photographer
-
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నో అంటే నో: తాప్సీ
‘‘నేను నటిని మాత్రమే. పబ్లిక్ప్రాపర్టీని కాదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ (2010) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు. వరుస హిందీ సినిమాలతో దూసుకెళుతున్న తాప్సీ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం ఉత్సాహం చూపుతుటాంటారు.ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట. అయితే అందుకు ఆమె నో అంటే నో చెప్పారు. ‘‘నేను నటిని మాత్రమే.. పబ్లిక్ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో అని చెబితే వారి అభి్రపాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావ్? అని కామెంట్ చేయొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి... అందుకే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. -
అలాంటి డ్రెస్ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతానన్నాడు: హీరామండి నటి
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా తన కెరీర్లో ఎదురైన పలు సంఘటలను గుర్తు చేసుకుంది. 90వ దశకంలో బాలీవుడ్లో మహిళా నటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించింది. ఒక ఫోటోగ్రాఫర్‌తో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది.మనీషా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ప్రారంభంలో నన్ను చాలామంది ఫోటోషూట్లు అడిగేవారు. ఒకసారి నేను అమ్మతో కలిసి ఫోటోషూట్‌కు వెళ్లాను. అక్కడే ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను నువ్వే తర్వాతి సూపర్‌స్టార్ అని నాతో అన్నాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు రెండు పీసుల బికినీ తెచ్చి ధరించమని అడిగాడు. అప్పుడు నేను బీచ్‌కి వెళ్లినప్పుడు, ఈత కొట్టేటప్పుడు మాత్రమే ఇది వేసుకుంటాను. కానీ ఇలాంటి వాటితో సినిమాల్లోకి రావాలనుకోవడం నాకు ఇష్టం లేదు. దీంతో బికినీ ధరించను అని చెప్పా. పూర్తి దుస్తులతోనే ఫోటోలు తీయమని సూచించా. ఆ తర్వాత అతను నాకు ఓ డైలాగ్ చెప్పాడు. నేను పెద్దస్టార్ అయ్యాక తానే నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు' అని వెల్లడించారు.కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది. -
నా భార్యాకుమారుడిని చేరదీయండి
ఖమ్మంక్రైం: ‘మానస నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న నీకు తోడగా ఉండాల్సింది పోయి వెళ్తున్నా.. మన కుమారుడు నమన్రెడ్డిని జాగ్రత్తగా చూసుకో.. నాన్నా(కుమారుడిని ఉద్దేశించి) నీ చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సి ఉన్నా చేయి విడిచిపెట్టి పోతున్నాను. నన్ను క్షమించండి. అమ్మ, అక్క, తమ్ముళ్లు, అత్తయ్య, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు మీరంతా నా కొడుకు, భార్యను జాగ్రత్త గా చూసుకోండి. నాపై కోపం ఉంటే వారిపై చూపకుండా చేరదీసి ఆదుకోండి’ అంటూ లేఖ రాసిన ఓ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఎరసాని శ్రీనివాస్‌రెడ్డి(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ భార్య మానస, కుమారుడు నమన్రెడ్డితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన లోన్‌యాప్‌లు, క్రెడిట్‌కార్డుల ద్వారా తీసుకున్న అప్పులు పెరిగి తీర్చలేని పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యాన కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకుని లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఆయనకు టీ ఇవ్వడానికి వెళ్లిన సిబ్బంది ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా శ్రీనివాస్‌రెడ్డి ఉరి వేసుకుని కనిపించాడు. ఆయన వద్ద లభించిన లేఖ, చిరునామా ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, అప్పులు పెరగడంతో తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడగా, శ్రీనివాసరెడ్డి తన భార్య, కుమారుడిని విడిచిపెట్టలేక సంఘర్షణకు గురైనట్లు లేఖ ద్వారా తెలియడంతో చదివిన వారంతా కంటతడి పెట్టారు. కాగా, ఆయన మృతదేహాన్ని అన్నం ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టుటౌన్ ఎస్ఐ రఫీ తెలిపారు. -
అహో!
వీడియో వైరల్ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ మార్క్ స్మిత్ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్–అప్ షాట్ ఇది.కెమెరామన్‌గా మార్క్ స్మిత్ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్ వీడియో 124 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్‌గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
ఆ బ్యూటిఫుల్ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్ ఎంతో తెలుసా?
Anant-Radhika pre wedding: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్‌లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అప్డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్ ఈయనే. ఇంత ఫేమస్ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్‌ను ఎంచుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం. -
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!? -
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్సీపీ బ్యాన్‌చేసి ప్రెస్మీట్లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాడులకు వారే బాధ్యత వహించాలి.. ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు. -
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
మిస్సింగ్ కాదు మోసం.. ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు. రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్‌ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్‌ను తన భార్య నవ్యశ్రీ ఫోన్‌కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కోడూరు వంతెన సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు.. ఆదినారాయణ బైక్‌తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్ఢీఆర్ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ.. ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్‌పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్‌ఫోన్‌ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్‌ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పట్టించేందుకు.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఐ చెప్పారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
పెళ్లిలో ఫొటోగ్రాఫర్ స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా..!
ఎక్కడైనా ఫొటోగ్రాఫర్ అంటే వేడుకల్లో మంచి స్టిల్స్ తీస్తూ బిజీగా ఉంటాడు. తనపని తాను చేసుకుంటూ ఫంక్షన్లో సందడిని చూస్తుంటాడు. కానీ ఫొటోగ్రాఫర్ ఏకంగా డ్యాన్సులు వేస్తే..? ఫొటోలు ఎవరు తీస్తారనే ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే రెండు పనులను ఒంటి చేత్తే చేసేశాడు మీరు ఇప్పుడు చూడబోయే ఫొటోగ్రాఫర్. పెళ్లికి బంధువులంతా గుమికూడారు. ఇంట్లో సందడి బాగా నెలకొంది. ఆ సందడిని మరింత పెంచాడు పెళ్లికి వచ్చిన ఫొటోగ్రాఫర్. బంధువులతో పాటు కలిసి చిందులు వేశాడు. ఓ వైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు వీడియోలు తీశాడు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అతనితో పాటు కలిసి స్టెప్పులు వేశారు. if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5 — Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లోనే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ డ్యాన్సుకు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డ్యాన్సు చేస్తూ ఫొటోలు తీసినందుకు అతన్ని మెచ్చుకున్నారు. అతను తీసిన ఫొటోలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందంటూ మరో యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ.. లద్దాఖ్‌లో బైక్ టూర్.. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
చంటిపిల్లలతో ఏదైనా పనిచేయించాలంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకువస్తుంటుంది. అదొక పెద్ద టాస్క్‌లా మారిపోతుంది. చిన్నపిల్లలకు హెయిర్ కటింగ్ చేయించాలన్నా, ఇంజక్షన్ చేయించాలన్నా, ఫొటో తీయాలన్నా అది పెద్దలకు శక్తికి మించిన పనిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏడుపునకు దిగితే ఇక తల్లిదండ్రుల తల పట్టుకోవాల్సిందే. అయితే ఇటువంటి సమయంలో ఒక తండ్రి అనుసరించిన పద్దతి ఎంతో చక్కగా ఉన్నదంటూ, అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించాలనుకున్నాడు. అయితే అతని కుమార్తె ఫొటోకు అనుగుణంగా కుర్చీలో కూర్చొనేందుకు సహకరించ లేదు. ఆ చిన్నారి కుర్చీలో కూర్చుంటేనే ఫొటో తీయగలనని ఫొటోగ్రాఫర్ అన్నాడు. దీనికి అతని తండ్రి సమాధానమిస్తూ తన కుమార్తె తన చంకలో నుంచి దిగడం లేదని, కుర్చీలో కూర్చొనేందుకు సహకరించడం లేదని తెలిపాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? ఫొటోగ్రాఫర్ అడగగా, నా దగ్గర ఒక ఐడియా ఉందని తండ్రి సమాధానమిచ్చాడు. కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రికి వచ్చిన ఐడియా ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తన కుమార్తెకు ఫొటో తీయించేందుకు ఆ తండ్రి కుర్చీలో కూర్చుని, తనపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆ చిన్నారికి ఫొటో తీశారు. దీనికి సంబంధించిన ఫొటో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన యూజర్స్ తండ్రి అనుసరించిన టెక్నిక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ‘మీ అమ్మాయి ఎంతో ముద్దొస్తోంది. మీరు ఎంతో తెలివైనవారు’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘నా కుమారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కూడా ఇలానే తీయాల్సి వచ్చిందని’ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..! Passport worker - We're gonna need the baby to sit on the chair for the photo. Dad - She won't let me put her down. Passport worker - You're gonna need to figure something out if you want a passport picture. Dad - I got an idea... pic.twitter.com/cx9sm5EsBl — Yair Menchel (@yairmenchel) July 20, 2023 -
పర్ఫెక్ట్ టైమింగ్: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫొటో కోసం 7 గంటల శ్రమ ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్ పార్కులో కనిపించింది. పాల్ గోల్డ్ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్ రాశారు. ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్ కంటపడింది. ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు! -
కృత్రిమ మేధ కళలకు వధ?
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు క్లౌడిమోనెట్ ‘వాటర్ లిల్లీస్’ పేరిట రూపొందించిన 250 చిత్రాలు పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న సరస్సులో లిల్లీపూల స్ఫూర్తిగా ఆయన వీటిని చిత్రించారు. వాటర్ లిల్లీస్లోని ఒక చిత్రం 2007లో సోత్బే వేలంలో 1.85 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. తరువాతి సంవత్సరం లండన్ క్రిస్టీ వేలంలో మరో చిత్రం 4.1 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. మోనెట్ చిత్రించిన వాటర్ లిల్లీస్ను ఓ మంచి ఫొటోగ్రాఫర్ అంతే అందంగా కొన్ని క్షణాల్లో కెమెరాలో బంధించగలడు కానీ వాటికి ఉండే విలువెంత? దొడ్డ శ్రీనివాసరెడ్డి : 19వ శతాబ్దంలో లాండ్ స్కేప్ ఆర్టిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఫొటోలను సృజనాత్మక కళగా గుర్తించగలమా అన్నది నాటి కళాకారుల ప్రశ్న. కానీ తదుపరి కాలంలో ఫొటోగ్రఫీ కూడా కళగా అవతరించింది. ఫొటోలు కూడా వందల కోట్ల డాలర్లు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కళాకారుల మనుగడనే ప్రశ్నించే మరో ముప్పు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో వచ్చి పడింది. ఏళ్లకు ఏళ్లు చేసిన సాధన ద్వారా కళాకారులు సాధించిన నైపుణ్యాన్ని కృత్రిమమేధ క్షణాల్లో అనుకరిస్తోంది. నమూనాలను సృష్టిస్తోంది. కృత్రిమమేధ ఇకముందు కళలకు సమాధి కడుతుందా? మనిషి సృజనాత్మకతతో పోటీపడుతుందా? కారుచౌకగా ఏఐ కళారూపాలను సృష్టిస్తుంటే అసలు కళలకు ఆదరణ ఉంటుందా? ఏఐ రూపొందించే కళలకు విలువ ఉంటుందా? అన్నవి ఇప్పుడు కళా ప్రపంచంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమమేధ ఇక సృజనాత్మక కళారంగాలనూ కబ్జా చేస్తుందని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమమేధ ఆధారంగా చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ సృష్టించిన సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన మరో ప్లాట్‌ఫామ్ డాల్–ఇ. ప్రఖ్యాత ఫ్రెంచ్ సర్రియలిస్ట్ పెయింటర్ సాల్వడార్ డాలీ పేరును పోలినట్లుగా ఉండే ఈ డాల్–ఇ ప్లాట్‌ఫామ్ కృత్రిమమేధను ఉపయోగించి అద్భుతమైన డిజిటల్ పెయింటింగ్స్‌ను సృష్టిస్తోంది. డాల్–ఇ మాదిరిగానే మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి మరికొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిత్ర కళారంగంలో చొరబడి సంచలనం సృష్టిస్తున్నాయి. హేగ్ మ్యూజియంలో ఉన్న జొనెస్ వెర్మర్ అద్భుత కళాఖండం ‘గర్ల్ విత్ ఎ పెరల్ ఇయరింగ్’ స్ఫూర్తిగా జులియన్ వాన్ డైకెన్ అనే ఆర్టిస్టు మిడ్ జర్మీ ప్లాట్‌ఫామ్‌పై కృత్రిమమేధను వినియోగించి రూపొందించిన ‘ఎ గర్ల్ విత్ గ్లోయింగ్ ఇయరింగ్స్’ చిత్రాన్ని ఆమ్స్టర్డామ్లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టినప్పుడు చిత్ర కళారంగంలో అలజడి రేగింది. కంప్యూటర్ సృష్టించిన చిత్రాన్ని కళాఖండంగా ఎలా పరిగణిస్తారని ఆర్టిస్టులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. ప్రింటింగ్, పబ్లిషింగ్ పరిశ్రమ కూడా ఇప్పుడు కృత్రిమమేధను ఆశ్రయించి కవర్ డిజైన్స్ రూపొందిస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ ఇప్పుడు తన కవర్ డిజైన్ల సృష్టికి కృత్రిమమేధపై ఆధారపడుతోంది. అనేకమంది రచయితలు తమ నవలలు, పుస్తకాల కవర్ డిజైన్ల కోసం కృత్రిమమేధను ఉపయోగిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా అద్భుతమైన కట్టడాలు, డామ్లు, స్టేడియాలు, గార్డెన్ల డిజైన్ల రూపకల్పనకు కృత్రిమమేధను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలోకీ కృత్రిమమేధ అడుగుపెట్టింది. ది ఫ్యాబ్రికెంట్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనూహ్యమైన వ్రస్తాలు, ఆభరణాల డిజైన్లను ఏఐతో సృష్టిస్తున్నాయి. ఇవి ధరించడానికి పనికి రావు కానీ డిజిటల్ రూపంలో వర్చువల్‌గా వీటిని ధరించి ఆనందించవచ్చు. అయితే వీటిని పొందడానికి మాత్రం ‘నిజమైన’ ధర చెల్లించాల్సిందే. కొన్ని వ్రస్తాల డిజైన్లు పదివేల డాలర్ల వరకు ఉన్నాయి. ఇటీవల బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న వారి ఫొటో ఒకటి ఆ్రస్టేలియాలో ప్రతిష్టాత్మకమైన ఫొటోగ్రఫీ పోటీల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫొటో కృత్రిమమేధ ఆధారంగా తయారుచేసిందని తెలిసి ప్యానెల్ జడ్జిలు ఈ చిత్రాన్ని తొలగించి వేరే ఫొటోను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం ఫలితంగా పోటీలను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి కంప్యూటర్ సృష్టించే ఫొటోలకు, మరొకటి కెమెరా ద్వారా తీసిన ఫొటోలకి. కదం తొక్కుతున్న కళాకారులు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులు ఏళ్ల తరబడి కృషితో సాధించిన నైపుణ్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్న కృత్రిమమేధపై కదం తొక్కుతున్నారు. కళా నైపుణ్యాన్ని కూడా ఆటోమేషన్ చేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, మ్యుజీషియన్లు తమ మనుగడను అంధకారంలోకి నెడుతోందని కృత్రిమమేధపై విరుచుకుపడుతున్నారు. కృత్రిమమేధ చొరబాటును అడ్డుకునేందుకు రకరకాల ఆయుధాలు సన్నద్ధం చేస్తున్నారు. శాన్ఫ్రాన్సికోకి చెందిన కార్టూనిస్టు సరా అండర్సన్, ఇల్ల్రస్టేటర్ కార్లో వోర్టిజ్ కాపీరైట్ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ బొమ్మలను అనుకరిస్తూ నకలు సృష్టిస్తున్న ఏఐ వేదికలు డ్రీమ్ అప్, మిడ్ జర్నీ, స్టేబుల్ ప్యూజన్పై వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా తమ బొమ్మలను వాడుకుంటున్నందుకు కాపీరైట్ చట్టం కింద శిక్షించాలని కోరారు. గుర్తింపు కావాలి ఏఐ ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రాంలు సొంతంగా ఏమీ సృష్టించలేవు. అవి సృష్టించే నకలుకి ఏదో ఒక అసలైన చిత్రమో, కళాకారులు లేదా రచయితల శైలి ఆధారం కావాలి. ఎలాంటి చిత్రం, ఫొటో, రచన కావాలన్నా ఎవరిశైలిలో కావాలన్నా కమాండ్ ఇస్తే వాటిని అనుసరించి కృత్రిమమేధ నకలును సృష్టించగలుగుతుంది. అలాంటప్పుడు వాటికి ఆధారమైన కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లకు తగిన రీతిలో పరిహారం చెల్లించడం, గుర్తింపు ఇవ్వాలనేది వారి వాదన. క్రిస్ కస్టనోవా అనే రచయిత్రి ‘జోర్యా ఆఫ్ ద డాన్’ పేరిట ప్రచురించిన కామిక్ నవలకు అమెరికా కాపీరైట్ ఆఫీసు తొలుత ఆమోదం తెలిపింది. అయితే ఈ కామిక్‌లో ఉపయోగించిన బొమ్మలు మిడ్‌జర్నీ ప్లాట్‌ఫామ్ ద్వారా సృష్టించినట్లు తరువాత వెల్లడైంది. దీనిపై వివాదం చెలరేగడంతో నవలలో కథకు మాత్రమే కాపీరైట్ ఇస్తున్నామని, కంప్యూటర్ సృష్టించిన బొమ్మలకు ఇవ్వలేదని కాపీరైట్ ఆఫీసు తన నిర్ణయాన్ని సవరించుకుంది. బొమ్మలు, కార్టూన్లు, చిత్రాలను కృత్రిమమేధ కాపీ కొట్టకుండా షికాగో యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ‘గ్లేజ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఉపయోగిస్తే, అది చిత్రాలపై కంటికి కనిపించని ఒక తెరను కప్పేస్తుంది. దాంతో కృత్రిమమేధ ఈ చిత్రాన్ని కాపీ కొట్టడం కుదరదు. ‘కృత్రిమమేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కొన్ని మార్గదర్శకాలు, ఆంక్షలు అవసరం’ అని గ్లేజ్ సృష్టికర్త స్వాన్షాన్ అభిప్రాయపడ్డారు. సహజీవనం తప్పదు కృత్రిమమేధ విస్తృతిని ఆపడం ఎవరివల్లాకాదు. అన్ని రంగాల్లోకి అది చొచ్చుకుపోతోంది. ఇక కృత్రిమమేధను మన జీవితాల్లోకి ఆహ్వా నించక తప్పదు. దాంతో సహజీవనానికీ మార్గం సుగమం చేసుకోవాల్సిందే అని విజ్ఞులు చెబుతున్నారు. సాల్వడార్ డాలీ సర్రియలిస్టు పెయింటింగ్స్‌ను, పికాసో అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను, బ్రాక్ క్యూబిజమ్ను మొదట్లో కళగా గుర్తించలేదు. కానీ ఇప్పుడవి అద్భుత కళాఖండాలుగా ఆవిష్కృతమయ్యాయి. కొత్తదనాన్ని స్వీకరించడానికి మనిషికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు కృత్రిమమేధ సృష్టించే కళారూపాల్ని ముందు ముందు మనం ఆమోదించి ఆహ్వా నిస్తామేమో?. -
'యూ ఆర్ వెరీ స్పెషల్'.. నిహారిక పోస్ట్ వైరల్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తాజాగా నిహారిక బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్ వెరీ స్పెషల్ అంటూ విషెస్ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరిఫ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది. కాగా.. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది. (ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్) -
ఫొటోగ్రాఫర్ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్‌ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్ రోడ్డులోని ఒక లే అవుట్లో ఆ ఫొటోగ్రాఫర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కొనిజాల సురేష్ (28) డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్ రోడ్డులోని ఓ లే అవుట్లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్‌తో కలిసి సురేష్ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనమైంది. విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్‌డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్కుమార్రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది. చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్‌డే పేరుతో! దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్ సీఐ పి. శివగణేష్ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు. -
పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత
పాలపుంత చిత్రాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డెరెక్, కొలరాడోలోని మరూన్ బెల్స్ పర్వతాల వద్ద తీశాడు. ఇంతకీ మానసిక చింతకు పాలపుంతకు కనెక్షన్ ఏమిటి అనే కదా మీ డౌట్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డెరెక్‌కు ఈ నక్షత్రాలే ఓదార్పునిచ్చాయట. డెరెక్‌కు ఆస్ట్రోఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది కాదట. 20 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత వ్యాధి వల్ల గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడేవాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడేవి. అలాంటి టైంలో వాటి నుంచి బయటపడటానికి, మనసును వేరేపని మీద లగ్నం చేయడానికి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆసక్తి పెరిగింది. తర్వాత ఓ రోజు తన కెమెరాను పట్టుకుని.. పాలపుంతల చిత్రాలను తీయడానికి బయల్దేరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రోఫొటోగ్రాఫర్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదీ చదవండి: LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి.. -
Shikha Khanna: నూరు తల్లుల కథ
31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. ఆ తల్లుల గాధలు అందరికీ తెలియాలి అని భావించిన ప్రసిద్ధ పోర్ట్రయిట్ ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా వందమంది తల్లుల ఫొటోలు, ఇంటర్వ్యూలతో ‘100 సెల్ఫ్పోర్ట్రయిట్స్ 100 డ్రీమ్స్’ పేరుతో పుస్తకం తెస్తోంది. ఈ సందర్భంగా వచ్చే వారం పూణెలో ఈ వందమంది తల్లులు ఒక వేదిక మీదకు రానున్నారు. ఈ ఘట్టం తల్లి గొప్పదనాన్ని చాటనుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే ఒక తల్లికి లడాఖ్‌లో డ్యూటీ. ఆ సమయానికి ఆమెకు రెండేళ్ల పాప ఉంది. దూరాన వదల్లేదు. లడాఖ్‌లో ప్రతికూల వాతావరణంలో పెంచడం రిస్క్. ఉద్యోగమా... మాతృత్వమా? ఏం... రెండూ ఎందుకు చేయకూడదు. ఆమె తన రెండేళ్ల కూతురిని లడాఖ్ తీసుకెళ్లింది. ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు కూతురిని పెంచింది. ఆ తల్లి ఆ సవాలును ఎలా స్వీకరించి దాటిందో ఆ కథ తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక తల్లి అంధురాలైన కళాకారిణి. అంధత్వంతో కళలో సాగడమే ఒక కష్టమైతే తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం ఇంకా కష్టం. కాని ఆ తల్లి ఆ బాధ్యతను నెరవేర్చింది. అందుకు ఏ యే ఇక్కట్లను దాటింది? ఆమె నోటి గుండా వింటే ఎంత బాగుంటుంది? ఒక తల్లి క్రీడల్లో కొనసాగాలి. దేశాలు తిరగాలి. మరోవైపు పిల్లలు. ఆటల కోసం వ్యాయామానికి, ప్రాక్టీసుకు సమయం ఇవ్వాలి. మరోవైపు పిల్లలకూ ఇవ్వాలి. ఎంత ఒత్తిడి. ఏదో ఒకటి ఎంచుకొని రెండోది వదిలేయకుండా రెంటినీ నిర్వహించడంలోనే ఆ తల్లి గొప్పదనం ఉంది. ఆ కథ లోకంలో ఎందరికి తెలుసు? తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. ఆ ఆలోచనతోనే ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా ‘ఎంయుఎం’ (మదర్స్ యునైటెడ్ మూవ్మెంట్) అనే ప్రాజెక్ట్ మొదలెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘100 సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ పుస్తకంలో తల్లుల జీవన గాథలు వారి మాటల్లోనే రికార్డు చేసింది. 31 దేశాల నుంచి 100 మంది తల్లులు– వారంతా తమ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు... వృత్తిలో విజయం సాధిస్తూనే తల్లిగా కూడా విజయం సాధించినవారు– తమ అనుభవాలను ఈ పుస్తకంలో చెప్పారు. భారతదేశం నుంచి అథ్లెట్ అశ్వినీ నాచప్ప, పారా అథ్లెట్ దీపా మాలిక్ తదితరులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి టీచర్లుగా, మ్యూజిక్ టీచర్లుగా, లైఫ్‌స్టయిల్ కోచ్‌లుగా, గాయనులుగా, హక్కుల ఉద్యమకారులుగా, చెఫ్‌లుగా, ఫొటోగ్రాఫర్లుగా వివిధ రంగాలలో కొనసాగుతున్న తల్లులు ఉన్నారు. ‘తల్లి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకం ఆమెను మరింత ఉన్నతంగా ఉంచుతుంది’ అంటుంది శిఖా ఖన్నా. స్వయంగా ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ అయిన శిఖా భారతదేశంలో న్యూబోర్న్ బేబీల ఫొటోగ్రఫీని తొలిగా ప్రవేశ పెట్టింది. దాదాపు 1000 ప్రముఖ కుటుంబాల ఫొటోలు తీసిందామె. అంతే కాదు యువతరం కోసం ఆన్లైన్లో ఫొటోగ్రఫీ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తను తల్లయ్యాక ఫొటోగ్రాఫర్/ తల్లిగా రెండు పాత్రలు పోషించడంలో తానెంత ఫోకస్డ్గా ఉండాల్సి వచ్చిందో అర్థమయ్యాక ఇలా పని చేసే తల్లుల కథలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి కదా అనిపించింది. పిల్లలు పుట్టగానే చాలామంది తల్లులు తమకు ఎంతో ఇష్టమైన వృత్తిని, ఉపాధిని, హాబీని వదిలేస్తుంటారు. అలాంటి వారు ఒక ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చిందామె. పూణెలో నవంబర్ 11 నుంచి 13 తేదీల మధ్య జరిగే ఈవెంట్లో ఈ 100 మంది తల్లులు వచ్చి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడనున్నారు. స్త్రీల మాతృత్వానికి, జీవన రంగానికి సంబంధించిన అనేక సెషన్స్ జరగనున్నాయి. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరగనుంది. ప్రధాని మెచ్చుకుని ఈ ఈవెంట్ విజయవంతం కావాలని సందేశం పంపారు. ఈ ఈవెంట్లో పాల్గొనే తల్లులకు శుభాకాంక్షలు. తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. -
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్‌సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్‌లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్‌హాసన్‌కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్‌కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు.