rail accident
-
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్‌ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్‌పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్దువార్ డివిజన్లోని న్యూ మేనాగురి స్టేషన్లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్దూర్ డివిజన్ డీఆర్ఎం అమర్జీత్ గౌతమ్ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌లోని కుమేదర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. #WATCH | 5 wagons of an empty goods train derailed at New Maynaguri station in Alipurduar division. Trains have been diverted through alternate routes and movement has not been affected. Senior officers including DRM Alipurduar have moved to the site. Restoration work is going… pic.twitter.com/6GKv0otIAB— ANI (@ANI) September 24, 2024ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి -
ఒడిశా రైలు ప్రమాదం: ఒక్కరు తప్ప అందరూ సేఫ్
సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలోని రాష్ట్ర ప్రయాణికులు ఐదుగురిలో ఒక్కరే మృతిచెందారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి మరణించినట్లు గుర్తించామని.. ఒడిశాలో నివసిస్తున్న ఆయన, పెన్షన్ కోసం వచ్చి, తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్కినట్లు తేలిందన్నారు. అతనితోపాటు అదే బోగీలో విశాఖకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని, వీరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 342 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు సేఫ్ కటక్, బాలాసోర్‌లోని సోరూ, గోపాలపురం ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రయాణికులతో పాటు, ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఊళ్లలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని మాట్లాడాం. అత్యవసర చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన విశాఖకు తరలించడంతో పాటు, భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చాం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి బయల్దేరిన లేదా ఏపీలో దిగాల్సిన వారి వివరాలు సేకరించాం. ఆ రైలు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 309 మంది తెలుగువారు ఉన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 33 మంది ఉన్నారు. రెండు రైళ్లలో 342 మంది తెలుగువారు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, 329 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ప్రయాణికుడు మాత్రం బంధువులతో ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మందిని విశాఖకు తరలించి కేజీహెచ్‌లో ముగ్గురికి, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో ఇద్దరికి, క్యూవన్ ఆస్పత్రిలో ఇద్దరికి, అపోలోలో ఒకరికి చికిత్స చేయిస్తుండగా, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక సాయం అందజేత కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరి్థక సాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి అమర్నాథ్ సోమవారం అందించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఇక ఈ ప్రమాదం గురించి తెలియగానే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే.. మర్నాటి ఉదయమే నాతో పాటు ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మాతోపాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసులు 20, మరో 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వాహనాలను తీసుకెళ్లాం. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద ఐదు అంబులెన్స్‌లతో సేవలందించాం. ఇంకా సీఎం ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస.. ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర స్టేషన్లలో కంట్రోల్ రూంలకు అందిన సమాచారం ద్వారా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల చార్టుల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నంబర్ల ప్రకారం వారితో మాట్లాడి ఆచూకీ తెలుసుకున్నాం. సురక్షితంగా స్వస్థలాలకు చేరేవరకు అందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసి మన చర్యలను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా గురించి చెప్పగా కేంద్ర మంత్రులు అభినందించారు. చదవండి: అమ్మానాన్న క్షమించండి! -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా
సాక్షి అమరావతి/భువనేశ్వర్/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు. లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధితులను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవలకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులెన్స్‌లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసోర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. భువనేశ్వర్‌లో బాధితుల సహాయ కేంద్రం ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయన్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్(ఐఏఎస్) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరాలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు. క్షతగాత్రులకు విశాఖలో చికిత్స రైలు ప్రమాదంలో గాయపడ్డ పలువురికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సెవెన్ హిల్స్, ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురుమూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 8333905022 (వాట్సాప్) సంప్రదించవ్చని తెలిపారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ! -
దేవుడా! ఈ మృతదేహాల్లో నా కొడుకు ఉండకూడదు.. ఓ తండ్రి ఆవేదన ఇది
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. ఈ ప్రమాదం కారణంగా ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించగా, 900 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు పడి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు బతికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృతదేహాల్లో వెతుకుతూ.. దేవుడా ఇందులో నా కొడుకు ఉండకూడదూ అని లోపల అనుకుంటూ వెతుక్కుంటూ కనిపించాడు. కుప్పల్లా మృతదేహాలు.. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే వినిపిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్నాడు. తీరా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి..ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడగ్గా.. నా కొడుకు. ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. బతికే ఉన్నాడో లేడో తెలీదు. బతికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది, తనకు ఏమైందో తెలియడం లేదు. ఒకవేళ చనిపోయాడేమో అని ఇక్కడ వెతుక్కుంటున్నాను. కానీ దొరకడంలేదు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా ..శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 7 గంటలకు జరిగిన విధ్వంసకర సంఘటనలో, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద 12841 షాలిమార్-కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంయుక్త తనిఖీ నివేదిక ప్రకారం, ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ వైఫల్యంగా అధికారులు గుర్తించారు. This is heartbreaking 💔 A father looking for his son among the dead. 😔#OdishaTrainAccident pic.twitter.com/eZZDAO94BR — Ketofol☀️ (@aka911_) June 3, 2023 -
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్ కీలక ప్రెస్‌మీట్
సాక్షి,విశాఖ: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందని.. ట్రైన్ ప్రమాదంలో క్షతగాత్రులను మృతులను తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఒరిస్సా పంపించారన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైనట్లు తెలిపారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నామన్నారు. (చదవండి: 'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో..) ఇదిలా ఉండగా హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 10 మంది ట్రైను ఎక్కలేదని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు ఇచ్చాపురం నుంచి బోర్డర్లో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను సిద్ధం చేశామన్నారు.అన్ని కలెక్టరేట్లోను హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్ తో పాటు మొత్తంగా 65 అంబులెన్స కు పంపించినట్లు చెప్పారు. వీటితో పాటు విమానాశ్రయంలో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవి సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం అందిందన్నారు. ఒరిస్సాలో కూడా మన వారికి వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి) -
ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే
సాక్షి, విజయవాడ: రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమండల్ రైలులో ఏపీకి చెందినవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల ఫోటోలను సేకరిస్తున్నారు. డేటా ఆధారంగా రాష్టానికి చెందిన ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలంలో వైద్య సేవలు, అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. ఒడిశాకు ఏపీ అధికారుల బృందం రైలు ప్రమాదంలో 179 మంతి తెలుగువారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం అధికారుల బృందం ఓడిశా చేరుకుందన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 కాంటాక్ట్‌లోకి వచ్చారని తెలిపారు. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో హెల్స్‌లైన్ ఏర్పాటు: 0866 2575833 చేశామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. కోరమండల్ రైలులో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వీరిలో 23 మందిని కాంటాక్స్ చేశాం.. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కోరమండల్ రైలులో తెలుగు ప్రయాణికుల వివరాలు ►కోరమండల్ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ►విశాఖపట్నం వరకు 110, రాజమండ్రి వరకు26 మంది ►తాడేపల్లి గూడెం ఒకరు, విజయవాడ వరకు 39 మంది ►ఏలూరులో దిగాల్సిన ఇద్దరు సురక్షితం. చంద్‌పాల్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యారు ►చీరాల నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికులు సేఫ్. ఆరుగురిలో ఇద్దరిని సంప్రదించిన పోలీసులు ► తాడేపల్లిగూడెం రావాల్సిన ఇద్దరు ప్రయాణికులు సేఫ్. ఉమామహేశ్రరావు, రంజిత్ గాయాలతో బయటపడ్డారు. కాకినాడ వాసుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఒడిశాలోని బాలాసోర్ సమీపములో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233 తూర్పుగోదావరి జిల్లా... ►ఒడిశా బాలాసోర్‌లో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్ రైళ్లలో రాజమండ్రికి రావాల్సిన ప్రయాణికులు.. ► మొత్తం ప్రయాణికులు 31 మంది ►వీరిలో రాజమండ్రి వాసులు-5 ►కాకినాడకు చెందినవారు-1 ►కొవ్వూరుకు చెందినవారు-1, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు-- 12, చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు-2, కోల్‌కతా-1 ►వీరిలో 22 సురక్షితంగా ఉన్నారు. కృష్ణాజిల్లా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాషువా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్ ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -8332983792 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9491068906 ఎస్బీ ఎస్ఐ - 9618336684 -
బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎటు చూసినా రక్తపు మడుగే:ఒడిశా ప్రమాద బాధితుడి ఆవేదన
తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు 13 కోచ్‌లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడు జనరల్ కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్డిఆర్ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్‌లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు. As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n — Anubhav Das (@anubhav2das) June 2, 2023 (చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ) -
వేగంగా వస్తున్న రైలు.. అక్కను కాపాడి.. చెల్లెలు దుర్మరణం
ఖమ్మం క్రైం: శరవేగంగా వస్తున్న రైలును గమనించని అక్కను కాపాడే క్రమంలో చెల్లెలు మరో రైలు ఢీకొని దుర్మరణం పాలైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అందించిన వివరాలివి. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పోతునూక యశోద (37) తన అక్క వరలక్ష్మి, మరో మహిళతో కలిసి కమాన్‌బజార్‌లో మంగళవారం షాపింగ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వరలక్ష్మి ఓవర్ బ్రిడ్జి కింద వెంకటగిరి రైలు గేటుదాటుతోంది. అదే సమయంలో ఎగువ లైన్లో రైలు అతివేగంగా వస్తున్న విషయాన్ని గమనించిన ఆమె చెల్లెలు యశోద.. అక్క వరలక్ష్మిని వెనక్కి లాగింది. కానీ మరోవైపు డౌన్‌లైన్‌లో వస్తున్న రైలును గమనించకపోవటంతో యశోదను ఢీకొనగా.. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తన ను కాపాడబోయి చెల్లెలు కళ్ల ముందే మృతి చెందటంతో అక్క వరలక్ష్మి గుండెలు పగిలేలా రోదించడం కలిచివేసింది. యశోదకు భర్త రమేశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మార్చురీకి తరలించగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్‌రావు తెలిపారు. చదవండి: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి -
స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 39 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బార్సిలోనా సమీపంలోని మాంట్‌కాడా స్టేషన్ వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో స్టేషన్లో పార్క్ చేసిన ఉన్న రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎవరికి తీవ్ర గాయాలు అవ్వలేదని చెప్పారు. రైలులో నిలబడి ఉన్న వారు ఎక్కువ గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. .ఈ ఘటన కారణంగా సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు. చదవండి: జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా -
షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు రైలు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్యాసెంజర్ల వెయిటింగ్ హాల్లోకి గూడ్స్ రైలు దూసుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్‌లోని రెండు ట్రాక్‌లు బ్లాక్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు బోల్తాపడ్డాయి. రైల్వే స్టషన్లో ఫుటోవర్ బ్రిడ్జి కూడా ధ్వైంసమైంది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైల్వే స్టేషనలో సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5లక్షల పరిహారం.. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. #JustIn Three passengers killed, while two others sustained grave injuries as a goods train derailed and rammed into passengers waiting at Korai station in #Odisha on Monday.@NewIndianXpress @Siba_TNIE pic.twitter.com/RtjYyhST2z — TNIE Odisha (@XpressOdisha) November 21, 2022 -
పట్టాలపై సెల్ఫీ.. దూసుకొచ్చిన లోకల్ ట్రైన్.. క్షణాల్లో!
కోల్‌కతా: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలకు క్రేజ్ పెరిగింది. అయితే, అదే సెల్ఫీ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదమని తెలిసి కూడా సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు టీనేజర్లపైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని జీఆర్పీ పోలీసులు మంగళవారం తెలిపారు. మృతులను బగ్నాన్ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్ (18), షరిఫుల్ ముల్లిక్ (14)గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్‌బై.. బీజేపీలో చేరిక! -
షాకింగ్ వీడియో: భార్యను ట్రైన్ కింద తోసేసి పిల్లలతో పరార్!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. వీడియోలో.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్‌పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్‌లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. shocking video has emerged of a woman sleeping on the platform at Vasai railway station being pushed down by her husband. @saamTVnews @SaamanaOnline @ANI @AmhiDombivlikar @zee24taasnews @ pic.twitter.com/q0OrFTlePg — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 22, 2022 ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక విద్యార్థి రైలు ఢీ కొని మృతి చెందింది. ఐతే ఈ ఘటన రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగానే జరిగిందంటూ ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ప్రీతి పుట్టస్వామి అనే విద్యార్థి ప్రభుత్వ కాలేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి ఆటోలో రైల్వే పట్టాల వద్ద దింపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె రైలు పట్టాలు దాటుతుండగా జారిపడటంతో అటుగా వేగంగా వస్తున్న రైలు ఢీ కొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేప్టటారు. ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల తప్పిదమేనని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టాల్సిందేనంటూ...నిరసనలు చేశారు. ఈ మేరకు నిరసనకారులు హాసన్-మైసూరు హైవేను దిగ్భందించడమే కాకుండా తీవ్ర ఆగ్రహంతో టైర్లను తగలబెట్టడం వంటి పనులు చేశారు. వాస్తవానికి ఇలా రైలు పట్టాలను దాటవద్దంటూ హెచ్చరించడమే కాకుండా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే కళాశాలకు, మార్కెట్‌కు సమీపంలో ఉన్నందున నివాసితులు సులభంగా ఉంటుందని తరుచుగా ఈ రైల్వే ట్రాక్‌లను దాటి అవతలి వైపుకు వెళ్లిపోతుంటారు. ఇలా నిర్లక్య ధోరణితో రాంగ్రూట్లో రైలు పట్టాలను క్రాస్ చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవడం బాధకరం. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా!
