rastha roko
-
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్‌లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
ములుగు జాతీయ రహదారిపై సీతక్క రాస్తారోకో
-
భార్య, శిశువును హత్య : దళిత సంఘాల ఆందోళన
-
నిందితుడి ఇంటి ఎదుటే ఖననం
పాలకుర్తి: ఘట్కేసర్లో అత్యంత పాశవికంగా భార్య, శిశువును హత్య చేసిన నిందితుడు మాచర్ల రమేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో మృతురాలి బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట గొయ్యి తీసి ఘట్కేసర్లోని ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని ఖననం చేశారు. దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు మద్దతుగా దళిత సంఘాలు, సుమారు 500 మంది రాస్తారోకో చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. కుల వివక్షతోనే కర్కశంగా కాల్చి చంపారని, నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం వద్దే వద్దు!
తమ గ్రామం మద్యం దుకాణాన్ని తొలగించాలని యర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి చెందిన మహిళలు సోమవారం రాస్తారోకోనిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన చేశారు. ప్రకాశం ,యర్రగొండపాలెం: తమ గ్రామంలో బ్రాందీషాపు ఎత్తేయాలని మహిళలు జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు రాస్తారోకో చేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని గురిజేపల్లిలో సోమవారం జరిగింది. తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేయాలని మహిళలు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి పక్కనే ఇప్పటి వరకు గోలుసు దుకాణం నిర్వహించారు. మండలంలో మొత్తం ఆరు లైసెన్స్ షాపులు ఉండగా నాలుగు షాపులు పట్టణంలో, మానిగుడిపాడు, కొలుకులలో ఒక్కొక్కటి చొప్పున నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఒకషాపు మెయింటినెన్స్ ఖర్చులు కూడా రావడంలే దని కొన్ని నెలలుగా మూలేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గురిజేపల్లిలోని బెల్ట్‌షాపును పర్మినెంట్ షాపుగా మార్చారు. మద్యం కోసం సమీప గ్రామాలైన బోయలపల్లె, సర్వాయపాలెం, వాదంపల్లె గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం తాగుతున్నారు. జాతీయ రహదారిపై షాపు ఉండటంతో భారీ వాహనాలు సైతం మద్యం కోసం నిలుపుతారన్న ఆందోళన మహిళలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం దుకాణం తెరిచే ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మద్యం పుటుగా తాగి గ్రామంలో అల్లర్లు చేస్తున్నారని, ఇంట్లో మహిళలను కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామంలోని పలు గృహాల్లో గోడవలు ప్రారంభమయ్యాయి. ఒకరు మద్యం మత్తులో తన భార్యకు ఉరేసేందుకు విఫలయత్నం చేశాడు. మరొకరు భార్యను చితకబాదాడని మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు రోడ్డు ఎక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో అనేక వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవకుమార్ తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి షాపు ఎత్తేయిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు రాస్తారోకో విరమించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ సాయంత్రం పోలీసులు రక్షణగా మద్యం అమ్మకాలు జరిపించడం గమనార్హం. -
విద్యార్థులను దుర్భాషలాడిన బస్సు డ్రైవర్!
మెదక్‌రూరల్: ‘బస్ పాస్ పెట్టుకొని రోజూ తిరుగుతున్నారు.. అంటూ’ దుర్బాషలాడిన డ్రైవర్ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమంటూ విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మెదక్ మండలం అవుసులపల్లి వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీహరి, సౌమ్య, సిద్దు, జ్యోతి, నసీర్‌బేగం, వెన్నెల అనే డైట్ విద్యార్థులు సిద్దిపేట దగ్గరలోని డైట్ కళాశాలలో చదువుతున్నారు. ప్రతి రోజు పాస్ తీసుకొని కళాశాలకు ఆర్టీసీ బస్‌లో వెళ్లి వస్తుంటారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట నుంచి మెదక్‌కు వస్తున్న దుబ్బాక డిపోకు చెందిన బస్సులో గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో బస్ డ్రైవర్ విద్యార్థులనుద్ధేశించి నోటికొచ్చిన మాటలు తిడుతూ దర్భాషలాడినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. డ్రైవర్‌తో బస్‌లో వాగ్వివాదం పెట్టుకుంటే దాడికి పాల్పడుతాడేమో అనే భయంతో ముందుగానే తమ గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచాం అందించినట్లు తెలిపారు. అవుసులపల్లి వద్దకు చేరుకోగానే విద్యార్థులతో పాటు గ్రామస్తులు బస్సుకు అడ్డంగా నిలబడి రాస్తారోకో చేశారు. డ్రైవర్ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమని ఆందోళన చేశారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. మెదక్ డిపో మినహయిస్తే ఇతర డిపో బస్సులో ప్రయాణిస్తే ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. -
అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
గుంటూరు ఈస్ట్: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు, బారాఇమాంపంజా సెంటర్లో వారం రోజులుగా నీటి సమస్య, డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ నిరసనకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు, పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో బాలమురళీకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ర్యాలీగా పాత గుంటూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నినదించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు షేక్ చాంద్‌బాషా, షేక్ సమీవుల్లా, కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ, స్థానిక నాయకులు మహమ్మద్ షరీఫ్, ఫిరోజ్, హమీద్ మాట్లాడుతూ శనివారం కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోనే వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, కొంత మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధి మరించిందని ఆరోపించారు. ఈప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, అనారోగ్యబారిన పడి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
మృతదేహంతో..
ఇల్లెందు : తమ కుమారుడి ఆత్మహత్యకు కారకుడైన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ మృతదేహంతో కుటుంబీకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఇల్లెందులోని 17వ వార్డుకు చెందిన కొమ్ము వెంకటేష్(23) శనివారం సాయంత్రం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు గత 12 ఏళ్లుగా ఇల్లెందులోని ఇద్దరు వ్యాపారుల వద్ద షాపు గుమస్తాగా పనిచేస్తున్నాడు. అనివార్య కారణాలతో వారం రోజులపాటు షాపుకు వెళ్లలేదు. శనివారం వెళ్లాడు. అతనిని యజమానులు దూషించడంతో ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో కుటుంబీకులు నేరుగా జగదాంబ సెంటర్లో వెళ్లి అక్కడ రాస్తారోకోకు దిగారు. వీరికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు ఐతా సత్యం, పోట్ల నాగేశ్వరావు వివరాలు తెలుకున్నారు. ఆందోళన కారులను సీఐ సారంగపాణి శాంతింపచేశారు. -
అన్నదాతల ఆక్రోశం
అయిజ (అలంపూర్) : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. రైతులు తాము పండించిన పంటలను దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం, హాలియా నాఫెడ్ వారి ఆధ్వర్యంలో హాకా ద్వారా గిట్టుబాటు ధరకు కందులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 1న అయిజ మార్కెట్ సబ్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇక్కడ మద్దతు ధర రూ.5,250 కాగా బోనస్ రూ.200 కలిపి మొత్తం రూ.5,450కు కొ నుగోలు చేయాలి. ఈ మేరకు సబ్ యార్డుకు రైతులు ప్రతిరోజు సుమారు 300 నుంచి 500 క్విం టాళ్ల కందులు తెస్తుండగా 250 నుంచి 300 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 200 క్వింటాళ్ల కందులు మి గిలిపోతున్నాయి. సంచుల కొరత ఎక్కువగా ఉండడంతో కందుల కొనుగోళ్లు సైతం మందగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేయింభవళ్లు పడిగాపులు.. ఇదిలా ఉండగా హమాలీలకు హాకా నుంచి సుమారు రూ.90 వేలు కూలీలు చెల్లించాల్సి ఉంది. దీంతో హమాలీలు మార్కెట్ యార్డులో పనిచేసేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దాని వలన వేల క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డులో పోగవుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కందులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు రేయింభవళ్లు కందుల కుప్పల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఆగ్రహించిన రైతులు గురువారం ఏకంగా నగరపంచాయతీలోని పాతబస్టాండ్ చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుగంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అధికారులతో మాట్లాడుతామని, రోడ్డుపై నుంచి వెళ్లిపోవాలని రైతులను కోరారు. దానితో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. ఐదురోజుల నుంచి కాపలా.. ఆదివారం అయిజ మార్కెట్ యార్డుకు 40 సంచులు కందులు తెచ్చా. ఇంతవరకు కొనలేదు. రాత్రీపగలు కందుల వద్ద కాపలా ఉంటున్నాం. తిండి తినడానికి కూడా కష్టమైంది. రాత్రిపూట చలికి వణికిపోతున్నా. అధికారులను బతిమలాడినా కందులు కొనకపోవడంతో రోడ్డుమీదకు వచ్చాం. – రాముడు, రైతు, తాండ్రపాడు, రాజోళి మండలం సమస్యలను పరిష్కరిస్తాం.. తేమశాతం ఎక్కువ ఉండడంతో కొంతమంది రైతుల కందులు కొనుగోలు చేయలేదు. సంచుల కొరత ఉన్నందుకు కొంత మేరకు పనులు మందగించాయి. హమాలీలకు కూలీలు చెల్లించకపోవడంతో వారు పనులకు సరిగా రావడంలేదు. సంచుల కొరత లేకుండా చేసి, హమాలీలకు కూలీలు చెల్లించేలా కృషిచేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ -
నీటిపాట్లు
మడకశిర: నెలల తరబడి నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడంతో పట్టణంలోని వడ్రపాళ్యం మహిళలంతా రోడ్డెక్కారు. తమ దుస్థితిని వివరిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పార్వతమ్మదాసన్న ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి గురువారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. 6వ వార్డులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. మడకశిర – హిందూపురం రోడ్డుపై బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో వాహనరాకపోకలన్నీ స్తంభించగా.. వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తాగునీరు సరఫరా చేసే పైపులు దెబ్బతిని లీకేజీలు ఎక్కువయ్యాయనీ, అందువల్లే నీరు సక్రంగా సరఫరా కావడం లేదన్నారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని మున్సిపల్ అధికారులను పలుమార్లు కోరినా వారు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా తాగునీరు సరఫరా చేయాలని కోరినా స్పందించలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు కదలేది లేదని రోడ్డుపైనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ లింగన్న వడ్రపాళ్యం చేరుకుని మహిళలతో చర్చించారు. ఆందోళన విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా... మహిళలంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఎస్ఐ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు. -
నేడు కాంట్రాక్ట్ అధ్యాపకుల రాస్తారోకో
అనంతపురం రూరల్: కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని ఆ సంఘం జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం కూడా వారు ఆందోâýæనను కొనసాగించారు. వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడంలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయని ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే ఎంత గౌరవం ఉందో స్పష్టం అవుతోందన్నారు. నేడు రాస్తారోకో చేపడుతున్నట్లు తెలిపారు. అధ్యాపకుల సమ్మెకు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు హనుంతరెడ్డి, ఎర్రప్ప, సుబ్రహ్మణ్యం, అక్బర్, ఎంజీ ప్రభాకర్, రామాంజనేయులతోపాటు పలువురు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై రాస్తారోకో
యాదగిరిగుట్ట: మండలాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటవుతున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాలను కలుపవద్దంటూ చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు, శివారు గ్రామాలను కలపాలని కోరుతూ మోటకొండూర్ గ్రామస్తులు గురువారం పోటాపోటీగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌లో స్పీకర్ మధుసూధనచారి చిక్కుకున్నారు. చొల్లేరును మోటకొండూర్ మండలంలో కలిపితే పరిపాలనపరంగా ఇబ్బందులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ యాదగిరిగుట్టకు వెళ్లే మేము నూతనంగా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. రవాణా సౌకర్యం, బ్యాంక్ సౌకర్యాలు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే ఉన్నాయని, ఇవన్ని ఉండాలంటే గుట్ట మండలంలోనే కొనసాగించాలని అధికారులను కోరుతూ నినాదాలు చేశారు. బలవంతంగా మోటకొండూర్‌లో కలపాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శివారు గ్రామాలు కలపాల్సిందే... మోటకొండూర్ మండలాన్ని తలలేని మొండెంగా తయారు చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారన్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే మండలాలు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నాయని మండిపడ్డారు. నూతన మండలం అభివృద్ధి కావాలంటే శివారు గ్రామాలైన చొల్లేరు, మహబూబ్‌పేట, చిన్నకందుకూర్, ముస్త్యాలపల్లి, చీమలకొండూర్ గ్రామాలను కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామాలను కలపకుండా యత్నిస్తున్నారని అఖిలపక్షం నాయకులు, గ్రామస్తులు ఆరోపించారు. ట్రాఫిక్ జాం... జాతీయ రహదారిపై మహబూబ్‌పేట, చొల్లేరు, మోటకొండూర్ గ్రామాల ప్రజలు వేర్వేరుగా «రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామస్తులు నిరసన తెలుపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనచారి చిక్కుకుపోయారు. దీంతో ఎస్కార్టు సిబ్బంది నిరసన కారులను సమదాయించి వెళ్లారు. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రైనీ ఎస్ఐ విజయకృష్ణలు పోలీస్ సిబ్బందితో వాహనాలను నియంత్రించారు. -
సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్ బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు 25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు. విద్యుత్ టవరెక్కిన నాయకులు సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్లు ఆర్డీఓ రావాలంటూ విద్యుత్ టవర్ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్దింపారు. స్వచ్ఛందంగా సాగర్ బంద్ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్ బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు 25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు. విద్యుత్ టవరెక్కిన నాయకులు సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్లు ఆర్డీఓ రావాలంటూ విద్యుత్ టవర్ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్దింపారు. స్వచ్ఛందంగా సాగర్ బంద్ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో
దేవరకొండ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కన్వీనర్ బొమ్ము రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, అనిల్, వెంకటేష్, శివ, సిద్ధు తదితరులున్నారు. -
కొండాపురం వాసుల రాస్తారోకో
ఆత్మకూరు (ఎం) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని మండలంలోని కొండాపురం గ్రామస్తులు మంగళవారం రాయగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి, అక్కడే వంటా–వార్పు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆత్మకూరు (ఎం) మండలం 4 కి.మీ. మాత్రమే ఉంటుందని, మోటకొండూరు మాత్రం 18 కి.మీ. వస్తుందన్నారు. భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ పి.శివనాగప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులకు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. అనంతరం గుండాల, మోత్కూరు ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, రవికుమార్‌లు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన విరమించమని కోరినా వారు వినకపోవడంతో ఓ దశలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన గుడ్డేటి విష్ణు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం భువనగిరి సీఐ ఎ.అర్జునయ్య, తహసీల్దార్ లక్క అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని అక్కడే గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కొండాపురంను 18 కిలోమీటర్ల దూరంగా ఉన్న మోటకొండూరులో కలపడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతారని, ఆత్మకూరు(ఎం) మండలంలోనే కొనసాగించాలని జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ పి.హేమలత, మాజీ జెడ్పీటీసీ పి.పూర్ణచందర్రాజులు కోరారు. దీంతో తహసీల్దార్ అలివేలు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. రాస్తారోకో వల్ల సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సర్పంచ్ గుండు పెంటయ్య గౌడ్, ఉప సర్పంచ్ కొప్పుల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల పెంటయ్య గౌడ్, కొప్పుల మల్లారెడ్డి, పీసరి నర్సిరెడ్డి, కొండా మురళి, గుడ్డెటి భిక్షపతి, బాశెట్టి సత్యనారాయణ, కొండా పంచాక్షరి, గుండు శ్రీశైలం, కొప్పుల రాంరెడ్డి, కొప్పుల సువర్ణ, అనూష, మమత, సుశీల పాల్గొన్నారు. మెడకు ఉరితో నిరసన దిలావర్పూర్ (ఆలేరు) : మండలంలోని దిలావర్పూర్ను నూతనంగా ఏర్పాటయ్యే మోటకొండూర్ మండలంలో కలుపొద్దని కోరుతూ మంగళవారం ఆ గ్రామస్తులు మెడకు తాడు బిగించుకుని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దిలావర్పూర్ గ్రామాన్ని యథావిధిగా ఆలేరు మండలంలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీస బాలరాజ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా జోగిరెడ్డి, చెక్క వెంకటేశ్, చాపల మల్లేశం, మచ్చ సత్యనారాయణ, అంజయ్య, సిద్ధులు, నరేందర్, శంకర్, కుల్లయ్య, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఆలేరును డివిజన్‌గా మార్చాలని రాస్తారోకో
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్‌ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్‌ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్‌రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్‌రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు. సీఐతో వాగ్వాదం... రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. -
రైల్వేగేట్ తెరవాలని రాస్తారోకో
ఆలేరు : రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ ఆదివారం ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, ఎండీ సలీం, చెక్క వెంకటేశం, కుమార్, సిద్ధులు, నాగరాజు పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు .. రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. గుజ్జ అశోక్, కూళ్ల సిద్ధులు, అఫ్జల్ తదితరులు దీక్షలో పాల్గొనగా మంగ నర్సింహులు, తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, ఎంఎ ఎక్బాల్, ఎనగందుల సురేష్, చామకూర అమరేందర్‌రెడ్డి, జూకంటి పెద్దఉప్పలయ్య, సలీం పాల్గొన్నారు. -
సాగర్‌ను మండల కేంద్రం చేయాలి
నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లుతున్న నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మాచర్ల–హైదరాబాద్ రహదారిపై పైలాన్‌కాలనీ పోలీస్ పరేడ్‌గ్రౌండ్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాగర్‌కు అంతర్జాతీయంగా పేరున్నప్పటికీ 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నీరు, విద్యుత్, రహదారులు, భూమి అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎలాంటి పురోగతికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా సాగర్ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే నిరాశే మిగిలిందన్నారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యాచరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అఖిలపక్ష నాయకులు కార్యచరణ ప్రకటించారు. సోమవారం చలో కలెక్టరేట్(నల్లగొండ), మంగళవారం రోడ్డుపై వంటవార్పు, బుధవారం మానవహారం, గురువారం సాగర్ బంద్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రజలతో పాటు తునికినూతల, చింతలపాలెం, నెల్లికల్లు గ్రామపంచాయతీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. హీరాకార్ రమేశ్‌జీ, కున్రెడ్డి నాగిరెడ్డి, చంద్రమౌళినాయక్, సయ్యద్‌గౌస్, బషీర్, జంగయ్య, వేణు, హచ్చునాయక్, ధర్మానాయక్, మునినాయక్, చిన్నరామయ్య, కంచర్లసుధీర్, కాటుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాస్తారోకో
నకిరేకల్ : ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని రవాణాకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ మెయిన్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటì కీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాస్తారోకో చేస్తున్న సమయంలోనంబర్ ప్లేట్ లేకుండా ఇసుకుతో వస్తున్న ఓ ట్రాక్టర్‌ను మెయిన్‌సెంటర్ నిలిపివేసి పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ సర్పంచ్పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నాయకులు దైద సుధాకర్, కందాల ప్రమీల, మర్రి వెంకటయ్య, రాయి కృష్ణ, పల్స యాదగిరి, బొమ్మకంటి కొమురయ్య, గౌని లక్ష్మినర్సయ్య, పురుషోత్తంరెడ్డి, ఆకుల భాస్కర్, వంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నర్సింహ్మ, సుదీర్‌రెడ్డి, మర్రి రామస్వామి, దేవయ్య, శ్రీను, జనార్ధన్, అమీర్‌పాషా, నగిశెట్టి శ్రీను, వంటెపాక కృష్ణ, పుట్ట సత్తయ్య, ముత్తిరాములు, బొజ్జ చిన్నవెంకులు తదితరులు ఉన్నారు. -
చిన్నకందుకూర్ ప్రజల రాస్తారోకో
యాదగిరిగుట్ట: నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు హైదాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆలేరు నుంచి భువనగిరికి వెళ్లే, పుష్కర భక్తుల వాహనాలు భారీ స్థాయిగా స్తంభించాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నమిలె పాండు మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే యాదగిరిగుట్ట మండలంలో మమల్ని కొనసాగించాలన్నారు. పారిపాలన దృష్ట్యా యాదగిరిగుట్టనే బాగుంటుందని, మోటకొండూర్‌లో కలువడంతో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. మోటకొండూర్‌కు పక్కన ఉన్న మహబూబ్‌పేట, చొల్లేరు గ్రామాలను కలుపకుండా చిన్నకందుకూర్‌ను కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి అభ్యంతరాలను పంపించడానికి త్వరలోనే కలెక్టర్‌ను కలుస్తామని చెప్పారు. రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి ఏఎస్ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కుమార్‌లు చేరుకొని ఆందోళన కారులను సముదాయించి, రాస్తారోకో విరమింపజేశారు. ఉపసర్పంచ్ కట్ట మల్లేష్, గ్రామస్థులు చందసాయిబాబు, దూసరి కిష్టయ్య, బడే పోషయ్య, జహంగీర్, ర్యాకల స్వామి, అశోక్, బీమగాని రవి తదితరులున్నారు. -
విగ్రహ తొలగింపుపై రాస్తారోకో
రావిపాడు రోడ్డులో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన నరసరావుపేట రూరల్ : ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డులోని ఆలయం ఎదుట శుక్రవారం రాస్తారోకో చేశారు. రావిపాడు రోడ్డులోని కమ్మ హాస్టల్ సమీపంలో ఆంజనేయస్వామి వారి చిన్న ఆలయాన్ని నిర్మించి కొన్నేళ్ళుగా పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ విగ్రహాన్ని రెండు ముక్కలుగా చేసి మురుగు కాల్వలో పడేశారు. అలాగే, రెండు నెలల క్రితం కూడా పట్టణంలోని రెడ్డి కళాశాల ఎదుట ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. వరసగా విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతుండటంతో వీహెచ్‌పీ ఆందోళనకు దిగింది. విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ, భజరంగ్‌దళ్, హిందూ సేన తదితర సంస్థల ఆధ్వర్యంలో దాదాపు గంటపాటు రాస్తోరోకో చేశారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి చలవాది రాధాకృష్ణమూర్తి, హిందూసేన నాయకులు కోట ప్రసాద్, భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ ప్రహ్లాదగుప్తా, బీజేపీ నాయకులు వల్లెపు కృపారావు, కాకుమాను కోటేశ్వరరావు, సీహెచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నీటి కోసం రోడ్డెక్కిన జనం
రెండు గంటల పాటు రాస్తారోకో గర్గుల్ వాసుల ఆందోళన అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మహిళలు కామారెడ్డి రూరల్: గొంతెండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గర్గుల్ గ్రామస్తులు రోడ్డెక్కారు. కామారెడ్డి-రామారెడ్డి రోడ్డుపై గురువారం రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉదయం ఖాళీ బిందెలతో స్థానికులు రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, బోర్లు ఎత్తిపోవడంతో రోజూ వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడితో పాటు అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడకు వచ్చి గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే, అధికారులు వచ్చి నీటి సమస్యను తీర్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఓ కానిస్టేబుల్ గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. మరోవైపు తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గాయత్రి వచ్చి వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పగా, తమ కాలనీకి వచ్చి సమస్యను చూడాలని పట్టుబట్టారు. దీంతో వారు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. సమీపంలో ఉన్న నాలుగు వ్యవసాయ బోర్లను సైతం పరిశీలించిన అధికారులు, రైతులతో మాట్లాడారు. అయితే, బోర్లను అద్దెకు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. వారం రోజుల్లో పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేస్తామని, అప్పటివరకు రోజూ రెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. మాజీ ఎంపీపీ నిమ్మ లింగవ్వ, రవీందర్‌రెడ్డి, భీంరెడ్డి, శ్రీనివాస్, సాయిలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లకోసం రోడ్డెక్కిన జనం
సంపునకు తాళం... సిబ్బంది నిర్బంధం గంటపాటు రాస్తారోకో... నారాయణపేట : మంచినీటి ఎద్దడిని తీర్చాలంటూ అప్పక్‌పల్లి గ్రామస్తులు బుధవారం సత్యసాయి సంపుహౌస్‌కు తాళంవేసి సిబ్బందిని నిర్బంధించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మూడు నెలలుగా సత్యసాయి నీరు గ్రామానికి అందడం లేదంటూ సిబ్బందికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ రమేశ్ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామ శివారులో మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదన్నారు. దీనికితోడు ఉన్న బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీటి సమస్య తీవ్రమైందన్నారు. గ్రామంలో ఉన్న సత్యసాయి సంపు నుంచి ట్యాంకుకు పైపులైన్ ఉన్నా నీరందించడం లేదని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న సర్పంచ్ అక్కడికి చేరుకొని గ్రామస్తులకు సముదాయించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామలింగారెడ్డి అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న యువకులపై విరుచుకుపడ్డారు. రోడ్డుపై రాస్తారోకో చేయడం... సంపుహౌస్‌కు తాళం వేయడం సరికాదని అగ్రహించారు. రాస్తారోకోకు దిగిన సర్పంచ్ రమేశ్, గ్రామస్తులను స్టేషన్‌కు తరలించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి తన అనచరులతో పోలీసుస్టేషన్‌కు చేరుకొని సర్పంచ్‌నే పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వచ్చి కేసు చేస్తారా అంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సత్యసాయి నీటి పథకం అధికారులతో మాట్లాడారు. త్వరలోనే పైపులైన్ లీకేజీని సరిచేస్తామని హామీ ఇచ్చారు. సొంత పూచీకత్తుపై సర్పంచ్‌ను, గ్రామస్తులను పోలీసులు వదిలేశారు. -
పొగాకు రైతుల రాస్తారోకో
గిట్టుబాటు ధరల కోసం ఆందోళన నాయకులు, వ్యాపారుల కుమ్మక్కుపై విమర్శలు కొండపి : గిట్టుబాటు ధర లేదని పొగాకు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. వ్యాపారులు ధరలు దిగకోసి పొగాకు కొంటున్నా రైతు నాయకులు వ్యాపారులకు వంత పలకడంపై ఆగ్రహం చెందారు. వేలం కేంద్రం అధికారి సైతం చోద్యం చూడటం తప్ప వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి రైతుల పక్షం వహించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ పొగాకు రైతులు కొండపి పొగాకు వేలంకేంద్రంలో వేలాన్ని అడ్డుకున్నారు. గిట్టుబాటు ధరల కోసం రెండు గంటలకు పైగా శనివారం రాస్తారోకో నిర్వహించారు. వివరాలు .. వేలంకేంద్రం పరిధిలోని నరసరాజుపాలెం, పీరాపురం గ్రామానికి చెందిన రైతులు 336 బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. కేంద్రం అధికారి మురళీధర్ వేలాన్ని ప్రారంభించారు. రెండు లైన్లు కొనుగోలు చేసిన తరువాత మూడవ లైన్లోకి పాట రాగా పొగాకుకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు గ్రహించారు. వెంటనే రైతులు వేలాన్ని అడ్డుకుని వేలం కేంద్రం ముందు రోడ్డు మీద రాస్తారోకోకు దిగారు. రోడ్డుకు అటుఇటు ముళ్ల కంచెలు, విద్యుత్ స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మేలిమి పొగాకు క్వింటా 12 వేల రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయగా ఇప్పుడు అదే పొగాకు 9 వేల రూపాయల నుంచి 8 వేలకు దిగకోశారని ఆవేదన చెందారు. ధరల గురించి బోర్డు చైర్మన్ పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎస్ఐ ఆంజనేయులు రైతులకు సర్ది చెప్పడంతో ఇంత తక్కువగా ధరలు మరొకసారి రాకూడదని చెబుతూ రాస్తారోకో విరమించారు. ధరల్లేవు మాది ఐటిసి ఎన్పిఏ గ్రామం. అయినా ధరలకు దిక్కులేదు. ట్రేలలో మెక్కలు పెంచమన్నారు. పట్టలు వేసి మరీ గ్రేడ్ చేసి చెక్కులు వేయమన్నారు. ధరలు మాత్రం పెంచకుండా దిగ కోస్తున్నారు. దీంతో మాకు దిక్కుతోచడం లేదు. కె.బ్రహ్మయ్య, నరసరాజుపాలెం మేలిమి పొగాకుకు తక్కువ ధరలా ! రూ. 12 వేలకు కొనుగోలు చేయాల్సిన మేలిమి పొగాకు రూ.9 వేల లేపే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అయితే పొగాకు రైతు బతికి బట్ట కట్టేది ఎట్టా. పొటాష్ వేస్తే మంచిదని అధికారులు సలహా ఇస్తే మూట 28 వందలు పెట్టి ఎకరాకు బస్తా వేశాం. ఖర్చు తడిసి మోపెడు అయింది. బండి భాస్కర్‌రెడ్డి , పీరాపురం వ్యాపారులకే నాయకుల వంత వ్యాపారులకే అధికారులు , కొంతమంది రైతు నాయకులు వంత పలుకుతున్నారు. రైతును పట్టించుకునేవారు ఏరి. ఇంత దారుణమైన ధరల పతనం ఆగకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక గత్యంతరం లేదు. జి సుబ్బరాయుడు