pinnelli rama krishna reddy
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శుక్రవారం (ఆగస్ట్23) బెయిల్ మంజూరు చేసింది. -
పిన్నెల్లి అరెస్టుపై కాసు మహేష్ రెడ్డి సీరియస్
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు. -
పిన్నెల్లిపై పచ్చ కుట్రలు.. విర్రవీగితే నష్టం తప్పదు..
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్‌లోనే కొనసాగుతూ వైఎస్సార్సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్‌ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్‌సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్‌ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పిన్నెల్లి బెయిల్‌పై నేడే తీర్పు
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్‌లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. చదవండి: చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్‌కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు. -
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్‌ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్‌లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్‌ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ రౌడీల స్వైర విహారం
సాక్షి, నరసరావుపేట, మాచర్ల: ఎదుట ఉన్నది కూడా మనుషులేనన్న విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి... మళ్లీ లేవలేనంతగా గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు. ఇదీ... శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాల అత్యంత కిరాకతమైన ప్రవర్తన. విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే.... తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో ఫెలయింది. ఇక ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి మాచర్లలో రెండు రోజుల క్రితం తాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచరులను అరెస్టు చేస్తారా? అంటూ బ్రహ్మారెడ్డి కొందరితో కలిసి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డారు. దానికి కొనసాగింపుగానే అన్నట్టుగా... శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే వంకతో... చుట్టుప్రక్కల ఫాక్షన్ గ్రామాలకు చెందిన తన అనుచరులను ముందే పిలిపించుకున్నారు. నిజానికి విలేకరుల సమావేశానికి అన్ని ఊళ్ల నుంచి... అంత మంది రావాల్సిన పనిలేకపోయినా... ముందస్తు పథకం ప్రకారం రాడ్లు, కర్రలతో వారిని సిద్ధంగా ఉంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా దుర్బాషలాడుతుండటంతో అక్కడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో తమను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ స్థానిక నేతలు చల్లా మోహన్, ఓర్సు కిషోర్, ఉప్పుతోళ్ల శ్రీనివాసరావులపై దాడి చేశారు. వారు కిందపడిపోయినా వదలకుండా కర్రలతో దాడులు చేస్తూ, బండరాళ్లతో బలంగా గుండెలపై కొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిస్సహాయంగా పడి ఉండిపోవటంతో... నినాదాలు చేస్తూ, ఈలలు వేసుకుంటూ పోలీసులు నచ్చజెప్పినా వినకుండా ప్రదర్శనగా రైలు గేటు వరకూ వెళ్లారు. ఒకదశలో పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగారు. కొందరు వ్యక్తులు రైల్వే గేటు వద్ద ఓ వాహనాన్ని పూర్తి స్థాయిలో దహనం చేశారు. రింగ్‌రోడ్డులోని మరో వాహనంపై రాళ్లతో దాడిచేశారు. మరో నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు బ్రహ్మారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి గుంటూరు పంపించారు. కారు, కార్యాలయం దగ్ధం... వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దారుణంగా దెబ్బలు తిని, నిస్సహాయంగా రోడ్డుపై పడిపోయిన విషయం వారి బంధువులు, స్నేహితులకు తెలియటంతో వారు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. తమ వారిని దారుణంగా కొట్టడం, దాదాపుగా హతమార్చే ప్రయత్నం చేయటంతో... వారి బంధుమిత్రులు టీడీపీ కార్యకర్తల జులుంను నిరసించారు. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కారుకు నిప్పు పెట్టారు. జూలకంటి బ్రహ్మారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై కూడా దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు అగంతకులను చెదరగొట్టి... పట్టణంలో 144వ సెక్షన్ అమలులోకి తెచ్చారు. ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటుచేశారు. పథకం ప్రకారమే... కావాలనే పల్నాడులో మంటలు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే. మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడులు సృష్టించేందుకు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌లు పథకం ప్రకారం బ్రహ్మారెడ్డిని మాచర్లకు తీసుకువచ్చారు. నెలవారీ డబ్బులు ఖర్చులకిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్‌ను బతికించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. బ్రహ్మారెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చిన నాటి నుంచీ కావాలనే లేనిపోని గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. నేను 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇలాంటి అలజడులెప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య యుతంగా ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. కానీ వీళ్లు గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి... తాగి.. మహిళలను తిట్టారు. ప్రశ్నించిన కార్యకర్తలను బండరాళ్లు, రాడ్లతో కొట్టారు. దీనికి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి. గొడవలు మొదలుపెట్టడమే కాక ఆ తరువాత పెద్ద ర్యాలీలాగా వెళ్లి స్వైర విహారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు చెబుతున్నాను. మీ రాజకీయాల కోసం పల్నాడులో మంటలు రేపుతున్నారు. పల్నాడును తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న ఫ్యాక్షన్ ను మళ్లీ రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం జగన్
మాచర్ల రూరల్(పల్నాడు జిల్లా): ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన డ్వాక్రా సభ్యులకు రూ.4.01 కోట్ల విలువైన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని, త్వరలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తానే గడపగడపకూ వస్తున్నానని ప్రకటించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని కొనియాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీలు బూడిద మంగమ్మ, దాసరి చౌడేశ్వరి, యేచూరి సునీత శంకర్, శారద శ్రీనివాసరెడ్డి, రూప్లీబాయి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శేరెడ్డి గోపిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మండ్లి మల్లుస్వామి, యలమంద, మార్కెట్ యార్డు చైర్మన్లు వెలిదండి ఉమా గోపాల్, పల్లపాటి గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని వినియోగించుకోవాలి మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకాన్ని వెనుకబడిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో మెట్ట రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి బోరు సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పథకాలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా మెట్ట రైతుల నీటి సమస్య తీర్చేందుకు వైఎస్సార్ జలకళ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు
-
పదవి లేకపోతే చంద్రబాబు రాక్షసుడిలా మారతారు
-
చంద్రబాబులాంటి స్వార్థనేత మరెవరూ ఉండరు..
సాక్షి, గుంటూరు : ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థనేత మరెవరు ఉండరని మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అవసరానికి వాడుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. కోడెల మృతదేహంతో రాజకీయం చేయాలని చూశారని పిన్నెల్లి విమర్శించారు. బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
సాగర్ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సాగర్ రిజర్వాయర్ నుంచి బుధవారం కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా నిండని సాగర్‌కు ఇప్పుడు నీళ్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తోందని.. రైతులందరికీ ఇకపై అన్నీ మంచిరోజులేనని వ్యాఖ్యానించారు. -
పల్నాటి ‘రాములమ్మ’
సాక్షి, కారంపూడి : అది పల్నాడు పోరుగడ్డ.. అందులోన ఎన్నికల సంగ్రామం.. గ్రామాల్లో జోరుగా ప్రచారం.. సెగలుపుట్టిస్తున్న సూర్యుడిని లెక్కచేయక.. శ్వేదాన్ని చిందిస్తూ.. కుమారుడి విజయం కోసం అలుపెరుగక.. పరితపిస్తూ.. ప్రతిధ్వనిస్తూ.. ప్రచార పర్వంలో దూసుపోతున్నారు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండ వేడిమికి తట్టుకోలేక చెట్ల కింద కూలబడుతుంటే.. ఆరుపదుల వయస్సు దాటిన రాములమ్మ లక్ష్యం, వేగం ముందు కాలం నివ్వెరబోతుంది. సమయాన్ని వృథా చేయకుండా ఇంటింటి ప్రచారంలో రాములమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గ్రామాల్లో వెల్లువెత్తుతున్న జనాదరణను చూసి పడుతున్న శ్రమను సైతం మరిచిపోతున్నారు. మరోవైపు పేటసన్నెగండ్లలో ప్రచారానికి ఆటంకం కలిగించాలని చూసిన వారిపై పల్నాటి నాగమ్మలా గర్జించారు. ఆమెకు తోడుగా కుమార్తె నాగమణి కూడా అన్న గెలుపు కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.నాలుగు రోజుల్లో మండలంలోని 11 గ్రామాలను చుట్టి వచ్చారు. వాస్తవంగా ఇంత తక్కువ కాలంలో నిజంగా ఏ ఒక్క అభ్యర్థి తరుఫు బంధువులు ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో ఎంతో కాలంగా టీడీపీకి కంచుకోటగా భావించే మండలంలో కోటకు బీటలు వారుతున్నాయి. -
అమాత్య... అన్న పిలుపేదీ?
సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు. అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు. -
పౌరుషాల గడ్డ ..మాచర్ల
సాక్షి, మాచర్ల : జీవప్రదాయినిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయాన్ని గుండెలపై పెట్టుకున్నా.. గుక్కెడు మంచినీళ్లకు అల్లాడుతున్న నియోజకవర్గం మాచర్ల. పల్నాటి పౌరుషాల కత్తుల నెత్తుటి మరకల్లో తడిచి ఫ్యాక్షన్ రంగు పులుముకుని.. అభివృద్ధి ఆనవాళ్లను మరిచిన ప్రాంతమిది. ఇక్కడ శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆశీస్సులతో ఎందరో రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకున్నారు. మరెందరో ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఒకే కుటుంబంలో వారే ప్రత్యర్థులై రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేశారు. మూడు దఫాలు విజయాన్ని సాధించి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు తమ సత్తా చాటేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గ పునర్వివిభజన సమయంలో రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు, మంచికల్లు, రెంటాల, రెంటచింతల గ్రామాలు గురజాల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గంలోకి మారాయి. మొత్తం ఐదు మండలాల్లో మాచర్ల మండలంలోని విజయపురిసౌత్, తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సరిహద్దుగా ఉంటుంది. కారంపూడి మండలంలోని దక్షిణం వైపు చక్ర సిమెంట్స్ తరువాత వినుకొండ నియోజక వర్గంలోని రెడ్డిపాలెం ప్రారంభమవుతుంది. వెల్దుర్తి మండలంలోని దావుపల్లి తరువాత ప్రకాశం జిల్లాకు చెందిన యర్రగొండపాలెం సరిహద్దుగా ఉంటుంది. రెంటచింతల మండలంలో ఒక వైపు గురజాల నియోజకవర్గం సరిహద్దుగా ఉంటుంది. మరోవైపున కృష్ణానది ఉంది. నాగార్జున సాగర్, గుంటూరు హైదరాబాద్, నర్సరావుపేట, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కలుపుతూ రహదారులున్నాయి. విజేతల వివరాలు నియోజకవర్గంలో 1962లో రంగమ్మరెడ్డిపై కాంగ్రెస్ తరఫున కేశవ నాయక్ గెలుపొందాడు. 1967లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వెన్నా లింగారెడ్డి 64 ఓట్లతో విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి లింగారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి 12 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 1978లో జూలకంటి నాగిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చల్లా నారపరెడ్డి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థి నారపరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొర్రపాటి సుబ్బారావు 26 వేల మెజార్టీతో గెలిచారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి నట్టువ కృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వట్టికొండ జయరాంపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మగడ్డ శివరామకృష్ణ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నట్టువ కృష్ణ పై 4300 ఓట్లతో గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుర్రి పున్నారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి సుందరరామిరెడ్డిపై 5600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి జూలకంటి దుర్గాంబ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై 1750 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 31 వేల పైచిలుకుతో గెలుపొందారు. 2009లో జూలకంటి బ్రహ్మారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 9600 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల ఆధికత్యతో విజయం సాధించారు. 2014లో వైఎస్సాఆర్ సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3535 ఓట్ల ఆధికత్యతో గెలిచారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు మాచర్ల మండలంలోని 15 పంచాయతీల్లో 17 శివారు గ్రామాలున్నాయి. రెంటచింతల మండలంలో 11 పంచాయతీల్లో 3 శివారు గ్రామాలున్నాయి. దుర్గి మండలంలో 14 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి. కారంపూడి మండలంలో 15 పంచాయతీల్లో 8 శివారు గ్రామాలున్నాయి. వెల్దుర్తి మండలంలో 16 పంచాయతీల్లో 16 శివారు గ్రామాలున్నాయి. సామాజిక వర్గాల వివరాలు రెడ్లు : 33000 కమ్మ సామాజిక వర్గం : 29000 ఎస్సీ మాదిగ : 24000 మాలలు : 9000 యాదవులు : 19000 వడ్డెరలు :15000 ముస్లింలు, దూదేకులు : 20,000 ఆర్యవైశ్యులు : 13,000 సుగాలీలు, చెంచులు, గిరిజనులు :19,000 నాయుడులు : 14,000 ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు వెనుకబడిన నియోజకవర్గంలో సాగు, తాగు నీటి పథకాలు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరికపూడిసెల, దమ్మర్ల గొంది, జెర్రివాగు, 100 పడకల ఆసుపత్రి, గొలివాగు ఎత్తిపోతల పథకంతోపాటు అనేక అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. యాదవ, వడ్డెర, కాపు, ముస్లిం, ఆర్యవైశ్య సామాజిక వర్గాలు గెలుపును నిర్ణయిస్తాయి. ప్రత్యేకతలు నియోజకవర్గ పరిధిలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కుడికాలువ ఉంది. విజయపురిసౌత్ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. విజయపురిని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు పరిపాలించారు. నాగార్జున కొండలో ప్రస్తుతం బుద్ధిజం చరిత్ర జ్ఞాపకాలు మ్యూజియంలో పెట్టారు. బ్రహ్మనాయుడు పునఃనిర్మించిన శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ఇప్పటికీ ఉంది. వెల్దుర్తి, మాచర్ల రూరల్, దుర్గి మండలాల్లో సాగు, తాగునీటి సమస్య ఎక్కువ. వరికపూడిసెల ప్రాజెక్టు కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతోంది. నియోజకవర్గం పక్కనే ఉన్న నల్లమల అడవులు వేదికగా నక్సల్స్ ఉద్యమాలు చేపట్టారు. వెల్దుర్తి, గొట్టిపాళ్ళ, శిరిగిరిపాడు, వేపకంపల్లి, గుండ్లపాడు గ్రామాలు ఫ్యాక్షన్ చరిత్ర కలిగి ఉన్నాయి. నియోజకవర్గ జనాభా : 3,76,946 పురుషులు : 1,94,456 స్త్రీలు : 1,82,490 మొత్తం ఓటర్లు : 2,40,670 పురుషులు : 1,19,582 స్త్రీలు : 1,21,054 ఇతరులు : 34 పోలింగ్ బూత్‌లు : 299 సమస్యాత్మకమైన బూత్‌లు : 58 -
నిరుద్యోగులకు చంద్రబాబు టోకరా
మాచర్ల రూరల్: ఓట్లు, సీట్ల కోసం ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత రూ.వెయ్యి మాత్రమే ఇస్తానని చెప్పటం ఆయన మోసపూరిత నైజం మరోసారి బట్టబయలైందని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశ చూపి ఓట్లు పొంది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఏ ఎన్నికల్లో గెలవకపోయినా తన కుమారుడు లోకేష్‌బాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా ఉద్యోగం ఇప్పించుకున్న చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు టోకరా వేశారన్నారు. ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తాననటం దారుణమని, 48 నెలలకు రూ.2 వేల చొప్పున రూ 96వేలను ప్రతి ఒక్క నిరుద్యోగికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, మ్యానిఫెస్టో హామీలను అమలుపరచాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీకి నిరుద్యోగుల తల్లిదండ్రుల ఉసురు తగులుతుందని పీఆర్కే చెప్పారు. -
పెద్ద నోట్ల విషయంలోనూ యూటర్నా..?
మాచర్ల: పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో పట్టించుకోకుండా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడినప్పుడు ఏమీ మాట్లాడని సీఎం చంద్రబాబు, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వలన ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారనే విషయం గుర్తుకు వచ్చిందా... ఈ విషయంలోనూ యూ టర్నా అని వైఎస్సార్ సీపీ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అప్పుడు తన సలహాపైనే మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాడని చెప్పుకున్న సీఎం చంద్రబాబు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు నగదు కొరత గురించి మాట్లాడుతున్నారన్నారు. నోట్ల రద్దు సమయంలో సామాన్యులు క్యూలో నిలబడి గుండెపోటుతో చనిపోయినప్పుడు కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదన్నారు. ఎప్పటికప్పుడు అన్నీ నా వల్లనే జరిగాయని గొప్పలు చెప్పుకోవడం, ఆ తరువాత ప్రజలు ఇబ్బంది పడితే యూ టర్న్ తీసుకొని ఎవరో ఒకరిని బాధ్యులను చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకపోతే యూ టర్న్ తీసుకున్న సీఎంగా ప్రజల్లో చులకనై చివరికి ప్రజల చేతనే శిక్షింపబడే స్థాయికి దిగజారుతారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. -
ఇచ్చిన హామీలకు దిక్కులేదు.. కొత్త పథకాలా?
మాచర్ల: రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు వాటిని నెరవేర్చకపోగా, కొత్త హామీలు ఇస్తూ ఆయా సామాజిక వర్గాలను మోసగించే పనిలో బిజీబిజీగా ఉన్నారని వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన గురువారం గుంటూరు జిల్లా మాచర్లలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని వర్గాలను మోస గించిన సీఎం ఎక్కడా కనబడలేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందువరకు ఎస్సీలు, మాదిగలు, రజకులు, రెల్లి, నాయుడు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులతో పాటు ఏ వర్గాన్నీ వదలకుండా చంద్రబాబు హామీల మీద హామీలిచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రతి సామాజికవర్గాన్ని అణచివేతలో ముందంజలో ఉన్నారని దుయ్యబట్టారు. ఎవరైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే పోలీసులను అడ్డం పెట్టుకొని అణచివేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం రైతులు, మహిళలు, నిరుద్యోగులు, డ్వాక్రా సంఘ సభ్యులు, చేనేత, వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేయకుండా కావాలని జాప్యం చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించగానే భయపడి ఊరూరా మళ్లీ కొత్త హామీలతో మభ్యపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయానికీ కేంద్రాన్ని అడిగాను... రాష్ట్రంలో నిధులు లేవు... ఇదిగో నేను అభివృద్ధి చేస్తున్నా.. ప్రతిపక్షం అడ్డగిస్తోందంటూ కాలం గడుపుతున్న సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా కరువుతో రైతులు సాగుకు నీళ్లు రాక అల్లాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
విజయవాడ: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం డీజీపీ సాంబశివరావును కలిశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్యాయంగా వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. గుంటూరు జిల్లా ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు మూడుసార్లు ఎఫ్ఐఆర్ను మార్చారన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. పార్టీ నేత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ... టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, అధికార పార్టీ నాయకులే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
'ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు'
► మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : రాష్ట్రంలో ప్రజల అభిమానంతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ ప్రభుత్వం నిత్యం ఆయనపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) విమర్శించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 11 మంది మృతి చెందితే వెంటనే స్పందించి జగన్ అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. దీన్ని సహించలేక జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మీడియాకు సంబంధించి ఏ వార్త వచ్చినా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రాజీ పడటం దారుణమన్నారు. శనివారం అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించే వరకూ కూడా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు విమర్శలు రావడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారని తెలిపారు. అక్రమ కేసుల నమోదులో ముందంజ పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పక్షం చెప్పిందే వేదంగా భావిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడంలో ముందంజలో ఉండడం బాధాకరమన్నారు. అధికారమనేది శాశ్వతం కాదనే విషయాన్ని ఆయా శాఖల అధికారులు మర్చిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి చిట్టా సేకరిస్తున్నామని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పీఆర్కే తెలిపారు. -
యరపతినేనికి పిన్నెల్లి మరోసారి సవాల్
గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరం రాజీనామా చేద్దామన్నారు. దమ్ముంటే యరపతినేని తన సవాల్‌ను స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు. మాచర్లలో పిన్నెల్లి మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల పనుల్లో యరపతినేని ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటే..తనను హౌస్ అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు. గురజాలలో యరపతినేనిపై తాను పోటీ చేస్తానని...ఎవరు ఓడిపోతే వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిన్నెల్లి చెప్పారు. యరపతినేని మైనింగ్‌లో అవినీతికి పాల్పడ్డారని లోకాయుక్త కూడా నిర్ధారించిందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి సోమవారం దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో ఆదివారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
జనాగ్రహాన్ని చూసైనా బుద్ధి రాదా..
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి చేపట్టిన జల దీక్షకు లభిస్తున్న జనాధరణను చూసైనా టీడీపీ ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలుకు వెళ్తూ మంగళవారం ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో ఆరు జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన ప్రజలు ఉవ్వెత్తున తరలివచ్చి జగన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, డిండిలతోపాటు వివిధ ప్రాజెక్టులు చేపడితే కరువుతో తాము ఎల్లకాలం అల్లాడాల్సిందేనని భావిస్తున్న ప్రజలు, రైతులు జగన్ జలదీక్ష జయప్రదం కావాలని, అక్రమ ప్రాజెక్టులు నిలిచిపోవాలని కోరుతూ వేలాది మంది తరలివ స్తున్నారని చెప్పారు. ఇలాంటి జనాదరణ కలిగిన జగన్‌ను రోజూ మంత్రులచేత తిట్టిస్తూ ఏదో విధంగా ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబు అసలు సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిలిపివేతకు చర్యలు తీసుకునే విధంగా అధికార పార్టీ వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. -
వైఎస్ పాలనలోనే రైతురాజ్యం
► మళ్లీ రాబోయే రోజులలో జగన్ హయాంలోనే.. ► జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల ప్రారంభకార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతురాజ్యంఎలా ఉంటుందో తన హయాంలో చూపించాడని, భవిష్యత్తులో రైతులకు మేలు చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రాత్రి జమ్మలమడక రహదారిలో రామప్ప దేవాలయం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. అంతకుముందు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సంతకంతో రుణమాఫీ చేసి రైతుల జీవితాలలో వెలుగులు నింపిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన బాటలోనే నడుస్తున్న జగన్ భవిష్యత్తులో రైతురాజ్యాన్ని స్థాపిస్తారని ఎమ్మెల్యే పీఆర్కే చెప్పారు. శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతుసంఘం ఆధ్వర్యంలో 26వ తేదీ వరకు జాతీయస్థాయి ఎడ్లపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల నుంచి 12 ఎడ్ల జతలు పాల్గొన్న ఈ పోటీలు రాత్రి 10 గంటలవరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించి ఎమ్మెల్యే పీఆర్కే పర్యవేక్షించారు. ఎడ్ల పోటీలను చూసేందుకు భారీగా తరలివచ్చారు. భారీర్యాలీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే పీఆర్కే భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే బుల్లెట్ నడుపుతూ చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కామనబోయిన కోటయ్య, ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షేక్ కరిముల్లా, కౌన్సిలర్లు అన్నెం అనంతరావమ్మ, పోలా భారతి శ్రీనివాసరావు, బిజ్జం నాగలక్ష్మీ సుధాకరరెడ్డి, ఇంజమూరి రాణి, షేక్ ఫర్వీన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సీహెచ్. రోశయ్య, యూత్ కన్వీనర్ టి. కిషోర్, జిల్లా కార్యదర్శులు జూలకంటి వీరారెడ్డి, బండారు పరమేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యవర్గ సభ్యులు మార్తాల ఉమామహేశ్వరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు మరియమ్మ, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా, ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షులు ఎం.శ్రీనివాసశర్మ, అధ్యక్షులు నల్ల వెంకటరెడ్డి, కోశాధికారి ఉమామహేశ్వరరెడ్డి, ముక్కా శ్రీనివాసరావుయాదవ్, సుబ్బయ్య, శ్రీను, సీతారామిరెడ్డి, నాసరయ్య, పరమేశ్వరరావు, బూడిద శ్రీను, మెట్టు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, ఎంఆర్ఎఫ్ రామాంజిరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసగిస్తున్న బాబు
► అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు ► ప్రభుత్వ తీరుపై ప్రజా ఉద్యమం చేపడతాం ► మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల : అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సొంత జీవోలతో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ పరిధిలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించటం ద్వారా సొంత మనుషులను నియమించుకొని దోపిడీకి రాజమార్గాన్ని చూపుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో నిరుద్యోగులుగా ఉన్న 1.40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని మరిచి ఉద్యోగాలను ఇవ్వకపోగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించే పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. అన్ని రకాల దోపిడీలకు తెర తీసిన చంద్రబాబు చివరికి రాజధాని పరిధిలోని సీఆర్డీఏలో రిజర్వేషన్‌కు సంబంధం లేకుండా సొంత పనుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఫ్రీ జోన్ చేయకుండా మోసగింపు చర్యలు ప్రారంభించారని మండిపడ్డారు. రెండేళ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీకి తెరతీసి కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా అక్రమ ఆర్జనతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వటం అత్యంత దారుణమన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హత లేని ప్రతి ఒక్కరికి పథకాలను కట్టబెడుతూ పేదలను ఇబ్బందిపెడుతున్న చంద్రబాబు.. అర్హత అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పేదల కోసం ఏమీ చేయకుండా పథకాలన్నీ కార్యకర్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజా ఉద్యమాలను చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ర్ట యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు వెలిదండి గోపాల్, దుర్గి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం వెంకటేశ్వర్లు, మున్సిపాల్టీలో పార్టీ ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, నాయకులు శ్రీనివాసశర్మ, నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.