Rajeev Chandrashekhar
-
ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు. -
రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్.. ఆస్థులకంటే అప్పులే ఎక్కువ!
కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి 'రాజీవ్ చంద్రశేఖర్' నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, అప్పులు వంటి వాటిని వెల్లడించారు. ఆస్తులకు సంబంధించి.. చంద్రశేఖర్ వద్ద రూ.52,000 నగదు, చరాస్తులతో పాటు మొత్తం రూ.9.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.10.38 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.45.7 కోట్ల రుణాత్మక ఆస్తులు, వ్యక్తిగత రుణాలు రూ.41.2 కోట్లు ఉన్నట్లు సమాచారం. రాజీవ్ చంద్రశేఖర్ వద్ద రూ. 10000 విలువ చేసే స్కూటర్, రూ. 3.35 లక్షల విలువైన నగదు ఉన్నట్లు సమాచారం. కాగా ఆయన భార్యకు రూ. 12.47 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఐటీ మంత్రి స్థిరాస్థులురూ. 14.4 కోట్లుగా ప్రకటించారు. అప్పులు దాదాపు రూ. 19.42 కోట్లు ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ అధిపతి 'శశి థరూర్' & సీపీఐకి చెందిన పన్నియన్ రవీంద్రన్‌పై చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శశిథరూర్ నాలుగోసారి గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసారు. -
శశిథరూర్ ప్రత్యర్ధి ఎవరంటే?
తిరువనంతపురం : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్ధులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. 39 మందిలో కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్ తన సొంత నియోజకవర్గం తిరువనంతపురం నుండి పోటీ చేయబోతున్నారు.థరూర్ అదే నియోజకవర్గం నుండి ప్రస్తుతం మూడవసారి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2009లో తొలిసారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన థరూర్ గతంలో కాంగ్రెస్ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక రానున్న ఎన్నికల్లో శశి థరూర్ ప్రత్యర్థి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి - రాజీవ్ చంద్రశేఖర్. మూడుసార్లు రాజ్య సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించన ఆయన తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. -
అలా కుదరదు.. ఏఐ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారత్‌లో తమ ఉత్పత్తులను ఎలా పడితే అలా భారత్ మార్కెట్లోకి తీసుకురావడం కుదరదు. భారత్‌లో ఏఐ ఉత్పత్తులు ప్రారంభించే ముందు ప్రభుత్వ ఆమోదం పొందటం తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. "తమ ఏఐ మోడల్స్‌ను ల్యాబ్ నుండి నేరుగా మార్కెట్‌కి తీసుకెళ్లడంలో మరింత క్రమశిక్షణతో ఉండటానికి ఇది సహాయపడుతుంది. డిస్క్లెయిమర్లు, కాపలా వ్యవస్థ ఉండాల్సిందే. తద్వారా వినియోగదారుకు ఏది నమ్మదగనిదో తెలుస్తుంది" అని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని, దీనికి సంబంధించిన తీసుకున్న చర్యలు, ప్రస్తుత స్థితిపై 15 రోజుల్లోగా నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ఆదేశాలు ఫిబ్రవరి 29న జారీ అయినట్లు మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. ఏదైనా తప్పుడు సమాచారం లేదా డీప్‌ఫేక్ సృష్టికర్తను గుర్తించడానికి ఏఐ రూపొందించిన కంటెంట్‌ను శాశ్వత ప్రత్యేకమైన మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్‌తో లేబుల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎర్రర్‌కు గురయ్యే మోడల్‌ను అమలు చేయాలనుకుంటే, దానిని టెస్టింగ్‌లో ఉన్నట్లు లేబుల్ చేయాలి. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇది ఎర్రర్-ప్రోన్ ప్లాట్‌ఫారమ్ అని పేర్కొంటూ యూజర్ నిర్ధారణ, సమ్మతిని స్పష్టంగా తీసుకోవాలని మంత్రి వివరించారు. -
డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు ప్రత్యేక అధికారులు: కేంద్రం
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు ఫిర్యాదులకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశం తరువాత కేంద్రం ఈ నిర్ధారణకు వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాన్ని చెప్పారు. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు చాలా ప్రమాదకరమని, నకిలీ సమాచారంతో ప్రజలను ఇవి తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కఠినంగా వ్యవహించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘ఐటి రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన వ్యవధిలోపు , లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటలలోపు ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్టు రుజువైనా లక్ష రూపాయల దాకా జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోల వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకొచ్చేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భగా ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్ ఫేక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ పరిణమిస్తున్నాయంటూ సోమవారం ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ట్విటర్ వేదికగా ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌పాంలకు కూడా కొన్ని సూచనలు అందించారు. అలాగే ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, విశ్వాసాన్ని కలిగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. 2023, ఏప్రిల్ నుంచిఅమల్లోకి వచ్చిన నిబంధనలు ప్రకారం సోషల్ బీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయకూడదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ గుర్తు చేశారు. వినియోగదారులు లేదా ప్రభుత్వం కానీ తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేసిన 36 గంటల్లో అటువంటి కంటెంట్‌ను తీసివేయవలసి ఉంటుందని వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం, ఈ నిబంధనలను పాటించకపోతే ప్లాట్‌ఫారమ్‌పై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఐటీ రూల్-7 ప్రకారం కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికపై వస్తున్న ఫేక్ వీడియోలపై బాధితులు కోర్టును ఆశ్రయించే హక్కు ఉందన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. టాలీవుడ్ నటి రష్మికకు సంబంధించి అభ్యంతర రీతిలో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులతోపాటు, నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇలాంటి తప్పుడు వీడియోలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుడ్‌బై మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న రష్మిక బిగ్‌బీతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. డీప్ ఫేక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు, ఆడియో లేదా వీడియోలను మార్ఫింగ్ చేసి డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తారు. మెషిన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఒరిజినల్ వీడియోలు, ఫోటోల స్థానంలో నకిలీ ఇమేజ్,వీడియోలను రూపొందిస్తారు. సైబర్ నేరగాళ్లు ఖచ్చితమైన ఫేషియల్ సిమెట్రీ డేటా సెట్‌ను రూపొందించడానికి ఫేషియల్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏఐని వాడుకుంటారు. దీంతో పాటు ఒక వ్యక్తి వాయిస్‌ని ఖచ్చితంగా కాపీ చేయడానికి వాయిస్ మ్యాచింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలా బ్రిటీష్-ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ నటించిన వీడియోను రష్మిక్ ఫేస్‌తో డీప్‌ఫేక్ వీడియోను సృష్టించడం గమనార్హం. PM @narendramodi ji's Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet Under the IT rules notified in April, 2023 - it is a legal obligation for platforms to ➡️ensure no misinformation is posted by any user AND ➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023 -
ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో తన కెదురైన అనుభవంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సర్వీసు, క్యాబిన్ పరిస్థితి నచ్చలేదు అంటూ సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇండియా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతున్న తరుణంలో ప్రయాణీకులకు ఇలా స్వాగతం చెప్పడం ఏమీ బాగాలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ తర్వాత ఢిల్లీకి తిరుగి వస్తుండగా కేంద్ర మంత్రికి ఈ అనుభవం ఎదురైంది. లండన్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణానికి ఆయన విస్తారా విమానాన్ని ఎంచుకున్నారు.ప్రయణా సాఫీగా సాగినప్పటికీ, కానీ ఇదే బాలేదు అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?) ఈ క్రమంలో విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్లో పడివున్న వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహార పదార్థాల ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పే తీరు బాలేదు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి డిస్ అప్పాయింటెడ్ హ్యాష్‌ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఇది వైరల్‌గామారింది. ఒక్కో యూజర్ తమకెదురైనా అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన విస్తారా ఒక ప్రకటన జారీ చేసింది. (పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం) విస్తారా ప్రకటన: పోస్ట్ వైరల్ కావడంతో విస్తారా స్పందించింది. హాయ్ రాజీవ్ జీ మీ కెదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద కస్టమర్లకు చక్కటి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. జరిగిన ఘటన తమ ప్రామాణిక శుభ్రతా విధానాలకు అనుగుణంగా లేదనేది అర్థ మైందనీ, దీనిని సీరియస్‌గా పరిగణించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన అనుభవాన్ని అందించడానికి బద్ధులై ఉన్నామంటూ వివరణ ఇచ్చింది. So decided to fly @airvistara from London to Delhi last nite. Nice new clean 787 aircraft and very smooth flight - but saddened by service & state of cabin -food & litter not the best way to welcome visitors to India or compete wth other global carriers 😥😥🤷🏻♂️#Disappointed… pic.twitter.com/LSsVDPOym5 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 3, 2023 -
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు: మంత్రి కౌంటర్ ట్వీట్
కేరళ వరుస పేలుళ్ల నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం (అక్టోబర్ 31న) కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఈ ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్షన్ 153 (ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. పాలస్తీనాకు సీపీఎంతో మద్దతుతో కలమసేరి పేలుళ్లను ముడిపెట్టి, ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది. విచ్ఛిన్నకర, అతివాద శక్తులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ కేరళ చీఫ్ కె సురేంద్రన్ ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వారిని కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బీజేపీ నేత ఆరోపించారు. కేసుతో బెదిరించాలని చూస్తున్నారు అటు తనపై నమోదైన కేసుపై రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ ద్వారా స్పందించారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఏకమై తనపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. హమాస్‌పై వారి వైఖరిని బహిర్గతం చేసినందుకే ఈ కేసుతో బెదిరించాలని చూస్తున్నారన్నారు. SDPI, PFI,హమాస్ వంటి విషపూరిత రాడికల్ హింసాత్మక సంస్థలకు నిర్లజ్జగా మద్దతిస్తున్నాయనీ, వీరి బుజ్జగింపుల కారణంగా కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి కేరళ వరకు తీవ్రవాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక మంది అమాయక ప్రజలు, భద్రతా దళాలు బలయ్యారంటూ ట్వీట్ చేశారు. So the two INDI alliance partners @RahulGandhi and @PinarayiVijayan have jointly filed a "case" against me Two of biggest appeasers in Indian politics who shamelessly appease poisonous radical violent organizations like SDPI, PFI and Hamas, whose politics have caused… pic.twitter.com/rTOLCULeDT — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 31, 2023 కాగా ఆదివారం నాటి వరుస పేలుళ్లపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ద్వారా కేరళ సీఏంపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ జిహాద్ కోసం బహిరంగ పిలుపులిస్తున్నటెర్రరిస్ట్ హమాస్ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారని ట్వీట్ చేశారు. దీంతో కేరళ సీఎం, కేంద్ర మంత్రి మధ్య మాటల యుద్ధం జరిగింది. పచ్చి అబద్దాల కోరు, తీవ్రమైన విషం చిమ్ముతున్నాడంటూ ముఖ్యమంత్రి రాజీవ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అనే తేడా లేకుండా చట్టాన్ని వ్యతిరేకంగా, విద్వేషంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చెప్పారు. -
చైనాకు 30 ఏళ్లు పట్టింది .. మనకు పదేళ్లే
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద వ్యవధిలో అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు పురోగమిస్తోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ స్థాయికి చేరుకునేందుకు చైనాకు 25–30 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్ నుంచి కార్ల వరకూ అన్నింటా ఉపయోగించే చిప్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు భారత్ పురోగమనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ‘ఈ 10 బిలియన్ డాలర్ల తోడ్పాటుతో వచ్చే 10 ఏళ్లలో సెమీకండక్టర్ల విభాగంలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు వెడుతోంది. దీనికోసం చైనా వంటి దేశాలకు 25–30 ఏళ్లు పట్టేసింది. అయినా అవి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు ‘అని మంత్రి చెప్పారు. మెమరీ సొల్యూషన్స్ దిగ్గజం మైక్రాన్ తలపెట్టిన ఏటీఎంపీ ప్రాజెక్టుతో సెమీకండక్టర్ల పరిశ్రమలో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో .. వేదాంత, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఇక్కడ చిప్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్‌కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
లక్ష యూనికార్న్‌లు.. 20 లక్షల స్టార్టప్‌లు సాధ్యమే: కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్‌ల స్థాయికి ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. -
ట్విటర్‌కు షాక్: రూ.50 లక్షల జరిమానా
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు భారీ షాక్ తగిలింది. కేంద్రం ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ విషయంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విటర్ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన అన్ని ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ జాక్ నేతృత్వంలోని ట్విటర పదే పదే ఉల్లంఘించిందని ట్వీట్ చేశారు. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం 10 సార్లు ట్విటర్‌ను బ్లాక్ చేసిందని ఆరోపించింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గత ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంఆదేశాలు, ఏకపక్షంగా వాక్, భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించింది. 2021లో రైతుల నిరసనల నిర్వహణపై విమర్శనాత్మకమైన ఖాతాలను పరిమితం చేయాలనే ఆదేశాలను పాటించకపోతే దేశంలో సోషల్ మీడియాను మూసివేస్తామని ఇండియా బెదరించిందని ట్విటర్‌మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆరోపించిన తరువాత తాజా తీర్పు వెలువడటం విశేషం. గత ఏడాది జూన్ 28న, జూలై 4లోగా ఉత్తర్వులను పాటించాలని కోరుతూ ప్రభుత్వం ట్విటర్‌కు లేఖ రాసింది, లేకపోతే మధ్యవర్తిగా తన చట్టపరమైన కవచాన్ని కోల్పోతారని హెచ్చరించింది. లీగల్ షీల్డ్‌ను కోల్పోతే,యూజర్లు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ట్విటర్ ఎగ్జిక్యూటివ్‌లకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. VIDEO | "Our relationship with (social media) platforms isn't adversarial. Our insistence is that law must be followed. I am glad that the court has today laid down that non-compliance isn't an option. All platforms in India have to comply with Indian law," says Union Minister… pic.twitter.com/ExO0jWugpD — Press Trust of India (@PTI_News) June 30, 2023 -
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలు వడ్డాయి. యాంటిట్రస్ట్ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ నేపథ్యంతో తాజా వ్యాఖ్యాలు చేశారు. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరిమానా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు, భారతదేశంలోని మొత్తం డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంద న్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) కాగా ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు నిజమని గత ఏడాది యాంటీట్రస్ట్ వాచ్డాగ్ సీసీఐ తేల్చింది. కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. వ్యాపారంలో పోటీ కార్యకలాపాల్లో అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉన్న సంగతి తెలిసిందే. -
త్వరలో సెమీ కండక్టర్ల హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. త్వరలో ప్రకటించబోయే సెమీకండక్టర్ ఫ్యాబ్, తొలి ప్యాకేజింగ్ యూనిట్లతో పాటు 2024 నాటికి 100 డిజైన్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాల ఊతంతో భారత్ సెమీకండక్టర్ల హబ్‌గా మారగలదని ఆయన పేర్కొన్నారు. చిప్‌ల తయారీ కోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక పథకం, విరివిగా నిపుణుల లభ్యత, నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడగలదని చంద్రశేఖర్ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన మూడో సెమీకాన్ఇండియా ఫ్యూచర్డిజైన్ రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు వివరించారు. దేశీయంగా ఏడాదిన్నర క్రితం సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్‌లనేవి దాదాపు శూన్యమని, కానీ ప్రస్తుతం 27–30 డిజైన్, సెమీకండక్టర్ అంకుర సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2024 నాటికి ఈ విభాగంలో 100 పైచిలుకు అంకుర సంస్థలు ఏర్పాటయ్యే దిశగా ముందుకు వెడుతున్నామన్నారు. యాపిల్, సిస్కో, శాంసంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలవగలదని.. తయారీ రంగం ఇప్పటికే ఊపందుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ఇన్‌కోర్‌లో సెకోయా పెట్టుబడులు.. రోడ్‌షో సందర్భంగా ఇన్‌కోర్ సెమీకండక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సెకోయా క్యాపిటల్ ఇండియా ప్రకటించింది. ఇన్‌కోర్ ఇప్పటి వరకూ సెకోయా నుంచి 3 మిలియన్ డాలర్లు సమీకరించింది. సెమీకండక్టర్ల విభాగంలో సెకోయాకు ఈ ఏడాది ఇది రెండో పెట్టుబడి. ఈ మధ్యే మైండ్‌గ్రోవ్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసింది. -
ఎస్వీబీ సంక్షోభం: స్టార్టప్‌లకు రిస్కులు తొలగిపోయినట్లే!
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. ఎస్వీబీ ప్రధానంగా స్టార్టప్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్వీబీ బ్రిటన్ విభాగాన్ని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది. -
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్‌ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొబైల్స్‌లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. -
ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికి కేంద్ర మంత్రి!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్మస్క్తో అంటీముట్టనట్టుగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఈలాన్ మస్క్‌కి పరోక్ష మద్దతు లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్విటర్ విషయంలో ఈలాన్ మస్క్ తెలిపిన అభిప్రాయాలను కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు. ట్విటర్లో విద్వేషపూరిత ట్వీట్లు చేస్తున్నారని, అనవసర గొడవలకు కారణం అవుతున్నాడంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని తమ ప్లాట్‌ఫారమ్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు గతంలో ట్విటర్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అప్పుడే వ్యతిరేకించాడు ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్. ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఉండాలనే నినాదంతో ట్విటర్లోనూ పోల్స్ పెడుతూ చివరకు ఆ సంస్థను టేకోవర్ చేశారు. కాగా ట్రంప్‌పై శాశ్వత నిషేధం అనైతికంగా సరికాదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయడం తమ వైఫలమ్యంటూ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తనతో చెప్పినట్టు కూడా మస్క్ తెలిపాడు. కాగా ట్రంప్‌ను ట్విటర్ నుంచి శాశ్వతంగా నిషేధించడం తమ వైఫల్యమంటూ జాక్ డోర్సే తెలిపినట్టుగా వచ్చిన వార్తా కథనాన్ని రీట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి ఒక వ్యక్తిని శాశ్వతంగా నిషేధించడం అంటే యూజర్ల ప్రాథమిక హక్కులను హరించినట్టే. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే బలమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. Deplatforming is a big deal - Its a violation of fundamental rights of users n must hv force of law behind it for any platform to exercise n must never ever be be done arbitrarily. @elonmusk @jack https://t.co/gkYLTbTiGB — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) May 11, 2022 ఫ్రీ స్పీచ్, శాశ్వత నిషేధం వంటి అంశాలపై ఇప్పటికే ఈలాన్ మస్క్‌కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండగా తాజాగా భారత మంత్రి కూడా ఇందులో జతయ్యారు. పైగా మంత్రి ట్వీట్‌కు స్పందిస్తున్నవారు సైతం శాశ్వత నిషేధం అనే నిర్ణయం సరికాదంటున్నారు. చదవండి: Donald Trump: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్ -
ఐటీ పరిశ్రమకు వై2కే తరహా అవకాశం
న్యూఢిల్లీ: కరోనా తర్వాతి ప్రపంచం భారత ఐటీ పరిశ్రమకు వై2కే తరహా సందర్భం వంటిదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు, భారీ అవకాశాలను సొంతం చేసుకునేందుకు పరిశ్రమ ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2021’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నైపుణ్యాలపై ఐటీ పరిశ్రమ మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని చంద్రశేఖర్ ప్రస్తావించారు. తగినంత పని లేదని కొన్నేళ్ల క్రితం చెప్పిన కంపెనీలే.. ఇప్పుడు విదేశాల్లో నియామకాలు చేపడుతూ పెద్ద ఎత్తున నైపుణ్య వనరులను నిలుపుకుంటున్నట్టు తెలియజేశారు. ‘‘ప్రపంచం ఎంతగానో మారిపోయింది. డిజిటైజేషన్ ఆకాశామే హద్దుగా కొనసాగుతోంది. కనుక డిటిజైషన్కు, నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పెరిగింది. మనం కరోనా తర్వాతి ప్రపంచంలో ఉన్నామని గుర్తించాలి. భారత ఐటీ పరిశ్రమకు ఇది వై2కే తరహా సందర్భం’’ అని చంద్రశేఖర్ అన్నారు. అవకాశాలను వెంటనే సొంతం చేసుకోలేకపోతే మరొకరు వీటిని తన్నుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు ముందుకు రావాలి. నైపుణ్య శిక్షణ, నెట్వర్క్ విస్తరణకు నూరు శాతం కష్టించి పనిచేయాలి’’ అని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో, యూనికార్న్‌ల ఏర్పాటులో ఫిన్‌టెక్ కంపెనీల (టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల కంపెనీలు) పాత్రను ఆయన ప్రస్తావించారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధారిత పరిష్కారాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయని ప్రశంసించారు. -
కర్ణాటక సంక్షోభం : రతన్ టాటాను తప్పుపడతారా?
బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్ శాసన సభ్యులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లినట్లు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు రాజీవ్ చంద్రశేఖర్. ‘విమానంలో ప్రయాణించింనంత మాత్రాన ప్రభుత్వం కూలిపోతుందా.. అలానే జరిగితే ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ అలానే చేస్తారు కదా. ఎమ్మెల్యేలు విస్తారా విమానంలో ప్రయాణించారు. అంటే ఈ సంక్షోభానికి రతన్ టాటాను కూడా బాధ్యుడిని చేస్తారా’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ప్రయాణించింది చార్టెడ్ ప్లైట్‌లో.. ఇంతకు ముందు ఈ విమానాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా ఉపయోగించారు. కాబట్టి జరగుతున్న పరిణామాలకు విమానాన్ని నిందించడం మాని కూటమిలోని అస్థిరత్వాన్ని విమర్శించుకుంటే మంచిందన్నారు రాజీవ్. ఈ సమస్యను బీజేపీ మీద నెట్టాలని సంకీర్ణ కూటమి నాయకులు ప్రయత్నించారు. కానీ వారి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు రాజీవ్ తెలిపారు. -
వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల అఫిడ్‌విట్‌లో పేర్కొన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాను నిర్వహిస్తున్న వివిధ కంపెనీల నుంచి తనకు ఏటా 28 కోట్ల రూపాయలు వస్తున్నాయని, తన కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం 65 కోట్ల రూపాయలని తెలిపారు. తాను 1942 మోడల్ ‘రెడ్ ఇండియన్ స్కౌట్’ కారును 2004లో పది వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంచ్లో నమోదుకాని ‘వెంక్ట్రా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎస్పీఎల్ ఇన్ఫోటెక్ పీటీఈ, జూపిటర్ గ్లోబల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, మిన్స్క్ డెవలపర్స్, ఆర్సీ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్, శాంఘైన్ న్యూ మీడియా’ కంపెనీల్లో తనకు ఈక్విటీ షేర్లు ఉన్నాయని, ఈ షేర్ల ద్వారా ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని ఆయన వివరించారు. 58 అనుబంధ కంపెనీలు కలిగిన అతిపెద్ద కంపెనీ ‘జూపిటర్ క్యాపిటల్’ పేరును ఆయన తన అఫిడవిట్లో పొందుపర్చలేదు. ఈ కంపెనీలో 90 శాతం వాటా ఆయనదే. ఆయన 2005లో ఈ కంపెనీని స్థాపించారు. మొదటి సంవత్సరం నాలుగు అనుబంధ కంపెనీల ద్వారా ఆ కంపెనీకి 15.08 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కంపెనీ వేగంగా అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. కంపెనీ 2018లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదిక ప్రకారం కంపెనీకి 58 అనుబంధ కంపెనీలు ఉన్నాయి. వాటిలో సువర్ణ న్యూస్, ఆసియా నెట్, ఇండిగో 91.9 ఎఫ్ఎం, రిపబ్లిక్ టీవీ, ఆక్సిస్కేడ్ (టెక్నాలజీ సంస్థ), ఇండియన్ ఎయిరో వెంచర్స్ లాంటి పలు డిఫెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆదాయం జూపిటర్ కంపెనీ 2018, మార్చి నెలలో ‘రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్’ సమర్పించిన నివేదికలో కంపెనీ పెట్టుబడుల విలువను 7,100 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. 2018, మార్చి నెల నాటికి 1,026 కోట్ల రూపాయలను వార్షికాదాయంగా చూపించారు. ఈ కంపెనీ గురించి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. ఆయన 2014 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్ట్ 30వ తేదీ వరకు డిఫెన్స్ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులుగా కొనసాగారు. అప్పుడు సొంతంగా డిఫిఎన్స్ కంపెనీలు కలిగిన వ్యక్తిని పార్లమెంటరీ స్థాయి సంఘంలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ ఎంపీలు గొడవ చేశారు. వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ తరఫున చర్చలు జరిపిన కమిటీలో కూడా ఈ రాజీవ్ చంద్రశేఖర్ సభ్యుడిగా ఉన్నారు. అనేక లగ్జరీ కార్లు ఆయన సొంతం చంద్రశేఖర్ తాను 2004లో పది వేల రూపాయలతో ఓ డొక్కు కారును కొన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. హెరిటేజ్ కార్లకు లక్షల్లో, కోట్లలో డిమాండ్ ఉంటుందన్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్తలు ఎవరైనా కంపెనీల పేరిటే కార్లను కొంటారని తెల్సిందే. ఆయనకు ‘ఫెరారీ డినో, ఫెరారీ ఎఫ్555 స్పైడర్, లంబోర్గినీ ముర్సీలగో, బీఎండబ్ల్యూ ఎం5 (ఎఫ్ 60), హమ్మర్ హెచ్2 లాంటి అతి ఖరీదైన, అతి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అఫిడవిట్లోనూ తప్పులే తనకు ఆరు కంపెనీల నుంచి ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని 2018, మార్చి 12వ తేదీన సమర్పించిన అఫిడవిట్లో రాజీవ్ పేర్కొన్నారు. అయితే అవి ఫిబ్రవరి 28వ తేదీ నాటి లెక్కలని చెప్పారు. 2018, మార్చి 30వ తేదీ నాటికి ఈ ఆరు కంపెనీలకు కలిపి 313 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కంపెనీ ఆర్థిక రిటర్న్స్‌లో చూపించారు. లోక్‌పాల్ విచారించాల్సిందే! ప్రధాని సహా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల అవినీతిని విచారించే అధికారంగల లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను కేంద్రం ఆదివారమే ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రధాని నేతత్వంలోని కమిటీ నియమించే లోక్‌పాల్ చైర్మన్, ప్రధానిపై వచ్చే ఆరోపణలను చిత్తశుద్ధిగా విచారిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. పాలకపక్షం బీజేపీ తరఫున గత మార్చి నెలలో గెలిచిన రాజీవ్ చంద్రశేఖర్, తన అఫిడవిట్లో అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను బోల్తా కొట్టించినందుకు ఆయనపై లోక్‌పాల్ విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ప్రక్షాళన దిశగా తొలి అడుగు వేయాలి. -
వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు
-
భారత వాయుసేనలోకి ‘డకోటా’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన(ఐఏఎఫ్)లోకి పురాతన డగ్లస్ డీసీ 3 విమానం వచ్చి చేరనుంది. పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన ఈ విమానాన్ని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్ ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధాల్లో దీన్ని వినియోగించారు. ఈ సమయంలో డకోటా అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానానికి చంద్రశేఖరన్ తండ్రి పైలట్‌గా వ్యవహరించారు. డకోటాతో ఉన్న అనుబంధానికి గుర్తుగా బ్రిటన్ నుంచి చంద్రశేఖరన్ దాన్ని కొనుగోలు చేశారు. ఆరేళ్లుగా లండన్‌లో మరమ్మతులు చేయిస్తున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే డకోటాను ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చేందుకు చంద్రశేఖరన్ ప్రతిపాదన చేశారు. అయితే, చంద్రశేఖరన్ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. బీజేపీ హయాంలో చంద్రశేఖరన్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో డకోటా చేరేందుకు అన్ని రకాల క్లియరెన్సులను పూర్తి చేస్తున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. మరికొద్ది నెలల్లో యూకే నుంచి విమానం భారత్‌కు వస్తుందని చెప్పారు.