Quarters
-
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
మకావ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ 57వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు కొంత ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పాయింట్లు సాధించి వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌లో స్కోరు 12–10 వద్ద శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో తేరుకున్న ఆయుశ్ ఒకదశలో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి అంతరాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఆయుశ్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే శ్రీకాంత్ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఆయుశ్ రెండు పాయింట్లు సాధించినా, మరోవైపు శ్రీకాంత్ మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ తస్నిమ్ మీర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ తొమోకా మియజాకి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్ తస్నిమ్ 17–21, 21–13, 10–21తో పరాజయం పాలైంది. గాయత్రి–ట్రెసా జోడీ విజయం మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 21–11తో లిన్ చి చున్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 17–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో బల్రాజ్
రోయింగ్‌లో భారత ప్లేయర్ బల్రాజ్ పన్వర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రెండో రౌండ్లో ఆదివారం బల్రాజ్ రెండో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. 7 నిమిషాల 12.41 సెకన్లలో పన్వర్ లక్ష్యాన్ని చేరాడు. క్వెంటిన్ ఆటోగ్నెల్లీ (మొనాకో; 7 నిమిషాల 10 సెకన్లలో) టాప్ ప్లేస్‌లో నిలిచాడు. రెపిచేజ్ రౌండ్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రోవర్లు మంగళవారం క్వార్టర్ఫైనల్లో తలపడనున్నారు. -
క్వార్టర్స్‌లో యూకీ ద్వయం
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో ఫెడరికో జెబలాస్–బోరిస్ అరియాస్ (బొలీవియా) జంటను ఓడించింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 329వ ర్యాంకర్ సహజ 7–6 (10/8), 7–5తో భారత్‌కే చెందిన రియా భాటియాను ఓడించింది. మరోవైపు తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ శ్రీవల్లి రషి్మక రెండో రౌండ్లో 6–1, 3–6, 6–7 (5/7)తో ఏడో సీడ్ జాక్వెలిన్ కబాజ్ అవాద్ (స్వీడన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్
భారత డేవిస్‌కప్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ అగ్రశ్రేణి ఆటతీరుతో టాప్‌సీడ్ ఆటగాడికి షాకిచ్చాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన రామ్‌కుమార్ అద్భుతమైన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్ 1–6, 6–4, 6–4తో టాప్ సీడ్ ల్యుకా నర్డి (ఇటలీ)ని ఓడించాడు. తొలి సెట్లో నర్డి ధాటికి రామ్‌కుమార్ తేలిపోయాడు. సెట్ ఆరంభంలోనే అతని సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇటలీ స్టార్ ప్లేయర్ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తర్వాతి సెట్లలో భారత ఆటగాడు దూకుడు కనబరిచాడు. రెండో సెట్లో 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో కీలకమైన బ్రేక్ పాయింట్ సాధించిన రామ్‌కుమార్ అదే జోరుతో సెట్ గెలిచి 1–1తో సమం చేశాడు. మూడో సెట్లో రామ్ సంధించిన ఏస్‌లకు టాప్‌సీడ్ ఆటగాడు బదులివ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన భారత ఆటగాడు ఈ సెట్లోనూ దూకుడు పెంచి మ్యాచ్ గెలిచాడు. నర్డి 4 ఏస్‌లు సంధిస్తే... రామ్‌కుమార్ 9 ఏస్‌లు సంధించాడు. -
జొకోవిచ్ జోరుగా...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిన్నెర్ (ఇటలీ), మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), నాలుగో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ అతి సులువైన విజయంతో ముందంజ వేశాడు. పది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్ మనారినొ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏకంగా 17 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సెర్బియన్ దిగ్గజం 31 విన్నర్లతో అలవోకగా మ్యాచ్‌ని చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తొలి రెండు సెట్లలో అయితే ఫ్రాన్స్ ఆటగాడిని ఖాతా తెరువకుండా చేశాడు. ప్రత్యర్థి సర్వి స్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కేవలం గంటా 44 నిమిషాల్లోనే వరుస సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించాడు. తాజా ఫలితంతో గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో 58 సార్లు క్వార్టర్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా స్విట్టర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన సెర్బియన్ సూపర్‌స్టార్ నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లోనే 14 సార్లు క్వార్టర్స్ చేరిన జొకోవిచ్ 10 సార్లు ముందంజ వేసి టైటిల్ గెలువగలిగాడు. సిట్సిపాస్ అవుట్ నిరుటి రన్నరప్, ఏడో సీడ్ స్టెఫనొస్ సిట్సిపాస్ (గ్రీస్)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గత మూడేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అతనికి ఇదే నిరాశాజనక ప్రదర్శన. ఆదివారం జరిగిన పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో అమెరికాకు చెందిన 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ చేతిలో కంగుతిన్నాడు. ఈ విజయంతో అమెరికా ఆటగాడు తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్ అడ్డంకిని దాటి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు స్థానిక ప్లేయర్ నుంచి అసాధారణ పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా 4 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 6–7 (5/7), 6–7 (4/7), 6–3, 6–0తో పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో స్థానిక ఆటగాడు వరుసగా మూడో ఏడాదీ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో గత సీజన్ సెమీఫైనలిస్ట్, 15వ సీడ్ కరెన్ కచనొవ్ (రష్యా)కు షాకిచ్చాడు. కొకొ గాఫ్ తొలిసారి... మహిళల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ అమెరికన్ స్టార్ కొకొ గాఫ్ తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నాలుగేళ్లుగా బరిలోకి దిగుతున్న ఆమెకు రెండు సార్లు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. కానీ ఈ సారి ఆమె 6–1, 6–2తో మగ్దలెన ఫ్రెచ్ (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. కేవలం గంట 3 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. రెండో సీడ్ అరిన సబలెంక (బెలారస్) 6–3, 6–2తో అమండ అనిసిమొవ (అమెరికా)పై గెలుపొందగా, 9వ సీడ్ క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–3, 6–2తో మిర అండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్‌నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది. -
క్వార్టర్స్‌లో సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 21–19, 21–15తో సుంగ్ జి హ్యూన్ (దక్షిణ కొరియా)పై వరుస గేముల్లో విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19–19తో సమానంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత షట్లర్ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అతడు 17–21, 18–21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 13–21, 14–21తో మిసాకి మత్సుటోమో–అయాక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. సైనా అవుట్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 11–21, 8–21తో మూడో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. యామగుచి దూకుడు ముందు నిలువలేకపోయిన సైనా... మ్యాచ్‌ను 23 నిమిషాల్లోనే ప్రత్యర్థికి అప్పగించేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల విభాగంలో భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లకు కూడా నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 12–21, 13–21తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడగా... రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ గాయంతో ఆరంభంలోనే వెనుదిరిగాడు. కేవలం నిమిషం పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ 0–3తో వెనుకబడిన సమయంలో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. పోలీస్ క్వార్టర్స్
ఒకప్పుడు రక్షక భటుల నివాసాలు. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రక్షక భటులు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పగలు రాత్రి తేడా లేకుండా పోకిరీలు అక్కడ చేరి బహిరంగంగా మద్య సేవనం చేస్తున్నారు. మద్యం మత్తులో అటుగా వెళ్లే మహిళలు, యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పలుమార్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో బెంబేలెత్తుతున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని మూలాపేటలో పాత పోలీసు క్వార్టర్స్ (గ్యాస్ గోదాము ముందు వైపు) భవనాలు పోకిరీలకు అడ్డాగా మారాయి. గతంలో పోలీసు సిబ్బంది నివాసం ఉండేవారు. దీంతో అక్కడి ప్రజలు నిర్భయంగా జీవించేవారు. కాలక్రమేణా క్వార్టర్స్ శిథిలావస్థకు చేరడంతో అక్కడున్న వారందరూ నూతనంగా మూలాపేట, నవాబుపేటల్లో నిర్మించిన పోలీసు క్వార్టర్స్‌కు వెళ్లిపోయారు. దీంతో వాటి ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువయ్యారు. క్వార్టర్స్‌కు ఉన్న కిటికీలు, తలుపులను సైతం కొందరు అపహరించుకుని వెళ్లారు. చుట్టు పక్కల ఏపుగా చెట్లు పెరిగాయి. భవనం గది లోపల, పైన ఖాళీ మద్యం బాటిళ్లు ఈ క్రమంలో అసాంఘిక శక్తులు ఆ క్వార్టర్స్‌ను ఆవాసాలుగా చేసుకుని జోరుగా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం ఆ క్వార్టర్స్ భవనాల్లోకి చేరి మద్య సేవనం చేస్తున్నారు. శిథిల క్వార్టర్స్ భవనాల్లో పేకాట, వ్యభిచారం తదితర కార్యక్రమాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు రిక్షా కార్మికులు, స్థానికేతరులు శిథిల భవనాల్లో తలదాచుకుంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలను తాగుతున్నారు. మొక్కుబడి గస్తీ చర్యలు క్వార్టర్స్‌కు సమీపంలో ప్రజల నివాసాలు ఉన్నాయి. వారి పిల్లలు క్వార్టర్స్ మీదుగానే విద్యాసంస్థలకు వెళ్లాల్సి ఉంది. దీంతో అసాంఘిక శక్తులు అటుగా వెళ్లే విద్యార్థినులను, మహిళలు, యువతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజులు పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించి ఆపై అటు వైపునకు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు యథేచ్ఛగా విజృంభిస్తున్నాయి. తాజాగా రెండు రోజుల కిందట ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు తరుముకుంటూ వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. బాధిత బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో బాధిత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కన్నీటి పర్యంతమైంది. బాలిక కావడం విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువు పోతుందోనని వారు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. ఈ తరహా ఘటనలు అనేకం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
సింధు నిష్క్రమణ
హాంకాంగ్: ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట సింధు మళ్లీ నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ సింధు 18–21, 21–11, 16–21తో తనకంటే దిగువ ర్యాంకులో ఉన్న బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–11, 15–21, 21–19తో భారత సహచరుడు సౌరభ్ వర్మపై గెలుపొందాడు. మిగతా మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్.ప్రణయ్ 12–21, 19–21తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూడగా, రెండో సీడ్ చౌతియెన్ చెన్ (చైనీస్ తైపీ) 12–21, 23–21, 21–10తో పారుపల్లి కశ్యప్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 12–21తో నాలుగో సీడ్ యుత వతనబె–అరిస హిగషినొ జోడీ చేతిలో కంగుతింది. -
‘మినిస్టర్స్’ క్వార్టర్స్‌లోనే ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులంతా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసముంటూ సామాన్య ప్రజలు, సందర్శకులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా సమీకృత సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయ శాఖలను బీఆర్కేఆర్ భవన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ని ప్రభుత్వ విభాగాల భవనాలకు తరలించ డం పూర్తయింది. ఆదివారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళాలు వేసేయాలని, అవసరమున్న అధికారులు తాళం చెవులను రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి అనుమతితో తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో మంత్రులను కలుసుకునేందుకు వచ్చే సామాన్యు లు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు తప్పనిసరిగా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసముంటూ సందర్శకులను కలుసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. మంత్రులకు తాత్కాలిక పేషీలు.. సచివాలయం ఖాళీ కావడంతో పేషీలు కోల్పోయిన రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం తాత్కాలిక కార్యాలయాలను కేటాయించింది. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో కార్యాలయాలు కేటాయించారు. మిగిలిన మంత్రులకు వారి శాఖల పరిధిలోని విభాగాల భవనాల్లో కార్యాలయాలను కేటాయించారు. -
ప్రణయ్ నిష్క్రమణ
ఆక్లాండ్: వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులెవరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమణతో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 15–21, 14–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కాంటా సుయెయామ (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను గెల్చుకున్నా... ఆ తర్వాత తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 14–16 వద్ద ప్రణయ్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 900 డాలర్ల (రూ. 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఏ విభాగంలోనూ భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. -
ప్రాంజలకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 ఆసియా పసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ ప్రాంజల 2–6, 5–7తో మురమత్సు చిహిరో (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది. ఈ క్వార్టర్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మృతదేహం ఉన్న గది నుంచి వాసన రావడంతో సహఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేయగా వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అదేవిధంగా మృతుడి ఉన్న గదికి లోపలి నుంచి తాళం వేసి ఉన్నట్టు తెలిపారు.. ఆయన కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే మృతుడి మరణానికి కారణాలేమిటో తెలియరాలేదు. -
క్వార్టర్స్‌లో వికాస్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ పంఘల్ (49 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ బౌట్లలో అమీర్ గినిఫిడ్ (మొరాకో)పై వికాస్... శర్విన్ (మారిషస్)పై అమిత్... ఆమిన్ (మొరాకో)పై మనీశ్ గెలుపొందారు. మరోవైపు మనోజ్ (69 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో అబ్దుల్ కబీర్ (మొరాకో) చేతిలో ఓడిపోయాడు. -
హైదరాబాద్‌కు నిరాశ
న్యూఢిల్లీ: లీగ్ దశలో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. కర్ణాటకతో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ 103 పరుగుల తేడాతో ఓడింది. తొలుత కర్ణాటక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (111 బంతుల్లో 140; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సమర్థ్ (124 బంతుల్లో 125; 13 ఫోర్లు) సెంచరీలు చేయడంతోపాటు రెండో వికెట్‌కు 242 పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ (5/59) మినహా మిగతావారు విఫలమయ్యారు. 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 42.5 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అంబటి రాయుడు (62 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), టి.రవితేజ (57 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఒకదశలో 202/3తో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్ శ్రేయస్ గోపాల్ (5/31), స్టువర్ట్ బిన్నీ (3/45) ధాటికి 42 పరుగులకే చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో ముంబైను బోల్తా కొట్టించింది. గురువారం న్యూఢిల్లీలోనే జరిగే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీతో ఆంధ్ర; సౌరాష్ట్రతో బరోడా తలపడతాయి. -
క్వార్టర్స్‌లో ఫెడరర్
∙ డెల్‌పొట్రోతో పోరుకు సిద్ధం ∙ మిక్స్‌డ్‌లో ఓడిన బోపన్న జోడి ∙ యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో కసి తీర్చుకునే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అర్జెంటీనా స్టార్ డెల్ పొట్రోతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తలపడనున్నాడు. యూఎస్ ఓపెన్‌లో వరుస టైటిళ్లతో (2004–2008) దూసుకెళ్తున్న ఫెడెక్స్‌కు 2009 ఫైనల్లో డెల్ పొట్రో షాకిచ్చాడు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత రోజర్‌కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇందులో చెలరేగితే సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థుల (నాదల్, ఫెడరర్) మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశముంది. న్యూయార్క్: టోర్నమెంట్ మొదట్లో ప్రతీ మ్యాచ్‌లోనూ చెమటోడ్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టోర్నీ జరుగుతున్న కొద్దీ చెలరేగుతున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్విట్జర్లాండ్ స్టార్ 6–4, 6–2, 7–5తో ఫిలిప్ కొహ్ల్ష్చెబెర్ (జర్మనీ, 33వ సీడ్)పై అలవోక విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో 24వ సీడ్ జువన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా) 1–6, 2–6, 6–1, 7–6 (7/1), 6–4తో ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను కంగుతినిపించగా... అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–5, 7–6 (7/5), 6–3తో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)కు షాకిచ్చాడు. ఫెడెక్స్ జోరు యూఎస్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించాడు. గంటా 49 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఫిలిప్ కొహ్ల్ష్చెబెర్ ఒక్క మూడో సెట్లోనే కాస్త పోటీఇచ్చాడు. ఐదు సార్లు యూఎస్ చాంపియన్ అయిన ఫెడరర్ ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించాడు. 15 విన్నర్స్ కొట్టిన ఫెడెక్స్ 10 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో సెట్నైతే రోజర్ వేగంగా ముగించేశాడు. ప్రత్యర్థికేమాత్రం అవకాశమివ్వకుండా కేవలం 27 నిమిషాల్లోనే ఆటకట్టించాడు. మూడో సెట్లో జర్మనీ ఆటగాడు కొహ్ల్ష్చెబెర్ కాస్త పోరాడినా ఫెడరర్ ధాటికి అదేమాత్రం సరిపోలేదు. ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరీ పోరులో డెల్ పొట్రో ఆరో సీడ్ థీమ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. అర్జెంటీనా ఆటగాడు 9 ఏస్‌లు సంధించి, 31 విన్నర్స్ కొట్టాడు. దీటుగానే బదులిచ్చిన థీమ్ 5 ఏస్‌లు, 51 విన్నర్స్ కొట్టాడు. అనవసర తప్పిదాల్లో ఇద్దరూ అర్ధసెంచరీ దాటేశారు. డెల్ పొట్రో 59, థీమ్ 53 చేశారు. క్వార్టర్ ఫైనల్లో డెల్ పొట్రోతో ఫెడరర్ తలపడనున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం 2009లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఫెడరర్‌కు లభించింది. స్వితోలినా ఔట్ మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కథ ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 1–6, 6–4తో స్వితోలినాపై విజయం సాధించింది. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడటంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే ఇందులో కీస్ పైచేయి సాధించింది. తర్వాత సెట్లో పుంజుకున్న ఉక్రెయిన్ క్రీడాకారిణి కేవలం 24 నిమిషాల్లో సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణాయక పోరులో పోరాడినప్పటికీ కీస్ చేతిలో పరాజయం తప్పలేదు. మిక్స్‌డ్‌లో బోపన్న ఔట్: మిక్స్డ్ డబుల్స్‌లో ఏడో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–దబ్రౌస్కీ (కెనడా) జంటకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మూడో సీడ్ మైకేల్ వీనస్– హ చింగ్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయం 4–6, 6–3, 10–8తో సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంటను కంగుతినిపించింది. -
క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే సౌరభ్ వర్మ, సాయి ఉత్తేజితా రావులకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21–11, 21–14తో యింగ్ యింగ్ లీ (మలేసియా)పై అలవోక విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి వరుస గేముల్లో 40 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. క్వార్టర్స్‌లో ఆమె... క్వాలిఫయర్ హరుకొ సుజుకి (జపాన్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ సాయిప్రణీత్ 21–13, 21–18తో తొమ్మిదో సీడ్ ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)ను కంగుతినిపించాడు. 12వ సీడ్ సౌరభ్ వర్మ 16–21, 25–23, 11–21తో ఐదో సీడ్ బ్రైస్ లెవర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత 15–21, 17–21తో పట్టరసుడ చయ్వాన్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ డెచపోల్ పువరనుక్రొ–సప్సిరి టెరటనచయ్ (మలేసియా) జంట 21–10, 21–9తో ప్రజక్తా సావంత్ (భారత్)–యోగేంద్ర కృష్ణన్ (మలేసియా) జోడిని ఓడించింది. -
క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ ఓటమి
బ్యాంకాక్: ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ 139–141తో చెన్ యి–స్యూన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. -
ఆన్లైన్లో అద్దె వసూలు
ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రత్యేక వెబ్సైటు ప్రారంభం భువనేశ్వర్: ప్రభుత్వ క్వార్టర్ల అద్దె ఆన్ లైన్లో వసూలు చేసేందుకు ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం(జీఏ) ఆధ్వర్యంలో ఈ–క్వార్టరు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలవుతుంది. ప్రతి నెల ప్రభుత్వ సిబ్బంది చెల్లించాల్సిన క్వార్టరు అద్దెను కొత్త వ్యవస్థ ప్రకారం ఆన్లైన్లో వసూలు చేస్తారు. జీతాల చెల్లింపునకు ముందు క్వార్టరు అద్దెను ఆన్లైన్లో మినహాయిస్తారు. పాత విధానంలో నెలవారీ అద్దె చెల్లింపు వ్యవస్థను మార్చితో ముగిస్తారు. ప్రభుత్వ క్వార్టర్ల నిర్వహణ, కేటాయింపు, రద్దు వగైరా అంశాల్లో పారదర్శకతకు కొత్త వ్యవస్థ దోహదపడుతుంది. ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం(జీఏ) క్వార్టర్ల అద్దె వసూలుకు ప్రత్యేక వెబ్సైటు ప్రారంభించింది. ఈ సైటు ఆధ్వర్యంలో ఆన్లైన్ అద్దె వసూలు ప్రక్రియ నిర్వహిస్తారు. పాత విధానంలో ప్రభుత్వ క్వార్టరు అద్దె వసూలు ప్రక్రియని మార్చి నెలతో ముగించేందుకు అనుబంధ విభాగాలకు సాధారణ పాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ వ్యవస్థలో ప్రతి నెల 20వ తేదీ సరికి చెల్లించాల్సిన జీతం నుంచి క్వార్టరు అద్దెను సర్దుబాటు చేస్తారు. సిబ్బంది బదిలీ, విరామం, అకాల మరణం వగైరా అంశాల్ని ఈ సైటులో పదిలపరుస్తారు. దీని వలన ప్రభుత్వ క్వార్టర్ల అక్రమ నిలుపుదల, అద్దె బకాయి వంటి సమస్యలు నివారించడం సాధ్యం అవుతుంది. అర్హులైన సిబ్బందికి సకాలంలో క్వార్టర్లని కేటాయించేందుకు వీలవుతుంది. ప్రభుత్వ వసతి నిర్వహణలో పూర్తిస్థాయి పారదర్శకతకు వీలవుతుంది. -
క్వార్టర్స్‌కు నార్పల, మడకశిర
- అనంత ప్రీమియర్ లీగ్ పోటీల్లో సత్తా అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో స్థానిక అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలుర అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్ పోటీల్లో నార్పల, మడకశిర జట్లు నాకౌట్ స్థాయి నుంచి క్వార్టర్‌కు చేరాయి. కాగా ఇప్పటికే ఆర్డీటీ అకాడమీ, కదిరి, ఆత్మకూరు, ధర్మవరం, గుంతకల్లు, కణేకల్లు జట్లు క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్పల, మడకశిర జట్లు క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ వివరాలు విన్సెంట్ క్రీడా మైదానంలో పెనుకొండ, నార్పల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నార్పల జట్టు 38.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. జట్టులో విజయకృష్ణ (73) రాణించారు. పెనుకొండ బౌలర్లు బాబా ఫకృద్దీన్, ఖాదర్ తలా 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 26.3 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నార్పల జట్టు బౌలర్లు లక్ష్మీకాంత్ 4, విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా బీ గ్రౌండ్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 42 ఓవర్లలో 227 పరుగులు చేసింది. జట్టులో భీమానాయక్ (61), అల్తాఫ్ (51) అర్ధశతకాలతో రాణించారు. తాడిపత్రి జట్టులో రమేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఓడింది. జట్టులో లక్ష్మణ్‌కుమార్ (96) త్రుటితో సెంచరీ మిస్సయ్యాడు. వచ్చే ఆదివారం క్వార్టర్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల వివరాలు కదిరి–నార్పల ధర్మవరం–ఆత్మకూరు గుంతకల్లు–కణేకల్లు ఆర్డీటీ అకాడమీ–ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర -
క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్
మనేసర్ (హరియాణా): జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ బాను పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మనేసర్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో మనికా 8–11, 11–7, 11–6, 10–12, 5–11, 11–8, 11–4తో నిఖత్ బాను (తెలంగాణ)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మధురిక పట్కర్ టైటిల్‌ను దక్కించుకోగా... పురుషుల విభాగంలో శరత్ కమల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో మధురిక (4–0) 11–5, 11–9, 11–5, 12–10 తో ఆరుసార్లు జాతీయ చాంపియన్ అయిన పౌలోమి ఘటక్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్లో అచంట శరత్ కమల్ 11–8, 6–11, 11–9, 3–11, 11–8, 11–5తో సౌమ్యజిత్ ఘోష్‌పై గెలిచి ఏడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2003లో అతను ఇక్కడే తొలి టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. -
రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో హైదరాబాద్
లక్నో: బ్యాట్స్‌మెన్ బద్రీనాథ్ (84 బంతుల్లో 14 నాటౌట్), కొల్లా సుమంత్ (59 బంతుల్లో 10 నాటౌట్) సంయమనంతో ఆడటంతో... ఆంధ్రతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’ చేసుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా చివరిరోజు లంచ్ తర్వాతే ఆట మొదలైంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినందుకు ఆంధ్రకు 3 పాయింట్లు లభించగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక హైదరాబాద్ (నాలుగు విజయాలు) 31 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. హరియాణా కూడా 31 పాయింట్లతో (మూడు విజయాలు) రెండో స్థానంలో నిలిచి ఈ గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
క్వార్టర్స్‌లో వైఎంసీఏ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్ వైఎంసీఏ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 74- 62తో సెయింట్ మార్టిన్స్ క్లబ్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సికిం ద్రాబాద్ వైఎంసీఏ జట్టు 81-70తో సిటీ కాలేజ్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టు తరఫున పృథ్వీ (30), డేవిడ్ (11) రాణించగా, సిటీ కాలేజ్ జట్టులో ఫణి (26) ఆకట్టుకున్నాడు.