సాక్షి, పెద్దపల్లి : ‘ఎంత పనాయేరా కొడుకా.. నువు లేక మేము బతుకుడెట్లా’ అని విశాల్ తల్లిదండ్రులు, సోదరి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. సోమవారం పెద్దపల్లి రైల్వేస్టేషన్లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం ఆగిన సమయంలో రైలు దిగిన విశాల్(21)ను సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన పెద్దపల్లిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్–పద్మావతి దంపతులకు కుమారుడు విశాల్, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. సెలవులు రావడంతో ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి శ్రీనివాస్ బయల్దేరగా లగేజీ ఎక్కువగా ఉంటుందని విశాల్, తల్లి పద్మావతి సైతం బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ రైల్లో సోమవారం ఇంటికి బయల్దేరారు. ప్రాణం తీసిన క్రాసింగ్.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు క్రాసింగ్ కోసం ఆగడమే విశాల్ ప్రాణాలను తీసిందా.. అనే భావన అందరిలో నెలకొంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు నుంచి దిగిన విశాల్ పక్కనే ఉన్న పట్టాలపైకి వెళ్లిన సమయంలో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ప్రమాదం జరిగింది. చదవండి: డెలివరీకి డబ్బు కావాలి, డ్రాప్ చేయాలని అడిగింది.. ఆపై బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం -
రెండు రైళ్ల ఢీ.. 32మంది మృతి..
కైరో : రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 32 మంది మృత్యువాతపడగా 66 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టుకున్న వేగానికి చాలా కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయారు. దఫల్ అల్ సవమ్, తాహ్త సిటీ మధ్య ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుని సహాయక చర్యలు చేపట్టారు. కోచ్‌ల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయటానికి చుట్టు పక్కలి గ్రామాల జనం కూడా సహాయపడుతున్నారు. ఇప్పటికే 49 అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటంలో సహాయపడుతున్నాయి. మొరగ, తాహ్త, సోహగ్ హాస్పిటల్లలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈజిప్టు రైల్వే శాఖ పని తీరు బాగాలేకపోవటంత కారణంగానే తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో అత్యధికంగా దాదాపు 1,793 ప్రమాదాలు జరిగాయి. 2017 ఆగస్టులో అలెగ్జాండ్రియా సిటీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా.. 123 మంది గాయపడ్డారు. చదవండి, చదివించండి : స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా? -
రైలు ప్రమాదంలో గ్రామ వలంటీర్ మృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రామ వలంటీర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు మండలం మొఖసా నరసన్నపాలెం గ్రామంలో బోయపాటి రవీంద్రకుమార్ (35) వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రైలు ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఏలూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వలంటీర్ ఐడీ కార్డు ఆధారంగా మొఖసా నరసన్నపాలెం గ్రామ వలంటీర్ బోయపాటి రవీంద్రకుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రకుమార్ ప్రమాదవశాత్తూ రైలు క్రింద పడి మరణించడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
రైలుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
లక్నో: స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలెట్లు గుర్తించడంతో కేవలం రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదమేమి సంభవించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి బిహార్‌లోని జయనగర్‌కు 4674 షహీద్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో లక్నో సమీపంలోని చర్బాగ్ రైల్వే స్టేషన్లో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అయితే పట్టాలు తప్పిన బోగీల్లో ప్రయాణికులు ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. వెంటనే ఆ ఆ బోగీలలోని ప్రయాణికులను దింపేసి ఇతర బోగీల్లో ఎక్కించి రైలు ప్రయాణం పునరుద్ధరించారు. -
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్‌లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ.. -
రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డి: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైలు ఇంజన్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తోంది. ఇది గమనించి ఉద్యోగులు అక్కడి నుంచి తప్పుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఇంజన్ ఢీకొని ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. -
మానవ తప్పిదం వల్లే
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో నవంబర్ 11న ఎంఎంటీఎస్–ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తేల్చారు. సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎంఎంటీఎస్ లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమా దం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలిలో రెండు రోజుల పాటు పరీక్షించారు. సిగ్నల్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సిబ్బంది, అధికారులను ప్రశ్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణం కాదని తేల్చారు. లోకోపైలట్ చంద్రశేఖరే ప్రమాదానికి కారణమని గుర్తించి రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో లోకోపైలట్ మృతి చెందగా, రైలు గార్డు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సెలవులోనే ఉన్నా రు. గార్డు కోలుకున్న తర్వాత దీనిపై ప్రశ్నిం చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
రైలు ప్రమాదంపై కమిటీ విచారణ వేగవంతం
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్‌సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్‌కృపాల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కాగా నేడు విచారణలో భాగంగా స్టేషన్ మేనేజర్ రవీందర్, డివిజన్ రీజనల్ మేనేజర్ ఎన్వీఎస్ ప్రసాద్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్‌లు రైల్వేసేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని విచారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ రైల్‌భవన్‌లో ఈ ఘటనపై అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు. చదవండి : కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ.. -
కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ..
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం (13న) ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలెట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసుల అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ రైలును లోకోపైలట్ మూవ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్‌ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక, రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై కేసులను నమోదు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ప్రాణం కాపాడిన ‘100’
సాక్షి, సంగెం(వరంగల్) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది. ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్‌రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్‌పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవిందర్ కోరారు.