notices
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుడమేరు వరదలపై చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదలపై ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయాలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ బుడమేరు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయలేదనే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీ చేసే విషయాన్ని తరువాత చూస్తామని హైకోర్టు పేర్కొంది.చదవండి: ‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే -
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
చంద్రబాబు మరో అబద్ధం.. వైఎస్ జగన్ కౌంటర్
సాక్షి, అమరావతి: గోబెల్స్ ప్రచారాల్లో చంద్రబాబును మించిన వాళ్లు మరెవరూ లేరనే విషయం.. మరోసారి రుజువైంది. అబద్ధాల్ని సృష్టించడం.. వాటిని అంతే అందంగా అమ్ముకోవడంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిలాంటి ఉన్నతస్థానంలో ఉండి.. అదీ మీడియా ముందుకు వచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది కూడా. తాజాగా.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంతో నిన్నంతా నడిచిన నాటకీయ పరిణామాలు తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్‌గా చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.‘‘జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు. ఆయన్నేదో(జగన్‌ను ఉద్దేశిస్తూ..) ఆపేశారని.. నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. సూటిగా అడుగుతున్నా.. నిన్ను వెళ్లవద్దని ఎవరైనా ఆపారా?. నోటీసులు ఉంటే మీడియాకు చూపించండి. ప్రజా జీవితంలో ఉండే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది’’ అని చంద్రబాబు మాట్లాడారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.‘‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తాను అంటే.. పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ కార్యక్రమంలో ఎవరూ పాలు పంచుకున్నా.. అందరినీ అరెస్ట్ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నారు. ఆలయానికి వెళ్తామంటే నోటీసులు ఇవ్వడమేంటో? అసలు ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నోటీసుల్లోని విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు కూడా. దీంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం.. బయటపడింది. ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే! -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా..? లేదా..? ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి చెబుతూ, దీనికయ్యే ఖర్చంతా ఆ సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని.. దీనికి వ్యయం ఎంతవుతుందో మార్గదర్శికి చెప్పాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఖర్చు వివరాలు చెప్పిన వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఫైనాన్సియర్స్‌కు తేల్చి చెప్పింది. డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేస్తూ పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను ఆ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వాస్తవాలను నిగ్గు తేల్చాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 (హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు)న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్ జగన్ హయాంలో), మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించడం కోసం నోటీసులు జారీ చేయాలని గత విచారణ సందర్భంగా రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికయ్యే ఖర్చు ఎవరు భరించాలన్నది సందిగ్ధంగా మారడంతో రిజిస్ట్రీ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి పైన పేర్కొన్న ఆదేశాలు ఇచ్చింది. -
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని.. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ కాంట్రవర్శి కామెంట్స్ చేశారు. -
పన్ను నోటీసుల్లో సరళ పదాలు వాడండి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు పంపే నోటీసులు లేదా లేఖలలో సరళమైన పదాలను ఉపయోగించాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఉన్న అధికారాన్ని వినియోగించడంలో న్యాయబద్దంగా వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, వ్యక్తిగత హాజరు అవసరం లేని ప్రస్తుత డిజిటల్ యుగంలో అధికారులు పన్ను చెల్లింపుదారులతో మరింత ‘న్యాయంగా, స్నేహపూర్వకంగా‘ ఉండాలని అన్నారు. పన్ను నోటీసులు పన్ను చెల్లింపుదారులలో ‘భయ భావనను‘ సృష్టించకూడదని అన్నారు. ఇందుకు బదులుగా నోటీసులు సరళంగా, సూటిగా ఉండాలన్నారు. నోటీసు పంపిన కారణాన్ని మదింపుదారునికి ‘స్పష్టంగా’ తెలియజేయాలని మంత్రి సూచించారు. ‘‘మనం సరళమైన, సులభంగా అర్థమయ్యేలా నోటీసులు జారీ చేసే మార్గాలను అన్వేíÙంచలేమా? ఎందుకు చర్య తీసుకున్నారో, నోటీసు ఎందుకు పంపడం జరుగుతోందో స్పష్టంగా వివరించలేమా?’ అని ఆమె ఈ సందర్భంగా ప్రశి్నస్తూ, ఆయా అంశాలను పన్ను చెల్లింపుదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. వేగవంతంగా రిఫండ్స్... రిఫండ్లను వేగంగా జారీ చేయడంలో మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థికమంత్రి సూచించారు. సమస్యకు తగిన చర్యలను మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులకు తగిన న్యాయపరమైన చర్యలను చివరి ప్రయత్నంగా మాత్రమే అమలు చేయాలని ఆమె కోరారు. పన్ను డిమాండ్‌కు స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం డిపార్ట్మెంట్ లక్ష్యంగా ఉండాలన్నారు. పన్నుల శాఖ మరింత స్నేహపూర్వకంగా, పారదర్శకంగా ఉండాలని తాను తరచూ పేర్కొంటున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, పన్ను అధికారులు ఇన్నాళ్లూ అన్యాయంగా వ్యవహరించారని తాను పేర్కొంటున్నట్లు అర్థం చేసుకోరాదని స్పష్టం చేశారు. -
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
త్వరలో మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణ చివరి అంకానికి చేరడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులకు త్వరలో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారుల నుంచి వాంగ్మూలంతో పాటు అఫిడవిట్లను స్వీకరించి పరిశీలించింది. ఈ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. గడువులోగా అఫిడవిట్ దాఖలు చేయకుండా కమిషన్ ఆదేశాలను ధిక్కరించిన ఓ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి విచారణకు తాజాగా సమన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. కాగా మాజీ ముఖ్యనేత ఒకరు అనారోగ్యంతో ఉన్నారని, విచారణకు హాజరుకాలేరని బీఆర్ఎస్ నేత ఒకరు కమిషన్‌కు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. అయితే ఒకవేళ సమన్లు జారీ చేసినా, విచారణకు రానిపక్షంలో కమిషన్ స్వయంగా ఆ నేత నివాసానికి వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇలావుండగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను వచ్చే వారం నుంచి కమిషన్ ప్రారంభించనుంది. 57 మంది సాక్షులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో కమిషన్‌కు సహకరించేందుకు తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని నియమించాలని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్థిక అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. -
ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంబేడ్కర్ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ.. ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.చంద్రబాబు సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు -
విడాకుల పిటిషన్: మాజీ సీఎం భార్యకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసు ఆర్టికల్ 142ను ఉపయోగించి తన క్లైంట్ ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.2016తో తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్‌ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.ఒమర్ అబ్దుల్లా, పాయల్ ఢిల్లీలోని ఒబేరాయ్‌లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి విడిగానే ఉంటున్నారు. -
కాళేశ్వరం స్కాం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై విచారణ.. తీర్పు రిజర్వ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది.ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం లంచ్ మోషన్ వేయడంతో.. అధికారులకు కోర్టు బ్రేకులు వేసింది. ఇవాళ్టి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. -
వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని తొలగిస్తాం
కాకినాడ రూరల్: కాకినాడ నగరం 49వ డివిజన్లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 452(1) అండ్ 461(1) ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్ 89 (1అండ్2), రెడ్ విత్ సెక్షన్ 82, 90(1) ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడీఏ యాక్ట్–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు. తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొన్నారు. కన్నబాబు లేదా ఆయన అనుమతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కడియాల శ్రీరమ్య డిజిటల్ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్ అవ్వలేదన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. -
విత్తన కంపెనీల టార్గెట్‌పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
నీట్ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల అంశంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. 30న ఫలితాలు వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సెలింగ్ చేపడతామని(జులై 6లోపు పూర్తి చేస్తామని) ఎన్టీఏ కోర్టుకు నివేదించింది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.Supreme Court reiterates that it will not stay the counselling of NEET-UG, 2024.“Counselling will go on and we will not stop it. If the exam goes then everything goes in totality so nothing to fear,” says Supreme Court. pic.twitter.com/ACAB1dmyt5— ANI (@ANI) June 13, 2024ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందురోజు హడావిడిగా ఫలితాలు విడుదల చేయడంపైనా రాజకీయపరమైన విమర్శలు సైతం చెలరేగాయి. దీంతో నీట్లో అవినీతి, అక్రమాలు చోటు ఉండబోదని చెబుతూ ఎన్టీఏ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు విద్యాశాఖ నీట్ గ్రేస్ మార్కుల పునఃసమీక్ష కోసం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేస్ మార్క్‌ల నిర్ణయాన్ని వెక్కి తీసుకోవడం, ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో ఆ కమిటీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.#WATCH | On the Supreme Court's hearing on the NEET-UG 2024 exam, Education Minister Dharmendra Pradhan says "There is no corruption. In connection with the NEET examination, 24 lakh students appear in the examination. A hearing in the Supreme Court is underway today and this… pic.twitter.com/xpS9v55ptY— ANI (@ANI) June 13, 2024 -
కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో తన పాత్రను తెలియజేయాలని ఆయన్ని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. పవర్ కమిషన్ నోటీసుల ప్రకారం.. జూన్ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే.. జూలై 30 వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్ కమిషన్ సంకేతాలిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి.. వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం. -
‘ఫోన్ ట్యాపింగ్’పై మీ వివరణేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీ వివరణేంటో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని.. ఇది టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి సాధారణ సమస్య కాదని, వ్యక్తుల గోప్యతలోకి చొరబడిన అంశమని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సుమోటాగా విచారణ చేపట్టిన హైకోర్టు ‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకుని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమయంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు’అంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం మధ్యాహ్న విరామం తరువాత విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్‌ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.