Messenger
-
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, వాట్సాప్‌లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్‌ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్‌పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్‌లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్‌లో “గెట్ స్టార్ట్” అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
టీకాలందు.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేరయా!
కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ భారత్‌లో కోవిడ్ నిరోధానికి వాడుతున్న టీకాల పేర్లివి. ఒకట్రెండు నెలల్లో మరికొన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి! వీటిల్లో ఫైజర్, మోడెర్నా కంపెనీల టీకాలు వినూత్నమైనవి. మిగిలిన వాటికంటే భిన్నమైన పద్ధతిలో తయారైనవి! అంతేకాదు.. ఈ తరహా టీకాలు భవిష్యత్తులో హెచ్ఐవీ, కేన్సర్ల వంటి... ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు!!! కోవిడ్ నిరోధానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న టీకాలను స్థూలంగా రెండు భాగాలుగా విడదీయవచ్చు. దశాబ్దాలుగా పలు వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న సంప్రదాయ టీకాలు ఒక రకమైతే వినూత్నమైన ఆలోచనతో యాభై ఏళ్ల పరిశోధనల తరువాత తొలిసారి అందరికీ అందుబాటులోకి వచ్చిన మెసెంజర్ ఆర్ఎన్ఏ క్లుప్తంగా.. ఎంఆర్ఎన్ఏ టీకాలు ఇంకో రకం. ఆటలమ్మ అని మనం పిలుచుకునే స్మాల్‌పాక్స్ వ్యాధికి 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ తొలి టీకా తయారు చేశారు. అవులకు సోకే, పెద్దగా ప్రమాదం లేని వైరస్‌ను మానవుల్లోకి జొప్పిస్తే రోగనిరోధక వ్యవస్థ చైతన్యవంతమై స్మాల్ పాక్స్ కారక వేరియోలా వైరస్‌ను అడ్డుకుంటుందన్న జెన్నర్ సూత్రం విజయవంతంగా పనిచేసింది. ఆ తరువాత స్మాల్‌పాక్స్ తరహాలో పూర్తి వైరస్‌ను కాకుండా.. నిర్వీర్యమైన వైరస్‌తో కొన్ని రకాలు, ఇతర పద్ధతులు వాడకంలోకి వచ్చాయి. కోవిడ్‌కు ఉపయోగిస్తున్న కోవిషీల్డ్, స్పుత్నిక్– వీలను చింపాంజీల్లోని అడినో వైరస్ జన్యుక్రమంలోకి సార్స్ కోవ్–2 వైరస్ కొమ్మును చేర్చడం ద్వారా సిద్ధం చేశారు. కోవాగ్జిన్‌లో మాత్రం నిర్వీర్యం చేసిన వైరస్‌ను ఉపయోగించారు. వైరస్ లేదా వైరస్ విడిభాగాలను గుర్తించి వాటిపై దాడికి యాంటీబాడీలను తయారు చేయ డం సంప్రదాయ టీకాలు చేసే పని అన్నమాట! కణాల టీచర్ ఎంఆర్ఎన్ఏ.... ఎంఆర్ఎన్ఏ టీకాలు వ్యాధి నిరోధక ప్రొటీన్లు ఎలా ఉత్పత్తి చేసుకోవాలో శరీరానికి నేర్పుతాయి. కోవిడ్ విషయంలో ఈ టీకాలు వైరస్ జన్యుక్రమం చుట్టూ పరుచుకుని ఉండే కొమ్ములను కణాల ద్వారా తయారు చేస్తాయి. (పక్కఫొటోలో చూడండి) అమెరికన్ కంపెనీ ఫైజర్, మోడెర్నా, జర్మన్ కంపెనీలు బయోఎన్‌టెక్, క్యూర్వ్యాక్లు ఈ రకమైన టీకాలపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నాయి. డీఎన్ఏ పోగులోని కొన్ని భాగాలను జన్యువులంటామని.. వాటిల్లో దాగున్న సమాచారం ఆధారంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు తయారవుతాయని మనకు తెలుసు. ఎంఆర్ఎన్ఏ అంటే డీఎన్ఏలోని ఒక భాగమే. కోవిడ్ విషయాన్ని తీసుకుంటే.. వైరస్‌లోని కొమ్మును తయారు చేసేందుకు కావాల్సిన ఎంఆర్ఎన్ఏను టీకా ద్వారా అందిస్తారు. ఇది మన కణాల్లోకి చేరి వైరస్ కొమ్ము ప్రొటీన్లను తయారు చేసేలా సూచనలు చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ప్రొటీన్‌తో కూడిన వైరస్‌ను చూస్తే చాలు.. వెంటనే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్న మాట. 1970ల్లోనే పరిశోధనలు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఎలాంటి వ్యాధికైనా చికిత్స కల్పించవచ్చునని 1970ల్లో శాస్త్రవేత్తలు ఊహించారు. పరిశోధనలు చేశారు.ప్రయోగాల్లో భాగంగా ఎంఆర్ఎన్ఏను జంతువుల శరీరాల్లోకి జొప్పించినప్పుడు విపరీతమైన దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే.. హంగెరీ శాస్త్రవేత్త కాటలిన్ కారికో ఎంఆర్ఎన్ఏ భాగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించారు. కాటలిన్ కారికో పరిశోధనల ఆధారంగా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెరిక్ రోసీ... మోడెర్నా కంపెనీని స్థాపించి పరిశోధనలను కొనసాగించారు. ఇదే సమయంలో కాటలిన్ కారికో పరిశోధనలు కేన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న ఉగుర్ సాహిన్, ఓజ్లెమ్ టురెసీ దంపతులను ఆకర్షించింది. బయోఎన్‌టెక్ కంపెనీ వ్యవస్థాపకులైన వీరు