Neymar
-
బ్రెజిలియన్ సాకర్ స్టార్ నెయ్మార్.. అదిరిపోయే లగ్జరీ పెంట్ హౌస్ (ఫోటోలు)
-
పీలే రికార్డును బద్దలు కొట్టిన నెమార్
సావోపావ్లో: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నెమార్ కొత్త రికార్డు సృష్టించాడు. బొలీవియాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నెమార్ నమోదు చేసిన గోల్ అతని కెరీర్లో 78వది. దాంతో ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్, దిగ్గజ క్రీడాకారుడు పీలే పేరిట ఉన్న 77 గోల్స్ రికార్డు బద్దలైంది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
నెమార్‌కు బంపరాఫర్.. ఏకంగా 832 కోట్లు
రియాద్: ప్రపంచ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం కోట్లాది డాలర్లతో సౌదీ అరేబియా క్లబ్‌లు క్యూ కడుతున్నాయి. ఎంత భారీ మొత్తమైనా చెల్లించి సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో (అల్ నాసర్) ఇక్కడి లీగ్‌లో ఆడుతుండగా ఇప్పుడు మరో టాప్ ప్లేయర్ నెమార్ ఈ జాబితాలో చేరాడు. ఈ బ్రెజిల్ ఆటగాడితో తాజాగా సౌదీ క్లబ్ ‘అల్ హిలాల్’ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు కోసం నెమార్‌కు వార్షిక వేతనంగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 832 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇతర సౌకర్యాలూ నెమార్‌కు లభిస్తాయి. గత ఆరు సీజన్లుగా పారిస్ సెయింట్ జర్మయిన్ (పీఎస్జీ) క్లబ్ తరఫున నెమార్ ఆడాడు. తాజా పరిణామాల్లో భాగంగా ట్రాన్స్ఫర్ ఫీ కింద పీఎస్జీ క్లబ్‌కు అల్ హిల్ మరో 98 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 819 కోట్లు) కూడా చెల్లించనుంది. గాయాలతో ఇబ్బంది పడుతూ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన నెమార్‌కు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు అల్ హిలాల్ ముందుకు రావడం విశేషం. చదవండి: ODI WC 2023: ఇలా ఉంటే ఇంగ్లండ్‌ను ఆపడం సాధ్యమా..? వీళ్లు చాలదన్నట్లు స్టోక్స్ జతకలిశాడు..! -
విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో నెయ్మర్ నిర్మించిన మాన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు అతనికి భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి నెయ్మర్కు పర్యావరణ అధికారులు బిగ్‌షాక్ ఇచ్చారు. నెయ్మర్ కొత్తగా నిర్మించిన తన మాన్షన్ హౌస్ వెలుపల ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు. అతని చర్యపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణానికి హానీ కలిగించేలా నిబంధనలు ఉల్లఘించి మాన్షన్ బయట కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నెయ్మర్కు 3.3 మిలియన్ యూఎస్ డాలర్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.27.1 కోట్లు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని అధికారులు ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ''నిబంధనల ప్రకారం మాన్షన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోవచ్చు. కానీ నెయ్మర్ తన విలాసాల కోసం పర్యావరణానికి హానీ కలిగిస్తూ కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటి?. రూల్స్‌కు విరుద్దంగా నదీ ప్రవాహాన్ని సంగ్రహించడం చట్టరిత్యా నేరం. అనుమతి లేకుండా నదీ ప్రవాహాన్నిమళ్లించడం.. కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం రాళ్లు, ఇసుకను అక్రమంగా తరలించడం.. పర్యావరణ బోర్డు అనుమతి లేకుండానే వృక్షసంపదను అణచివేయడమనేది నేరం కిందే లెక్క. ప్రభుత్వ చట్టాలను పాటించకుండా నిషేధాజ్ఞలను ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ''అంటూ ప్రకటనలో తెలిపింది. ఇక నెయ్మర్ కుటుంబసభ్యులు మాన్షన్‌లో ఉన్నప్పుడే అధికారులు, పోలీసులు ఎంటరయ్యారు. దీంతో నెయ్మర్ తండ్రి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారులు చుట్టూ కొలతలు తీసుకొని ఎంతమేర పర్యావరణానికి నష్టం కలిగించాడనే దానిపై రిపోర్టు తయారు చేశారు. అనంతరం నోటీసులు అంటించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. Neymar has been fined nearly $3.5 million after Brazilian authorities said that the soccer star’s luxury coastal mansion in southeastern Brazil violated rules in the 'construction of an artificial lake' https://t.co/VE5RVJYSxJ pic.twitter.com/T5rdztMMER — Reuters (@Reuters) July 5, 2023 ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చదవండి: #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మర్ జూనియర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో(ఐదు మిలియన్ రియాస్లు) జరిమానా విధించారు. తాజాగా అక్రమ ప్రాజెక్టు కట్టడంపై నెయ్మర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కన్నెర్రజేసిన అధికారులు శనివారం రెండోసారి జరిమానా విధించి నెయ్‌మర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాగా 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్! మిలియన్ డాలర్ ఫైన్ -
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Neymar Could Be Fined $1 Million: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రధాన పట్టణం రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనం నిర్మిస్తున్న నేమార్‌కు మిలియన్ డాలర్ మేర ఫైన్ వేయనున్నారు. ఈ విషయం గురించి స్థానిక మేయర్ కార్యాలయం.. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. భవనం నిర్మిస్తున్న క్రమంలో అతడు పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేకూర్చాడు. కాబట్టి మిలియన్ డాలర్ల మేర జరిమానా విధించే అవకాశం ఉంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. నేమార్ చేపట్టిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిపింది. రెండున్నర ఎకరాలు కాగా నేమార్ మాన్షన్ వద్దకు వచ్చి అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని చెప్పగా.. అతడి తండ్రి వారితో గొడవతో దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' -
Neymar: శుభవార్త చెప్పిన నేమార్.. ఫొటోలు వైరల్
Neymar and Bruna Biancardi: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్, పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ప్లేయర్ నేమార్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘నీ రాక కోసం మేము కలగన్నాం. ఎన్నెన్నో ప్రణాళికలు రచించాం. నీ రాక మా జీవితాలను పరిపూర్ణం చేయడంతో పాటు రానున్న రోజులను మరింత సంతోషకరంగా మారుస్తుందని మాకు తెలుసు. నువ్వొక అందమైన కుటుంబంలో అడుగుపెట్టబోతున్నావు. తోబుట్టువులు, బామ్మ-తాతయ్యలు, అత్తమ్మలు, పిన్నమ్మలు ఇప్పటికే నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు’’ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంది. పుట్టబోయేది కూతురైనా, కొడుకైనా తమ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని.. తన గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను తొందరగా చూడాలని ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా ఈ ఫొటోల్లో నేమార్ తన భాగస్వామి బ్రూనాను, పుట్టబోయే బిడ్డను ముద్దాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో నేమార్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలో నేమార్- డావీ లుకాతో కలిసి 2011లో కూతురికి జన్మనిచ్చాడు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఈ బ్రెజిలియన్ స్టార్‌కు రెండో సంతానం. ఇదిలా ఉంటే.. 2021 నుంచి డేటింగ్ చేస్తున్న నేమార్- బ్రూనా 2022లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడు నెలల తర్వాత విడిపోతున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా ఇలా తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు. కాగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న 30 ఏళ్ల నేమార్ కల ఫిట్నెస్ సమస్యల కారణంగా కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. -
ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం!
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్ ఆన్లైన్లో పోకర్(పేకాట) గేమ్ ఆడి 1 మిలియన్ యూరోలు(భారత కరెన్సీలో దాదాపు రూ. 9 కోట్లు) పోగొట్టుకోవడం ఆసక్తి రేపింది. తన డబ్బు పోగొట్టుకోవడంతో నెయ్మర్ కన్నీటిపర్యంతం అవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొడ కండరాల గాయంతో మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న నెయ్మర్ ఇంట్లోనే ఉంటుండడంతో పోకర్ గేమ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్మర్ బుధవారం రాత్రి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో భాగంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతే తన డబ్బులు పోయాయంటూ లబోదిబో మన్న నెయ్మర్ గుక్కపట్టి ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. అయితే కాసేపటికే ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా కేవలం సరదా కోసమే అంటూ క్యాప్షన్ జత చేశాడు. పేకాటలో డబ్బులు పోవడం, రావడం సహజం. ఒకసారి పోతే.. మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత గేమ్‌లో నెయ్మర్ తాను పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన నెయ్మర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీలతో కలిసి నెయ్మర్ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Neymar é o rei do entretenimento até fazendo live slk, o cara é foda kkkkkkkkkkkkkkkkk pic.twitter.com/EGV6C5ygP0 — Portal do Neymar 🇧🇷 | Fan account (@portaldonjr) March 28, 2023 చదవండి: అమెరికాను గెలిపించిన సాయితేజ రెడ్డి -
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్మర్.. కథ ముగిసినట్లే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఫుట్‌బాల్ అభిమానుల గుండెలు బరువెక్కాయి. టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో క్రొయేషియా 4-3 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. అంతే అంతవరకు నెయ్మర్.. నెయ్మర్ అంటూ మారుమోగిన స్టేడియం ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది. ఒకపక్క క్రొయేషియా సంబరాలు జరుపుకుంటుంటే.. బ్రెజిల్ ఆటగాళ్లు మాత్రం నిరాశలో మునిగిపోయారు. బ్రెజిల్ గుండెబలం అయిన నెయ్మర్ ఓటమి బాధతో ఒక్కక్షణం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. మ్యాచ్ ఓటమితో మైదానంలోనే కూలబడిన నెయ్మర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తమ అభిమాన ఆటగాడు అలా ఏడుస్తుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పండి. పీలే, రొనాల్డో, రొనాల్డినో తర్వాత బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నెయ్మర్ ఈ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు నెయ్మర్ బ్రెజిల్ తరపున 77 గోల్స్ చేశాడు. ఈ ఆనందం అతనికి ఎక్కువసేపు కూడా నిలవకుండా పోయింది. మరి నెయ్మర్ వెక్కి వెక్కి ఏడ్వడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్లు. మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉన్నప్పటికి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే తరచూ గాయాల బారిన పడుతూ ఆటకు దూరమవుతున్న నెయ్మర్ మరో నాలుగేళ్లు ఇదే ఫిట్నెస్తో ఉంటాడా అంటే చెప్పలేం. ఇక గాయం కారణంగా 2014 ఫిఫా వరల్డ్‌కప్‌కు నెయ్మర్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత 2015లో కోపా అమెరికా కప్ ఆడకుండా నిషేధం, 2018లో సెమీస్‌లో ఇంటిబాట పట్టడం, 2019 కోపా అమెరికా కప్‌ను బ్రెజిల్ తృటిలో మిస్ చేసుకుంది. తాజాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్మర్.. రౌండ్ ఆఫ్ 16 ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతని ఆటతీరు చూసి బ్రెజిల్ మరోసారి ఛాంపియన్ అవుతుందని అంతా భావించారు. ఇక క్వార్టర్ ఫైనల్లోనూ నెయ్మర్ అదే దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్న నెయ్మర్ వచ్చే వరల్డ్‌కప్ ఆడుతానో లేదో అన్న సందేహం అతనిలో ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక నెయ్మర్ కథ దాదాపు ముగిసినట్లే. ఫుట్‌బాల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ 2002లో చివరిసారి ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. 2014లో సెమీఫైనల్లో ఇంటిబాట పట్టిన బ్రెజిల్.. మిగతా మూడుసార్లు క్వార్టర్స్‌కే పరిమితమైంది. Million heart brokes neymar crying 💔💔 #FIFAWorldCup #Neymar pic.twitter.com/ENHlraFJJG — Henry 🇧🇩 (@shoaibA21211051) December 9, 2022 -
కల చెదిరింది.. హృదయం ముక్కలైంది! గుండెకోత మిగిల్చారు.. అయినా!
ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫిపా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ తమ ప్రయాణాన్ని క్వార్టర్ ఫైనల్లోనే ముగించింది. క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియా చేతిలో పరాజయం పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆరోసారి ట్రోఫీను ముద్దాడాలని ఖాతర్ గడ్డపై అడుగుపెట్టిన సాంబా బృందం నిరాశతో ఇంటిముఖం పట్టింది. తమ ఆరాధ్య జట్టు ఓడిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. బ్రెజిల్ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్ సైతం పొగిలి పొగిలి ఏడ్చాడు. మ్యాచ్ సాగిందిలా.. ఇరు జట్లు మ్యాచ్ నిర్దేశిత 90 నిమిషాల సమయం ముగిసే వరకు గోల్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయమిచ్చారు. అయితే అదనపు సమయంలో మొదటి అర్ధ భాగంలో నెయ్మర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో మెరిశాడు. అభిమానులలో గెలుపు ఆశలు రేకెత్తించాడు. పట్టలేని సంతోషం తో మైదానంలో పరుగులు తీసాడు. దీంతో 1-0 బ్రెజిల్‌కు లభించింది. అనంతరం రెండో అర్ధభాగం లో క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్వోనిక్ గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు. దీంతో అభిమానుల హృదయ స్పందనల వేగం మరింత హెచ్చింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫెనాల్టీ షూటౌట్లో ఏం జరిగిందంటే? తొలి ప్రయత్నంలోనే క్రోయేషియా ఆటగాడు గోల్ కొట్టి తమ జట్టుకు అధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం బ్రెజిల్ తమ తొలి ప్రయత్నంలో గోల్ కొట్టడంలో విఫలమైంది. బ్రెజిల్ ఆటగాడు రోడ్రిగో కొట్టిన బంతిని క్రోయేషియా గోల్ కీపర్ లీవర్ కోచ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక రెండో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించగా.. బ్రెజిల్ కూడా ఈ సారి గోల్ కొట్టడంలో సఫలమైంది. దీంతో స్కోర్ 2-1గా మారింది. ఇక మూడో ప్రయత్నంలోనూ క్రొయేషియా, బ్రెజిల్ ఇరు జట్లు గోల్స్ సాధించాయి. దీంతో స్కోర్ 3-2 అయింది. ఇక నాలుగో ప్రయత్నంలోనూ క్రొయేషియా గోల్ సాధించింది. దీంతో 4-2గా మారింది. స్టేడియం మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో బ్రెజిల్ తరపున గోల్ కొట్టేందుకు మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. అయితే మార్కినో కొట్టిన షాట్ ఎడమైవైపున్న గోల్ బార్‌ను తాకడంతో బ్రెజిల్ ఓటమిపాలైంది. దీంతో సగటు బ్రెజిల్ అభిమాని గుండె పగిలింది. ఇక బ్రెజిల్‌పై అద్భుత విజయం సాధించిన క్రోయేషియా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఏదేమైనా ఆటలో గెలుపుఓటములు సహజమే! క్రొయేషియా గెలిచినా.. బ్రెజిల్ ఓడినా సాకర్ ప్రేమికులను ఈ మ్యాచ్ ఉత్కంఠతో మునివేళ్ళమీద నిలబెట్టిందనటంలో సందేహం లేదు. కావాల్సినంత వినోదం పంచడంతో పాటు కాసిన్ని భావోద్వేగాలను కూడా మూటగట్టింది. చదవండి: FIFA WC: షూటౌట్లో బ్రెజిల్ అవుట్.. సెమీఫైనల్లో క్రోయేషియా -
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్‌లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
FIFA WC: నెయ్మర్ అడుగు పడింది.. దర్జాగా క్వార్టర్స్‌కు బ్రెజిల్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 4-1తో గెలిచిన బ్రెజిల్ దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బ్రెజిల్ తరపున విని జూనియర్(ఆట 7వ నిమిషం), నెయమర్(ఆట 13వ నిమిషం), రిచర్లీసన్(ఆట 29వ నిమిషం), లుకాస్ పెక్వెటా(ఆట 36వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఇక సౌత్ కొరియా తరపున పైక్ సాంగ్ హూ(ఆట 76వ నిమిషం) గోల్ సాధించాడు. కాగా బ్రెజిల్ తొలి అర్థభాగంలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌టైమ్‌లో దక్షిణ కొరియా గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినప్పటికి సఫలీకృతం కాలేకపోయింది. ఆ తర్వాత ఆట అదనపు సమయంలోనూ ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఇక చీలమండ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు నెయ్మర్ రీఎంట్రీలో అదరగొట్టాడు. ఆట 13వ నిమిషంలో బ్రెజిల్‌కు వచ్చిన పెనాల్టీని నెయ్మర్ చక్కగా వినియోగించుకున్నాడు. గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి అద్బుత గోల్ సాధించాడు. కాగా ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో సెర్బియాతో మ్యాచ్‌లో పాల్గొన్న నెయ్మర్ చీలమండకు గాయం అయింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక డిసెంబర్ 9న(శుక్రవారం) జరగనున్న క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్.. క్రొయేషియాతో తలపడనుంది. 🎦 CAN'T. MISS. THESE. 😍@CBF_Futebol run riot as they score 4️⃣ past @theKFA to set up a q/f fixture with @HNS_CFF ⚔️ Watch #Brazil in action on Dec 9 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#BRAKOR #Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/bpIjF1tn3k — JioCinema (@JioCinema) December 6, 2022 -
స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు బ్రెజిల్‌కు భారీ షాక్..
సెర్బియాతో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయానికి గురైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈనెల 28న స్విట్జర్లాండ్‌తో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని జట్టు వైద్యులు ప్రకటించారు. బ్రెజిల్ తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన నెమార్ 75 గోల్స్ చేశాడు. మరో రెండు గోల్స్ చేస్తే బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా దిగ్గజం పీలే (77 గోల్స్) పేరిట ఉన్న రికార్డును అతను సమం చేస్తాడు. కాగా సెర్బియాతో తమ తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. బ్రెజిల్ యువ ఆటగాడు రిచర్లిసన్ రెండు గోల్స్‌తో తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్ గ్రూప్-జి నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. చదవండి: FIFA WC 2022: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే -
FIFA WC: ఫిఫా వరల్డ్‌కప్‌లో ధోని హవా! గెలుపొందిన బ్రెజిల్‌కు ఊహించని షాక్!
FIFA WC 2022 Brazil vs Serbia: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ మిస్టర్ కూల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని ఫిఫా ప్రపంచకప్-2022 వేదికపై ధోనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఫ్యాన్స్ సందడి.. బ్రెజిల్ ఘన విజయం బ్రెజిల్ జట్టు మద్దతుదారుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. సాకర్ మెగా ఈవెంట్లో భాగంగా గ్రూప్- జిలోని మాజీ చాంపియన్ బ్రెజిల్ గురువారం సెర్బియాతో తలపడింది. దోహాలోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీ పడగా.. నేమార్ బృందం సెర్బియాను చిత్తు చేసింది. 2-0తో ప్రత్యర్థిని ఓడించి ఘనంగా టోర్నిని ఆరంభించింది. ఇక బ్రెజిల్ జట్టును ఉత్సాహపరిచే క్రమంలో ఫ్యాన్స్ ఎల్లో జెర్సీలతో దర్శనమిచ్చారు. ధోని జెర్సీతో అభిమాని ఇందులో భాగంగా నాబీల్ అనే వ్యక్తి బ్రెజిల్‌కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలను సీఎస్కే ఫ్యాన్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ .. ‘‘ఎక్కడికెళ్లినా.. అక్కడ ఎల్లో’’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. బ్రెజిల్‌కు ఊహించని షాక్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్రెజిల్ కెప్టెన్ నేమార్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి కుడి పాదానికి దెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 80వ నిమిషంలో సెర్బియా ఫుట్‌బాలర్ నికోలా మిలెన్‌కోవిచ్ ఢీకొట్టగా నేమార్ నొప్పితో విలవిల్లాడాడు. అతడు మైదానాన్ని వీడగా ఆంటోని నేమార్ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా తమ తదుపరి మ్యాచ్‌లో బ్రెజిల్ స్విట్జర్లాండ్‌తో పోటీ పడనున్న తరుణంలో సారథి ఇలా గాయం బారిన పడటం గమనార్హం. చదవండి: FIFA WC 2022: వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్ IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! Everywhere we go, there’s always Yellove! 💛 https://t.co/xMRix13Ea1 — Chennai Super Kings (@ChennaiIPL) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో
వైరల్: నడిరోడ్డులో ఓ యువకుడు చేసిన పని.. విస్మయానికి గురి చేస్తోంది. రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ గుద్దుకునే యత్నం చేశాడతను. అతని తల బస్సు అద్దానికి తగిలి.. అదికాస్త బద్ధలయ్యింది. ఈ ప్రమాదం నుంచి.. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది. కానీ, తల, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. తొలుత ఆ యువకుడు కావాలని చేశాడనుకున్నారు స్థానికులు. కానీ, కారణం తెలిస్తే.. కంగు తినడం మీ వంతూ అవుతుంది కూడా!. అయితే.. యువకుడు అంతటితోనే ఆగలేదు. కనీసం ఒంటిపై చొక్కా కూడా లేని ఆ యువకుడు తనకు తగిలిన గాయాలను లెక్కచేయకుండా పైకి లేచి.. తనను గుద్దిన బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్‌పై రక్తం కారుతున్న కాళ్లను ఆనించి.. ప్రయాణికులను కాసేపు టెన్షన్ పెట్టాడు. అతన్ని నిలువరించడం స్థానికులు, ప్రయాణికుల వల్ల కూడా కాలేదు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. తొలుత దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. కేరళ మలప్పురం పెరింథాల్‌మన్నలోని జూబ్లీ జంక్షన్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మానసిక స్థితి బాగోలేదని గుర్తించి.. తల్లిదండ్రుల్ని పిలిపించి మందలించారు. ఆపై వాళ్ల సాయంతో కోజికోడ్‌లోని మెంటల్ హెల్త్ సెంటర్‌కు యువకుడిని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. తాను బ్రెజిల్ జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, బస్సుకు ఉన్న బ్లూకలర్ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని, ఆ కోపంతోనే అలా చేశానని గట్టి గట్టిగా అరిచాడు. అంతేకాదు.. బస్సు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక.. నెయ్‌మర్‌తో సహా టీం సభ్యులంతా రావాలని డిమాండ్ చేస్తూ హల్ చల్ చేశాడు. In a shocking incident, a mentally ill youth jumped before a moving bus near Perinthalmanna. The cops summoned his parents to the spot, and shifted him to a mental health institute in Kozhikode, reports said. The man suffered head & leg injuries in the incident. pic.twitter.com/sgcSRQHHVJ — Bechu.S (@bechu_s) November 9, 2022 -
ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం!
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ తొలిసారి ప్రతిష్టాత్మక ''బాలన్ డీ ఓర్'' అవార్డుకు నామినేట్ కాలేకపోయాడు. అవార్డుకు సంబంధించి 30 మంది జాబితాను ప్రకటించగా.. మెస్సీ నామినేషన్‌కు కూడా అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. మెస్సీ బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్-జెర్మన్(పీఎస్జీ) తరపున మొదటి సీజన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఏడుసార్లు అవార్డు అందుకున్న మెస్సీ ప్రాంచైజీ మారిన ఏడాది వ్యవధిలోనే బాలన్ డీ ఓర్‌కు నామినేట్ కాకపోవడం ఆసక్తి కలిగించింది. ఇక మెస్సీతో పాటు సహచర పీఎస్జీ ఆటగాడు.. బ్రెజిల్ స్టార్ నెయమర్ కూడా నామినేట్ అవడంలో విఫలమయ్యాడు. కాగా ప్రతిష్టాత్మక బాలిన్ డీ ఓర్ అవార్డుకు మొత్తం 30 మంది నామినేట్ కాగా.. వారిలో ఐదుసార్లు అవార్డు విజేత క్రిస్టియానో రొనాల్డో సహా మహ్మద సాలా, రాబర్ట్ లెవాండోస్కీ, కిలియన్ బేపీ, ఎర్లింగ్ హాలండ్, కరీమ్ బెంజెమా, సాదియో మానే, కెవిన్ డిబ్రుయోన్, హారీ కేన్ తదితరులు ఉన్నారు. కాగా అక్టోబర్ 17న ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు విజేతను ప్రకటించనున్నారు. కాగా గతేడాది పొలాండ్ స్ట్రైకర్ రాబర్ట్ లెవాండోస్కీతో టగ్ ఆఫ్ ఫైట్ ఎదురయినప్పటికి తొలి స్థానంలో నిలిచి ఏడోసారి అవార్డును ఎగురేసుకుపోయాడు. ఈసారి మాత్రం పీఎస్జీకి ఆడుతూ మెస్సీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. కాగా 2005 నుంచి చూసుకుంటే మెస్సీ ఇప్పటివరకు ఏడుసార్లు బాలన్ డీ ఓర్ అవార్డును దక్కించుకొని చరిత్ర సృష్టించాడు. 2005 నుంచి వరుసగా నామినేట్ అవుతూ వచ్చిన మెస్సీ.. 2007, 2009, 2010, 2011, 2012, 2019, 2021లో ఏడుసార్లు అవార్డును గెలవడం విశేషం. ఇక 1956 నుంచి ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి బాలన్ డీ ఓర్ పేరిట పురస్కారం ఇస్తూ వస్తుంది. ఇక 2018 నుంచి మహిళల విభాగంలోనూ ఈ అవార్డు అందిస్తుంది. చదవండి: The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! Ashes Series:139 ఏళ్ల యాషెస్ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా! -
'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ట్రెయినింగ్ సెషన్‌కు తాగి వచ్చాడని.. అంతేగాక ప్రాక్టీస్ సమయంలోనూ తాగుతూ కనిపించాడంటూ ఆర్ఎంసీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేనియల్ రియోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేనియల్ రియోలో వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ''కొంతకాలంగా నెయ్మర్ ఆశించిన విధంగా రాణించడం లేదు. పైగా ప్రాక్టీస్ సెషన్లకు తాగి వస్తున్నాడు. జట్టును మొత్తం సర్వ నాశనం చేస్తున్నాడు. పీఎస్జీ ఫ్యాన్స్ కూడా నెయ్మర్ ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. వెంటనే అతన్ని జట్టును నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారంటూ'' తెలిపాడు. కాగా చాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ చేతిలో పారిస్ సెయింట్ జెర్మెన్ ఓడిపోయినప్పటి నుంచి ఏది కలిసిరావడం లేదు. వరుసగా ఇటీవలే ఆడుతున్న అన్ని మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూస్తూ వచ్చింది. తాజాగా లీగ్ 1లో భాగంగా మొనాకోతో జరిగిన మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) 3-0 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా నెయ్మర్ 2017లో బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్స్ జెర్మన్(పీఎస్జీ)కు మారాడు. చదవండి: PAK vs AUS: స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు! Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్ -
మెస్సీ గోల్ చేశాడు.. పారిస్ దద్దరిల్లింది
Lionel Messi Scores Maiden PSG Goal: ఛాంపియన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మేన్ (పీఎస్జీ) స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ గోల్ సాధించడంతో పారిస్ నగరం దద్దరిల్లింది. రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్జీ తరఫున తన తొలి గోల్ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. JUST LISTEN TO THE ROAR THAT COULD BE HEARD ALL OVER PARISNotice how Messi instantly points to Mbappé who provided the brilliant assist 🔥 pic.twitter.com/aa5n6FAtaq— mx (@MessiMX30i) September 28, 2021 తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్ తరఫున గోల్ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబపే అందించిన అద్భుతమైన పాస్‌ను మెస్సీ గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌ను మెస్సీ.. మరో స్టార్ ప్లేయర్ నెయ్మాన్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
28 ఏళ్ల నిరీక్షణకు తెర, కన్నీళ్లతో ఆటగాళ్లు..
అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది. #CopaAmérica 🏆 ¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi 🔟🇦🇷 levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee — Copa América (@CopaAmerica) July 11, 2021 మెస్సీ-నెయ్మర్.. ఇద్దరూ కన్నీళ్లే ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. #CopaAmérica 🏆 ¡LO LINDO DEL FÚTBOL! Emotivo abrazo entre Messi 🇦🇷 y Neymar 🇧🇷 ¡ÍDOLOS! 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/ecknhlv2VI — Copa América (@CopaAmerica) July 11, 2021 తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టైటిల్ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. Messi is tossed in the air by his Argentina teammates. It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ — ESPN India (@ESPNIndia) July 11, 2021 ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది. -
నెమార్ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు
రియో డి జనీరో: బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్, ప్యారిస్ సెయింట్–జెర్మయిన్ క్లబ్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ నెమార్ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చాడు. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు స్థానిక టీవీ చానల్ తెలిపింది. ఈ మొత్తాన్ని ‘యూనిసెఫ్’తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్ కోసం వినియోగించనున్నారు. -
సెర్బియా చిత్తు.. నాకౌట్‌కు సాంబా జట్టు
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్నడూ లేనంతగా ఆగ్రశ్రేణి జట్లు నాకౌట్ చేరడానికి నానాతంటాలు పడుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లే పంజా విసిరి పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచకప్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ సులభంగా నాకౌట్‌కు చేరుతుందనుకున్నారు. కానీ లీగ్ చివరి మ్యాచ్‌లో సెర్బియాపై గెలిస్తేనే రౌండ్ 16కి వెళ్లే అవకాశం.. డ్రా అయితే కొంచెం కష్టం ఇది సాంబా జట్టు పరిస్థితి. అలాంటి మ్యాచ్‌లో బెబ్బులిలా పంజా విసిరింది. బుధవారం గ్రూప్ ఈలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో సెర్బియాను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన బ్రెజిల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో సాంబా జట్టు స్టార్ నెమార్ చిరుతలా కదిలాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు కూడా నెమార్ మీదే ఆధారపడకుండు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ప్రథమార్థంలో నెమార్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మిడ్ ఫీల్డర్ పాలిన్హో హెడర్ గోల్ చేసి బ్రెజిల్ జట్టుకు తొలి గోల్ అందిచాడు. తొలి భాగం ముగిసే సరికి బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో భాగంలో బ్రెజిల్ మరో గోల్ నమోదు చేయడానికి చాలా సమయమే పట్టింది. బ్రెజిల్ చేసిన గోల్ ప్రయత్నాలను సెర్బియా రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 68వ నిమిషంలో టి సిల్వా మరో గోల్ చేసి జట్టుకు మరింత ఆధిక్యాన్ని పెంచాడు. రెండో భాగం ముగిసినా, ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు కాకపోవడంతో బ్రెజిల్ విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఈ లో టాపర్‌గా రౌండ్ 16 లోకి అడుగుపెట్టింది. జులై 2 న నాకౌట్ పోరులో మెక్సికోతో బ్రెజిల్ తలపడనుంది. -
నెమార్ ఆడటం అనుమానమే?
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెమార్ నేడు స్విట్జర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. బ్రెజిల్ కోచ్ అడెనార్ బాకీ (టిటె) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఈ స్టార్ ఆటగాడు నేటి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. నెమార్ వంద శాతం ఫిట్‌గా లేడని, మ్యాచ్ ఆడే సమయం వరకూ చెప్పలేమని టిటె పేర్కొనడంతో బ్రెజిల్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నెమార్ ఆడకపోయినా తమ జట్టు సమిష్టిగా రాణించగలదని టిటె విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నెమార్ ప్రపంచకప్ ముందు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. కానీ ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో, ప్రాక్టీసులో ఉత్సాహంగా కనిపించడంతో అభిమానుల్లో ఆశ మొదలైంది. ఇక టిటె ప్రకటించిన పిడుగు లాంటి వార్తతో అభిమానుల ఆశ ఆవిరైంది. ఈ స్టార్ ఫుట్‌బాలర్ లేకుండా నేటి మ్యాచ్‌లో బ్రెజిల్ గెలవొచ్చు కానీ కప్ గెలవలేదని అతడి అభిమానులు పేర్కొంటున్నారు. గత ప్రపంచకప్‌లో కూడా నెమార్ గాయపడి సెమీఫైనల్ ఆడకపోవటంతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇక నెమార్ లేకుండా బ్రెజిల్ ఆడే మ్యాచ్‌లకు మజానే ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వైరల్: నెమార్‌ను స్టేడియంలో కింద పడేసి..
సాకర్ మొదలవకముందే సరదా ఆటలు మొదలయ్యాయి. ఇప్పటికే ఫీఫా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు రష్యా చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక ప్రత్యర్థి జట్లను మట్టికరిపించడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ప్రాక్టీస్ మధ్యలో ఆటగాళ్లు చేసే కొంటె పనులు అభిమానులను అలరిస్తున్నాయి. కాగా, రష్యా చేరుకున్న బ్రెజిల్ జట్టు ముమ్మర ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం ఆట మధ్యలో సాంబా జట్టు మిడ్ ఫీల్డర్ ఫిలిప్ కౌటినో 26వ పుట్టిన రోజు వేడుకలు మైదానంలో జరిపారు. పుట్టిన రోజంటే కేక్ కట్ చేసి రచ్చరచ్చ చేస్తారు కానీ బ్రెజిల్ స్టార్ నెమార్ రూటే సపరేటు. కౌటినోకు విభిన్నంగా పుట్టిన రోజు విషెస్ చెప్పాలనుకున్నాడు. నెమార్‌కు సహచర సభ్యులు జత కలవడంతో అందరూ కలిసి కోడిగుడ్లతో కౌటినోను నింపేశారు. అయితే నెమార్ చేసిన చిలిపి పనినే మరో సహచర ఆటగాడు మార్సిలొ చేశాడు. కౌటినో తరహాలోనే నెమార్‌ను టార్గెట్ చేసి అతన్ని కింద పడేసి కోడిగుడ్లతో అభిషేకం చేశారు. సాంబా ఆటగాళ్లు చేసిన అల్లరి పనులకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బ్రెజిల్ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం స్విట్జర్లాండ్‌తో పోటీ పడనుంది. -
వైరల్: ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఆటవిడుపు