Narayanapeta district
-
చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం!
నారాయణపేట, సాక్షి: చిరుత పులితో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డ ఘటన శనివారం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. దామరగిద్ద మండలం కాంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతాయనే సమాచారంతో చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఆ సమయంలో జనం రాకను చూసి పిల్ల చిరుతలు పరారయ్యాయి. అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి చిరుత నిస్సహాయ స్థితిలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో కొందరు యువకులు ఫొటోలు-వీడియోలు తీసేందుకు.. ఆ చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని దానిని పరిశీలిస్తున్నారు. -
TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
నారాయణపేట, సాక్షి: వయసుతో తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. జిల్లాలో ఓ యువ ప్రాణాన్ని బలిగొంది. ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి ఒకరు క్లాస్ రూమ్ ముందే కుప్పకూలి.. కన్నుమూశారు. హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ (15) ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన శ్రీకాంత్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్సలు చేసిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. గుండె పోటు కారణంగానే శ్రీకాంత్ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు హఠాన్మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు శ్రీకాంత్ మృతితో బుడుమలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఇథనాల్ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్ మండలం ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల శివారులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మాగనూర్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్ సీఐ రాంలాల్‌ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతోపాటు రెండు బైక్‌లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
ప్రధాని మోదీ ప్రశంసించిన బారం బావికి జీవం..
నారాయణపేట: ఒకప్పుడు ఎంతో మంది దాహార్తి తీర్చిన ఆ బావి.. కాలక్రమంలో నిరాదరణకు గురైంది. ఉనికినే కోల్పోయి కంపచెట్లకు నెలవుగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా తయారైంది. అలాంటి బావి.. కలెక్టర్ చొరవ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్వవైభవం సంతరించుకొంది. బతుకమ్మ వేడుకలకు వేదికవడమే కాకుండా.. మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి మోదీ నోట కీర్తించేవరకూ వెళ్లింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి ఖ్యాతిపై కథనం.. జిల్లా కేంద్రంలోని పురాతనమైన బారంబావి గురించి తెలుసుకున్న కలెక్టర్ దాసరి హరిచందన బావిని పునరుద్ధరించి భావితరాలకు అందించాలని సంకల్పించారు. ఈ మేరకు గతేడాది ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బావి మెట్లకు మరమ్మతు చేయించి చుట్టూ పెరిగిన కంపచెట్లు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. బావిలో పూడికను తీయించడంతో ఊటనీరు చేరి జలకళ సంతరించుకుంది. పునరుద్ధరణ తర్వాత బారం బావి.. గతేడాది నుంచి బతుకమ్మను అక్కడే కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బారం బావి పునరుద్ధరణపై గతేడాది మార్చి 28న మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. మళ్లీ బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. చారిత్రక మెట్లబావి పునరుద్ధరణ విషయమై పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ దాసరి హరిచందన చూపిన చొరవను గుర్తు చేసుకుని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుద్దీపాల కాంతుల్లో బారం బావిలో బతుకమ్మ సంబరాలు విద్యుత్ కాంతులతో జిగేల్.. గతంలో బతుకమ్మ వేడుకలను స్థానిక చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించేవారు. బారంబావి పునరుద్ధరించడంతో గతేడాది నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో.. ఆ కాంతుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని ఒక్కొక్క శాఖ ఒక్కోరోజు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో సంబరాలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే బతుకమ్మలను బారం బావిలో నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవతల వేషధారణలతో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మలను పుట్టిలో ఉంచి బారంబావిలో ప్రదర్శించడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. -
Bheemeshwari- Naveen: కన్నీరు పెట్టిస్తున్న ప్రేమకథ
సాక్షి, నారాయణపేట: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పేదరికం వెంటాడుతున్నా ఇరు కుటుంబాలకు దూరంగా వెళ్లి బతుకు బండిని సాగిస్తున్నారు. అంతలోనే విధి వక్రీకరించింది. ఓ పాపకు జన్మనివ్వగానే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన పసిబిడ్డ అనాధ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. నారాయణ పేట జిల్లా మఖ్తల్‌కు చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన భీమేశ్వరి ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్తే వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా భీమేశ్వరి 2021 మేలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు నెలలకే నవీన్‌కుమార్‌తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉంటున్నారు. ఆగస్టు 18న భీమేశ్వరి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు రాత్రి ఓ పాపకు జన్మనిచ్చిన భీమేశ్వరి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సంజీవయ్య పార్కు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన పసిబిడ్డ అనాధగా మారింది. చదవండి: (కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం) -
నాగరాజు కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేసిన వైఎస్ షర్మిల
సాక్షి, నారాయణపేట జిల్లా(గరిడేపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
నారాయణపేట జిల్లా కలెక్టర్ ఫోటోతో వాట్సాప్ ఖాతా తెరిచి..
సాక్షి, నారాయణపేట: ఏకంగా కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను తెరవడమేగాక.. ఆ నంబర్ నుంచి పలువురికి సందేశాలు పంపి రూ.2.4లక్షలు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమేరకు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించిన వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్ పేరిట నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన ఫొటోతో వాట్సాప్ ఖాతా తెరిచాడని, దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాల పంపించాడని తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి అమేజాన్ పే యాప్ ద్వారా కొంత కొంత మొత్తం చొప్పున పలు దఫాలుగా రూ.2,40,000 సైబర్ నేరగాడు వేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నకిలీ ఖాతా విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి విచారించామని తెలిపా రు. ఈ వాట్సాప్ నంబర్‌కు, జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ హరిచందన సైతం పేర్కొన్నట్లు తెలిపారు. ఎవరికైనా సందేహాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. చదవండి: బీజేపీ కార్యకర్త మృతి.. వచ్చే నెల 4వ తేదీనే పెళ్లి.. జార్ఖండ్ వ్యక్తిగా గుర్తింపు నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసం చేసిన అతను జార్భండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సామాజిక మాద్యమాల్లో ఇలా అధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు అడుగుతుంటారని, అలాంటి వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరాల నుంచి రక్షణకు ఎన్‌సిఆర్‌పి పోర్టల్, టోల్‌ఫ్రీ నం.1930 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. -
ముక్కలు చేసి... మూటకట్టి!
నారాయణపేట రూరల్: గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా హత్య చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన నారాయణపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్‌పల్లి రోడ్డు మార్గంలో రోజు మాదిరి సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్ల వైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సమాచా రం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ సురేష్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టూ కొన్ని మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి. ఇప్పటికే అన్ని పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసులతోపాటు ఇతర జిల్లాలు, పొరుగున ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీ వల శ్యాసన్‌పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా.. అక్రమ సం బంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: ఆడుకుంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో..
ఊట్కూర్: ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్‌ను పిల్లలు ఆడుకుంటూ స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలి ఒక బాలికను బలిగొంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్ మండలం ఎర్గాట్‌పల్లిలో మంగళవారం మైసమ్మ జాతర నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు కుటుంబ సభ్యులతో ట్రాక్టర్‌పై జాతరకు వెళ్లి వచ్చి.. ఇంటి ముందు వాహనాన్ని ఆపాడు. రాత్రి 8 గంటల సమయంలో కొందరు చిన్నారులు ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. వీరిలో ఒకరు ఇంట్లోకి వెళ్లి ట్రాక్టర్ తాళం తెచ్చి స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. అదే సమయంలో ట్రాక్టర్ ముం దు ఆడుకుంటున్న రూప (8), కల్పన, వెంకటేష్‌లను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఊట్కూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రూప మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కల్పన, వెంకటేశ్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషాదం: ఆడుకూంటూ పిల్లలు ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో -
అరెకరం భూమి కోసం అన్న ప్రాణం తీసిన తమ్ముడు
సాక్షి, దామరగిద్ద (నారాయణ పేట): తనకు రావాల్సిన అరెకరం భూమి రికార్డు చేసివ్వడం లేదని, రైతుబంధు డబ్బులు తనే తీసుకుంటున్నాడనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అన్నను కడతేర్చాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని క్యాతన్‌పల్లిలో బ్యాగరి హన్మంతు (52), బుగ్గప్ప, భీమప్ప అన్నదమ్ములకు ఆరెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అన్న హన్మంతుకు మూడెకరాలుండగా మిగిలిన ఇద్దరికీ ఎకరాన్నర చొప్పున నమోదై ఉంది. అన్న పేరుతో ఉన్న అదనపు భూమిలో మిగిలిన ఇద్దరికి చెరో అరెకరం భూమిని రికార్డు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు హన్మంతు శివారులోని వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అదేరాత్రి 11 గంటలకు అక్కడికి తమ్ముడు బుగ్గప్ప వెళ్లి అన్నతో గొడవకు దిగగా పక్కపొలంలో ఉన్న రైతు బ్యాగరి బాలన్న వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బు గ్గప్ప కత్తితో చేసిన దాడి లో అన్న హన్మంతు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్
సాక్షి, మక్తల్: లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ ఇస్తానని చెప్పి, సుమారు రూ. 50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణారావుపేటకు చెందిన షేక్ మహిబూబ్ సుబానీ, భార్యాపిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి వలస వచ్చాడు. గుర్లపల్లి రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ‘మిత్ర’పేరుతో ఫర్టిలైజర్ షాపును తెరిచి పురుగు మందులను అమ్మేవాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్న అనంతరం ఆరు నెలల క్రితం దుకాణం మూసేసి, మిత్ర ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి షేర్ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రూ.లక్ష ఇస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్ వస్తుందని డిపాజిట్‌దారులను నమ్మించాడు. దీంతో బాధితులు ఐసీఐసీఐ గద్వాల బ్రాంచ్‌లో ‘మిత్ర’సంస్థ పేరిట డబ్బులు జమచేసి రసీదును సుబానీకి ఇచ్చేవారు. ఆ డబ్బులతో మక్తల్ మండలం మంతన్‌గోడ్, ఊట్కూర్‌లో పదెకరాల చొప్పున సుబానీ కొనుగోలు చేశాడు. నెల క్రితం తన కుమారుడు షేక్ అస్జర్‌అలీ యజమానిగా శ్రీఅంజలి పేరుతో జ్యువెలరీ షాపు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈనెల 21న మక్తల్ మండలం చందాపూర్‌కు చెందిన హన్మంతు రూ.ఐదు లక్షలు సుబానీకి ఇచ్చాడు. చదవండి: (టార్గెట్ రూ.216 కోట్లు! దొంగిలించేందుకు యత్నం) బుధవారం తమ షాపు వద్దకు వస్తే ఐదు తులాల బంగారంతో పాటు నెలకు రూ.30 వేల చొప్పున కమీషన్ ఇస్తానని సుబానీ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. బుధవారం అక్కడికి వెళ్లిన హన్మంతు షాపు మూసి ఉండటంచూసి కంగుతిన్నాడు. విషయం మిగతా వారికి చెప్పడంతో ఆరా తీయగా ఈనెల 23న అర్ధరాత్రే సుబానీ కుటుంబసభ్యులతో కలిసి ఇల్లు, దుకాణం ఎత్తేసి పరారయ్యాడని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు మొదలుకుని రూ.25 లక్షల వరకు, సుమారు ఐదొందల మంది నుంచి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. బాధితుల ఫిర్యాదుతో ఎస్ఐ రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రథయాత్రలో కరెంట్ షాక్: ఇద్దరు దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): రథసప్తమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాదం నింపింది. రథయాత్రలో విద్యుదాఘాతం సంభవించి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా గ్రామ శివారులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథాన్ని ఊరేగిస్తుండగా విద్యుదాఘాతం సంభవించింది. జాతర కోసం నూతనంగా తయారు చేయించిన ఇనుప రథాన్ని తరలిస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగలి చంద్రప్ప, హనుమంతు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే నారాయణపేటలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఉత్సాహంగా సాగుతున్న రథయాత్రలో ఒక్కసారిగా అల్లకల్లోలం ఏర్పడింది. భక్తులందరూ భయాందోళన చెందారు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
నారాయణపేట: ఘోర రోడ్డు ప్రమాదం
-
నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, నారాయణపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్ తీవ్ర గాయాల పాలవ్వగా.. ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ప్రమాదవార్త తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కూతురు లేని లోకంలో ఉండలేను!) -
అమెరికాలోనే అంత్యక్రియలు..
సాక్షి, మరికల్ (నారాయణపేట): మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన దంపతులు ఆర్టీసీ కండక్టర్ నరసింహరెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విధితమే. వీరి అంత్యక్రియలు పది రోజుల తర్వాత సోమవారం సాయంత్రం అమెరికాలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు మౌనికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చదవండి: (టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం) -
టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలల క్రితం భార్యా భర్తలిద్దరు కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. శనివారం బందువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!) ఈ ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే నెల రిటైర్మెంట్ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నరసింహారెడ్డి స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
తెరపైకి కొత్త మండలాలు?
సాక్షి, నారాయణపేట: పరిపాలన సౌలభ్యం.. ప్రజల డిమాండ్ల మేరకు మరోసారి కొత్త మండలాల ప్రస్తావన తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ 2016లో విజయదశమిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు శ్రీకారం చుట్టి.. రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. అయితే, జిల్లాతోపాటు పలు మండలాలను ఏర్పాటు చేయాలని ఉవ్వెత్తున ఉద్యమాలను జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగించారు. మరోసారి అవకాశం ఉంటే నారాయణపేటకు తొలి ప్రాధాన్యతనిస్తామని అప్పట్లో మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరపున ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2018 ఎన్నికలు సమయంలో ప్రచారానికి నారాయణపేటకు వచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఫిబ్రవరి 17, 2019లో నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. అంతకు ముందు జిల్లాల ఏర్పాటులో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఉద్యమంతో పాటు మండలాల ఉద్యమాలు కొనసాగాయి. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రస్తుతం అక్కడక్కడ కొత్త మండలాలు ఏర్పాటు అవుతుండడంతో నారాయణపేట జిల్లాలో సైతం కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో నారాయణపేట జిల్లాలో 11 నుంచి 13 మండలాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మండలాలు ఇవే.. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. అందులో నారాయణపేట నియోజవకర్గంలో నాలుగు మండలాలు మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, క్రిష్ణ మండలాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్ మండలాలు ఉన్నాయి. జిల్లాలో మళ్లీ రెండు మండలాలు ? జిల్లాలో మళ్లీ కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. నూతన రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావడంతో ప్రస్తుత సమయంలోనే కొత్త మండలాలకు ఏర్పాటు చేస్తే సరిపోతుందనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే ఉద్యమించిన ఉద్యమకారుల ఆశలు చిగురిస్తున్నాయి. అయితే రెండు మండలాల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీల ద్వారా తీర్మాణాలను చేయించి ప్రతిపాదనలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరా నాటికి కొత్త మండలాలు ఏవి ఏర్పాటు అవుతాయో...లేదో వేచిచూడాల్సిందే మరి. కోటకొండను మండలంగా ప్రకటించాలి మండలంలోని కోటకొండను మండలం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ(ఎంఎల్)న్యూడమెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతూ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి డీపీఓ మురళీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ.. నారాయణపేట పట్టణంలో 24 వార్డులు, మండలంలో 35 గ్రామాలు ఉన్నాయని, మండలంలోని కోటకొండని మండలం చేయడంతో పరిసర గ్రామాల ప్రజలకు పరిపాలన సౌలభ్యం అవుతుందని ఆకాంక్షించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కె.చంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ కాళిందినికి వినతిపత్రాలను ఆందజేశారు. జడ్పీసీఈ మాట్లాడుతూ జడ్పీ సమావేశంలో పెట్టి తీర్మాణం చేసిపై అధికారులకు పంపిస్తామన్నారు.కార్యక్రమంలో కోటకొండ సర్పంచ్ విజయలక్షి్మ, ఎంపీటీసీ సునీత, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కాశీనాథ్, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు ప్రశాంత్, యాదగిరి, వెంక్రాములు, చెన్నారెడ్డి పాల్గొన్నారు. మరో రెండు.. కొత్త మండలాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ మండలాలను ఎక్కడ ఏర్పాటు చేస్తే సరిపోతుందనే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ మండలాల్లో కొత్త మండలాలు చేయాలని 2016లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వాటిని పరిశీలిస్తే కోస్గి మండలంలో గూండుమాల్, మద్దూర్ మండలంలోని కొత్తపల్లి, దామరగిద్ద మండలంలో కానుకుర్తి, నారాయణపేట మండలంలో నారాయణపేట ఆర్బన్, కోటకోండ, అప్పక్‌పల్లి, మక్తల్ మండలంలో కర్నే, జక్లేర్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేశారు. ఆదేశాలు రాలేదు కొత్త మండలాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాలని తమకేమి ఆదేశాలు రాలేదు. – చీర్ల శ్రీనివాసులు,ఆర్డీఓ, నారాయణపేట -
అవినీతి మరకలేని వారు రైతులొక్కరే..
మరికల్ (నారాయణపేట): దేశంలో అవినీతి మరక లేని వారు ఉన్నారంటే అది రైతులు ఒక్కరేనని ప్రొఫెసర్ హారగోపాల్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మరికల్ శ్రీవాణి పాఠశాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్ల రూపాలయలను కొల్లగొట్టి దేశం విడిచి పొతున్న అవినీతి రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని కొరితే లాఠీచార్జ్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చెసుకుంటున్నా ప్రభుత్వాల నుంచి స్పందన రావడం లేదన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని అలోచన చేయకుండా రైతులు నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలను పండిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. నేడు హైబ్రీడ్ విత్తనాలు రావడంతో ఓ పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందని, దీంతో అప్పులు రైతులవి ఆదాయం మాత్రం కార్పొరేట్ వారివి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేసిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినితమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మట్టిదిబ్బ కూలి 10 మంది సమాధి
నారాయణపేట/మరికల్: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు. రోజువారీ లాగే ఉపాధిహామీ పనుల కోసం ఊరి శివారులోకి వెళ్లారు. అక్కడ ఎండకు తాళలేక ఓ గుట్ట నీడన నీళ్లు తాగేందుకు వెళ్లారు. అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పైభాగంలో ఉన్న మట్టిదిబ్బ ఒక్కసారిగా వారిపై కూలిపడటంతో పది మంది మహిళా కూలీలు మట్టిలో సజీవసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేర్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్రమత్తం చేస్తుండగానే.. తీలేర్ గ్రామానికి చెందిన ఆరు గ్రూపుల ఉపాధి హామీ కూలీలు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. జాన్సీ, దవ గ్రూపుల వారు మాత్రం బుధవారం ఉదయం 9 గంటలకు తీలేర్ శివారులోని ఎద్మరితిప్పగుట్ట వద్ద నీటి నిల్వ గుంతల (కందకాలు) పనులు చేసేందుకు వెళ్లారు. ఈ గ్రూపుల్లో మొత్తం 50 మంది కూలీలు ఉన్నారు. ఎండ ఎక్కువ కావడంతో 11 గంటల ప్రాంతంలో 12 మంది మహిళా కూలీలు గుట్టనీడలో ఉంచిన నీళ్లు తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న మణెమ్మ ఈ విషయాన్ని చుట్టుపక్కల కూలీలకు తెలియజేయడంతో వారంతా ప్రమాదస్థలికి చేరుకున్నారు. వారంతా పారలతో మట్టిని తీయగా లక్ష్మి అనే కూలీ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివారులో మట్టిదిబ్బలు కూలిన స్థలాన్ని పరిశీలిస్తున్న జనం. జేసీబీతో మృతదేహాల వెలికితీత గ్రామస్తులు హుటాహుటిన జేసీబీని రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. మట్టిని తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మూడు మృతదేహాలు గుర్తుపట్టనంతగా ఛిద్రమయ్యాయి. మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. బాధిత కుటుంబ సభ్యుల రోదన.. చూసేవారిని కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అత్త, కోడలు.. మృతి చెందిన వారిలో అత్త, కోడలు ఉన్నారు. చర్లపల్లి లక్ష్మి, హన్మంతు దంపతుల కుమారుడు వెంకటయ్య అదే గ్రామానికి చెందిన అనురాధను పెళ్లి చేసుకున్నాడు. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో అత్తాకోడళ్లు లక్ష్మి, అనురాధ ఇంటి నుంచి కూలీ పనులకు వెళ్లారు. మట్టి దిబ్బలు కూలిన సంఘటనలో అత్త, కోడలు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలు అనురాధకు కుమా రుడు, కూతురు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు రోజువారీ కూలి పనుల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం మట్టి పెళ్లలు కూలి మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన హుటాహుటిన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో కలసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు, అంత్యక్రియల కోసం రూ.ఐదు వేలను తక్షణ సాయం కింద అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే విషయాన్ని అధికారికంగా చెప్పడం కుదరడం లేదన్నారు. ఎన్నికల తర్వాత బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: చాడ వెంకటరెడ్డి నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో మట్టి దిబ్బల కింద పడి మరణించిన కూలీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీపీఐ డిమాండ్ చేసింది. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో ఉన్న విజిలెన్స్, మానిటరింగ్ బృందాలు ఉపాధి పనుల ప్రాంతాలను పరిశీలించకపోవడం వల్ల విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు నీడ, నీటి వసతి కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిబంధనలు పెడచెవిన పెట్టడం వల్లే.. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రూపొందించిన నిబంధనలను అధికారులు పెడచెవిన పెట్టిన కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం విమర్శించారు. నిబంధనలు సరిగ్గా పాటించక పోవడంతో పాటు అధికారులు పని స్థలాల్లో అందుబాటులో లేరని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం దిగ్భ్రాంతి నారాయణపేట జిల్లాలో జరిగిన దుర్ఘటనలో ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షానికి తడవడంతో కూలిన మట్టిదిబ్బ! నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివారులోని ఎద్మల్తిప్పగుట్ట వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి బాగా తడిసిపోయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే బుధవారం అక్కడికి పనికి వెళ్లిన కూలీలపై మట్టిదిబ్బ ఒక్కసారిగా కూలిందని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తీలేర్ సంఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావులను ఘెరావ్ చేశారు. వారిని మంత్రి సముదాయించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమిం చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎన్నికల వేళ కావడంతో సంఘటన స్థలానికి రాలేకపోతున్నానని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందుతుందని సీఎం భరోసానిచ్చారు. ఆస్పత్రి వద్ద ఆందోళన నారాయణపేట ఎస్పీ చేతన సంఘటన స్థలానికి చేరుకుని మంత్రి ఆదేశాల మేరకు మృతదేహాలను ప్రత్యేక వాహ నాల్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న ఎస్పీ చేతన కలగజేసుకుని ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని ఇలాంటి వాటికి తావివ్వొద్దంటూ వారిని శాంతింపజేశారు. రాస్తారోకో.. నిలిచిన వాహనాలు మృతదేహాలను గ్రామానికి తీసుకువస్తున్న సమయంలో బంధువులు, గ్రామస్తులు మరోసారి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తీలేర్ స్టేజి వద్ద హైదరాబాద్–రాయచూర్ జాతీయ రహదారిపై మృతదేహాలతో రెండు గం టల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు కలెక్టర్ అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. ప్రస్తు తం ఎన్నికల కోడ్ ఉన్నందున స్పష్టమైన హామీ ఇవ్వలేమని, మృతుల అంత్యక్రి యలకు రూ.ఐదు వేలు, ఆపద్బంధు కింద రూ.50 వేల చొప్పున ఇప్పుడే ఇస్తామని స్పష్టంచేశారు. గురుకులంలో పిల్లలకు సీట్లు ఇస్తామని, ఇళ్ల స్థలాలపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని వారికి నచ్చజెప్పారు. అలాగే రూ.ఐదు లక్షలు చొప్పున పరిహారం అందించేలా ఎన్నికల కమిషన్‌కు నివేదించామని, అక్కడి నుంచి అనుమతి వస్తే వారికి నగదు అందజేస్తామనని ఆందోళన విరమింపజేశారు. ఆ కొద్ది నిమిషాల్లోనే.. పని పూర్తయ్యే దశలో ఉండగా ఓ జాతీయ రాజకీయ పార్టీకి చెందిన నేతలు కొందరు ఉపాధి కూలీల వద్దకు వచ్చా రు. వారితో మాట్లాడాల్సి ఉందని చెప్ప డంతో కొందరు మహిళలు నీరు తాగేందుకు మట్టిదిబ్బ నీడ చెంతకు వెళ్లారు. ఇంకొందరు కొద్ది దూరంలో ఉన్న చెట్టు నీడకు చేరుకున్నారు. అయితే వర్షానికి తడిసిన మట్టి దిబ్బ, మహిళలు దాని చెంతకు చేరుకు న్న కొద్ది నిమిషాల్లోనే హఠాత్తుగా వారిపై కుప్పకూలింది. దీంతో దిబ్బ కింద ఉన్న కూలీల్లో పదిమంది చనిపోయారు. నీడకు కూసందమని పోయాం.. కొంచెం సేపు నీడకు కూసందమని ఆడవాళ్లం మట్టిగోడ సాటుకు వెళ్లాం. అందరం కూర్చొని కూలీ పనిపై మాట్లాడుకుంటున్నాం. కొంతసేపటికి మట్టిదిబ్బ కూలి మాపై పడింది. నేను పూర్తిగా మట్టిలో మునిగిపోయిన తలకాయ ఒక్కటి కొంత తేలుకొని ఉంటే అరవడంతో పక్కల ఉన్న వాళ్లు వచ్చి నన్ను లేపారు. మట్టి బెడ్డలు పడడంతో నా కాలు విరిగింది. నాకు, నా భర్త కల్యాణ్‌కు ఎలాంటి ఆధారం లేదు రోజు కూలీ పని చేసుకుని బతుకుతున్నాం. 15రోజుల నుంచి అక్కడ పని చేస్తున్నాం. గుంతలు లోతుగా తీయడంతో మట్టికూలినట్లు అనిపిస్తుంది. మేము పని చేసే దగ్గర్లో చెట్లు లేకపోవడంతో రెండు రోజుల నుంచి అదే గోడ సాటుకు నీడన కూర్చుంటున్నాం. ఇప్పుడు నా కాలు విరిగింది..మేము ఎలా బతకాలి. మాకు రోజు కూలీ పని తప్ప ఎలాంటి ఆధా రం లేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు దవాఖానకు వచ్చిన. డాక్టర్లు చూసి తొడలో ఎముక విరిగింది. ఇనుప రాడ్ వేయాలని చెబుతున్నారు. – లక్ష్మి, ప్రమాదంలో గాయపడిన ఉపాధి కూలీ -
నారాయణపేట జిల్లా విషాదం.. కూలీలు మృతి
-
విషాదం... 10 మంది కూలీలు మృతి
సాక్షి, నారాయణపేట : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టిదిబ్బలు కూలడంతో 10 మంది ఉపాధిహామీ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మరికల్ మండలం తీలేరు శివాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మట్టిదిబ్బలు తొలిగిస్తేనే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. గ్రామానికి చెందిన 30 మంది ఉపాధిహామీ కూలీలు రెండు గ్రూప్‌లుగా గ్రామ శివారులో జరుగుతున్న ల్యాండ్ డెవెలప్మెంట్ పనులు చేస్తున్నారు. ఇందులో 15 మంది లోయలాగా ఉన్న గుంతలో దిగి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై మట్టిదిబ్బలు పడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రొక్లెన్ సాయంతో మట్టిదిబ్బలు తీయిస్తున్నారు. పొట్టకూటి కోసం కూలికెళ్లిన తమవారు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. -
నారాయణపేట... నాలుగు లైన్ల బాట
నారాయణపేట: ఇటీవలే మనుగడలోకి వచ్చిన నారాయణపేట జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రూ.18.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. మండలంలోని సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్ రోడ్డులోని ఎర్రగుట్ట సీమీపం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శంకుస్థాపన చేశారు. రూ.18.65 కోట్లతో రోడ్డు నిర్మాణం సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్‌రోడ్డు ఎర్రగుట్ట సమీపం వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకు గాను 2018 అక్టోబర్ 17న జీఓ 566ను ఆర్అండ్బీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రూ.18.65 కోట్ల అంచనా వ్యయం కాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి ఈనెల 11వ తేదీన అగ్రిమెంట్ కాగా.. ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహనదారులకు ఊరట నారాయణపేట నూతన జిల్లాలో అభివృద్ధికి తొలి అడుగు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంతో ఆరంభమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సింగారం చౌరస్తా మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా మారనుంది. మక్తల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్లు, మరికల్ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మద్దూర్, కోస్గి మండలాల వారికి సైతం భూనేడ్ నుంచి వస్తే వారికి నారాయణపేట అందుకున్నట్లుంది. సింగారం నుంచి 5 కిలోమీటర్ల వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో ఈ ప్రాంత వాహనదారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నారాయణపేటలో అంతరాష్ట్ర రహదారిగా నాలుగు లైన్ల విస్తరణ జరగుతుండడంతో ఆటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రాంత వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హైదరాబాద్, రాయచూర్ ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వ్యవస్థ మెరుగుపడినట్లేనని భావిస్తున్నారు. డివైడర్లు.. పచ్చదనం నాలుగులైన్ల రోడ్డు 100 ఫీట్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో డివైడర్, బట్లర్ఫ్లై లైట్లు ఏర్పాటుచేసి మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రాంతం సుందరంగా మారుతుందని భావిస్తున్నారు. ‘పేట’ అభివృద్ధికి శుభపరిణామం నారాయణపేట కొత్త జిల్లాలో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం అభివృద్ధికి శుభపరిణామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాపార, విద్య రంగాలకు అనువుగా మారుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నారాయణపేట కేంద్రబిందువుగా ఉందని.. బంగారం, చేనేత రంగాలు ఇక్కడ ప్రసిద్ధి గాంచాయని వివరించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు చేస్తున్న కృషికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ఇక 33 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ములుగు, నారాయణపేట జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి రానున్నాయి. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ కాగా, నెల రోజుల పాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. ఈ అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం ఆదివారం నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు... నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి. కొత్త కలెక్టర్ల నియామకం.. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్రాస్కు నారాయణపేట జిల్లా కలెక్టర్లుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు. -
రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
-
రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడుగా మరోరెండు నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 17(ఆదివారం) నుంచి ములుగు, నారాయణపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. 9 మండలాలతో కూడిన ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా పరిధిలోకి రానున్నాయి. నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూర్, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు నారాయణపేట పరిధిలోకి రానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది.