mishap
-
అచ్యుతాపురం ఘటన: దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ దుర్ఘటన అప్డేట్స్పరిహార ప్రకటన చేసిన చంద్రబాబుఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు సర్కార్బాధిత కుటుంబాల ఆందోళన, వైఎస్సార్సీపీ డిమాండ్‌కు తలొగ్గిన వైనంఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం జిల్లా మెడికవర్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబుఅనంతరం మీడియాతో పరిహార ప్రకటనమృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారంఅవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు,గాయాలు అయిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబుచికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణపరిహారం ఎప్పటిలోగా అందిస్తామనేదానిపై ఇవ్వని స్పష్టతగత ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేశాయంటూ అసందర్భోచిత వ్యాఖ్యలుప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, పరిహారంపై స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ ప్రభుత్వ స్పందన సరిగా లేదు: బొత్స ఫైర్అచ్యుతాపురం ఘటన బాధాకరంప్రభుత్వం స్పందించిన తీరు సరికాదుబాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమంత్రులు, ఎమ్మెల్యేలు బాధితుల్ని పరామర్శించలేదుచంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలిగతంలో మా ప్రభుత్వం ఈ తరహా ప్రమాదాలు జరిగితే సత్వరమే స్పందించిందిమా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిందిసెజ్ ప్రమాద బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలిరేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారుపరిహార ప్రకటనపై బాబు సర్కార్ డ్రామాలుఅచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. పరిహారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలుగత ప్రభుత్వం మాదిరే పరిహారం ఇవ్వాలని కోరుతున్న బాధిత కుటుంబాలుఅటు విశాఖ, ఇటు అనకాపల్లి మార్చురీల వద్ద ఆందోళనపరిహారంపై స్పష్టమైన ప్రకటన తర్వాతే పోస్ట్‌మార్టానికి సహకరిస్తామని బైఠాయింపుపోలీసులు, రెవెన్యూ అధికారుల బుజ్జగింపులతో తలొగ్గని కుటుంబ సభ్యులుప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇస్తుందని ప్రకటించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్తక్షణం సాయం అందించాలని బాధిత బంధువుల డిమాండ్కాసేపటికే జాయింట్ కలెక్టర్ జాహ్నవి విరుద్ధమైన ప్రకటనపరిహారం ఇవ్వాలంటే ముందు బాధితుల బంధువుల్ని గుర్తించాలంటూ మెలికమూడు రోజుల సమయం పడుతుందని వ్యాఖ్యపరిహారం చంద్రబాబే ప్రకటిస్తారంటూ తెలిపిన జాహ్నవిజేసీ ప్రకటన తర్వాత.. ఆందోళన ఉధృతానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు, బంధువులుమెడికవర్ ఆస్పత్రికి చంద్రబాబువిశాఖ మెడికవర్ ఆస్పత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరామర్శచికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబువైద్యం అందుతున్న తీరును వైద్యుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబుకేజీహెచ్కు వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరుల పరామర్శఅధికార యంత్రాగం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయిన బాధితులుఏ ఒక్కరూ పట్టించుకోలేదని కంటతడి పెట్టిన మహిళలుచలించిపోయి.. బాధితుల్ని ఓదార్చిన బొత్స ‘సీఎం రమేష్‌కు సిగ్గుందా?’అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతమార్చురీ గేటు ముందు నిరసనకు దిగిన మృతుల కుటుంబ సభ్యులుప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ నినాదాలుమృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్.అచ్యుతాపురం ప్రమాద ఘటనపై కేంద్రం రూ. రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం దుర్మార్గంసీఎం రమేష్ కు సిగ్గుందా?బాధిత కుటుంబాలు రోదిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదు..:::ఘంటా శ్రీరామ్, వామపక్ష నేతఅచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది పరిశ్రమల కాలుష్య నియంత్రణ నా శాఖ పరిధిలో ఉంది కానీ, భద్రత వేరే శాఖ కిందికి వస్తుంది పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పాను అలా చేస్తే పరిశ్రమలు మూతపడతాయని నిర్వాహకులు భయపడుతున్నారుకానీ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాల్సిందేఇలాంటి ఘటనలప్పుడు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరంసెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాంరాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం ఖర్గే దిగ్భ్రాంతిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతిఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలిబాధితులకు న్యాయం చేసి, తగిన నష్టపరిహారం ఇవ్వాలిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిపరిహారాన్ని సీఎం ప్రకటిస్తారు: విశాఖ జేసీవిశాఖ కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలిసిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవి.మృతుల వారసుల్ని విచారణ చేసి గుర్తిస్తాం: జేసీ జాహ్నవిపరిహారం చెల్లించటానికి వారసుల గుర్తింపు కార్యక్రమానికే మూడు రోజుల టైం పడుతుంది: : జేసీ జాహ్నవిపరిహారం ఎంత అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు : జేసీ జాహ్నవిప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక వెల్లడిస్తాం : జేసీ జాహ్నవిజేసీ ప్రకటన నేపథ్యంలో.. మీడియా ముందుకు బాధిత కుటుంబాలుపరిహారం ప్రకటించేదాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనీయమని స్పష్టీకరణపరిహారంపై ప్రకటనేది?ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మృతుల బంధువుల వాగ్వాదం నష్ట పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ మృతదేహలను తీసుకెళ్ళేది లేదని తేల్చేసిన బంధువులుమృతుల బంధువులను బుజ్జగిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందివిశాఖ కేజీహెచ్ వద్ద ఇదే తరహా ఆందోళనఅందుకే ప్రమాదం!: అధికారుల వెర్షన్అనకాపల్లి ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై అంచనాకి వచ్చిన అధికారులురియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరగలేదు అని క్లారిటీ తెచ్చుకున్న అధికారులు!ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ సాల్వెంట్ లో MTBE లిక్విడ్ లీక్ అవ్వడంతోనే ప్రమాదం?లీక్ అవుతున్న సాల్వెంట్ మీద ఎలక్ట్రికల్ స్పార్క్ పడటంతో పేలుడు సంభవించిందని అంచనాపేలుడు దాటికి కుప్పకూలిన బ్రిక్ వాల్మరో నలుగురి పరిస్థితి విషమంఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమంమెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అధికారుల సూచన18కి చేరిన మృతుల సంఖ్య కొనసాగుతున్న ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల ఆందోళన విశాఖ కలెక్టర్ హామీ తర్వాత కూడా వెనక్కి తగ్గని మృతుల కుటుంబ సభ్యులుఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టిన కుటుంబ సభ్యులుఅధికార ప్రజాప్రతినిధులెవరూ రాలేదని మండిపాటుఅధికార యంత్రాంగం కూడా ఆలస్యంగా స్పందించిందంటున్న బాధితులుకోటి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పోస్టుమార్టంకు సహకరిస్తామని స్పష్టీకరణగత ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే ఆదుకుంది కదా అని గుర్తు చేస్తున్న మృతుల బంధువులు అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబుఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎంనగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబుతర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లనున్న సీఎంఘటనా స్థలాన్ని సందర్శించనున్న చంద్రబాబుఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఆస్పత్రిలో ఏడు మృతదేహాలు.. ఆరింటి గుర్తింపుమార్చురీ వద్ద ఉన్న మృతుల బంధువులపై ఆంక్షలువిశాఖ కేజీహెచ్ వద్ద పరిహారంపై స్పష్టమైన హామీ కోరుతూ బంధువుల ఆందోళనఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని ముందు జాగ్రత్తమృతదేహన్ని చూస్తామని చెప్పినా లోపలకు పంపించని పోలీసులుపోలీసులతో బంధువుల వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తత సాక్షి చేతిలో ప్రమాదంపై ఫిర్యాదు కాపీరాంబిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాంబిల్లి తహశీల్దార్ భాగ్యవతిమధ్యాహ్నాం 2:15 కి పేలుడు జరుగున్నట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్సాల్వెంట్ కెమికల్ పేలి ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని రిపోర్ట్ఒకట్రెండు రోజుల్లో పరిహార ప్రకటన: విశాఖ కలెక్టర్కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌ను ముట్టడించిన మృతుల బంధువులు.ప్రమాదం జరిగిన తరువాత యాజమాన్యం ఎందుకు స్పందించలేదని నిలదీసిన మృతుల బంధువులు.ప్రభుత్వం నుండి పరిహారం ప్రకటన స్పష్టం గా వచ్చేవరకు మార్చురీ వద్ద ఆందోళన చేస్తామంటున్న బాధిత కుటుంబాలు.ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పిన కలెక్టర్ కలెక్టర్ ప్రకటనపై బాధితుల కుటుంబాల అసంతృప్తి.. కొనసాగుతున్న ఆందోళనతగిన న్యాయం చేయాల్సిందే: బాధిత కుటుంబాల ఆందోళనకేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకేజీహెచ్ మార్చురీకి వచ్చిన జిల్లా కలెక్టర్.కలెక్టర్‌ను చుట్టుముట్టిన బాధితులుతమకు న్యాయం చేయాలని డిమాండ్జరిగిన ప్రమాదంపై ఇప్పుడు వరకు ప్రభుత్వ స్పందించలేదు: బాధిత కుటుంబాలుస్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు: బాధిత కుటుంబాలుకంపెనీ ప్రతినిధులు ఎవరూ రాలేదు: బాధిత కుటుంబాలుగతంలో జగన్ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది : బాధిత కుటుంబాలుఅదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలి: బాధిత కుటుంబాలుపరిహారంగా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి: బాధిత కుటుంబాలుకేజీహెచ్ వద్ద ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వద్ద ఫార్మా కంపెనీ మృతుల బంధువుల ఆందోళననష్టపరిహారంపై స్పష్టమైన ప్రభుత్వం హామీ ఇవ్వాలని బంధువుల డిమాండ్కేజీహెచ్లో 12 మృతదేహాలుబంధువులతో రెవెన్యూ అధికారుల చర్చలు అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తతనష్టపరిహారం పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పంచనామాకు సహకరించేది లేదంటున్న మృతుల బంధువులు..మృతుల బంధువులను బుజ్జగిస్తున్న రెవెన్యూ అధికారులుపంచనామాకు సహకరించాలని మిగతా వివరాలు ఆపై మాట్లాడదామంటున్న రెవెన్యూ సిబ్బందిఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్ కలెక్టర్మృతుల బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న జాయింట్ కలెక్టర్నష్టపరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాని స్పష్టతఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు బీఎన్ఎస్ సెక్షన్లు 106(1), 125(b),125(a) కింద కేసులు నమోదుఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసునిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రాంబిల్లి పోలీసులుప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటనఅచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య 18!అచ్యుతాపురం సెట్ దుర్ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్యకేజీహెచ్ మార్చురీకి 12 మృతదేహాలుకొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్17 మృతదేహాల గుర్తింపు.. మరొకటి గుర్తించాల్సి ఉంది!విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్న మృతుల వివరాలు1)నీలపు రామిరెడ్డి అస్సోసియేట్ జెనరల్ మేనేజర్ 2)మహంతి నారాయణారావు అసిస్టెంట్ మనేజర్ 3)మొండి నాగబాబు అసిస్టెంట్ మేనేజర్ 4)చల్లపల్లి హారిక ట్రైనీ ఇంజినీర్ 5)మారిశెట్టి సతీష్ అసిస్టెంట్ మేనేజర్ 6)యళ్లబిల్లి చిన్నారావు పెయింటర్ 7)పైడి రాజశేఖర్ ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ తండ్రి ధర్మారావు శ్రీకాకులం జిల్లా వంజంగి కులం కాలింగ 8) కొప్పర్తి గణేస్ కుమార్ M దుర్గా భవాని 9) ప్రశాంత్ హంస మేల్ W/o జ్యోతి 10) వేగి సన్యాసి నాయుడు11)పూడి మోహన్ దుర్గా ప్రసాద్ 12)జవ్వాది చిరంజీవిఅనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలుఈ ఐదు మృతదేహలకు పంచనామా నిర్వహించనున్న అధికారులుఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న మృతుల బంధువులుఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్న మృతుల వివరాలు..జావేది పార్థసారిది, పార్వతీపురం మన్యంపూసల వెంకట సాయి, చిన గంట్యాడమారేణి సురేంద్ర, గాజువాకభి. ఆనందరావు, విజయనగరంబిఎన్. రామచంద్రరావుఎసెన్షియా (scientia) కంపెనీ ఎదుట రోదిస్తున్న బాధితుల బంధువులుఅచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం పేలిన రియాక్టర్ తమ వారి ఆచూకీ ఇంకా తెలియదు అంటూ రోదిస్తున్న బాధితులుఇంకా శిథిలాల కిందే చిక్కుకున్న కొంతమంది కార్మికులు?సహాయక చర్యల్లో జాప్యం చేస్తున్నారనే విమర్శఎవ్వరూ పట్టించుకోక పోవడంతో.. కంపెనీ ఎదుట బైఠాయించిన బాధితులుఅధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోందిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని అన్నివిధాలా ఆదుకోవాలిబాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలిఅచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.గత కొంతకాలంగా విశాఖ సమీపంలోని కంపెనీలలో వరుస ప్రమాదాలునిరంతరం ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది:::సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ -
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
రష్యాలో ఘోర రైలు ప్రమాదం... 70 మందికి తీవ్రగాయాలు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. Passenger train derails in Komi Region, Russia pic.twitter.com/Ywh4s6NEaH— RT (@RT_com) June 26, 2024 -
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బంధువులకు ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది
-
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్‌మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్‌గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్‌గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
చీమలపాడు: ఆ తిండి తిని పశువులకు అస్వస్థత.. మూడు మృతి
క్రైమ్: ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ శ్రేణులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చగా.. వేదికకు దగ్గర్లోని ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, ఆర్పడానికి వెళ్లిన వాళ్లు అందులోని సిలిండర్ పేలి మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలు అయ్యాయి కూడా. ఈ విషాదంతో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకుంది బీఆర్ఎస్. అయితే.. సమ్మేళనం కోసం వండిన వంటకాలను గ్రామ సమీపంలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని కొన్ని పశువులు ఆ కుళ్లిపోయిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురయ్యాయి. మూడు ఆవులు మృతి చెందగా, మరికొన్నింటికి వైద్యం అందిస్తున్నారు. నలుగురు గ్రామస్తుల మృతితో విషాదంలో ఉన్న తాము అక్కడ తిండి వదిలేసిన సంగతి గమనించలేదని, పశువులు నిత్యం అటువైపు మేతకు వెళ్తుండడంతో తాము పెద్దగా పట్టించుకోలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని పశువుల యజమానులు వాపోతున్నారు. -
ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 36 మందిని బలిగొన్న ఆలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయి. సోమవారం ఉదయం బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రమాదానికి కారణమైన అక్రమ కట్టడాన్ని కూల్చివేతను అధికారులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ఇండోర్ మున్సిపల్ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. కూల్చివేతలకు ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. సుమారు నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్‌సిబ్బంది అక్కడ మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా, ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు దగ్గరుండి ఆ కూల్చివేతలను పర్యవేక్షించారు. #WATCH | Madhya Pradesh: Indore municipality deploys bulldozer & demolishes illegal structure at Indore temple where 36 people died after the stepwell collapse there last week. pic.twitter.com/gpRJB6zWhN — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023 ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.. ఆలయంలో మెట్లబావిని మూసేస్తూ కాంక్రీట్స్లాబ్వేయగా.. శ్రీరామ నవమి నాడు ఆ స్లాబ్ ఉన్న ప్రాంతంలోనే యాగం చేయడం, భక్తుల బరువును మోయలేక ఆ పైకప్పు కూలిపోయి భక్తులు బావిలో పడిపోయి మరణించడం తెలిసిందే. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. అది అక్రమ కట్టడం అని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కిందటి ఏడాది ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు పంపింది. అంతేకాదు.. ఆ పైభాగానికి కూల్చివేసేందుకు మార్క్ కూడా చేసింది. కానీ, ఆ సమయంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆలయ ట్రస్ట్ నిరసన వ్యక్తం చేయడంతో.. అధికారులు వెనక్కి తగ్గారు. ఒకవేళ అధికారులు ఆనాడే దూకుడుగా స్పందించి ఉంటే.. నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. ఇండోర్ స్నేహ్ నగర్లో పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తోంది. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావిని కేవలం నాలుగు ఐరన్ గ్రిడ్స్‌తో.. పైన సన్నని కాంక్రీట్ లేయర్, టైల్స్‌తో కప్పేసి పూజల కోసం ట్రస్ట్ నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అక్రమ కట్టడంతో పాటు చుట్టుపక్కల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సైతం కూల్చేస్తున్నారు అధికారులు. మరోవైపు.. ఇండోర్ ఆలయ ప్రమాద ఘటనతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆలయ కట్టడాలను, బావుల్ని గుర్తించి.. తక్షణమే వాటిని మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే ఆలయాల ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే గుర్తించి తక్షణమే వాటిని తొలగించడం లేదంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. -
గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఇండోర్ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్‌పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. -
నెల్లూరు: తోడేరు చెరువులో ఆరుగురు యువకుల గల్లంతు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన. -
కేంద్ర ప్రభుత్వ అనుచిత నిర్ణయాలు వల్లే ప్రమాదాలు
-
కందుకూరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందజేత
సాక్షి, నెల్లూరు: కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘనటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందజేశారు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌లను కాకాణి ఆ కుటుంబాలకు అందజేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్న మంత్రి కాకాణి.. ఘటనపై దర్యాప్తు వీలైనంత త్వరగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
విషాదం: చిన్నా.. నీ సాహసం వృథా అయ్యిందిరా!
ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్‌ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంగ్లండ్‌లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్‌లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది. కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు. నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్‌తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విమాన కూల్చివేత కేసు.. ఎనిమిదేళ్లకు న్యాయం
ఆమ్స్టర్డ్యామ్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 298 మంది మృతికి కారణమైన నిందితులకు ఆలస్యంగా అయినా కఠిన శిక్ష పడింది. ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది డచ్ కోర్టు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రష్యా పాత్ర ఉందనే విషయం స్పష్టమైందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన 196 మంది, 43 మంది మలేసియన్ వాసులు, 38 మంది ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు.. ఇలా మొత్తం పది దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటువాదుల పని అయ్యిండొచ్చని, అందులో మాస్కో ప్రమేయం ఏం లేదని పాత పాటే పాడుతోంది. -
తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్
అహ్మదాబాద్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రెటరీని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది. అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు! -
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం
అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందినట్లు సమాచారం. పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవాళ్లలో మరొకరి మృతితో.. మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటన దర్గాహోన్నూరు ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారాయన. అంతేకాదు.. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారాయన. -
మోర్బీ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన
లక్నో: ఛట్ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. #WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw — ANI (@ANI) October 31, 2022 ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే.. -
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
మోర్బీ విషాదం.. అరెస్టులు షురూ
గాంధీనగర్: దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు తీసిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన కేసులో పోలీసుల చర్యలు మొదలయ్యాయి. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టిన ఓరేవా కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అయితే వాళ్లిద్దరూ మధ్య స్థాయి ఉద్యోగులని తెలుస్తోంది. బ్రిడ్జి దుర్ఘటన జరిగినప్పటి నుంచి కంపెనీ సీనియర్లు పత్తా లేకుండా పోయారు. వాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జి పునఃప్రారంభ విషయంలో ఒరేవా ఎన్నో తప్పిదాలకు పాల్పడిందని.. ఫిట్నెస్ సర్టిఫికెట్ దగ్గరి నుంచి బ్రిడ్జిని తిరిగి ప్రారంభించడం దాకా.. అన్నింట్లోనూ వైఫల్యాలే ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముందు ముందు మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని విచారణ జరుపుతున్న సిట్ ప్రకటించింది. ఇక ప్రమాదానికి ముందు కొందరు కుర్రాళ్లు.. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తాళ్లను విపరీతంగా ఊపారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. #WATCH | An injured survivor in the #MorbiBridgeCollapse recounts the harrowing moment when the suspension bridge collapsed and how he saved himself pic.twitter.com/MWX3HpwqmT — ANI (@ANI) October 31, 2022 -
బిడ్డకు పేరుపెట్టే సంబురం.. కమ్మేసిన విషాదం
యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు -
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
దైవ దర్శనానికి వెళ్తుండగా.. పల్టీలు కొడుతూ నీట పడ్డ ట్రాక్టర్
లక్నో: కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కువ మందిని తీసుకెళ్తున్న సమయంలో.. ఓవర్‌లోడ్ కారణం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది. మరో పది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్ వెల్లడించారు. మృతులంతా సీతాపూర్ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు. मुख्यमंत्री जी ने दिवंगत के परिजनों को ₹4 लाख की राहत राशि प्रदान करने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए उनके उपचार की समुचित व्यवस्था करने के निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2022 -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు.