Rajender etela
-
కంటోన్మెంట్లో కారుణ్య నియామకాలు చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్లో పనిచేసిన మున్సి పల్ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం18వ లోక్‌సభ ‘జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. -
మాది చేతల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మేం ఇళ్లలో కూర్చోలేదు.. ‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. ఆక్రమణలతోనే అనర్థాలు ‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అది కమీషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు దీన్ని కమీషన్ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. రిటైనింగ్ వాల్‌పై ఇంజనీర్లతో చర్చిస్తాం ‘మున్నేరుపై రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్ తెలిపారు. వెంటనే స్పందించాం.. ‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.రూ.10 వేలు దేనికి సరిపోతాయి? సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
కమలానికి కొత్త సారథి.. ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈటల వైపే మొగ్గు...?బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.అలాగైతే రామచంద్రరావుకే.. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
అవి రైతుల పాలిట ఉరితాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభివరి్ణంచారు. ఈ నిబంధనలు రైతాంగాన్ని వంచనకు, మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాపనార్ధాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఇచి్చన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అద్దాల మేడలో కూర్చొని, తనకు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారనే ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.34 వేల కోట్ల రైతుల రుణమాఫీని బేషరతుగా చేస్తామన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిబంధనల పేరుతో హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో రే వంత్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్‌కు ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆడబిడ్డలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కాలేజీ పిల్లలకు స్కూటీలు.. వంటి హామీలను అమలు చేయడంపై లేదన్నారు. ఫిరాయింపుల పర్వం చూస్తుంటే కేసీఆర్ జుట్టు నుంచి రేవంత్‌రెడ్డి పుట్టినట్టు ఉందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నారా? లేదా? ‘తెల్లరేషన్ కార్డు ఎవరికి ఇస్తారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నాడా? లేదా? మూడున్నర ఎకరాల తరిపొలం, ఏడు ఎకరాల కుష్కి పొలం ఉన్నవారికి మాత్రమే తెల్లరేషన్ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వక పదేళ్లు అవుతుంది. మీరు వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు పేరుతో సగం మందికి, ఆదాయపన్ను పేరుతో 20%మందికి, రీ షెడ్యూల్ పేరుతో ఇంకొంత మందికి రుణమాఫీ ఎగ్గొడుతున్నారు. పొమ్మనక పొగబెట్టడం, ఎగబెట్టుడు తప్ప ఇంకొకటి లేదు’అని ఈటల ధ్వజమెత్తారు. -
రాష్ట్ర బీజేపీలో ‘అధ్యక్ష’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరగొచ్చుననే అంచనాల మధ్య అది తీవ్ర రూపం దాలి్చంది. ప్రధానంగా కొంతకాలం క్రితం కొత్తగా పార్టీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే ఇతర పదవుల్లో ఉన్న వారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి మధ్య తీవ్రపోటీ నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై పూర్తి అంకితభావంతో ఉన్న పాత నాయకులకే ఈ పదవి దక్కాలంటూ బీజేపీలో ఓ వర్గం నాయకులు గట్టిగా ప్రయతి్నస్తున్నారు. అయితే పార్టీ విస్తరించాలంటే కొత్తవారు చేరడం ముఖ్యమని, కొత్త, పాత తేడాలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకిగా మారకూడదని మరికొందరు వాదిస్తున్నారు. రాజాసింగ్ వర్సెస్ ఈటల దాదాపు రెండేళ్ల క్రితం పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ పేరు పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా పార్టీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతోంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని కోరుకున్న ఈటలకు.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పినట్టు సమాచారం.మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తనను తప్పించాలని కోరడంతో.. త్వరలోనే అంటే వారం, పది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ దేశభక్తి కలిగి దూకుడుగా వ్యవహరించే (అగ్రెసివ్) నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఈటల ఘాటుగా స్పందించారు. గల్లీల్లో ఉన్నవారు కాదు కావాల్సింది‘ఫైటర్‌కు పదవిని ఇవ్వాలంటూ కొందరు మాట్లాడుతున్నారు.. ఎవరికి ఇవ్వాలి.. స్ట్రీట్ఫైటర్కు ఇవ్వాలా..’అంటూ నేతల పేరును ప్రస్తావించకుండా ఈటల వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్న వాడు కావాలని, గల్లీల్లో ఉన్న వారు కాదని రాజ్యాన్ని, అధికారంలో ఉన్న వారిని నిగ్గదీసి నిలదీయగలిగే వాడే ఫైటర్ అవుతాడని అన్నారు. తన లాంటి వారు ఊరికే మాట్లాడరని సందర్భం వచ్చినపుడు జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వారిమని ఓ సమావేశంలో పాల్నొన్న సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. కొత్త, పాత నాయకులు అనే తేడాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. ఒక పార్టీ కొత్తగా ఎదిగి, అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు జతకావాల్సిందేనన్నారు. కొత్త, పాత ఏమీ లేదన్న రఘునందన్ తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్‌రావు వద్ద ఓ విలేకరి ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘కొత్తగా వచి్చన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ అసోం సీఎం అయ్యేవారు కాదు. ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరి కండువా కప్పుకున్న రోజునుంచే ఆ పార్టీ నాయకుడిగా సదరు వ్యక్తి చెలామణి అవుతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’అంటూ స్పందించడం గమనార్హం. పోటీలో పలువురు నేతలుమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, జి.మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ వంతు లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి నాటికి బీజేపీ రాష్ట్ర కొత్త సారథిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్టు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవా రం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల సమావేశం కానున్నారు. అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి మళ్లీ కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం తనకు సన్నిహితులైన అస్సాం సీఎం, అధిష్టానం దూత హిమంత బిశ్వతో ఈటల భేటీ అయిన సందర్భంగా జాతీయ నాయకత్వం ఆలోచనలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. అంతకుముందు అమిత్ షా కూడా ఈటలతో ఫోన్లో మాట్లాడి ఈ అంశాలను వివరించినట్టు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకుందని.. పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సమాయత్తం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని వారిద్దరు సూచించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించినా.. ఈటల రాజేందర్ తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ అగ్ర నాయకత్వం ఒప్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమైనట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు.దాదాపు ఇరవై ఏళ్లపాటు టీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో గుర్తింపుతోపాటు కేసీఆర్ కేబినెట్లో నంబర్ టూగా కొనసాగిన నేపథ్యంలో.. ఈటలకు ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న ఇమేజీ పార్టీ పురోగతికి దోహదపడతాయని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈటలకున్న గుర్తింపు, వివిధ సామాజిక వర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, సంఘాలతో మంచి సంబంధాలు ఉండటం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
రేవంత్‌కు మతి భ్రమించింది
కంటోన్మెంట్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, సంచలనం కోసం ఏదిపడితే అదే మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి కేన్సర్‌లా పట్టుకుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ సీనియర్ నేత మల్క కొమురయ్యలతో కలిసి మహేంద్రాహిల్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ...వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే దేశానికి కేన్సర్‌లా తయారైందన్నారు. గత రెండు పర్యాయాలుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన కాంగ్రెస్‌కు ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పాలించే సత్తా మాకే ఉందంటూ రేవంత్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అవమానించారని విమర్శించారు. డీకే అరుణ గెలిస్తే, ఈటల ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుందనడంలో రేవంత్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు నాకే ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కంటోన్మెంట్లో డబ్బు సంచులతో దిగిపోయిందని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ మల్కాజ్గిరి ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని అన్నారు. మోదీ సమర్థ పాలనతో దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కంటోన్మెంట్ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే కంటోన్మెంట్ విలీనానికి వ్యతిరేకంగా బీజేపీకే చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. -
కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, ఏం చేశారని మీటింగ్‌లు పెట్టి ఓట్లు అడుగుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు వాటి కి కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది’అని విమర్శించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత తాడూరి శ్రీనివాస్‌తో పాటు ఉప్పల్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్త లు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంరావాలని, అప్పుడే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా చెబుతున్నారన్నారు. ‘రాహుల్ ప్రధాని కాలేరు, కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయలేదు’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలున్నాయని, బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కరెంటు కోతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ అధికార ప్రతి నిధి ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
రేయ్ అని పిలిచే హక్కు వారికే ఉంటుంది
లక్డీకాపూల్ (హైదరాబాద్): చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మాజీ ఎమ్మెల్యే, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన మెగా అల్యూమ్ని వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుంచి 84 వరకు చదువుకున్నానని, కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారంటూ ఈటల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరే అని పిలవగలిగే హక్కు స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉంటుందన్నారు. సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను బయాలజీ విద్యార్థినే కానీ ఆర్థికవేత్తను కాదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తన ప్రసంగంలో మొదటిపేరాలో.. ‘ఈ డబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంద’ని చెప్పానన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేందర్, రాజస్తాన్ హైకోర్టు, న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఓయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ విద్యార్థులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహా రెడ్డి, రాచకొండ డీసీపీ ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడైనా సర్దుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురితో విడిగా భేటీ రాష్ట్ర కోర్‌కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను వేచి ఉండాలని అమిత్ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్ ఆధారంగానే అమిత్ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వారికి గట్టిగానే క్లాస్ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్‌కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్ షా క్లాసుతోనైనా లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
బీజేపీ నేతలొస్తే తరిమికొట్టండి
గజ్వేల్/దుబ్బాకటౌన్: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్టీ వేసి, గ్యాస్ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నేతలను ఈ అంశాలపై నిలదీసి చీపుర్లతో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌర స్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ వంద అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఏనాడూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోని ఈటల రాజేందర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికల బరిలో కి వచ్చి.. వరుసలు కలుపుతూ తెగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్నింటి వాసా లు లెక్కపెట్టేవిధంగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌పైనే పోటీకి దిగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ వస్తే కటిక చికటే మిగులుతుందని, ఆ పార్టీ కర్ణాటకలో కనీసం మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇదే రకమైన పరిస్థితి వస్తుందన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత విధానాలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుంజ వాయిద్యంతో ఆకట్టుకున్న మంత్రి సీఎం కేసీఆర్‌కు మద్దతుగా సోమవారం నిర్వహించిన విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు రుంజ వాయిద్యం వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. విశ్వకర్మలకు చెందిన రుంజ కళాకారులు ఈ వాయిద్యంతో అందరినీ అలరిస్తుంటారు. హరీశ్‌రావు సైతం కొద్దిసేపు వాయించి సభికులను ఉత్సాహపరిచారు. కాగా సీఎం కేసీఆర్‌కే మా మద్దతు అంటూ.. విశ్వకర్మ సంఘం నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రికి పత్రాలు అందజేశారు. బీజేపీ డకౌట్.. కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ వస్తుందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు తామే అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారని, కానీ వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. బీజేపీపై నమ్మకం లేకనే ఆ పార్టీ నుంచి విజయశాంతి, వివేక్, రాజగోపాల్‌రెడ్డితో పాటు రోజుకో నాయకుడు బయటకు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్‌లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అవినీతికి పాతరేద్దాం
గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. గజ్వేల్ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల -
61 సీట్లపైనే గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల కన్నా ఎక్కువ మెజారిటీని బీజేపీ గెలుచుకుంటుందని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో 119 నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్న ‘సెటిల్డ్’పార్టీ బీజేపీ కాదన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో ఈటలతో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. టీయూడబ్లు్యజే రాష్టప్రదాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ ప్రధాన కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అనుకూలాంశాలను, కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మూలమైన అంశాలు మూలకు.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియా మకాలు అనే అంశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. అన్ని పనులు ఆపి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనం లేకపోగా ప్రాజెక్టు పునాదులే కదిలాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలతో మొత్తం ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి వరకు ఉన్న రూ. 74 వేల కోట్ల అప్పును రూ. 5.5 లక్షల కోట్లు చేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 17 పోటీ పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, వడ్డీలేని రుణాలు, రుణమాఫీలన్నీ అటకెక్కాయి. పేదలకు భూములు ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచి్చన ప్రభుత్వ, దేవాలయ భూములు సేకరిస్తున్నారు. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారంతా కేసీఆర్ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షుడిగా చేసుకున్నారు. హంగ్‌వస్తే కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒకటవుతాయి బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టిందని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని మాపై ఒక వదంతి పుట్టించారు. రెండు పార్టీలు ఒకటి అయితే నేను గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఎందుకు పోటీ చేస్తా? టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీతో ఎప్పుడూ పొత్తులేదు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్, బీజేపీ కలుస్తా యా? 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా మూ కుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు. 2018లో 19 మందిని గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కేసీఆర్ పంచన చేరారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను నివారించగలదు. మోదీ పాలనలో స్కాం లేదు. దేశ ఆత్మగౌరవం పెరిగింది. సెటిల్డ్ పార్టీ కాదు బీజేపీ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్‌గా లేదు. జనసేనతో మాకు అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం. 8 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో ‘సెటిల్డ్’ పార్టీ కాదు. అందుకే నాయకులు వస్తుంటారు... పోతుంటారు. బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు ఎందుకు నాయకులను చేర్చుకుంటున్నాయి? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జీహెచ్ఎంసీలలో బీజేపీ సంపూర్ణంగా బలంగా ఉంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కొంత మేరకే ప్రభావం చూపుతాం. మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ మొదలైన మిగతా జిల్లాల్లోనూ బలం పెరిగింది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడుతుంది. 1947 నుంచి ఇప్పటివరకు తెలుగునాట బీసీ సీఎం లేరు. జనాభాలో 52 శాతం ఉన్నా పరిపాలన అందని ద్రాక్షే. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే.. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. దేశంలో బీసీలకు అవకాశాలు కల్పించిందే బీజేపీ. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. నేడో రేపో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
ఈటల కన్నా పెద్ద మనిషి కాసాని
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన అనుయాయులతో కలసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ వంటి నాయకుడు బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని అన్నారు. జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్లోకి రావాల్సిందని, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజు్ఞలైన ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని, ఎవరెవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. ముదిరాజ్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. పారీ్టలో ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని, ఈటలను మించిన నాయకులు ముదిరాజుల్లో ఉన్నారని అన్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులపెద్దలను కూర్చోబెట్టుకొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జ్ఞానేశ్వర్‌తోపాటు బీఆర్ఎస్లో చేరినవారిలో కాసాని వీరేశ్, బండారి వెంకటేశ్ ముదిరాజ్, ముప్పిడి గోపాల్, బియ్యని సురేశ్, ప్రకాశ్ ముదిరాజ్ తదితరులున్నారు. -
కేసీఆర్‌ది అహంకార, దుర్మార్గ పాలన
సాక్షి. హైదరాబాద్: సీఎం కేసీఆర్ అహంకార, దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. అలవి కాని హామీలతో కేసీఆర్ ప్రజలను మరోసారి బురి డీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఈ సారి బీఆర్ఎస్కి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజ లకిచ్చిన అనేక హామీలు అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్ట డానికి హుజూరాబాద్ ప్రజలకు అవకాశం వచ్చిందని, ఇప్పుడు గజ్వేల్ ప్రజలు కూడా సదవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్నారు. గజ్వేల్‌లో పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్న దుర్మార్గపు వ్యవస్థ నడుస్తోందని, మరోసారి అక్కడ గెలిస్తే 40, 50 ఏళ్లుగా పేదలు సాగుచేస్తున్న భూములను గుంజుకుని ప్రైవేట్ వారికి కట్టబెడతారన్నారు. ‘ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తే తొక్కిపడేస్తా అని మంత్రి హరీశ్‌రావు అంటున్నారట.. తొక్కిపడేసే శక్తి నీకు లేదు. నిన్ను తొక్కిపడేసేది గజ్వేల్ ప్రజలు’ అని ఈటల హెచ్చరించారు. మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఓరుగంటి కిట్టు, నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నేత రంజిత్‌యాదవ్, చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ చక్రధర్ తదితరులు బీజేపీలో చేరారు. ఈటల, ఇతర నేతలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీతోనే న్యాయం: శ్రీలతారెడ్డి ఈ సందర్భంగా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలు నెరవేరలేదని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. సంకినేని వెంకటేశ్వ రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి ఏమిటో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. -
కేసీఆర్‌పై పోటీ చేస్తా!
హుజూరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు.. అక్కడ కూడా పోటీ చేస్తానని (పరోక్షంగా సీఎం కేసీఆర్‌పై) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనను హుజూరాబాద్‌లో గెలిపించేందుకు కథానాయకులుగా మారి బీజేపీ శ్రేణులు పనిచేయాలని కోరారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఆరు ఫీట్ల హైట్ లేకపోవచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చుగానీ ప్రజల బాధలు తీర్చేవాడిని..’అని ఈటల అన్నారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడుచేసిన దుర్మార్గపు పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి అని ఆరోపించారు. ‘హుజూరాబాద్‌లో హోదా ఉన్నవాడితో కొట్లాడతాంగానీ సైకోతో ఏం కొట్లాడుతాం.. పొలిటికల్ లీడర్ పొలిటికల్‌గా కొట్లాడాలి..’అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుందని, మొన్నటితో వారి పీడ విరగడైందని పేర్కొన్నారు. ‘కొట్టడం చేతకాక కాదు.. కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగాను. కొట్లాట నా సంస్కృతి కాదు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ ను. గూండాను కాదు. రౌడీని కాదు’అని అన్నారు. కొంతమంది చిల్లరగాళ్లు తను కేసీఆర్ కోవర్టు అని ఇంకా మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. కేసీఆర్ వల్ల నరకం అంటే ఏమిటో సంపూర్ణంగా అనుభవించిన వాడినని తెలిపారు. తన శక్తిని మొత్తం బీఆర్ఎస్ ఓటమికి వినియోగిస్తానన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా బెదిరిస్తే చమడాలు తీస్తాం.. జాగ్రత్త.. అని చెప్పాలంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అధికారులు పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన వాళ్ల మీద చెయ్యి పడినా అంతు చూసేవరకూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాదన్నారు. ఈనెల 16న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుజూరాబాద్‌కు రాబోతున్నారని, సభను గొప్పగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
రాజకీయాలను దిగజార్చిన కేసీఆర్
చుంచుపల్లి: ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లా డారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభా లకు గురిచేసి తమ వైపు తిప్పుకునే సంస్కృతి బీఆర్ఎస్లో కొనసాగుతోందని, ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘ఎవడిపాలైందిరో తెలంగాణ’ అనే పాటతో రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన సోమన్న.. గతంలో ఈ ప్రభుత్వంతో కొట్లాడారని, అలాంటి వ్యక్తి నేడు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడని, నాయకులను, ప్రజాగాయకుల ను ఎలా లొంగదీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని ఈటల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి 17 పేపర్లు లీక్ అయ్యాయని, ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయని, అవి కూడా అత్యంత కీలకమైన శాఖలని గుర్తుచే శారు. కాగా, బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్ని కల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దరఖాస్తుల పరిశీ లన జరుగుతోందని ఆయన చెప్పారు. -
ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రూప్–1 వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రూప్–1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్య క్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమె త్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపా లన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహ రిస్తుందనుకుంటే.. మళ్లీ అదే అస మర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసు కెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయ డం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధి కారంలో ఉండే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి: అరుణ డిమాండ్ టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, చైర్మ న్ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీ నామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. గ్రూప్ –1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందజేయాలన్నారు. కేసీ ఆర్ సర్కార్‌కు మద్యం నోటిఫి కేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్ పై లేదని విమర్శించారు. ప్రభుత్వానికి సిగ్గుండాలి: ఈటల ధ్వజం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటిదని, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే, తాను ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. రైతాంగానికి నిరంతర విద్యుత్ ఇస్తున్నట్టు అబిడ్స్ చౌరస్తాలో, సచివాలయంలో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ది అబద్ధాల ప్రభుత్వమనీ, చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం లేదని మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల రైతన్నలు అప్పులపాలయ్యారనీ, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల బకాయిలు ఎగ్గొట్టే వారనే ముద్ర తెలంగాణ రైతుల పైన పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోంగార్డులకు సీఎం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు, కొత్త కేటాయింపు అంశాల్లో సంబంధిత పీఆర్ మంత్రికే ప్రమేయం లేకుండా పోయిందని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపుతాం 40 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వారిని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ తొలిమేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130 వ జయంతి సందర్భంగా జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కృష్ణస్వామి హైదరాబాద్ ప్లాన్ ఇచ్చిన మేధావి, రచయిత, కవి అని కొనియాడారు. ప్రొఫెసర్ గాలి వినోద్, బండ ప్రకాశ్ ముదిరాజ్, కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
విపక్షాలను సర్కార్ వేధిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ‘విపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీనిని ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. మమ్మల్ని అవమానించడం అంటే మా ప్రజలను అవమానించడమే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మా హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది’అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సూచించారు. పొలాలు కోతకు గురయ్యాయని, ఇసుక మేటలు వేశాయని, పొలాలను బాగు చేసుకోవడానికి గతంలో సీఎం చేసిన ప్రకటన మేరకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతులకు సహాయం చేయాలని ఈటల అన్నారు. పంట రుణమాఫీలో జాప్యంతో రైతులపై రూ.10 వేల కోట్ల వడ్డీల భారం పడిందని, ఎప్పటిలోగా రుణాలు మాఫీ చేస్తారో తెలపాలని కోరారు. రైతు కూలీలకూ రైతుబీమా పథకం వర్తింపజేయాలని ఆయన సూచించారు. సర్కారీ బడులు మూత.. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్సిటీల్లో కోర్సుల ఫీజులను భారీగా పెంచారని, వాటిని తక్షణమే తగ్గించాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కలి్పంచాలని, గెస్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని అన్నారు. భూముల విక్రయాలు వద్దు.. ప్రభుత్వ భూముల విక్రయాలపై పునరాలోచన చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదలనుంచి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులకు కూడా దళితబంధు ఇస్తామనడం సరికాదని, పేదవారికి మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సొంత జాగాలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం అందజేయాలని సూచించారు.