Property registration
-
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్‌డ్రాయల్‌కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్‌లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్‌ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కచ్చితత్వం.. పారదర్శకం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ సేవల్లో కచ్చితత్వం, పారదర్శకతను రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్లైన్ ద్వారా అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రాగా త్వరలో మరికొన్ని కీలక సేవలను ఆన్లైన్ చేయనుంది. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే వివాహ రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే నిర్దేశిత సమయంలో సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. హిందూ, ఇతర మతాల వివాహాలను ప్రత్యేకంగా రిజిస్టర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ఫీజును ఆన్లైన్లో చెల్లించి ఫాం–ఏ పూర్తి చేసి దానితో పాటుగా వెడ్డింగ్ కార్డు, వివాహ ఫొటో, ఇంటి అడ్రస్ ప్రూఫ్, దంపతుల ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సాక్షులతో కలిసి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్పెషల్ వివాహాల చట్టం కింద ఇతర సాంప్రదాయాల్లో జరిగే వివాహాలను ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సొసైటీలు, సంస్థల (ఫర్మ్‌లు) రిజిస్ట్రేషన్లు సులభతరం చేసి ఆన్లైన్లో వాటిని చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ‘ఈ–చిట్స్’తో మోసాలకు చెక్ చిట్‌ఫండ్ సంస్థల పేరిట జరుగుతోన్న మోసాలకు చెక్ పెట్టడానికి గాను ‘ఈ–చిట్స్’ పేరుతో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా ‘ఈ–చిట్స్’కు రూపకల్పన చేసింది. అలాగే చిట్ ఫండ్ సంస్థలు తమ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఏ చిట్‌ఫండ్ సంస్థ అయినా తమ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇప్పటికే ఉన్న చిట్‌ఫండ్ సంస్థలు కూడా తాము నిర్వహించే చిట్ గ్రూపుల సమాచారాన్ని త్వరలో ఇందులోనే అప్లోడ్ చేయనున్నారు. నోటరీల రిజిస్ట్రేషన్‌నూ ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వినతులకూ ఆప్షన్.. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ప్రజలు వినతులిచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానంలో ఎవరైనా తమ విన్నపాన్ని ఆన్లైన్లో ఉన్నతాధికారులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ వినతులను సంబంధిత విభాగాలు నిర్దేశిత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను నేరుగా ఆన్లైన్లో చేసుకునే విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను తామే డేటా ఎంట్రీ ద్వారా తయారు చేసుకుని, ఆన్లైన్లో అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే ఆ సమయంలో ఒక్కసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ విధానం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
కాస్తయితే...దీప్తి లక్షలు పోగొట్టుకునేది
-
గ్రామాల్లో మొదలైన ఆస్తుల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు అనుకూలంగా పరిపాలనను మండలం నుంచి గ్రామ స్థాయికి తీసుకువచ్చిన ప్రభుత్వం.. దాన్ని మరింత మెరుగుపరిచేలా రిజిస్ట్రేషన్ల సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. భూముల రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. తమ గ్రామాల్లోని సచివాలయాలకు వెళితే అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే అన్ని సేవలు పొందవచ్చు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశల్లోనూ పూర్తయి అక్కడ డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రారంభించాలని గతంలోనే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందుకోసం మొదట ప్రయోగాత్మకంగా రీసర్వే పూర్తి చేసిన 51 గ్రామ సచివాలయాలను గత సంవత్సరం జనవరిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించి అక్కడి పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో 1,949 సచివాలయాలు, ఈ నెల 23న మరో 195 సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించింది. వీటిలో రీసర్వే పూర్తయిన 2 వేల గ్రామాలను 1,535 గ్రామ సచివాలయాలుగా మ్యాపింగ్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం దిశా నిర్దేశం.. ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తి స్థాయిలో మొదలు కావాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఈ నెలాఖరు నాటికి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. దీంతో ఈ 15 రోజుల్లోనే దాదాపు అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు ఊపందుకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే సర్టిఫైడ్ కాపీ, ఈసీ సర్టిఫికెట్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ సహా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 4,300కిపైగా రిజిస్ట్రేషన్లను సచివాలయాల్లో చేశారు. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.7.67 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని 44 గ్రామ సచివాలయాల్లో 766 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ 2 వేల గ్రామాలకు సంబంధించి సచివాలయాల ద్వారా 16 లక్షల ఈసీలు, 62 లక్షల సర్టిఫైడ్ కాపీలు జారీ చేశారు. ఈ సేవల్ని మరింత విస్తృతంగా సచివాలయాల నుంచి అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సేవల గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రజల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లే విధానాన్ని రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ప్రవేశపెట్టాం. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ప్రజలు ఈ సర్వీసుల్ని వినియోగించుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఎవరి గ్రామాల్లో వారు ఈ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయడం కోసం ఆయా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
యూనియన్ బ్యాంకులో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. ఇప్పటివరకు ఈ సేవలు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూబీఐ శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులో ఇచ్చే ఈ స్టాంప్ పేపర్ ఆధారంగా రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూబీఐ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ సత్యేంద్రకుమార్ తివారీ, యూబీఐ స్టేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ల మధ్య విజయవాడలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీఐ ఉన్నతాధికారులు మురళీపార్థసారథి, శారదామూర్తి, పీవీజేఎన్ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 యూబీఐ బ్రాంచ్‌లలో శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని యూబీఐ ఎఫ్‌జీఎం నవనీత్ కుమార్ వివరించారు. చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం -
జీపీఏ హోల్డర్ పన్ను ఎగవేసినా ఆస్తిని రిజిస్టర్ చేయాలి
సాక్షి, అమరావతి: జీపీఏ హోల్డర్ ఆదాయ పన్ను ఎగవేశారన్న కారణంతో అసలు యజమానికి చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించడం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి జీపీఏ హోల్డర్ది కానప్పుడు రిజిస్ట్రేషన్‌కు నిరాకరించకూడదని చెప్పింది. ఆ భూములు నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ)లో కూడా లేవని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని స్పష్టం చేసింది. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసి, విడుదల చేయాలని విశాఖపట్నం జిల్లా సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన జానపరెడ్డి వెంకట భారతి అనకాపల్లి జిల్లా రేబాకలో తనకున్న 2.50 ఎకరాలకు మర్రిపాలేనికి చెందిన నెట్టిమి ఉదయ భాస్కర్‌కు జీపీఏ ఇచ్చారు. ఈ భూమిలో 5,402 చదరపు గజాలు నీలంశెట్టి మల్లమ్మకు, 3,418 చదరపు గజాలు కోడూరు రూపకు 2014 సెప్టెంబర్‌లో జీపీఏ హోల్డర్ ద్వారా భారతి విక్రయించారు. అయితే సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వారి డాక్యుమెంట్లను విడుదల చేయలేదు. దీంతో 2015 జూలైలో మల్లమ్మ, రూప జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేశామని, ఆదాయ పన్ను శాఖ ఆమోదం లభించిన తరువాతే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ వారికి లేఖల ద్వారా తెలిపారు. దీనిని సవాలు చేస్తూ రూప, మల్లమ్మ 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.శివకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ జప్తు చేసిన ఉదయ భాస్కరరావు ఆస్తులు తాము కొన్న భూములు కూడా ఉన్నాయని తెలిపారు. 2014 సెప్టెంబరు 11న తాము రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్లు సమర్పించగా, అధికారులు ఆ నెల 29న జప్తు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. ఆదాయ పన్ను శాఖ జప్తు ఉత్తర్వుల కాల పరిమితి 2 సంవత్సరాలేనని, వాటిని అడ్డంపెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ తమ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయకుండా అట్టిపెట్టుకోవడం చెల్లదన్నారు. ఆదాయ పన్ను శాఖ తరఫున సీనియర్ న్యాయవాది కె.రాజిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కొన్న భూములు నిషేధిత జాబితాలో లేవని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
AP: ఊరిలోనే రిజిస్ట్రేషన్
సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రిజిస్ట్రేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలుత 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసింది. ఎలాంటి భూ వివాదాలు లేని, సమగ్ర భూ సర్వే పూర్తయిన 33 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మి, రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నం సచివాలయాల్లో సేవలను ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో నిర్దేశించిన 31 సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు ఏం జరుగుతోందంటే.. స్థిర, చరాస్తులు, విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు, దళారులు నిర్ణయించిన ధర చెల్లించాల్సి వచ్చేది. లేని పక్షంలో డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టి వెనక్కు పంపుతున్న సంఘటనలు కోకొల్లలు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు దళారులతో కుమ్మక్కు కావడంతో అక్రమ తంతు యథేచ్ఛగా నడిచేది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందేలా చర్యలు తీసుకుంది. భూముల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలన్నీ సచివాలయ కేంద్రంగానే చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. ప్రక్రియ సమర్థవంతంగా జరగాలంటే భూముల వివాదాలు ఉండకూడదని భావించింది. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి తొలుత అలాంటి గ్రామాలను ఎంపిక చేసింది. సిబ్బందికి అవగాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గ్రామ సచివాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి మరీ డాక్యుమెంట్ల పరిశీలన, చలానా తదితర విషయాలపై సమగ్రంగా సమాచారం అందించారు. ఇది వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందే సేవలన్నీ సచివాలయాలకు అనుసంధానం చేశారు. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్స్లీప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలిముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, దస్తావేజు, సెటిల్మెంట్ దస్తావేజు, దాన విక్రయ, తనఖా, చెల్లు రశీదు, భాగ పరిష్కార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు ఉన్న ఊళ్లోనే అందుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సచివాలయంలో ఒక పంచాయతీ సెక్రటరీకి ప్రభుత్వం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ హోదా కల్పించింది. ఇకపై సచివాయలంలో జరిగే స్థిర, చరాస్తి క్రయ, విక్రయాల విక్రయం, కోనుగోలుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మిలో ఇప్పటి వరకు 101 రిజిస్ట్రేషన్లు జరిగ్గా వీటి విలువ రూ.26,58,522గా ఉంది. రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. లేఅవుట్లు ఎక్కువగా ఉన్న కారణంతో భారీగా ఆదాయం సమకూరినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.16,96,53,581 విలువ చేసే 302 స్థిర, చరాస్తులు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.73,23,939 ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. త్వరలో మరిన్ని గ్రామాల్లో.. జిల్లాలో త్వరలో మరిన్ని గ్రామాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. అందులో నేలటూరు, నందిగంపాడు, జగన్నాథపురం, జగన్నాథపురం(గంగవరం), చిడిపి, తిమ్మరాజుపాలెం, బల్లిపాడు, పేరరామచంద్రపురం, అనపర్తి–5, కొప్పవరం, మహేంద్రవాడ–1, పోలమూరు–1, రామవరం–1, కుతుకులూరు–1, పెదపర్తి, పూలగుర్త, ఇల్లపల్లి, ఇల్లపల్లి(తుమ్మలాపల్లి), ఇల్లపల్లి(రాళ్లకండ్రిగ), కోమారిపాలెం–2, తొస్సిపూడి, పందలపాక–1,కొంకుదురూరు–1, దామిరెడ్డిపల్లి, బొమ్మూరు–2, రాజవోలు–1, శ్రీకృష్ణపట్నం, జి.ఎర్రవరం, నామవరం, సుభద్రంపేట, నార్త్ తిరుపతి రాజాపురం సచివాలయాల్లో త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం రిజిస్ట్రేషన్ పక్రియపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. స్థిరాస్తి క్రయ, విక్రయాలు, ఏ సేవకు ఎంత వసూలు చేయాలన్న విషయమై సమగ్రంగా చెబుతున్నాం. చలానాలు, ప్రభుత్వ ఫీజులు తీసుకోవాల్సిన వాటిపై చెబుతున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఎలా అధిగమించాలో స్పష్టం చేస్తున్నాం. తొలి విడతలో కేటాయించిన వాటిలో రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో సైతం పారదర్శకంగా జరిగేలా చూస్తాం. – ఆనందరావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ -
డూప్లి 'కేటుగాళ్లు'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని పాయకాపురంలో గీత అనే మహిళ పేరిట ఆస్తికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఉంది. దీనిని గుర్తించిన కేటుగాళ్లు అదే ప్రాంతంలో నివశిస్తున్న విజయలక్ష్మి పేరును ఆధార్ కార్డులో గీతగా మార్పించి.. రూ.12 లక్షల విలువైన ఇంటిస్థలాన్ని ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భవానీపురంలో మేర కోటేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యం కాని డాక్యుమెంట్లను గుర్తించి.. వాటిని వేరే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. సదరు ఆస్తులను తన కొడుకు శ్రీనివాసులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కొందరు లేఖరుల సాయంతో దర్జాగా సాగిపోతున్న దందాలు విశాఖపట్నంలో లాగిన తీగతో విజయవాడలో వెలుగులోకి వచ్చాయి. ఇలా బయటపడింది.. విశాఖపట్నానికి చెందిన ఎన్.వెంకటేశ్వరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కోసం దరఖాస్తు చేయగా.. తన స్థలాన్ని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి రాజు చైతన్య అనే వ్యక్తికి విజయవాడలోని గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం డొంక కదిలింది. ఈ ఫిర్యాదుతో మేల్కొన్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా వ్యవహరించి నిందితుడిని పిలిపించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. తిరిగి అతనిపైనే గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సహకరిస్తున్న వ్యక్తులెవరనేది కూపీ లాగుతున్నారు. కాగా, ప్రస్తుతం గుణదలకు చెందిన రాజుచైతన్య పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ముగ్గురు వ్యక్తులతో కూడిన బృందం సహకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. దొంగ రిజిస్ట్రేషన్లు ఇలా.. ప్రధానంగా ఆధార్ కార్డులో పేరు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆధార్ కార్డుల మార్పిడి ఇందిరాగాం«ధీ స్టేడియం సమీపంలో సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒరిజనల్ రికార్డుల మాదిరి డాక్యుమెంట్లు సృష్టించడంలో నిష్ణాతులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిణామాలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో కొందరు కేటుగాళ్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ కొన్ని ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేకపోతే సంబంధిత సిబ్బంది ‘నాట్ ఫౌండ్’ అని సమాచారమిస్తారు. దీంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మేర కోటేశ్వరావు అనే వ్యక్తితో కూడిన బృందం ఆరితేరినట్టు గుర్తించారు. కోటేశ్వరరావు విజయవాడలోని దేవీపేటలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. ఈ తరహాలో ఇప్పటికే నున్న, గాంధీనగర్, మైలవరం, గుణదల, పటమట, మైలవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. నున్న ప్రాంతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ప్రధానంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది, దస్తావేజు లేఖరులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, కొందరు సబ్రిజిస్ట్రార్లు సైతం సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించడం సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు ముందు ఓ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తగ్గిన తాకిడి
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో మళ్లీ స్తబ్ధత నెలకొంది. వారం రోజులుగా కొత్త ఒప్పందాలు పెద్దగా లేకపోవడంతో దస్తావేజుల నమోదు సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌కు కనీస ఆదరణ కరువైంది. అడపాదడపా మాత్రమే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా లావాదేవీలపై ఒప్పందాల అనంతరం అధికార రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు. కానీ మార్కెట్ విలువ, దాని ప్రభావంతో రిజిస్ట్రేషన్ రసుం పెంపు నేపథ్యంలో పాత ఒప్పందాల దస్తావేజుదారులు గత నెలాఖరులోగానే పోటీ పడి దాదాపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణాల లావాదేవీలపై ప్రభావం పడింది. దీంతో కొత్త దస్తావేజుదారుల తాకిడి లేక సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు వెలవెలబోతుండగా, డాక్యుమెంట్ రైటర్స్ కేంద్రాలు బోసిపోతున్నాయి. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) తగ్గిన రిజిస్ట్రేషన్లు.. గ్రేటర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దినసరి దస్తావేజుల నమోదు సంఖ్య సింగిల్ డిజిట్ దాటడం లేదు. మహా నగర పరిధిలో హైదరాబాద్ (సౌత్), రంగారెడ్డి, మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తున్నాయి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణంగా రోజూ కనీసం 20 నుంచి 40 వరకు, కొన్నింటిలో 80 నుంచి 140 వరకు స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది. వారం రోజులుగా దస్తావేజుల నమోదు సంఖ్య ఐదు నుంచి పదికి పడిపోయింది. నిరంతరం దస్తావేజుదారులతో కిటకిటలాడే ఉప్పల్, రంగారెడ్డి ఆర్వో, కుత్బుల్లాపూర్ మహేశ్వరం, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఇబ్రహీంపట్నం, ఫరూఖ్‌నగర్, వనస్థలిపురం తదితర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెద్దగా తాకిడి లేకుండాపోయింది. (క్లిక్: ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!) -
కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరల పెంపుతో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు విలువలు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. తద్వారా ప్రజలపై భారం పడుతుండగా.. రిజిస్ట్రేషన్ శాఖకు కాసులపంట పండనుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉన్న పట్టణాలు, పల్లెల్లో మార్కెట్ ధరలు పెంచుతున్నారు. గత జూలైలోనే పెంచగా.. ఇప్పుడు మళ్ళీ వాటికి వ్యవసాయ భూముల్లో సుమారుగా 50 శాతం వరకు, ప్లాట్లు, అపార్ట్మెంట్లలో 35 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల వారీగా మార్కెట్ ధరను పెంచగా కమిటీల సంతకాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. 5 నెలల్లోనే మరోసారి పెంపు... భూముల విలువ ప్రకారం భూ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా సుమారు తొమ్మిదేళ్ల కిత్రం పెంచగా గత జూలైలో మార్కెట్ విలువను సవరించారు. తొమ్మిదేళ్ల నుండి పెంచలేదు కాబట్టి పెంచారని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పాత విలువలను బట్టే ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంచుకోవడం కోసం ఎనిమిదేళ్ల తర్వాత గత జూలైలో పెంచింది. ఏడాది కూడా కాకుండానే పెంచిన ధరలను మళ్లీ 6 నెలలకే పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి 50 శాతం వ్యవసాయ భూములు.. 35 శాతం ప్లాట్లు కొత్తగా ప్రభుత్వం మార్కెట్ ధరను పెంచాలని తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయభూములు సుమారు 50 శాతం వరకు పెరగనున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా సైదాపూర్‌లో 2.25 లక్షల నుండి 3.37 లక్షలు పెరుగుతుండగా జమ్మికుంటలోని వ్యవసాయ భూములు మార్కెట్ విలువ ఎకరానికి 2.22 కోట్ల నుండి 3.33 కోట్ల వరకు పెరుగుతోంది. కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములు సైతం ఇదే స్థాయిలో పెరగనున్నట్లు సమాచారం. కరీంనగర్లో గరిష్టంగా గజానికి 32,500 ఉండగా ఇప్పుడు దానిని 37,400 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగుకు 2,200 ఉండగా ఇప్పుడు ఆ విలువను 3,300లకు పెంచనున్నారు. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) వేములవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లో కూడా పెంచారు. కరీంనగర్‌లోని ప్రధాన పట్టణాలైన జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, గంగాధరల్లో మార్కెట్ వ్యాల్యూ పెరుగుతున్నాయి. దీనివల్ల సుమారు 20 కోట్ల పైగానే రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రజల నెత్తిన మాత్రం భారం పడనుంది. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? మరికొంత సమయమివ్వాలి... ప్రభుత్వం ఫిబ్రవరి 1 తేదీ నుండి కొత్త ధరలు అమల్లోకి తీసుకువస్తుందని తెలియడంతో కరీంనగర్‌తోపాటు 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వారం రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలతోపాటు రామగుండం, హుజూరా బాద్, కోరుట్ల, మెట్పల్లి వంటి పట్టణ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మీసేవా, రిజిస్ట్రేషన్ సర్వర్లు బిజీ వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల గడువు ఇచ్చిన తర్వాత పెంచిన మార్కెట్ విలువను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రారంభ దశలో తడబడిన నగర రియల్టీ.. అనంతరం శరవేగంగా కోలుకుంది. వ్యాక్సినేషన్ పెరగడం, ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాల వృద్ధి, అందుబాటు ధరలతో గ్రేటర్లో ప్రతి నెలా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. గతేడాది డిసెంబర్లో 3,931 యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.2,340 కోట్లు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే రిజిస్ట్రేషన్ సంఖ్యలో 0.5 శాతం తగ్గాయి కానీ ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే మాత్రం 16 శాతం వృద్ధి రేటు నమోదయింది. 96 శాతం అధికం.. ► గతేడాది నగరంలో రూ.25,330 కోట్ల విలువ చేసే 44,278 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. 2020లో 22,570 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో ఆ తరగతి అఫర్డబుల్ గృహా కొనుగోళ్ల మీద ప్రత్యక్ష ప్రభావం పడింది. ► రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ రిజిస్ట్రేషన్లు 2020లో 30 శాతం జరగగా.. గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతానికి క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. 2021 డిసెంబర్‌లోని రిజిస్ట్రేషన్లలో 60 శాతం గృహాలు రూ.25– 50 లక్షల మధ్య ధర ఉన్నవే జరిగాయి. అన్ని కేటగిరీల్లో లగ్జరీ గృహాల రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. రూ.కోటి పైన ధర ఉన్న గృహాలు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) వెయ్యి నుంచి 2 వేల చ.అ. విస్తీర్ణం లోపు ఇళ్లకే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండాలనే అభిప్రాయం గృహ కొనుగోలుదారుల్లో పెరిగిపోయింది. దీంతో గతంలో కంటే కాస్త ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. గతేడాది డిసెంబర్లో వెయ్యి లోపు చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు 19 శాతం జరగగా.. వెయ్యి నుంచి రూ.2 వేల చ.అ. మధ్య ఉన్నవి 66 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలు 15 శాతం ఉన్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు) -
కొత్త సర్వర్‌పై రిజిస్ట్రేషన్లు మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వర్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం సోమవారం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణకు కలిపి హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించారు. గత రెండు రోజులుగా చేస్తున్న విభజన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరిలో ఉన్న పై–డేటా సెంటర్‌కి డేటాబేస్‌ను మార్చారు. ఇక్కడ సర్వర్ల సామర్థ్యాన్ని గతంకన్నా పెంచి డేటాబేస్‌ను సిద్ధం చేశారు. ఈ సర్వర్లపైనే సోమవారం టెస్టింగ్ కింద రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వరకు టెస్టింగ్‌లో భాగంగానే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మార్చిన సర్వర్‌లో వస్తున్న సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వర్ స్పీడ్ ఎలా ఉంది, ఎప్పుడు తగ్గుతుంది, వేలిముద్రల స్కానింగ్, వెబ్‌ల్యాండ్, స్టోరేజీ తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం నుంచి మార్చిన సర్వర్ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి సర్వర్‌తో ఇక్కట్లు సెంట్రల్ సర్వర్ వ్యవస్థ తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ల సామర్థ్యం సరిపోక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతాలున్నాయి. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించి మన రాష్ట్రంలో కొత్త డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రోజూ జరిగే రిజిస్ట్రేషన్లు, అవసరమైన స్టోరేజీ తదితర వాటికి అనుగుణంగా సర్వర్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల ఇకపై సర్వర్ సమస్యలు ఉండవని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. -
కరోనా వేళా ఆగని రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి వేళ రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు సాధారణ రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గినా.. ఇబ్బందులను అధిగమించి ఇబ్బడిముబ్బడిగానే జరిగాయి. ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఏప్రిల్, మే నెలల్లో రూ.650.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఆ రెండు నెలల్లో రూ.1,125.12 కోట్లు ఆదాయం ఆర్జించాల్సి ఉంది. కరోనా కల్లోలం సృష్టించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయక లక్ష్యం మేరకు ఆదాయం రాలేదు. అయినా.. లక్ష్యంలో 57.80 శాతం రెవెన్యూ సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ రెండు నెలల్లో కేవలం రూ.186.46 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.463.91 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం ద్వారా ఆదాయాన్ని పెంచగలిగారు. 1,91,696 రిజిస్ట్రేషన్లు ఈ రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,91,696 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23,674 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. తూర్పు గోదావరి జిల్లాలో 21,197, పశ్చిమగోదావరి జిల్లాలో 16,756 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 6,950 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెవెన్యూ పరంగా చూస్తే (నిర్దేశిత లక్ష్యం మేరకు).. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రూ.39.98 కోట్లు (లక్ష్యంలో 73.94%), ఆ తర్వాత నెల్లూరులో రూ.40.29 కోట్లు (లక్ష్యంలో 70.49 శాతం), కర్నూలులో రూ.51.63 కోట్లు (లక్ష్యంలో 70.05 శాతం) ఆదాయం లభించింది. శ్రీకాకుళంలో అతి తక్కువగా రూ.14.10 కోట్లు (లక్ష్యంలో 42.43 శాతం) ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలోనూ తక్కువగా రూ.35.02 కోట్లు (లక్ష్యంలో 46.83 శాతం) రెవెన్యూ వసూళ్లు జరిగాయి. ఉద్యోగులు కష్టపడ్డారు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసిన ఉద్యోగులకు అభినందనలు. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ -
లంచాల్లేకుండా రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : ‘పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించు కున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరిం చడానికి మార్గం కనిపెట్టాలి’ అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు/ భూముల రిజిస్ట్రేషన్లకు అనుసరించాల్సిన విధానంపై ఆదివారం ఆయన ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధివిధానాలు, మార్గ దర్శకాలు ఖరారు చేయాలన్నారు. వ్యవసా యేతర ఆస్తులు/భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంబించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు కె. తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉంటారు. 3,4 రోజులపాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతోసమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు కొత్త ఇబ్బందులు రావద్దు.. ‘వివిధ కారణాల వల్ల 70–80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకొనే విధానం రావాలి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకొని మంచి విధానం తీసుకురావాలి. మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘ధరణి’పై సీఎం సంతృప్తి.. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వివరాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతోందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలోనూ అలాంటి విధానమే రావాలని ఆకాంక్షించారు. కాగా, సీఎం ఆదేశాలతో మంత్రి వేముల ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింతమెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియఉండాలి. ప్రజలకులేని పోని కొత్తఇబ్బందులు రావద్దు.. సీఎం కేసీఆర్ ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ 3రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరు కున్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు. -
అరగంటలో ‘మ్యుటేషన్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయే తర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అరగంటలో పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందు బాటులోకి రానున్నాయి. గ్రామ పంచా యతీలు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లోనే మ్యుటేషన్లు పూర్తి కానున్నాయి. సరళీకృత ఫార్మాట్లో.. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం ప్రకారం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో (నాన్ అగ్రికల్చర్)ను క్లిక్ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్ స్లాట్ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ నమోదు చేయగానే వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. స్లాట్ బుక్ కాగానే అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడి మొబైల్ నంబర్‌కు సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్ బుకింగ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్లైన్లో ఈ–చలాన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు మళ్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. వెంటనే మ్యుటేషన్ సిగ్నేచర్ కోసం సబ్ రిజిస్ట్రార్‌కు పంపిస్తారు. ఈ సంతకం చేయడంతోనే సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. నేటి నుంచి ట్రయల్ రన్ .. బీఆర్కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి వార్‌రూంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి రోజుకు 10 రిజిస్ట్రేషన్ల చొప్పున మూడు రోజులపాటు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ధరణి సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించనున్నారు. ఈ నెల 23న నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
ధరణిలో ఆస్తుల నమోదుపై కోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదు ప్రక్రియపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది గోపాలశర్మ ఈ పిటిషన్‌ని దాఖలు చేశారు. చట్టబద్దత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారని కోర్టుకు విన్నవించారు. వెబ్సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని.. 15 రోజుల్లోనే వివరాలు నమోదు చేయాలంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటి అని ప్రశ్నించింది. (చదవండి: 20 దాకా ఆస్తుల నమోదు) ధరణిలో ఆస్తుల నమోదుకు గడువు లేదని, నిరంతర ప్రక్రియ అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆస్తుల నమోదుకు చివరి తేదీ లేదన్న ఏజీ వివరణను నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని చెప్పాలని ఏజీకి సూచించిన హైకోర్టు.. ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై విచారణను మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా వేసింది. అలానే ల్‌ఆర్‌ఎస్‌పై విచారణని నవంబర్ 5కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
20 దాకా ఆస్తుల నమోదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 20 వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శనివారంతో గడువు ముగిసిపోగా మరో 10 రోజులు పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టానికి ప్రతిపాదించిన పలు కీలక సవరణలను మంత్రివర్గం ఆమోదిం చింది. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు డివిజన్ కమిటీల పనివిధానం, డివిజన్ల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జీహెచ్ఎంసీలో ఇప్పటికే అమలులో ఉన్న 50 శాతం మహిళల కోటాకు చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకోసారి డివిజన్ల రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతితో మారుతున్నాయి. ఇకమీదట రెండు పర్యాయాలకు (పదేళ్లకు) ఒకసారి డివిజన్ల రిజర్వేషన్లు మారుతాయి. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఈ రెండు అంశాలతో పాటు ఇతర బిల్లులను మంగళ, బుధవారాల్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదింపచేసుకోనుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం పొందుపర్చింది. భూవినియోగ మార్పిడి కోసం ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడానికి నాలా చట్టానికి సవరణలు జరపాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప మార్పులతో సవరణలను జరపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్రమంత్రివర్గం ఈ మేరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. హెచ్ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానంపై మంత్రివర్గం చర్చించింది. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు., ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా, గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరపాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనికి 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎన్నిరోజులైనా వీటిని నడిపి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని కోరింది. కాగా, ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకుని, తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతాంగాన్ని కోరింది. మక్కల సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి యాసంగిలో మొక్కజొన్న సాగుపై కేబినెట్ చర్చించింది. దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని అభిప్రాయపడింది. కేంద్రం నిర్ణయాలతో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడటంపై కేబినెట్ ఆవేదన వ్యక్త చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ... మన రైతుల ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనే కేంద్రం ఆలోచన పట్ల కేబినెట్ విస్మయం వ్యక్తం చేసింది. విశ్వవిపణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉండటం, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో... మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది. -
తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం సాయంత్రం కేబినెట్లో ఆమోదం పొందనున్న కొత్త చట్టం ఇక ముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో నిర్ణయించనున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలో తహశీల్దార్ అధికారాలను సమీక్షించనున్న ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను తహశీల్దార్లకు అప్పగించే యోచన గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించే యోచన తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్ని కార్యాలయాలు తగ్గించి, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసే యోచన పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు! గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గించే యోచన ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాలు 443 తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు ఏర్పాట్లు ధరణి వెబ్సైట్లో ఇక పూర్తి పారదర్శకంగా భూముల వివరాలు అక్రమాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను తీర్చిదిద్దే యత్నం వీఆర్వోల వద్ద రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం రికార్డుల స్వాధీనం ఏ మేరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలగు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!) -
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ మినహాయింపుతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ, స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తుదారులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌తో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్) సౌకర్యం కూడా కల్పిస్తోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం నిర్ణయించుకున్న సమయం ప్రకారం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లడానికి పాస్ కూడా ఆన్లైన్లో లభిస్తుంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకునే దరఖాస్తుదారులు ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్ registration. telangana.gov.in లో పబ్లిక్ డాటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్స్ వివరాలను నమోదు చేసుకోవాలి. స్థిరాస్తి క్రయవిక్రయదారులు తమ మధ్య గల షరతులు, నిబంధనలను కచ్చితంగా పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే ఆస్తి విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహా ఇతర రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్టాంపు డ్యూటీ తదితర సుంకాలను పూర్తిగా ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. క్రయవిక్రయదారులు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకొని ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఈసీ, దస్తావేజు నఖలు పత్రాలను కూడా ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్ శాఖ కల్పించింది. రిజిస్ట్రేషన్ శాఖ registration. telangana.gov.in వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో రుసుము చెల్లించి పొందవచ్చు. ఐదుగురికి మాత్రమే అనుమతి కరోనా కట్టడిలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఒక స్థిరాస్తి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కేవలం ఐదుగురు సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు రిజిస్ట్రేషన్‌కు మధ్య కొంత సమయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఆస్తిని కొనుగోలు చేసేవారు, అమ్మేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నా.. స్లాట్ ప్రకారం ఒకసారి కేవలం ఐదుగురిని మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ వద్దకు అనుమతించి.. తర్వాత మరో ఐదుగురిని పంపిస్తారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో, రిజిస్ట్రేషన్ సంతకాలు, ఫొటోగ్రఫీ సందర్భంగా శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరి. మాస్కులు లేనిదే లోపలికి అనుమతించరు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. -
ఇక రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ (పలానా రోజు,సమయం)ను బుక్ చేసుకునే సదుపాయం అందుబా టులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి ఆన్లైన్ స్లాట్ విధానం అమలుకు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమైంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో స్లాట్ విధానానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్లాట్ బుక్ చేసుకోని వారి దస్తావేజులను పరిశీలించి నమోదు చేయనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారి దస్తావేజుల నమోదు రోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పూర్తిచేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత స్కాన్ అయిన డాక్యుమెంట్లను ఆ రోజే సంబంధిత దస్తావేజుదారుకు అందజేస్తారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజు 18 మందికి మాత్రమే స్లాట్ బుక్ చేసుకొని స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఇలా..:స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆన్లైన్ ప్రీ–రిజి స్ట్రేషన్ డాటా ఎంట్రీకి అవకాశం ఇవ్వడంతో దస్తావేజుదారులు ఇంటి వద్దే ఆన్లైన్లో డాక్యుమెంట్‌ను తయారుచేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ చలానా నమూనాలతో పాటు ఫీజు రుసుం వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఉంటాయి. పబ్లిక్ డాటా ఎంట్రీ పూర్తిచేసి ఎలక్ట్రానిక్ చలానా జత పర్చాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డాక్యుమెంట్ ఎంట్రీ పూర్తి కాగానే పది అంకెల నంబర్ వస్తుంది. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఈ పది అంకెల నంబర్‌ను సబ్ రిజిస్ట్రార్‌కు ఇస్తే వెంటనే దానిని ఆన్లైన్లో పరిశీలించి తప్పులుంటే సరిచేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను పూర్తి చేసి సాయంత్రంలోగా స్కాన్ చేసిన దస్తావేజులను ఇస్తారు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాటా ఎంట్రీకి స్వస్తి... స్లాట్ బుకింగ్ ఆన్లైన్ విధానం వల్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకు స్వస్తి పలకనున్నారు. ఆన్లైన్లోనే పూర్తి ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్ వద్ద దస్తావేజులు తయారు చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆఫ్‌లైన్‌లో సమర్పించేవారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు డాటా ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్ నమోదు పూర్తి చేసేవారు. ఇక మీదట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఉండదు.