Rajya Sabha member
-
విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన.న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్జీఏ 29వ సెషన్లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది. -
కోర్టులో ఎంపీ కన్నీరు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్‌కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు. ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్‌ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్‌కు బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
ఏర్పేడులో ఆర్. కృష్ణయ్యపై రాయితో దాడి
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
రాజ్యసభ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. దీనిని రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో తాజాగా సవాలు చేశారు. తన సస్పెన్షన్ రాజ్యసభలోని విధివిధానాలు, ప్రవర్తనా నియమాలతో పాటు రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్లో రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ చైర్మన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తన సస్పెన్షన్ కారణంగా ఆర్థిక స్టాండింగ్ కమిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలకు తాను హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు. కాగా నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆగస్టు 11న పరాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే తమ పేర్లను చేర్చారంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు నలుగురు ఎంపీలు ఫఙర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవ్ చద్ద సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాఘవ్ చద్దాను సస్పెండ్ చేశారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. -
ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్
ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీని పీటీ ఉష కలిశారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోను ప్రధాని ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. పార్లమెంట్లో పీటీ ఉషను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. Glad to have met PT Usha Ji in Parliament. @PTUshaOfficial pic.twitter.com/maRxU3cfYb — Narendra Modi (@narendramodi) July 20, 2022 కాగా, దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులను భారతీయ జనతా పార్టీ ఇటీవలే పెద్దల సభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. పీటీ ఉష (కేరళ)తో పాటు తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ రాష్ట్రపతి కోటాలో ఎగువసభకు నామినేట్ చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత క్రీడా విభాగం నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి పీటీ ఉషనే కావడం విశేషం. చదవండి: పెద్దల సభకు పరుగుల రాణి -
బీజేపీతోనే బడుగుల అభ్యున్నతి: రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
గన్‌ఫౌండ్రి(హైదరాబాద్): బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త సైతం అత్యున్నత పదవిని అందుకోవడం బీజేపీలోనే జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై శనివారం హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. యూపీలోని బుల్డోజర్ తరహా పాలన తెలంగాణలోనూ వస్తుందన్నారు. బీజేపీకి కులం, మత భేదాల్లేవని.. పేదరికమే ప్రాథమికం గా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో సగం జనాభా ముస్లింలేనని, అక్కడ వారికి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో పాత, కొత్త కలయికల వైరం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఈటల రాజేందర్, స్వామిగౌడ్, వివేక్‌వెంకటస్వామి వంటి వారు బీజేపీలో చేరారని వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం ... లక్ష్మణ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా, సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్ స్వాగతం పలికారు. శంషాబాద్, ఆరాంఘర్ చౌరస్తా, మెహదీపట్నం మీదుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రయాణించిన లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఎస్సీసెల్ ప్రొటోకాల్ కో–కన్వీనర్ కె. ప్రశాంత్, హైదరాబాద్ నాయకులు సూర్యప్రకాశ్, సందీప్‌యాదవ్ తదితరులున్నారు. -
ప్రచారంలో గుండెపోటు.. ఎంపీ కన్నుమూత
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గుండెపోటుకు గురైన రాజ్యసభ సభ్యుడు ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. ఆయనే తమిళనాడుకు చెందిన మహ్మద్ జాన్ (72). ఆయన అన్నాడీఎంకే తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల వేళ అన్నాడీఎంకే విషాదంలో మునిగింది. అతడి మృతికి అన్నాడీఎంకే, డీఎంకే, ఏఎంకే ఇతర పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. రాణిపేటలోని మాస్క్యూ వీధిలో ఉన్న తన నివాసంలో జాన్ మంగళవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. మహ్మద్ జాన్ 2011లో రాణిపేట ఎమ్మెల్యేగా గెలిచి జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతితో రాణిపేట నియోజకవర్గం విషాదంలో మునిగింది. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు జాన్ మద్దతు ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో రాణిపేట నియోజకవర్గంలో ఓ మతానికి చెందిన వారు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. అతడి మృతికి డీఎంకే అధినేత స్టాలిన్ సంతాపం ప్రకటించారు. -
చంద్రబాబు అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తా..
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంపై(టీటీడీ) ఎల్లో మీడియాలో వస్తున్న అసత్య కధనాలపై విసుగు చెందానని, త్వరలో చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మండి పడ్డారు. పవిత్రమైన వెంకన్న సన్నిధిపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ విషయంపై తన సహచరుడు సత్యపాల్ సభర్వాల్‌తో కలిసి త్వరలో తిరుపతి పట్టణ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. -
రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
-
జానారెడ్డి ఓటమి ఖాయం
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డిని ఓటమి ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం హాలియాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దొంగలు మళ్లీ చంద్రబాబును తీసుకొని తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు వచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందకుపైగా కేసులు వేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను మనకు రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకుతో దోస్తీకట్టి మరోమారు మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో మొట్ట మొదటగా ఓడిపోయేది జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్రెడ్డేనన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలి పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి గుర్రంపోడు : బూత్ కమిటీలు ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించి విజయమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండలకేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలను గడపగడపకు ప్రచారం చేసేలా ప్రతి కార్యకర్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పదవులు అçనుభవించిన జానారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఆప్కాబ్ చైర్మెన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి
సీఎంకు దేవేందర్‌గౌడ్ లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాలని రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొత్త జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశం కావడానికి సరైన వసతుల్లేవ న్నారు. పన్నుల ద్వారా సమకూరే ప్రజల సొమ్ము వారికే చెందాలని, ప్రజాదనం ప్రజల అవసరాలకే వినియోగించాలని కోరారు. అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలను పెంచి, ఉద్యోగులను భర్తీ చేయాలని దేవేందర్‌గౌడ్ కోరారు. -
‘మహాభియోగం’ తిరస్కరణ
నిజం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు - జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు ఉపసంహరించుకుంటున్నాం - రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సభ్యుల లిఖితపూర్వక నివేదన - దీంతో నోటీసును తిరస్కరించిన చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ‘నిర్దోషిత్వం’ నిరూపణైంది. ఆయనపై 61 మంది రాజ్యసభ్య సభ్యులు మోపిన ‘మహాభియోగ’ నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ అవాస్తవాలు, అభూత కల్పనలు, తప్పుడు డాక్యుమెంట్లతో తమను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న పలువురు రాజ్యసభ్య సభ్యులు నాగార్జునరెడ్డిపై తామిచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లిఖితపూర్వకంగా నివేదించారు. దీంతో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జస్టిస్ నాగార్జునరెడ్డికి సంబంధించిన అభిశంసన దస్త్రాన్ని మూసివేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అభిశంసన నోటీసు ఉపసంహరణ నేపథ్యంలో సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని జస్టిస్ నాగార్జునరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అత్యంత వివాదాస్పదుడిగా పేరుపడి సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి అవాస్తవాలు, తాను సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లతో పలువురు రాజ్యసభ సభ్యులను కలిశారు. రామకృష్ణ చెప్పిన వివరాలు, సమర్పించిన డాక్యుమెంట్లను మాత్రమే పరిశీలించిన రాజ్యసభ సభ్యులు నాణేనికి మరోవైపు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు తయారైంది. దీనిపై 61 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి చర్చ నిమిత్తం దానిని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చారు. ఈ నోటీసు గురించి తెలుసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి తన నిర్దోషిత్వం నిరూపణ అయ్యేంతవరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశారు. నిజాయితీ, ముక్కుసూటితనానికి జస్టిస్ నాగార్జునరెడ్డి మారుపేరంటూ న్యాయవాదులు ఆయనకు బాసటగా నిలిచారు. అసలు వాస్తవాలను వివరిస్తూ వారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యులకు వినతిపత్రాలు పంపారు. రామకృష్ణ చెప్పినవన్నీ కట్టుకథలనీ, ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడువని రుజువు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ జత చేసి పంపారు. ఏకంగా 1,050 మందికి పైగా న్యాయవాదులు ఆ వినతిపత్రంపై సంతకాలు చేశారు. దీంతో అభిశంసన నోటీసుపై సంతకాలు చేసిన రాజ్యసభ సభ్యులకు రామకృష్ణ నైజం బోధపడింది. ఈ నేపథ్యంలో వారు అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రామకృష్ణ క్రమశిక్షణారాహిత్యం, అతనిపై ఉన్న కేసులు, అప్పులు ఎగవేసిన చరిత్ర, న్యాయమూర్తులపై నిరాధారణ ఆరోపణలు చేయడం, తదితర విషయాలన్నీ ఆధారాలతో సహా అర్థం చేసుకున్నారు. దీంతో సంతకాలు చేసిన వారిలో పలువురు రాజ్యసభ సభ్యులు జస్టిస్ నాగార్జునరెడ్డిపై ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారు లిఖితపూర్వకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తెలియచేశారు. దీంతో అభిశంసన నోటీసును తిరస్కరిస్తూ, అందుకు సంబంధించిన దస్త్రాన్ని మూసివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. -
ఐఐటీల్లో సీట్ల సంఖ్య లక్షకు పెంపు
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో సీట్ల సంఖ్యను 2020 నాటికి ఒక లక్ష వరకూ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఐఐటీల్లోనూ కలిపి 82,604 సీట్లున్నాయని తెలిపారు. ఐఐటీల్లో విద్యా ప్రమాణాలు నానాటికి తగ్గి పోతుండటంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ... విద్యావసరాలకు తగినట్లుగా ప్రతిభ గల అధ్యాపకులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. వీరి ఎంపికకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. ఉత్తమ ప్రతిభగల అధ్యాపకులను ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడాది పొడవునా ప్రకటనలు ఇస్తున్నామని, అలాగే ప్రతిభ ఉన్న వారిని ఐఐటీలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
చిన్న పారిశ్రామికవేత్తలకూ వన్‌టైం సెటిల్మెంట్
దేశంలోని అన్ని పెద్ద, చిన్న తరహా పారిశ్రామిక సంస్థలకు కూడా వన్ టైం సెటిల్మెంట్ పాలసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అమలులో ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు లిఖిత రూపంలో ఆయన సమాధానం ఇచ్చారు. అప్పులలో కూరుకుపోయిన, నిర్వాసితులైన రైతులు, నిరుద్యోగ విద్యార్థుల విషయంలోను, పెద్దపెద్ద వ్యాపారుల విషయంలోను వ్యవహరించేటపుడు స్టేట్ బ్యాంకుకు వేర్వేరు విధానాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని, పైగా అప్పులలో కూరుకుపోయిన, నిర్వాసితులైన రైతులు, నిరుద్యోగ విద్యార్థుల విషయంలో మరింత సానుభూతితో వ్యవహరించాలన్నది స్టేట్‌బ్యాంకు బోర్డు అనుమతించిన విధానమని మంత్రి చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు, ఇతర ప్రజలు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజల విషయంలో స్టేట్ బ్యాంకు చాలా కఠినమైన విధానం అవలంబిస్తోందని మంత్రి దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకొచ్చారు. దానికి.. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైతులు, ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజల పట్ల స్టేట్ బ్యాంకు కఠినమైన విధానాలు అవలంబించడం లేదని మంత్రి అన్నారు. అన్నిచోట్లా విధానం ఒకేలా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష ఉండబోదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో రైతులు, విద్యార్థుల పట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న కఠిన విధానాలపై సమీక్షకు తీసుకుంటున్న చర్యలేంటని కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు మరియు విద్యార్థులకు ఆర్థికసాయం / వన్ టైం సెటిల్మెంట్లకు సంబంధించి విధానం ఒకేలా ఉందని, ఈ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా జరుగుతుంటాయని ఆయన అన్నారు. -
రాజధానంటే కేవలం వ్యాపార కేంద్రమే కాదు
-
రాజధానంటే కేవలం వ్యాపార కేంద్రమే కాదు
- రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి - బెంగళూరులో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు సాక్షి, బెంగళూరు : రాజధాని అంటే వ్యాపార కేంద్రాన్ని నిర్మించడమే కాదని.. సకల వసతులతో ప్రజల జీవనానికి అనుకూలమైన నగరాన్ని నిర్మించడమని రాజ్యసభ సభ్యు డు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారమిక్కడ డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలుజరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ‘వ్యవసాయం దండగ కాదు పండగ’ అని రుజువు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, డ్వాక్రా మిహ ళలకు పావలా వడ్డీకే రుణాలు తదితర పథకాల ఫలాలను అన్ని వర్గాలకూ అందించారని కొనియాడారు. కాగా, రాజధాని అమరావతిని ప్రజల జీవనానికి అనుకూలంగా నిర్మించినపుడే అది మంచి నగరమవుతుందన్నారు. లేదంటే ‘ఘోస్ట్సిటీ’గా మారుతుందన్నారు. అనంతరం ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి, వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం
♦ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక ♦ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో.. ♦ ఢిల్లీకి తరలివెళ్లిన అనుచరులు, అభిమానులు ♦ వచ్చే నెల 7న జిల్లాకు రాక సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ధర్మపురి శ్రీనివాస్ మం గళవారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం విధితమే. గత నెల 24 రాజ్యసభకు నోటిఫికేషన్ వెలువడగా.. 26న డీఎస్‌ను టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఈ వ్యవహరంలో నిజామాబాద్ ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారు. అనంతరం డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. రైళ్లల్లో ఒక రోజు ముందుగానే వెళ్లారు. సీనియర్ నేతగా అనుభవం రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మపురి శ్రీనివాస్‌కు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సుధీర్ఘ అనుభవజ్ఞుడిగా అనేక పదవులు చేపట్టిన నాయకుడిగా డీఎస్ పేర్కొందారు. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారిగా కాలుమోపనున్నారు. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్న ఎంపీ కవిత సూచన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ అంశాలు కూడా డీఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ డీఎస్ చేరిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించిన కేసీఆర్ అనంతకం ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో సీనియర్ రాజకీయ వేత్త, బీసీ వర్గాల నేతగా డీఎస్‌కు తగిన ప్రాధాన్యం కల్పించారన్న చర్చ సాగుతోంది. వచ్చే నెల 7న డీఎస్ రాక రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చే నెల 7న మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు సన్నాహాలు ప్రారంభించా రు. ఇందుకు సంబంధించి అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి నగరంలోని డీఎస్ ఇంటి వరకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!
► అధికార పార్టీ అభ్యర్థిగా ఖరారు ► చక్రం తిప్పిన ఎంపీ కల్వకుంట్ల కవిత ► బీసీ నేతగా ప్రతిపాదన ఓకే అన్న సీఎం కేసీఆర్ ► నేడో, రేపో అధికారిక ప్రకటన నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతకు రాజ్యసభలో అవకాశం కల్పించేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రయత్నం ఫలించింది. రెండు రాజ్యసభ స్థానాల కోసం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రయత్నం చేసిన క్రమంలో జిల్లాకు చెందిన డీఎస్‌కు అవకాశం రావడం కోసం ఎంపీ కవిత చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందన్న ఆమె ఆలోచనను పార్టీ అధిష్టానం బలపరిచింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ పేరు రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. 24న నోటిఫికేషన్ రాజ్యసభ ఎన్నికల కోసం ఈ నెల 24న నోటిఫికేషన్ వెలువడనుండగా.. అంతకంటే ముందగానే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. రోజులు గడిచిన కొద్దీ ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను తేల్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ కవిత రెండు రోజులుగా జిల్లాకు చెందిన డీఎస్ పేరును సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడ ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్యులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమాలోచనల మీదట డీఎస్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడ ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో ఆయనకు అన్నమాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆ పదవీకాలం ఇంకా మూడు నెలలు ఉండగానే రాజ్యసభకు డీఎస్ పేరును ఖరారు చేయడం చర్చనీయాంశం అవుతోంది. అంచెలంచెలుగా.. 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన డీఎస్.. 32 ఏళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1982 వరకు వేల్పూరు సహకార బ్యాంకులో అధికారిగా పనిచేసిన డీఎస్ అదే సంవత్సరం రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేశారు. 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా బరిలోకి దిగిన ఆయన మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట, కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న డీఎస్ 1989, 1994లో ఓటమి చెందినా... 1999, 2004లలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2015 మార్చి వరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి అవకాశం కల్పించకపోవడంతో చివరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం కేసీఆర్.. అదే ప్రకారం డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యునిగా అవకాశం దక్కనుండటం అరుదైన అవకాశంగా పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు ఎంపీగా అవకాశం దక్కనుండగా.. నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందన్న వార్త పట్ల డీఎస్ శిబిరంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. -
నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన ఎంపీ
న్యూఢిల్లీ: జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) రాజ్యసభ సభ్యుడు అనిల్ సహానీ(53) సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. పార్లమెంటుకు సమర్పించిన ట్రావెల్ అలవెన్స్ లో నకిలీ విమాన టికెట్ బిల్లులు సమర్పించిన కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ ఉత్తర్వులను జారీ చేశారు. సహానీ రెండో సారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనపై చర్యలకు జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వెనకాడుతున్నట్టు సమాచారం. నకిలీ ఎయిర్ ఈ- టికెట్లు, బోర్డింగ్ పాసులు మొత్తం కలిపి రూ.23 లక్షల బిల్లులను ఆయన పార్లమెంటుకు సమర్పించారు. ఆయన ఎక్కడికీ ప్రయాణం చేయకుండానే ఈ బిల్లులను సమర్పించారని ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ స్కామ్ లో ఢిల్లీ ఎయిర్ ఇండియా అధికారి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతీ పార్లమెంటు సభ్యునికి దేశంలో ప్రయాణించడానికి 34 విమాన టికెట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తనను అక్రమంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తోందని సహానీ మండిపడ్డారు. -
రాష్ట్రానికి ప్రత్యేక నిధులివ్వండి
రాజ్యసభలో ఎంపీ సీతారామలక్ష్మి ఏలూరు, భీమవరం : రాష్ట్రంలోని పలు సమస్యలపై రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గురువారం చర్చించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబుపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా ఉందన్నారు. రైతుల సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో వారికి అండగా నిలిచేందుకు చంద్రబాబు రుణమాఫీని అమలు చేసి వారిని ఆదుకున్నారన్నారు. అయితే రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక రైల్వేజోన్, రాజధాని ఏర్పాటు, కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రం గురించి అన్ని విధాలుగా తెలిసిన కేంద్రమంత్రులు ఎం.వె ంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయ నిధుల విడుదల చేయడానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. -
వీహెచ్‌పై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు (విహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సదస్సులో పార్టీ కార్యకర్తలతో మాట్లాడించాలంటూ వేదికపై హన్మంతరావు పట్టుబట్టారు. ఆ విషయం తర్వాత చూద్దామంటూ పలువురు నేతలు వీహెచ్‌ను బుజ్జగించారు. దాంతో ఆగ్రహించిన వీహెచ్ కార్యకర్తలతో మాట్లాడించనప్పుడు ఈ సదస్సు ఎందుకంటూ ఆ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దిగ్విజయ్ సింగ్‌ను నిలదీశారు. దాంతో ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేయొద్దంటూ వీహెచ్‌కు దిగ్విజయ్ సింగ్ సూచించారు. కార్యకర్తలతో మాట్లాడించాల్సిందే అంటూ వీహెచ్ పట్టుపట్టారు. దాంతో వీహెచ్ వ్యవహారంపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత కే.జానారెడ్డి జోక్యం చేసుకుని వీహెచ్‌ను పక్కకు తీసుకువెళ్లి బుజ్జగించారు. దాంతో ఆ సమస్య సద్దుమణిగి... సమావేశం ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్ నేతల నుంచి ఆ సదస్సుకు అంతంతమాత్రంగానే హజరైయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నంలో సదస్సును ఏర్పాటు చేసింది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తోపాటు పార్టీ పెద్దలు పలువురు హాజరయ్యారు. ఈ సదస్సు సోమవారం ముగియనుంది. -
'రాజ్యసభకు లేదా గవర్నర్‌గా వెళ్లాలనుకున్నా'
హైదరాబాద్: రాజ్యసభ లేదా ఓ రాష్ట్రానికి గవర్నర్ వెళ్లాలని తాను అనుకున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ తమ పార్టీ నాయకులంతా కేబినెట్లో ఉండాలని కోరారు... అందుకే ఆర్థిక మంత్రిగా బాధ్యతుల స్వీకరించానని చెప్పారు. అయితే తన మొదటి ఆప్షన్ మాత్రం రాజ్యసభే అని యనమల స్ఫష్టం చేశారు.శనివారం హైదరాబాద్‌లో యనమల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్లానింగ్ కమిషన్‌కు బదులు అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను పునరుద్దరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులు భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. గిరిజన జిల్లా ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని యనమల తెలిపారు. -
'మీసంలేని' నేస్తమా నీకు ...
'మీసంలేని' నేస్తమా నీకు రోషమెక్కువా కానీ మనసు మక్కువ అంటూ పాత స్నేహితుడి కోసం తాజాగా కొత్త పల్లవిని అందుకున్నాడు మరో పాత స్నేహితుడు. ఇంతకీ ఆ పాత స్నేహితులు ఎవరు ఏమా కథా అనుకుంటున్నారా ?... అయితే ఆ పాత ప్రాణ స్నేహితుల కథలోకి వద్దాం. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌లు మాంచీ జిగ్రీ దోస్తులు అన్న విషయం తెలిసిందే. ఆ దోస్తుల మధ్య కాలమో లేక ఖర్మమో కానీ వారి మధ్య మనస్పర్థలు ఉరుముల్లేని మెరుపుల్లా వచ్చి పడ్డాయి. దాంతో 2010లో పార్టీ నుంచి అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అమర్ సింగ్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. దాంతో గత నాలుగేళ్లుగా ఆ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ మంగళవారం యూపీ రాజధాని లక్నోలో ఆసియాలో అతి పెద్దదైన జ్ఞనేశ్వర్ మిశ్రా పార్క్‌ను ప్రారంభ కార్యక్రమం మళ్లీ వారని కలపింది. ఆ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోపాటు ఆయన తండ్రి ములాయం సింగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి హాజరైన అమర్ సింగ్ సందర్భంగా ఆ తండ్రి కొడుకులను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. తాను సమాజ్ వాదీని కాదని ములాయం వాదీనంటూ భజనలు చేశాడు. దాంతో అమర్ సింగ్ మళ్లీ ములాయం స్నేహాన్ని కోరుకుంటున్నాడని అందరికి అర్థమైంది. ఇంతకీ ములాయం సింగ్ యాదవ్ స్నేహాన్ని ఎందుకు అమర్ కోరుకుంటున్నాడు.... పార్టీలో అసమ్మతి జ్వాలలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్... అమర్ సింగ్లోపాటు ఆ పార్టీ తరఫున 2009లో రాంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సినీ నటి జయప్రదలను సస్పెండ్ చేశారు. దాంతో నీ పార్టీకి పోటీగా పార్టీ పెడతానంటూ మంగయ్య శపథం చేశారు అమర్ సింగ్. శపథం చేసినట్లే 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ అనే పార్టీని ఆయన స్థాపించాడు. ఆ తర్వాత సంవత్సరమే అంటే 2012లో యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అమర్ సింగ్ పార్టీ 360 స్థానాల్లో పోటీ చేసింది. అయినా ఒక్క ఎమ్మెల్యే స్థానాన్నికూడా గెలుచుకోలే బొక్కబోర్లా పడిపోయింది. దాంతో అమర్ సింగ్ కొత్త పార్టీని చాపచుట్టినట్లు చుట్టేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ములాయం సింగ్ పార్టీ ఎస్పీ విజయఢంకా మోగించింది. దాంతో అమర్ సింగ్ చేసేది లేక అజీత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయలోక్ దళ్ చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఫతేపూర్ సీక్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఘోర పరాజయం పాలైయ్యారు. మరోవైపు అమర్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది చివర మూడు నెలల్లో ముగిసిపోనుంది. దాంతో ప్రజల ఓట్లు తనకు అచ్చిరావని సదరు నేతగారికి అర్థమైంది. అందుకే మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన పాత మిత్రుడ్ని కాకా పడుతున్నారు. ఎందుకంటే యూపీ అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీకి సగానికి పైగా సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో ములాయం స్నేహంతో మరోసారి రాజ్యసభకు ఎగిరిపోవాలని అమర్ సింగ్ తాపత్రయపడుతున్నారు. -
అన్ని రాష్ట్రాలూ సమానమే
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారామన్ శనివారం శాసన సభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నుంచి ధృవపత్రం అందుకున్నారు. సీతారామన్ భర్త, ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహదారుగా నియమితులైన పరకాల ప్రభాకర్, ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, యడ్లపాటి రఘునాధబాబు, ప్రేమేందర్‌రెడ్డి, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్ ఆమె వెంట ఉన్నారు.