Radha
-
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్..
న్యూజిలాండ్ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్ సైమా ఠాకూర్ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలీడే(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఆఖరిలో అమీలియా కేర్(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో అమీలియా కేర్ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్ కేర్ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో కీలక మార్పు!?
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావం పొందిన భారత జట్టు.. పాక్‌పై గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా హర్మాన్ సేన తమ సేవలను సజీవంగా ఉంచుకోవాలంటే పాక్‌పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఓ కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోందిరాధా యాదవ్ ఎంట్రీ..న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పిన్న్ రాధా యాదవ్.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ అరుంధతి రెడ్డి స్ధానంలో రాధా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన. -
విభేదాలే రాధ ప్రాణాలు తీశాయా!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫార్మర్ అన్న ముద్రతో హత్యకు గురైన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో ఉదంతం ఇప్పుడు మాజీలు..ప్రస్తుత మావోయిస్టుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2017 డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చి0దని రాధ తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి చైతన్య మహిళా సంఘం సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అక్కడ నుంచి ఏవోబీ బో ర్డర్ మీదుగా దళంలో చేరింది. అక్కడే ఆమె పేరును నీల్సోగా మార్చారు. సాంకేతిక విద్యావంతురాలు కావడంతో ఆమెను తొలుత సిగ్నల్ ఆపరేటర్‌గా నియమించి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వచ్చి.. నేతలు చెప్పిన వారికి సమాచారం (ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్) చేరవేసి, ఫోన్ స్విచాఫ్ చేసి, సిమ్‌కార్డు తీసేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది. అప్పటికే అడవిలో ఉన్న అగ్రనేతలకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.వారందరూ షుగర్, బీపీ, గుండె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్, పరీక్షలు, మందు లు, చికిత్స మొత్తం రాధ అలియాస్ నీల్సోనే చూసుకునేది. అలా నీల్సో అనతికాలంలో అగ్ర నాయకత్వానికి దగ్గర అ య్యింది. అందుకే ఆమె సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్Œ ఫోర్స్ క మాండర్‌గా ఎదిగింది. ఆమెను లేడీ చేగువేరాగా పిలిచేవారు.కరోనా సమయంలో వైద్యసేవలు కరోనా ఫస్ట్ వేవ్‌లో మావోయిస్టులకు పెద్దగా నష్టం వాటి ల్లలేదు. కానీ..సెకండ్ వేవ్‌లో చాలామంది అగ్రనేతలు వరుసగా మరణించడం మొదలైంది. మందుల కోసం బయటకు వచ్చే కొరియర్లపై పోలీసు నిఘా తీవ్రమైంది. ఆ సమయంలో నీల్సోనే చాలా మంది దళ సభ్యులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడింది.అయితే కరోనా తగ్గుముఖం పట్టాక.. ఓ అగ్రనేతతో నీల్సోకు విభేదాలు మొదలై.. తారస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో నీల్సో దళం వదిలి ఇంటికి వద్దామనుకుంది. కానీ, సదరు నేత తీరు, సిద్ధాంతాలు ఉల్లంఘిస్తున్న వైనాన్ని వివరిస్తూ.. మూడునెలల క్రితం అగ్ర నాయకత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పార్టీలో తీవ్ర అలజడి రేపగా, దీనిపై నిజనిర్ధారణ చేయాలంటూ ఓ కీలకనేతకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో దళానికి వరుస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నీల్సోతో ఘర్షణ పడిన నేత నిజ నిర్ధారణకు వచ్చిన నేతకు రాధ ఇన్ఫార్మర్ అంటూ ఫిర్యాదు చేశాడు. అసలే పోలీసుల నుంచి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో అతని మాటలను అగ్రనేత సైతం విశ్వసించాడు. చివరికి నీల్సోకు మరణశిక్ష విధించారు. లొంగుబాటులో మావోలు రాధ హత్య దళంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము రాధ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భయంతో ప్రస్తుతం దళంలోని కొందరు సభ్యులు తెలంగాణ పోలీ సులను సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సెంట్ర ల్ కమిటీ మెంబర్లు కొద్ది రోజుల్లో సరెండర్ అవుతామంటూ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కరోనాకు ముందు మావోయిస్టులు ఫిట్టర్, ఎల్రక్టీషియన్, మెకానికల్ డిప్లొమా చదువుకున్న గిరిజన యువతను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఐఈడీల తయారీ కోసమేనని అప్పుడే తెలంగాణ పోలీసులు అనుమానించారు. వెళ్లిన వారిలో చాలామంది అక్కడ ఉండలేకపోయారు. మెజారిటీ యువకులు అప్పటి కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. -
అందాల రాధగా తమన్నా..ట్రెడిషన్ లుక్ అదుర్స్!
కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్ కరణ్ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు. ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్’లో ఉంది. ఈ లెహెంగా సెట్ “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్" ఫ్యాబ్రిక్. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్ డబ్కా వర్క్, మోతీ గోల్డ్ సీక్విన్స్, సిగ్నేచర్ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్ పూర్తి పర్పుల్ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్ అత్యంత అద్భుతంగా ఉంది. View this post on Instagram A post shared by T O R A N I (@toraniofficial) (చదవండి: మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి) -
రాధే మరణశిక్షను అంగీకరించింది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పార్టీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీ సులు బంటి రాధ అలియాస్ నీల్సోను కోవ ర్టుకుట్రలో భాగం చేయడం ద్వారా ఆమె మరణానికి కారకులయ్యారు.. చివరకు రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణే‹శ్వెల్లడించారు. ఈ మేరకు ఆయన పేరి ట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ లోని వివరాల ప్రకారం.. ‘పోలీసు ఉన్నతాధి కారులు ఆమె కులం, జెండర్‌ను ఉపయోగించుకొని అవాస్తవాలతో కొన్ని సంఘాల పేరి ట పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే పోలీసు లకు రాధ కులం, మహిళ అని మాట్లాడే అర్హ త లేదు. పీడితవర్గ మహిళగా సమస్యల్ని ఎదుర్కొని వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీ లో చేరింది. సభ్యురాలి నుంచి నాయ కత్వ స్థానంలోకి ఎదగడానికి ఆమె పట్టుదల, పార్టీ కృషి ఉంది. ఆపై ఆమె కుటుంబ బలహీనతలను పోలీసులు వాడు కొని విప్లవద్రోహిగా మార్చి పార్టీ నాయక త్వాన్ని నిర్మూలించాలని చూశా రు. ఇంతలోనే పార్టీ అప్రమత్తం కావడం, పోలీసుల పథకం విఫలమైంది’. అని పేర్కొన్నారు. వాళ్లకు మానవత్వం లేదు..బండి రాధను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడవేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువు పూర్తిచేసిన రాధను బలవంతంగా పార్టీలో చేర్చుకొని జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పా రు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రాధను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధిస్తూ కులం పేరుతో దూషించారని ఆమె సోదరుడు కూడా ఆరోపించా డని తెలిపారు. మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించిన దళిత మహిళ రాధపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్రవేయడం ఆ పార్టీ నేత ల నీచమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు. -
విప్లవం కోసం అడవిబాట పట్టి.. విగతజీవిగా ఇంటికి..
కాప్రా: విప్లవం కోసం ఉద్యమంలోకి వెళ్లిన మహిళా మావోయిస్టు పల్లెపాటి రాధ అలియాస్ బంటి రాధ అలియాస్ నీల్సో జీవితం విషాదాంతంగా ముగిసింది. కాప్రా సర్కిల్, న్యూ ఇందిరానగర్‌కు చెందిన రాధ డిప్లొమో ఇన్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ పూర్తి చేసింది. అనంతరం విప్లవంపై ఆకర్షితురాలై అడవిబాట పట్టిన రాధ తిరిగి విగతజీవిగా ఇంటికి చేరింది.ఇన్ఫార్మర్ నెపంతో సహచర మావోయిస్టులే ఆమెను హత్య చేశారు. ఓ మహిళా మావోయిస్టును తోటి మావోయిస్టులే హతమార్చడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, చెన్నాపురం అటవీప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాధ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం ఉదయం రాధ భౌతికకాయాన్ని ఇందిరానగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కుమార్తె విగత జీవిగా తిరిగి ఇంటికి చేరడంతో తల్లిదండ్రుల రోధనలతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. సాయిబాబానగర్‌లోని శ్మశానవాటికలో రాధ అలియాస్ నీల్సో దహన సంస్కరాలు పూర్తి చేశారు. అన్యాయంగా చంపేశారుమావోయిస్టుల అంతర్గత విషయాలు బయటకొస్తాయనే రాధను అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విప్లవ బాటపట్టిన మావోయిస్టుల్లోనూ అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు అనే తారతమ్యం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే రాధను సహచర మావోయిస్టులు చంపేశారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల్లో కొందరు చేసిన తప్పులను రా«ధ ప్రశ్నించిందని, వారి గుట్టు బయటపడుతుందనే భయంతోనే చంపేశారని చెబుతున్నారు. రాధ ఇన్ఫార్మర్గా మారిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చింది, మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి తప్పిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రాధ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.దళిత మహిళ అనే వివక్ష ఒక దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే మా చెల్లెను అన్యాయంగా చంపేశారు. ఇన్ఫార్మర్ నేపంతో సహచర మావోయిస్టులే చంపి రోడ్డుపై పడేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తే మృతదేహం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఏరియా ఆస్పత్రికి మేం వెళ్లేసరికే రాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అసలు తల్లిదండ్రులు లేకుండా వారికి సమాచారం అందించకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాధ మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేస్తారు. – లింగం, రాధ అన్నయ్య.నా బిడ్డను చూస్తా అనుకున్నామూడు రోజుల్లో నా బిడ్డ ఇంటికొస్తుందని తెలిసింది. చాలా ఏళ్ల తర్వాత నా బిడ్డను చూస్తా అనుకున్నా. అంతలోనే రెండు రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. బిడ్డ ఇక లేదని తెలియడంతో చివరి చూపుకోసం బుధవారం మధ్యాహ్నం అక్కడికి బయలుదేరాం. మేం వెళ్లేసరికే పోస్టుమార్టం పూర్తి చేశామని చెప్పి,మృతదేహాన్ని అప్పగించేశారు. ఇన్ఫార్మర్ పేరుతో నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. నా కొడుకుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. –పోచమ్మ(బాలమ్మ), రాధ తల్లిఇన్ఫార్మర్ అనడం అబద్ధంమా అక్క రాధను ఇన్ఫార్మర్ అని చెప్పడం పచ్చి అబద్ధం. ఆరేళ్ల క్రితం మావోయిస్టుల పార్టీలో చేరిన అక్క ఫ్యామిలీ గుర్తుకు వచ్చినప్పుడు కేవలం మెసేజ్ మాత్రం చేసేది. అది కూడా ఆమె వెళ్లిన తర్వాత రెండేళ్ల క్రితం ఒక్క మెసేజ్ చేసింది. ఎలా ఉన్నారు, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అని ఆరా తీసింది. మేం బాగానే ఉన్నాం, నువ్వు ఇంటికి రావొచ్చు కదా అంటే నన్ను మర్చిపోండి, నేను మావోయిస్టుల్లోనే ఉంటానని చెప్పింది. అలాంటి మా అక్క ఇన్ఫార్మర్ అని ముద్ర వేసి అన్యాయంగా చంపేశారు. ఆ తర్వాత ఈ నెల 18న నాకు మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చేసింది మా అక్క కాదని గుర్తించా. అక్కకు ఏం జరిగిందోననే భయంతో మాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీశా. ఆ తర్వాతి రోజునే చనిపోయిందని తెలిసింది. ఈ నెల 21న చనిపోయిందని ఫొటో వాట్సాప్ చేశారు. కానీ ఆ ఫొటోలో 19వ తేదీ కనిపించింది. అంటే మా అక్క చనిపోయిన తర్వాత రెండు రోజులకు మాకు సమాచారం అందింది. నాకు డబ్బులు పంపేదని ఆరోపిస్తున్నారు. అలా అయితే నేను క్యాబ్ డ్రైవర్‌గా ఎందుకు పని చేస్తాను. –సూర్యప్రకాష్, రాధ తమ్ముడు -
ఏడేళ్ల కిందట అదృశ్యం..శవమై ప్రత్యక్షం
సాక్షిప్రతినిధి, వరంగల్/ యాదాద్రి/ చర్ల/కాప్రా: ఏడేళ్ల క్రితం అదృశ్యమై..మావోయిస్టు పార్టీలో చేరి కీలకంగా ఎదిగిన బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సో శవమై ప్రత్యక్షమైంది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలి నుంచి దండకారణ్యంలో చేరి నాయకత్వ రక్షణదళ కమాండర్‌గా ఎదిగిన ఆమె.. చివరకు దళం సహచరుల చేతిలోనే హత మైంది. విద్యార్థి నుంచి దళనేతగా సాగిన ఏడేళ్ల ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది. ఉద్యమంలో కొనసాగుతూనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులకు ‘కోవర్టు’గా మారిందన్న సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ నాయకత్వం.. ప్రజాకోర్టు నిర్వహించి రాధ అలియాస్ నీల్సోను చర్ల సమీపంలో హతమార్చి ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట బుధవారం వీడియో, ప్రకటన విడుదల చేసింది. రాధ కేసు..రంగంలోకి దిగిన ఎన్ఐఏ బంటి బాలయ్య– పోచమ్మ (బాలమ్మ)ల స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ పరిధిలోని కాప్రాలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు సూర్యం, కూతురు రాధలు ఉండగా.. బంటి రాధ అలియాస్ నీల్సో 2017లో ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ అదృశ్యమైంది. రాజాపేటకు చెందిన జిట్టా సుదర్శన్‌రెడ్డి పీపుల్‌వార్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసే సమయంలో రాధ విప్లవ గీతాలు ఆకర్షితురాలయ్యారు. అప్పట్లో ఆమె అదృశ్యం సంచలనంగా మారగా.. మొదట హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు 2022, జనవరి 2న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఎటూ తేల్చలేదు. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసును రీ ఓపెన్ చేసింది. మావోయిస్టులు ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారన్న అభియోగంపై మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, కాకరాల మాధవి అలియాస్ అరుణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో 2022, జూన్ 23 హైదరాబాద్‌లోని చిలకానగర్, ఫిర్జాదిగూడ, మెదక్ జిల్లా చేగుంట, వరంగల్ నగరంలలో ఎన్ఐఏ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాదులు డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పా, దుబాసి స్వప్నలను అరెస్టు చేసి ఎన్ఐఏ రాధ ఆచూకీ కోసం విచారించింది. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డి పేటలలోనూ సోదాలు నిర్వహించింది. నేడు కాప్రాలో అంత్యక్రియలుపోలీసులు రాధ మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, రాధ మెడకు ప్లాస్టిక్ తాడు కట్టి చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. గురువారం రాధ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. హేయమైన చర్య : ఎస్పీ రోహిత్ రాజుమావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న దళిత యువతి రాధ అలియాస్ నీల్సోను అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సామాజిక న్యాయమంటూ మాటలు చెప్పే మావోయిస్టులు ఇతరులను వదిలేసి కేవలం దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాధానం చెప్పాలన్నారు. కీలకంగా ఎదిగి...సహచరుల చేతిలో హతమైఓ వైపు పోలీసులు, మరోవైపు ఎన్ఐఏ బంటి రాధ కోసం ఆరా తీస్తుండగా.. ఆమె మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగింది. విశాఖపట్నం వెళ్లి 2017 డిసెంబర్లో అదృశ్యమైన ఆమె.. ఆంధ్ర –ఒడిశా బార్డర్ (ఏవోబీ) మావోయిస్టు కమిటీకి కీలకంగా మారింది. ఏడాదిలోనే పార్టీ నాయకత్వ కమిటీకి రక్షణ దళ కమాండర్‌గా ఎదిగింది. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (కోవిడ్ సమయంలో చనిపోయారు)తో పాటు పలువురు నేతలకు రక్షణ కల్పించే ఫ్లటూన్కు కీలకమైంది. సుమారు ఏడేళ్లపాటు బంటి రాధ అలియాస్ నీల్సో ప్రస్థానం మావోయిస్టు పార్టీలో కొనసాగింది. మూడు నెలల కిందటే అనుమానం వచ్చిన మావోయిస్టు పార్టీ నాయకత్వం ఆమెను ‘కోవర్టు’గా భావించి కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన సోదరుడు సూర్యం ద్వారా పోలీసులకు సహకరిస్తుందని భావించిన పార్టీ నాయకత్వం, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన రాధ అలియాస్ నీల్సోను అంతమొందించినట్టు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామే చేసినట్లు మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట లేఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
పని ఒత్తిడి, ఆపై జ్వరం.. ఆశ వర్కర్ మృతి
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయం చేయాలని ధర్నా తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్‌డే (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
సుందరా ట్రావెల్స్ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం డ్రం, పల్లవన్నగర్ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, ఎల్ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్ మాట్లాడుతూ ద్వారకేశ్ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్ కాయిన్స్ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్ కాయిన్స్ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు. -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా.. గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది. అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు.. ఎస్ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే.. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్్కఫోర్స్లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది. భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
ఓ పండుగలా ‘రాధా మాధవం’: హీరో వినాయక్ దేశాయ్
అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ రాబోతోంది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించగా.. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వినాయక్ దేశాయ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. 'మాతృభాష కన్నడ అయినా.. పెరిగింది ముంబైలోనే. అక్కడే సినిమా ప్రయత్నాలు చేశాను. కన్నడలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. బాహుబలి సినిమా చూసి తెలుగు చిత్ర సీమకు రావాలని నిశ్చయించుకున్నాను. చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. అలా 2019 నుంచి ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కరోనా టైంలో ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా చెప్పేవాడిని. ‘శ్రీరంగపురం’ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాను. ‘లవర్స్ లవ్ స్టోరీ’ అనే మూవీ చేయగా.. అది ఓటీటీలోకి వచ్చింది. నా మూడో చిత్రమే రాధా మాధవం. రాధా మాధవం దర్శకుడు ఇస్సాకు నాకు మంచి ఫ్రెండ్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. తనకు దర్శకుడిగా అవకాశం వస్తే.. నాకు ఈ సినిమాను ఇచ్చారు. దర్శక నిర్మాతలు నాకు ముందు నుంచీ పరిచయం ఉండటంతో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. మేం అంతా కొత్త వాళ్లమే అయినా మా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాధా మాధవం సినిమాను నిర్మించారు. చైతన్య కొల్లి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. థాజ్ విజువల్స్ ఎంతో సహజంగా ఉంటాయి. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో చాలా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాం. మా చిత్రం అందరికీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం రాబోతోంది. గ్రామీణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ పండుగలా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. మా లాంటి కొత్త వాళ్లని, కొత్త టీం చేసిన ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తే.. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేస్తాం. మార్చి 1న రాబోతోన్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నాను. -
ఈమె ఫ్లాప్ హీరోయిన్.. తల్లి స్టార్ హీరోయిన్.. చిన్నారిని గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ ముద్దుగుమ్మ కార్తీక నాయర్. 2009లో జోష్ చిత్రంలో టీచర్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. 2015లో ఆమె తన చివరిసారిగా తమిళ చిత్రం 'పురంపోక్కు ఎంగిర పొదువుడమై'లో కనిపించింది. ఆ తర్వాత 2017లో 'ఆరంభ్'అనే సీరియల్లో ఆమె దేవసేన పాత్రను పోషించింది. అయితే సీనియర్ నటి, హీరోయిన్ రాధ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన కార్తీక గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో రోహిత్ మీనన్‌ను పెళ్లాడింది. నవంబర్ 19న జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, జాకీ ష్రాఫ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే తాజాగా కార్తీక నాయర్ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని హీరోయిన్ తల్లి రాధ నాయర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే కొత్త కోడలిగా అడుగుపెట్టిన నా కూతురికి అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. తన కుమార్తె కార్తీక పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
Thulasi Nair: హీరోయిన్ రాధ చిన్న కూతురు ఇలా అయిపోయిందేంటి? (ఫొటోలు)
-
గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో 'రాధా మాధవం'
టాలీవుడ్లో విలేజ్ లవ్ స్టోరీలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఇండస్ట్రీలో ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డీ.ఎస్.ఎన్. రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
డైరెక్టర్ సాహసం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ రీమేక్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలి అందరికంటే కాస్తా స్టైలిష్ గా ఉంటుంది. మిన్నలే చిత్రం నుంచి ఇటీవలే శింబు కథానాయకుడిగా రూపొందించిన వెందు తనిందదు కాడు చిత్రం వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ నటుడుగా మారి చాలాకాలమే అయ్యింది. పలు చిత్రాలలో ముఖ్యపాత్రను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈయన ఇకపై నటించను అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నటించడం తనకు ఇష్టం లేదని నిర్ణయాన్ని కూడా శనివారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాగా.. గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ మూవీ అనివార్య కారణాల వల్ల చాలా కాలం నిర్మాణ పనులు సాగాయి. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదిన చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. దీని గురించి చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్ తాను చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ మరో మాట చెప్పకుండా నటించడానికి సమ్మతించారన్నా రు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పలు దేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరు లు సిటీ నేపథ్యంలోనే చిత్రాలు చేస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేసే ఆలోచన లేదా అన్న ప్రశ్నకు తనకు అలాంటి కోరిక ఉందని చెప్పారు. అయితే వెందు తనిందదు కాడు చిత్రంలో ప్లాస్టర్లను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారనని.. అయితే అది కొందరికి నచ్చలేదని చెప్పా రు. ఆ కారణంగానే చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందనే భావన ఉందన్నారు. మీకు పాత చిత్రాల్లో దేనిని రీమేక్ చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. శివాజీ గణేషన్, రాధ నటించిన మొదల్ మర్యాదై చిత్రాన్ని రీమేక్ చేస్తానని చెప్పారు. అందులో శివాజీ గణేషన్ పాత్రలో కమలహాసన్‌ను ఎంపిక చేస్తానని చెప్పారు. మొదటి సినిమా మొదల్ మర్యాదైలో తన నటనతో రాధ ప్రసంశలు అందుకుంది. -
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్
సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం(నవంబర్ 19) ఉదయం రోహిత్ మేనన్‌తో కార్తిక మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం కార్తిక పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, జోష్(2009) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. కార్తిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జీవా నటించిన ‘రంగం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2015 నుంచి కార్తిక చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
దేశం అనుకరించేలా ఏపీ విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047ను అనుకరించేలా అద్భుతమైన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా.. రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై వర్క్ షాపులో ఫలవంతంగా చర్చలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న నీతి ఆయోగ్ వర్క్ షాపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర విద్యా రంగంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వి.రాధా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సంస్కరణలపై విద్యా వేత్తలు, మేథావులు పలు సూచనలు చేశారని, వాటిని అమలు చేయాలంటే కేంద్ర స్థాయిలోని పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాశ్యత శాతం పెంపుతో పాటు రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను ప్రాథమిక స్థాయి నుంచే అందజేస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047లో భాగంగా పాఠశాల విద్యా విభాగం లక్ష్యాలు, అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళి కలను వివరించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, విద్యా వేత్తలు ప్రసంగించారు. నీతి ఆయోగ్ డీఎంఈవో డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో ఎండీ డా.వినోద్ కుమార్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణితో పాటు నీతి ఆయోగ్ సలహాదారులు సీహెచ్ పార్థసారథిరెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణుడు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ, మూల్యాంకన నిపుణుడు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధి అభిషేక్ పాల్గొన్నారు. కేంద్ర నిధులకు సిఫార్సు చేయండి: సీఎస్ విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డిని కలిసింది. నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్ కేంద్రానికి తగిన సిఫార్సులు చేయాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. -
రహస్యంగా రాధ కూతురు 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు 'కార్తీక' జోష్ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. అందులో నాగచైతన్యకు జోడీగా ఆమె మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తీకకు 'రంగం' సినిమా ఆమె కెరీయర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఏకంగా జూ. ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కార్తీక తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ కనిపించింది. అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగును ధరించింది. ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్స్ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆమె.. నెగెటివ్ ఎనర్జీ తమపై పడకూడదనే ‘ఈగల్ ఐ’ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసిన వారందరూ కార్తీక నిశ్చితార్థం చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. మళ్లీ అలాంటి డ్రామానేనా?) కొద్దిరోజుల క్రితమే కార్తీక ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం. అల్లరి నరేష్‌తో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి చిత్రాల్లో నటించిన కార్తీక.. 2015 తర్వాత నుంచి వెండితెరకు దూరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9)