen Trashes McDonald’s because Her Coffee Took too Long pic.twitter.com/qi0V0MG2mk — Karen (@crazykarens) October 4, 2021 -
ఫాస్ట్ ఫుడ్ కోసం హెలికాప్టర్లో 725 కిమీ..
మాకావ్: ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టముండని వారంటుండరు. సామాన్యూలు నుంచి ధనికులకు వరకు ఫాస్ట్ ఫుడ్ అంటే చేవి కోసుకుంటారు. అలాంటి ఫాస్ట్ ప్రియులంతా లాక్డౌన్ నిబంధనలను సైతం పక్కన పెట్టి సాహాసాలు చేసిన సందర్భాలు వెలుగు చుస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా సమీప ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన బట్టర్ చికెన్ వెతుక్కుంటూ యూకె బార్డర్‌కు వెళ్లి వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆ డ్రైవర్ తన ఇంటి నుంచి దాదాపు 32 కిమీ దూరంలో ఉన్న మెయిన్ సిటీకి ప్రయాణించాడు. యుకేలోని ఓ డ్రైవర్ పిజ్జా కోసం లాక్డౌన్ నిబంధనలు విస్మరిస్తూ.. గంటకు 72 కిమీ వేగంతో వెళ్లి కొనుగోలు చేశాడు. ఇటీవల జరిగిన ఈ రెండు సంఘటనలు అందరిని ఆశ్చర్యపరచగా... తాజా ఈ ఫాస్ట్ ఫుడ్ కోసం రష్యా బిలియర్ ఏం చేశాడో తెలిస్తే నోళ్లు వెల్లబెట్టాల్సిందే. రష్యాకు చెందిన విక్టోర్ మార్టినవ్(33) బిలియనీర్ తనకు ఇష్టమైన మెక్‌డోనాల్డ్స్ ఫెంచ్ ప్రైస్, బర్గర్ కోసం 720కిమీ హెలికాప్టర్లో ప్రయాణించి దాదాపు 2,680 డాలర్లు ఖర్చు పెట్టాడు. క్రస్నోర్ సమీపంలో మెయిన్ సిటీలో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు అతడు తన చాటెడ్ హెలికాప్టర్లో 450 మైళ్లు ప్రయాణించి పెద్ద పెద్ద మకావ్ ప్యాకెట్స్, మిల్క్ షేక్స్, ఫ్రెంచ్ ప్రైస్, బర్గర్లు కొనుగొలు చేశాడు. అయితే అక్కడ హెలికాప్టర్ నిలిపెందుకు స్థలం లేనప్పటికి అతడు క్రస్నోర్కు కాస్తా దూరంలో హెలికాప్టర్‌ను నిలిపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి మరి ఇష్టమైన ఫెంచ్ ప్రైస్, మిల్క్ షేక్, తెచ్చుకున్నాడంట. ఇక దీనిపై మార్టినవ్ మాట్లాడుతూ.. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆలుస్తాకు హాలీడే ట్రిప్‌కు వచ్చాను. ఆలుస్తాలోని బ్లాక్ సీ సమీపంలో ఓ రిసార్ట్‌లో దిగాం. రిసార్ట్‌లో పెట్టె సాధారణ మాకావ్ ఫుడ్ తిని విసిగిపోయాం. దీంతో హెలికాప్టర్లో క్రస్నోర్లో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు వెళ్లి మాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని వచ్చాం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. -
వైరల్: మెక్ డొనాల్డ్ సిబ్బంది ఔదార్యం
మన చుట్టూ ఉన్న వాళ్లకు తోచిన సహాయం చేస్తే, సాయం పొందిన వ్యక్తికి, నాకు ఇంత మంది అండగా ఉన్నారే... అనే భావన వారిలో కలుగుతుంది. మనకు కూడా ఎంతో కొంత తృప్తినిస్తుంది. కాసింత ప్రేమ పంచితే చాలు వారి జీవితాన్ని మార్చలేకపోయినా కాస్తైనా ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో మనం చేసే చిన్న సాయం కూడా వారికి ఊరటనిస్తుంది. మెక్‌డొనాల్డ్ సిబ్బంది కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తికి సాయం చేసి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. మెక్‌డొనాల్డ్స్‌కు వచ్చిన దివ్యాంగుడికి ఓ ఉద్యోగి తన చేతులతో స్వయంగా ఫుడ్ తినిపించగా, మరొకరు సాఫ్ట్‌డ్రింక్ తాగించి ఔదార్యం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ది ఫీల్ గుడ్ పేజ్’ శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ కస్టమర్ పట్ల మెక్ డొనాల్డ్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లైకులు, రీట్వీట్ల ద్వారా నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తండ్రి, కూతుర్ల జిమ్.. వైరల్) -
మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్
లండన్: కరోనా కాలంలో ఎన్నో సంఘటనలు చేసుకున్నాయి. మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచినప్పటికీ... మనుషుల్లో మానవత్వాన్ని బయటకు తీసింది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు శత్రు దేశాలు సైతం మిత్రులుగా మారుతున్నాయి. ఈ తరుణంలో నువ్వా నేనా అంటూ సొంత దేశంలో పోటీపడే ఫుడ్ చైన్ వ్యాపారాలు కూడా ఈ సంక్షోభంలో మద్దతుగా నిలుస్తున్నాయిని చెప్పడానికి ఈ తాజా సంఘటనే రుజువు. లాక్డౌన్లో ప్రముఖ వ్యాపార సంస్థలు ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో పలు సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీనివల్ల వేలల్లో ఉద్యోగుల జీవితాలు రోడ్డునే పడే అవకాశం ఉంది. అలాంటి వారిని ఆదుకోవాలంటూ యుకేలోని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్‌కింగ్ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటోంది. అమెరికన్ బెస్డ్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ అయిన బర్గర్ కింగ్ యుకేలోని మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పాపా జాన్స్, టాకో బెల్స్ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. (చదవండి: షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు) We know, we never thought we’d be saying this either. pic.twitter.com/cVRMSLSDq6 — Burger King (@BurgerKingUK) November 2, 2020 ‘మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని కలలో కూడా ఊహించలేదు. కానీ రెస్టారెంట్స్, ఫుడ్స్ వ్యాపార సంస్థలలో పని చేసే వేలమంది ఉద్యోగులకు ఇప్పుడు మీ మద్దతు చాలా అవసరం. ఇందుకోసం మీరు కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్ ఆహారం కొనుగోలు చేయండి. వేల మంది ఉద్యోగుల జీవితాలను ఆదుకోండి. అయితే ఈ మహమ్మారి కాలంలో జాగ్రత్త ఉండటం మంచి విషయమే.. కానీ మంచిపని కోసం బయటి ఆహారం ఆర్డర్ చేయడం అంత చెడ్డ విషయం కాదు’ అంటూ బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వ్యాపారంలో పోటీ దారులైన మెక్‌డోనాల్డ్స్ ఉద్యోగుల కోసం ఈ ట్వీట్ చేసిన బర్గ్కింగ్ తీరుకు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘బర్గర్ కింగ్ చోరవ ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. మనం ఎప్పటికీ మన పోటీదారులతో అసమానంగా పోరాడచ్చు. అలాగే అవసరమైన సమయాల్లో వారికి మద్దతుగా కూడా నిలబడవచ్చని బర్గర్ కింగ్ రుజువు చేసింది’ , ‘గొప్ప చర్య బర్గర్ కింగ్, మెక్‌డోనాల్డ్స్ అభిమానుల నుంచి భారీ మద్దతు, గౌరవం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: కాకరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో రసగుల్లా..) -
ఉద్యోగినితో ఎఫైర్ : మెక్‌డొనాల్డ్ సీఈవోపై వేటు
న్యూయార్క్ : కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సంస్థ ఉద్యోగినితో శారీరక సంబంధం నెరిపిన ప్రెసిడెంట్, సీఈవో స్టీవ్ ఈస్టర్‌బ్రూక్‌పై మెక్‌డొనాల్డ్స్ వేటు వేసింది. కంపెనీ విధానాలను ఉల్లంఘిస్తూ పరస్పర అంగీకారంతో ఉద్యోగినితో ఎఫైర్ సాగించిన ఈస్టర్‌బ్రూక్‌ను తొలగించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని మెక్‌డొనాల్డ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈస్టర్బ్రూక్ స్ధానంలో క్రిస్ కెంప్స్కీని మెక్డొనాల్స్ట్ యూఎస్ఏ ప్రెసిడెంట్‌గా నియమస్తూ ఆయన డైరెక్టర్‌గా కంపెనీ బోర్డులోనూ అడుగుపెడతారని తెలిపింది. కంపెనీలో నాయకత్వ మార్పునకు సంస్థ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా కంపెనీ విధానాలకు విరుద్ధంగా ఉద్యోగినితో తన రిలేషన్షిప్ పొరపాటు చర్యేనని మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఈస్టర్బ్రూక్ పేర్కొన్నారు. కంపెనీ పాటించే విలువలను గౌరవిస్తూ తాను తప్పుకోవాలన్న బోర్డు నిర్ణయాన్ని అంగీకరిస్తానని చెప్పారు. ప్రపంచంలోనే దిగ్గజ ఫాస్ట్‌ఫుడ్ చైన్‌గా పేరొందిన మెక్‌డొనాల్డ్స్‌కు 100కు పైగా దేశాల్లో 38,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. -
మెక్‌డొనాల్డ్స్‌లో ఉడకని చికెన్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1/10 చౌరస్తాలో ఉన్న సిటీ సెంటర్ మాల్లో మెక్ డొనాల్డ్స్ ఆహార కేంద్రంలో ఉడకని చికెన్ వడ్డించారంటూ బాధితులు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1లో ఉన్న సిటీ సెంటర్ మాల్‌లోకి శివశంకర్ అనే జర్నలిస్ట్‌తో పాటు ఆయన స్నేహితుడు శ్రీనివాస్ శనివారం రాత్రి షాపింగ్‌కు వెళ్లారు. అనంతరం మెక్‌డొనాల్డ్స్‌లో చికెన్ వింగ్స్ తినడానికి ఆర్డర్ చేశారు. ఆ తరువాత దానిని తింటుండగా సరిగ్గా ఉడకలేదని శివశంకర్ గుర్తించారు. ఇదే విషయాన్ని బాధితుడు నిర్వాహకుల్ని నిలదీశాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేనేజర్ వచ్చి ఇంకో ఆర్డర్ తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ చికెన్ హర్యానా, పంజాబ్ నుంచి సగం ఉడకబెట్టి వస్తుందని, ఇక్కడికి వచ్చాక మళ్లీ మిగతా సగాన్ని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఉడకబెట్టి ఇస్తుంటామని, ఇందులో చిన్న పొరపాటు జరుగుతుందని సర్దిచెప్పారు. అయితే.. తిన్న వెంటనే పచ్చి చికెన్ తిన్న ఫీలింగ్ రావడం, బయటికి వచ్చి వాంతులు చేసుకోవడం జరిగింది. రాత్రంతా వీరు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. -
మెక్‌డొనాల్డ్స్‌ను తాకిన ‘మీటూ’ ఉద్యమం
న్యూయార్క్ : అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ కంపెనీ మెక్డొనాల్డ్స్కూ ‘మీటూ’ ఉద్యమం తాకింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా రెండు నేషనల్ అడ్వకసీ గ్రూప్‌లు లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాయి. 9 నగరాల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న 10 మంది మహిళల తరుఫున ఈ గ్రూప్‌లు ఈ ఫిర్యాదు దాఖలు చేశాయి. ఈ వర్కర్లలో సెయింట్ లూయస్కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. రెస్టారెంట్లో పనిచేసే సూపర్వైజర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ అమ్మాయి ఆరోపించింది. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాక ఫిర్యాదుల్లో తమ గోడును వెల్లబుచ్చుకున్న మహిళలందరూ తాము ఎంత లైంగిక వేధింపులకు గురి అవుతున్నామో వివరించారు. ఉద్యోగుల తక్కువ వేతనాలపై పోరాడుతున్న ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ వివాదాన్ని నిర్వహిస్తోంది. ఈ కేసులకు అవసరమయ్యే లీగల్ కాస్ట్లను టైమ్స్ యూపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ భరిస్తోంది. సొంతంగా ఈ కేసులను కమిషన్లు, కోర్టుల ముందుకు తీసుకురాలేని మహిళల కోసం నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా సమాన ఉద్యోగవకాశాల సంఘం వద్ద ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఈ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మెక్‌డొనాల్డ్స్ అధికార ప్రతినిధి టెర్రి హిక్కీ స్పందించారు. తమ వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులకు, వివక్షకు చోటు లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుందని హిక్కీ చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న రెస్టారెంట్ పేర్లలో ఫ్రాంచైజీలు నడిపేవే ఎక్కువగా ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా మెక్‌డొనాల్డ్స్ నడపడం లేదని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌కు, ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. గత రెండేళ్ల క్రితం కూడా ఇదే రకమైన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా ఫైట్ ఫర్ 15 డాలర్స్ నమోదు చేసింది. ఆ సమయంలో ఆరోపణలను సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంటామని మెక్‌డొనాల్డ్స్ హామీ ఇచ్చింది. అయితే పాలసీల్లో ఏమైనా మార్పులు చేశారా అనే విషయంపై స్పందించడానికి మాత్రం అధికార ప్రతినిధి నిరాకరించారు. -
గొడ్డుమాంసం తినడం మానేశారు!
సన్నటి మంట మీద ఆలివ్ ఆయిల్ చుక్కలతో ఉడికించిన గొడ్డుమాంసం ముక్కల్ని.. బన్ల మధ్యలో ఉంచి, దానికి కాస్త స్పెషల్ సాస్, అమెరికన్ చీజ్, పికిల్స్, ఆనియన్స్‌ను జతచేస్తే.. హాంబర్గర్ రెడీ అయినట్లే. ఇక ప్రఖ్యాత మెక్‌డోనాల్డ్స్‌లో తయారయ్యే బిగ్ మాక్ హాంబర్గరైతే.. ఎంత వరల్డ్ ఫేమసో చెప్పుకోవాల్సిన పనిలేదు. మెక్‌డోనాల్డ్స్ ఆహార ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావడాన్ని క్యాపిటలిజం వ్యాప్తిగానూ అభివర్ణించే ఆర్థికవేత్తలు కొందరు.. ఏకంగా ఆకలి సూచికి ‘బిగ్ మాక్ ఇండెక్స్’ అని పేరు కూడా పేరుపెట్టారు. ఇక అమెరికాకే చెందిన ప్రఖ్యాత క్యాపిటలిస్టు, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బిగ్ మాక్ అంటే నాలుక కోసుకుంటారు. ‘‘దాన్ని అలా అలా నోట్లో పెట్టుకుని కొరికితే.. వావాహ్.. ఆ టేస్టే వేరప్ప!’’ అనేది ఒకప్పటి ట్రంప్ మాట! ఇప్పుడాయన గొడ్డుమాంసం తినడం మానేశారు! ట్రంప్ ఫిట్‌నెస్‌పై ఆందోళన : పలు అనుమానాలు, విమర్శల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ట్రంప్ చేయించుకున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. నాటి టెస్టుల్లో ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని తేలింది. అయితే ఫిట్నెస్ కాస్త ఆందోళనకరంగాఉంది. 6అడుగుల 3 అంగుళాల ఎత్తు, 71 ఏళ్ల వయసున్న ట్రంప్ 239 పౌండ్ల(108.4 కేజీల) బరువున్నారు. ఒబెసిటీ(అధికబరువు) కేటగిరీకి అతి చేరువలో ఉన్న ట్రంప్ డైట్ పాటించకుంటే ప్రమాదం ఎదుర్కోకతప్పదని వైట్‌హౌస్ ఫిజీషియన్ డాక్టర్ రోనీ జాక్సన్ సూచించారు. ఆ మేరకు గడిచిన రెండు వారాలుగా ట్రంప్ గొడ్డుమాంసం తినడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఫిష్ శాండ్విచ్ (ఫిష్ ఓ ఫిలెట్), ఫ్రూట్ సలాడ్స్, చాక్లెట్ మిల్క్ షేక్‌లను మాత్రమే తీసుకుంటున్నారు. విషప్రయోగ భయం! : బడా రియల్టర్ పుత్రుడిగా బిజినెస్‌లోకి ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్.. అతికొద్ది కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. శత్రువుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండే ట్రంప్.. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహారాన్ని ముట్టనుగాక ముట్టరు! ప్రతి సందర్భంలోనూ మెక్‌డోనాల్డ్స్ నుంచి తెప్పించే బిగ్ మాక్‌ను మాత్రమే ఆరగించేవారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలానే వ్యవహరించారు. ‘‘నాకు శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం. పనిలో భాగంగా రకరకాల చోట్లకు వెళతాం. అయితే అక్కడ తయారుచేసిన ఆహారం శుభ్రంగా వండారా, లేదాని చెప్పలేం. మెక్‌డోనల్డ్స్ సురక్షిత ప్రమాణాలు పాటిస్తుంది కాబట్టే వాళ్ల బర్గర్లు మాత్రమే తింటా’’ అని ట్రంప్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే ట్రంప్ జాగ్రత్తల వెనుక ‘విషప్రయోగం’ భయం కూడా ఉందని ప్రఖ్యాత జర్నలిస్టు మిచెల్ వూల్ఫ్ అంటారు. ఇటీవలే తాను రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్ గురించిన అనేక రహస్య విషయాలను చెప్పుకొచ్చారాయన. ‘‘ఆహారంలో విషప్రయోగం జరగొచ్చనే ఆందోళన ట్రంప్‌లో చాలా కాలంగా ఉంది. అందుకే ఆయన బయటికెళ్లినప్పుడు.. సురక్షితంగా వండిన మెక్‌డోనాల్డ్స్ పదార్థాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇది ఎప్పుడు మొదలైందో చెప్పలేనుగానీ, దశాబ్ధాలుగా ట్రంప్ ఇలానే చేస్తున్నారు’’ అని మిచెల్ వూల్ఫ్ రాశారు. -
నోరూరించే డీల్స్ ఆఫర్ చేస్తున్న కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్
ముంబై : ఒకవైపు ప్రముఖ రెస్టారెంట్లు మెక్‌డొనాల్డ్స్ మూతపడటంతో, మరోవైపు కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్‌లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. నోరూరించే డీల్స్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల మూతను, ఈ రెస్టారెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ, కార్ల్స్ జేఆర్. లాంటి క్విక్ సర్వీసు రెస్టారెంట్లు దేశీయంగా తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వాల్యుమీల్స్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్లో ఈ అవుట్లెట్లలో విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో గత రెండు వారాలుగా 80కిపైగా మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిన్నీ పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో స్థానిక భాగస్వామి నిర్వహిస్తున్న 169 రెస్టారెంట్లలో ఆహార భద్రత, నాణ్యతపై మెక్డొనాల్డ్స్ఇండియా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. దీంతో మెక్‌డీ కస్టమర్లు కూడా బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ లాంటి రెస్టారెంట్లకు ఆకర్షితులవుతున్నారు. పరిమిత కాల ఆఫర్‌తో తమ రెస్టారెంట్లలోకి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని బర్గర్ కింగ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ వెర్మన్ అన్నారు.నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 2021 నాటికి దేశీయ ఆహార సర్వీసుల పరిశ్రమ 4.98 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ జీడీపీలో రెస్టారెంట్ సెక్టారే 2.1 శాతం సహకరిస్తుందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. -
మెక్‌డి, హోండాలకు జీఎస్టీ నోటీసులు
న్యూఢిల్లీ : హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, వెస్ట్, సౌత్‌లోని మెక్‌డొనాల్డ్స్, రిటైల్ లైఫ్‌స్టయిల్, హోండా డీల్స్ సంస్థలు తప్పుడు జీఎస్టీతో వినియోగదారులను మోసం చేస్తున్నట్టు వెల్లడైంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నందున్న ఈ సంస్థలపై యాంటీ-ప్రాఫిటరింగ్ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. కనీసం ఐదు సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీ సేఫ్‌గార్డ్స్) ఈ నోటీసులు జారీచేసింది. వాసెలిన్ ఉత్పత్తులపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించినప్పటికీ, ఇంకా 28 శాతమే విధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిప్పటికీ, ఒక్క కప్ కాఫీ ధరను రూ.142 నుంచి తగ్గించనట్టు తెలిసింది. డిసెంబర్ 29నే డీజీ సేఫ్‌గార్డ్స్ ఈ నోటీసులు జారీచేసింది. కానీ ఇంకా తమకు ఎలాంటి నోటీసులు అందలేదని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు చెబుతోంది. లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ కూడా నవంబర్ 22న 28 శాతం జీఎస్టీ విధించిందని, కానీ ఆ వారం ప్రారంభంలోనే జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించినట్టు ఫిర్యాదులో తెలిసింది. ఈ విషయంపై స్పందించడానికి లైఫ్ స్టయిల్ ఇంటర్నేషనల్ స్పందించడానికి తిరస్కరించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలను తమకు అందించడం లేదని 36 మంది కొనుగోలుదారులు చెప్పడంతో, ఫిరామిడ్ ఇన్‌ఫ్రాటెక్‌కు కూడా ఈ నోటీసులు అందాయి. బారెల్లీకు చెందిన కారు డీలర్ హోండా కారు కూడా ఎక్కువ మొత్తంలో పన్నులను విధిస్తున్నట్టు తెలిసింది. ఈ అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, యాంటీ ప్రాఫిటరింగ్ చర్యలు తీసుకోబోతున్నారు. -
మెక్‌డొనాల్డ్స్ వార్నింగ్ : అక్కడ తింటే ఖతమే
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ తన కస్టమర్లకు వార్నింగ్ ఇస్తోంది. నార్త్, ఈస్ట్ ఇండియాలో కొనసాగుతున్న తమ బ్రాండెడ్ అవుట్లెట్లలో తినొద్దంటూ కస్టమర్లకు సీరియస్ హెచ్చరికలు జారీచేస్తోంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు(సీపీఆర్ఎల్) నిర్వహిస్తున్న తమ ఈ బ్రాండెడ్ అవుట్లెట్లలో తింటే, ఆరోగ్య సమస్యల బారిన పడతారంటూ పేర్కొంటోంది. ఈ రెస్టారెంట్లలో వాడే పదార్థాలు, తమ అంతర్జాతీయ ప్రమాణాకలు అనుగుణంగా లేవని మెక్‌డొనాల్డ్స్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. సీపీఆర్ఎల్ వీటిని మూత వేయాల్సి ఉందన్నారు. సీపీఆర్ఎల్, మెక్ డొనాల్డ్స్ ఇండియా జాయింట్ వెంచర్ 50:50గా ఉంది. ఈ జాయింట్ వెంచర్లో 160 అవుట్లెట్లు కొనసాగుతున్నాయి. వీటిలో 84 అవుట్లెట్లు ఈ వారం ప్రారంభంలో మూతపడ్డాయి. బకాయిలు చెల్లించని కారణంగా సీపీఆర్ఎల్ లాజిస్టిక్స్ పార్టనర్ రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ తన సర్వీసులను రద్దు చేసింది. ఈ కారణంతో అవుట్లెట్లు కూడా క్లోజయ్యాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ రద్దు చేసినప్పటి నుంచి బర్గర్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌కు, సీపీఆర్‌ఎల్‌కు న్యాయపోరాటం నడుస్తోంది. ఈ వివాదంతో అనేక సరఫరాదారులు బయటికి వచ్చేసినప్పటికీ, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నప్పటి నుంచి సీపీఆర్ఎల్ అనధికారికంగా రెస్టారెంట్లను నిర్వహిస్తోందని, మెక్‌డొనాల్డ్స్ సిస్టమ్‌లోకి సరఫరా చేసేందుకు తెలియని డిస్ట్రిబ్యూటర్ను తాము ఆమోదించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మెక్‌డొనాల్డ్స్ ఆరోపణలపై స్పందించిన సీపీఆర్ఎల్ ఎండీ విక్రమ్ భక్షి, రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ కంటే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌ను నియమించుకున్నట్టు తెలిపింది. లాజిస్టిక్స్ పార్టనర్‌గా కోల్డ్ఎక్స్ను ఎంపికచేసుకున్నట్టు పేర్కొంది. కేఎఫ్‌సీ, స్టార్‌బక్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, వెండీస్ అండ్ కార్ల్స్ జూనియర్, ఏడీబీ వంటి వాటికి కోల్డ్ఎక్స్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది.