New Trend
-
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
ఓల్డే..గోల్డు.. పాత మోడళ్లకు కొత్త హంగులు
వడ్డాణం, బంగారపు జడ.. ఓస్ ఈ పేర్లు నిన్నా మొన్నటివే కదా అంటారా? అయితే కంకణాలు, కంటెలు? ‘ఇవెక్కడో విన్న పేర్లలాగే ఉందే’ అనుకుంటున్నారా? కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు చాలా పాతకాలం నాటి మోడ్రన్ జ్యువెలరీ ట్రెండ్స్‌కి ఇంకా దూరంగానే ఉన్నారని అర్థం.. ‘పాత ఒక వింత.. కొత్త ఒక రోత’ అన్నట్టు.. ఆభరణాల ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు బరువైనా వెరపులేదంటున్న మహిళలు.. వంటి నిండా దిగేసుకుంటున్న నగలన్నీ కలిపితే.. సగటు బంగారం బరువు రెండు కిలోలుగా చెప్పొచ్చు. – సాక్షి, సిటీబ్యూరో ‘ఏమిటలా వంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకు వడ్డాణాలు, బంగారపు పూలజడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు.. వగైరాలన్నీ ఒకనాటి ఫ్యాషన్లే కావచ్చు.. అయితే పాతే వింత అంటున్న ఆధునికులు మోటుగా ఉంటాయంటూ తీసి పారేసిన నగల్ని మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు.. మరింతగా వెనక్కు వెళ్లి శోధించి.. మరీ పురాతన ఆభరణశైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి పూర్తి సంప్రదాయ ఆభరణం అయిన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. రాజుల కాలంలో ధరించేవారట.. ఇటీవల మహానటి సినిమాలో సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ సైతం ధరించి కనిపిస్తుంది. కాళ్లకి పట్టీ టైప్‌లో ఉంటూ, మెడకి ధరించే ఈ కంటె చూడడానికి థిక్‌గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెంట్స్, పెరల్ డ్రాప్స్ జోడించడం, అలాగే స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా వీటి ధరలు ఉంటున్నాయి.కాసుల గలగల.. కాసుల పేర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి.. ఆధునిక మహిళల మెడలో గలగల మంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30 నుంచి 300 గ్రాముల దాకా బరువు ఉండేవి ధరిస్తున్నారు. వీటి ఖరీదు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఉంటుంది.గుట్టలు గుట్టలుగా.. ఒకనాటి తెలంగాణ సనాతన సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. రూ.3లక్షల నుంచి రూ.15లక్షల దాకా వివిధ ధరల్లో లభిస్తున్నాయి.కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులను.. దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాత కాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా ఈ తరహా ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటుగా ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బరువులో ఇవి రూ.1లక్ష నుంచి రూ.5లక్షల ధరల్లో లభిస్తున్నాయి.‘పాత’నగల.. జాతరలా.. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాత కాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయితే.. గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, ఆభరణాల డిజైనర్ -
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
లెట్.. సెట్.. గో.. నయాట్రెండ్గా ఆకట్టుకుంటున్న ‘కిట్టీ కల్చర్’!
సాక్షి, సిటీబ్యూరో: కిట్టీపార్టీ.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహిళలే కాదు. మగవాళ్లు కూడా తాము సైతం అంటూ నెలకోసారి కిట్టీ పార్టీలకు జై కొడుతున్నారు. పది, పదిహేనుమంది ఒక చోట చేరి సరదాగా గడిపేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటున్నారు. నెల నెలా పొదుపు చేసిన డబ్బుతో విహార యాత్రలకు వెళ్తున్నారు. నగరంలో ఈ తరహా కిట్టీ పార్టీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే విధమైన ఆలోచన కలిగిన వారి మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే మహిళలు నెలకోసారి ఒక చోట చేరి ఈ వేడుకలను ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ లేడీస్ స్పెషల్ కిట్టీ పార్టీల తరహాలోనే ‘జెంట్స్ స్పెషల్’ కిట్టీ పార్టీలు కూడా నగర సంస్కృతిలో ఒక భాగంగా కనిపిస్తున్నాయి.ఉరుకుల పరుగుల జీవితం. ఒకే కాలనీలో ఉన్నా, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే ఒకరికొకరు అపరిచితులే. కనీస పలకరింపులు ఉండవు. చుట్టూ మనుషులే ఉన్నా ఆకస్మాత్తుగా ఏదో ఒక ఆపద ముంచుకొస్తే ఆదుకొనే వారెవరూ అంటే చెప్పడం కష్టమే. అలాంటి సాధారణ, మధ్యతరగతి జీవితాల్లో కిట్టీ పార్టీలు సరికొత్త సంబంధాలను, అనుబంధాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదీ ఓ ఐదారు గంటల పాటు సరదాగా గడిపే సమయం. ఆట పాటలు, ఉరకలెత్తే ఉత్సాహాలు, సరదా కబుర్లు.. దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించేందుకు అద్భుతమైన టానిక్‌లా పనిచేసే ఔషధం కిట్టీ పార్టీ. ఉప్పల్‌కు చెందిన కొందరు వాకింగ్ ఫ్రెండ్స్ కిట్టీ పార్టీకి శ్రీకారం చుట్టారు. వారిలో కొందరు ఉద్యోగులు, మరి కొందరు వ్యాపారులు. ప్రతి నెలా ఒక చోట సమావేశమవుతారు.ఒకరికొకరు అండగా..ఒక్కొక్కరూ నెలకు రూ.5000 చొప్పున 15 మంది కలిసి రూ.75000 పొదుపు చేస్తున్నారు. అందులో రూ.60 వేల వరకూ ఆ నెల అవసరమైన వారికి ఇచ్చేస్తారు. మిగతా రూ.15000 లతో సరదాగా గడిపేస్తారు. నెలకోసారి కిట్టీ పార్టీని నిర్వహించేందుకు ఆ గ్రూపులో ఒకరిని ఆతిథ్యం ఇచ్చే హోస్ట్‌గా ఎంపిక చేసుకుంటారు. ‘రోజంతా సరదాగా గడిపేస్తాం. అంతా చుట్టుపక్కల కాలనీల్లో ఉండేవాళ్లమే. కానీ కనీసం పరిచయాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మేమంతా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఆపద వచి్చనా ఆదుకునేందుకు మా టీమ్ రెడీగా ఉంటుంది.’ అని చెప్పారు టీమ్‌కు సారథ్యం వహించే రవి.నగర శివారుకు..అపార్ట్మెంట్లలో మహిళల బృందంలోని ఒకరి ఇంట్లో కానీ లేదా కమ్యూనిటీ హాల్లో కానీ నిర్వహిస్తారు. కానీ జెంట్స్ పార్టీల్లో ఔటింగ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. సిటీకి దూరంగా వెళ్లి ఒక రోజంతా గడిపేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.విహారయాత్రలు కూడా..కిట్టీ పార్టీల మరో ప్రత్యేకత ఏడాదికి ఒకసారి దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో విహరించడం, ప్రతి నెలా పొదుపు చేసే డబ్బులతో గోవా, కేరళ, కాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తారు. అలాగే దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు సైతం కిట్టీ పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఏటా ఓ పది రోజులు టూర్‌కు వెళ్లి రావడం కూడా ఈ పార్టీల కల్చర్‌లో భాగంగా కొనసాగుతోంది.ఇదీ ‘కిట్టీ’ చరిత్ర..దేశవిభజన అనంతరం 1950లో ఈ వినూత్నమైన కిట్టీపార్టీ సంస్కృతి ప్రారంభమైంది. ఒకే ప్రాంతంలో నివసించే మహిళల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మొదలయ్యాయి. దేశవిభజన ఫలితంగా ఆర్థికంగా తీవ్ర కష్టాలకు గురైన కుటుంబాలను ఆదుకునేందుకు పది మంది మహిళలు కలిసి రావడం ఒక ఉన్నతమైన సంప్రదాయంగా నిలిచింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ఈ సంస్కృతి 1980 తరువాత క్రమంగా అంతటా విస్తరించింది. -
డెనిమ్ న్యూ లుక్ డిజైన్..!
ఫ్యాషన్ ప్రపంచంలో అప్ సైక్లింగ్ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజెప్పడానికి డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్ అప్ సైక్లింగ్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది.మనకున్న రకరకాల డిజైన్ వేర్లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్‌ను డెనిమ్ అంటారు. డెనిమ్ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్ రోబ్స్లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్ వేర్ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్‌తో సరికొత్త డిజైన్‌నీ క్రియేట్ చేయవచ్చు.అప్ సైకిల్ డెనిమ్ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్ డిజైనర్. డెనిమ్‌తో ఎన్నో అప్‌సైకిల్ డిజైన్స్ చేసిన డిజైనర్. మోడర్న్ డ్రెస్సులే కాదు శారీస్‌ను కూడా డెనిమ్ టచ్‌తో,ప్యాచ్ వర్క్‌తో వివిధ రకాల మెటీరియల్‌ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్ చేస్తుంది.– నెట్ ఫ్యాబ్రిక్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్పైన ఘుంగ్రూ వర్క్ డిజైన్ చేశారు. – పోల్కా డాట్స్ప్యాచ్ వర్క్‌తో రూపొందించిన శారీ– లినెన్ శారీకి జియోమెట్రిక్ స్టైల్లో కట్ చేసిన డెనిమ్ క్లాతతో ప్యాచ్ వర్క్ చేశారు. – స్కర్ట్ శారీని డెనిమ్‌ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్ స్టైల్ డ్రెస్ ఇది. – డెనిమ్ క్రాప్‌టాప్– కాటన్ ఫ్యాబ్రిక్ – డెనిమ్ జాకెట్‌ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా– లేస్తో లాంగ్ స్లీవ్స్ రూపొందించిన డెనిమ్ జాకెట్– డెనిమ్ ప్యాచ్‌వర్క్‌తో మోడర్న్ టాప్– డెనిమ్ ప్యాంట్ బెల్ స్టైల్‌కి క్రోచెట్ డిజైన్‌ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్.ఇవి చదవండి: పవర్ఫుల్ ప్రఫుల్..! -
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్‌ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్‌లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
సరికొత్త ట్రెండ్ ఉంగారాల చెయిన్లు..!
వేళ్లకి ఉంగరాలు, మెడలో గొలుసులు ధరించడం సాధారణమే! చేతులకు ఉంగరాలు.. చెయిన్లు, హ్యాండ్ కఫ్స్ ధరించడం ఇప్పుడు ట్రెండ్. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సుల మీదకు ఈ ఉంగరాలు, చెయిన్ల వరసలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. యువత వేగానికి, స్టయిల్‌కి అద్దంలా భాసిల్లుతున్నాయి. బంగారు వరసలు లైట్ వెయిట్ జ్యువెలరీలో భాగంగా హ్యాండ్ కఫ్స్, చెయిన్స్ డిజైనర్లను ఆధునికత వైపుగా పరుగులు తీయిస్తున్నాయి. ఆభరణాల డిజైనర్లు బంగారు లోహంతో వెస్ట్రన్ స్టైల్ డిజైన్స్‌ను కొత్తగా మెరిపిస్తున్నారు. వెండి వెలుగులు తక్కువ ఖర్చు అనే జాబితాను ఈ తరం పక్కన పెట్టేస్తోంది. ఏ డిజైన్ తమకు మరింత అందాన్ని తీసుకువస్తుందో, నలుగురిలో గుర్తింపును సంపాదిస్తుందో దానినే ఇష్టపడుతోంది. అందుకే సిల్వర్ డిజైన్స్ మరింతగా యువత మదిని గెలుచుకుంటున్నాయి. స్టీల్ మెరుపులు స్ట్రీట్ అండ్ బోహో స్టైల్లో స్టీల్‌తో తయారైన ఆభరణాలను యువత ఎక్కువ ధరిస్తుంటుంది. క్యాజువల్ వేర్, పార్టీవేర్కీ నప్పే ఈ డిజైన్ వరసలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. (చదవండి: తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!) -
అతికించిన అందం! ఇంటి గోడలకు త్రీడీ వాల్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంచరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి ఉంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
వారెవ్వా! రబ్బర్ ఫ్లోరింగ్.. ఇంటీరియర్‌లో నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆధునిక పోకడలు, అభిరుచుల మేరకు వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గదికో రకంగా డిజైనింగ్ చేయిస్తున్నారు. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్‌లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలోనూ ఈ తరహా ఫ్లోరింగ్‌ను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్‌ను వేయిస్తున్నాయి. పై అంతస్తులో పిల్లలు ఆడుకుంటే కిందికి శబ్దాలు వినిపించకుండా, కిందపడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. తడిగా ఉంచే కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాంతాలలో కూడా వీటిని వేసుకోవచ్చు. రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో, విభిన్న శైలి రంగులలో, డిజైన్లలో లభ్యమవుతాయి. వీటికి దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇతర ఫ్లోరింగ్‌లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడైపోవటం వంటివి చాలా తక్కువ. ఫంగస్ కూడా పట్టదు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న రవితేజ
-
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్‌లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్‌లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
ఓర్నీ.. టెక్నాలజీ సాయంతో బిక్షాటనా! ట్రెండ్ సెట్ చేశాడుగా!
సాక్షి, బొమ్మలరామారం: మారాజ.. మారాజ.. అంటూ చేతిలో తుపాకీతో, మాటల గారడీ చేస్తూ సంక్రాంతి వేళ భిక్షాటన చేస్తూ సందడి చేసే తుపాకీ రాముడు నేడు ట్రెండ్ మార్చాడు. పోలీస్ ఆఫీసర్లాంటి ఖాకీ యునిఫాం, చేతిలో కట్టె తుపాకీ, నెత్తికి టోపీ, నల్లరంగు బూట్లను ధరించే తుపాకీ రాముడు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త అవతారమెత్తాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన మిరాల రాములు సంచార జాతికి చెందిన వ్యక్తి. 42 ఏళ్లకు పైగా తుపాకీ రాముడి వేషధారణతో సంక్రాంతి సమయంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా నోటితో గారడీ మాటలు చెబుతూ భిక్షాటన చేసిన రాముడు నేడు ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్నాడు. వయసు మీద పడడంతో తన మాటలను రికార్డు చేసి బ్లూటూత్ స్పీకర్ సాయంతో జనానికి వినిపిస్తున్నాడు. సంక్రాంతి పండుగ వేళ బ్లూటూత్ సాయంతో మాటలు వినిపిస్తున్న తుపాకీ రాముడి సందడిని చూసి ప్రజలు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. – మిరాల రాములు, బొమ్మలరామారం (తుపాకీ రాముడు) (చదవండి: బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు) -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్‌లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్‌తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
Hyderabad: తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. విభిన్న భాషల మేలు కలబోతతో విలసిల్లుతున్న హైదరాబాద్.. భాషలో, యాసలో ఆంగ్ల అనుకరణం కారణంగా కొన్నాళ్లుగా తెలుగుపై కాస్త మక్కువ తగ్గింది. ప్రస్తుతం నగర వేదికగా సంగీత వేదికలపై తెలుగు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ రాక్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన వేదికలపైనే ఇప్పుడు తెలుగు పాటలు, జానపద సాహిత్యం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్ బ్యాండ్స్ నగరంలో సందడి చేసేవి. కానీ ఇప్పుడు దాదాపు పాతిక తెలుగు బ్యాండ్స్ ప్రాంతీయ భాషలో అలరిస్తున్నాయి. నగరంలోని బార్లు, పబ్‌లలో జస్టిన్ బీబర్ సాంగ్స్‌కు బదులు బుల్లెట్టు బండి పాటలు మార్మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొడితే ఎలక్ట్రిక్ మ్యూజిక్కు బదులు టాలీవుడ్ మాస్ పాటలు వినిపిస్తున్నాయి. నగర జీవన విధానంలో పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక స్థానముంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్, క్లబ్‌లలో ఇంగ్లిష్, హిందీ సంగీతం వినిపించేది. కొన్నేళ్లుగా ఈ స్పాట్లలో తెలుగు పాటలు ప్రారంభమయ్యాయి. కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం కేవలం తెలుగు సాహిత్యమే ప్రధానాంశంగా ప్రారంభించాయి. అయిదేళ్ల క్రితం ఇలాంటివి రెండు, మూడు ఉంటే ఇప్పుడు 40 వరకు పెరిగాయి. ఈ మధ్య కాలంలో అనూహ్యంగా తెలుగు బ్యాండ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్‌పైన లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌తో మెలోడీ, మాస్, క్లాస్, జానపద పాటలు అలరిస్తుంటే ఫుడ్, సిప్‌ను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఈ పరిణామంతో తెలుగు బ్యాండ్స్‌కు ఉపాధి పెరిగింది. తెలుగు మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కోవిడ్ కారణంగా కాస్త నెమ్మదించాయి. నైట్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో మాత్రం తెలుగు పాటలే కొత్త ట్రెండ్. నగరం నలుమూలల్లోని ఏ బార్, రెస్టారెంటైనా తెలుగు పాటే క్రేజీనెస్. తెలుగు సాహిత్యం ఉన్న రిసార్ట్స్, బార్లకు కస్టమర్లు కుటుంబ సమేతంగా వస్తుండటం విశేషం. తెలుగు సాహిత్యమే ప్రస్తుత నేపథ్యం.. నగరవాసులు ఇప్పుడు తెలుగు పాటల ట్రెండ్‌నే అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే ప్రదర్శించాలనే నేపథ్యంతోనే తబులా రాసా బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు లైవ్ మ్యూజిక్ బ్యాండ్లకు మంచి వేదికను ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో తెలుగు పాటలను వింటూ కుటుంబంతో సరదాగా గడపాలనే వారి సంఖ్య పెరిగింది. నైట్ కల్చర్‌కు పేరొందిన ప్రదేశాల్లో తెలుగు పాటలున్నవాటినే ముందు రిజర్వ్ చేసుకుంటున్నారు. – జువ్వాడి శ్రవణ్, తబులా రాసా వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్ -
ఐఫోన్14 అలా వచ్చిందో లేదో...ఐఫోన్15 సిరీస్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్14 అలా లాంచ్ అయిందోలేదో అప్పుడే రానున్న ఐఫోన్ సిరీస్‌పై ఊహాగానాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్‌లో భారీ మార్పులే చేయనుందట. ప్రస్తుతం ఐఫోన్ 14పై మోడల్స్ ఫీచర్స్ మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ ఈసారి భారీ అప్డేట్స్తో నెక్ట్స్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తాజా అంచనాల ప్రకారం ఐఫోన్-15 సిరీస్‌లో ప్రో, ప్రో మాక్స్ వేరియంట్ మధ్య భారీ మార్పులే తీసుకురానుంది.ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో అందించని ప్రత్యేక ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లో జోడించనుంది. కాగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరించింది. ఐఫోన్-14 సిరీస్‌లో ప్రో, నాన్-ప్రో మోడల్స్ ఫీచర్స్ అప్డేట్ చేసినా, కానీ, రెండు ప్రో మోడల్స్ మధ్య బ్యాటరీ, స్క్రీన్ తప్ప మిగతా ఫీచర్స్‌లో పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ యూజర్లు భారీ నిరాశ చెందారు. ముఖ్యంగా ఆపిల్ వ్యవస్థపాకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఇన్‌స్టా స్టోరీ కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 చదవండి:ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది? (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 (1/2) I think Apple should name A16 as A16 Pro and A15 used by two iPhone 14 standard models as A16/A15 Plus. Maybe it helps promote two iPhone 14 standard models. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 -
విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?.. ప్రత్యేకతలివే
దొండపర్తి (విశాఖ దక్షిణ): సినిమాకు వెళ్లాలంటే.. సాధారణ థియేటర్‌కా.. మల్టీప్లెక్సుకా.. అంటూ అనేక ఆలోచనలు చేస్తుంటాం. కానీ కొద్ది రోజుల తరువాత ఈ చాయిస్ లిస్టులో ఇగ్లూ థియేటర్ కూడా చేరనుంది. పుర్రెకో బుద్ధి అన్న నానుడికి తగ్గట్టుగా ఆనంద్‌కు వచ్చిన సరికొత్త ఆలోచనతో సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఈ థియేటర్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చదవండి: ‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’ విశాఖ జిల్లాలో ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్ తరువాత జాతీయ రహదారికి ఆనుకొని ఏ స్క్వేర్ గోకార్టింగ్ వద్ద ఈ ఇగ్లూ థియేటర్ రూపుదిద్దుకుంటోంది. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ థియేటర్ నిర్మాణం ఇంకో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆగస్టు నెలలో థియేటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్ ప్రత్యేకతలు.. కేవలం 500 గజాల్లో ఇగ్లూ తరహాలో ఎఫ్ఆర్పీ మెటీరియల్‌తో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మినీ థియేటర్లో వంద మంది కూర్చొనే విధంగా సీట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫుల్ ఏసీ, హైక్వాలిటీ సరౌండ్ సిస్టమ్, ఇలా మల్టీప్లెక్సులకు సమానంగా థియేటర్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే పక్కనే 500 గజాల్లో మరో ఇగ్లూ థియేటర్‌ను నిర్మించనున్నారు. ఈ ఇగ్లూ థియేటర్.. మల్టీప్లెక్స్ ట్రెండ్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు. -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్‌కుమార్ సింగ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్‌గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
అక్షయ్ న్యూ ట్రెండ్