Outsourcing Staff
-
10 రోజుల్లో ప్రాజెక్టుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని ప్రాజెక్టుల వివరాలు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను 10 రోజుల్లోగా తమకు సమర్పించాలని రెండు బోర్డులు తెలుగు రాష్ట్రాలను మరోసారి ఆదేశించాయి. అలాగే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలను సైతం సమర్పించాలని కోరాయి. గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై చర్చించేందుకు బోర్డులు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ భేటీలకు బోర్డుల సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండేతోపాటు తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టుల వివరాలను 10 రోజుల్లో ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించగా కొన్ని ప్రాజెక్టుల వివరాలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా బనకచర్లకు సంబంధించి వివరాలు అవసరం లేదని ఏపీ ఇంజనీర్లు చెప్పినట్లు తెలిసింది. అయితే అన్ని వివరాలు సమర్పించాలని, అక్కర్లేని వాటిపై తదుపరి భేటీలో చర్చిద్దామని బోర్డు ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే వారం కేంద్రం కొత్తగా నియమించిన ఇద్దరు సీఈలు విధుల్లో చేరుతున్నారని, వారికి అన్ని వివరాలు తెలియజేయాల్సి ఉందని బోర్డుల అధికారులు వివరించారు. ఏయే ప్రాజెక్టులు ఏ బోర్డు పరిధిలో ఉండాలన్న విషయం తేలాక కేంద్ర బలగాల భద్రత అంశాన్ని చర్చిద్దామని ఇరు రాష్ట్రాలు తెలిపినట్లు సమాచారం. సీడ్ మనీ అందించడంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలపగా అందుకు బోర్డులు అంగీకరించాయి. ఈ భేటీలో ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై చర్చించలేదని తెలిసింది. -
ఏపీ: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..) -
సీఎం జగన్ ఆదేశాలతో విధుల్లోకి..
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నన్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇటీవల దేవస్థానం ఆదాయం ఘననీయంగా పడిపోయిందన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దానికారణంగా కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. దీంతో వారు పడిన ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవస్థానం చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తిరిగి విధుల్లో చేరిన సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు మెంబర్లు వారణాసి దినేష్‌రాజ్, సూరిశెట్టి సూరిబాబు, కోరాడ లక్ష్మణ్‌కుమార్, దాడి దేవి, సిరిపురపు ఆషాకుమారి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలొద్దు దేవస్థానం విషయంలో రాజకీయాలొద్దని అన్ని రాజకీయపార్టీలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూములను లీజులకిచ్చే నిర్ణయం కొత్తగా మేమేదో తీసుకున్నట్టు ప్రచారం చేయడం తగదన్నారు. అసలు గతంలో దేవస్థానం భూములను లీజులకిచ్చిందెవరని ప్రశ్నించారు. దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూసమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ముత్తంశెట్టి తొలుత ఆలయ బేడాప్రదక్షిణ చేసి స్వామికి పూజలు నిర్వహించారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖను ఎవరు ఆపలేరు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖలో పరిపాలన రాజధానిని ఎవరూ ఆపలేరని మంత్రి ముత్తంశెట్టి స్పష్టం చేశారు. తాత్కాలికంగా అడ్డంకులు సృష్టించినా అంతిమ విజయం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఆపలేరన్నారు. -
ఔట్‌సోర్సింగ్‌కు ఊపిరి
-
ఆరు నెలలుగా జీతాలు లేవు : ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ సిబ్బంది
-
ఔట్సోర్సింగ్ కుచ్చుటోపీ !
ఔట్ సోర్సింగ్ ముసుగులో గత ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తమ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికారులను పావులుగా వాడుకుని అడ్డగోలుగా ప్రభుత్వ నిధులు కాజేశారు. మొన్నటికి మొన్న సర్వశిక్ష అభియాన్ ద్వారా భారీ స్క్రీన్ల పేరుతో నిధులు మింగినవైనం బయటపడగా... తాజాగా జిల్లాలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే అండతో ఏర్పాటైన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన సంఘటన వెలుగు చూసింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పుడు ఆ సంస్థపై క్రిమినల్కేసు నమోదు చేయించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి,విజయనగరం అర్బన్: విద్యాశాఖ అడ్డాగా గత ప్రభుత్వ పాలనలో సాగిన అక్రమాల పర్వం వెలుగు చూస్తూ నే ఉంది. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలు తాజాగా బయ ట పడ్డాయి. వారికోసం చెల్లించా ల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రూ.62 లక్షలు జమచేయకుండా జిల్లాలోని ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చెందిన బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తినేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిపాటు సిబ్బంది అడిగినా ఇటు విద్యాశాఖగానీ, అటు ఏజెన్సీగానీ స్పందించలేదు. అయితే తినేసిన ఆ రూ.62 లక్షలు ఆ ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చులో చూపించారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఏజెన్సీ అడ్రస్‌కు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో విద్యాశాఖ క్రిమినల్ కేసు పెట్టింది. అధికారం అండతో... అడ్డగోలు నియామకాలు... జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన హాస్టళ్ల నిర్వహణ కోసం గతేడాది జనవరిలో వివిధ కేడర్ నాన్ టీచింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత జిల్లా విద్యాశాఖ అర్హులైన అభ్యర్థులతో నియామక జాబితాను సిద్ధం చేసి సర్వీసు అనుభవం ఉన్న ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో జిల్లా యంత్రాంగం ఒప్పందం పెట్టుకుంది. అయితే అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఆ నియామకాలను, ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఏజెన్సీ స్థానంలో ఎలాం టి అనుభవం లేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బంధువుకు చెందిన బేతస్థ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని నియమించింది. రాత్రికి రాత్రి ఇచ్చిన ఆ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటనైనా లేకుండా ఒక్క రోజు సమయం ఇచ్చి నియామక నోటిఫికేషన్ మరలా విడుదల చేసి ఎలాగోలా తమకు అనుకూలమైనవారిని నియమించుకుని మరో జాబితా ప్రకటించారు. ఈ విషయం అప్పట్లో వివాదా స్పదమైనాజిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. తొలినుంచీ ఎగ్గొట్టిన ఈపీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలు.. తొలి మూడు నెలలకు ఒకసారి వేతన నిధులు రావడంతో ఆ మొత్తం ఒకేసారి చెల్లించారు. ఆ సమయంలో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాల నిధులు వెళ్లలేదని విద్యాశాఖ గుర్తించి తదుపరి బిల్లులకు అనుమతులివ్వలేదు. జిల్లా యంత్రాంగంపై ఆ ఎమ్మెల్యే ఒత్తిడి పెంచడంతో ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు కేటాయించకపోయినా తరువాత మరో ఐదునెలల వేతనాన్ని విడుదల చేశారు. అయినా ఆ ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు ఎగ్గొట్టింది. ఇప్పుడు ఆ ఏజెన్సీ చెల్లించాల్సిన బకాయి రూ.62 లక్షలకు చేరింది. నూతన ప్రభుత్వం వచ్చాక జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. గత నెల రోజులుగా బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ యజమానికి నోటీసులు పంపారు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై విద్యాశాఖ తాజాగా ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌పై క్రిమినల్ కేసు పెట్టింది. ఆందోళనలో సిబ్బంది.. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో గతేడాది హాస్టళ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం ఒక్కో హాస్టల్‌కు ఒక వార్డెన్, ఒక హెడ్కుక్, ఇద్దరు సహాయ కుక్‌లు, ఒక నైట్ వాచ్‌మన్ వంతున పోస్టులను భర్తీ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల కోసం వేతన మొత్తం నుంచి తీసుకున్న సొమ్మును ఇవ్వకపోడంపై ఏడాదిగా ఆందోళనలో ఉన్నారు. ఆ ఏజెన్సీపై కేసుపెట్టాం.. జిల్లాలోని మోడల్ స్కూళ్లలో హాస్టల్ నిర్వహణ సిబ్బంది నియామకానికి గడచిన ఏడాది ఒప్పందం పెట్టుకున్న బేతస్థ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. వేతనాల నుంచి కేటాయించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను సిబ్బంది ఖాతాలో జమ చేయకుండా సుమారు రూ.62 లక్షలు తిరిగి చెల్లించాలని కొన్ని నెలలుగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీపై చట్టబద్ధమైన చర్యలకోసం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టాం. సిబ్బంది వివరాలను తాజాగా పోలీసులు అడిగారు. ఇస్తున్నాం. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవలు బంద్ అయ్యాయి. పారిశుధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా సేవలు నిలిపేశారు. జీతాలు చెల్లించేంత వరకు సేవలు నిలిపేస్తామని చెప్పారు. నాలుగైదు రోజుల కింద నుంచి సేవలు నిలిపేస్తున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సేవలను నిలిపివేయాల ని నిర్ణయించినట్లు పారిశుధ్య కార్మికులు తెలిపారు. పారిశుధ్య కార్మికులే కాకుండా పేషెంట్ కేర్, సెక్యూరిటీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో అస్పత్రులన్నీ మందుల వ్యర్థాలతో నిండిపోయాయి. రూ.25 కోట్లు చెల్లించాలి.. రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రులతో పాటు, మెడికల్ కాలేజీల్లో దాదాపు 10 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికీ దాదాపు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా సేవలు బంద్ చేశారు. ఎక్కడికక్కడ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టారు. వీరంతా ఓ ఏజెన్సీ సంస్థ పరిధిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది నుంచి ఈ సంస్థ తమకు ప్రతి నెలా నిర్ణీత సమయానికి జీతాలివ్వట్లేదని సిబ్బంది వాపోతున్నారు. కాగా, పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమేనని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి అంగీకరించారు. తాము నిధులు విడుదల చేశామని, బుధవారం కార్మికులకు అందుతాయని పేర్కొన్నారు. -
అనంతపురంలో రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమావేశం
-
పంచాయతీ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆదివారం లేఖ రాశారు. ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వీరికి కనీస వేతనం కూడా దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40వేల మంది కారోబార్, బిల్ కలెక్టర్, పారిశుధ్య సిబ్బంది పంచాయతీల్లో పనిచేస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంచాయతీ ఉద్యోగులను క్రమబద్ధీకరించారన్నారు. పంచాయతీ పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిని క్రమబద్ధీకరిస్తే మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
జీతాల కోసం ఉద్యోగుల ధర్నా
వేతనాల కోసం జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ సుమారు 70 మంది ఉద్యోగులు బైఠాయించారు. జీతాల్లేక తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. -
బయోమెట్రిక్‌తో ఆందోళన
► దుర్గగుడి సిబ్బంది వేతనాల్లో కోత ► నెలంతా వచ్చినా 8 రోజులు గైర్హాజరైనట్లు నమోదు ఇంద్రకీలాద్రి : దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానంతో సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏప్రిల్‌లో 8 నుంచి పది రోజులకు పైగా విధులకు హాజరు కానట్లు బయోమెట్రిక్‌లో నమోదు కావడంతో మిషన్ల పనితీరుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ ఒకటి నుంచి దుర్గగుడి సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అయితే రోజూ విధులకు హాజరైనా కొంత మందికి 20 రోజులు మాత్రమే పని చేసినట్లు నమోదు కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది గొల్లుమంటున్నారు. ఏఈవో స్థాయి అధికారులతో పాటు సూపరింటెండెంట్లు, దిగవ స్థాయి సిబ్బంది సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా గుడిపై ఏ ఇద్దరు సిబ్బంది కలిసినా బయోమెట్రిక్‌పైనే చర్చ జరుగుతోంది. బయోమెట్రిక్ విధానంవల్ల నష్టపోయే సిబ్బంది పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయో మెట్రిక్ హాజరుతో పాటు ప్రత్యేకంగా ఒకరికి హాజరు నమోదుపై పర్యవేక్షణ అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిక్కులు ఎన్నో... బయో మెట్రిక్‌తో చిక్కులు అన్నీ, ఇన్నీ కావని ఆలయ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ యంత్రాలు ఏర్పాటు చేసి నెల కాక ముందే హాజరు కోసం తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మూడు చోట్ల బయో మెట్రిక్ యంత్రా లు ఏర్పాటు చేశారు. ఆలయంలో రెండు షిఫ్టులలో 306 మంది శాశ్వత సిబ్బంది, 60 మంది ఎన్‌ఎంఆర్‌లు, మరో 35 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్టున్నారు. బొటన వేలు, చూపుడువేలి ముద్రతో పాటు ఐరిస్ద్వారా హాజరు తీసుకునేలా బయోమెట్రిక్ పరికరాలలో సాప్ట్‌వేర్‌ను పొందుపరిచారు. ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. మరికొన్ని విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం వచ్చి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. అయితే (అదనపు విధులు) ఓటీ చేస్తున్న వారిని ఏ విధంగా నమోదు చేస్తారనే దానిపై సృష్టత లే కపోవడంతో చిన్న స్థాయి సిబ్బంది తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామంటున్నారు. -
సేవలకు విమ్స్ రెడీ!
♦ రూ.22 కోట్ల వైద్య పరికరాలు రాక ♦ 30 మంది డాక్టర్ల నియామకం ♦ ఔట్‌సోర్సింగ్‌లో 150 మంది సిబ్బంది సాక్షి, విశాఖపట్నం : వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్) ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాథమికంగా ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలతో శ్రీకారం చుట్టనుంది. తొలుత ఈ నెల 7న విమ్స్‌ను ప్రారంభిస్తామని ఇటీవల అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అయితే ఆ రోజు అమావాస్య కావడం వల్ల ముహూర్తాన్ని 11వ తేదీకి మార్చారు. ఈ నేపథ్యంలో ఓపీ సేవలకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ముహూర్తానికి మరో వారం రోజులే ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమకూరుతున్న వసతులు ఆస్పత్రికి ముఖ్యంగా రూ.22 కోట్ల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. వీటిలో శస్త్రచికిత్స థియేటర్లు, పరికరాలు, టేబుళ్లు, ఎనస్థీషియా (మత్తు) యంత్రాలు, మంచాలు, పరుపులు వంటివి ఉన్నాయి. ప్రస్తుతానికి 50 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రికి ఇచ్చిన మంచాలు నాసిరకానికి కావడంతో వెనక్కి పంపేశారు. వాటి స్థానంలో నాణ్యమైన అత్యాధునిక మంచాలను తెచ్చారు. వీటిని ఆస్పత్రిలో అమర్చారు కూడా. త్వరలో మరో 350 మంచాలను తీసుకురానున్నారు. సిబ్బంది నియామకాలు వైద్య సేవలకు వీలుగా 30 మంది డాక్టర్లను నియమించారు. వీరు కాకినాడ, గుంటూరు, శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రుల నుంచి వస్తున్నారు. ఇటీవల కేజీహెచ్‌లో నియమితులైన 20 మంది నర్సులను కూడా విమ్స్‌కు పంపుతున్నారు. వీరితో పాటు 150 మంది వైద్య, వైద్యేతర సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు జరుపుతున్నారు. మరోవైపు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ గార్డెనింగ్ బాధ్యతలను చేపట్టింది. పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ పనులు కూడా సత్వరమే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా రూ.18 లక్షల విలువైన సర్జికల్, మందులను కూడా సిద్ధం చేశామని, ప్రారంభోత్సవం నాటికి ప్రాథమికంగా అన్ని హంగులు, సదుపాయాలను సమకూరుస్తామని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
చల్లగా జెల్ల!
టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు కూడా చేరారు. వారిని తొలగిస్తూ ఫిబ్రవరి 29న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. నెల రోజుల తర్వాత గురువారం జిల్లా అధికారులు ఆ కబురు చల్లగా చెప్పారు. దీంతో ఏంచేయాలో తెలియక ఆ ఉద్యోగులు కాకినాడలో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. రోస్టర్ విధానంలోనే నియమించినా.. జిల్లాలోని మండల కార్యాలయాలను కంప్యూటరీకరించిన తరువాత టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కీలకమయ్యాయి. ఈ మేరకు 2006లో 40 మందిని కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూ చేసి రోస్టర్ విధానంలోనే నియమించింది. తర్వాత 2011లో మరో 30 మంది అదే విధానంలో నియమితులయ్యారు. వారంతా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారే. ఔట్ సోర్సింగ్ పోస్టు అయినా సరే ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందనే ఆశతో కాలం నెట్టుకొస్తున్నారు. నెల జీతం రూ.8,400 అయినాసరే ఆర్నెల్లకో, మూడు నెలలకో చెల్లిస్తున్నా సరే.. కుటుంబాలను ఎన్నో కష్టాలకోర్చి పోషించుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి.. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని నిర్దిష్ట కాలపరిమితిలో రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఆ హామీ నెరవేర్చుతారన్న ఆశతో జిల్లాలోని మండల కార్యాలయాల్లో పని చేస్తున్న 70 మందితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 640 మంది టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్లంతా ముఖ్యమంత్రికి పలుమార్లు వినతిపత్రం సమర్పించుకున్నారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతనం అమలు చేయాలని మొర పెట్టుకున్నారు. అలాచేస్తే మండల కార్యాలయాల్లో విధులు సక్రమంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పాటు అందిస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తామని విన్నవించుకున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచించింది. వారందరినీ తొలగిస్తూ గత ఫిబ్రవరి 29వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని నెల రోజులు ఆలస్యంగా గురువారం జిల్లా ఉన్నతాధికారులు చెప్పేసరికి వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన కొంతమంది కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ‘క్వాలిఫైడ్ వ్యక్తులకే ఉద్యోగాలిచ్చినప్పుడు మమ్మల్ని ఇప్పుడిలా అర్ధంతరంగా రోడ్డున పడేయడం భావ్యం కాదు. తహసీల్దారు డిజిటల్ సిగ్నేచర్ సహా మండల కార్యాలయంలో పనులన్నీ మేమే చేస్తాం. అయినా ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు ముగిసిందని చెప్పి ఎలా తొలగిస్తారు?’ అని రాజమహేంద్రవరానికి చెందిన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్ ఆధారిత పనులు చేసేవారిని ఒకేసారి తొలగిస్తే రోజువారీ సేవలకు ఆటంకం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
కొత్తూర్ (శ్రీకాకుళం) : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు సాయిరాం, డివిజన్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
‘స్వగృహ’ కొంప కూల్చుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి ఉన్నారనే కారణంతో వివిధ విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం తొలగిస్తోంది.. కానీ అప్పుల్లో మునిగి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మాత్రం ఇందుకు భిన్నం. రెండేళ్లుగా ఒక్క ఫ్లాట్‌ను కూడా అమ్మని ‘స్వగృహ’లో యథేచ్ఛగా సిబ్బంది నియామకం జరుగుతూనే ఉంది. జీతాలు చెల్లించే పరిస్థితి లేక ఖాళీ స్థలాలు అమ్ముకుంటున్న సంస్థను ఈ కొత్త కొలువులు పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఈ వ్యవహారానికి కారణం ప్రజాప్రతినిధులే. తమ అనుచరులకు వారు ‘స్వగృహ’లో ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు. ఈ కార్పొరేషన్లో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకే పనీ లేదు. దానికితోడు కొత్తగా వస్తున్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక.. ఏదో ఓ పేరుతో పోస్టు ఇస్తున్నారు. వీరి జీతాల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము వృథా అవుతోంది. కనీసం ఒక్కరోజు కూడా ఫీల్డ్‌కు వెళ్లే పనిలేకున్నా కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా చెలామణి అవుతున్నారు. సిఫారసు చేసిన ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి ఈ ‘కొత్త’ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేసి పదవీవిరమణ పొందిన కొందరికి నెలకు రూ.18 వేల నుంచి రూ.25 వేలు చెల్లిస్తున్నారు. ఫోన్ బిల్లు, పెట్రోలు భత్యం కూడా ఇవ్వడం గమనార్హం. అమ్మకాలు నిలిపేశాక మార్కెటింగ్‌లో కొలువులు: గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కొత్త ధరలు ఖరారు చేసే ఉద్దేశంతో ఇళ్ల అమ్మకాలు నిలిపివేయాలని నాటి ఎండీ ఆదేశించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచింది. అయితే ఇళ్ల అమ్మకం వద్దనుకున్నప్పుడు మార్కెటింగ్ విభాగంలో సిబ్బంది నియామకం ఎందుకో అధికారులకే తెలియాలి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన ఓ ఎంపీ, నల్లగొండకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీల సిఫారసుతో ముగ్గురికి ‘స్వగృహ’లో ఉద్యోగాలిచ్చారు. -
ఇంకా ఉన్నాయ్!
పనులు చేయకుండా బిల్లులు మాయం కేసు... తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు కుత్బుల్లాపూర్: పనులు చేయకుండానే బిల్లులు మింగిన బాగోతానికి సంబంధించి తవ్వినకొద్దీ అవినీతి కాంట్రాక్టర్ల జాబితా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ కార్యాలయం వేదికగా రూ.46 లక్షల విలువైన 24 పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మాయం చేసిన విషయమై జూలై 6న ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లు, సహాయ కాంట్రాక్టర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నార్త్‌జోన్ కార్యాలయంలో పనిచేసే ఆడిటర్లపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లను జూలై17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అరెస్టు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. తాజాగా శుక్రవారం అందరికీ బెయిల్ మంజూరైనట్టు తెలిసింది. తాము పనులు చేయకుండా కాజేసిన నిధులను జూలై 31లోగా వెనక్కి ఇస్తామని కోర్టుకు చెప్పిన కాంట్రాక్టర్లలో ఐదుగురు సంబంధిత మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. మరో ఇద్దరు సగం చెల్లించి.. మిగతా మొత్తానికి 15 రోజుల గడువు కావాలని కోర్టును అభ్యర్ధించారు. వెలుగు చూస్తున్న అక్రమాలు పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన సంఘటనలో మరో ఇద్దరు పాత్రధారులుగా తేలారు. ఈమేరకు సంబంధిత అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కు చెందిన బి.లక్ష్మణ్ జగద్గిరిగుట్ట డివిజన్లో రూ. 2.30 లక్షలు విలువ చేసే పనులను చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించారు. మరో కాంట్రాక్టర్ రూ.62 వేలు తీసుకున్నట్లు జీడిమెట్ల పోలీసులకు తాజాగా ఇంజినీరింగ్ అధికారులు ఫిర్యాదు చే శారు. -
స్తంభించిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఆయా ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, సిబ్బందిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తీసుకోవాలని, కనీస వేతనంతో పాటు జీవిత బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ ఆరోగ్య మిత్ర, నెట్వర్క్ ఆస్పత్రి మిత్ర, టీమ్ లీడర్స్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. నిలిచిన సేవలు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో కీలకమైన నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, యశోద, కిమ్స్, సన్‌షైన్, కేర్, అపోలో తదితర ఆస్పత్రుల్లో సేవలు స్తంభించిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, గుండెపోటు బాధితులకు ఉచిత వైద్య సేవలకు ఆస్పత్రులు నిరాకరించడంతో వారికి నరకయాతన తప్పలేదు. ఆరోగ్యశ్రీలో సమ్మె ప్రభావం లేదు ఆరోగ్యశ్రీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె ప్రభావం సంస్థపై లేదని ఆరోగ్యశ్రీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిరంతరాయంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగులు సమ్మెను కొనసాగించినప్పటకీ ఎలాంటి అంతరాయం ఏర్పడదన్నారు. సమ్మె జరిగినప్పటికీ శనివారం రాష్ట్రంలో 421 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. 296 మంది ఇన్ పేషెంట్లుగా చేరారన్నారు. -
చెత్త ఫైటింగ్
కార్మికుల మధ్య తోపులాట నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పారిశుధ్య విధుల్లో డ్వాక్వా మహిళలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కార్మికుల మధ్య ‘చెత్త’ ఫైటింగ్ ఆరంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిపై విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలతో ఔట్సోర్సింగ్ సిబ్బంది వాదనకు దిగారు. మా పొట్టలు కొట్టొద్దంటూ విన్నపాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ససేమిరా అనడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి. కృష్ణలంక, లంబాడీపేట, కుమ్మరిపాలె ం, పాయకాపురం, పటమట ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మల్లికార్జునపేటలో కార్మికుల మధ్య వివాదం ముదరడంతో ప్రజారోగ్య శాఖాధికారులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్వాక్వా మహిళల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. ఫలిస్తున్న ప్రయత్నాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కమిషనర్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. డ్వాక్వా మహిళలు పారిశుధ్య విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్కిల్-1లో 102, 2-లో 130, 3-లో 60 మంది చొప్పున కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎన్సీసీ విద్యార్థులు వీధులను శుభ్రపరిచారు. కార్మిక సంఘాల అత్యవసర భేటీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు సాగించడంపై ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రెస్‌క్లబ్‌లో అత్యవసర భేటీ నిర్వహించారు. సమ్మె సెగను మరింత రగిలించాలని నిర్ణయించారు. గురువారం నుంచి నగరంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 17న సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటన్నారు. పోలీసు కేసులకు వెరచేది లేదని స్పష్టం చేశారు. -
‘ఫోర్జరీ’ ఉదంతంపై కదలిక!
చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం విచారణతో వెలుగులోకి వస్తున్న కాంట్రాక్టర్ల మాయాజాలం జోనల్ కార్యాలయమే వేదికగా తతంగం ఇంజనీరింగ్ అధికారులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష ఏడుగురు కాంట్రాక్టర్లు.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు కుత్బుల్లాపూర్: కాంట్రాక్టర్లు బరి తెగించి ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసుకున్న విషయంపై ‘సాక్షి’ లో సోమవారం ప్రచురితమైన ‘ఫోర్జరీ పనులు’ కథనం కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్-15 ో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడుగురు కాంట్రాక్టర్లు, ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా గోప్యంగా జరుగుతున్న ఈ తంతు ఎట్టకేలకు వెలుగులోకి రావడంతో ఇంజనీరింగ్ అధికారులు పరుగులు పెట్టారు. సోమవారం ఉదయమే కార్యాలయానికి చేరుకున్న అధికారులు సంబంధిత ఏడుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, వారు డ్రా చేసిన చెక్కుల వివరాలను తయారు చేసే పనిలో పడ్డారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సిద్ధం చేసుకుని, సాయంత్రం గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు నివేదించినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు నార్త్ జోన్ కార్యాలయం అకౌంట్స్ సెక్షన్ వేదికగా చేసుకుని ఈ తతంగాన్ని నడిపారు. క్రిమినల్ కేసులు ఫోర్జరీ సంతకాలతో చేయని పనులకు బిల్లులు తీసుకున్న విషయాన్ని గుర్తించిన సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, ఏఈఈ లక్ష్మికాంత్‌రెడ్డిలు ఈ నెల 3వ తేదీన ఏడుగురు కాంట్రాక్టర్లు మాధురి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్, రాజు, సుధీర్, వేణుగోపాల్, రేక్యా నాయక్‌లతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది లింగయ్య, విజయ్, ఉపేందర్రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరిపై ఐపీసీ సెక్షన్ 120బి, 379, 420, 467, 468ల కింద కేసులు నమోదు చేసినట్లు జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ ‘సాక్షి’ కి తెలిపారు. అదేవిధంగా ఫోర్జరీకి పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ కమిషనర్ సమీక్ష సాక్షిలో వచ్చిన కథనం గ్రేటర్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోమవారం సాయంత్రం ఎస్ఇ కిషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, హెచ్డి రమేష్, ఏఈలు భానుచందర్, లక్ష్మికాంత్‌రెడ్డి, రామచంద్రరాజులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. 2013-14, 15 సంవత్సరాల్లో టెండర్ల ద్వారా పనులు దక్కించుకుని కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లను ఎందుకు గుర్తించలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు, అలాగే విషయాన్ని రాష్ర్ట విజిలెన్స విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
ఇలా.. మొదలైంది..!
► హెచ్ఎండీఏలో డెప్యుటేషన్లకు చెక్ ► 77 మంది మాతృసంస్థలకు బదిలీ ► 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు బాధ్యతలు స్వీకరించిన శాలిని మిశ్రా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొత్త కమిషనర్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9.30 గంటలకు ఆమె కమిషనర్ సీట్లో ఆసీనులయ్యారు. కొత్త కమిషనర్‌ను కలిసి అభినందించేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆసక్తి చూపారు. ఆమె ఎవరినీ అనుమతించకపోవడంతో పుష్పగుచ్ఛాలతో వచ్చిన పలువురు అధికారులు ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. కమిషనర్ వచ్చీరాగానే ప్రక్షాళన ప్రారంభించడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది. అవసరానికి మించి అధికంగా ఉన్నారన్న కార ణాన్ని చూపుతూ 47 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు నిబద్ధతతో పనిచేస్తున్న వారూ ఉన్నారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క కలం పోటుతో ఉద్యోగం నుంచి తప్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కొత్త కమిషనర్ వచ్చీ రాగానే చిరుద్యోగులమైన తమపై కొరడా ఝుళిపిస్తారని ఊహించలేదని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఘొల్లుమంటున్నారు. మలి దశలో మరికొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్వాసనకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లానింగ్ విభాగంలోని పలువురు అవినీతి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి... కష్టపడి పనిచేస్తున్న తమను బదిలీ చేయడం ప్రభుత్వ పెద్దల దుర్ణీతికి అద్దం పడుతోందని డెప్యూటేషన్‌పై వచ్చిన కొంతమంది అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అదనపు బాధ్యలు ఇలా... హెచ్ఎండీఏలో పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ, మెంబర్ ఎస్టేట్, ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలాజీ రంజిత్ ప్రసాద్‌ను మాతృశాఖ రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. ఆ బాధ్యతలను ఎస్టాబ్లిష్మెంట్ విభాగం డీఏఓ ఎం.సరస్వతికి అదనంగా అప్పగించారు. మహా నగరాభివృద్ధి సంస్థకు గుండెకాయ లాంటి అకౌంట్స్ విభాగం సీఈఓ నరసింహన్‌ను మాతృసంస్థకు బదిలీ చేశారు. అదే విభాగంలో డీఏఓ-1గా పనిచేస్తున్న డి.విజితకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సీపీఓగా వి.ధీరజ్‌కుమార్‌కు, డెరైక్టర్ ప్లానింగ్-1 గా డి.యాదగిరిరావుకు, అడిషనల్ డెరైక్టర్‌గా కె.వికాస్, పీఓలుగా కల్పక కౌది, గోపికా రమ్యలకు బాధ్యతలు అప్పగించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో ప్రధానమైన ఓఎస్డీ, డెరైక్టర్ అర్బన్‌ఫారెస్ట్రీ, అసిస్టెంట్ డెరైక్టర్ 1, 2 పోస్టులను బీపీపీ మెంబర్ ఎన్విరాన్మెంట్ బి.చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారు. హెచ్ఎండీఏ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్ల బాధ్యతను శ్రీనివాసాచారికి, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్స్ పోస్టులను ఏఓ డి.సుధాకర్, ఎం.ఎస్.ఎన్.మూర్తికి అదనంగా అప్పగించారు. భూ విభాగంలోని తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దారులు, సూపరింటెండెంట్ల పోస్టులకు ఇన్చార్జిలను నియమించారు. -
అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై బదిలీ వేటు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొమ్మనలేక పొగ పెట్టినట్లు.. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని జిల్లా అధికారులు మూకుమ్మడిగా బదిలీ చేశారు. వాస్తవానికి వీరికి బదిలీలు ఉండవు, ఎక్కడ నియమిస్తే అక్కడే విధులు నిర్వర్తిస్తారు. సంబంధిత కాంట్రాక్టర్ వారికి జీతాలు చెల్లిస్తారు. అయితే టీడీపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖలో 2004 నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ అపరేటర్లలో 53 మందిని దూరప్రాంతాలకు ఆకస్మికంగా బదిలీ చేసింది. దీని వెనుక జిల్లా మంత్రి, ఆయన ఓఎస్డీ, కొందరు అధికారుల కుట్ర ఉందని సదరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చేదే అరకొర జీతం.. అది కూడా పది నెలలుగా మంజూరు కాలేదు, అయినా నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కార్యాలయాల్లో ఉంటూ కష్టపడుతున్న తమను బదిలీ చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. జీతాలు చెల్లించే విషయంలో చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు బదిలీల పుణ్యం కట్టుకున్నారని ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అయిన చోటుకు వెళ్లని వారిని ఆ సాకుతో తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు మంత్రి, ఆయన ఓఎస్డీ ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అందుకే నిబంధనలు లేకపోయినా దూరప్రాంతాలకు బదిలీ చేశారని అంటున్నారు. ఎప్పుడో వచ్చే అరకొర జీతాలతో దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. మీరు చేరకపోతే.. కొత్తవారు వస్తారని ఇప్పటికే కొందరు తహశీల్దార్లు వ్యాఖ్యానించడాన్ని బట్టి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించమని వారిపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల తోపాటు కలెక్టరేట్లో మొత్తం 64 మంది అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. కలెక్టరేట్లో పనిచేస్తున్న వారు మినహా మిగతా 53 మందిని బదిలీ చేశారు. ఈ బదిలీల తీరును కొందరు టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. -
ఏడాదిగా జీతాల్లేవ్!
పాలకొండ: అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాకిరీ తప్ప చిల్లిగవ్వ అందడంలేదు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి గత 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. పైగా వేతనాలు అడిగితే సాగనంపుతామని అధికారులు భయపెడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బందిని నియమించారు. 2008లో అవుట్ సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) పరిధిలో వీరిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో 64మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వెబ్ ల్యాండింగ్, మీ-సేవ, భూ వివరాల నమోదు వంటి కీలక కార్యకలాపాలకు వీరినే వినియోగిస్తున్నారు. ఈ శాఖలోని రెగ్యులర్ సిబ్బందికి కంపూటర్లపై అంతగా అవగాహన లేకపోవడంతో వీరే కీలకంగా మారారు. మీ సేవ ధ్రువపత్రాల జారీలోనే వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 12 నెలలుగా..... అన్ని పనులకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందినే వినియోగించుకుంటున్న అధికారులు వారికి వేతనాలు చెల్లించడంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ప్రతి వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చూడటం, తీరా అవి అందకపోవడంతో ఉసూరుమనడం.. మళ్లీ అదే ఆశతో కాలం వెళ్లదీయడం తమకు నిత్యకృత్యంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, 12 నెలలు దాటిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించామని తెలిపారు. బెదిరింపులు మొదలు... వేతనాలు ఇవ్వకపోగా ప్రస్తుతం వీరికి బెదిరింపులు మొదలయ్యాయి. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమావేశం నిర్వహించి విధులు భహిష్కరించాలని యోచించారు. అయితే ఉన్నతాధికారులు వీరిని హెచ్చరికలతో భయపెట్టారు. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో నిరసన తెలియజేస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. -
వర్సిటీలకు నిధులు పెంచాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది (టూటా)ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉద్యోగుల, అధ్యాపకుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టారు. యూనివర్సిటీలకు ఏకమొత్తంలో విడుదల చేసే నిధులు(బ్లాక్ గాంట్స్) పెంచాలని, వర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులందించి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, ప్రధానకార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలకు నిధు లు భారీగా పెరుగుతాయని ఆశించామన్నారు. అయితే గత ప్రభుత్వాల వలనే అరకొర నిధులతో సరిపెట్టారని విమర్శించారు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్లను నియమించాలన్నారు. నాన్-టీచింగ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభు త్వ ట్రెజరీ నుంచి వర్సిటీల ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడు తూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టూటా ఉపాధ్యక్షులు మమత, పున్నయ్య, జాన్సన్, ఇక్బాల్ ఖురేషీ, సాయాగౌడ్, విజ యలక్ష్మి, టీచింగ్, నాన్-టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మూగ రోదన!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు రాకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడంతో ఈ శాఖలో కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. దీనికి తోడు టీడీపీ నేతల అనుచరులను నియమిం చేందుకే ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను ప్రభుత్వం తొలగించిందని బాధిత ఉద్యోగు లు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలో పశుసంవర్థక శాఖలో ఒక జేడీతోపాటు డీడీ ఒకరు, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో 16 మంది ఏడీలు (పాలన/వైద్యం), 60 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 300 మంది పారా వెట ర్నరీ అధికారులు పని చేస్తున్నారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 54 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. జూలై 31తో గడువు ముగిసిపోగా వచ్చే డిసెంబర్ వరకు అన్ని విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది పదవీ కాలం పొడిగించినా పశుసంవర్థక శాఖలో మాత్రం అది అమలు కాలేదు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే పశుసంవర్థక శాఖ సిబ్బందికి రెన్యూవల్ చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ వారిని నియమించుకునేందుకు మంత్రి ఈ చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇదే విషయమై పలుమార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేసి వినతి పత్రాలు అందిం చినా అధికారులు స్పందించలేదని ఆవేదన చెందుతున్నారు. పాలనా సమస్యలు పశుసంవర్థక శాఖలో ఇప్పుడు కొత్తగా మరో సమస్య ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందితో పాటు పాలనాపరమైన సిబ్బంది, పశువులకు వైద్యం చేసే సిబ్బంది ఉంటేనే ఆ శాఖకు వైభవం. అయితే జిల్లాలో సరిపడా సాంకేతిక సిబ్బంది ఉన్నా, ఇతర విభాగాల సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. జూనియర్ అధికారుల భర్తీ కూడా ఇప్పట్లో జరిగేలా లేదని అధికారులే చెబుతున్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల్ని సకాలంలో నియమించకపోతే పశువైద్యానికి తిప్పలు తప్పవని కూడా చెబుతున్నారు. కనీస సౌకర్యాల కల్పన కూడా గగనంగా మారింది. చాలాచోట్ల సిబ్బందికి రవాణా భత్యం చెల్లించకపోవడంతో స్థానిక వైద్యులే వారి జీతాల నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా వైద్యశాలల కంప్యూటరీకరణలో భాగంగా కంప్యూటర్లు కేటాయించినా, ఆపరేటర్లను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జేడీల సమీక్షలో చెప్పినా.. పశుసంవర్థకశాఖ ఇబ్బందులపై ఇటీవల రాష్ట్రస్థాయిలో జాయింట్ డెరైక్టర్ల సమీక్ష నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆయా జిల్లాల జేడీలు పూసగుచ్చినట్టు నివేదికల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. పశువైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్లే కీలకం. అయితే ఈ పోస్టులు 50 శాతం వరకు ఖాళీ అయ్యాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని కోరినా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది పరిస్థితీ అయోమయంగా మారింది. వీళ్లను క్రమబద్థీకరించాల్సి ఉన్నా సాకులు చూపి సర్కార్ తప్పించుకుంటోందని ఆయా విభాగాల సిబ్బందే వాపోతున్నారు. ‘గోపాలమిత్ర’లే ఆధారం కృత్రిమ గర్భోత్పత్తి, ప్రాథమిక చికిత్స కోసం పశువైద్యశాలలు లేనిచోట ప్రభుత్వం ‘గోపాలమిత్ర’ను ప్రవేశపెట్టింది. అధికారులు, సిబ్బంది సలహా మేరకు అనుభవం ఉన్న ప్రైవేట్ సిబ్బందే పశువులకు వైద్యం చేయడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. సదుపాయాలు లేని చోట్ల పశువులకు వైద్యం అందించి తద్వారా గౌరవ వేతనం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశు సంవర్థక శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో చాలా ప్రాంతాల్లో ‘గోపాలమిత్ర’లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇవీ ఇబ్బందులు జేడీ పోస్టులో ఇతర జిల్లాలకు చెందిన, రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారిని నియమించడంతో అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో 21 వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ల(వీఎల్ఎస్వో)కు గాను ఐదుగురే ఉన్నారు. 41 జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకు గాను 28 మందే ఉన్నారు. 64 లైవ్‌స్టాక్ ఆఫీసర్లకు గాను 61మందే ఉన్నారు. 57 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులుండగా ప్రస్తుతం 13మందే ఉన్నారు. ఉన్న ఒక్క ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. 13 వీవీఏ పోస్టులకు గాను ఐదుగురే విధులు నిర్వహిస్తున్నారు. రెండు ఎన్యూమరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 164 అటెండర్ పోస్టులుండగా 113 మందే ఉన్నారు. -
బాబొచ్చాడు.. జాబు పోయింది
గృహ నిర్మాణ శాఖలో 3 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం సాక్షి విజయవాడ బ్యూరో : బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీఎం పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నారు. ఇప్పటికే డ్వామాలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సర్కారు ఇంటికి పంపింది. తాజాగా గృహ నిర్మాణ శాఖలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు 2006 నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీరు పనిచేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన లక్షలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించేందుకు వీరిని నియమించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు నెలకు రూ. 7,500 నుంచి రూ. 8,500 వరకు, అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ. 12 వేల చొప్పున జీతం ఇచ్చేవారు. ఏడాదికోసారి వీరి ఉద్యోగాలను పొడిగిస్తూ వచ్చారు. వాస్తవానికి వీరందరికీ జూన్ 30వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగిసింది. జూలై 31వ తేదీ వరకు వీరిని కొనసాగించింది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు తమను కూడా క్రమబద్ధీకరిస్తారని వీరంతా ఆశపడ్డారు. అయితే చంద్రబాబు వీరిని ఇంటిబాట పట్టించే పని మొదలు పెట్టారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయించడంపై టీడీపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. ఈ ఏడాది మార్చి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే ఆలోచన కూడా చేయడం లేదు. దీంతోపాటు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖలో సుమారు 3 వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.