Ravi
-
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు, డబుల్..
-
ఈ దుఃఖం తీర్చేదెవరు?
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు. చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే.. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు. స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు. రోడ్డున పడ్డ బతుకులు.. కూకట్‌పల్లికి చెందిన విజయ్ప్రతాప్గౌడ్ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్‌ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత గడువైనా ఇవ్వాల్సింది సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి అన్నా కనికరించలేదు! కూకట్‌పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బీటెక్ రవి దాష్టీకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్‌రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్‌రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది. వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్‌రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.రాజగోపాల్‌రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉపాధ్యాయుని కీచకపర్వం!
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవి ఇటీవల 10వ తరగతి విద్యార్థినులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. హెచ్ఎం వెంకటరమణ కలుగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్దిచెప్పి పంపారు. అయితే అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై టీచర్ రవి కక్ష కట్టారు. తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపారు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోపణలను ఖండించారు. హైసూ్కల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కిందట ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకరాని చోట తాకినట్లు ఫిర్యాదు చేశారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని సర్ది చెప్పి పంపించానన్నారు. -
Ravi Raheja: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె.రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. -
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్ర
గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు. పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు. టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.వాటర్ ప్లాంట్‌ను కూల్చిన టీడీపీ శ్రేణులుగుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు వలివర్తిపాడు క్రాస్‌లోని వాటర్ ప్లాంట్‌ను టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులు గురువారం రాత్రి దౌర్జన్యంగా కూల్చివేశారు. గుంపుగా వచ్చి షట్టర్లు పగులగొట్టి ప్లాంట్ నడుపుతున్న వ్యక్తిపై దాడి చేయడంతో అతడి చెయ్యి విరిగింది. అతని భార్యను బయటకు నెట్టేసి భయానక వాతావరణం సృష్టించారు. వాటర్ ప్లాంట్‌లోని పరికరాలు, మోటార్, పైపులను ధ్వంసం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇప్పటికైనా స్పందించి గొడవలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు. -
పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి వాసి
విజయవాడ స్పోర్ట్స్: పారిస్‌లో ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి ఎంపికయ్యారు. షాట్‌పుట్ విభాగంలో రవి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రవి.. ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఇందుకోసం అతని తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం అమ్మేశారు. తల్లిదండ్రులు, కోచ్‌లు ఇచ్చిన స్ఫూర్తితో రవి ఇప్పటివరకు దాదాపు 25కు పైగా పతకాలు సాధించి ప్రపంచ క్రీడా వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. ఆదాయ పన్ను విభాగ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రవి మాట్లాడుతూ.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని తెలిపాడు. కాగా, రవిని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, వి.రామస్వామి అభినందించారు. -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి అదృశ్యం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్‌లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. దుబాయ్‌లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్‌తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్త పన్ను విధానంలోనే 66% రిటర్నులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
నూతన విధానమే ఎంపిక
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం అదే : రామ్‌గోపాల్ వర్మ
‘‘చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ‘ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్’ లక్ష్యం’’ అన్నారు దర్శక–నిర్మాత రామ్గో΄ాల్ వర్మ. శుక్రవారం విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘శివ’ అప్పుడు నా గురించి ఎవరికీ తెలియదు. ఆ చిత్రం హిట్టవ్వడం వల్లే నేనెవరో అందరికీ తెలిసింది. మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నాకు వీలు దొరికింది. కానీ ప్రతిభ ఉండి నాలాగా ఇంకా ప్రపంచానికి తెలియాల్సిన వారు ఎందరో బయట ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్‌కి వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్‌ని ఎంపిక చేశాం. వీటిని సోషల్ మీడియాల పోల్‌కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువ మంది బెస్ట్ డైరెక్టర్‌గా ఓటు వేసిన వారికి మా సంస్థలో చాన్స్ ఇస్తాం. డైరెక్టర్స్ అనే కాదు కెమెరా, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా.. ప్రతి క్రాఫ్టులో ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేస్తున్నాం. సెలెక్ట్ అయిన వారి ప్రతిభను ముందుగా మా సంస్థలో ఉపయోగించుకోవాలనేది నా, నిర్మాత రవి స్వార్థం’’ అన్నారు. నిర్మాత రవి కూడా పాల్గొన్నారు. -
రవి పరంజపే : చిత్రకారుల సంపద..!
అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్‌తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్‌లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్‌లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్‌కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం. రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్‌స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్‌స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్‌కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"? – అన్వర్. -
అహం దెబ్బతిని..
శంషాబాద్: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్‌లో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్‌లోని బట్టర్ఫ్లై వెంచర్లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్ చేసి, రవిని వాట్సాప్ గ్రూప్‌లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్‌గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న ఓ వైన్స్ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్ఫ్లై వెంచర్లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్పేట్ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్ ఫ్లై వెంచర్‌లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. గుండెమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం– హైదరాబాద్ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జిగా భూపేష్‌రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే. లోపాయికారి ఒప్పందం టీడీపీదే.... కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు. హవ్వా...ఓటమి భయమా..?! కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్‌కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్ పోరు
లోక్‌సభకు చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో వారణాసి, గోరఖ్‌పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్ ఉన్న నగరం. ఈ ప్రాంతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ కీలకంగా నిలిచింది. ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. ఇక్కడ ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీల మధ్యప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో హీరో వర్సెస్ హీరోయిన్ పోరు నెలకొంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవి కిషన్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ భోజ్‌పురి నటి కాజల్ నిషాద్కు ఇక్కడి టిక్కెట్ కేటాయించింది. రవి కిషన్ 2019లో ఇక్కడి నుంచి బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. కాజల్ నిషాద్ 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ, మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు.1990లో యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించి, వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రవి కిషన్ విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఐదుసార్లు ఎంపీని చేసిన ఇక్కడి ఓటర్లు సీఎంపై మరింత నమ్మకం ఉంచారు. అందుకే బీజేపీకి మద్దతుగా నిలుస్తారనే అంచనాలున్నాయి.గోరఖ్‌పూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 20 లక్షల 74 వేలు. ఈ సీటులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 లోక్‌సభ ఉప ఎన్నిక మినహా ప్రతిసారీ సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
శిల్పా రవిని గెలిపించండి
బొమ్మలసత్రం: నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం నంద్యాల వచ్చారు. ఆయనకు పట్టణ శివారులోని ఆటోనగర్ వద్ద అభిమానులు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. నంద్యాలలోని శిల్పా రవి నివాసానికి చేరుకుని వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులకు చాలాసేపు అభివాదం చేశారు. శిల్పా రవి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ‘శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. ఇన్నేళ్ల మా ఇద్దరి స్నేహంలో నన్ను ఎన్నికల ప్రచారం కోసం రావాలని ఏనాడూ రవి కోరలేదు. నేనే శిల్పా రవి కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. రవి మంచి మనసు, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యమే నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది. నా మనసుకు నచ్చిన స్నేహితులు ఏ ఫీల్డ్‌లో ఉన్నా వారి అభివృద్ధిని కోరుకుంటాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. శిల్పా రవి మంచి మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శిల్పా రవికి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను...’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తనను గుర్తుంచుకుని అల్లు అర్జున్ ఇంతదూరం రావడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్, శిల్పా రవిపై కేసు నమోదు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని కలిసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి శనివారం నంద్యాలకు వచ్చారు. ఆయన వస్తున్నాడని తెలిసి ప్రజలు భారీ సంఖ్యలో ఎమ్యెల్యే శిల్పా రవి నివాసం వద్దకు తరలివచ్చారు. జనం గూమికూడేందుకు అనుమతి తీసుకోలేదని ఎమ్యెల్యే శిల్పా రవి, అల్లు అర్జున్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నంద్యాల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. -
షర్మిల, సునీత, బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు షాక్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్మోహన్రెడ్డి, అవినాశ్‌రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్మోహన్రెడ్డి లేదా అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. -
పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
సాక్షి ప్రతినిధి, కడప: వారంతా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనే క్రియాశీలక కార్యకర్తలు. ఎన్నికల సంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు, గుర్తింపు పొందిన పార్టీ అభ్యరి్థగా మరి కొందరు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కంటే మించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తతంగం పులివెందుల నియోజకవర్గంలో తెరపైకి వచ్చింది. కలిసికట్టుగా ఒకే వాహనంలో, ఒకే గ్రామంలో టీడీపీ కోసం ప్రచారం కొనసాగిస్తున్న ఉదంతమిది. 👉పులివెందుల టౌన్‌కు చెందిన అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తుగా పార మరియు స్టోకర్ రిటర్నింగ్ అధికారి కేటాయించారు. అయితే ఎక్కడా తన గుర్తు తెలియజేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించడం లేదు. పైగా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం కోసం పనిచేస్తున్నారు. ఈనెల 3న అంబకపల్లి, మురారిచింతల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే బీటెక్ రవి కారుపై ఎస్కార్ట్ తరహాలో నిల్చొని గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న బీటెక్ రవి సోదరుడు భరత్‌కుమార్‌రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈయనతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిరెడ్డి సంజీవరెడ్డి, గోకనపల్లె వరప్రసాదరెడ్డిలు కూడా టీడీపీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. సంజీవరెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో కలిసి స్వయంగా టీడీపీలో చేరికల్లో పాల్గొన్నారు. మురారిచింతల గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం సైతం కలిసికట్టుగా చేపట్టారు. గోకనపల్లె వరప్రసాదరెడ్డి ఏకంగా టీడీపీ టోపి పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేపట్టడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత, బీటెక్ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారన్నారు. సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్ రవి తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్సీపీ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
మలయాళ నటి అదితి రవి ఫోటోలు వైరల్
-
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు.