Ram Temple
-
బీహార్‌లో అయోధ్యను మించిన రామాలయం
అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది.బీహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్‌ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. -
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
‘అడవి రాముడి’కి నవ వసంతం
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్పీఎఫ్ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్‌కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. -
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
ఆధ్యాత్మిక శోభ.. అజ‘రామ’రం
ఏకశిలపై వెలసిన ఆధ్యాత్మిక నగరి.. అందాల పురి.. ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త కళతో మిలమిలా మెరిసిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్టకు అధికారిక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధిని అటకెక్కించింది. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇది అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. సుమనోహర మాడవీధులు, సుందర ఉద్యానవనాలతో అజరామర కోవెలై విరాజిల్లుతోంది. – సాక్షి, రాయచోటి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు 2019 తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా శాశ్వత కల్యాణ మండపంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మాణం, భక్తులకు విశ్రాంతి గదులు, వీవీఐపీల అతిథి గృహాలు, కొండపై పార్వేట మండపం, పుష్కరిణి, ఆలయ సమీపంలో రామసేతు కోనేరు ఆధునికీకరణ, రామాలయం చుట్టూ మాడవీధుల నిర్మాణాలు జరిగాయి. పచ్చదనంతో కూడిన ఉద్యాన వనాలతో కోవెల కొత్త అందాలు సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేకమైన బండరాయితో చప్టా ఏర్పాటైంది. గుడి వెలుపల మండపం నిర్మితమైంది. నూతన రథం సమకూరింది. ఆలయం చుట్టూ ఆక్రమణలు తొలగించారు. కొత్త రోడ్ల నిర్మాణాలతో ఏకశిలానగరం ముగ్ధమనోహరమై ఆకర్షిస్తోంది. క్షేత్రంలో జాంబవంతుడు, పోతన, హనుమంతుని విగ్రహాల ఏర్పాటుకూ వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సోమశిల నుంచి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించేలా చేపట్టిన పనులూ పూర్తయ్యాయి. పౌర్ణమి వెలుగులో స్వామి కల్యాణం ఒంటిమిట్టలో ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కోదండ రాముని కల్యాణ ఘట్టం పౌర్ణమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా నిర్వహించడం ఆనవాయితీ. గతంలో కల్యాణ వేదిక అందుబాటులోలేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 60 ఎకరాల విస్త్రీర్ణంలో కల్యాణ వేదికకు స్థలాన్ని కేటాయించడంతోపాటు అందులో శాశ్వత మండప నిర్మాణాలు పూర్తి చేయడంతో ఏటా స్వామి కల్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ ఆ«ధ్వర్యంలో మధ్యాహ్న సమయంలో భక్తులకు నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రెండో శనివారం తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ విక్రయిస్తున్నారు. టీడీపీ హయాంలో అంతంత మాత్రమే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2015 సెపె్టంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. తర్వాత కాలంలోనూ అభివృద్ధి పనులు అంత వేగంగా జరగలేదు. పైగా 2018లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వామి కల్యాణం రోజున ప్రకృతి విపత్తుతో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయి. కల్యాణం రోజు ఇంతటి అపశృతి చరిత్రలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. 2014 నుంచి స్వామికి కల్యాణం రోజున పట్టు వ్రస్తాలు సమర్పించేందుకు స్వయంగా సీఎం హోదాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా అభివృద్ధి దిశగా అంత ఆలోచనచేయలేదని విమర్శిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా టీటీడీ అధికారుల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి భక్తులకు అన్ని వసతులూ కల్పించింది. అభివృద్ధితో కళకళ చిన్నతనం నుంచి చూస్తున్న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం గత నాలుగేళ్లలో నమ్మలేనంతగా మారిపోయింది. ఆలయాన్ని చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసింది. గుడి కళకళలాడుతోంది. భక్తులకు సకల వసతులూ సమకూరాయి. – శ్రీనివాసులు, ఒంటిమిట్ట రామయ్యకు రాజయోగం నేను కొన్నేళ్లు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చైర్మన్‌గా పనిచేశాను. ఇతిహాసాల్లోనూ ఒంటిమిట్ట రామయ్యకు చరిత్ర ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో రామయ్యకు రాజయోగం పట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. – ముమ్మడి నారాయణరెడ్డి, పెన్నపేరూరు, ఒంటిమిట్ట మండలం అద్భుత క్షేత్రమైంది ఈ రామాలయం టీటీడీ ఆధ్వర్యంలో అద్భుత క్షేత్రంగా ఆవిష్కృతమైంది. భక్తులకు కావాల్సిన విడిది గృహం సమకూరింది. స్వామి శాశ్వత కల్యాణ వేదిక నిర్మితమైంది. పచ్చని నందన వనాలు కనువిందు చేస్తున్నాయి. వీవీఐపీ బిల్డింగ్, అన్నప్రసాద కేంద్రం, నూతనంగా నిర్మించిన పార్వేటి మండపంతో ఆలయం అభివృద్ధి బాటపట్టింది. పుష్కరిణి, రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలవ రాతి బండలు, రామతీర్థం భక్తులను ఆకట్టు్టకుంటున్నాయి. – నటేష్ బాబు, డిప్యూటీ ఈఓ, ఒంటిమిట్ట -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
డల్లాస్ లో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
అయోధ్యకు పోటెత్తిన భక్తులు
-
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్‌కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ రియాక్షన్
-
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్‌ఫ్రంట్‌ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్‌కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని, సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు. కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు. ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్‌చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రామ్ లల్లా దర్శనం: సోనూ నిగమ్ భావోద్వేగం, బీ-టౌన్ సెల్ఫీ వైరల్
#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది. రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92 — Actual India (@ActualIndia) January 22, 2024 అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy — ANI (@ANI) January 22, 2024 #WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm — ANI (@ANI) January 22, 2024 కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్‌ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.. ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ్‌లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్డేట్స్ -
Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట?
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్ స్నానం, విష్ణుపూజ, గోదాన్, రామ్ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం! ప్రాణ ప్రతిష్ట అంటే.. ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్‌లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎలా జరుగుతుందంటే.. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్‌ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే..
ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. #WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g — ANI (@ANI) January 22, 2024 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. దర్శన వేళలు ఇవే అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే.. వీడియో వైరల్
భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టానికి సమయం అసన్నమైంది. అయోధ్య నగరంలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు మరి కాసేపట్లో తెరలేవనుంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రముఖులు ఆయోద్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య పురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR — Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024 వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ ,రవీంద్ర జడేజా కూడా అయోధ్య పుర వీధుల్లో కన్పించాడు.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Virat Kohli reaches Ayodhya for Ram Mandir Pran Pratishtha 🛕#ViratKohli #RamMandir #Ayodhya #CricketTwitter pic.twitter.com/k132x5UNv9 — InsideSport (@InsideSportIND) January 22, 2024 -
ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్‌తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024