quarter
-
కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం
Coffee Day Enterprises ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొంటున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ జులై–సెపె్టంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 434 కోట్ల రుణ(అసలు, వడ్డీ) చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్–జూన్‌లోనూ రూ. 440 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందడం గమనార్హం! తాజా త్రైమాసికంలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాల చెల్లింపులను పూర్తిచేయలేకపోయినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. వీటిలో క్యాష్ క్రెడిట్ తదితర రుణాలు రూ. 189.14 కోట్లుకాగా.. వీటిలో అసలు విలువ రూ. 183.36 కోట్లుగా కంపెనీ తెలియజేసింది. ఇక చెల్లించవలసిన అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీల(ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్లు) విలువ రూ. 244.77 కోట్లలో అసలు రూ. 200 కోట్లుకాగా.. వడ్డీ రూ. 44.77 కోట్లుగా వివరించింది. డిఫాల్ట్ నేపథ్యంలో రుణదాతలు రుణ రికవరీ నోటీసుల జారీతోపాటు.. న్యాయ వివాద చర్యలకు దిగినట్లు తెలియజేసింది. రికవరీ నోటీసులు, న్యాయ వివాదాలు, రుణదాతలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోఉన్న కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేయలేదని వెల్లడించింది. -
ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ కరెన్సీ ఏదో తెలుసా? నమ్మలేరు!
తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ‘ఆఫ్ఘని’ ఆశ్చర్యకరంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. ఈ త్రైమాసికంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ పనితీరుతో టాప్-3లో చోటు సంపాదించుకుంది. రెండేళ్ళ క్రితం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడి ఆర్థికపరిస్థితి అతలాకుతమైంది. ఆఫ్ఘన్ జాతీయ కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. కానీ తాలిబన్ల కీలక చర్యలతో ఈ త్రైమాసికంలో ఆఫ్గని అనూహ్యంగా పుంజుకోవడం విశేషంగా నిలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం కొలంబియన్ పెసో, శ్రీలంక రూపాయి తర్వాత 2023లో ప్రపంచంలో మూడో అత్యంత బలమైన పనితీరు కనబర్చిన కరెన్సీగా అవతరించింది. ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఆ దేశానికి అందిన మిలియనర్ల డాలర్ల సాయం, పొరుగు దేశాలతో పెరిగిన వాణిజ్యం దీనికి కారణమని భావిస్తున్నారు. మానవ హక్కుల విషయంలో ప్రపంచంలోనే దారుణంగా పడిపోయి, పేదరిక పీడిత దేశంగా పేరొందిన ఆఫ్గాన్ కరెన్సీ బలోపేతం చేయడానికి తాలిబాన్ చర్యలు కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తన కరెన్సీ బలోపేతం చేయడానికి అనేక చర్యలను అమలు చేసింది. ఆఫ్ఘని సంవత్సరానికి దాదాపు 14శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడవ బలమైన కరెన్సీగా నిలిచింది, కొలంబియన్ పెసో మరియు శ్రీలంక రూపాయి కంటే మాత్రమే వెనుకబడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, కరెన్సీ నియంత్రణలు, నగదు ప్రవాహం,చెల్లింపులతో ఆఫ్ఘని ఈ త్రైమాసికంలో సుమారుగా 9 శాతం పుంజుకుంది. కొలంబియన్ పెసో 3 శాతం లాభాలను అధిగమించింది. (ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!) కరెన్సీలో ఈ పెరుగుదల ఆఫ్ఘనిస్తాన్ అంతర్గతం సంక్షోభం ఇంకా అలాగే ఉందనీ, ముఖ్యంగా ఆర్థిక ఆంక్షల కారణంగాకా దేశం ప్రపంచ ఆర్థికవ్యవస్థ నుంచి దూరంగా ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రధానంగా నిరుద్యోగం తీవ్రంగా ఉంది. మూడింట రెండొంతుల కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి బదులుగా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2021 చివరి నుంచి ప్రతి కొన్ని వారాలకు ఐక్య రాజ్యసమితి క్రమం తప్పకుండా 40 మిలియన్ల డాలర్లకు పైగా సాయం అందిస్తోంది. మరోవైపు కరెన్సీ నియంత్రణలు ప్రస్తుతానికి పని చేస్తున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, అస్థిరత ఏర్పడొచ్చని వాషింగ్టన్‌లోని న్యూ లైన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ & పాలసీలో మిడిల్ ఈస్టర్న్, సెంట్రల్ అండ్ దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు కమ్రాన్ బోఖారీ హెచ్చరిస్తున్నారు. -
ఈఎస్జీ ఫండ్స్‌కు అమ్మకాల సెగ - భారీగా కోల్పోయిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్) ఫండ్స్ జూన్ త్రైమాసికంలో రూ.520 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. అంతకుముందు మార్చి త్రైమాసికంలో ఈఎస్జీ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకున్న రూ.470 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే పెరగడం గమనార్హం. ‘‘కొత్త ఈఎస్జీ పథకాల ఆవిష్కరణతో ఏఎంసీలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కానీ, స్థిరంగా ఈఎస్జీ పథకాలు పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం ఇంకా ఏర్పడాల్సి ఉంది’’అని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ఇక ఏడాది జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈఎస్జీ పథకాల నుంచి నికరంగా రూ.1,060 కోట్లు బయటకు వెళ్లాయి. గతేడాది ఇదే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ రూ.1,020 కోట్లుగా ఉంది. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1.83 లక్షల కోట్లను ఆకర్షించడంతో పోలిస్తే, ఈఎస్జీ పథకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఆరంభ దశలోనే.. ‘‘సస్టెయినబుల్ ఫండ్ (ఈఎస్జీ ఫండ్స్) మార్కెట్ భారత్‌లో ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కరోనా తర్వాత ఇన్వెస్టర్లలో ఆసక్తికి అనుగుణంగా ఎన్నో ఈఎస్జీ పథకాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నుంచి గడిచిన 24 నెలల్లో కొత్త పథకాలు ఊసే లేదు’’అని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. దీంతో భారత్‌లోని ఈఎస్జీ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రెండేళ్లుగా రూ.10,000–12,000 కోట్ల స్థాయిలోనే ఉండిపోయినట్టు పేర్కొంది. జూన్ చివరికి ఇవి రూ.11,040 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. మొత్తం మీద ఈఎస్జీ ఫండ్స్ విభాగంలో 11 పథకాలే అందుబాటులో ఉన్నాయి. ఇందులోనూ టాప్–5 పథకాల్లోనే 87 శాతం నిర్వహణ ఆస్తులు ఉన్నట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ఈ 11 పథకాల్లోనూ 8 ఫండ్స్ యాక్టివ్ నిర్వహణలో ఉన్నవి. -
కాఫీడే కష్టాలు: రూ. 440 కోట్ల రుణాల డీఫాల్ట్
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రూ. 440 కోట్ల మొత్తాన్ని డీఫాల్ట్ అయ్యింది. రూ. 220 కోట్ల రుణానికి సంబంధించి రూ. 190 కోట్ల అసలు, సుమారు రూ. 6 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు అలాగే, ఎన్సీడీలు మొదలైన బాకీల విషయంలో దాదాపు రూ. 245 కోట్లు డీఫాల్ట్ అయినట్లు వివరించింది. 2019లో వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణానంతరం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిన సీడీఈఎల్ ఆ తర్వాత నుంచి అసెట్ల విక్రయం తదితర మార్గాల్లో రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదీ చదవండి: Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
స్టార్టప్స్‌కు తగ్గిన నిధులు
భారతీయ స్టార్టప్స్ 2022 క్యూ1లో 12 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనికార్న్ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్ స్టోరీ. ఇంక్42 రూపొందించిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఫండింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఫిన్‌టెక్ ముందంజలో.. మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్ 22.1 శాతం, ఎంటర్ప్రైస్టెక్ 6.8, కంన్జ్యూమర్ సర్విసెస్ 6.5, డీప్‌టెక్ 5.1, ఎడ్టెక్ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి. డీల్స్ సంఖ్య పరంగా ఎంటర్ప్రైస్టెక్ 41, ఈ–కామర్స్ 40, ఫిన్‌టెక్ 25, డీప్‌టెక్ 21, ఎడ్టెక్ 17, మీడియా, వినోదం 16, హెల్త్‌కేర్ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్‌టైమ్ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం. పడిన సీడ్ ఫండింగ్.. మందగమనం ఉన్నప్పటికీ భారత్ స్టార్టప్స్‌కు అత్యధిక సీడ్ ఫండింగ్ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్ డాలర్ల సీడ్ ఫండ్‌లో 2 బిలియన్ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్ ఫండింగ్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్ డాలర్లుగా ఉంది. స్టార్టప్ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్‌తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్‌కు చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. కారణం ఏమంటే.. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్‌ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్‌ను స్పష్టంగా దెబ్బతీసింది. 2021 బుల్ రన్ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. ఇవీ గణాంకాలు.. సిరీస్ సి–రౌండ్స్‌లో గరిష్ట కరెక్షన్తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్‌లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్–3లో నిలిచిన ఫోన్‌పే 650 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 500 మిలియన్ డాలర్లు, ఇన్సూరెన్స్‌దేఖో 150 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 212 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్ స్టేజ్ ఫండింగ్ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్ స్టేజ్ ఫండింగ్ 76% క్షీణించి 700 మిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్–ఏ డీల్స్ 58 నుంచి 30కి, సిరీస్–బీ డీల్స్ 28 నుంచి 4కు పడిపోయాయి. -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్‌లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది!
న్యూఢిల్లీ: ఓవైపు వర్క్‌ఫ్రం హోం విధానానికి ముగింపు పలికేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా... మరోవైపు వర్క్‌ఫ్రం హోంకే మెజారిటీ ఉద్యోగార్థులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు, పని విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. తొమ్మిది నగరాల్లోని 1,200 కంపెనీలతోపాటు 1,500 మంది ఉద్యోగుల నుంచి ఈ సర్వే కోసం శాంపిల్స్ సేకరించారు. వర్క్‌ఫ్రం హోం బెటర్ కరోనా కేసులు తగ్గినా.. దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లి పని చేసేయడానికి ఫ్రెషర్లు విముఖత చూపిస్తున్నారు. ఇంటి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పనికి 46 శాతం మంది మద్దతు తెలపగా హైబ్రిడ్ విధానం ఉండాలని 29 శాతం మంది అన్నారు. హైబ్రిడ్ అంటున్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసు, ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మేలని 42 శాతం కంపెనీలు తెలిపాయి. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందని ఆ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. కాగా ఇంటి నుంచి విధులు ఉండాలని 35 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడమే సరైన పద్దతని 23 శాతం కంపెనీలు చెప్పాయి. ఆఫీసే... మేల్ వర్క్‌ఫ్రం హోం విధానానికి మేల్ ఎంప్లాయిస్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. అయితే ఇదే సమయంలో మహిళలు వర్క్‌ఫ్రం హోంకే జై కొడుతున్నారు. ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పని కొనసాగించడమే బాగుంది 51 శాతం మహిళలు తెలియజేస్తే.. పురుషుల విషయంలో ఇది 29 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సాధారణంగా బయటకు వెళ్లి పని చేయడాన్ని ఇష్టపడే మగవాళ్లు, వర్క్‌ఫ్రం హోంలో ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటాన్ని ఇష్టపడటం లేదు. వేతనమే ముఖ్యం వర్క్‌ఫ్రం హోం , ఆఫీస్ అనే తేడాలు పెద్దగా పట్టించుకోమని కంపెనీ ఎంత వేతనం అందిస్తుంది అనేదే తమకు ప్రాధాన్యమని 25 శాతం మంది ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. నియమకాలు పెరిగాయ్ దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఐటీ 61 శాతం, ఆర్థిక సేవలు 48, బీపీవో, ఐటీఈఎస్ రంగాలు 47 శాతం వృద్ధి కనబరిచాయి. అయితే గడిచిన త్రైమాసికంలో పదోన్నతి, వేతన పెంపు అందుకోలేదని 70 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. -
టాప్‌గేర్‌లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
Tcs : రూ.9వేల కోట్లు దాటిన ఆదాయం!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28.5 శాతం ఎగసి రూ. 9,008 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,008 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18.5 శాతం పుంజుకుని రూ. 45,411 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 38,322 కోట్ల టర్నోవర్ నమోదైంది. భాగస్వామ్యాలు.. క్యూ1లో యూఎస్‌కు చెందిన బయోఫార్మా కంపెనీ డిజైన్, ఆచరణ సేవలకుగాను టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. జర్మనీలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన నార్డ్ ఎల్బీ ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు వ్యూహాత్మక భాగస్వామిగా టీసీఎస్‌ను నియమించుకుంది. కమిన్స్ ఇంక్ గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ కోసం టీసీఎస్ సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ కంపెనీలలో ఒకటైన కార్నివాల్ కార్పొరేషన్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసులకు టీసీఎస్‌తో జట్టు కట్టింది. అంతేకాకుండా గ్లోబల్ హెచ్ఆర్ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ ఇంటిగ్రేటర్ భాగస్వామిగానూ ఎంపిక చేసుకుంది. క్యూ1 మైలురాళ్లు.. ♦ నికరంగా 20,409 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,09,058కి చేరింది. వెరసి 5 లక్షల మంది ఉద్యోగుల మైలురాయిని తొలిసారి అధిగమించింది. ♦ ఒక త్రైమాసికంలో 6 బిలియన్ డాలర్ల(రూ. 44,700 కోట్లు) ఆదాయాన్ని తొలిసారి సాధించింది. ♦ 8.1 బిలియన్ డాలర్ల విలువైన(టీసీవీ) కాంట్రాక్టులను సంపాదించింది. నిర్వహణ మార్జిన్లు 2 శాతం బలపడి 25.5 శాతాన్ని తాకాయి. నికర మార్జిన్లు 19.8 శాతంగా నమోదయ్యాయి. ♦ షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. జూలై 16 రికార్డ్ డేట్. ♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 8.6 శాతంగా నమోదైంది. ♦ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్– సెప్టెంబర్‌కల్లా సిబ్బంది కుటుంబాలకూ వ్యాక్సిన్లు ♦ వార్షిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 25.4 శాతం, రిటైల్, సీపీజీ 21.7 శాతం, బీఎఫ్ఎస్ఐ 19.3 శాతం, తయారీ 18.3 శాతం, టెక్నాలజీ 12.3 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 6.9 శాతం చొప్పున ఎగశాయి. ♦ ప్రాంతాలవారీగా.. ఉత్తర అమెరికా 15.8 శాతం, యూకే 16.3 శాతం, యూరోప్ 19.7 శాతం, లాటిన్ అమెరికా 16 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 25.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక దేశీయ బిజినెస్ 25.3 శాతం, ఆసియా పసిఫిక్ 9.3 శాతం చొప్పున వృద్ధి చూపాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ♦ దేశీ ఆదాయం 14.1% క్షీణత చవిచూసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలను ప్రకటించింది. షేరు 0.7% క్షీణించి రూ. 3,253 వద్ద ముగిసింది. -
దుమ్ము రేపిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల జోరు నడుస్తోంది. 2020 జూలై-డిసెంబరులో 10 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక ఆరు నెలల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. మొత్తం మొబైల్స్ మార్కెట్లో 19శాతం వాటాతో సామ్సంగ్ లీడర్‌గా నిలిచిందని సైబర్ మీడియా రిసర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. చైనా కంపెనీ షావొమీ అక్టోబరు-డిసెంబరులో 27 శాతం వాటాతో తొలి స్థానంలో ఉందని తెలిపింది. గతేడాది తొలి అర్దభాగంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో మార్కెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీలు బలంగా రంగంలోకి దిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో మొబైల్స్ డిమాండ్ అధికమైంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలోనూ మొబైల్స్ పరిశ్రమ 2020లో నిలదొక్కుకోవడం గుర్తిండిపోయే అంశం. వృద్ధి 10 శాతం ఉండొచ్చు.. ప్రస్తుత ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని సీఎంఆర్ అంచనా వేస్తోంది. 5జీ మోడళ్ల విక్రయాలు 10 రెట్లు అధికమై 3 కోట్ల యూనిట్లకు ఎగుస్తుందని తెలిపింది. బేసిక్ ఫోన్ యూజర్లు స్మార్ట్ఫోన్ల వైపు పెద్ద ఎత్తున మళ్లుతున్నారు. అన్ని ధరల్లోనూ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్న మోడళ్లు.. రూ.20 వేల లోపు ధరలోనూ 5జీ మోడళ్ల రాక..వెరశి ఈ ఏడాది మార్కెట్ కొత్త పుంతలు తొక్కనుంది. 2020లో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రూ.13,000 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.14,000 లకు చేరిందని బిగ్-సి మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ట్రెండ్‌ను చూస్తుంటే ఈ ఏడాదే స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రూ.15,000లను తాకుతుందని అన్నారు. ఒకదానికి ఒకటి పోటీగా.. దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 58% వాటాతో వన్‌ప్లస్ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాపిల్‌కు 20% వాటా ఉంది. దేశంలో టాప్-10 బ్రాండ్స్‌లో యాపిల్ ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2020 అక్టోబరు-డిసెంబరులో సామ్సంగ్ 20% వాటా పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 35% వృద్ధి సాధించింది. వివో 14%, రియల్మీ 11, ఒప్పో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. క్యూ 4లో వివో సేల్స్ 25% తగ్గగా, రియల్మీ 50%, ఒప్పో 14% అమ్మకాలను పెంచుకున్నాయి. ఫీచర్ ఫోన్ల విభాగంలో 20% వాటాతో తొలి స్థానంలో ఉన్న ఐటెల్ అమ్మకాలు క్యూ 4లో 2% తగ్గాయి. -
పెట్టుబడులకు ‘బంగారం’!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి తీవ్రత, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడులకు పసిడి ఆకర్షణీయంగా నిలిచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి రూ.2,426 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు భారత్ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) తాజా గణాంకాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ 2019 జూలై–సెప్టెంబర్ మధ్య గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.172 కోట్లే. ⇔ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి క్యూ2లో రూ.5,957 కోట్ల నికర పెట్టుబడులు వస్తే, ఇందులో గోల్డ్ ఈటీఎఫ్‌లదే అధిక మొత్తం. ⇔ నెలవారీగా చూస్తే, జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.202 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ పెట్టుబడుల విలువ రూ.1,483 కోట్లుగా ఉంది. అయితే రూ.195 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. లాభాల స్వీకరణ దీనికి కారణం. ⇔ ఇక ఏప్రిల్ (రూ.731 కోట్లు), మే (రూ.815 కోట్లు), జూన్ (రూ.494 కోట్లు), జూలై (రూ.921 కోట్లు), ఆగస్టు (రూ.908 కోట్లు), సెప్టెంబర్ (రూ.597 కోట్లు)లో నికర పెట్టుబడులు కొనసాగాయి. ⇔ గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న మొత్తం విలువ (ఏయూఎం) సెప్టెంబర్ 2020 నాటికి రూ.13,590 కోట్లు. 2019 సెప్టెంబర్ ముగింపునాటికి ఈ విలువ రూ.5,613 కోట్లుగా ఉంది. ఆర్థిక అనిశ్చితే కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకుల మార్కెట్‌ను ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులకు పసిడే సురక్షితమైనదని భావిస్తున్నారు. మార్కెట్లు దాదాపు రికవరీ బాటన నడుస్తూ, కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనిశ్చితి తొలగిపోని పరిస్థితి కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు గత ఏడాది కాలంగా మంచి రిటర్న్స్ అందించడానికి ఆర్థిక అనిశ్చితే కారణం. దీనికి ప్రస్తుతం కరోనా మహమ్మారి కూడా తోడయ్యింది. అమెరికా ఎన్నికలు, ఫలితాలు రానున్న రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా గోల్డ్ ఈటీఎఫ్లనే ఎంచుకుంటారని భావిస్తున్నాం. అంతక్రితం రెండు నెలలతో పోల్చితే, సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినా, ఇక్కడ పాజిటివ్ అవుట్‌లుక్ మాత్రమే కనబడుతోంది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతుండడం, ఉద్దీపన చర్యలతో వ్యవస్థలోకి వస్తున్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల వల్ల పెట్టుబడులు సురక్షిత సాధనమైన పసిడిలోకే మళ్లే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా ఫిజికల్ గోల్డ్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నాం. – దివామ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకులు -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
కోటక్ బ్యాంకు ఫలితాలు భేష్
♦ జూన్ క్వార్టర్లో లాభం 1,347 కోట్లు ♦ 26 శాతం పెరుగుదల ♦ కలిసొచ్చిన సబ్సిడరీల పనితీరు ముంబై: అనుబంధ సంస్థల చక్కని పనితీరు, కోర్ ఆదాయం పెరగడంతో జూన్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 26 శాతం వృద్ధితో రూ.1,346.82 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఆర్జించిన లాభం చూసుకున్నా 23 శాతం వృద్ధితో రూ.913 కోట్లుగా నమోదయింది. నికర వడ్డీ ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ.2,246 కోట్లకు చేరింది. అయినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గడం గమనార్హం. 0.20 తగ్గి 4.4 శాతానికి పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం రూ.733 కోట్ల నుంచి రూ.906 కోట్లకు వృద్ధి చెందింది. వాహన రుణాల విబాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.132 కోట్లుగా నమోదైంది. కొత్తగా యాప్ ఆధారిత డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు, ఇతర సేవలకు సంబంధించి మార్కెటింగ్ కోసం చేసిన వ్యయాల రూపేణా బ్యాంకుపై రూ.63 కోట్ల భారం పడింది. చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జైమిన్ భట్ మాట్లాడుతూ... ఎంసీఎల్ఆర్ రేటు మార్జిన్లపై ప్రభావం చూపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 4.2–4.3 శాతానికి పరిమితం అవుతుందని చెప్పారు. రుణాల్లో 19 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగ ఎక్విప్మెంట్ విభాగాల్లో అధికంగా రుణాలివ్వడమే దీనికి కారణం. పెద్ద కార్పొరేట్లు, కన్జ్యూమర్ రుణాల్లోనూ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆస్తుల నాణ్యత విçషయానికొస్తే... స్థూల ఎన్పీఏలు 1.07%గా ఉన్నాయి. వీటికి కేటాయించిన నిధులు మాత్రం రూ.232కోట్లకు పెరిగాయి. దివాళా చర్యలకు ఆర్బీఐ గుర్తించిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో నాలుగింటిలో కోటక్ బ్యాంకు వాటా కూడా ఉంది. -
మైండ్ ట్రీ లాభాలకు కరెన్సీ, వీసాల సెగ
క్యూ1 స్వల్ప క్షీణత; రూ.122 కోట్లు న్యూఢిల్లీ: మధ్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లాభం జూన్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించింది. రూ.121.7కోట్ల లాభాన్ని ఆర్జించింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వీసా వ్యయాలు అధికం కావడం, అనుబంధ సంస్థల నుంచి ఎదురైన ప్రతికూలతలు ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,347 కోట్ల నుంచి రూ.1,355 కోట్లకు పెరిగింది. కంపెనీ సీఈవో, ఎండీ రోస్టోవ్ రావణన్ మాట్లాడుతూ.. తమ సబ్సిడరీలైన మ్యాగ్నెట్, బ్లూఫిన్ ప్రభావం లాభాలపై పడిందని, ఓ క్లయింట్ ప్రాజెక్టు నిలిచిపోయినట్టు చెప్పారు. తాము కొనుగోలు చేసిన ఈ సబ్సిడరీల నుంచి కొంత కాలం పాటు ప్రతికూలతలు ఉండొచ్చన్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది వృద్ధి అంచనాలను సవరించాల్సి వస్తుందన్నారు. వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై 1.5 – 2 శాతం మేర ఉంటుందని తెలిపారు. -
హెచ్‌యూఎల్ లాభం 9 శాతం అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 9.28 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 1,174 కోట్లు. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 4.98 శాతం వృద్ధితో రూ. 8,662 కోట్ల నుంచి రూ. 9,094 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ. 8,910 కోట్ల నుంచి రూ. 9,335 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం హెచ్‌యూఎల్ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,058 వద్ద ముగిసింది. -
కార్గోలో 12 శాతం వృద్ధి: ఎస్సార్ పోర్ట్స్
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్గో విభాగంలో 12 శాతం వృద్ధి సాధించామని ఎస్సార్ పోర్ట్స్ సీఎండీ రాజీవ్ అగర్వాల్ చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్ని ఆయన శుక్రవారమిక్కడ విడుదల చేశారు. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 19.62 మెట్రిక్ టన్నుల ఎగుమతులు సాధించామన్నారు. థర్డ్ పార్టీ కార్గోలోనూ 60 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. హజారియా పోర్ట్ యూనిట్లో 26 శాతం, పారాదీప్‌లో 131 శాతం, విశాఖలో 21 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇదే ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ముందుకెళతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
రెండో త్రైమాసికం బాగుంటుంది
ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా సింగపూర్: ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో భారత్ వృద్ధి మెరుగ్గా ఉండగలదని జపాన్‌కి చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా వేసింది. క్యూ1లో వృద్ధి 6.1 శాతంగా ఉంటే .. క్యూ2లో 6.5–7% శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)తో కొంత అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం స్వల్పకాలికంగానే ఉండి రెండో త్రైమాసికంలో మెరుగైన వృద్ధికి ఉపయోగపడగలదని తెలిపింది. ‘కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు మొదలైన వాటి విక్రయాలు.. బొగ్గు, విద్యుదుత్పత్తి మొదలైనవి పెరుగుతున్న నేపథ్యంలో తొలి త్రైమాసికం కన్నా జూన్ క్వార్టర్లో వృద్ధి సగటున కొంత మెరుగ్గా ఉండగలదు‘ అని నొమురా చీఫ్ ఎకానమిస్ట్ సోనల్ వర్మ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్లు ఆమె వివరించారు. అయితే, జీఎస్టీ విధానానికి మారే క్రమంలో టోకు వర్తకులు .. నిల్వలు తక్కువ స్థాయిల్లో ఉంచవచ్చని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే.. భారత్ వృద్ధి ఈ ఏడాది 7%గాను, వచ్చే ఏడాది 7.8%గాను ఉండొచ్చని తెలిపారు. 2016–17లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మూడేళ్ల కనిష్టమైన 7.1%కి పడిపోయిన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టెలికం ఆదాయం 10% డౌన్: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం రంగా నికి మొబైల్ టెలిఫోనీ, డేటా వంటి కన్సూమర్ సర్వీసుల నుంచి వచ్చే ఆదాయం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో తగ్గింది. ఆదాయం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 10.5 శాతం క్షీణతతో రూ.37,284 కోట్లకు తగ్గిందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. కన్సూమర్ సర్వీసుల ఆదాయం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.41,681 కోట్లుగా నమోదయ్యిందని పేర్కొంది. ఆదాయం తగ్గుదలకు జియో ఉచిత సర్వీసులే ప్రధాన కారణమని ప్రధాన టెలికం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. -
క్యూ4పై తగ్గిన వ్యాపార విశ్వాసం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) డిమాండ్ పరంగా వృద్ధి అవకాశాలపై వ్యాపారవర్గాల విశ్వాస అంచనాలు మరింత తగ్గాయి. ఇవి అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం తరహాలోనే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసిన పారిశ్రామిక అంచనాల సర్వేలో వెల్లడైంది. ముడి వస్తువుల ధరల పెరుగుదల ఒత్తిడితో లాభాల మార్జిన్లు తగ్గవచ్చని సర్వే పేర్కొంది. దాదాపు 1,221 తయారీ కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. క్యూ3లో దేశీ తయారీ రంగ సంస్థల వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి, క్యూ4లో వాటి అంచనాలపై అవగాహనకు ఈ సర్వే తోడ్పడుతుందని ఆర్బీఐ తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 3,865 కోట్లు
• 15 శాతం పెరుగుదల • బ్యాంక్ చరిత్రలో కనిష్ట వృద్ధి ఇదే న్యూఢిల్లీ: ప్రైవేట్‌రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,865 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం(రూ.3,357 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల ఉపసంహరణల కారణంగా మార్జిన్లు తగ్గడంతో నికర లాభం వృద్ధి నెమ్మదించిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ చెప్పారు. 300 కోట్ల డాలర్ల ఎన్నారై డిపాజిట్ల రిడంప్షన్ కారణంగా ఫారిన్ కరెన్సీ లోన్ బుక్ 200 కోట్ల డాలర్లు తగ్గడం మార్జిన్లపై ప్రభావం చూపిందన్నారు. అయితే బ్యాంక్ చరిత్రలో అత్యంత తక్కువ వృద్ధి సాధించిన క్వార్టర్ ఇదే. రెండేళ్ల క్రితం వరకూ ఈ బ్యాంక్ ఎప్పుడూ నికర లాభంలో 30 శాతం వృద్ధిని సాధిస్తూ వచ్చేది. రెండేళ్ల క్రితం బ్యాంక్ నికర లాభం 20 శాతం స్థాయిలకు పడిపోయింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం అప్.. మొత్తం ఆదాయం రూ.18,283 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.20,748 కోట్లకు పెరిగిందని సుక్తాంకర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరుగుదలతో రూ.8,309 కోట్లకు ఎగసిందని తెలిపారు. 19% రుణ వృద్ది సాధించామని, నికర వడ్డీ మార్జిన్ 4.1%గా ఉందని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 0.29% నుంచి 0.32%కి పెరిగాయని తెలిపారు. గత క్యూ3లో రూ.716 కోట్లుగా ఉన్న మొండిబకాయిల కేటాయింపులు 9 శాతం పెరిగి రూ.716 కోట్లకు చేరాయని వివరించారు. గత ఏడాది నవంబర్ 8 నాటి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలు 37 శాతం పెరిగాయని పేర్కొన్నారు. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 1.5 శాతం వృద్ధితో రూ.1,268 వద్ద ముగిసింది. -
వచ్చే త్రైమాసికానికి సాధారణ స్థితి: టాటా స్టీల్
నవంబర్ కంటే డిసెంబర్లో పరిస్థితులు మెరుగు జంషెడ్పూర్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ప్రతికూలతల నుంచి వచ్చే త్రైమాసికం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటామని టాటా స్టీల్ ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్ 8న కేంద్రం డీమానిటైజేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో విక్రయాలు మెరుగ్గా ఉన్నాయని టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో దేశీయంగా స్టీల్ రంగం క్లిష్ట పరిస్థితులను చవి చూసిందన్నారు. చైనా సహా, ఇతర దేశాల నుంచి దేశంలోకి భారీ ఎత్తున స్టీల్ దిగుమతి అవుతున్న తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని దేశీయ స్టీల్ పరిశ్రమకు మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో ఈ రంగంలో రూ.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగిందని... దేశ అభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశీయ స్టీల్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని నరేంద్రన్ అభినందించారు. 2016 ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. అయితే, గత మూడు, నాలుగు నెలల కాలంగా స్టీల్ ముడి సరుకైన ఐరన్ ఓర్, బొగ్గు ధరలు పెరిగిపోవడంతో ఒత్తిడి నెలకొందని, ఇక డీమానిటైజేషన్ రావడం తమ కంపెనీ పనితీరును దెబ్బతీసినట్టు చెప్పారు. -
త్రైమాసికానికోసారి అడిగితే ఎలా?
కేంద్రం తీరును ప్రశ్నించిన వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: త్రైమాసికానికోసారి కేంద్ర నిధులపై వినియోగ ప్రతాలు అడిగితే ఎలా అంటూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం లోక్‌సభలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి విడుదలయ్యే నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ త్రైమాసికానికోకసారి వినియోగ పత్రాలు అడుగుతోంది. మాది కొత్త రాష్ట్రం. కొన్ని సమస్యలున్నాయి. అందువల్ల వార్షిక ప్రాతి పదికన వినియోగ పత్రాలు తీసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలి.అలాగే తెలంగాణ ప్రభుత్వం నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిని కోరాం. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ’ అని వినోద్ పేర్కొన్నారు. -
జీడీపీకి వ్యవ‘సాయం’..!
సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం • జూన్ త్రైమాసిక వృద్ధి 7.1 శాతం కంటే అధికం • గతేడాదితో పోల్చుకుంటే 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదల • సాగు, సేవలు, వాణిజ్య రంగాల్లో ఆశాజనక పరిస్థితులు • క్షీణించిన పెట్టుబడులు... మైనింగ్‌లో వృద్ధి మైనస్ న్యూఢిల్లీ: భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికం(క్యూ2)లో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది. సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర గణాంకాల విభాగం బుధవారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వృద్ధి రేటులో 2015లో చైనాను అధిగమించిన మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలో రంగాల వారీగా... ⇔ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలైన ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, వృత్తి నిపుణుల సేవలు... తయారీ, వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవల రంగాల్లో 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. ⇔ వ్యవసాయ రంగం, అటవీ ఉత్పత్తులు, మత్స్య రంగాల వృద్ధి మెరుగైంది. 3.3 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2 శాతమే. ⇔ ఇక మైనింగ్, క్వారీరుుంగ్ వృద్ధి మైనస్ 1.5 శాతానికి పడిపోరుుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 5 శాతం మేర వృద్ధిని నమోదైంది. ⇔ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు 3.5 శాతంగా ఉండగా క్రితం సంవత్సరంలో ఇదే సమయంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే క్షీణించింది. ⇔ నిర్మాణ రంగం మాత్రం మెరుగుపడింది. తాజాగా ఈ రంగలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వృద్ధి కేవలం 0.8 శాతం మాత్రమే. ⇔ తయారీ రంగం మాత్రం 9.2% నుంచి 7.5%కి దిగి వచ్చింది. జీవీఏ 7.1 శాతం మూల ధర ఆధారంగా లెక్కించే గ్రాస్ వేల్యూ యాడెడ్ (జీవీఏ) సెప్టెంబర్ త్రైమాసికంలో 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నమోదైన 7.3 శాతం కంటే తగ్గినట్టు తెలుస్తోంది. జీడీపీ వృద్ధి రేటును కొత్త విధానంలో మార్కెట్ ధరల ఆధారంగా లెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదే జీవీఏ మాత్రం ఫ్యాక్టరీ ధరల ఆధారంగా లెక్కించే రేటు. జీవీఏ, ఉత్పత్తులపై పన్నులు కలిపి ఈ మొత్తంలోంచి సబ్సిడీలను తీసివేయగా వచ్చేదే జీడీపీ రేటు. స్థిరమైన ధరల ప్రకారం ⇔ జీడీపీ విలువ రూ.29.63 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.27.62 లక్షల కోట్లు. ⇔ ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ) రూ.5.15 లక్షల కోట్లు. క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.4.27 లక్షల కోట్లు. ⇔ స్థిరమైన ధరల ప్రకారం చూస్తే ప్రభుత్వ తుది వినియోగ వ్యయం రూ.3.84 లక్షల కోట్లు. పెట్టుబడులు క్షీణించడం ఆందోళనకరం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగానికి వచ్చిన గణాం కాలు చక్కని, స్థిరమైన పనితీరును తెలియజేస్తున్నారుు. రెండో అర్ధ భాగం విషయంలో మాత్రం అనిశ్చితి నెలకొంది. దీన్ని విశ్లేషించాల్సి ఉంది. పెట్టుబడులను సూచించే గ్రాస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) క్షీణించడం ఆందోళన కలిగించే అంశం’’ అని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీఎఫ్‌సీఎఫ్ ప్రస్తుత రేట్ల ప్రకారం మైనస్ 3.2 శాతం... స్థిరమైన ధరల ప్రకారం మైనస్ 5.6 శాతంగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ రేట్లు 7.5%, 9.7 శాతంగా ఉన్నారుు. రెండో త్రైమాసికంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళనకరమని, దీన్ని పరిశీలించాల్సి ఉందని సుబ్రమణియన్ అన్నారు. ముందున్నవి సవాళ్లు... న్యూఢిల్లీ: జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ... నోట్ల రద్దు కారణంగా వినియోగం పడిపోవడం వల్ల భవిష్యత్తులో సవాళ్లు పొంచి ఉన్నాయని పారిశ్రామిక రంగం, నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యారుు. అంచనా కంటే తక్కువే.. రెండో త్రైమాసికంలో జీడీపీ 7.3%, జీవీఏ 7.1% అన్నది అంచనాల కంటే తక్కువే. ప్ర స్తుతం పెద్ద నోట్లను రద్దు చేసినందువల్ల జీడీపీ/జీవీఏ వృద్ధి రేటు మా అం చనా ప్రకారం 7.8% కంటే మరింత తక్కువగా ఉంటుంది. - సునీల్ కనోరియా, ఇండియా రేటింగ్స ప్రధాన ఆర్థిక వేత్త నోట్ల రద్దు ప్రతికూలం.. రానున్న త్రైమాసికంలో వృద్ధి రేటుకు ప్రస్తుత నోట్ల రద్దు ప్రతికూలంగా మారుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ మరింత తగ్గుదల.. నోట్ల రద్దు తర్వాత జీడీపీ, జీవీఏ అంచనాలను 2017 సంవత్సరానికి 7.5%, 7.3%కి తగ్గిం చగా... ప్రస్తుత డేటా ప్రకారం వృద్ధి రేటు మా అంచనాల కంటే తక్కువే ఉండొచ్చు. - అదితి నాయర్, ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త ఎన్నో సవాళ్లు.. డీమోనిటైజేషన్, బ్రెగ్జిట్, చైనా ఆర్థిక రంగంలో మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల రక్షణాత్మక విధానాలు, పరిష్కారం కాని ఎన్పీఏల రూపంలో దేశ ఆర్థిక వృద్ధికి సవాళ్లు పెరిగిపోయారుు. - డీఎస్ రావత్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
టాటా మోటార్స్‌కు జేఎల్ఆర్ దన్ను
రూ. 848 కోట్ల నికర లాభం ముంబై: టాటా మోటార్స్ కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్లో రూ.848 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. వివిధ దేశాల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు జోరుగా ఉండడం వల్ల ఈ స్థారుు నికర లాభం సాధించామని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ.1,700 కోట్ల నష్టాలు వచ్చాయని వివరించింది. నికర ఆదాయం రూ.62,647 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.67,000 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇంగ్లండ్, యూరప్, ఉత్తర అమెరికా, చైనా, ఇతర దేశాల్లో జేఎల్ఆర్ అమ్మకాలు జోరుగా ఉన్నాయని తెలిపింది. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే నికర నష్టాలు మరింత పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. గతేడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో రూ.289 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.631 కోట్లకు పెరిగాయి. నికర అమ్మకాలు రూ.11,794 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.11,406 కోట్లకు పడిపోయాయని వివరించింది. వాణిజ్య, ప్రయాణికుల వాహనాల అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 6% వృద్ధితో 1,34,397కు పెరిగాయని పేర్కొంది. జేఎల్ఆర్ నికర లాభం 9.2 కోట్ల పౌండ్ల నుంచి 24.4 కోట్ల పౌండ్లు(రూ.2,065 కోట్లు)కు పెరిగింది. -
వివిమెడ్ ల్యాబ్స్ లాభం రూ. 27 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబర్ త్రైమాసికంలో వివిమెడ్ ల్యాబ్స్ సుమారు రూ. 27 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది దాదాపు రూ. 24 కోట్లు. తాజా త్రైమాసికంలో ఆదాయం రూ. 337 కోట్ల నుంచి రూ. 298 కోట్లకు తగ్గింది.