కారికో టెక్నాలజీతోపాటు ఆమెను కూడా తమ కంపెనీలోకి ఆహ్వానించి కేన్సర్‌పై పరిశోధనలు ముమ్మరం చేశారు. కేన్సర్ కణితుల నిర్మూలనకు ప్రస్తుతం కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సల వంటి మొరటు పద్ధతులను వాడుతున్నామని, ఈ క్రమంలో శరీరానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నామని ఉగుర్, ఓజ్లెమ్ల భావన, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు చేయవచ్చునని వారు విశ్వసిస్తున్నారు. కణితులపై నేరుగా దాడి చేయగల యాంటిజెన్ల ఉత్పత్తికి ఎంఆర్ఎన్ఏ ఉపయోగపడుతుందని వీరు చెబు తున్నారు. ఒకవైపు మోడెర్నా, ఇంకోవైపు బయో ఎన్‌టెక్ ఇప్పుడు రొమ్ము కేన్సర్‌తోపాటు ప్రొస్టేట్, చర్మ, కాలేయ, మెదడు, ఊపిరితిత్తుల కేన్సర్ల చికిత్సకు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలన్న అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇన్ఫ్లుయెంజా, జికా, రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు టీకాలు సి ద్ధం చేయడంలో కొంత ప్రగతి సాధించారు కూ డా. కోవిడ్ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి గుర్తింపు రావడంతో సమీప భవిష్యత్తులోనే ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరమవుతాయని, కే న్సర్తోపాటు అనేక ఇతర వ్యాధులకు చికిత్స కల్పించడం సాధ్యమవుతుందని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు కబురు అందించింది. తమ వినియోగదారుల కోసం కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సర్చ్ ఇంజిన్ దిగ్గజం వ్యక్తిగత మెసేజింగ్ యాప్ లో అనేక ఫీచర్లను జోడించింది. కొన్ని ఫీచర్లు వచ్చేసి ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్, ఎమోజీలకు సులభంగా అనుమతి, వాయిస్ యాక్సెస్ వంటివి ఉన్నాయి. "మీ ఖాతా పాస్ వర్డ్ ను సురక్షితంగా ఉంచడం నుంచి టెక్స్ట్ సందేశాలను షెడ్యూల్ చేసే వరకు, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 బిలియన్ యాక్టివ్ ఆండ్రాయిడ్ పరికరాలకు కొత్త అప్డేట్ లు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నట్లు" గూగుల్ తెలిపింది. సందేశాలకు ఇప్పుడు ఎండ్ టూ ఎండ్ ఎన్ ఎండ్ క్రిప్షన్ లభించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ గత ఏడాది నవంబర్ లో ఈ ఫీచర్ బీటా మోడ్ ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ రోల్ అవుట్ చేస్తుంది. వీడియో కాలింగ్ చేసుకునే సమయంలో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ లభిస్తుందని తెలిపింది. అలాగే, మరిన్ని దేశాల్లో భూకంప హెచ్చరిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ తెలిపింది. గ్రీస్, న్యూజిలాండ్ లో పరీక్షించిన ఈ ఫీచర్ ఇప్పుడు టర్కీ, ఫిలిప్పీన్స్, కజకస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లలో అందుబాటులో ఉంది. అధిక భూకంప ప్రమాదాలు సంభవించే దేశాల్లో భూకంప హెచ్చరికలను తెలియజేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రాబోయే సంవత్సరాల్లో ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు గూగుల్ తెలిపింది. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
ఉగ్రమూకల కొత్త యాప్ బాట
శ్రీనగర్: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్క్రిప్షన్ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడే ఎందుకు ? భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ డివైజ్ ఎన్క్రిప్షన్ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్కౌంటర్లలో మరణించిన వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2జీ నెట్వర్క్ కోసం... కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం. ఫోన్ నంబర్ అక్కర్లేదు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్ నంబర్ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్‌కు గట్టి సవాల్.. మరో యాప్
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో పర్సనల్ మెసెంజేర్ యాప్ వాట్సాప్‌కు గట్టి సవాల్ ఎదురవుతోంది. ప్రైవసీ పాలసీ అప్డేట్స్తో ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు ‘సిగ్నల్’ను అందిపుచ్చుకుంటున్నారు. వాట్సాప్ తన సోదర సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను పంచుకుంటుందన్న తాజా ప్రైవసీ అప్డేట్ కారణంగా అచ్చం వాట్సాప్‌ను పోలి ఉండే ‘సిగ్నల్’ యాప్‌ను ఎంచుకుంటున్నారు. ‘సే హెలో టు ప్రైవసీ’ అన్న టాగ్‌లైన్‌తో ఉండే సిగ్నల్ యూజర్ల డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ అప్డేట్స్ను వెల్లడించడంతో దీనిపై చర్చ మొదలైంది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల ‘సిగ్నల్’ యాప్‌ను వాడమని తన ట్విటర్ ఫాలోవర్స్‌కు పిలుపునివ్వడంతో క్రమంగా వాట్సాప్ యూజర్లు సిగ్నల్ యాప్‌లోకి జంప్ అవుతున్నారు. ఒక్కసారిగా ప్రైవసీపై చర్చ జరగడం, యూజర్ల డేటాను ఫేస్బుక్ వినియోగించుకోవడం వంటి అంశాల కారణంగా.. ప్రైవసీపై అధికంగా ఫోకస్ చేసే సిగ్నల్ యాప్ తెరపైకి వచ్చింది. సిగ్నల్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీకి సొంతమైన ఈ సిగ్నల్ యాప్‌ను మాక్సీ సృష్టించారు. వాట్సాప్ కోఫౌండర్ బ్రియన్ ఆక్టన్ ఈ సిగ్నల్ ఫౌండేషన్‌కు కూడా కోఫౌండర్. ఇవీ ప్రత్యేకతలు.. మామూలు మొబైల్ కాల్ తరహాలో సిగ్నల్ యాప్‌లో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. మీ ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళతాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్ యాప్‌లో వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. గ్రూప్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్లై ఇవ్వడం, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. చాట్ ప్రైవసీనే.. అయితే వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని, పర్సనల్ చాట్స్ విషయంలో ఇంతకుముందున్న పాలసీనే ఇప్పుడూ కొనసాగుతుందని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. అయితే అకౌంట్ రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే ఫోన్ నెంబర్, లొకేషన్, మొబైల్ డివైజ్ డేటా, ఐపీ అడ్రస్ వంటివి ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీస్‌కు షేర్ చేయనున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్బుక్, లేదా థర్డ్ పార్టీస్‌ను వినియోగించే సంస్థలు విని యోగదారులతో కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా వాట్సాప్‌ను వినియోగించేలా తన ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. -
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అమ్ముకోవాలా..?
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ సంస్థ గుత్తాధి పత్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం, 48 రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. మార్కెట్లో ఎలాంటి పోటీ లేకుండా చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఆ సంస్థ కొనుగోలు చేస్తూ ఏకాఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం కోర్టులో వేసిన దావాలో పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్‌కి చెందిన ఇన్స్టాగ్రామ్, మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లను ఆ సంస్థ విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పక్కా ప్రణాళికతో గుత్తాధిపత్యం ఫేస్బుక్ పక్కా ప్రణాళికతో చిన్న సంస్థల్ని మింగేస్తూ మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణుల్ని కనబరుస్తోందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ విమర్శించారు. 2012లో ఇన్స్ట్రాగామ్ని, 2014లో వాట్సాప్‌ని కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుందని అన్నారు. వినియోగదారులకు మరో ఎంపిక లేకుండా చేస్తూ ఏ కంపెనీని ఎదగనివ్వడం లేదని ఫెడరల్ కమిషన్ తన పిటిషన్లో పేర్కొంది. ఫేస్‌బుక్‌పై దావా వార్త బయటకు రాగానే ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. నిబంధనలకు అనుగుణంగానే ఫేస్బుక్ సంస్థ తాను ఏమి చేసినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశామని వాదిస్తోంది. ఏవైనా రెండు కంపెనీలు కలిసిపోవడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం కోర్టుకెక్కడం ఏమిటని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు జెన్నిఫర్ న్యూస్టీడ్ అన్నారు. ఫెడరల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తోందని ఆరోపించారు. -
గూగుల్ ఉద్యోగికి ఫేస్బుక్ రూ. 44 లక్షల నజరానా
ప్రపంచ వ్యాప్తంగా ఏంతో మంది వాడుతున్న ఫేస్బుక్ యొక్క మెసెంజర్ యాప్‌లో కీలకమైన లోపాన్ని గుర్తించిన గూగుల్ ఉద్యోగికి భారీ నజరానా లభించింది. ఈ లోపంతో హ్యాకర్లు మెసెంజర్ యాప్‌లో ఇద్దరి మధ్య జరిగే కాల్ సంభాషణలను వినే అవకాశం ఉన్న విషయాన్ని గూగుల్‌కి చెందిన ప్రాజెక్ట్ జీరో బగ్-హంటింగ్‌లో పనిచేసే నటాలీ సిల్వనోవిచ్ అనే మహిళా ఉద్యోగి గుర్తించారు. కేవలం ఆండ్రాయిడ్ మెసేంజర్ యాప్‌లో మాత్రమే ఈ లోపాన్ని గుర్తించినట్టు సదరు ఉద్యోగి తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు ఫేస్బుక్ వినియోగదారులపై ఈ లోపం ద్వారా హ్యాకర్లు నిఘా పెట్టడానికి సహాయపడుతుందని జెడ్‌నెట్ నివేదించింది. అయితే, ఈ బగ్‌ని అక్టోబరు 6వ తేదీన గుర్తించిన ఆమె..ఫేస్‌బుక్‌కి సమాచారం అందించిందట. ఈ లోపాన్ని గుర్తించినందుకు గాను ఫేస్బుక్ సిల్వనోవిచ్కు 60 వేల డాలర్ల (సుమారు 44 లక్షలు రూపాయిలు) బహుమతిని అందించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాజాగా ఆ లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. గతంలో కూడా సిల్వనోవిచ్ వాట్సాప్, ఐమెసేజెస్, విఛాట్, సిగ్నల్, రిలయన్స్ జియో ఛాట్ వంటి యాప్స్‌లో లోపాల్ని గుర్తించింది. (చదవండి: దేశంలో స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్) -
ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. తన వివిధ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడంలో మరో కీలక అడుగు వేసింది. తన ఫేస్బుక్ మెసెంజర్లో క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా కొత్త ఫీచర్ ను తాజాగా విడుదల చేసింది. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసెంజర్ కు డైరెక్టుగా మేసేజ్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేయకుండా మెసెంజర్ యూజర్లతో చాట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ రెండూ స్వతంత్ర యాప్స్ గా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఇన్బాక్స్లు వేరుగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అనుభవాన్ని కనెక్ట్ చేస్తూ కొన్ని కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకువచ్చామని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి , మెసెంజర్ హెడ్ స్టాన్ చుడ్నోవిస్కీ వెల్లడించారు. దీన్ని వెంటనే అప్డేట్ చేయాలా వద్దా అనేది యూజర్లు నిర్ణయించుకోవచ్చని కూడా వారు పేర్కొన్నారు. అలాగే సెల్ఫీ స్టిక్కర్లతో సహా 10 కొత్త ఫీచర్లను జత చేసినట్టు తెలిపారు. వాచ్ టుగెదర్, వానిష్ మోడ్, చాట్ కలర్స్, మనకిష్టమైన ఎమోజీలు, ఫార్వార్డింగ్, యానిమేటెడ్ మెసేజులు, అప్ డేట్ బ్లాకింగ్ తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ కొత్త అప్డేట్ ప్రస్తుతం కొంత మందికే పరిచయం చేసింది. రాబోయే కొద్ది నెలల్లో అందరికీ అందుబాటులోకి తేనుంది. అలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. సో .. యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
సాక్షి,న్యూఢిల్లీ: వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో అప్డేట్స్ను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరో ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గత వారం ప్లేఫుల్ పియోమరు అనే యానిమేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ వాటికి మరి కొన్ని స్టిక్కర్లను జత చేయనుంది. (వాట్సాప్‌లో హోంవర్క్) చుమ్మీ చుమ్ చుమ్స్, రికోస్ స్వీట్ లైఫ్, బ్రైట్ డేట్, మూడీ ఫుడీస్ అనే యానిమేటెక్ స్టిక్కర్లను వాట్సప్ తన స్టోర్ ద్వారా అందించనుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని వాట్సాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టోర్‌లో కనిపించని వారు కొన్ని రోజుల తరువాత వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు వాట్సాప్ ను మెసెంజర్‌తో కలపాలనే ఆలోచనలో ఫేస్బుక్ ఉంది. దీని ద్వారా మెసేంజర్, వాట్సాప్ రెండు ఫ్లాట్ఫ్లాంల ద్వారా కూడా వినియోగదారులు కలుసుకోవచ్చు. ఇది ఇంకా ప్రయోగత్మాక దశలోనే ఉంది. త్వరలో దీన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఫేస్బుక్ ఉంది. (వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
ఫేస్బుక్ కొత్త ఎమోజీ.. ఫన్నీ మీమ్స్ వైరల్
ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన కేరింగ్ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది. ఈ ఎమెజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ్యవాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలు రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో వారి స్నేహితులతో, సన్నిహితులతో చాట్ చేస్తూ తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రేమ, చిరునవ్వు, బాధ, కోపం, అలగడం వంటి భావాలను తెలపడానికి వాట్సప్, ఫేస్బుక్లో ఇప్పటికే ఆరు ఎమోజీలు ఉన్న విషయం తెలిసిందే. (ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!) "Mask off" on the Facebook "Care Emoji"? It was actually the Uncle Fester Emoji the whole time! pic.twitter.com/8EBzkw5U7V — Parallax Views w/ J.G. Michael (Podcast) (@ViewsParallax) May 3, 2020 అయితే ఇప్పడు కొత్తగా లాక్డౌన్లో మన వారిని జాగ్రత్తగా ఉండమని చెబుతూ వారిపై మనకు ఉన్న బాధ్యతను తెలియపరచడానికి ఇటీవల ‘కేరింగ్’ ఎమోజీని ఫేస్బుక్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రేమ, చిరునవ్వులతో హృదయాన్ని హత్తుకుని ఉన్న ఎమోజీకి కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుంటే మరికొందరు ‘ఫేస్బుక్ కేరింగ్ ఎమోజీని షేర్ చేస్తుంటే.. అది లేని వారి రియాక్షన్ ఎలా ఉంటుంది’ ‘ఈ కేరింగ్ ఎమోజీ కోసం నా ఫేస్‌బుక్‌ను ఆప్డేట్ చేస్తూనే ఉన్నాను.. కానీ అది రావడం లేదు’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్లో షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఎమోజీని విడుదల చేస్తున్నట్లు కమ్మూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వోయికా ఏప్రిల్‌లో ట్వీట్ చేశాడు. ‘‘మేము కొత్తగా కేరింగ్ ఎమోజీని ఫేస్బుక్, మెసెంజర్లో విడుదల చేస్తున్నాము. ఈ విపత్కర కాలంలో దూరంగా ఉన్న మీ వాళ్లపై ప్రేమను పంచుకునేందుకు ఈ ఎమోజీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశాడు. -
ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!
కరోనా మహమ్మారి విజృంభించకుండా కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించి దీంతో చాలా వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలో తమ బంధువులతో, స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోవడానికి చాలా మంది ఫేస్‌బుక్‌నే వేదికగా చేసుకుంటున్నారు. తమ భావాలు పంచుకోవడానికి ఎమోజీలను ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఫేస్బుక్లో లైక్ కోసం ఉపయోగించే ధమ్స్అప్ ఎమోజీ, హార్ట్, లాఫింగ్, షాక్, శాడ్‌నెస్, యాంగర్ ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే తమ భావాలను పంచుకోవడానికి వీలుగా ప్రస్తుతమున్న ఆరు ఎమోజీలకు తోడు మరో ఎమోజీని ఫేస్బుక్ మనకోసం తీసుకువచ్చింది. అదే కేర్ ఎమోజీ. కరోనా విపత్కర పరిస్థితుల్లో మన వారికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ కేర్ ఎమోజీని ఉపయోగిస్తారు. నవ్వుతున్న ఒక ఎమోజీ హార్ట్ సింబల్‌ని హత్తుకున్నట్లుగా ఈ కేర్ ఎమోజీని రూపొందించారు. ఫేస్‌బుక్‌తో పాటు మెసేంజర్‌లో కూడా పర్పుల్ కలర్లో ఉండే పల్స్ హార్ట్ ఎమోజీని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేర్ ఎమోజీ ఈ రోజు నుంచి ఫేస్బుక్లో ప్రత్యక్షం కానుంది. బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఎనేబుల్ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా ఈ ఎమోజీ వస్తుంది. అయితే బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఎనేబుల్ చేసుకొని యూజర్స్లు మాత్రం ఫేస్బుక్ తరువాతి అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే. కొత్తగా వచ్చిన ఈ ఎమోజీ యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.అయితే కొందరు మాత్రం ఈ కేర్ ఎమోజీ వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చేటట్లు ఉందని అంటున్నారు. సాధారణంగా ప్రేమికుల రోజున ఒక టెడ్డీబేర్ హార్ట్‌ని పట్టుకున్న టాయ్నే ఎక్కువగా గిఫ్ట్‌గా ఇస్తుంటారు. We’re launching new Care reactions on @facebookapp and @Messenger as a way for people to share their support with one another during this unprecedented time. We hope these reactions give people additional ways to show their support during the #COVID19 crisis. pic.twitter.com/HunGyK8KQw — Alexandru Voica (@alexvoica) April 17, 2020 -
భారత్‌లో ఫేస్బుక్ మెసెంజర్ కిడ్స్
న్యూఢిల్లీ : ఫేస్బుక్ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్ కిడ్స్ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ వారాంతంలో గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్బుక్ తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం పెరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని వివరించింది. -
గూగుల్ హ్యాంగౌట్స్ యూజర్లకు షాకింగ్ వార్త
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్టుఫైవ్ గూగుల్ అనే వెబ్సైట్ వెల్లడించింది. జిచాట్కు ప్రత్యామ్నయంగా 2013లో గూగుల్ సంస్థ హ్యాంగౌట్స్ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో నెటిజన్లు దీనిని ఆదరించలేదు. దానికి తోడు హ్యాంగౌట్స్‌లో బగ్స్ ఎక్కువగా ఉండేవి. గత కొద్ది కాలంగా గూగుల్ కూడా ఈ యాప్‌పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించలేదు. ఈ యాప్‌కు బదులుగా గూగుల్ మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఆర్సీఎస్ ఫీచర్లను మెసేజింగ్‌కు జోడిస్తున్నామని తెలుపుతూనే హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేస్తామని చెప్పకనే చెప్పింది. హ్యాంగౌట్స్‌కు గూగుల్ తన సేవలను నిలిపివేయడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి అది వాడే వారు మరొక ప్లాట్‌ఫాంను ఎన్నుకోవడానికి సమయం ఉంది. -
బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల మళ్లింపు
హిరమండలం : ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మెసెంజర్ డబ్బులు కాజేసిన ఘటన హిరమండలం ఎస్బీఐలో చోటుచేసుకుంది. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాడలి నిర్వాసిత గ్రామానికి చెందిన నల్ల రమణమ్మకు హిరమండలం ఎస్బీఐలో ఖాతా ఉంది. నిర్వాసితురాలు కావడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం అంతా ఖాతాలోనే ఉంది. ఏప్రిల్ నాటికి ఆమె ఖాతాలో రూ.3.60 లక్షలు ఉండేది. గృహనిర్మాణ అవసరాల నిమిత్తం ఆమె ఏప్రిల్ 18న బ్యాంకుకు వెళ్లగా నగదు కొరత దృష్ట్యా రూ.20వేలకు మించి ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఖాతాల్లో సొమ్ములున్నా తీసుకోలేని పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా రూ.50వేలు ఇవ్వడానికి బ్యాంకు సిబ్బంది ఒప్పుకున్నారు. అప్పటికే చలానా నింపడాన్ని గమనించిన మెసేంజర్ బాలరాజు రూ.50వేలు తీసుకునేందుకు కొత్త చలానా (విత్‌డ్రా ఫామ్) నింపి నగదు ఇప్పించాడు. ఆమె దగ్గర ఉన్న పాత రూ.20 వేల చలానా తీసుకున్నాడు. అందులో ఓ సున్నా అదనంగా వేసి రెండు లక్షల రూపాయలుగా మార్చి సొమ్మును తన ఖాతాలోకి మళ్లించాడు. ఏప్రిల్ నుంచి నగదు అవసరాలు లేకపోవడంతో రమణమ్మ బ్యాంకుకు రాలేదు. బుధవారం ఇంటి పనుల కోసం నగదు అవసరం పడటంతో ఖాతా పుస్తకంతో బ్యాంకుకు చేరుకుంది. ఖాతాలో నగదు పరిశీలించగా రూ.2లక్షలు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురై బ్యాంకు మేనేజర్ దివాకర్‌కు ఫిర్యాదు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరపగా బాలరాజు ఖాతాకు మళ్లించినట్లు తేలింది. వెంటనే మేనేజర్ అతన్ని పిలిపించి మందలించారు. ఆయన ఖాతా నుంచి తిరిగి రమణమ్మ ఖాతాకు రూ.2లక్షలు జమచేశారు. ఇకపై ఇటువంటి తప్పిదాలు లేకుండా చూసుకుంటామని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఖాతాదారుల్లో ఆందోళన హిరమండలం ఎస్బీఐ పరిధిలో ఎల్‌ఎన్‌పేట, హిరమండలం మండలాల్లో వేలాది మంది ఖాతాదారులు ఉన్నారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు కోట్లాది రూపాయలు మంజూరు చేశారు. ఈ లావాదేవీల ప్రక్రియతో స్థానిక ఎస్బీఐ నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటన వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన విర్చ్యువల్ అసిస్టెంట్ 'ఎం'ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఫేస్బుక్ మెస్సెంజర్‌లోని ఒక టెక్ట్స్ రోబోట్. ఈ వీఆర్ ఎం ను ఫేస్బుక్ 2015 ఆగస్టులో ప్రారంభించింది. దాదాపు రెండున్నరేళ్లపాటు సేవలందించిన దీనికి త్వరలో వీడ్కోలు పలకనున్నారు. 2018 జనవరి 19 వీఆర్ ఎం కు చివరి రోజు కానుంది. ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి దీనిని తయారు చేశామని, తద్వారా ఫేస్బుక్ చాలా విషయాలను తెలుసుకుందని యంత్రాంగం తెలిపింది. ఫేస్‌బుక్‌లోని ఇతర విభాగాల్లో ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటామని ఫేస్బుక్ తెలిపింది. అంతేకాకుండా మరో కీలక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 'ఎం' 2వేల మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి పరిచి అందరికీ ఉపయోగ పడేలా తిరిగి బీటా వెర్షన్లో తీసుకువస్తామని ప్రకటించింది. మానవ మేధా శక్తితో సమానంగా ఉండగలిగి మరింత మందికి చేరువయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. -
వాట్సాప్ తర్వాత ఫేస్బుక్ మెసెంజర్ బ్రేక్..
వాట్సాప్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడి 24 గంటల అనంతరం ఫేస్బుక్ మెసెంజర్ సర్వీసులు కూడా ఇదే బారిన పడ్డాయి. శనివారం రోజు మెసెంజర్ సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్టు తెలిసింది. ట్విట్టర్లో పలు యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెసెంజర్ అకౌంట్ల ద్వారా ఎలాంటి మెసేజ్‌లను పంపించడం, స్వీకరించడం కుదరడం లేదని యూజర్లు పేర్కొన్నారు. పాత మెసెజ్‌లను కూడా చూడలేకపోతున్నామని కొంతమంది యూజర్లు రిపోర్టు చేశారు. ''ఫేస్బుక్ మెసెంజర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. నా మెసేజ్‌లన్నీ కనిపించడం లేదు. ఎవర్ని కాంటాక్ట్ చేయడం కూడా కుదరడం లేదు... ప్లీజ్ సాయం చేయండి'' అంటూ ఓ యూజర్లు ట్వీట్ చేసింది. నిన్న కూడా ఇదే మాదిరి వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లో పాటు పలు ప్రపంచ దేశాల్లో వాట్సాప్ సేవలు పనిచేయలేదు. కారణమేమిటన్నది తెలియనప్పటికీ, తర్వాత కొద్ది సేపటికి ఈ సేవలు రిస్టోర్ అయ్యాయి. తమ సేవలకు అంతరాయం ఏర్పడటంపై వాట్సాప్ యూజర్లకు క్షమాపణ చెప్పింది. వాట్సాప్ డౌన్ అవ్వడమే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ ఐటెమ్‌గా నిలిచింది. పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ వంటి పలు దేశాల్లో ఇదే టాప్ ట్రెండింగ్ విషయం. ప్రస్తుతం ఈ విషయంపై వాట్సాప్ విచారణ జరుపుతోంది. ఈ ఏడాది ఇలా జరగడం ఇది మూడోసారి. ఆగస్ట్‌లోనూ ఇలాగే కొంత సేపు వాట్సాప్ పనిచేయలేదు. Hey @facebook, @messenger seems to be down. All of my messages have disappeared and I can’t contact anyone. Please help — Jessica Corso (@jessica_corso) November 4, 2017 -
130 కోట్ల మార్క్ దాటేసిన మెసెంజర్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌మీడియా నెట్ర్కింగ్ సైట్ ఫేస్బుక్ కు చెందిన మెసేంజెర్ యాప్ దూసుకుపోతోంది. ప్రతినెలా యూజర్ల పరంగా భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. 130కోట్ల యాక్టివ్ యూజర్లతో ప్రపంచ వ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తోంది. ఫేస్బుక్ సొంతమైన మరో మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సమానంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రతినెల ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మెసెంజర్ ప్రతి నెల ఉపయోగిస్తున్నారని ఫేస్బుక్ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది జూలైలో వన్బిలియన్ యాక్టివ్ యూజర్ల మార్క్‌ను అధిగమించిన మెసెంజర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటోందని ఫేస్బుక్ తెలిపింది. మెసెంజర్ ఉత్తమంగా ఉండటం, కొత్త మాస్క్, ఫిల్టర్లు, వీడియో చాట్ లాంటి అంశాలు దీనికి దోహదం చేసినట్టుతెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రదేశాల్లో తమ వర్చ్యువల్ పెర్సనల్ అసిస్టెంట్ త్వరలో అందుబాటులో తేనున్నట్టు ఫేస్బుక్ పోస్ట్ లో శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు కాదు ఇన్‌బాక్స్ పునఃరూపకల్పనతో మరిన్ని మార్పులను తీసుకొస్తామని తెలిపింది. ఇందుకు ప్రతి వినియోగదారుడికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఫేస్బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్‌కు 1.3బిలియన్ల యూజర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌కు 700 మిలియన్ నెలవారీ వినియోగదారులు నమోదువుతున్నారు. అలాగే 200 మిలియన్ల మంది ప్రతి రోజు 'స్టోరీస్' ఫీచర్ ఉపయోగిస్తున్నారు. మరోవైపు సమీప ప్రత్యర్థి స్నాప్‌చాట్ రోజువారీ యూజర్లు 166 మిలియన్ మాత్రమే. -
మరో మైల్స్టోన్ అధిగమించిన మెసెంజర్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు చెందిన మెసెంజర్ యాప్ మరో రికార్డును సొంతం చేసుకుంది. యూజర్ల సంఖ్యలో మరో కీలకమైన రికార్డును సొంతం చేసుకుంది. గత ఎనిమిది నెలల్లో మొత్తం 200 మిలియన్ల కొత్త యూజర్లను జతచేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. రికార్డు స్థాయిలో 1.2 బిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రతినెలా 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు నమోదవుతున్నారని ఫేస్బుక్ హెడ్ ఆఫ్ మెసెంజర్ డేవిడ్ మార్కస్ తెలిపారు.దీంతో వివిధ ఫీచర్లతో విశేష ఆదరణ పొందుతున్న సమీప భవిష్యత్తులో నెలకు 1.5 లేదా 2 బిలియన్ల యూజర్లను సాధించడం అంత కష్టమేమీకాదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నుంచి వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్లకు 200 మిలియన్ల మంది, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల యూజర్లు ఉన్నారు. నెలకు 1 బిలియన్ యూజర్లతో ఫేస్బుక్ మూడు యాప్ లను కలిగి ఉండగా, గూగుల్ కుచెందిన 7 యాప్‌లు ఈ 1 బిలియన్ క్లబ్ లో ఉన్నాయి. మరోవైపు రాబోయే సం.రాల్లో మెసెంజర్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఒకవిప్లవం కానుందని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ విశ్వాసం. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఫేస్బుక్ తన ఇతర యాప్ ల రెవెన్యూలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1.2 బిలియన్ యూజర్లద్వారా ప్రకటనలపై వచ్చే ఆదాయంపై ఫోకస్ పెట్టనుంది. -
ఫేస్బుక్ ఇన్స్టెంట్ గేమ్స్ లాంచ్
న్యూయార్క్: మొబైల్ గేమ్ ప్రేమికులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ గుడ్ న్యూస్ అందించింది. తన మెసెంజర్ యాప్ లో మరో కొత్త ఫీచర్ ను జోడించింది. మెసెంజర్ వినియోగదారుల కోసం ఇన్స్టెంట్ గేమ్స్ ను బుధవారం లాంచ్ చేసింది. టెక్ క్రంచ్ అందించిన సమాచారం ఈ గేమింగ్ సదుపాయం 30 దేశాల్లో పరిచయం చేసింది. . బందాయ్ నామ్కో,కోనామీ, టయోటో్ లాంటి క్లాసిక్ డెవలపర్లు సహాయంతో 17 గేమ్స్ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. మెసెంజర్ యాప్ లోని గేమ్ కంట్రోలర్ అనే బటన్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ మీద టాప్ చేసిన తక్షణమే హెటీఎంల్ 5 లో ఈ గేమ్స్ ఓపెన్ అవుతాయి. -
ఫేస్బుక్ కీలక నియామకం
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది.దేశంలో వ్యాపార విస్తరణపై కన్నేసిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ..ఈ ఏడాది జూలై లో ఒక బిలియన్ యూజర్లను అధిగమించిన మెసెంజర్ కోసం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాన యాప్ మెసెంజర్ కోసం కొత్త నియామకాన్ని చేపట్టారు. మాజీ యాహూ అధికారి, ప్రముఖ ఈ టెయిలర్ స్నాప్ డీల్ కు ముఖ్య ఉత్పత్తి అధికారి గా పనిచేసిన ఆనంద్ చంద్రశేఖరన్ ను మెసెంజర్ యాప్ కు అధికారిగా నియమించారు. ఈ విషయాన్ని మంగళవారం చంద్రశేఖరన్ తన అధికారిక ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ఫేస్బుక్ మెసెంజర్ వేదికపై పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కాగా కనెక్టింగ్ ఇండియా తమ ప్రధాన లక్ష్యమని ,దేశంలో బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదనీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని జుకర్ బర్గ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో ఫేస్బుక్
సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ మెసెంజర్ శరవేగంగా దూసుకుపోతోంది. మూడేళ్ల క్రితం లాంచ్ అయిన మెసెంజర్ యాప్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. నెలకు సగటున వందకోట్ల (ఒక బిలియన్) యూజర్లతో మరో అతపెద్ద మైలురాయిని అధిగమించింది. లాంచింగ్ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఆదరణ అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజా ఈ యాప్ లో చేరిన నెటిజన్ల సంఖ్య ఒక బిలియన్ దాటడంతో సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈస్టర్ ఎగ్, బెలూన్ ఎమోజీలను యూజర్లకు పంపిస్తోంది. దీంతో ఈ యాప్ యూజర్ల స్మార్ట్ ఫోన్ నిండా బెలూన్లతో నింపేసి యూజర్లను ఆకట్టుకుంటోంది. గత జనవరి నుంచి 200 మిలియన్ల యూజర్లు పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. ఆధునిక సమాచార అత్యుత్తమ అనుభవాలను సృష్టించడంపై దృష్టి పెట్టినట్టు ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 17 మిలియన్లకు పైగా ఫోటోలు మెసెంజర్ ద్వారా షేర్ అవుతున్నట్టు వెల్లడించారు.మెసెంజర్ యొక్క కీ మార్కెట్లలో ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా అనే ఇతర యూరోపియన్ దేశాలు ఉన్నాయని చెప్పారు. కాగా ఫేస్ బుక్ స్వాధీనం చేసుకున్న వాట్సాప్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో 100 కోట్ల యూజర్లను అధిగమించింది. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలోఒకరు ఈయాప్ ను వాడుతున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫేస్ బుక్ మెసెంజర్ కొత్త ఫీచర్
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి.