prasanthi nilayam
-
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి అర్బన్: శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిర్పురీ సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను పరవశింపజేసింది. ‘అచింత్య రూపిణి సాయిమా’ అంటూ సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు కచేరీ చేశారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజు రచించి హిందోళరాగంలో ఆలపించిన పాటలతో భక్తులు మైమరిపోయారు. ఇందులో మాతేశ్వరి పరమేశ్వరి, తుకారాం భైరవీ రాగంలో పాడిన ‘స్వామికృపాకరి కరణ’ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది. -
అలరించిన చైతన్యప్రభు నాటిక
పుట్టపర్తి అర్బన్: విశ్వశాంతి కోసం పరితపించిన సత్యసాయి బాబా తన భక్త లోకాన్ని శాంతి, ప్రేమ అనే మార్గాల్లో చైతన్యపరిచి నడిపించిన మహనీయుడనే ఇతి వృత్తంతో కూడిన ‘శ్రీకృష్ణ చైతన్యప్రభు’ నాటిక అబ్బురపరిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్త బృందం, బాలవికాస్ విద్యార్థులు శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం విచ్చేశారు. పర్తి యాత్ర పేరుతో విచ్చేసిన భక్త బృందం శ్రీకృష్ణుని జీవిత గాథలను సత్యసాయికి అనుకరిస్తూ పలు నృత్య నాటికలు, సంగీత కచేరీలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో కృష్ణభగవానుడి ప్రియభక్తుడైన కృష్ణ చైతన్య ఇతివృత్తాన్ని అభినయించారు. -
ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ
పుట్టపర్తి అర్బన్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి మిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. కర్ణాటక, మలయాలీ,హిందూస్థానీ సంగీతంతో భక్తులను మంత్రముగ్దుల్ని చేశారు. జగదోద్ధారణ, చందన చర్చిత, దేశ్ హమారా యా దేశ్ హమారా, తదితర స్వాతంత్య్ర దేశ భక్తుల జీవిత గాథలతో ముడిపడిన పాటలు ఆలపించారు. సత్యసాయి మహా సమాధిని అందంగా అలంకరించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు మహాసమాధి దర్శనం తర్వాత సంగీత కచేరీ నిర్వహించారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి అర్బన్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం విద్యార్థులునిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈసందర్భంగా విద్యార్థులు గోకులం నుంచి అందంగా తయారు చేసిన గోవులకు సిల్క్ దుప్పట్ట కప్పుకొని ప్రశాంతి నిలయానికి తీసుకువచ్చి సేవ చేశారు. ట్రస్టు సభ్యులు వాటికి గడ్డి, పండ్లు, కాయలు తినిపించారు. అదేవిధంగా గోశాలలో పెంచుతున్న జింకలు, నెమలి, కుందేలు, పావురాలు తదితర పక్షులు, జీవాలకు పాలు తాగించడం, పండ్లు తినిపించడం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మధురాష్టకం, చల్లగాలిలో యమున తాటిపై, జగదానందకర, భవమీయ గోపాలబలం అంటూ సాగే సంగీతాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. 5000 ఏళ్ల నాటి నుంచి శ్రీకృష్ణుడు చేసిన లీలా వినోదాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ఆశ్రమం సీనియర్లు, బాబా భక్తులు పాల్గొన్నారు. -
మార్మోగిన సాయి నామస్మరణ
పుట్టపర్తి అర్బన్ : విజయనగరం జిల్లా వాసులు చేసిన సాయి నామస్మరణతో పుట్టపర్తి వీధులు పులకించాయి. పర్తియాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్న విజయనగరం జిల్లా సత్యసాయి భక్తులు స్వామివారి పల్లకీని ఊరేగిస్తూ ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సాయి భక్త బృందం పుట్టపర్తికి విచ్చేశారు. సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పట్టణంలోని గణేష్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, గోపురం వీధి, హనుమాన్ ఆలయం తదితర చోట్ల ఊరేగించారు. కార్యక్రమంలో కోలాటం, చెక్కభజన చేస్తూ మహిళలు ఆడిపాడారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
అలరించిన కర్ణాటక వాయిద్య కచేరీ
పుట్టపర్తి టౌన్ : గురుపౌర్ణమి వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో ప్రముఖ వాయిద్యకారులు చారుమతి రఘురామన్, అనంద్ ఆర్.క్రిష్ణలు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన వాయిద్య కచేరి ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో డిప్లమో పూర్తి చేసుకుని మంచి ఫలితాలు సాధించిన వారికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు జస్టిస్.ఏపి మిశ్రా, ఆర్జె.రత్నాకర్రాజులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సంగీత కచేరి నిర్వహించిన కళాకారులను ఘనంగా సన్మానించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ సత్యసాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సాయంత్రం సత్యసాయిపై కృతజ్ఙతను చాటుతూ నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. -
ఘనంగా ఏకాదశి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో మహారాష్ట్ర , గోవాకు చెందిన వేలాది భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సత్యసాయి భక్తులు తమకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆశాడ ఏకాదశి వేడుకలు ప్రశాంతి నిలయంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత మహారాష్ట్ర భక్తుల వేదఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పండరీనాథున్ని, సత్యసాయిని కొనియాడుతూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం మహారాష్ట్రకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘గాడ్ లక్కీ నెంబర్ 9’అన్న పేరుతో సంగీత నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు ప్రదర్శించిన హిరణ్య కషిపుడు, భక్త ప్రహల్లాదుల ఘట్టం భక్తుల హృదయాలను చలింపజేసింది. తర్వాత భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
ప్రశాంతి నిలయంలో కలకలం
- సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్ మాజీ రిసోర్స్ కో-ఆర్డినేటర్ అనుమానాస్పద మృతి - మృతురాలిది ఢిల్లీ - నాలుగు నెలల కిందట ఆ పదవికి రాజీనామా - మనస్పర్థలతో భర్తకు దూరం - విద్యావాహిని కార్యాలయంలో ప్రవేశంపై సందేహాలు ఆమెది ఢిల్లీ. ఉన్నత విద్యావంతురాలు. పుట్టపర్తి సత్యసాయిబాబాపై భక్తికొద్దీ పుట్టపర్తికి వచ్చారు. నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. - పుట్టపర్తి టౌన్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్ కార్యాలయంలో ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన సాయిప్రవ పట్నాయక్(32) అనుమానాస్పదస్థితిలో మరణించడం బుధవారం వెలుగులోకి వచ్చిందని సీఐ బాలసుబ్రమణ్యం, ఎస్ఐ వెంకటేశ్ నాయక్ తెలిపారు. వారి కథనం మేరకు... సాయిప్రవ పట్నాయక్ 2015 సెప్టెంబర్ 3న సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌లో రిసోర్స్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు పని చేసిన ఆమె మార్చిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాలుగేళ్ల కిందట పుట్టపర్తికి వచ్చిన ఆమె ఇక్కడి గోపురం మొదటి క్రాస్‌లోని అనూరాధ అపార్ట్మెంట్లో ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తన గది నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అక్కడి సాయిభక్త నివాస్ వద్ద గల విద్యావాహిని ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ ఉండగా బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది గమనించి ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యజిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భర్తకు దూరంగా... సాయిప్రవ పట్నాయక్‌కు పెళ్లైన నాలుగేళ్లైంది. అయితే పెళ్లైన నెలకే ఆమె భర్తను వదిలేసి బాబాపై భక్తితో ఇక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండేవారు. రెండేళ్ల పాటు ఇక్కడ ఉద్యోగం చేశాక తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. రంగంలోకి పోలీసులు సమాచారం అందిన వెంటనే సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. వారి తల్లిదండ్రులు జెగ్ని పట్నాయక్, మకరంద్ పట్నాయక్‌కు విషయం తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నెన్నో సందేహాలు సాయిప్రవ పట్నాయక్ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్న విద్యావాహిని కార్యాలయాన్ని ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 9 గంటలలోపు మూసివేస్తారు. అయితే మూసివేసిన కార్యాలయంలోకి ఆమె ఎలా వెళ్లగలిగారు, గది తాళాలు ఎలా దొరికాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఏదైనా చేశారా, అదే నిజమైతే ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అలరించిన ‘కృష్ణం వందే జగద్గురం’
పుట్టపర్తి టౌన్ : పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ప్రకాశం జిల్లా సత్యసాయి భక్తులు రెండో రోజు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ చిన్నారులు 55 మంది ‘కృష్ణం వందే జగద్గురం’ నృత్యరూకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి చిన్ననాటి ఆటలు, ఆయన భక్త కోటికి చూపిన మహిమాన్విత ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. అనంతరం నృత్యరూపంలో పాత్రధారులైన చిన్నారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పర్తియాత్రలో దాదాపు 200 మంది సత్యసాయి విద్యావాహిని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇలవేల్పుకు భక్తకోటి హృదయాంజలి
భగవాన్ సత్యసాయికి అశేష భక్తకోటి హృదయాంజలి సమర్పించింది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తుల నడుమ సత్యసాయి ఆరాధనోత్సవాలు సోమవారం ప్రశాంతి నిలయంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్న కీర్తనలు ఆలపించారు. - పుట్టపర్తి టౌన్ సత్యసాయి నిత్యాన్నదాన పథకం ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు నాగానంద, ఆర్జె.రత్నాకర్రాజు ప్రసంగిస్తూ.. ఆర్థించే ప్రతి ఒక్కరికీ సత్యసాయి ప్రేమను పంచారని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన సత్యసాయి విద్యాజ్యోతి పథకం కూడా మంచి పలితాలను ఇస్తోందన్నారు. సత్యసాయి ఆకాంక్షల మేరకు గురుపౌర్ణమి పర్వదినం నుంచి ప్రశాంతి నిలయంలో సత్యసాయి నిత్యాన్నదాన పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సేవా కార్యక్రమాలు విస్తృతం సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్య మాట్లాడుతూ.. సత్యసాయి సర్వాంతర్యామి అని అయన భౌతికంగా భక్తుల నడుమ లేకపోయినా ఆయన ఆశయాల కొనసాగింపే లక్ష్యంగా ప్రతి భక్తుడూ కృషి చేయాలన్నారు. సత్యసాయి సంకల్ప బలంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. సత్యసాయి విద్యాజ్యోతి పథకంలో భాగంగా దేశీయంగా 672 పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందులో 1.39 లక్షల మంది విద్యార్థులకు 6,500 ఉపాధ్యాయులు మానవతా విలువలతో కూడిన విద్యాబోధనలు అందిస్తున్నారని అన్నారు. 40 వేల మందికి అన్నవస్త్రాల వితరణ ఆరాధనోత్సవాలలో భాగంగా పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 40 వేల మంది వేకువజామునే స్టేడియంకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు స్టేడియం వేదిక వద్ద సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు సత్యసాయి సేవాదల్ సభ్యులు అన్నప్రసాదాలు, నూతనవస్త్రాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జే రత్నాకర్రాజుతో కలిసి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి భక్తులకు సత్యసాయి అన్నప్రసాదాలు, నూతన వస్త్రాలను వితరణ చేశారు. అదే విధంగా ప్రశాంతి నిలయంలోని ఉత్తర మైదానంలో కూడా అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. వేడుకలలో కర్ణాటక మంత్రి రమేష్, మాజీ మంత్రి గీతారెడ్డి, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్, చక్రవర్తి, ఏపీ మిశ్రా, ప్రసాద్‌రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలరించిన అనంతనారాయణన్ కచేరి సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత తమిళనాడుకు చెందిన అనంతనారాయణన్ బృందం సంగీత కచేరి అలరించింది. పిదప కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సేవాలు వెలకట్ట లేనివి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నీటి ఎద్దడి నివారించడం సత్యసాయికే సాధ్యమైందన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి చేసి చూపించారని కొనియాడారు. -
ఆ సేవలు అనితర సాధ్యం
సందర్భం :నేడు ప్రేమమూర్తి ఆరాధనోత్సవం ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలం.. అదే సత్యసాయి బాబా అభిమతం. మానవళిని సన్మార్గం వైపు పయనింపజేసే ఆధ్యాత్మిక బోధనలు... ఆర్తించే ఆపన్నులకు అన్నీ తానై కాపాడుకుంటూ వచ్చిన సత్యసాయి కోట్లాది భక్తుల గుండెల్లో భగవంతుడిగా కొలువై ఉన్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అన్న సత్యసాయి బోధ భక్తకోటి మదిలో అను నిత్యం ప్రతిధ్వనిస్తోంది. భౌతికంగా దేహం వీడి పరమపదించినా సర్వాంతర్యామిగా సత్యసాయి ప్రపంచ నలుమూలలా కొలువబడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న సత్యసాయి ఆరాధనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. - పుట్టపర్తి టౌన్ పూర్వం గొల్లపల్లిగా పిలవబడే పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద్దవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యసాయి జన్మించారు. బాల్యంలో సత్యనారాయణ రాజుగా పిలువబడిన ఆయన మెండైన ఆధ్యాత్మిక చింతనతో 1940లో తన 14వ ఏట సత్యసాయి బాబా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి కాషాయ వస్త్రధారిగా దేశదేశాల సంచరిస్తూ ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రభోదిస్తూ సువిశాల భక్త సామ్రాజాన్ని నిర్మించుకున్నారు. అచిర కాలంలోనే పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆర్తులను ఆదుకున్న భగవాన్ వరుస కరువులతో గుక్కెడు నీరు గగనమైపోయిన పరిస్థితుల్లో జిల్లాలోని వందలాది గ్రామాల గొంతు తడిపి దప్పిక తీర్చారు. ఉభయగోదావరి, చెన్నై నగరానికి కూడా తాగునీటిని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వాలు సైతం చేయలేని ఎన్నో గొప్ప కార్యక్రమాలను వందల కోట్ల రూపాయలు వెచ్చించి, అనతి కాలంలోనే పూర్తి చేసిన సత్యసాయి అపరభగీరథుడుగా కీర్తింపబడుతున్నారు. పేదలకు నయాపైసా ఖర్చులేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్‌లో సత్యసాయి వైద్య సంస్థలను నెలకొల్పారు. విలువైన విద్య ఉన్నత సమాజాన్ని నిర్మింస్తుందని ఆకాంక్షించిన సత్యసాయి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్శిటీని నెలకొల్పారు. వీటితోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రకృతి విలయాలకు గురై గూడు చెదిరిన వేలాది అపన్నులకు సత్యసాయి తన ట్రస్ట్ ద్వారా గూడు నిర్మించి వారి జీవితాలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలలో సేవా సంస్థలను నెలకొల్పి ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ తన ఆధ్యాత్మిక బోధన ద్వారా చైతన్యవంతులను చేస్తూ సన్మార్గదర్శనం చేసిన భగవాన్ తన 85 ఏట 2011 ఏప్రిల్ 24న శివైక్యం పొందారు.అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 24న సత్యసాయి ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నేటి ఆరాధనోత్సవాలు ఇలా.. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభామందిరంలోని సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థుల వేదపఠనం. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచరత్న కీర్తన ఉదయం 8.40 గంటలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నాగానంద, నిమిష్ పాండ్యల ప్రసంగం అనంతరం సత్యసాయి విద్యార్థుల సంగీత కచేరి ఉదయం 9.45 గంటలకు మహా మంగళహారతి ఉదయం 10 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో అనంత నారాయణ బృందం సాంస్కృతిక ప్రదర్శన -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్ విద్యార్థులు సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం సంగీత కచేరిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలపించిన గీతాలు అందరిలో భక్తిభావాన్ని నింపాయి. అనంతరం బ్రాస్ బ్యాండ్ వాయిద్య కచేరిని కూడా నిర్వహించారు. తర్వాత విద్యార్థినులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. -
విశ్వశాంతిని కాంక్షిస్తూ గాయత్రి యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ సత్యసాయి భక్తులు గాయత్రి జపం, యజ్ఞం నిర్వహించారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేలాది మంది భక్తులు నడుమ వేదపండితులు వేదమంత్రోచ్చారణ నడుమ గాయత్రి జపం, యజ్ఞం కృతువులను నిర్వహించారు. సత్యసాయి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ భక్తులు తరించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్రాజు, ప్రసాద్‌రావు, విజయభాస్కర్‌లతోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు. -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత హైదరాబాద్‌కు చెందిన సత్యసాయి భక్తుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ భక్తి గీతాలతో కచేరీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణియన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సత్యసాయి బోధనలు మానవాళికి ఆదర్శమన్నారు. బాలవికాస్ విద్యార్థిగా బాల్యంలో సత్యసాయి బోధనలు అనుసరిస్తున్న తన జీవితంలో చోటు చేసుకున్న అద్భుత అనుభవాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. హైదరాబాద్ భక్తుల నగర సంకీర్తన పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన హైదరాబాద్ సత్యసాయి భక్తులు పట్టణంలో నగరసంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణమండపం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెండిరథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగారు. సుమారు వెయ్యి మందికిపైగా భక్తులు నగరసంకీర్తనలో పాల్గోన్నారు.చిన్నారులు పౌరాణిక వేషధారణలో ముందకు సాగుతూ అలరించారు. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద మంగళహారతితో సంకీర్తన ముగిసింది. అలంకరణలో మహాసమాధి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంతి నిలయాన్ని వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని దేదీప్యమానంగా ఫలపుష్పదళాలతో ఆలంకరించారు. హేవిళంబి నామ సంవత్సరం ఉగాది పంచంగ శ్రవణాన్ని పండిత అవధాని శివసుబ్రహ్మణ్యంశాస్త్రి పఠించనున్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు.చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరపింపజేశారు. విద్యార్థుల బ్యాస్బ్యాండ్ వాయిద్యంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. పిదప భరత నాట్య కచేరితో విద్యార్థులు ఆహూతులను ఆలరించారు. చక్కటి నృత్యభంగిమలతో,సుమధుర స్వరాల నడుమ విద్యార్థులు నాట్య కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది. -
అలరించిన సంగీత కచేరీ
సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల, సత్యసాయి యూనివర్సిటీ యూజీ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సుమారు గంటపాటు కొనసాగిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. - పుట్టపర్తి టౌన్ -
పులకించిన ప్రశాంతి నిలయం
ఘనంగా శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేక ఘట్టం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత శివనామాన్ని స్మరిస్తూ సాయీశ్వర లింగానికి అభిషేకం చేస్తూ పరవశించిపోయారు. శుక్రవారం ఉదయం వేడుకలు వేదపఠనం, సత్యసాయి యూనివర్శిటీ విద్యార్థులు నాదస్వరం, పంచవాయిద్యాలతో ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, ఇతర ట్రస్ట్ సభ్యులతో కలసి సత్యసాయి పరమభక్తుడు అజిత్పోపట్ రచించిన ‘ది డివైన్ పప్పెటీర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సత్యసాయి బాబా 2001 నుంచి 2010 మధ్యకాలంలో భక్తులనుద్దేశించి ఇచ్చిన 65 ప్రసంగాల సమాహారాన్ని ఇందులో పొందుపరిచారు. అనంతరం సత్యసాయి మహాసమాధి చెంత వేదపండితులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలోని భజన మందిరంలో పండితుల వేదపఠనం నడుమ గణపతిపూజ, కుంకుమపూజ, కళశపూజ తదితర పూజాక్రతువులు నిర్వహించారు. మహారుద్రాభిషేకం ముగిసిన అనంతరం సాయీశ్వరున్ని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. వేడుకల్లో తెలంగాణ ఐజీ చారుసిన్హా, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్, ప్రసాద్‌రావు, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు. -
అలరించిన సంగీత నృత్యరూపకం
పుట్టపర్తి టౌన్ : శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన ‘జగతే పితర వందే’ సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి డ్యాన్స్ ట్రూప్ సభ్యులు సంగీత నృత్యరూపకం ప్రదర్శించారు. ఇందులో భాగంగా పరమశివుని వైభవాన్ని, వినాయకుడు తన మాతృమూర్తులపై ప్రదర్శించిన భక్తిభావనను చక్కగా వివరించారు. నేడు ప్రశాంతి నిలయంలో అఖండ భజన శివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ప్రారంభం కానుంది. -
బాబా మహాసమాధిని దర్శించనున్న గవర్నర్
పుట్టపర్తి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం మధ్యాహ్నాం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన 12.20 గంటలకు గవర్నరు పుట్టపర్తికి చేరుకుంటారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని శాంతిభవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుం చి రోడ్డుమార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళతారని అధికారులు తెలిపారు. -
పరవశభరితం చిన్నారుల సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపజేశాయి. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వివిధ దేశాలకు చెందిన చిన్నారులు క్రిస్మస్ గీతాలు ఆలపించారు. తొలుత బాలయేసును సత్యసాయి మహాసమాధి చెంతకు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి మహాసమాధి చెంత ప్రణమిల్లి వరణువేడారు. ఈసందర్భంగా ఏసుక్రీస్తు జీవితచరిత్ర అంశాలను, బో«ధనలను వివరిస్తూ చక్కటి గీతాలను ఆలపించారు.చిన్నారుల చక్కటి స్వరాలతో నిర్వహించిన ఆలాపనతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరంవిద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ చెన్నై మెట్రోకు చెందిన సత్యసాయి యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. రెండు రోజుల పర్తియాత్రలో భాగంగా చెన్నైకి చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. శనివారం సాయంత్రం చెన్నై మెట్రో సౌత్‌కు చెందిన సర్వస్త్రీ సాయిరక్షిత్ బృందం స్వర వాయిద్య కచేరి నిర్వహించారు. సుమధుర స్వరాలోలికిస్తూ వారు నిర్వహించిన సంగీత కచేరితో భక్తులు మైమరచిపోయారు.భక్తులు సత్యసాయి మహాసమాధని దర్శించుకున్నారు. -
అంబరమంటిన దీపావళి సంబరం
ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే గుజరాతీయుల నూతన సంవత్సర వేడుకలు సైతం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేద మంత్రోచ్ఛారణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన సత్యసాయి యూత్ సభ్యులు మహాసమాధి చెంత ‘జర్నీ ఆఫ్ రిథమ్’అన్న పేరుతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. అలాగే గుజరాత్‌లోని నవసారికి చెందిన బాలవికాస్ విద్యార్థులు శ్రీరాముడిని కొనియాడుతూ భక్తిగీతాలతో నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
నేత్రపర్వం
పుట్టపర్తి టౌన్ : కుచేలుని నిస్వార్థ భక్తి ప్రపత్తులను వివరిస్తూ చిన్నారులు ‘త్వమేవ శరణం సాయి’ అన్న పేరుతో నిర్వహించిన నృత్యరూపకం నేత్రపర్వంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి భక్తులు రెండవ రోజు బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుని బాల్య మిత్రుడైన కుచేలుడు ప్రదర్శించిన నిస్వార్థ భక్తిని వివరించడం ప్రధాన అంశంగా నృత్యరూపకం సాగింది. శ్రీకృష్ణుడు, కుచేలుని భక్తి ప్రపత్తుల గురించి అర్జునుడికి వివరించే ఘట్టంతో నృత్యప్రదర్శన ప్రారంభమైంది. నృత్యప్రదర్శనను తిలకించిన భక్తులు పరవశించిపోయారు. -
ముగిసిన విశ్వశాంతి యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో విజయదశమి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. దేశవిదేశాలకు చెందిన మంది భక్తులు పాల్గొన్నారు. విశ్వశాంతి యజ్ఞ వేదిక వద్ద నుంచి రుత్వికులు వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణాహుతి సామగ్రి భరణిని చేతబూని ఊరేగింపుగా సత్యసాయి మహాసమాధి చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కందుకూరి కొండావధాని నేతత్వంలోని రుత్వికుల బందం పూర్ణాహుతితో విశ్వశాంతి యజ్ఞాన్ని పూర్తి చేశారు. దుర్గాదేవిని కీర్తిస్తూ భక్తులు భక్తిగీతాలతో పూర్ణచంద్ర ఆడిటోరియం మార్మోగింది. సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. పలువురు వక్తలు సత్యసాయి వైభవాన్ని, దసరా పర్వదిన విశిష్టతను, అమ్మవారి వైభవాన్ని వివరించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సవితా నరసింహన్, కుమారి స్వర్ణలతా, గణపతిరామన్లతో కలసి నిర్వహించిన సంగీత కచేరి అందరినీ ఆకట్టుకుంది. ³#ట్టపర్తి,బుక్కపట్నం,కొత్తచెరువు మండలాల్లోని 126 గ్రామాలలో సత్యసాయి విద్యార్థులు చేపట్టిన గ్రామ సేవ కార్యక్రమం ముగిసింది.