Mithun Reddy Peddireddy
-
పుంగనూరులో పోలీసుల ఓవరాక్షన్
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనపై ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆయన కాన్వాయ్‌ను అడ్డు తగిలి పలువురు నేతలను వెనక్కి పంపించారు.మున్సిపల్ ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలతో మిథున్‌రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ శ్రేణులు ఆయన పర్యటనకు అడ్డుతగిలే అవకాశం ఉందని చెబుతూ పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. అనుమతికి మించి వాహనాలున్నాయంటూ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ను ఆపేశారు.మరోవైపు.. మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ వైఎస్సార్సీపీ నేతలను, కేడర్‌ను లోపలికి అనుమతించడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో నిజంగా నష్టమా? -
‘సూపర్‌సిక్స్ మరచిపోయారు’
సాక్షి,తిరుపతి: కూటమి నేతలు ప్రజాసమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాష, కౌన్సిలర్లు తిరిగి సోమవారం(సెప్టెంబర్2) వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపించ లేదు అని ప్రశ్నిస్తున్నా. ఎవరైనా పార్టీ మారక పోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌ను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు. సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మరచిపోయారు. వారు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అభివృద్ధిపై దృష్టిపెట్టాలి’ అని మిథున్‌రెడ్డి సూచించారు. కొన్ని కారణాల వల్ల తాము రాజీనామా చేసి వెళ్ళామని, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చామని మున్సిపల్ చైర్మన్ అలీంబాష తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. -
ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫ్యలంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.‘‘ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వినుకొండలో రషీద్‌ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగటం దారుణం. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యధేచ్చగా దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. I strongly condemn the attack on @YSRCParty Lok Sabha MP PV Midhun Reddy garu and former MP Reddeppa garu by those associated with @JaiTDP. This incident comes just 24 hours after the brutal murder of Rashid in Vinukonda by a TDP goon. Since coming to power, the new regime has…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024వైఎస్సార్సీపీ అత్యవసర సమావేశంరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న దాడులు, పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జగన్పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్యకు గురవ్వడం, ఇవాళ చిత్తూరు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరగడం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక.. రేపు వినుకొండకు వెళ్లనున్న జగన్.. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో కుట్రకోణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ కమిషన్ వేసి నిజనిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసే నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చదువుకునే రోజుల నుంచి పెద్దిరెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు ప్రతిసారి కుట్రలు చేసేవాడని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి వారి నుంచి విశేష ఆదరణ పొందుతున్న పెద్దిరెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా తాను సీఎం అవుతానని చెప్పడంలేదని, బాబును సీఎం చేయడానికే తాపత్రయ పడుతున్నట్టు అర్థమవుతోందన్నారు. చదవండి: (మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం) -
పార్లమెంట్లో ‘హోదా’ గళం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీ మేరకు ఆంధ్ర్రపదేశ్కు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాలని, జీవనాడి లాంటి పోలవరానికి నిధులివ్వకుండా, జాతీయ ప్రాజెక్టులా భావించకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా గళమెత్తారు. అశాస్త్రీయ విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఎనిమిదేళ్లు గడిచినా నెరవేర్చకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో 20 మందికిపైగా ఎంపీలంతా కలసి హోదా ఇవ్వాలని వందల సార్లు డిమాండ్ చేశామని, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని గుర్తించాలన్నారు. కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను గత సర్కారుకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలేవీ పూర్తి కాలేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. 2014లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్ సభకు గుర్తు చేశారు. మంగళవారం లోక్‌సభలో ‘సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’పై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఆ వివరాలివీ.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశ ప్రజల గళం కావాలి. హోదా కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు నివేదించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతోప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సాకులు చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాం. విభజన చట్టానికి సవరణ చేయాలని కోరాం. రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో డిమాండు చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ టీడీపీ సభ్యుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరానికి జాతీయ ప్రాజెక్టు తరహాలో నిధులు విడుదల చేయడం లేదు. నూతన భూసేకరణ నిబంధనలు, ప్రాజెక్టు ఖర్చు పెంపు ఇలా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సాంకేతిక కమిటీ 2019లోనే ఆమోదించినా ఆర్థిక శాఖ ఇంకా ఆమోదించకపోవడం సరికాదు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే తాగునీటి కాంపొనెంట్‌ను వేరు చేయడం. అంచనా వ్యయం నుంచి రూ.4,068 కోట్లు వేరు చేసి కేవలం సాగునీటి కోసమే ప్రాజెక్టును కడుతున్నామనడం ఎంతవరకు సమంజసం? ప్రాజెక్టును తాగునీటికి వినియోగిస్తే ఆ మొత్తాన్ని తగ్గిస్తామనడం సరికాదు. జాతీయ ప్రాజెక్టులో తాగునీరు కూడా ఒక భాగమే. కాంపొనెంట్ వారీ షరతులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలవరానికి రూ.10వేల కోట్ల అడ్‌హక్ నిధులను కేటాయించాలి. ఉపాధి హామీ నిధులు గతేడాదితో పోలిస్తే రూ.8,600 కోట్లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌కు 9.68 కోట్ల పనిదినాలు తగ్గాయి. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలి. విభజన నేపథ్యంలో సుమారు రూ.32 వేల కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. గత ప్రభుత్వం పరిమితికి మించి రూ.17,923 కోట్లకుపైగా రుణాలు అదనంగా తీసుకుందనే కారణంతో ఇప్పుడు కోతలు విధించడం సరికాదు. రూ.6,800 కోట్ల విద్యుత్తు బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత చట్టం ప్రకారం 77 వేల అదనపు టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రానికి అందచేయాలి. ఏపీ ప్రభుత్వం హోదా కోరింది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే 14వ ఆర్థిక సంఘం సాధారణ రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు. రాష్ట్రాల వనరుల లోటును రెవెన్యూ లోటు నిధులతో పూడుస్తున్నామని చెప్పారు. చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!) . -
మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ జీఎస్డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. -
వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు
మదనపల్లె సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషాల సమక్షంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్‌అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్‌ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్‌రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అక్రమాలు నిరూపించగలరా?
సాక్షి, అమరావతి: కుప్పం మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరూపించగలరా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మొత్తం 48 పోలింగ్ బూత్‌లలో ఏ బూత్‌లోనైనా దొంగ ఓట్లు వేసి ఉంటే వాటిపై ఏ బూత్‌లోనైనా టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని బాబును ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో 85% పంచాయతీల్లోనూ.. 90% ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలిచిందని.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు తద్భిన్నంగా రావని.. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే అంచనాకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కట్టుకథలు అల్లుతున్నారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు చేర్చారని చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు రివర్స్ గేర్‌లో మాపై ఆరోపణలు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఏజెంట్లు, అభ్యర్థులెవరూ ఫిర్యాదు చేయలేదు ‘కుప్పం మున్సిపాలిటీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓట్లు వేశారని.. చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీకి వత్తాసు పలికే అనుకూల మీడియాలో పెద్దఎత్తున కథనాలు రాశారు. అవన్నీ కట్టుకథలే. లోకేశ్ రెండ్రోజులపాటు కుప్పంలో మకాం వేసి.. ఆ పార్టీలో బలమైన, సీనియర్ నేతలను పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా నియమించారు. ప్రతి బూత్‌లో ఎన్నికల అధికారి, టీడీపీ ఏజెంటు, వైఎస్సార్సీపీ ఏజెంటు వద్ద కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఫలానా వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడనిగానీ, ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు పోల్ అయ్యాయనిగానీ 48 మంది టీడీపీ ఏజెంట్లు.. 24 మంది టీడీపీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. అక్రమాలు జరిగినట్లు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ప్రతి బూత్‌లో ఏం జరుగుతుందన్నది ఎస్ఈసీ వెబ్‌కామ్ ద్వారా వీడియోలలో రికార్డు చేసింది. చదవండి: (మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే: సజ్జల) అక్రమాలు జరిగింది ఎక్కడ? చంద్రబాబూ.. ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు వేశారు, అక్రమాలు జరిగాయని.. వెబ్‌కామ్‌ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను చూపాలని ఎస్ఈసీని కోరండి. మేం కూడా అదే బూత్‌లో ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని ఎస్ఈసీని కోరుతాం. అందుకు మీరు సిద్ధమా? అసలు.. ఓటరు కాని వ్యక్తి దొంగ ఓట్లు ఎలా వేయగలుగుతాడు? ఓటరు జాబితాలో ఉన్న ఒకరి ఓటును మరొకరు వేయాలి. అప్పుడు అన్ని పార్టీల ఏజెంట్లు బూత్‌లలో ఉంటారు. దొంగ ఓటు వేస్తే ఏజెంట్లు పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఒక్క బూత్లోనూ దొంగ ఓటర్లు వచ్చారని గొడవలు జరిగిన దాఖలాలు లేవు. దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే. ఆ సంస్కృతిని వైఎస్సార్సీపీపై రుద్దితే ఎలా? కుప్పంలో 28వేల దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి 2014లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన ఎన్నికల సంఘం 18 వేల ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఇంకా పది వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు చేర్పించిన దొంగ ఓట్లే. ఆ ఓట్లతోనూ.. దౌర్జన్యాలతోనూ ఇన్నాళ్లూ కుప్పంలో చంద్రబాబు నెగ్గుతూ వస్తున్నారు. కుప్పం ప్రజలకు ఇప్పటివరకూ చంద్రబాబు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల తరహాలోనే కుప్పం నియోజకవర్గాన్ని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు కేవలం 1,300 పక్కా ఇళ్లు ఇస్తే.. రెండున్నరేళ్లలో సీఎం జగన్ 5 వేలకుపైగా మంజూరు చేశారు. హంద్రీ–నీవాలో నీళ్ల లభ్యత తక్కువ ఉంది కాబట్టి, గాలేరు–నగరితో అనుసంధానం చేసి కుప్పానికి నీళ్లు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ గుర్తించే కుప్పం ప్రజలు సీఎం జగన్ వెంట నడుస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుంది’. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ‘కుప్పం ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. ‘చంద్రబాబు గత 30 ఏళ్లుగా మా నాన్నని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలుస్తాం’ అని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పనులపై వచ్చిన వారిని దొంగ ఓటర్లు అంటారా? తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కుప్పం ఉంది. పనుల నిమిత్తం వెళ్తున్న వారిని కుప్పం బస్టాండ్ నుంచి పట్టుకువచ్చి వారే దొంగ ఓటర్లు అని టీడీపీ నానా యాగీ చేసి.. భయానక వాతావరణం సృష్టించింది. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా దొంగ ఓట్లు వేశారని చూపించిన వీడియోల్లో.. ఏ ఒక్కరి వేలిపైనైనా ఓటు వేసినట్లు ఇంకు గుర్తు ఉందా అంటే లేదు. అంటే ఓటే వేయని వారిని చంద్రబాబు, టీడీపీ నేతలు దొంగ ఓటర్లుగా చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. దొంగ ఓటర్లంటూ టీడీపీ పట్టుకున్న వ్యక్తులంతా రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ మద్దతుదారులేనని తేలినట్లుగా పోలీసులే చెబుతున్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? చదవండి: (రెండు రోజులపాటు తిరుమల నడకదారులు బంద్: టీటీడీ) -
‘గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదు’
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అంబటి పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని.. నిమ్మగడ్డ మాత్రం ఎందుకు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షల నేపథ్యంలో అంబటి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి గుర్తుచేశారు. ఇది దుర్మాగం ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. మా హక్కులకు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూడిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉల్లి ఎగుమతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. తమ వినతిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలోనే ఉల్లి ఎగుమతికి అనుమతి వస్తుందని చెప్పారు. -
అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి. రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలి. గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి -
రాహుల్‌కి సుప్రియా సూలే ‘గ్రీన్ ఛాలెంజ్’
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం పెంచే లక్ష్యంతో మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాందీని చేరింది. గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి మొక్కనాటిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్, మరో నలుగురికి మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జీఎమ్మార్ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు. వెంటనే దీనిని అంగీకరిస్తూ అఖిల్, మిథున్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మల్లిఖార్జునరావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానంటూ, తన తరపున మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఉన్నారు. మిథున్‌రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన సుప్రియా ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తాను నామినేట్ చేస్తున్నట్లు సుప్రియ ట్వీట్ చేశారు. ఈవిధంగా గ్రీన్ ఛాలెంజ్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని చేరింది. -
సామాన్యుల చెంతకు తుడా సేవలు
సాక్షి, తిరుపతి తుడా: తుడా సేవలను సామాన్యుల చెంతకు తీసుకెళతామని ఆ సంస్థ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. తుడా వీసీ పీఎస్ గిరీషాతో కలిసి ఆయన శనివారం తుడా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వసతుల కల్ప నకు పెద్ద పీట వేయనున్నామన్నారు. తుడా పరి ధిలోని అనేక గ్రామాల్లో ప్రజలు కనీస వసతులకు నోచుకోవడంలేదన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో మరో నాలుగు నిర్మిస్తామన్నారు. మహిళా వర్సిటీ సమీపంలో తుమ్మలగుంట రోడ్డులోని తుడా విశ్రాంత భవనం పక్కన ఉన్న 1.70 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుచానూరు మార్కెట్ యార్డు, మంగళం సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కరకంబాడి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మరింత న్యాయం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. సూరప్పకశంలోని 146 ఎకరాల తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం పది రోజుల్లో తుడా గ్రీన్ టౌన్ షిప్ ప్లాన్ అందుబాటులోకి రానుందన్నారు. తుడా పరిధిలోని ప్రతి ఇం టికీ రెండు పండ్ల మొక్కలు, మరో రెండు వేప, కానుగ వంటి మొక్కలు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను తుడానే అందించి గ్రామీణ విద్యార్థుల ఉన్నతికి దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ గిరీషా, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, తుడా సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతర్గతంగా సమావేశం తుడా కార్యాలయంలో చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వీసీ గిరీషా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ సమావేశమయ్యారు. తిరుపతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. మా బంధం విడదీయరానిది మాది అన్నదమ్ముల అనుబంధం.. కష్టనష్టాల్లోనూ మా బంధం విడదీయరానిదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడారు. తుడా కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి విచ్చేసిన సందర్భంగా శనివారం చైర్మన్ చెవిరెడ్డి, వీసీ గిరీషా, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో చైర్మన్‌తో కలిసి కొంతసేపు మాట్లాడారు. తుడాకు విలువ తీసుకురావడంతోపాటు ఉన్నత స్థితిలో నిలిపేందుకు చెవిరెడ్డి కృషి చేస్తారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదన్నారు. వీసీగా పీఎస్ గిరీషా మంచి సేవలందిస్తారని చెప్పారు. అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులని, ఆ తరువాత తామిద్దరం అంతకు మించి స్నేహితులుగా..అన్నదమ్ముల్లా ఉన్నామని అన్నారు. -
పార్లమెంట్లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు
సాక్షి, కడప కార్పొరేషన్: రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఐదేళ్లుగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి లోపించి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇదే పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ట్యాక్స్ మినహాయింపులు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా తమ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ రాష్ట్రం నుంచి 23 ప్రతిపాదనలు వచ్చాయని, ఎప్పటిలోగా వాటిని మంజూరు చేస్తారో చెప్పాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారని, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే కంపెనీలకు కూడా ఈ స్కీంను వర్తింపజేస్తే అధిక ప్రయోజనం కలుగుతుందని, అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ది కూడా జరుగుతుందని వివరించారు. దీనిపై సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రాయితీలు, సబ్సిడీలు, ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఏపి సర్కార్ ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న కంపెనీలకు వడ్డీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతులను ఆదుకోండి 2012–13 రబీ శనగపంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. ఆశిష్ కుమార్ భుటానిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడేళ్లయినా ఇన్సూరెన్స్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, వెంటనే ఇన్సూరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీనిపై జాయింట్ సెక్రటరీ స్పందిస్తూ క్లెయిమ్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేసి మూడు రోజుల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఫైలు పంపిస్తానని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌లో జైలుశిక్ష అభ్యంతరకరం – ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట: ట్రిపుల్ తలాక్ చట్టం అభ్యంతకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలని చెప్పారు. వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలుశిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతకరమని పేర్కొన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళాసాధికారతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ మరోసారి స్పష్టంచేశారు. ముస్లీం మైనార్టీ మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. -
మేం తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ఉచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరువాత.. ఇక దీనిలో నేరాన్ని వర్తింపజేసే అంశం ఎక్కడ ఉందని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. నాన్ బెయిలబుల్ కేసు, మూడేళ్ల జైలు శిక్ష తదితర అంశాలతో కూడిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ లింగ సమానత్వాన్ని కోరుకుంటోంది. మహిళా సాధికారత కోసం నిలబడింది. మహిళాభ్యున్నతికి పాటుపడుతోంది. ఏపీ నూతన సీఎం ప్రారంభించిన అన్ని పథకాలు మహిళల అభ్యున్నతికి దోహదపడేవే. ఆయన మతసామరస్యం కోసం నిలబడే వ్యక్తి. సాధ్యమైన అన్ని మార్గాల్లో మహిళా సాధికారత కోసం మేం నిలబడుతాం. అయితే ప్రస్తుత రూపంలో ఈ బిల్లును మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఐఏ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు తదితర ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. 2017 ఆగస్టులో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. నాన్ బెయిలబుల్ కేసు వర్తింపజేయడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వివాహ బంధాల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పటికే గృహహింస నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 498ఏ తదితర చట్టాలున్నాయి. గృహహింస చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం మహిళకు మెయింటెనెన్స్ చెల్లించాలి. భర్త జైలులో పడితే మహిళలకు సామాజిక ఆర్థిక సహకారం ఎలా అందుతుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని చెబుతున్న ప్రభుత్వం దీనిలో మాత్రం విశ్వాస్ లేకుండా చేసింది. కొన్ని అభద్రతలు యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వం పునఃపరిశీలించి అభ్యంతరాలను పరిష్కరించి బిల్లును పాస్ చేయాలి. మేం మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం నిలబడుతున్నాము’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
‘హోదా’పై కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేస్తూ 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొత్త డిమాండ్ ఏమీ కాదు. 2014 మార్చిలో అప్పటి కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని నిర్ణయించింది. దానిని తక్షణం అమలుచేయాలని ప్రణాళిక సంఘానికి పంపింది. కానీ, గడిచిన ఐదేళ్లలో దీనిని అమలుచేయలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఆక్షేపించిందని సభలో పలుమార్లు చెప్పారు. కానీ, ఇది వాస్తవం కాదు. కేంద్రం ఒక్క సంతకంతో దానిని అమలుచేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయి. కేంద్రం స్పందించేందుకు ఇది సరైన సమయం. రెవెన్యూ లోటు రూ.63 వేల కోట్ల మేర ఉంది. రాజధాని లేకుండా, మౌలిక వసతలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇంత మొత్తం రెవెన్యూ ఎలా భర్తీ చేసుకోగలదు? అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఒకటి రెండే ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’.. అని మిథున్‌రెడ్డి వివరించారు. చట్టంలో హామీలు నెరవేర్చండి ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు పొందుపరిచారు. కడప స్టీలు ప్లాంటు గురించి బడ్జెట్లో ప్రస్తావనలేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా.. గడిచిన రెండేళ్లుగా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో మీరు పారిశ్రామిక రాయితీలు ఏమిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావనలేదు.. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు.. మెట్రో రైలు పనులు ప్రారంభం కాలేదు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముంది’.. అని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వాటా లెక్కించే విషయంలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది సరికాదని ఆయనన్నారు. -
అరుదైన గౌరవం
సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం స్పీకర్ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభను నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్ స్పీకర్‌గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ప్యానల్ స్పీకర్ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్‌గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్‌సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్‌సభలో చిన్న వయసులోనే ప్యానెల్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్‌సభ నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిపారు. -
‘టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి’
సాక్షి, అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి మండిపడ్డారు. గుత్తి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మిథున్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. కోర్టు నుంచి కేవలం నోటీసులు రాగానే కుట్ర అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజవర్గంలో జేసీ సోదరులు, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేత పెద్దారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారని మిథున్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలపై పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారని తెలిపారు. కొంతమంది అధికారుల వల్ల పోలీసు డిపార్ట్ మెంట్‌కు చెడ్డ పేరు వస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదారు నెలలు మాత్రమే ఉండబోతుందని, వైఎస్సార్సీపీ విజయం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. -
టీడీపీ నేతల అరాచాకలు పెరిగిపోయాయి
-
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వంచనపై గర్జన దీక్ష శిబిరంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎల్లుట్ల మారుతీ నాయుడు, మహేష్, నాగార్జున ఫ్యాన్స్ వెంకట్, నాని, యాసిన్, బాబ్జాన్, శర్మాస్‌వలి తదితరులకు తాజా మాజీ ఎంపీ, పార్టీ జిల్లా ఇన్చార్జి మిథున్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి వెళ్లారు. అయితే హృదయం నిండా వైఎస్సార్సీపీపై అభిమానం ఉంచుకుని ఇతర పార్టీలో కొనసాగలేక తిరిగి వచ్చామన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నానని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరినా అక్కడ ఉండలేక తిరిగి పార్టీలో చేరానని మారుతీనాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. -
బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు
సాక్షి, పీలేరు : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డి అని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మికీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మైనార్టీలను వైఎస్సార్సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్ జగన్, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. -
వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితోలో లేరని తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తారని ప్రజలను ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. -
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోండి
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ కుటుంబం’ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘నవరత్నాల’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాజారాం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి ఆదికి ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, కడప : బైరటీస్ గనుల్లో ఏపీఎండీసీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. కులం పార్టీ అడగనిదే ఏపని చేయడం లేదని విమర్శించారు. చివరకు టాక్సీ డ్రైవర్‌ను కూడా సొంత ఊరి నుంచి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారులు బాధ్యతలను వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకొని టీడీపీలోకి వెళ్లాలంటూ చురకలంటించారు. రెండు కంపెనీలకు మేలు జరిగేలా టెండర్ల నిబంధనలు మార్చిన ఘనత చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. అవినీతి అధికారులపై విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకమిటీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కుటుంబం గురించి నీచంగా మాట్లాతున్నారని, మంత్రికి ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. బాబు అవినీతిపై ప్రశ్నిస్తే.. రమణ దీక్షితులు నుంచి ప్రతిఒక్కరిపైనా కేసులు పెడుతున్నారంటూ మండిప్డడారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పసువులను కొన్నట్లు కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.